పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన | Why Actress Shobana Not Get Married | Sakshi
Sakshi News home page

నటి శోభన పెళ్లెందుకు చేసుకోలేదంటే..?

Jan 31 2025 7:22 AM | Updated on Jan 31 2025 7:54 AM

Why Actress Shobana Not Get Married

అలనాటి అగ్రతార శోభన బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాకుండా బహు భాషా నటి కూడా.. బాలనటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె తెలుగులో హీరోయిన్‌గా నాగార్జున నటించిన ‘విక్రమ్‌’ సినిమాతో పరిచయం అయింది. ఆమె నటి మాత్రమే కాదు..  అద్భుతమైన క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా.. లెక్కలేనన్ని ప్రదర్శనలు కూడా ఆమె ఇచ్చారు.  తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించిన శోభన కళారంగంలో చేసిన సేవలకు గానూ తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌(Padma Bhushan) పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం శోభన వయసు 54 ఏళ్లు. అయినా, ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది.

తెలుగులో టాప్‌ హీరోలతో సినిమాలు
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన.. 1985లో  నాగార్జున తొలి చిత్రం 'విక్రమ్'లో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిరంజీవితో రౌడీ అల్లుడు,రుద్రవీణ బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి ఆపై  మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారి పెళ్ళాం చిత్రాల్లో నటించింది. అభినందన,కోకిల, ఏప్రిల్‌ 1 విడుదల,దళపతి,రక్షణ,త్రిమూర్తులు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. 

ఇటీవలే ప్రభాస్‌ 'కల్కి' చిత్రంలో నటించిన శోభన చాలామందిని ఆకట్టుకున్నారు.  తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం ‘మణిచిత్రతాఝు’లో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో నిలిచారు.

'కళార్పణ' పేరుతో శిక్షణ.. పెళ్లికి ఎందుకు నో చెప్పారంటే
శోభన చాలా ఏళ్ల క్రితం నుంచే నటన కంటే నాట్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 1994లో  'కళార్పణ' అనే సంస్థకు ఆమె అంకురార్పణ చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం. అదే విధంగా పలువురు పేద విద్యార్థులకు ఉచితంగా నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. ఈమె సేవలకు గాను 2006లో అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 

కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నటన, నాట్యం కళారంగంలో విశేష సేవలందిస్తున్న శోభన వయసు 54 ఏళ్లు. కాగా ఈ గొప్ప నట కళాకారిణి అవివాహిత కావడం గమనార్హం. పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు శోభన బదులిస్తూ తనకు పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేదని, వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పారు. ఈ జీవితమే సంతోషంగా ఉందని నటి శోభన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement