సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎక్కువ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించాల్సిందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహిళ క్రికెట్ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరుగులకు సంబంధించి సచిన్ ఖాతాలో అనేక అంతర్జాతీయ రికార్డులు ఉన్నాయని, అయితే టెస్టు క్రికెట్ విషయానికొస్తే డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ టాప్ పదిలో కనిపించడని అన్నారు. మార్వన్ అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్ లాగే సచిన్ కూడా టెస్ట్ క్రికెట్‌లో ఆరు డబుల్ సెంచరీలు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. కాని డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ 12వ స్థానంలో ఉన్నాడన్నారు. ఎందుకంటే 200 టెస్టు మ్యాచుల్లో సచిన్ కేవలం ఆరు డబుల్ సెంచరీలు చేశాడని ఆయన పేర్కొన్నారు. (షెడ్యూల్ ఖరారు చేసేందుకు...)
కపిల్ దేవ్ మాట్లాడుతూ.. “సచిన్ చాలా ప్రతిభావంతుడు. క్రికెట్ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు. సెంచరీలు ఎలా చేయాలో అతనికి తెలుసు, కానీ వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలో తెలియదు. సెంచరీ చేసిన తరువాత అతను సింగిల్స్ తీసుకునేవాడు.. ఎక్కువ స్పీడ్‌గా ఆడేవాడు కాదు. అతను ఎప్పుడూ క్రూరమైన బ్యాట్స్‌మన్ కాలేడు. సచిన్ కనీసం అయిదు ట్రిపుల్ సెంచరీలు, పది డబుల్ సెంచరీలు చేయాల్సి ఉండేది. ఎందుకంటే అతను ప్రతి ఓవర్లో బౌండరీ బాదేవాడు. టెస్ట్ క్రికెట్‌లో 51 సెంచరీలు సాధించిన సచిన్‌కు తన మొదటి డబుల్ సెంచరీ సాధించడానికి 10 సంవత్సరాలు పట్టింది.
ఇది 1999లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో సాధ్యమైంది. వాస్తవానికి, టెండూల్కర్ 51 సెంచరీలలో కేవలం 20 మాత్రమే 150 కి పైగా స్కోర్లుగా నిలిచాయి. అయితే, 2010లో దక్షిణాఫ్రికాపై వన్డే డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ సచిన్’ అని పేర్కొన్నారు. సచిన్ తన కెరీర్‌లో 200 టెస్ట్ మ్యాచ్‌ల్లో 54.04 సగటుతో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 44.83 సగటుతో18,426 పరుగులు చేశాడు. 2013 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు
(కపిల్ సలహాతోనే కోచ్‌నయ్యా)
(ట్రిపుల్ సెంచరీ కంటే.. 136 పరుగులే మిన్న!)
Comments
Please login to add a commentAdd a comment