centuries
-
చంద్రునిపై ఆవలి వైపూ... అగ్నిపర్వతాలు!
న్యూయార్క్: చందమామ ఆవలి వైపు కూడా కొన్ని వందల ఏళ్ల కింద భారీ అగ్నిప ర్వతా లకు నిలయమేనని సైంటిస్టులు తాజాగా తేల్చారు. చంద్రుని ఆవలివైపు నుంచి చైనాకు చెందిన చాంగ్ ఈ–6 వ్యోమనౌక తొలిసారిగా తీసుకొచ్చిన రాళ్లు, మట్టి, ధూళి నమూ నాలను క్షుణ్నంగా పరీక్షించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘‘వాటిలో అగ్నిపర్వతపు రాళ్ల తాలూకు గుర్తులున్నాయి. అవి దాదాపు 280 కోట్ల కిందివని తేలింది. ఒకటైతే ఇంకా పురాత నమైనది. అది ఏకంగా 420 కోట్ల ఏళ్లనాటిది’’ అని వారు వివరించారు. ఆవలి వైపున అగ్నిపర్వతాల పేలుళ్లు కనీసం వంద కోట్ల ఏళ్ల పాటు కొనసాగినట్టు నిర్ధారణ అవుతోందని అధ్యయన సహ సారథి, చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నిపుణుడు క్యూలీ లీ చెప్పారు.ఇప్పటికీ మిస్టరీయే...చంద్రునిపై మనకు కనిపించే వైపు అగ్ని పర్వతాల ఉనికి ఎప్పుడో నిర్ధారణ అయింది. అయితే ఆవలి వైపు మాత్రం సైంటిస్టులకు ఎప్పుడూ పెద్ద మిస్టరీగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా నమూనాలు అందించిన సమాచారం అమూల్యమైనదని విశ్లేషణ లోపాలుపంచుకున్న అరిజోనా యూని వర్సిటీకి చెందిన ప్లానెటరీ వాల్కెనో నిపుణు డు క్రిస్టోఫర్ హామిల్టన్ అన్నారు. -
పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్‌కు సాటెవ్వరు!
పదిహేడేళ్ల వయసులో.. సరిగ్గా ఇదే రోజు ఓ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి శతకం నమోదు చేశాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. తన అసాధారణ ప్రతిభతో వాటన్నింటిని దాటుకుని.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచంలో ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతడే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.టీమిండియా తరఫున 1989లో పాకిస్తాన్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్.. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, మొదటి 15 మ్యాచ్‌లలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయిన ఈ ముంబై బ్యాటర్.. 1990లో ఇంగ్లండ్ గడ్డ మీద తన సెంచరీల ప్రయాణానికి నాంది పలికాడు.మాంచెస్టర్‌లో సెంచరీల ప్రయాణానికి నాందిమాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సచిన్ శతకంతో మెరిశాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 189 బంతులు ఎదుర్కొని 119 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితం ఎలా ఉన్నా సచిన్ కెరీర్లో ఈ మ్యాచ్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.వందో సెంచరీ అక్కడేనాడు ఇంగ్లండ్ మీద తొలి సెంచరీ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆసియా 2012 వన్డే కప్ సందర్భంగా బంగ్లాదేశ్ మీద మీర్పూర్ వేదికగా వందో శతకం బాదాడు. మొత్తంగా టీమిండియా తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండుల్కర్.. 51 శతకాలు, 68 అర్ధ శతకాల సాయంతో 15921 పరుగులు సాధించాడు.ఎవరికీ అందనంత ఎత్తులోఅదే విధంగా.. 463 వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేసి 18426 పరుగులు స్కోరు చేశాడు. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడిన సచిన్ ఖాతాలో 10 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 664 మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు స్కోరు చేసి.. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. వంద శతకాలు ఖాతాలో ఉన్నా మొదటి సెంచరీ మాత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకమే కదా!! -
ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..
దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు) -
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఐపీఎల్ 2024 సీజన్ సెంచరీల విషయంలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. 2023 సీజన్లో నమోదైన 12 సెంచరీల రికార్డును ఈ సీజన్ బద్దలు కొట్టింది. ఈ సీజన్లో వివిధ ఫ్రాంచైజీలకు చెందిన 13 మంది ప్లేయర్లు శతక్కొట్టారు. వీరిలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రెండుసార్లు సెంచరీ మార్కును తాకాడు. సీజన్ తొలి సెంచరీని లక్నో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124*) నమోదు చేయగా.. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113*), సునీల్ నరైన్ (56 బంతుల్లో 109), రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108*), జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 108*), జోస్ బట్లర్ (60 బంతుల్లో 107*), రోహిత్ శర్మ (63 బంతుల్లో 105*), యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104*), శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 104), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103), సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102*), ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102), జోస్ బట్లర్ (58 బంతుల్లో 100*), విల్ జాక్స్ (41 బంతుల్లో 100*) వరుసగా సెంచరీలు చేశారు. ఈ సీజన్ వేగవంతమైన సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, విల్ జాక్స్ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. హెడ్ ఆర్సీబీపై.. జాక్స్ గుజరాత్‌పై 41 బంతుల్లో శతక్కొట్టారు.సీజన్ల వారీగా సెంచరీలు..2024- 14 సెంచరీలు2023- 12 సెంచరీలు2022- 8 సెంచరీలు2021- 4 సెంచరీలు2020- 5 సెంచరీలు2019- 6 సెంచరీలు2018- 5 సెంచరీలు2017- 5 సెంచరీలు2016- 7 సెంచరీలు2015- 4 సెంచరీలు2014- 3 సెంచరీలు2013- 4 సెంచరీలు2012- 6 సెంచరీలు2011- 6 సెంచరీలు2010- 4 సెంచరీలు2009- 2 సెంచరీలు2008- 6 సెంచరీలుఓవరాల్గా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి. -
MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్‌టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్‌రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
నితేశ్, ప్రజ్ఞయ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: మేఘాలయ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐదు రోజుల ఈ తుది పోరులో రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 25/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 87.5 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. నితేశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 131 పరుగులు జోడించారు. నితేశ్ అవుటయ్యాక ప్రజ్ఞయ్ అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 46 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయ ఆట ముగిసే సమయానికి ఖాతా తెరవకుండా ఒక వికెట్ కోల్పోయింది. -
INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్‌కప్‌లో తమ్ముడి సెంచరీలు
What A day for Sarfaraz Khan and Musheer Khan: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు.మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. ముషీర్ ఖాన్‌కు తోడు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ గురువారం ఐర్లాండ్‌తో తలపడుతోంది. ముషీర్ దుమ్ములేపాడు.. సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇందులో భాగంగా.. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(17), అర్షిన్ కులకర్ణి(32) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన తెలుగు క్రికెటర్ అరవెల్లి అవినాశ్ రావు 22, సచిన్ దాస్ 21(నాటౌట్) పర్వాలేదనిపించారు. టెయిలెండర్లు ప్రియాన్షు మొలియా(2), మురుగన్ అభిషేక్(0) పూర్తిగా విఫలమయ్యారు. అటు అన్న.. ఇటు తమ్ముడు ఇరగదీశారు ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు స్వయానా తమ్ముడు. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం సర్ఫరాజ్ సెంచరీతో దుమ్ములేపాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు ముషీర్ ఖాన్ ఐర్లాండ్‌తో వన్డేలో శతకంతో చెలరేగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘అన్న అలా.. ఇంగ్లండ్ లయన్స్ మీద 161... తమ్ముడేమో ఇలా ఐర్లాండ్ మీద 118.. ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లదే’’ అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’ -
CWC 2023: ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ.. కష్టంగా ఉంది: కోహ్లి
ICC WC 2023- Ind vs NZ- Virat Kohli 50th ODI Century: ‘‘కోల్‌కతాలో కూడా చెప్పాను కదా!.. ఓ గొప్ప వ్యక్తి నన్ను అభినందించారు. ఇప్పుడు కూడా ఇదంతా ఓ కలలానే ఉంది. నిజానికి కల నిజమైనట్లు ఉంది. ఏంటో నాకే కొత్తగా ఉంది. ఈరోజు కూడా కీలక మ్యాచ్.. ఇందులో నా వంతుగా ఏం చేయాలో అది చేశాను. సింగిల్స్, డబుల్స్.. ఏదైనా జట్టు కోసమే నా సహచర ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అన్నీ అనుకూలించి ఈరోజు మేము భారీ స్కోరు చేయగలిగాం. జట్టును గెలిపించాలన్నదే నా అంతిమ లక్ష్యం. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. సింగిల్స్, డబుల్స్.. బౌండరీలు.. ఏదైనా జట్టు నా నుంచి ఆశిస్తున్న ప్రదర్శనకు అనుగుణంగానే ఆడతాను. నా శక్తిసామర్థ్యాల మేరకు అత్యుత్తమ ఆట తీరుతో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రీజులో కుదురుకున్న తర్వాత బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఉంటా. ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ ఇక ఈరోజు నా సెలబ్రేషన్స్ గురించి చెప్పాలంటే.. అనుష్క, సచిన్ పాజీ ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఈ ఫీలింగ్‌ను ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ నేను ఓ పరిపూర్ణ ఛాయాచిత్రం గీయాలనుకుంటే.. బహుశా అది ఇదేనేమో! నేను అత్యంత ప్రేమించే వ్యక్తి.. నా జీవిత భాగస్వామి అనుష్క.. నా హీరో సచిన్ టెండుల్కర్.. వీళ్లిద్దరి ముందు నేను వన్డేల్లో 50వ శతకం సాధించగలగడం.. అది కూడా చారిత్రాత్మక వాంఖడేలో.. ఇంతకంటే అత్యద్భుతం ఏముంటుంది?! అందరూ బాగా ఆడినందు వల్లే ఈరోజు మేము నాకౌట్ మ్యాచ్‌లో 400 పరుగుల స్కోరుకు చేరువగా వచ్చాం. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.. షాట్లు బాదాడు.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక టాప్‌లో శుబ్‌మన్, రోహిత్ అద్భుతం చేశారు. కేఎల్ రాహుల్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు’’- వన్డేల్లో 50 సెంచరీల వీరుడు, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ముంబైలోని వాంఖడేలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(47), శుబ్‌మన్ గిల్(80- నాటౌట్).. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డు సెంచరీతో మెరిశాడు. సచిన్ రికార్డు బద్దలు ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ గండాన్ని దాటి 117 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా 80వ శతకం సాధించాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 50వ సెంచరీ. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఫైనల్‌కు చేరువయ్యేందుకు మరోవైపు.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సైతం శతకం(105) బాదాడు. ఐదో నంబర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రోహిత్ సేన 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. తన రికార్డు సెంచరీ సమయంలో కలిగిన భావోద్వేగాలు, జట్టు భారీ స్కోరు సాధించిన విధానం గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమిది
వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ వేదికగా విరాట్ కోహ్లి సాధించిన అర్థ శతక సెంచరీ ఫీట్‌పై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. క్రీడా అభిమానులతో పాటు క్రీడాయేతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కోహ్లికు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడి ఘనత అందుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి అభినందనలు తెలుపుతూ ఓ సందేశం ఉంచారు. ఇవాళ కోహ్లి 50వ శతకం సాధించడమే కాదు.. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్టతను, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడు. ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. కోహ్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్ తరాలకు బెంచ్‌మార్క్ నెలకొల్పడం కొనసాగిస్తూనే ఉంటాడు.. Today, @imVkohli has not just scored his 50th ODI century but has also exemplified the spirit of excellence and perseverance that defines the best of sportsmanship. This remarkable milestone is a testament to his enduring dedication and exceptional talent. I extend heartfelt… pic.twitter.com/MZKuQsjgsR — Narendra Modi (@narendramodi) November 15, 2023 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోహ్లిని ఎక్స్ వేదికగా అభినందించారు. వెల్డన్ కింగ్‌కోహ్లీ. హాఫ్ సెంచరీ శతకాలు అనే అద్భుతమైన ఫీట్.. అదీ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో. టేక్ ఏ బో అంటూ ట్వీట్ చేశారు. Supremely Well done King Kohli @imVkohli 🎉 on Half-century of Centuries 👏 What an amazing feat to achieve and that too in the semi final of the World Cup Take a Bow 🙏 #ViratKohli𓃵 — KTR (@KTRBRS) November 15, 2023 తన సెంచరీల ఫీట్‌ను అధిగమించడంపై కోహ్లిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా అభినందించగా.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆ ట్వీట్‌ను రీపోస్ట్ చేసి మరీ కోహ్లిని అభినందించారు. ఒక దిగ్గజం నుంచి స్నేహపూర్వక సందేశం.. నిజంగా అభినందనీయం. మీ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కోహ్లి, సచిన్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారాయన. ఆప్ జాతీయకన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చారిత్రక మైలురాయిని అధిగమించిన విరాట్ కోహ్లికి శుభాకాంక్షలు. ఒక నిజమైన దిగ్గజమే రికార్డులను తిరగరాస్తారు. భావితరాలలో స్ఫూర్తిని నింపుతారు అంటూ సందేశం ఉంచారు. Congratulations to Virat Kohli on achieving a historic milestone with his 50th ODI century against New Zealand in the World Cup semifinal. A true legend rewriting records. Keep on inspiring the generations to come. pic.twitter.com/tLaKWv7fNq — Arvind Kejriwal (@ArvindKejriwal) November 15, 2023 -
Virat Kohli: కోహ్లి సాధించేశాడు.. సచిన్ సెంచరీల రికార్డు బద్దలు
క్రీజులో కుదురుకునేంత వరకు నెమ్మదిగా... పిచ్ స్వభావాన్ని, అవసరాన్ని బట్టి మధ్య ఓవర్లలో దూకుడుగా.. ఆఖరి వరకు ఉంటే ఆకాశమే హద్దుగా.. వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ స్టైల్ ఇది. టెస్టు, టీ20 ఫార్మాట్ల కంటే 50 ఓవర్ల క్రికెట్లో మిగతా మేటి బ్యాటర్లందరికంటే కోహ్లిని ప్రత్యేకంగా నిలిపింది ఈ లక్షణమే! ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఒకలా.. ఛేజింగ్‌లో అయితే మరోలా.. మ్యాచ్ సాగుతున్న కొద్దీ తన లెక్కలు మారిపోతూ ఉంటాయి. కానీ తానేం చేయాలి, తన ప్రణాళికలు ఎలా అమలు పరచాలన్న వ్యూహాల్లో మాత్రం స్పష్టత అలాగే ఉంటుంది. మిగతా బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల దాహం తీర్చుకుంటే.. కోహ్లికి మాత్రం లక్ష్య ఛేదనలోనే మరింత ఊపొస్తుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ తనలోని బ్యాటర్ మరింత దూకుడుగా మారిపోతాడు. ఇంకా.. ఇంకా మెరుగ్గా ఆడాలనే కసితో ముందుకు సాగుతాడు. అందుకే ఛేజింగ్‌లో కింగ్‌గా మారాడు కోహ్లి. ఇప్పటి వరకు లక్ష్య ఛేదనలో భాగంగా 27 శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్.. తాజాగా ప్రపంచకప్-2023 సెమీ ఫైనల్లో 100 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో తన సెంచరీల సంఖ్యను 23కు పెంచుకున్నాడు. అయితే, ఈ సెంచరీ అట్లాంటి ఇట్లాంటి సెంచరీ కాదు.. క్రికెట్ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన సెంచరీ!! అవును కోహ్లి సాధించేశాడు.. సెల్యూట్ కింగ్ కోహ్లి!! కేవలం నీ ఆటకే కాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నీ తత్వానికి!! చప్పట్లతో నిన్ను అభినందించిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్‌కు సలాం చేస్తూ మరోసారి నీ ప్రత్యేకతను చాటుకున్నందుకు!! టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఓవరాల్‌గా 50వ శతకం సాధించాడు. తద్వారా టీమిండియా లెజెండ్ సచిన్ టెండుల్కర్ సెంచరీ(49)ల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచకప్-2023లో భాగంగా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతకు ముందు.. వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్లలో సెమీస్‌లో మొత్తంగా కేవలం 11 పరుగులు(9, 1, 1) చేసిన కోహ్లి.. ఈసారి ఏకంగా 117 రన్స్ కొట్టేశాడు. సెమీ ఫైనల్ గండాన్ని దాటేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. అత్యధిక వన్డే సెంచరీలు: ►50 - విరాట్ కోహ్లి ►49 - సచిన్ టెండూల్కర్ ►31 - రోహిత్ శర్మ ►30 - రికీ పాంటింగ్ ►28 - సనత్ జయసూర్య View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
విరాట్ కోహ్లి= సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవాలంటే మళ్లీ సచినే దిగి రావాలి... మాస్టర్ బ్యాటర్ ఘనతల గురించి ఒకప్పుడు వినిపించిన వ్యాఖ్యల్లో ఇదొకటి. సచిన్ రికార్డుల స్థాయి, అతను అందుకున్న అసాధారణ మైలురాళ్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమనే భావన ఇందులో కనిపించింది... కానీ వాటిలో ఒక అరుదైన రికార్డును విరాట్ కోహ్లి ఇప్పుడు అందుకున్నాడు... తనకే సాధ్యమైన అద్భుత ఆటతో వన్డే క్రికెట్‌కు ముఖచిత్రంగా మారిన కోహ్లి 49వ సెంచరీని సాధించడం అనూహ్యమేమీ కాదు... ప్రపంచకప్‌కు ముందు 47 వద్ద నిలిచిన అతను మెగా టోర్నీలో కనీసం రెండు సెంచరీలు సాధించగలడని అందరూ నమ్మారు... బంగ్లాదేశ్‌పై సెంచరీ తర్వాత మరో రెండుసార్లు చేరువగా వచ్చీ శతకానికి దూరమైన అతను ఈసారి విజయవంతంగా ఫినిషింగ్ లైన్‌ను దాటాడు. విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు... అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు... కోహ్లి శతకం అందుకున్న క్షణాన కామెంటేటర్ అన్న ఈ మాట అక్షరసత్యం. ప్రపంచకప్ మ్యాచ్‌లో తన 35వ పుట్టిన రోజున సచిన్ సెంచరీల సరసన నిలవడంవంటి అద్భుత స్క్రిప్ట్ నిజంగా కోహ్లికే సాధ్యమైంది. ప్రపంచకప్ గెలిచిన క్షణంలో సచిన్‌ను భుజాల మీదకు ఎత్తుకున్న కోహ్లి... పుష్కరం తర్వాత భుజం భుజం కలుపుతూ అతని సరసన సమానంగా నిలిచాడు. సాక్షి క్రీడా విభాగం : వన్డే క్రికెట్‌ను విరాట్ కోహ్లి చదువుకున్నంత గొప్పగా మరెవరి వల్లా సాధ్యం కాలేదేమో! ఇన్నింగ్స్‌ను ఎలా ప్రారంభించాలి, మధ్య ఓవర్లలో ఎలాంటి ఆట ఆడాలి, చివర్లో ఎంతగా దూకుడు జోడించాలి... సరిగ్గా తాసులో కొలిచి లెక్కించినట్లుగా అతను ఈ ఫార్మాట్లో తన ఆటను ప్రదర్శించాడు. రుచికరమైన వంటకం కోసం వేర్వేరు దినుసులను సరిగ్గా ఎలా కలపాలో బాగా తెలిసిన షెఫ్ తరహాలో వన్డేల్లో విజయం కోసం ఎలాంటి మేళవింపు ఉండాలో అతను ఆడి చూపించాడు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా...లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా తన వ్యూహంపై ఉండే స్పష్టత కోహ్లిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగా ఉండే లక్ష్య ఛేదనలో గొప్ప గొప్ప ఆటగాళ్ల రికార్డులు కూడా పేలవంగా ఉంటాయి. కానీ కోహ్లికి మాత్రం పరుగుల వేటలోనే అసలు మజా. ఎంత లక్ష్యాన్నైనా అందుకోవడంలో తనను మించిన మొనగాడు లేడన్నట్లుగా అతని బ్యాటింగ్ సాగింది. తొలి ఇన్నింగ్స్‌లతో (51.15 సగటు, 22 సెంచరీలు) పోలిస్తే ఛేదనలో కోహ్లి రికార్డు (65.49 సగటు, 27 సెంచరీలు) ఘనంగా ఉందంటే అతని ఆట ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ 27లో 23 సార్లు భారత్ విజయం సాధించడం విశేషం. తన బ్యాటింగ్‌పై అపరిమిత నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం కోహ్లిని ‘ది బెస్ట్’గా తీర్చిదిద్దగా... అసాధారణ ఫిట్నెస్, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ సమయం పాటు సాగే కఠోర సాధన అతడి ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కోల్‌కతాలో శతకంతో మొదలై... ఆగస్టు 18, 2008... కోహ్లి తొలి వన్డే మ్యాచ్ ఆడిన రోజు. కొద్ది రోజుల క్రితమే భారత్‌కు అండర్–19 ప్రపంచకప్ అందించిన కెపె్టన్‌గా కోహ్లికి గుర్తింపు ఉండగా... సచిన్, సెహ్వాగ్‌లు విశ్రాంతి తీసుకోవడంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతనికి తొలి అవకాశం దక్కింది. ఐదింటిలో ఒక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినా సీనియర్ల రాకతో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత దేశవాళీలో, ఆ్రస్టేలియా గడ్డపై ఎమర్జింగ్ టోర్నీలో భారీ స్కోర్లతో చెలరేగిన తనను మళ్లీ ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. దాంతో ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం దక్కింది. మూడు అర్ధసెంచరీల తర్వాత తన 14వ వన్డేలో శ్రీలంకపై 114 బంతుల్లో చేసిన 107 పరుగుల ఇన్నింగ్స్‌తో అతని ఖాతాలో తొలి సెంచరీ చేరింది. ఈ సెంచరీ కోల్‌కతాలోనే ఈడెన్ గార్డెన్స్‌లో నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత మరో మూడు వన్డేలకే మళ్లీ సెంచరీ నమోదు చేసిన కోహ్లికి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వన్డే టీమ్‌లో అతను పూర్తి స్థాయిలో రెగ్యులర్ మెంబర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్‌తో పాటు కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. అయితే ఫైనల్లో అతని ఇన్నింగ్స్ (35 పరుగులు) కూడా ఎంతో విలువైంది. 31 పరుగులకే సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత గంభీర్‌తో మూడో వికెట్‌కు జోడించిన కీలకమైన 83 పరుగులు చివరకు విజయానికి బాట వేశాయి. ఒకదాన్ని మించి మరొకటి... విరాట్ కెరీర్లో అప్పటికే ఎనిమిది సెంచరీలు వచ్చి చేరాయి. జట్టులో స్థానానికి ఢోకా లేకపోగా, జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు జత చేస్తూ ఇన్నింగ్స్ నిరి్మంచే ‘క్లాసిక్’ ఆటగాడిగా కోహ్లికి అప్పటికి గుర్తింపు వచ్చింది. కానీ అతనిలోని అసలైన దూకుడుకు హోబర్ట్ మైదానం వేదికైంది. శ్రీలంకతో మ్యాచ్‌లో 40 ఓవర్లలో 321 పరుగులు ఛేదిస్తేనే టోర్నీలో నిలిచే అవకాశం ఉన్న సమయంలో కోహ్లి నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 133 పరుగులు చేయడంతో 37వ ఓవర్లోనే భారత్ లక్ష్యాన్ని చేరింది. పరిస్థితిని బట్టి కోహ్లి తన ఆటను ఎలా మార్చుకోగలడో ఈ ఇన్నింగ్స్ చూపించగా, తర్వాతి రోజుల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై చేసిన అత్యధిక స్కోరు 183, కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 160 నాటౌట్, నేపియర్‌లో కివీస్‌పై 123, పుణేలో ఇంగ్లండ్‌పై 123, మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 117... ఏది గొప్పదంటే ఏమి చెప్పాలి? జైపూర్‌లో ఆ్రస్టేలియాపై 52 బంతుల్లోనే చేసిన శతకం ఇప్పటికీ భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదై ఉంది. అతని ఒక్కో వన్డే ఇన్నింగ్స్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ శతకాలు అభిమానులకు పంచిన ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! -
అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో తొలి సెంచరీలు చేసింది ఎవరు..?
నిన్న (జూన్ 7) ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా ట్రవిస్ హెడ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ ఆసీస్ ఆటగాడు డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్లో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కిన అనంతరం వివిధ ఫార్మాట్ల ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్‌లో ఎవరు శతక్కొట్టారనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్‌లో ఎవరు తొలి సెంచరీ చేశారని ఆరా తీయగా.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తొలి సెంచరీ క్లైవ్ లాయిడ్ (1975 వరల్డ్‌కప్, వెస్టిండీస్), ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తొలి సెంచరీ ఫిలో వాలెస్ (1998, వెస్టిండీస్) పేరిట నమోదై ఉన్నాయి. టీ20 ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో జరిగే ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఇప్పటివరకు ఎవరూ సెంచరీ సాధించలేదు. టీ20 వరల్డ్‌కప్‌లో 11 సెంచరీలు నమోదైనప్పటికీ అన్నీ వివిధ దశల్లో వచ్చినవే. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా నిన్న మొదలైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) సత్తా చాటడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. వార్నర్ (43), ఉస్మాన్ ఖ్వాజా (0), మార్నస్ లబూషేన్ (26) ఔటయ్యారు. షమీ, సిరాజ్, శార్దూల్‌కు తలో వికెట్ దక్కింది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపెవరిది..? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ను ఆశ్రయించిన ఆసీస్ -
ముందే అనుకున్నారా.. కలిసే సెంచరీలు కొడుతున్నారు!
విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్.. ఇద్దరిలో ఒకరు ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకొని క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుంటే.. మరొకరు యంగ్ ప్లేయర్‌గా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆటలో ఎవరికి వారే సాటి. గిల్ కోహ్లి కంటే చాలా సీనియర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే కోహ్లి ఆటను చూస్తూ గిల్ పెరిగాడు. అలాంటిది ఈ ఇద్దరు ఇప్పుడు టీమిండియా తరపున కీలక బ్యాటర్లుగా ఎదిగారు. మరో విశేషమేమిటంటే ఈ ఇద్దరు కలిసి ఈ ఏడాది మూడు వేర్వరు మ్యాచ్‌ల్లో ఒకేసారి సెంచరీలతో మెరిశారు. అందులో రెండు మ్యాచ్‌లు టీమిండియా తరపున .. మరొకటి ఐపీఎల్లో వేర్వేరు జట్లు తరపున ఒకే మ్యాచ్‌లో సెంచరీలు బాదారు. తొలిసారి లంకతో జరిగిన మూడో వన్డేలో ఈ ఏడాది శుబ్‌మన్ గిల్, కోహ్లిలు ఒకే మ్యాచ్‌లో సెంచరీలతో మెరిసింది లంకతో జరిగిన మూడో వన్డేలో. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత ఓపెనర్ గిల్ 116 పరుగులు సెంచరీ చేయగా.. ఆ తర్వాత కోహ్లి 166 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. రెండోసారి.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇక ఈ ఇద్దరు ఒకే మ్యాచ్‌లో రెండోసారి సెంచరీలు చేసింది బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ 128 పరుగులు చేయగా.. కోహ్లి 186 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. ఐపీఎల్లో ముచ్చటగా మూడోసారి Photo: IPL Twitter ఇక ముచ్చటగా మూడోసారి ఒకే మ్యాచ్‌లో సెంచరీలు బాదింది ఐపీఎల్లో. అయితే ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా సెంచరీలు సాధించారు. ప్లేఆఫ్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి 101 నాటౌట్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 104 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచి గుజరాత్‌ను గెలిపించి ఆర్సీబీ లీగ్ స్టేజీలోనే వెనుదిరగడానికి కారణమయ్యాడు. అలా కోహ్లి, గిల్లు ముచ్చటగా మూడుసార్లు మూడు వేర్వేరు మ్యాచ్‌ల్లో సెంచరీలతో మెరిసి అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ అనంతరం ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో మరోసారి ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా జూన్ ఏడు నుంచి 11 వరకు ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. చదవండి: జడ్డూకు ఫుల్ డిమాండ్.. సీఎస్కే నుంచి బయటికి వస్తే?! -
సచిన్ రికార్డు బద్దలు కొట్టేది అతడే.. 110 సెంచరీలతో: పాక్ మాజీ పేసర్
OTD- Sachin Tendulkar 100 Centuries: పదకొండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ టోర్నీ-2012లో భాగంగా మార్చి 16న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సచిన్ ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 114 పరుగులు సాధించాడు. ఫలితం ఏదైనా ఈ మ్యాచ్ మాత్రం భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక ఇప్పటి వరకు సచిన్ సాధించిన ఈ అత్యంత అరుదైన రికార్డుకు చేరువగా రాగలిగింది టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మాత్రమే! ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇటీవలే కోహ్లి 75వ శతకం నమోదు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో తాజా సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశమే హద్దు సచిన్ టెండుల్కర్తో ఎన్నో మ్యాచ్‌లలో తలపడిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా కోహ్లికే ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ భారం దిగిపోయిన తర్వాత పరుగుల యంత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడని అక్తర్ పేర్కొన్నాడు. 110 సెంచరీలు చేస్తాడు ‘‘విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఇప్పుడు తనపై కెప్టెన్సీ భారం లేదు. మానసికంగా ఒత్తిడి లేదు. కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టే వీలు కలిగింది. కోహ్లి 110 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును బ్రేక్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. పరుగుల దాహంతో ఉన్న కోహ్లికి ఈ ఫీట్ అసాధ్యమేమీ కాదు’’ అని షోయబ్ అక్తర్ ఏఎన్ఐతో వ్యాఖ్యానించాడు. కాగా సచిన్ టెండుల్కర్.. అంతర్జాతీయ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు సాధించాడు. కోహ్లి ఇప్పటి వరకు వన్డేల్లో 46, టెస్టులో 28, టీ20లలో ఒక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వంద సెంచరీల మార్కుకు ఇంకా 25 శతకాల దూరంలో ఉన్నాడు. ఇక 34 ఏళ్ల కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉంటే అక్తర్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఆసియా లయన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా! PSL 2023: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..! -
Ranji Trophy: సౌరాష్ట్ర దీటైన జవాబు
బెంగళూరు: కెప్టెన్ అర్పిత్ వాసవద (219 బంతుల్లో 112 బ్యాటింగ్; 15 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (245 బంతుల్లో 160; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించడంతో... కర్ణాటక జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు మరో 44 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 76/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. షెల్డన్ జాక్సన్, అర్పిత్ నాలుగో వికెట్‌కు 232 పరుగులు జోడించి సౌరాష్ట్ర జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం అర్పిత్, చిరాగ్ జానీ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీయగా, వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. బెంగాల్‌కు భారీ ఆధిక్యం ఇండోర్‌లో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో బెంగాల్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 56/2తో మూడో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ ఆకాశ్‌దీప్ (5/42) మధ్యప్రదేశ్‌ను దెబ్బ కొట్టాడు. బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ మనోజ్ తివారి మధ్యప్రదేశ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెంగాల్ ఓవరాల్ ఆధిక్యం 327 పరుగులకు చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలి రోజే 506 (4 వికెట్ల నష్టానికి) పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1910 డిసెంబర్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 494 పరుగులు నమోదయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటి వరకు ఇదే తొలి రోజు అత్యధిక స్కోర్‌గా కొనసాగింది. తాజాగా ఇంగ్లండ్ తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది. World Record Day!#ENGvPAK pic.twitter.com/1WqQzmhNpC — RVCJ Media (@RVCJ_FB) December 1, 2022 ఈ రికార్డుతో పాటు తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ ఇంగ్లండ్ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్ తొలి సెషన్లో 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసిన ఇంగ్లండ్.. టీమిండియా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి సెషన్లో 158 పరుగులు స్కోర్ చేసింది. తాజాగా ఇంగ్లండ్.. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది. Stumps in Rawalpindi 🏏 England rewrite record books on their historic return to Pakistan 🙌 #WTC23 | #PAKvENG | https://t.co/PRCGXi3dZS pic.twitter.com/WPDooIc2ee — ICC (@ICC) December 1, 2022 ఇవే కాక, ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఈ మ్యాచ్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు 75 ఓవర్లలో 6.75 రన్‌రేట్ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. -
శతకాలతో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. పాక్ బౌలర్లకు చుక్కలు
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ వన్డేల తరహాలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 227/0గా ఉంది. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా దక్కంచుకోలేకపోయారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ టీమ్‌లో గుర్తు తెలియని వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అస్వస్థతను జయించి బెన్ డకెట్ సెంచరీ సాధించడం విశేషం. డకెట్‌కు ఇది టెస్ట్‌ల్లో తొలి శతకం. -
ఒకే రోజు 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు.. పరుగుల ప్రవాహం
VHT 2022: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా నవంబర్ 21 జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క రోజే ఏకంగా 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీ హవాలో పై పేర్కొన్న గణాంకాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కేరళ ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ (107 నాటౌట్), మధ్యప్రదేశ్ ఓపెనర్ యశ్ దూబే (195 నాటౌట్), హిమాచల్ ప్రదేశ్ ఏకాంత్ సేన్ (116), చండీఘడ్ అర్స్‌లన్ ఖాన్ (107), ఒడిశా ఆటగాడు కార్తీక్ బిశ్వాల్ (107 నాటౌట్), గుజరాత్ ఆటగాడు కథన్ పటేల్ (109), హైదరాబాద్ ఆటగాడు రోహిత్ రాయుడు (109), తమిళనాడు ఆటగాళ్లు నారాయణ్ జగదీశన్ (277), సాయ్ సుదర్శన్ (154), ఆంధ్రప్రదేశ్ రికీ భుయ్ (112 నాటౌట్), జార్ఖండ్ ఆటగాడు విక్రమ్ సింగ్ (116 నాటౌట్), బెంగాల్ ఆటగాళ్లు సుదీప్ ఘరామీ (162), అభిమన్యు ఈశ్వరన్ (122), రాజస్తాన్ ఆటగాడు ఆదిత్య గర్హ్వాల్ (149 నాటౌట్), మహారాష్ట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (107) సెంచరీలు బాదగా.. మరో 36 మంది హాఫ్ సెంచరీలు సాధించారు. -
టీ20 వరల్డ్‌కప్‌ల్లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
దేశవాళీ, ఐపీఎల్ తరహా లీగ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను చేరుకోవడం సర్వసాధారణమైపోయినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఈ మార్కును చేరుకోవడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే సెంచరీ సాధించిన ఆటగాళ్ల సంఖ్యను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఇవాల్టి (అక్టోబర్ 27) దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ వరకు కేవలం 10 శతకాలు మాత్రమే నమోదయ్యాయంటే నమ్మి తీరాల్సిందే. టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రొస్సో సాధించిన సుడిగాలి శతకం (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పదవ శతకంగా రికార్డయ్యింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (117) తొలి శతకాన్ని నమోదు చేశాడు. 2007 ఇనాగురల్ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై గేల్ శతకం బాదాడు. గేల్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో రెండో శతకాన్ని టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా బాదాడు. రైనా 2010 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరఫున ఇప్పటివరకు మూడంకెల స్కోర్ సాధించిన ఆటగాడు రైనా ఒక్కడే కావడం విశేషం. వీరి తర్వాత మహేళ జయవర్ధనే (2010లో జింబాబ్వేపై 100), బ్రెండన్ మెక్కల్లమ్ (2012లో బంగ్లాదేశ్‌పై 123), అలెక్స్ హేల్స్ (2014లో శ్రీలంకపై 116 నాటౌట్), అహ్మద్ షెహజాద్ (2014లో బంగ్లాదేశ్‌పై 111 నాటౌట్), తమీమ్ ఇక్బాల్ (2016లో ఓమన్‌పై 103 నాటౌట్), క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్‌పై 100 నాటౌట్), జోస్ బట్లర్ (2021లో శ్రీలంకపై 101 నాటౌట్), తాజాగా రిలి రొస్సో టీ20 ప్రపంచకప్‌ల్లో శతకాలు సాధించారు. -
మూడేళ్లు సెంచరీ చేయకపోయినా సచిన్ కంటే కోహ్లినే బెటర్..!
టీమిండియా తాజాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో శతక్కొట్టిన కోహ్లి.. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని, ఓవరాల్‌గా 71 శతకాన్ని నమోదు చేశాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల పాటు మూడంకెల స్కోర్ చేయకపోయినా గణాంకాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కోహ్లి మూడేళ్లకు పైగా సెంచరీ సాధించకపోయినా, సచిన్ కంటే ఓ ఇన్నింగ్స్ ముందుగానే తన 71వ శతకాన్ని నమోదు చేయడం మరో విశేషం. సచిన్ 71 శతకాల మార్కును 523 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. కోహ్లి 522 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ శతకాలను పూర్తి చేశాడు. 71 సెంచరీల తర్వాత మిగతా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్ కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాడు. సచిన్ 71 సెంచరీలు నమోదు చేసే క్రమంలో 49.51 సగటున 23,274 పరుగులు సాధించగా.. కోహ్లి ఇదే మార్కును చేరుకునే క్రమంలో 53.81 సగటున 24,002 రన్స్ స్కోర్ చేశాడు. అర్ధసెంచరీల విషయంలోనూ కోహ్లి.. సచిన్ కంటే మెరుగ్గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 523 ఇన్నింగ్స్‌ల తర్వాత సచిన్ 107 హాఫ్ సెంచరీలు సాధించగా.. కోహ్లి 124 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఇవే కాకుండా స్ట్రయిక్ రేట్ ఇతరత్రా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్‌తో పోలిస్తే కాస్త బెటర్‌గానే ఉన్నాడు. కాగా, కేవలం గణాంకాల్లో మెరుగ్గా ఉన్నాడని సచిన్ కంటే కోహ్లి అత్యుత్తమ ఆటగాడని చెప్పలేని పరిస్థితి. ఇద్దరు తమతమ హయాంలో అత్యుత్తమ ఆటగాళ్లన్నది కాదనిలేని సత్యం. కోహ్లి గణాంకాల పరంగా ప్రస్తుతం సచిన్ కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల మార్కు అందుకోవడం కోహ్లికి అంత ఈజీ కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 33 ఏళ్ల వయసున్న కోహ్లి మరో మూడు నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడినా హండ్రెడ్ హండ్రెడ్స్ మార్కును అందుకోలేడని సచిన్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. చదవండి: కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..! -
ఆ రోజు ఊరంతా ఖాళీ!... దశాబ్దాలుగా సాగుతున్న ఆచారం
అనంతపురం(తాడిపత్రి రూరల్): శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ బుధవారం సూర్యుడు ఉదయించక ముందే తాడిపత్రి మండలం తలారి చెరువు మొత్తం ఖాళీ అయింది. ‘అగ్గి పాడు’ ఆచారం పేరుతో ఇంటిలోని విద్యుత్ దీపాలను పూర్తిగా ఆర్పి, నిప్పు సైతం వెలిగించలేదు. పశువుల పాక ల్లోని పేడకళ్లతో పాటు ఇళ్లలోని కసువూ శుభ్రం చేయలేదు. కట్టెలు, వంట సామగ్రి, పాత్రలను మూటగట్టుకుని ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లపై వేసుకుని, ఇళ్లకు తాళం వేసి దర్గా వద్దకు చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. చీకటి పడిన తర్వాత ఇళ్లకు చేరుకుని ఆరుబయటనే భోజనాలు ముగించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఇంటి గడపకూ టెంకాయ కొట్టి లోపలకు ప్రవేశించారు. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయని గ్రామస్తుల నమ్మకం. -
సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్
Ruturaj Gaikwad And Venkatesh Iyer Smash Centuries Vijay Hazare Trophy.. దేశవాలీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్లు దుమ్మురేపారు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరపున కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా.. మహారాష్ట్ర తరపున కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ సీఎస్కే తరపున ఆడగా.. వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రుతురాజ్‌ను(రూ.6 కోట్లు) సీఎస్కే రిటైన్ చేసుకోగా.. వెంకటేశ్ అయ్యర్‌ను(రూ.8 కోట్లు) కేకేఆర్ తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్.. త్వరలోనే టెస్టులకు కూడా! మ్యాచ్‌ల విషయానికి వస్తే.. మహారాష్ట్ర, చత్తీస్‌ఘర్ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన చత్తీస్‌ఘర్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్రను రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో నడించాఇ మ్యాచ్‌లో రుతురాజ్ 143 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని దాటికి మహారాష్ట్ర 47 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. కాగా రుతురాజ్‌కు ఈ సీజన్లో రెండో సెంచరీ కావడం విశేషం. మరోవైపు కేరళతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో వెంకటేశ్ అయ్యర్(84 బంతుల్లో 112, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభమ్ శర్మ(67 బంతుల్లో 82, 9 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేరళ 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: Vijay Hazare Trophy: హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం.. ఆంధ్రకు మాత్రం -
గర్జించిన సఫారీ ఓపెనర్లు.. పసికూనపై భారీ స్కోర్ నమోదు
డబ్లిన్: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సఫారీ బ్యాట్స్‌మెన్ గర్జించారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పసికూన చేతిలో ఎదురైన పరాభవంతో సఫారీలు అలర్ట్ అయ్యారు. పరువు పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), జన్నెమన్ మలాన్ (177 బంతుల్లో 169 నాటౌట్; 16 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మలాన్ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కెరీర్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ వాన్ డర్ డుసెన్(28 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 2, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్ తలో వికెట్ పడగొట్టారు. కడపటి వార్తలందేసరికి ఐర్లాండ్ 3 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 12 పరుగులు సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోగా, రెండో వన్డేలో ఆతిధ్య ఐర్లాండ్ సఫారీలపై 43 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్లో ఐర్లాండ్‌కు సఫారీలపై ఇదే తొలి విజయం కావడం విశేషం. -
వరుస సెంచరీలతో చెలరేగుతున్న పృథ్వీ షా
ఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కెప్టెన్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు బాదిన పృథ్వీ తాజాగా మరో సెంచరీ బాదేశాడు. ఈ నాలుగు సెంచరీల్లో మూడుసార్లు 150కి పైగా స్కోరు నమోదు చేయడం విశేషం. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో 227 నాటౌట్, 185 పరుగులు నాటౌట్‌తో చెలరేగాడు. తాజాగా కర్ణాటకతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో కేవలం 122 బంతుల్లో 167 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే కర్ణాటకతో జరగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభించిన పృథ్వీ షా తర్వాత వేగం పెంచాడు. 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణమైన ప్రదర్శనతో జట్టులో చోటు పోగొట్టున్న షా.. విజయ్ హజారే ట్రోపీలో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే టోర్నీలో 725 పరుగులు చేసిన పృథ్వీ.. 723 పరుగులతో మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్ధలుకొట్టాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 49.2 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. -
అటు తిలక్... ఇటు భుయ్
సూరత్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ 113 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (145 బంతుల్లో 156; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా, తన్మయ్ అగర్వాల్ (100 బంతుల్లో 86; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం త్రిపుర 42 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. సీవీ మిలింద్ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇండోర్: ఆంధ్ర 3 వికెట్లతో పటిష్టమై న విదర్భను ఓడించింది. విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్లకు 331 పరుగులు చేసింది. యష్ (113 బంతుల్లో 117; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫైజ్ ఫజల్ (105 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. అనంతరం ఆంధ్ర 49.2 ఓవర్లలో 7 వికె ట్లకు 332 పరుగులు సాధించింది. రికీ భుయ్ (78 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫో ర్లు, 6 సిక్స ర్లు) అజేయ శతకం బాదగా, కెప్టెన్ హనుమ విహారి (67 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు.