
ప్రముఖ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఓ సినిమా కోసం లండన్ వెళ్లిన వడివేలు ఇండియాకు వచ్చిన అనంతరం స్వల్ప కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వెంటనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. కాగా ఈ మధ్యకాలంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే హీరో విక్రమ్, కరీనా కపూర్, కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment