
కమెడియన్ వడివేలు ఇంట విషాదం..
ఆయన కొద్ది రోజులుగా తమిళనాడు మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోనే ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు.
తమిళనాడు: ప్రముఖ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమ్ముడు జగదీశ్వరన్(55) ఆదివారం(ఆగస్టు 27) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయన కొద్ది రోజులుగా తమిళనాడు మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోనే ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు.
కాగా జగదీశ్వరీన్.. శింబు 'కాదల్ అలైవిట్టలై' సినిమాతో సహా పలు చిత్రాల్లో నటుడిగా తళుక్కుమని మెరిశారు. కానీ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో చెన్నై నుంచి మధురై వెళ్లిపోయాడు. అక్కడ ఒక వస్త్రాల షాపు పెట్టుకుని జీవనం కొనసాగించాడు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితమే వడివేలు తల్లి మరణించింది. ఈ విషాదం నుంచి తేరుకోమందే తమ్ముడు కూడా చనిపోవడంతో ఆయన ఇంట రోదనలు మిన్నంటాయి.
చదవండి: తాగమని బలవంతం, మందుకు బానిసయ్యా.. తాగుబోతునని నా కూతుర్ని కూడా..