niteesh
-
నితేశ్, ప్రజ్ఞయ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: మేఘాలయ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐదు రోజుల ఈ తుది పోరులో రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 25/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 87.5 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. నితేశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్స్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఏడో వికెట్కు 131 పరుగులు జోడించారు. నితేశ్ అవుటయ్యాక ప్రజ్ఞయ్ అజేయంగా నిలిచి హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 46 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయ ఆట ముగిసే సమయానికి ఖాతా తెరవకుండా ఒక వికెట్ కోల్పోయింది. -
'అసురన్' నటుడు మృతి
కోవిడ్ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. సినీ రంగానికి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడి కన్నుమూశారు. మరికొందరు ప్రముఖులు వారి ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. సోమవారం నాడు కరోనా కారణంగా తమిళ నటుడు నితీశ్ వీరా(45) కన్నుమూశాడు. అసురన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ 'పేరరుసు', 'వెన్నిల కబడి కుళు', 'పుదు పేట్టై' వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి, శృతీ హాసన్ జంటగా నటిస్తున్న 'లాభం' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు 'నీరో' అనే సినిమాలోనూ కనిపించనున్నాడు. ఇంతలోనే కరోనా ఆయనను కబళించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చదవండి: 31 వరకు సినీ, టీవీ షూటింగ్స్ రద్దు.. అజిత్ 10 లక్షలు విరాళం -
మరో యువరైతు ఆత్మహత్య
కుంటాల: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కుంటాల మండలం సరియాపూర్ పంచాయతి పరిధిలోని మెద్దన్పూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నితీష్(25) తనకున్న ఎకరం భూమితో పాటు ఆరెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నితీష్కు ఆరు నెలల క్రితమే వివాహమైంది.