vadivelu
-
స్టార్ కమెడియన్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా
ప్రముఖ కమెడియన్, పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మనకు తెలిసిన వడివేలు.. తోటి నటుడు సింగముత్తపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1991 నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగానని, సింగముత్తుతో కలిసి 2000 నుంచి కొన్ని సినిమాల్లో కలిసి నటించానని.. కానీ తాను అతడి కంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో సింగముత్తు తట్టుకోలేకపోతున్నాడని వడివేలు తన పిటిషన్లో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)ఆ మధ్య తాంబరంలో వివాదాస్పద స్థలాన్ని సింగముత్తు తనతో కొనిపించాడని, ఆ కేసు స్థానిక ఎగ్మోర్ కోర్ట్‌లో ఉందని వడివేలు చెప్పుకొచ్చారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించిన సింగముత్తు.. తనని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దీనికోసం ఆయన రూ.5 కోట్ల పరువు నష్టం దావా చెల్లించేలా చేయాలని కోర్టుకి విన్నవించాడు.ఇక వడివేలు పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన జడ్జి.. రెండు వారాల్లో బదులివ్వాలని నటుడు సింగముత్తుకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
దీనస్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్..
ప్రముఖ కమెడియన్ వెంగళ్రావు దీన స్థితిలో ఉన్నాడు. తమిళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. చికిత్సకు సైతం డబ్బుల్లేకపోవడంతో ఆదుకోవాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఒక చేయి, కాలు పక్షవాతానికి గురైందని, పని చేసే స్థితిలో లేనని, చికిత్సకు డబ్బులిచ్చి సాయం చేయాలని సినిమా తారలకు విజ్ఞప్తి చేశాడు.కదిలిన సినీతారలుఇది చూసిన తమిళ హీరో శింబు రూ.2 లక్షలు, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ రూ.25,000 ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కమెడియన్ వడివేలు.. నటుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు తనను నేరుగా కలిసి యోగక్షేమాలు తెలుసుకోనున్నాడు.వడివేలుతోనే ఎక్కువ సినిమాలుకాగా వెంగళ్రావు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో స్టంట్‌మెన్‌గా పని చేశాడు. తర్వాత నటుడిగా మారాడు. కాంతస్వామి, తలై నగరం, పగిరి.. ఇలా అనేక చిత్రాలు చేశాడు. ఎక్కువగా వడివేలుతో కలిసి పని చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లోనే దాదాపు 30 సినిమాలున్నాయి. ప్రస్తుతం వెంగళ్రావు విజయవాడలో నివసిస్తున్నాడు. #வடிவேலு உடன் காமெடி வேடங்களில் நடித்த #வெங்கல்ராவ் ஒரு கை, ஒரு கால் செயல் இழந்து, சொந்த ஊரான விஜயவாடாவில் சிகிச்சை பெற்று வருகிறார்.மருத்துவச் செலவுக்கு நடிகர்கள் மற்றும் சினிமா தொழில்நுட்பக் கலைஞர்கள் தனக்கு உதவும்படி வீடியோ வெளியிட்டுள்ளார்.@GovindarajPro #VengalRao pic.twitter.com/6wkYJBVTqK— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 24, 2024చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది? -
23 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. ఏ సినిమా కోసమంటే?
హీరోహీరోయిన్ కావొచ్చు.. హీరో-కమెడియన్ కావొచ్చు.. కొన్ని కాంబోలు సూపర్ హిట్ అవుతుంటాయి. అలా 'ప్రేమికుడు'(కాదలన్)లో ప్రభుదేవా, వడివేలుల కాంబో కేక పుట్టించింది. దీని తర్వాత 'మనదై తిరుడి విట్టాయ్'లోనూ కలిసి నటించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ జోడీ సెట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఈ కాంబో తిరిగి ఓ మూవీలో కనిపించనుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) వరుత్త పడాద వాలిభర్ సంఘం, రజనీ మురుగన్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు పొన్రామ్ కొత్తగా ఓ చిత్రం చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. దీనికి 'లైఫ్ ఈజ్ బ్యూటిపుల్' అనే టైటిల్ నిర్ణయించారని టాక్. ఇందులోనే ప్రభుదేవా-వడివేలు కలిసి నటించబోతున్నారట. ప్రస్తుతం ప్రభుదేవా దళపతి విజయ్ 'ద గోట్' మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. వడివేలు.. మరోసారి ఫహాద్ ఫాజిల్‌తో కలిసి నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్) -
మారుమూల గ్రామంలో లెజండరీ కమెడియన్ కుమారుడు.. పెళ్లి ఫోటో వైరల్
సౌత్ ఇండియాలో ప్రముఖ హాస్య నటుల్లో నటుడు వడివేలు ఒకరు. కోలీవుడ్‌లో అయితే ఆయనొక లెజండ్ అని చెప్పవచ్చు. గతంలో కొన్ని సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ తెరపై కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన మామన్నన్‌లో వడివేలు నటనను చూసిన వారందరూ కూడా ఫిదా అయ్యారు. ఇంతటి పాపులారిటీ వచ్చినా తన కుటుంబాన్ని ఎప్పుడూ పబ్లిక్‌గా కెమెరా ముందు ఆయన చూపించడు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా తక్కువ మందితోనే ముగించేస్తాడు. కెమెరా వాళ్లను కూడా లోపలికి అనుమతివ్వడు. దీంతో ఆయనకు అబ్బాయితో పాటు అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వారి ఫోటోలు బయట పెద్దగా కనిపించవు. తాజాగా వడివేలు కుమారుడి పెళ్లి నాటి ఫోటో తెగ వైరల్ అవుతుంది. వడివేలు కుమారుడి పేరు సుబ్రమణి ఆయన సుమారు 10 ఏళ్ల క్రితమే తనకు మరదలు వరుస అయ్యే భువనేశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో వడివేలు వద్ద ఎంతో డబ్బు, కార్లు, ఆస్తులు ఉన్నా కూడా తనకు దగ్గరి బంధువు అయిన ఆమెనే తన కోడిలిగా తెచ్చుకున్నాడు. తన వియంకుడు కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వారి పెళ్లి కూడా చాలా తక్కువ మంది సమక్షంలోనే జరిగింది. కష్టపడటం నేర్పించాడు గతంలో ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి వడివేలు గురించి సుబ్రమణి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తనకూ కూడా సినిమాల్లో నటించాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమా ఛాన్సుల కోసం తన తండ్రి వడివేలు ఎలాంటి సిపారసులు చేయలేదని చెప్పాడు. సిపారసు ద్వారా అవకాశం వస్తే ఎక్కువ కాలం నిలబడలేవని చెప్పడంతో తన తండ్రి పేరు ఎక్కడా కూడా ఉపయోగించుకోలేదని ఆయన చెప్పాడు. తన తండ్రి అంటే చాలా ఇష్టమని తన పిల్లలకు కూడా వడివేలే పేరు పెట్టినట్లు చెప్పాడు. తనకు ఏ అవసరం వచ్చినా వడివేలు సాయం చేస్తాడని ఆయన చెప్పాడు. అయనప్పటికీ తన తండ్రి మీద ఆధారపడకుండా జీవిస్తున్నట్లు సుబ్రమణి పేర్కొన్నాడు. కష్టపడి పనిచేయడం నేర్పించాడు అది చాలు అని ఆయన వినమ్రంగా చెప్పాడు. తనకు వడివేలు అంటే ఎంతో ప్రాణమని పేర్కొన్నాడు. పలుమార్లు సిటీకి రమ్మని నాన్నగారు చెప్పినా తాను వెళ్లలేదని సుబ్రమణి తెలపాడు. పండుగలు వస్తే అందరం కలిసి సంతోషంగా గడుపుతామని తెలిపాడు. ప్రస్తుతం ఆయన తన తండ్రి వడివేలు నుంచి వారసత్వంగా వచ్చిన పొలంలో ఒక మారు మూల గ్రామంలో వ్యవసాయమే చేసుకుంటున్నట్లు సమాచారం. (వడివేలు కూతురు కార్తీక పెళ్లి ఫోటో) ప్రస్తుతం ఆయన పెళ్లి ఫోటో కోలీవుడ్‌లో భారీగా ట్రెండింగ్ అవుతుంది. వడివేలుతో ఒక్కసారైనా వెండితెర మీద కనిపించాలనే కోరిక ఉన్నట్లు ఆయన చెప్పాడు. ఎప్పటికైన తెరపై కనిపిస్తానని ఆయన పేర్కొన్నాడు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా తన తండ్రి మీద ఆధారపడకుండా గ్రామీణ ప్రాంతంలో తన కష్టంతో జీవిస్తున్న సుబ్రమణి గురించి నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. పల్లెటూరులో ఉండే తన స్నేహితులతో కలిసే ఆ ఇంటర్వ్యూ ఇవ్వడంతో అది చాలా రోజుల నుంచి వైరల్ అవుతూనే ఉంది. తనకు హీరో విజయ్, అజిత్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. -
వడివేలుతో ఫహద్ ఫాసిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా
ప్రముఖ హాస్య నటుడు వడివేలు, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఇంతకుముందు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన 'మామన్నన్' చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆ చిత్రంలో వడివేలు పాజిటివ్ పాత్రలో, ఫాహత్ ఫాజిల్ నెగిటివ పాత్రలోనూ నటించి మెప్పించారు. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మించనుండడం విశేషం. ఈయన ఇంతకుముందు తమిళం, తెలుగు తదితర భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా వడివేలు, ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో తన 98వ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి వి.కృష్ణమూర్తి కథ, దర్శకత్వం బా ధ్యతలను వి.కృష్ణమూర్తి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేశారు. కాగా ఇది రోడ్డు పైన నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, కలై సెల్వన్ శివాజీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా ఈ సంస్థలో ఆర్బీ చౌదరి ఇంతకుముందు విజయ్ హీరోగా జిల్లా వంటి పలు చిత్రాలను నిర్మించారు. కాగా ఈయన తన 100వ చిత్రాన్ని నటుడు విజయ్ కథానాయకుడిగా నిర్మించనున్నట్లు చాలా కాలం క్రితమే వెల్లడించడం గమనార్హం. -
ఆ దెబ్బకు ఎనిమిదేళ్లు సినిమాలు మానేశా: డైరెక్టర్ భావోద్వేగం!
పోటాపోటీ(2011) సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ దర్శకుడు యువరాజ్ దయాలన్. ప్రస్తుతం ఇరుగపాట్రు అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతకుముందు తెనాలిరామన్(2014), ఇలీ(2015) చిత్రాలను తెరకెక్కించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఏర్పాటు చేసిన ఇరుగపాట్రు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న యువరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఎనిమిదేళ్లలో తాను నిద్రపోకుండా చేసింది ఆ సినిమానే అని అన్నారు. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) యువరాజ్ మాట్లాడుతూ..' దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ స్టేజ్‌పైకి వచ్చాను. ఈ గత ఎనిమిదేళ్లలో నన్ను నిద్రపోనివ్వనిది ఒకటి ఉంది. అదే నా లాస్ట్ మూవీ ఎలి. ఆ రోజు ప్రెస్ షోకి మీలో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. అప్పుడే నేను, వడివేలు థియేటర్ బయటే ఉన్నాం. అయితే ఆ రోజు ఎవరూ బయటకు రాలేదు. అలా నేనూ వడివేలు థియేటర్లోకి వెళ్లాం. సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని నేను అడిగా. అంతా నిశ్శబ్దం. చాలా రోజుల తర్వాత ఇలాంటి నిశ్శబ్దాన్ని చూశా. అయితే ఒక సినిమా తర్వాత ప్రేక్షకులు మౌనంగా ఉంటే దాని అర్థం కేవలం రెండు విషయాలు మాత్రమే. ఒకటి అది ప్రపంచ స్థాయి సినిమా అయి ఉండాలి లేదా దానికి విరుద్ధంగానైనా ఉండాలి. వారి మౌనానికి కారణం.. నేను రెండోదే తీసుకున్నా.'అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) ఆ సినిమా పరాజయం కొన్నేళ్లపాటు నిద్ర లేకుండా చేసిందని చెప్పారు. వాళ్ల నిశ్శబ్దం నన్ను చిన్నాభిన్నం చేసిందని తెలిపారు. ఈ సినిమాతో వాళ్ల జీవితంలోని మూడు గంటలు వృథా చేశానని అనిపించింది. అందుకే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరుగపట్రు నిర్మాతల సహకారంతోనే తాను మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే వడివేలుతో తెరకెక్కించిన తెనాలి రామన్ సక్సెస్ కావడంతో.. మళ్లీ వడివేలుని కథానాయకుడిగా పెట్టి ఇలి రూపొందించాడు. 2015లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరుగపట్లు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, శ్రద్ధా శ్రీనాథ్, విక్రాంత్, అబర్నతి, శ్రీ, సానియా అయ్యప్పన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. -
Raghava Lawrence, Kangana Ranaut Chandramukhi 2 Pre-Release Event: రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2'ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నటుడు వడివేలు ఇంట విషాదం..
తమిళనాడు: ప్రముఖ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమ్ముడు జగదీశ్వరన్(55) ఆదివారం(ఆగస్టు 27) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయన కొద్ది రోజులుగా తమిళనాడు మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోనే ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. కాగా జగదీశ్వరీన్.. శింబు 'కాదల్ అలైవిట్టలై' సినిమాతో సహా పలు చిత్రాల్లో నటుడిగా తళుక్కుమని మెరిశారు. కానీ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో చెన్నై నుంచి మధురై వెళ్లిపోయాడు. అక్కడ ఒక వస్త్రాల షాపు పెట్టుకుని జీవనం కొనసాగించాడు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితమే వడివేలు తల్లి మరణించింది. ఈ విషాదం నుంచి తేరుకోమందే తమ్ముడు కూడా చనిపోవడంతో ఆయన ఇంట రోదనలు మిన్నంటాయి. చదవండి: తాగమని బలవంతం, మందుకు బానిసయ్యా.. తాగుబోతునని నా కూతుర్ని కూడా.. -
Maamannan: ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన వడివేలు మామన్నన్ చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో అతని నటన చాలా అద్భుతంగా ఉంటుందనడంలో ఎంలాంటి సందేహం ఉండదు. తాజాగా పలువురు నటీనటులు ఆయనపై పలు ఆరోపణలు చేస్తుంటే నటి షకీలా మాత్రం ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి బహిరంగంగానే మాట్లాడింది. (ఇదీ చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) 90వ దశకంలో హాట్ నటిగా వెలుగొందిన నటి షకీలా తమిళంలోనే కాకుండా పలు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. గ్లామర్ చిత్రాల్లోనే నటించే షకీలా.. ఇప్పుడు కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనదైన నటనను ప్రదర్శిస్తోంది. తమిళ్ విజయ్ టీవీలో 'కుక్ విత్ కోమలి' షో తర్వాత షకీలా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తోంది. అందులో భాగంగానే తమిళ నటి అయిన ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది వడివేలు గురించి ప్రేమ ప్రియ కామెంట్ నా సినిమా కెరీయర్ ప్రారంభంలో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. నాకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చేవి. ఇండస్ట్రీలో నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారు. సినిమాల్లో నటించే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కోసారి ఏదోరకంగా అవకాశం వచ్చింది కదా అని నేను షూటింగ్‌కు వెళ్తాను.. కానీ వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని అక్కడి మూవీ మేకర్స్‌తో చెప్పించి వెనక్కి పంపేవారు. ఇలా చాలా సినిమాల్లో ఇదే జరిగింది.' అని ప్రేమ ప్రియ తెలిపింది. బెదిరించారు ఒక దర్శకుడు నన్ను ఫోన్లో బెదిరించాడు. నేను యూట్యూబ్ ఛానెల్లో వడివేలు గురించి చెప్పిన మాటల్లో నిజం లేదని తిరిగి తెలపాలని ఒకరు వార్నింగ్ ఇచ్చారు. అందుకు నేను బయపడలేదు. వడివేలు గురించి ఏదైతే నిజమో అదే చెప్పాను. 2010లో వచ్చిన విజయ్ 'సురా' సినిమాలో వడివేలుతో కలిసి నటించినప్పుడు కూడా ఆయన నో చెప్పారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కారణం ఏంటో చెప్పరు.' అని ప్రేమ ప్రియ తెలిపింది. వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు వడివేలుపై మీ-టూ ఫిర్యాదు చేసి ఉండవచ్చు కదా అని షకీలా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా వడివేల్కి, తనకు మీ టూ సమస్య లేదని, అది వేరే సమస్య అని ప్రేమ ప్రియ చెప్పింది. అయితే వడివేలు తనకు బాగా తెలుసని షకీలా పేర్కొంది. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని నటి షకీలా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి
‘లాస్య విలసిత.. నవ నాట్యదేవత.. నటనాంకిత అభినయ వ్రత చారుధీర చరిత స్వాగతాంజలి.. స్వాగతాంజలి’ అంటూ సాగే పాట ‘చంద్రముఖి 2’ చిత్రంలోనిది. రాఘవా లారెన్స్, లక్ష్మీ మీనన్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రధారి కంగనా రనౌత్‌పై చిత్రీకరించిన ‘ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి’ పాట తెలుగు, తమిళ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. యం.యం. కీరవాణి స్వరకల్పనలో చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడారు. ఇక రజనీకాంత్ హీరోగా జ్యోతిక, ప్రభు, నయనతార లీడ్ రోల్స్‌లో పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. -
వడివేలు పేరు చెప్పగానే షాక్ అయ్యాను: ఉదయనిధి స్టాలిన్
కోలీవుడ్ ప్రముఖ హీరో, నిర్మాత, తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మామన్నన్'. నటి కీర్తి సురేష్ నాయకిగా నటించిన ఇందులో వడివేలు, ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. (ఇదీ చదవండి: జవాన్ ట్రైలర్: నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు) ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'ఆరుకల్ ఆరు కన్నాడీ' పెద్ద విజయం సాధించిందన్నారు. కాగా ఇప్పుడు తన చివరి చిత్రం 'మామన్నన్' మంచి ఓపినింగ్స్ సాధిస్తూ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని 510 థియేటర్లలో విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రెండవ వారంలో కూడా 470 థియేటర్లలో రన్ అవుతోందని చెప్పారు. ఇంత మంచి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు చాలా అనుభవాలను చవి చూశామన్నారు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) చిత్ర ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సన్నివేశాలను నాలుగు రోజులు పాటు చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్ మొదలైన 8 రోజులు వరకు దర్శకుడు మారి సెల్వరాజ ఏం తీస్తున్నారో అర్థం కాలేదన్నారు. తర్వాత క్రమంగా అవగాహన వచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు తండ్రిగా వడివేలు పేరు చెప్పగానే షాక్‌కు గురయ్యానన్నారు. అయితే ఇందులో వడివేలు నటించకపోతే ఈ చిత్రమే వద్దు వేరే చిత్రం చేద్దామని మారి సెల్వరాజ అన్నారన్నారు. ఆయనకు ఈ నమ్మకంతో ఈ చిత్రాన్ని అప్పగించానో దాన్ని పూర్తి చేశారని అన్నారు. మామన్నన్ చిత్రం 9 రోజుల్లోనే రూ.52 కోట్లు వసూలు చేసిందని, తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రం ఇదని ఆయన పేర్కొన్నారు. తెలుగులో మామన్నన్ జులై 14న 'నాయకుడు' పేరుతో విడుదల కానుంది. -
నాయకుడుతో...
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ‘పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా ఏషియన్ మల్టీప్లెక్స్– సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ‘‘పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
తెలుగులోకి వచ్చేస్తున్న తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమా
కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా కీర్తి సురేష్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మామన్నన్' జూన్ 29న విడుదలై అక్కడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఉదయనిధి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ చిత్రంపై పలు విమర్శలు వచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతని కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇతర భాషల్లో హిట్ టాక్ వచ్చి.. భారీగా ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను టాలీవుడ్లో కూడా విడుదల చేస్తుంటారు. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. జులై 14వ తేదీన ఈసినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఆరురోజులకు గాను రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తెలుగులో విడుదల అయిన తర్వాత ఏమేరకు కలెక్ష్న్స్ రాబడుతుందో చూడాలి. 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?
ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది? 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) టాక్ ఏంటి? మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్‌తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ ఎంత? గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
స్టార్ హీరో చివరి సినిమాలో పాట పాడనున్న కమెడియన్
నటుడు ఉదయనిధి స్టాలిన్, నటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటుడు ఫాహత్ ఫాజిల్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇప్పటివరకు హాస్య పాత్రల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వడివేలు మామన్నన్ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌కు తండ్రిగా సీరియస్ పాత్రలో నటించడం విశేషం. ఇటీవల ఉదయనిధి స్టాలిన్, వడివేలు కలిసున్న ఫొటోతో కూడిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ బాణీలు కట్టిన ఒక పాటను నటుడు వడివేలుతో పాడించినట్లు సమాచారం. ఈ పాట రికార్డింగ్ సమయంలో వడివేలు, చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ తదితరులు ఏఆర్ రెహమాన్‌తో కూర్చుని ఉన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం తమిళనాడులో మంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం కావడంతో మామన్నన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి: నా జీవితంలో సామ్‌తో ఉన్న దశపై ఎంతో గౌరవం : చై -
పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!
నటి కీర్తీసురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. సినీ కుటుంబం నుంచి వచ్చిన నటి ఈ బ్యూటీ. తల్లి మేనక నటి. తండ్రి సురేశ్ నిర్మాత. వీరి వారసత్వంతో ముందుగా మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసిన కీర్తీ ఆ తరువాత ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అయితే ఇక్కడ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికేయన్‌తో నటించిన రజనీ మురుగన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కీర్తీసురేశ్‌కు నటిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తెలుగులో మహానటి చిత్రంతో సావిత్రిగా జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డునే గెలుచుకుంది. కీర్తీ సురేశ్ ఏ తరహా పాత్రనైనా అవలీలగా నటించి శభాష్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. జయంరవితో నటిస్తున్న సైరన్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా చాలా మంది హీరోయిన్లు ఉన్నా, నటి కీర్తీసురేశ్ పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోబోతోందని, తల్లిదండ్రులు సంబంధం చూశారు అనీ రకరకాల ప్రచారం వైరల్ అవుతోంది. ఇది ఒక రకంగా ఆమెకు ఫ్రీ పబ్లిసిటీనే అవుతోందని చెప్పవచ్చు. కాగా ఈ భామ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈమెకు ఫాలోవర్స్ అధికమే. ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ అభిమాని అడగ్గా నటుడు వడివేలు రెండు చేతులను జేబులో పెట్టుకుని ఏముందీ? ఏమీలేదు అనే విధంగా ఒక కార్టూన్ పోస్ట్ చేసి ఇప్పట్లో పెళ్లి ప్రస్తావనే లేదు అని తేల్చి చెప్పింది. -
ప్రముఖ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట విషాదం
ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగానూర్లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో మూవీ షూటింగ్లో పాల్గొన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసి షూటింగ్ మధ్యలోనే హుటాహుటిన తన స్వగ్రామం విరగానూర్కు పయనమయ్యారు. ఇక నేడు(గురువారం) సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగునున్నట్లు సమాచారం. తల్లి మృతితో వడివేలు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. అలాగే సినీ ప్రముఖులు, నటీనటులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తమిళ నటుడు అయిన వడివేలుకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. స్టార్ కమెడియన్ ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనపై కోలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఆయన గతేడాది నాయి శేఖర్ రిటర్న్స్‌తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై గోపిచంద్ మలినేని వివరణ -
హాస్య నటుడు వడివేలు పుట్టినరోజు వేడుక ( ఫొటోలు)
-
కమెడియన్ వడివేలుకు ఒమిక్రాన్? హాస్పిటల్లో చేరిక
ప్రముఖ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఓ సినిమా కోసం లండన్ వెళ్లిన వడివేలు ఇండియాకు వచ్చిన అనంతరం స్వల్ప కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వెంటనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. కాగా ఈ మధ్యకాలంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే హీరో విక్రమ్, కరీనా కపూర్, కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు
Court Issues Summons To Comedian Vadivelu: విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని సినీ నటుడు వైగై పుయల్ వడివేలుకు గురువారం ఎగ్మూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వడివేలు ఇంట్లో గతంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాంబరం సమీపంలో రూ .1.93 కోట్లకు 3.5 ఎకరాల స్థలాన్ని విక్రయించి, దానిని ఐటీ లెక్కల్లో చూపించనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వడివేలు కంగుతిన్నాడు. ఈ స్థలం విషయంలో సహచర నటుడు సింగముత్తు తనను మోసం చేసినట్టు ఆరోపిస్తూ.. ఆయన సెంట్రల్ క్రైం బ్రాంచ్‌ను ఆశ్రయించారు.చదవండి: చార్లీ చాప్లిన్‌లా 'ఇస్మార్ట్ బ్యూటీ' 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని తన ప్రమేయం లేకుండా సింగముత్తుతో పాటుగా మరికొందరు విక్రయించినట్లు ఆరోపించారు. ఈ కేసు గత కొన్నేళ్లుగా ఎగ్మూర్ కోర్టులో ఉంది. కాగా విచారణకు రావాలని వడివేలుకు గతంలోనే సమన్లు జారీ అయ్యా యి. అయితే, ఆయన హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం పిటిషన్ విచారణకు రాగా, సింగముత్తు తరపు న్యాయవాదులు హాజరై పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు వడివేలు ప్రయత్నిస్తున్నట్లు తమ వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి విక్రయించి, ఇప్పుడేమో సింగముత్తు మోసం చేసినట్టు ఆరోపిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం విచారణకు తప్పక హాజరు కావాలని వడివేలుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎగ్మూర్‌కోర్టు న్యాయమూర్తి నాగరాజన్ డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.చదవండి: ‘రిపబ్లిక్’ మూవీ చూసి రివ్యూ ఇచ్చిన టాలీవుడ్ పాప్ సింగర్ -
కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్..?
అగ్రహీరోల సరసన సినిమాలు చేస్తూ, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ కీర్తీ సురేష్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆమె కమెడియన్ వడివేలు సరసన ‘నాయ్ శేఖర్ రిటర్న్స్’ అనే సినిమాలో నటించనున్నారని కోలీవుడ్ టాక్. సురాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘నాయ్’ అంటే కుక్క అని అర్థం. శునకాల నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టైటిల్ పెట్టారట. శేఖర్ పాత్రను వడివేలు చేయనుండగా ఆయన సరసన కీర్తి నటించనున్నారని భోగట్టా. అయితే ఇందులో వడివేలుకి జోడీ లేదని, సినిమాకి కీలకంగా నిలిచే కథానాయిక పాత్ర ఉందనీ, ఆ పాత్రనే కీర్తీ సురేష్ చేయనున్నారని మరో వార్త వినిపిస్తోంది. మరి.. వడివేలుకి జోడీగా కీర్తి కనిపిస్తారా? లేక కథకి కీలకంగా నిలిచే పాత్రలో కనబడతారా? అసలు ఈ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే. చదవండి: ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్ -
వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ
Happy Birthday Day Vadivelu: ఆయనో కమెడియన్. అలాగని ఆషామాషీ నవ్వులు పంచడండోయ్. మూస ధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పాడాయన. ‘అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా?’ అనే రీతిలో ఉంటుంది ఆయన స్టయిల్. అందుకే స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్డమ్ను సంపాదించుకున్నారాయన. ఒకానోక టైంలో ఏడాదికి పాతికదాకా సినిమాల్లో నటించిన వడివేలు.. అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాకులతోనే కడుపుబ్బా నవ్వించే వారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే.. అందుకే కోలీవుడ్ ఆడియొన్స్ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్(వాగై ప్రవాహం) అని పిలుస్తుంటారు. వడివేలు 61వ పుట్టినరోజు ఇవాళ.. వాగై నది మధురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్ 12, 1960న పుట్టారు వడివేలు(కుమారవడివేలు నటరాజన్). అసలు చదువే అబ్బని వడివేలు.. చిన్నప్పటి నుంచి తండ్రి గ్లాస్ కట్టింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఖాళీ సమయాల్లో వీధి నాటకాలు.. అందులోనూ నవ్వులు పంచే పాత్రలతో అలరించడం చేసేవాడు. అలా దర్శకుడు టీ రాజేందర్ కంటపడడంతో .. ‘ఎన్ తంగి కళ్యాణి’లో ఓ చిన్న వేషం వేషాడు. రాజ్‌కిరణ్‌తో పరిచయం వడివేలు సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. అవకాశాల కోసం ఆయన కనీసం ఏమాత్రం ప్రయాణం చేయలేదు. కానీ, నటుడు రాజ్‌కిరణ్.. వడివేలు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి కారణం అయ్యాడు. వడివేలు తన పెళ్లి కోసం రైళ్లో వెళ్తున్న టైంలో.. నటుడు రాజ్‌కిరణ్‌తో పరిచయం అయ్యింది. ఆ సంభాషణ మధ్యలోనే వడివేలులోని నటుడిని గుర్తించి యాక్టింగ్ ఆఫర్ ఇచ్చాడు రాజ్ కిరణ్. అలా రాజ్ కిరణ్ హీరోగా నటించిన ‘ఎన్ రసవన్ మనసిలే’(1991)తో నటుడిగా మారిపోయాడు వడివేలు. ఆ తర్వాత నటుడు విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’లో వడివేలుకు అవకాశం ఇచ్చి.. తన తర్వాతి సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు ఇచ్చి వడివేలును ప్రొత్సహించాడు. త్రయం నవ్వులు గౌండమణి-సెంథిల్-చార్లీలాంటి టాప్ కమెడియన్ల హవా కోలీవుడ్‌లో కొనసాగుతున్న టైంలో.. వడివేలు ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన సింగరవేలన్(మన్మథుడే నా మొగుడు)లో విచిత్రమైన గెటప్, బట్లర్ ఇంగ్లీష్ క్యారెక్టరైజేషన్ వడివేలుకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై వరుసగా కామెడీ రోల్స్‌తో కోలీవుడ్‌లో కింగ్ ఆఫ్ కామెడీ ముద్రను దక్కించుకున్నాడు. గౌండమణి-సెంథిల్ కాంబోతో పాటు వడివేలు పంచిన కామెడీ కోలీవుడ్ ఆడియొన్స్‌కు నోస్టాల్జియా అనుభూతుల్ని మిగిల్చింది. తెలుగు వాళ్లకు.. తొంబై, 2000 దశకాల్లో కోలీవుడ్‌లో వడివేలు హవా నడిచింది. రజినీకాంత్, విజయ్‌కాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, అజిత్, ఇలా.. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆయన ప్రస్థానం నడిచింది. అలాగే ఇతర కామెడీ యాక్టర్లతోనూ ఆయన స్నేహం కొనసాగించేవాళ్లు. క్షత్రియ పుత్రుడు(తేవర్మగన్) లాంటి సీరియస్ సినిమాలతో పాటు ‘నవ్వండి లవ్వండి, ప్రేమికుడు, మిస్టర్ రోమియో, ప్రేమ దేశం, రక్షకుడు, ఒకే ఒక్కడు, చంద్రముఖి, సింగమలై, ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియొన్స్‌ను సైతం కితకితలు పెట్టించాడాయన. తెలుగులో స్ట్రయిట్ సినిమా ‘ఆరో ప్రాణం’తో పలకరించాడు. వివాదాలు.. రాజకీయాల ఎంట్రీతో వడివేలు కెరీర్ మసకబారడం మొదలైంది. తన కుటుంబంపై జరిగిన దాడికి బాధ్యుడ్ని చేస్తూ.. కెరీర్ తొలినాళ్లలో తనకు అవకాశాలిచ్చిన విజయ్‌కాంత్ మీదే అటెంప్ట్ టు మర్డర్ కేసుపెట్టి వివాదాలకు తెరలేపాడు వడివేలు. ఆపై విజయ్‌కాంత్‌పై ఎన్నికల్లోనూ పోటీ ప్రకటన చేశాడు. విజయ్‌కాంత్‌తో వైరం కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గించడమే కాదు.. రాజకీయంగానూ ఎలాంటి ఎదుగుదలను లేకుండా చేసింది. ఇక ఇమ్సయి అరసన్ 23ఎం పులకేసి(హింసించే 23వ రాజు పులకేశి) సినిమాతో హీరోగానూ వడివేలు సక్సెస్ అందుకున్నాడు. 2018లో ఈ సినిమా సీక్వెల్ విషయంలో దర్శకుడు శంకర్(మొదటి పార్ట్‌కు నిర్మాత), దర్శకుడు చింబు దేవన్‌తో చెలరేగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. వడివేలు వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని శంకర్, ఆపై మరికొందరు సినీ నిర్మాతల ఫిర్యాదులపై నడిగర్ సంఘం వడివేలుపై కన్నెర్ర జేసి నిషేధం విధించింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి ఈ ఏడాదిలో(2021) ఆయన కొత్త సినిమాలను అంగీకరించినట్లు, ఇది తన సినీ పునర్జన్మగా అభివర్ణించుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్‌లోనే ఆయన ఐదు సినిమాలు సైన్ చేయడం. ప్రే ఫర్ నేసమణి ఆరులో ‘రక్తం’, పొగరులో ‘కూల్‌డ్రింక్-ఒంటేలు’, సింగమలైలో ‘కానిస్టేబుల్’ కామెడీ పోర్షన్లు తెలుగు ఆడియొన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సినిమాలతోనే కాదు.. మన బ్రహ్మీలాగా మీమ్స్‌తోనూ వడివేలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక 2001లో వచ్చిన ఫ్రెండ్స్(తెలుగులో స్నేహమంటే ఇదేరాగా రీమేక్) మూవీ. త్్్ విజయ్, సూర్య హీరోలు. ఇందులో వడివేలు నేసమణి అనే క్యారెక్టర్ పోషించాడు. ఓ సీన్లో ఆయన నెత్తి మీద సుత్తి పడుతుంది. రెండేళ్ల క్రితం ఈ సీన్ పాక్‌లోని ఓ ట్విటర్ అకౌంట్ ద్వారా ట్రెండ్ కాగా.. నేసమణి పరిస్థితి ఎలా ఉందంటూ ఎంతో మంది ఆరాతీశారు. ఆయన కోలుకోవాలంటూ ‘ప్రే ఫర్ నేసమణి’ ట్రెండ్‌ను కొనసాగించారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఆ సీన్ వైరల్ అయ్యి.. వడివేలుకు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానంటోన్న ప్రముఖ కమెడియన్
ప్రముఖ హాస్యనటుడు వడివేలు సీఎం కరోనా నివారణ నిధికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి చెక్కు అందించారు. అనంతరం వడివేలు మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రపంచాన్నే విస్మయ పరచారని పేర్కొన్నారు. పరిపాలనలో ఆయన తండ్రి పేరును నిలబెట్టుకున్నారని అన్నారు. కొంగునాడు విభజనపై జరుగుతున్న ప్రచారం గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ఇప్పుడు కొంగునాడు అంటూ విభజననే ఊహించలేం అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేయరాదని వడివేలు అన్నారు. తాను మళ్లీ చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వడివేలు ఈ సందర్భంగా తెలిపారు. -
కమెడియన్ మొండితనం, దర్శకుడికి రూ.2 కోట్ల నష్టం!
'హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి' చిత్రానికి సంబంధించిన వివాదం పరిష్కారమైనట్టేనా? అన్న ప్రశ్నకు తాజాగా కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. దర్శకుడు శంకర్ హింసై అరసన్ 23 ఆమ్ పులికేసి చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును కథా నాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం విజయవంతం కావడంతో అదే టీమ్‌తో హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి సీక్వెల్‌ను నిర్మించాలని దర్శకుడు శంకర్ భావించారు. షూటింగ్ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో దర్శకుడు శంకర్‌కు వడివేలుకు మధ్య తలెత్తిన విభేదాలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు వరకు వెళ్లాయి. వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని శంకర్ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వడివేలు నటనకు దూరమయ్యారు. పలుమార్లు దర్శకుడు శంకర్, వడివేలు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. దర్శకుడు శంకర్‌కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించినట్లు, త్వరలోనే హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘మహా సముద్రం’ మూవీలో సిద్దార్థ్‌కు అంత రెమ్యునరేషనా?! రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం