
సాక్షి, హైదరాబాద్: మేఘాలయ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐదు రోజుల ఈ తుది పోరులో రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 25/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 87.5 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది.
నితేశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 131 పరుగులు జోడించారు. నితేశ్ అవుటయ్యాక ప్రజ్ఞయ్ అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 46 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయ ఆట ముగిసే సమయానికి ఖాతా తెరవకుండా ఒక వికెట్ కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment