
రిలీజైన ప్రతి సినిమా హిట్టవదు. కంటెంట్‌లో దమ్మున్నవి మాత్రమే హిట్టు, సూపర్ హిట్టుగా నిలుస్తాయి. కథలో ఏమాత్రం పస లేకపోయినా సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. అలా తమిళ సినిమాలోనూ వందల సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించారు. 2024లో తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలెన్ని? (Kollywood Box Office Report - 2024) లాభనష్టాలేంటి? అనేవి ఓసారి చూసేద్దాం..
రూ.1000 కోట్ల నష్టం
కోలీవుడ్ (Tamil Cinema Industry)లో గతేడాది 241 సినిమాలు రిలీజయ్యాయి. వీటికోసం తమిళ ఫిలిం మేకర్స్ దాదాపుగా రూ.3000 కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసిన నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గ భంగపాటు ఎదురైంది. ఏకంగా 223 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి. దీంతో వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లింది. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోల సినిమాలు సైతం చతికిలపడ్డాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన కంగువా రూ.1000 కోట్లు రాబడుతుందనుకున్నారు.
అతి కష్టమ్మీద రూ.100 కోట్లు!
తీరా చూస్తే కేవలం రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాగే టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండియన్ 2 సినిమా (Indian 2 Movie)ను రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. చివరకు ఇది కూడా కంగువా బాటలోనే పయనించింది. రూ.150 కోట్లకంటే ఎక్కువ రాబట్టలేకపోయింది. రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రాన్ని సైతం ప్రేక్షకులు ఇలాగే తిరస్కరించారు.
చదవండి: పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన
93% సినిమాలు ఫ్లాప్
2024లో కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. ఈ లెక్కన గతేడాది 93% చిత్రాలు ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోగా ఏడు శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జాబితాలో అమరన్ (Amaran Film), ద గోట్, రాయన్ వంటివాటితో పాటు లబ్బర్ పందు, గరుడన్, డిమాంటి కాలనీ 2, వాళై చిత్రాలూ ఉన్నాయి. 2025కి తమిళ ఇండస్ట్రీ శుభారంభం పిలికింది. మదగజరాజ, కుడుంబస్తాన్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. కానీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది.
ఆశలన్నీ ఈ ఏడాదిపైనే!
2023లో జైలర్, పొన్నియన్ సెల్వన్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కాసులవర్షం కురిపించాయి. కానీ 2024లో మాత్రం ఇండియన్ 2, కంగువా, వేట్టైయాన్ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడ్డాయి. ద గోట్, అమరన్, మహారాజా, రాయన్, అరణ్మణై 4 వంటి కొన్ని చిత్రాలు మాత్రమే హిట్టందుకున్నాయి. 2024 అత్యంత చెత్త సంవత్సరంగా నిలిచింది. 2025లో ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం.
- నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జి. ధనాంజనేయన్
Comments
Please login to add a commentAdd a comment