
కోవిడ్ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. సినీ రంగానికి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడి కన్నుమూశారు. మరికొందరు ప్రముఖులు వారి ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. సోమవారం నాడు కరోనా కారణంగా తమిళ నటుడు నితీశ్ వీరా(45) కన్నుమూశాడు.
అసురన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ 'పేరరుసు', 'వెన్నిల కబడి కుళు', 'పుదు పేట్టై' వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి, శృతీ హాసన్ జంటగా నటిస్తున్న 'లాభం' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు 'నీరో' అనే సినిమాలోనూ కనిపించనున్నాడు. ఇంతలోనే కరోనా ఆయనను కబళించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
చదవండి: 31 వరకు సినీ, టీవీ షూటింగ్స్ రద్దు.. అజిత్ 10 లక్షలు విరాళం
Comments
Please login to add a commentAdd a comment