Padma Bhushan
-
పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన
అలనాటి అగ్రతార శోభన బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాకుండా బహు భాషా నటి కూడా.. బాలనటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె తెలుగులో హీరోయిన్గా నాగార్జున నటించిన ‘విక్రమ్’ సినిమాతో పరిచయం అయింది. ఆమె నటి మాత్రమే కాదు.. అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. లెక్కలేనన్ని ప్రదర్శనలు కూడా ఆమె ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించిన శోభన కళారంగంలో చేసిన సేవలకు గానూ తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం శోభన వయసు 54 ఏళ్లు. అయినా, ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది.తెలుగులో టాప్ హీరోలతో సినిమాలునాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన.. 1985లో నాగార్జున తొలి చిత్రం 'విక్రమ్'లో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిరంజీవితో రౌడీ అల్లుడు,రుద్రవీణ బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి ఆపై మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారి పెళ్ళాం చిత్రాల్లో నటించింది. అభినందన,కోకిల, ఏప్రిల్ 1 విడుదల,దళపతి,రక్షణ,త్రిమూర్తులు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇటీవలే ప్రభాస్ 'కల్కి' చిత్రంలో నటించిన శోభన చాలామందిని ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం ‘మణిచిత్రతాఝు’లో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో నిలిచారు.'కళార్పణ' పేరుతో శిక్షణ.. పెళ్లికి ఎందుకు నో చెప్పారంటేశోభన చాలా ఏళ్ల క్రితం నుంచే నటన కంటే నాట్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 1994లో 'కళార్పణ' అనే సంస్థకు ఆమె అంకురార్పణ చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం. అదే విధంగా పలువురు పేద విద్యార్థులకు ఉచితంగా నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. ఈమె సేవలకు గాను 2006లో అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నటన, నాట్యం కళారంగంలో విశేష సేవలందిస్తున్న శోభన వయసు 54 ఏళ్లు. కాగా ఈ గొప్ప నట కళాకారిణి అవివాహిత కావడం గమనార్హం. పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు శోభన బదులిస్తూ తనకు పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేదని, వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పారు. ఈ జీవితమే సంతోషంగా ఉందని నటి శోభన పేర్కొన్నారు. -
బాబాయికి అభినందనలు తెలిపిన యంగ్ టైగర్
నందమూరి బాలకృష్ణకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్‌కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. మీరు అటు సినిమా.. ఇటు ప్రజలకు అందించిన సేవలకు దక్కిన గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్, నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. నటసింహంగా గుర్తింపు..నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.బాలకృష్ణ హీరోగా తొలి చిత్రం..1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానం..‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.— Jr NTR (@tarak9999) January 25, 2025 -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్‌కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్‌కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్‌ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్‌లో మెకానిక్ అప్రెంటిస్‌గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్‌లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్‌ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్‌కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్‌కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్‌గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్‌కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్‌లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్‌లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్‌గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్‌గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్‌కి శేఖర్ కపూర్‌ని ఓ బ్రాండ్‌గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్‌దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్‌కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్‌గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్
హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీరంగంలో అందించిన సేవలకుగానూ ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించనుంది. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా (జనవరి 25న) కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది.సినీ ప్రస్థానంనటుడిగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి చైర్మన్‌గా బాలకృష్ణ సేవలందిస్తున్నారు. ఈయన తాతమ్మ కల(1974) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించారు.సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. క్యాన్సర్ బారినపడ్డ ఎంతో మందికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్సను అందిస్తున్నారు.చదవండి: సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే? -
ఒకపుడు నక్సలైట్.. హీరోగా 180 ఫ్లాప్స్.. అయినా తగ్గని స్టార్డమ్!
సూపర్ స్టార్లు బాలీవుడ్‌ను ఏడుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు మిథున్ చక్రవర్తి. 1970-80ల కాలంలో చలనచిత్ర పరిశ్రమ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జీతేంద్ర, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ల హవా నడుస్తోంది. అలాంటి టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్‌గా నిలిచాడు. ఇప్పటికీ మిథున్ స్టార్డమ్ ఏ మాత్రం తగ్గ లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా స్పెషల్ స్టోరీ. బాలీవుడ్ ఎంట్రీ తరువాత చాలామంది స్టార్స్ తమ కెరీర్లో ప్లాప్ సినిమాలను చాలానే ఇచ్చారు. కానీ మిథున్ రూటే సెపరేట్. 47 ఏళ్ల కెరీర్లో ఏకంగా 180 ఫ్లాప్ చిత్రాలను ఖతాలో వేసుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి. తాను నటించిన 370 సినిమాల్లో దాదాపు 200 సినిమాలు అతను చూడను కూడా చూడలేదని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు మిథున్. 47 మూవీలు డిజాస్టర్లు మిగుల్చుకున్న హీరో కూడా ఆయనే. 1990వ దశకంలో, మిథున్ వరుసగా అత్యధిక ఫ్లాప్ చిత్రాల రికార్డును నెలకొల్పాడు . 1993-98లో బ్యాక్-టు-బ్యాక్ 33 చిత్రాలు అట్టర్ ఫ్లాప్. అయితేనేం మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్‌గా భావిస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా? మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్డమ్ వెనుక కారణం ఏమిటంటే 50 హిట్ చిత్రాలే. ముఖ్యంగా 1976లో మృగయ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఆ తరువాత డిస్కో డ్యాన్సర్ సినిమాతో ‘ఐ యామ్ డిస్కో డ్యాన్సర్’ పాటతో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మ్యూజిక్ అప్పట్టో దేశమంతా మారుమోగి పోయింది. అంతేకాదు భారతదేశంలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. మిథున్ ఎక్కడ పుట్టాడు? 1950 జూన్ 16న కోలకత్తాలో జన్మించిన మిథున్ B.Sc, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాడు. వేలాదిమంది ఇతర బెంగాలీ యువకుల మాదిరిగానే నక్సలిజం పట్ల ఆకర్షితుడై 1960ల చివరలో పోరాటం బాట పట్టాడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. అయితే మిథున్ సోదరుడు ఘోర ప్రమాదంలో మరణించడంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అలా సినిమాల్లోకి హీరోగా మిథున్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనుదిరిగి చూడలేదు.హిట్స్, ఫ్లాప్స్‌తో లెక్కలేకుండా వరుస సినిమాలతో డైరెక్టర్లు, నిర్మాతల ఫ్యావరేట్‌గా అవతరించాడు. ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగాననీ, ఒక దశలో హీరో కావాలనే తన కల నెరవేరదేమో అనుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు పలు సందర్భాల్లో మిథున్ చక్రవర్తి చెప్పాడు. యోగితా బాలిని మిథున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మిథున్. వీరికి ముగ్గురు కుమారులు మిమో, నమషి, ఉస్మాయ్. కుమార్తె దిషానిని దత్తత తీసుకున్నారు. కుమారుడు నమాషి బ్యాడ్‌బాయ్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. నటనతో పాటు, వ్యాపారం, టీవీ హోస్ట్‌గా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తున్నారు. మిథున్ చక్రవర్తి నెట్‌వర్త్ దాదాపు రూ.400 కోట్లు అని అంచనా. అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులతోపాటు, మెర్సిడెస్ బెంజ్ 1975, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్‌తో సహా అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. రాజకీయ జీవితం తొలుత టీఎంసీ ఎంపీగా ఎన్నికైన మిథున్, ఆ తరువాత ఎంపీగా రాజీనామా చేసి మరీ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరాడు. -
2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే!
కేంద్రం ప్రకటించిన 132 పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఇందులో వాణిజ్య, పారిశ్రామిక విభాగం నుంచి ఇద్దరికి పద్మ భూషణ్, మరో ఇద్దరికీ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మ భూషణ్ సీతారాం జిందాల్ - కర్ణాటకకు చెందిన జిందాల్ అల్యూమినియం లిమిటెడ్, సీతారాం జిందాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీతారాం జిందాల్ (SITARAM JINDAL)కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ లభించింది. యంగ్ లియు - ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్‌కాన్ సీఈఓ యంగ్ లియుకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ దక్కింది. భారతదేశంలో పారిశ్రామిక రంగంలో లియు చేసిన కృషికి కేంద్రం ఈ అవార్డుని అందించింది. భారతదేశంలో విస్తృతంగా సేవలందిస్తూ.. ఇప్పటికి సుమారు 40000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇదీ చదవండి: తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు! పద్మశ్రీ కల్పన మోర్పారియా - మహారాష్ట్రకు చెందిన జేపీ మోర్గాన్ ఇండియా సీఈఓ 'కల్పన మోర్పారియా'కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ లభించింది. శశి సోనీ - కర్ణాటకకు చెందిన శశి సోనీకి కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ కైవసం చేసుకుంది. -
భారత్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది: సుందర్ పిచాయ్
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. భారత అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. శుక్రవారం కాలిఫోర్నియా నగరం శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ గౌరవం పిచాయ్‌కు అందించారు. మధురైలో పుట్టిన సుందర్ పిచాయ్‌కు.. భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగానూ పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల నడుమ పిచాయ్ ఈ పురస్కారం అందుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం నాలో ఒక భాగం. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా దానిని నా వెంట తీసుకువెళతాను అని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. భారత మూడో అత్యున్నత పురస్కార గౌరవం అందుకున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు గాఢంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారాయన. ఈ సందర్భంగా తన మూలాల్ని, తన తల్లిదండ్రుల త్యాగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారాయన. Delighted to hand over Padma Bhushan to CEO @Google & Alphabet @sundarpichai in San Francisco. Sundar’s inspirational journey from #Madurai to Mountain View, strengthening 🇮🇳🇺🇸economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation pic.twitter.com/cDRL1aXiW6 — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) December 2, 2022 -
అద్భుత ఆవిష్కరణకు ఘన గౌరవం
కరోనా మహమ్మారి కల్లోల కాలంలో ప్రపంచమంతా టీకాల కోసం ఎదురుచూపులు చూసింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో దేశాలకు టీకాల సరఫరాదారుగా భారత్ నిలిచింది. అయితే, పాతికేళ్ల క్రితమే దేశ టీకాల చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించింది శాంతా బయోటెక్ సంస్థ. సంకల్ప బలంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెపటైటిస్–బి టీకాను ఆవిష్కరించింది. అది కూడా చవకగా అందజేసింది. దాన్ని సుసాధ్యం చేసింది... ఆ సంస్థ వ్యవస్థాపకులు, దీర్ఘదర్శి, రేపటితో 75వ వసంతంలోకి అడుగిడుతున్న ‘పద్మభూషణ్’ కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి. ఈ నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... దేశ ప్రగతిలో భాగస్వాములైన ప్రముఖులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం’ ఆయనకు అందించింది. నేడు దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపు కొంటోంది. పాతికేళ్ళ క్రితం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకొంది. ఆ శుభవేళల్లో దేశ బయోటెక్ రంగంలో సువర్ణాక్షరాలుగా లిఖించిన తొలి అధ్యాయం పురుడు పోసుకుంది. తొట్ట తొలిగా పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ రూపకల్పన జరిగిన శుభ సంరంభం అది! సుమారు 30 ఏళ్ళ క్రితం దేశంలో హెప టైటిస్–బి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎయిడ్స్ కంటే ప్రమాదకారిగా ప్రపంచాన్ని వణికిస్తోంది. జెనీవాలో జరుగుతున్న ఒక సమావేశానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఒక ప్రసంగకర్త మన దేశ సామర్థ్యంపై, మన ప్రభుత్వాల ఉదాసీనతపై, మనవారి ప్రతిభపై లోకువగా మాట్లాడారు. మనల్ని బిచ్చగాళ్ళ కింద జమకట్టారు. ఆ నిందను నిర్మూల్యం చేస్తూ అనేక దేశాలకు వ్యాక్సిన్లు పంపే మహోన్నత స్థితికి చేరుకున్నాం. హెపటైటిస్–బి వ్యాక్సిన్ స్ఫూర్తితో శాంతా బయోటెక్నిక్స్ 13 రకాల ఇతర అద్భుతమైన వ్యాక్సి న్లను సృష్టించే స్థాయికి చేరుకుంది. లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరలో పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్‌ను అందించాలన్నది శాంతా బయోటెక్నిక్స్ పెట్టుకున్న నియమం. దానిని సాధించడం ఆషామాషీ కాదు. విదేశాల నుంచి సాంకేతికతను దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారం. వరప్రసాద్‌రెడ్డి నాన్నగారు కొంత పొలం అమ్మి యిచ్చిన డబ్బుకు తోడు, బంధు వులు, ఆత్మబంధువులు మరి కొంత ఇచ్చారు. అయినా అది సరిపోదు. అదిగో! అప్పుడే యూసఫ్ బిన్ అలావీ అబ్దుల్లా రూపంలో అమృత హస్తం చేయి చాచింది. అది మాజీ ప్రధాని పీవీ నర సింహారావు చలువ. వరప్రసాద్ రెడ్డి పడుతున్న కష్టాలను గమనించిన పీవీ ఈ అబ్దుల్లాను పంపారు. అబ్దుల్లా ఒమన్ విదేశీ వ్యవహారాల మంత్రి. హెపటైటిస్–బి వ్యాక్సిన్ అవసరం తెలిసిన వ్యక్తి. తాను పెట్టుబడి పెట్టి, వ్యక్తిగత స్థాయిలో గ్యారంటీగా ఉంటూ బ్యాంక్ రుణాలు తెచ్చి, ఆ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. నిర్మాణం చేపట్టే నాటికి సుశిక్షుతులైన శాస్త్ర వేత్తలు లేరు. నిపుణుత, సమర్థత, నిబద్ధత కలిగిన గొప్ప బృందాన్ని సమీకరించుకొని రంగంలోకి దిగింది. అనుమతులకు, అమ్మకాలకు, పంపకాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. వ్యాక్సిన్ సామర్థ్యంపై విదేశీ కంపెనీ దుష్ప్రచారం చేసింది. సత్ సంకల్పం కాబట్టి కాలమేఘాలు తొలిగి పోయాయి. శాంతా బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హెపటైటిస్ ఎంతో భయంకరమైన వ్యాధి. వేగంగా మనుషులను నిర్వీర్యులను చేస్తుంది. లివర్ సిరోసిస్ వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంత మందిని శవాలుగా మార్చింది, కొంతమందిని జీవ చ్ఛవాలు చేసింది. అందుకే అర్జెంటుగా వ్యాక్సిన్లు తయారు చేసి పుట్టిన ప్రతిబిడ్డకూ వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషించింది. అత్యవసరమే అయినప్పటికీ నాణ్యత, సమర్థతపై అన్ని పరీక్షలూ జరిగి తీరాల్సిందేనన్నది శాంతా సంస్థ పట్టుదల. అన్ని పరీక్షల్లో గెలిచి, నూటికి నూరు శాతం సంపూ ర్ణమైన అర్హత సంపాయించుకున్న తర్వాతే వ్యాక్సి న్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అలా వరప్రసాద్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈ ప్రయాణంలో, శాంతా సంస్థ అడుగడు గునా మానవత్వాన్ని చాటుకుంది. అది భారత్ నుంచి లాహోర్‌కు సుహృద్భావ యాత్రగా బస్సు వేసే చారిత్రక సందర్భం. ఆ బస్సు కంటే హెప టైటిస్ వ్యాక్సిన్లే మాకు ముఖ్యమని పాకిస్తాన్ వేడు కుంది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి కార్యా లయం శాంతా బయోటెక్నిక్స్‌ను సంప్రదించింది. మానవీయ కోణంతో మిలియన్ వ్యాక్సిన్లను శాంతా సంస్థ ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా పాకి స్తాన్‌కు ఉచితంగా అందించి మానవత్వాన్ని చాటు కుంది. భారతీయ ఖ్యాతిని, ఆత్మను నిలబెట్టింది. యునిసెఫ్ విషయంలోనూ ఎంతో ఉదారాన్ని చూపించింది. యితఃపూర్వం ఒక్కొక్క వ్యాక్సిన్ 18 డాలర్లకు కొనుగోలు చేసే యునిసెఫ్‌కు కేవలం 23 సెంట్లకే అందజేసింది. ‘శాంతా’ చూపిన ఈ విత రణశీలత వల్ల యునిసెఫ్ ప్రపంచంలోని ఎన్నో పేద దేశాలకు ఉచితంగా హెపటైటిస్ వ్యాక్సిన్లు అందించి పుణ్యం మూట గట్టుకుంది. శాంతా బయోటెక్నిక్స్ వేసిన తొలి అడుగు అతి పెద్దది, అతి గొప్పది. అతి తక్కువ ధరకే వ్యాకిన్ అందించిన ప్రభావంతో మార్కెట్లో వ్యాక్సిన్ ధరలు 40వ వంతుకు పడిపోయాయి. అనేక బహుళజాతి సంస్థలు శాంతా సంస్థవైపు చూడడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత బయోటెక్ రంగంలో ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటికి స్ఫూర్తిగా నిలిచి తొలి గవాక్షం తెరిచింది మాత్రం శాంతా బయోటెక్నిక్స్ అన్నది మరువ రానిది. - మాశర్మ, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ జీవితం దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని, ఆ జీవన సాఫల్యాన్ని తృప్తిగా ఆస్వాదిస్తూ, తోటివారికి తోడు పడుతూ జీవిత పరీక్షలో కృతార్థులమయ్యా మని చెప్పగల ఆత్మవిశ్వాస సంపన్నులు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరు తెలుగుతేజం డాక్టర్ కోడూరి ఈశ్వర వరప్రసాద్ రెడ్డి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు శాంతమ్మ, వెంకట రమణారెడ్డి గార్లనే కాదు – అక్షర భిక్ష పెట్టిన గురువులను కూడా విస్మరించని సంస్కార వంతుడు వరప్రసాద్ రెడ్డి. మాతృమూర్తి పేరు తోనే ‘శాంతా బయోటెక్’ను నెలకొల్పారు. చాగంటి వారి వ్యాఖ్యానంతో బాపు బొమ్మలతో ‘మాతృ వందనం’ అనే పుస్తక ప్రచురణతో పాటు, రెండు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ‘మాతృ వందనం’ కార్యక్రమం జరుపుతున్నారు. కొంత మంది లబ్ద ప్రతిష్ఠుల మాతృమూర్తులను సత్క రించడం, ఒక వేద పండితుణ్ని సన్మానించి ఆధ్యా త్మిక ప్రవచనం ఏర్పాటు చెయ్యడం, రెండు ఆసుపత్రులలో నిత్యాన్నదానాలను నిర్వహించడం మొదలైనవి ఆయన అపారమైన మాతృభక్తికి నిదర్శనాలు. ‘తల్లీ నిన్ను దలంచి’, ‘తండ్రీ నిన్ను దలంచి’, ‘తండ్రి పరమ పూజ్యుడు’, ‘అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకు జేజే’ వంటి పుస్తకాలను వెలువరించి జననీ జనకులకు ఎంతటి ఉన్నత స్థానమివ్వాలో ఆచరణాత్మకంగా సూచించారు. సమాజ వికాసానికి విద్య గీటురాయి అని వరప్రసాద్ విశ్వాసం. ఆ అభిప్రాయంతోనే అనేక విద్యా సంస్థలను పోషిస్తున్నారు. తను చదువు కొన్న నేలబడి మొదలుకొని కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల వరకు – అన్నిటికీ భవన నిర్మాణాలకు విరాళాలనిచ్చారు. తన ఉన్నతికి కారకులైన గురు వులనెందరినో సత్కరించారు. మద్రాసులోని కేసరి పాఠశాల, నటుడు మోహన్‌బాబు విద్యా నికేతన్, సరస్వతీ విద్యాలయ శాఖలు... ఇలా ఎన్నో విద్యా సంస్థలకు కోట్ల కొలది రూపాయ లను విరాళాలుగా ఇచ్చారు. 6 విద్యా సంస్థ లలో ఉత్తమ విద్యార్థు లకు ఏటేటా శాంతమ్మ గారి పేర స్వర్ణ పతకా లను బహూకరిస్తున్నారు. అబ్దుల్ కలాం సూచన మేరకు 11 లక్షల మంది విద్యార్థులను తన ఉప న్యాసాలతో ఉత్తేజితుల్ని చెయ్యడం, ‘ఫోకస్’ సంస్థకు బాసటగా నిలిచి యువ ఉద్యోగులకు నీతి నిజాయితీల విలువను చాటడం – విద్య పట్ల ఆయన ఆసక్తికి కొన్ని ఉదాహరణలు. వేద పాఠశాలల నిర్మాణ నిర్వహణలకు ఆర్థిక సహాయం, వేద విద్యార్థులకు ఉపకార వేతనా లివ్వడం, 100 గంటలపాటు వేదాలను రికార్డు చేయడానికి, వేద సంబంధ పుస్తకాలను ప్రచురిం చడానికి చేయూతనివ్వడం – సనాతన ఆర్ష ధర్మం పట్ల ఆయన అభిమానానికి తార్కాణాలు. అనేక దేవాలయాలకు విరాళాలివ్వడమే గాక శ్రీపురం, వేదాద్రిలలోని అన్నదానాలకు భూరి విరాళాలి వ్వడం ఆయన దానధర్మ నిరతికి సాక్ష్యాలు. అనేక అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు నిధులివ్వడం, కేన్సర్ బారినపడి చివరి మజిలీకి చేరువవుతున్న అభాగ్యులకు ‘స్పర్శ’ వంటి సంస్థల ద్వారా ప్రశాంతతను చేకూర్చడం ఆయన మానవతా దృష్టికి మచ్చు తునకలు. వైద్యులకు, నర్సులకు శిక్షణనిచ్చే ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్’, కార్నియాపై పరిశోధనలకు ఊతమిచ్చిన ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి మొదలైన వైద్య సంస్థలకు సహకారం, వికలాంగులకు బధిరాంధులకు ఉపకరణాలు సమకూర్చడం అభినందనీయం. చిన్నతనం నుండి వరప్రసాద్ రెడ్డికి సంగీత సాహిత్యాలంటే మక్కువ. శ్రావ్యమైన పాటలను బాల్యం నుంచి పదిలపరచుకొనే అలవాటున్న ఆ రస పిపాసి అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌ను రూపొం దించారు. హాసం, శాంత–వసంత ట్రస్ట్ ప్రచుర ణలుగా శతాధిక గ్రంథాలను ప్రచురించారు. మరి కొన్నిటికి ఆర్థిక సహాయం చేశారు. మిత్రులు ఎంబీఎస్ ప్రసాద్ సంపాదకులుగా హాస్య సాహి త్యాలకు పెద్ద పీట వేస్తూ మూడేళ్లకు పైగా ‘హాసం’ పత్రికను నడిపారు. డా.సి. నారాయణ రెడ్డి, ముళ్లపూడి వెంకటరమణ, రావి కొండల రావు, తనికెళ్ల భరణి వంటి రచయితల రచనలతో పాటు సుమారు 50 పుస్తకాలను ప్రచురించారు. స్వయంగా ‘మనసు పలికే...’, ‘పరిణత వాణి’ వంటి పుస్తక రచనలు చేశారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుం దన్న సామెతగా ఆయన నిస్వార్థ సేవకు సర్వదా సానుకూలంగా సహకరిస్తున్న వసంత ధర్మ పత్నిగా లభించడం ఆయన అదృష్టం. ‘పద్మ భూషణ్’ నుంచి తాజాగా వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం వరకు వందల పురస్కారాలు అందుకొన్న వరప్రసాద్ సార్థక నామధేయులు. డా పైడిపాల, వ్యాసకర్త రచయిత, సినీ పరిశోధకుడు (రేపు డా‘‘ వరప్రసాద్ రెడ్డి 75వ జన్మదినోత్సవం) -
అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశా!
‘‘నేటి యువత చదువు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా సంపాదన అంటూ ఉరుకులు పరుగులు పెడుతోంది. అలాంటి యువతరానికి విలువల గురించి చెప్పాలని తీసిన చిత్రం ‘కవి సమ్రాట్’. విలువల కోసం యువత పరుగులు పెడితే భారతదేశం గతం కంటే వంద రెట్లు బాగుంటుంది’’ అని ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, కవి విశ్వనాథ సత్యనారాయణ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కవి సమ్రాట్’. ఎల్బీ శ్రీరామ్ టైటిల్ రోల్లో నటించి, నిర్మించారు. సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ పంచుకున్న విశేషాలు. ► పాఠశాల స్థాయిలోనే నాటకాలు రాసి, దర్శకత్వం వహించి, నటించేవాణ్ణి. సామాజిక అంశాలపైనే నా నాటక రచనలు ఉండేవి. ఆ తర్వాత నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నటుల మధ్య ఎక్కువ పోటీ ఉండటంతో పన్నెండేళ్ల పాటు రచయితగా చేశాను. నా గురువు ఈవీవీ సత్యనారాయణగారి వద్ద చాలా సినిమాలకు రచయితగా చేశాను. ► ఈవీవీగారి ‘చాలా బాగుంది’ నటుడిగా నాకు బ్రేక్ ఇచ్చింది. అయితే ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో నా పాత్ర సీరియస్‌గా ఉండటంతో అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చేవి. ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. డైరెక్టర్లు చెప్పినట్లు చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ, డబ్బుకన్నా సంతృప్తి ముఖ్యం. దాంతో చాలా సినిమాలు వదులుకున్నాను. నా మనసుకు నచ్చిన, విలువలతో కూడిన అంశాలను ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశాను. ► భారతదేశంలోని ధ్వజస్తంభాల్లాంటి మహనీయుల్లో కొందరి చరిత్రలైనా చెబుదామనిపించింది. ఈ క్రమంలో యువతని ప్రోత్సహించాలనుకున్నాను. ప్రతిభావంతులైన తొమ్మిది మందిని ఎంచుకుని, కథలు రాయమన్నాను. వాటిల్లో విశ్వనాథ సత్యనారాయణగారిపై సవిత్ సి. చంద్ర రాసిన కథ నచ్చడంతో తన దర్శకత్వంలోనే ‘కవి సమ్రాట్’ నిర్మించాను. తన తాతగారు సి. సుందరరామ శర్మగారు విశ్వనాథ సత్యనారాయణగారిపై రాసిన పుస్తకం ఆధారంగా సవిత్ ‘కవి సమ్రాట్’ కథని రాసి, అద్భుతంగా తెరకెక్కించాడు. ► విశ్వనాథ సత్య నారాయణగారి ఆశీర్వాదాలతోనే ఆయన పాత్రలో నటించి, నిర్మించాను. విశ్వనాథ సత్యనారాయణగారిపై కథ రాసుకుని నా వద్దకు వచ్చిన సవిత్కి, ఇలాంటి విలువలున్న చిత్రాన్ని ‘ఆహా’లో విడుదల చేసే అవకాశం కల్పించిన అల్లు అరవింద్‌గారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ► నేటి యువత తమను తాము నిరూపించుకోవాలనే ఆకాంక్షతో ఇండస్ట్రీకి వస్తున్నారు. అయితే వారు తమ ఆకాంక్షను బలమైన సంకల్పంగా మార్చుకున్నప్పుడే విజయం సాధిస్తారు. ప్రస్తుతం నా టీమ్‌లో నేను తప్ప మిగిలిన వారందరూ పాతికేళ్లలోపు కుర్రాళ్లే. వారి కొత్త ఆలోచనలకు నేను తోడుగా నిలబడి నటించడంతో పాటు నిర్మించి వారికి ధైర్యం ఇస్తున్నా. ► ముప్పై ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఒక నటుడిగా ఇప్పటికీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు మాత్రమే చేయాలనే ఆలోచన నాకు లేదు. అందుకే.. షార్ట్ ఫిలింస్ ద్వారా సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చెబుతున్నాను. సినిమాల్లో సంపాదించిన డబ్బుని షార్ట్ ఫిలింస్‌కి ఖర్చు చేసేశాను. ఈ జర్నీలో లాభ, నష్టాల గురించి ఆలోచించను.. ఈ ప్రయాణాన్ని ఆపను. మూడు నాలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అవి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను. ► గతంలో నేను పోటీ పడ్డ తోటి హాస్యనటుల్లో చాలామంది ఇప్పుడు లేరు. అలాగే నాకు విరివిగా అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించిన దర్శకులు కూడా లేరు. పైగా గతంతో పోలిస్తే ప్రస్తుత సినిమాల్లో హాస్యనటులకు ప్రాధాన్యం ఉండటం లేదు.. అలా వచ్చి, వెళ్లిపోయే చిన్న చిన్న పాత్రలు రాస్తున్నారు. ఈ మధ్య నాకు వస్తున్న పాత్రలు మూస ధోరణిలో ఉండటంతో ఒప్పుకోవడం లేదు.. అందుకే నేను బిజీగా ఉండటం లేదు (నవ్వుతూ). వైవిధ్యమైన పాత్రలొస్తే నేనెప్పుడూ సిద్ధమే. -
Ela Bhatt: పద్మభూషణ్ ఇలా భట్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, గాంధేయవాది ఇలా భట్( 89) ఇక లేరు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం గుజరాత్ అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. 1933లో జన్మించిన ఇలా భట్.. సూరత్‌లోని సర్వజనిక్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఎంటీబీ ఆర్ట్స్ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 1955లో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ (TLA) అని పిలువబడే టెక్స్టైల్ కార్మికుల పూర్వ యూనియన్‌లో న్యాయ విభాగంలో చేరారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (SEWA) వ్యవస్థాపకురాలిగా ఇలా భట్ పేరొందారు. అంతేకాదు.. మహిళల ఆర్థిక సంక్షేమం కోసం మొట్టమొదటి మహిళా బ్యాంకును సైతం ఆమె ఏర్పాటు చేశారు. 1977లో కమ్యూనిటీ లీడర్ షిప్ కేటగిరీ కింద.. ఆమె రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. అంతేకాదు.. 1979లో ఏర్పాటైన మహిళల ప్రపంచ బ్యాంకుకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆపై దానికి ఆమె చైర్‌పర్సన్‌గానూ వ్యవహరించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 1985లో పద్మశ్రీ, ఆ మరుసటి ఏడాదికే పద్మ భూషణ్ ప్రకటించింది భారత ప్రభుత్వం. 2011లో గాంధీ శాంతి బహుమతి సైతం ఆమె అందుకున్నారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు సలహాదారుగా పని చేశారు. గాంధీజీ ప్రేరణతో, భట్ సేవా (SEWA)ను స్థాపించారు. రాజ్యసభ సభ్యురాలిగానూ ఆమె 1989 వరకు పనిచేశారు. 2007లో ఆమె మానవ హక్కులు, శాంతిని పెంపొందించడానికి నెల్సన్ మండేలా స్థాపించిన ఎల్డర్స్ అనే గ్రూప్‌లో చేరారు. కాగా, ఇలా భట్ మృతిపట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Saddened by the demise of noted activist and Padma Bhushan awardee, Smt. Ela Bhatt. She devoted her life to Gandhian ideals and transformed the lives of millions of women, by empowering them. My heartfelt condolences to her near & dear ones, and her many admirers. — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2022 -
‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రైటర్ పద్మభూషణ్ చిత్రయూనిట్ ఆదివారం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మూవీ బృందం పాటను రిలీజ్ చేశారు. అనంతరం హీరో సుహాస్ మాట్లాడుతూ రైటర్ పద్మభూషణ్ అందరినీ అలరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, షూటింగ్ మొత్తం విజయవాడలో తీశామని తెలిపారు. ఛాయ్ బిస్కట్స్ ప్రొడక్షన్స్ ద్వారా తాను చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యానన్నారు. చదవండి: ఎన్టీఆర్ 30: సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే! ఇది ఒక డ్రామా చిత్రమని, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుని బయటకు వెళ్తారన్నారు. మూవీ చూశాక వారం రోజులు మర్చిపోలేరని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రైటర్ పద్మభూషణ్ సినిమా నాకు చాలా స్పెషల్ అని, తాను పుట్టి పెరిగిన విజయవాడలో షూటింగ్ జరిగిందన్నారు. తాను చదువుకున్న కాలేజీ, భవానీ ఐలాండ్, గాంధీ హిల్స్ ప్రతిచోటా షూటింగ్ చేశామన్నారు. హీరోయిన్ టీనాకల్పరాజ్ మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన విషయాలు లాగానే ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయన్నారు. తనను దర్శకుడు బాగా ఎంకరేజ్ చేశారన్నారు. నిర్మాత శరత్ మాట్లాడుతూ ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. చిత్ర నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. -
కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ: దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత తన ట్విటర్ ప్రొఫైల్ మార్చినట్టు వచ్చినట్టు వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని.. తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘గందరగోళం సృష్టించేందుకు కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. నా ట్విటర్ ప్రొఫైల్ నుంచి ఎటువంటి సమాచారం తీసివేయలేదు. అలాగే కొత్తగా ఎటువంటివి జోడించలేదు. నా ట్విటర్ ప్రొఫైల్ మునుపటిలానే ఉంద'ని గులాం నబీ ఆజాద్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అసంతృప్త నేతల బృందమైన జీ –23లో కీలక నాయకుడిగా ఉన్న ఆజాద్ అధికార బీజేపీతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా ఆజాద్ పదవీ విరమణ సమయంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆజాద్ పరస్పరం ప్రశంసించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌కు పద్మభూషణ్ పురస్కారం దక్కడంపై కాంగ్రెస్ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమమైంది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు స్పందించకుండా మౌనంగా ఉంది. కపిల్ సిబల్, శశి థరూర్, రాజ్‌బబ్బర్ వంటి నాయకులు ఆజాద్‌కు అభినందనలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మాత్రం భిన్నంగా స్పందించారు. పద్మ పురస్కారాన్ని తిరస్కరించాలనే అర్థం వచ్చేట్టుగా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు) -
దేవేంద్ర ఝఝరియాకు పద్మభూషణ్.. నీరజ్ చోప్రాకు పద్మశ్రీ
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించగా.. క్రీడారంగంలో 9 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పారాఒలింపిక్ అథ్లెట్ దేవేంద్ర జజేరియా భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను పద్మశ్రీ వరిచింది. మిగతావారిలో సుమిత్ అంటిల్(పారాఅథ్లెట్), ప్రమోద్ భగత్(షూటింగ్), శంకర్‌నారాయణ్ మీనన్, ఫసల్అలీ దార్, వందన కటారియా(హాకీ), అవనీ లేఖరా(షూటింగ్), బ్రహ్మానంద్ సంక్వాల్కర్లను కూడా పద్మశ్రీ వరించింది. దేవేంద్ర ఝఝరియా: దేవేంద్ర ఝఝారియా ..2004 పారాలింపిక్స్‌లో స్వర్ణం...2021లో రజతం... ఈ రెండింటి మధ్య 2016లో మరో ఒలింపిక్ స్వర్ణం... ఇది అతని గెలుపు ప్రస్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొనని ఒలింపిక్స్‌కు: సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది.అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. నీరజ్ చోప్రా: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. -
బిల్‌గేట్స్ పేరెత్తితే ఆనంద్ మహీంద్రాకి చిరాకు.. కారణం ఇదే?
Padma Bhushan Anand Mahindra Life Story In Telugu: సోషల్ మీడియాలో ఏదైనా వీడియో బాగా పాపులర్ అయితే అది వెంటనే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా అకౌంట్లో ప్రత్యక్షం అవుతుంది. సామాజిక అంశాల మొదలు స్పోర్ట్స్ ఈవెంట్స్ వరకు అన్నింటిపైనా ఆయన స్పందిస్తుంటారు. లక్ష కోట్ల రూపాయల బిజినెస్ నడిపించే వ్యక్తిగా ఆయన అసలే కనిపించరు. కారణం .. ఆయనకు సినిమాలంటే పిచ్చి.. సినిమాల్లోకి రావాలని హర్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. కానీ పరిస్థితులు అనుకూలించక తిరిగి కుటుంబ బిజినెస్లోకే వచ్చారు. స్టీలు, ట్రాక్టర్లు , జీపులు తయారు చేసే కంపెనీ కంప్యూటర్స్, ఎయిరోస్పేస్ వరకు తీసుకెళ్లారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం ఇటీవల ఆనంద్ మహీంద్రాని పద్మభూషణ్‌తో సత్కరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా వ్యాపార సామ్రాజ్యానికి మూడో తరం వారసుడు ఆనంద్ గోపాల్ మహీంద్రా. 1953లో హరీష్ , ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. తమిళనాడులో స్కూలింగ్ పూర్తి చేసిన ఆనంద్ మహీంద్రా.. సినిమాలపై ఉన్న మక్కువతో 1977లో హర్వర్డ్ యూనివర్సిటీలో ఫిల్మ్‌మేకింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మనసు మార్చుకుని తిరిగి వ్యాపారం వైపు మొగ్గు చూపారు. దీంతో అదే యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో మాస్టర్స్ చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. వ్యాపార మెళకువలు 1980వ దశకంలో స్టీలు వ్యాపారంలో జపాన్ గుత్తాధిపత్యం చెలాయిస్తుండేది. ప్రపంచంలో మరే దేశంలో మరే కంపెనీ జపాన్ సంస్థల ముందు నిలబడలేవు అనే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో ముంబైలో ఉన్న మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఫైనాన్స్) ఆఫీసరుగా 1981లో చేరారు. అక్కడే ఉంటూ . జీపులు, ట్రాక్టర్లు, స్టీలు వ్యాపారాల నుంచి మహీంద్రా గ్రూపుని ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలకు విస్తరించారు. వ్యాపారంలో ఒక్కో మెళకువను ఒంటబట్టించుకుంటూ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు ఆనంద్‌లో ప్రతిభకు పరీక్ష పెట్టేందుకు మరో సవాల్‌ని ఆయన ముందు ఉంచారు తాత జగదీశ్చంద్ర. తొలి పరీక్ష సమ్మెలతో అట్టుడికి పోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలు 1991లో మహీంద్రాకు అప్పగించారు. ఆనంద్ పదవీ బాధ్యతలు స్వీకరించడమే ఆలస్యం ఫ్యాక్టరీలో మరోసారి పెద్ద సమ్మెకు పిలపునిచ్చారు కార్మికులు. ఫ్యాక్టరీలో తీవ ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆనంద్ మహీంద్రా క్యాబిన్ని చుట్టుముట్టి గట్టిగా నినాదాలు ఇస్తున్నారు కార్మికులు. ఏ కొంచెం తేడా వచ్చినా యజమానిపై దాడి తప్పదు అనేంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చని.. ఫ్యాక్టరీ వదిలి వెళ్లాలంటూ నలువైపుల నుంచి సలహాలు వస్తున్నాయి. అప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు ఆనంద్ మహీంద్రా. నేరుగా రంగంలోకి ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మికులతో స్వయంగా చర్చలకు దిగారు ఆనంద్. మీ డిమాండ్లు ఒప్పుకోవాలన్నా.. దీపావళికి బోనస్‌లు ఇవ్వాలన్నా ఈ స్ట్రైక్‌ని ఇక్కడితో ఆపేసి పనిలోకి వెళితే మంచిది లేదంటే అంతే సంగతులు అంటూ ఖరాఖండీగా చెప్పారు. ఒక్క మాట అటు ఇటు అయితే భౌతిక దాడులకు అవకాశం ఉన్న చోట ఎంతో ధైర్యంగా కంపెనీ పరిస్థితులు, తన చేతిలో ఉన్న అవకాశాలను కార్మికులకు వివరించారు. అప్పటి వరకు కార్మికులతో మధ్యవర్తులే మాట్లాడే వారు.. సమస్య పరిష్కారం కాకుండా సుదీర్ఘకాలం సాగదీసేవారు. ఆ సంస్కృతికి భిన్నంగా యజమానే స్వయంగా రంగంలోకి దిగడం. తనకు ఏం కావాలో.. తనేం చేయగలడో నేరుగా చెప్పడంతో కార్మికులకు కొత్తగా అనిపించింది. ఆనంద్ మహీంద్రా మాట గౌరవించి పనిలోకి వెళ్లారు. గత కొన్నేళ్లుగా చచ్చీ చెడీ యాభై శాతం ఉత్పత్తి మాత్రమే సాధించే ఆ ఫ్యాక్టరీ.. ఆనంద్ వచ్చాక ఆ ఏడాది 150 శాతం ఉత్పత్తిని సాధించింది. ఈ ఘటనతో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం, అందులోని ఉద్యోగుల భవిష్యత్తుకి ఆనంద్ రూపంలో భరోసా లభించింది. తెగింపుకి తొలిమెట్టు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వాహన తయారీ టెక్నాలజీ కోసం ఇప్పటికీ విదేశీ కంపెనీలపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరంపరలోనే ఫోర్డ్ కంపెనీతో కలిసి ఎస్కార్ట్ కారుని మార్కెట్లోకి తెచ్చారు ఆనంద్ మహీంద్ర. తొలి ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఆనంద్ సామర్థ్యంపై నీలినీడలు కమ్మకున్నాయి. కానీ ఈ అపజయాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నారు ఆనంద్. ఆ ప్రాజెక్టులో పని చేసిన 300 ఇంజనీర్లు, ఇతర సభ్యులతో సొంతంగా టీమ్‌ని తయారు చేశారు. దేశీయంగా ప్యాసింజర్ వెహికల్ తయారీ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు ఆనంద్ మహీంద్రా. ఆ రోజుల్లో ఆ ప్రయత్నం ఆత్మహత్యాసదృశ్యమే. అనేక నిద్రలేని రాత్రులు ఆ టీం గడిపింది,. స్కార్పియో సంచలనం మహీంద్రా టీం చేసిన కృషితో దేశీ టెక్నాలజీతో స్కార్పియో మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు సక్సెస్ ఇండియా మార్కెట్‌నే కాదు ప్రపంచ మార్కెట్‌నే మార్చేసింది. అప్పటి వరకు విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చుక్కానిలా పని చేసింది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో సైతం స్కార్పియో వాహనాల అమ్మకాలు దుమ్ము రేపాయి. ఆ రోజుల్లో యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ మార్కెట్ వాటా 4.9 శాతం ఉంటే స్కార్పియో వాటా ఏకంగా 36 శాతానికి పెరిగింది. అదే ఒరవడిలో తర్వాత మహీంద్రా నుంచి జైలో ఎక్స్‌యూవీ సిరీస్, కేయూవీ సిరీస్‌లతో పాటు ఆఫ్‌రోడ్‌లో సంచలనం సృష్టిస్తున్న థార్ వంటి వెహికల్స్ వచ్చాయి. మహీంద్రా దూకుడు దేశీ టెక్నాలజీ తయారైన స్కార్పియో విజయం ఆనంద్ మహీంద్రాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. దీంతో మహీంద్రా గ్రూపు కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా మహీంద్రా లోగోలో రైస్‌ని చేర్చి మహీంద్రా రైస్ అంటూ కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్, గుజరాత్ ట్రాక్టర్స్, రేవా ఎలక్ట్రిక్ కార్ వెహికల్స్, సత్యం కంప్యూటర్స్, ప్యూజియోట్ మోటార్ సైకిల్స్, సాంగ్యాంగ్ మోటార్ సైకిల్స్ తదితర కంపెనీలను వేగంగా కొనుగోలు చేసి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుని విస్తరించారు. ఎయిరోస్పేస్లోకి కూడా అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ మహంద్రానే. మహీంద్రా విస్తరణ మహీంద్రా గ్రూపులో 1991లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పుడు కంపెనీ విలువ రూ.1,520 కోట్లు ఉండగా ముప్ప ఏళ్లలో 60 రెట్లు పెరిగి 2020 వచ్చే సరికి రూ. 96,241 కోట్లకు చేరుకుంది. పలు అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు , గౌరవ పదవులు చేపట్టారు. బిల్‌గేట్స్ పేరు ఎత్తితే చిరాకు ఆనంద్ మహీంద్రా భార్య పేరు అనురాధ. ఆమె జర్నలిస్టుగా పని చేస్తున్నారు. వెర్వే, మెన్స్ వరల్డ్ అనే పత్రికల నిర్వహిస్తున్నారు. ఆయనకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హర్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో బిల్‌గేట్స్, ఆనంద్ మహీంద్రా ఇద్దరు క్లాస్మేట్స్. బయట తాను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా తన కూతుళ్లకు మాత్రం ఫెయిల్యూర్ పర్సన్లానే కనిపిస్తుంటానని ఆనంద్ మహీంద్రా అంటున్నారు. అందుకు కారణం ఆయన కూతుళ్లెవాళ్లెప్పుడు బిల్‌గేట్స్‌తో నన్ను పోలుస్తూ ‘నువ్వో ఫెల్యూయర్ పర్సన్’ అని ఆటపట్టిస్తుంటారు. అందుకే నాకు బిల్‌గేట్స్ పేరు వింటేనే కోపం వస్తుందంటూ సరదగా తన కుటుంబ విశేషాలను మీడియాతో ఆయన పంచుకున్నారు. సామాజిక సేవలో వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన తర్వాత సామాజిక సేవల్లోకి వచ్చారు ఆనంద్ మహీంద్ర. సామాజిక సేవ కోసం నాంది ఫౌండేషన్ స్థాపించారు. అందులో ఆయనకు ఎక్కువ సంతృప్తి ఇచ్చింది చదువుకు దూరమైన పేద బాలికల కోసం చేపట్టిన నహీ కాలీ ప్రాజెక్టు. 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 3.30 లక్షల మంది ఆడ పిల్లలకు ఈ ప్రాజెక్టు ద్వారా విద్య అందుతోంది. A matter of great happiness to see my good friend @anandmahindra get the Padma Bhushan. He has led the Mahindra group ably and ethically and more importantly always had India’s interest beating in his heart. pic.twitter.com/GCFzCW9VeA — Harsh Goenka (@hvgoenka) November 8, 2021 ఆనంద్ గోపాల్ మహీంద్రా ఘనతలు - భారత ప్రభుత్వం నుంచి 2021 నవంబర్ 7న పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. - ఫార్చూన్ మ్యాగజైన్ 2014లో ప్రకటించిన వరల్డ్ గ్రేటెస్ట్ లీడర్స్ -50లో చోటు దక్కించుకున్నారు. - ఫార్చూన్ ఆసియా మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ పీపుల్ 25లో స్థానం పొందారు - ఫోర్బ్స్ పత్రిక 2013లో ఎంట్రప్యూనర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు విశేషాలు - 1945లో ముహమ్మద్, జగదీశ్ చంద్ర మహీంద్రాలు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఎం అండ్ ఎం పేరుతో కంపెనీ నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓవర్ లాండ్ అనే యూరప్ కంపెనీతో కలిసి ఆర్మీకి జీపులు తయారు చేసే పని దక్కించుంది. - దేశ విభజన సమయంలో ఈ సంస్థలో భాగస్వామిగా ఉన్న ముహమ్మద్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆయన మంత్రి కూడా అయ్యారు. అయితే ఎం అండ్ ఎం గ్రూపులో తన తమ్ముళ్లని పార్ట్నర్లుగా జగదీశ్ చంద్ర చేర్చారు. అనంతరం కంపెనీ పేరును మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. - టాటా, మహీంద్రా గ్రూపులు చూపిన బాటలో ఇండియాలో స్టీలు పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుగుతూ జపాన్ను వెనక్కి నెట్టింది. చైనా తర్వాత రెండో స్థానంలో నేడు ఇండియా నిలిచింది. I began my career in the 80’s at our alloy steel company. Back then the Japanese dominated the industry like unshakeable Gods. It was unimaginable that we could ever be more than a midget in front of them. I wonder if today’s youth will understand the magnitude of this milestone https://t.co/c0KOhuZEQm — anand mahindra (@anandmahindra) January 6, 2021 - 80,90వ దశకాల్లో రూరల్ ఇండియాలో కనెక్టివిటీకి మరోపేరుగా మహీంద్రా కమాండ్ జీపులు నిలిచాయి. - మహీంద్రా గ్రూపుకి 72 దేశాల్లో కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. 100కు పైగా దేశాల్లో మహీంద్రా ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. 🙏🏽 for all your congratulations on my Padma Bhushan award. Repeating my tweet from last year: “There’s an old saying: If you see a turtle on top of a fence, you know for sure it didn’t get there on its own! I stand on the shoulders of all Mahindraites.” https://t.co/tdJBbjNNWo — anand mahindra (@anandmahindra) November 9, 2021 వారి వల్లే ఈ ఘనత పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన సందర్భంలో వచ్చిన ప్రశంసలకు ఆయన వినమ్రంగా స్పందించారు.. ఈ ఘనత వెనుక మహీంద్ర సంస్థ ఉద్యోగుల శ్రమ ఉందన్నారు. వారి భుజాలపై తాను నిలబడి ఈ అవార్డు అందుకున్నట్టుగా తెలిపారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
పద్మభూషణ్ అందుకున్న పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ: పలువురు ప్రముఖులకు 2020 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం 141 పద్మ అవార్డులను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అందుకున్నారు. అవార్డులను అందుకున్న వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఏపీలోని మదనపల్లికి చెందిన సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాప కుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డి, తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరొందిన భాష్యం విజయసారథి, అనంతపురం జిల్లాకు చెందిన తోలు బొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. తన సేవలను గుర్తించి అవార్డు అందించడం ఎంతో సంతోషంగా ఉందని పద్మశ్రీ పురస్కారగ్రహీత చింతల వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
వాస్తవిక నటి.. షబానా ఆజ్మీ @ 72
పది డైలాగులు అవసరమైన చోట ఒక ముఖ కవళిక. పెద్దగా అరవాల్సిన చోట ఒక లోగొంతుక. భోరున విలపించాల్సిన చోట కంటి నుంచి జారని నీటి చుక్క. పగలబడి నవ్వాల్సిన చోట పంటి మెరుపు... ఇవి నటన అని చూపించిన నటి షబానా ఆజ్మీ. ఆమె వల్ల స్త్రీ పాత్రలు తెరపై వాస్తవికంగా కనిపించాయి. ఆమె వల్ల కథలు నిజంగా నమ్మించాయి. ఆమె కొంతమంది నటీనటులకు నటగ్రంథం అయ్యింది. ఆమెను భారతీయ వెండితెర సదా గౌరవంగా చూస్తుంది. మన హైదరాబాద్ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతోంది. చూడండి ఎలా హైదరాబాద్‌తో ఆమె జీవితం ముడిపడిందో. 1950 సెప్టెంబర్ 18న ఇక్కడే పుట్టిందామె. తల్లి షౌకత్ ఆజ్మీది హైదరాబాద్ కనుక కాన్పుకు పుట్టింటికి రావడంతో ఇక్కడే నాలుగు నెలలు ఊపిరి పీల్చింది. ఆ తర్వాత ముంబై చేరుకుంది. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునే సమయంలో ఆమెకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి కె.ఏ.అబ్బాస్ ‘ఫాస్లా’, రెండు కాంతిలాల్ రాథోడ్ ‘పరిణయ్’. కాని రెంటి కంటే ముందు తొలిసినిమాగా ‘అంకుర్’ విడుదలైంది. శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఆ కథే ఆమె తొలి కథ అయ్యింది. అందులోని గ్రామీణురాలు లక్ష్మి ఆమె తొలి పాత్ర అయ్యింది. దక్కనీ ఉర్దూ ఆమె తొలి సంభాషణ అయ్యింది. తొలి జాతీయ అవార్డు కూడా ఆ సినిమాతోనే వచ్చింది. హైదరాబాద్ గాలి హైదరాబాద్ అమ్మాయికి గొప్ప ప్రారంభం ఇచ్చింది. తండ్రి కైఫీ ఆజ్మీ కమ్యూనిస్టు కవి. షౌకత్ ఆజ్మీ ‘ఇప్టా’ సభ్యురాలు. 9 ఏళ్ల వయసు వచ్చే వరకూ షబానా ఆజ్మీ ముంబైలో రెడ్‌ఫ్లాగ్ హౌస్‌లో ఉండేది. అంటే 8 కమ్యూనిస్టు కుటుంబాలు ఉండే చిన్న భవనం అన్నమాట. దానికి ఒకటే టాయ్‌లెట్. ఒకటే బాత్రూమ్. కాని వాళ్లంతా కలిసి మెలిసి జీవించేవారు. కైఫీ ఆమెకు ఆ వయసులో ఒక నల్లటి బొమ్మ తెచ్చి ఇచ్చాడు. షబానా ఆ బొమ్మను చూసి ‘నా ఫ్రెండ్స్ అందరి దగ్గర తెల్లటి బొమ్మలున్నాయి’ అనంటే ఆయన ‘నలుపు కూడా అందమైనదే. నీకు ఆ సంగతి తెలియాలి’ అని చెప్పాడు. అలాంటి వాతావరణంలో ఆమె పెరిగింది. ఇంటికి ఎప్పుడూ వచ్చేపోయే కవులు... పార్టీ సభ్యులు. షబానాకు పేరు పెట్టక ఇంట్లో ‘మున్నీ’ అని పిలుస్తుంటే ఇంటికి వచ్చిన కవి అలీ సర్దార్ జాఫ్రీ ‘ఇంకా పేరు పెట్టకుండా ఏమిటయ్యా’ అని తనే షబానా అని పేరు పెట్టాడు. ఆమె తోటి స్నేహితురాళ్లు ఫ్యాంటసీ బొమ్మల పుస్తకాలు చదువుతుంటే షబానాకు రష్యా నుంచి వచ్చే పుస్తకాలు చదవడానికి దొరికేవి. తండ్రి వల్ల సాహిత్యం తల్లి పృధ్వీ థియేటర్లో పని చేయడం వల్ల నటన ఆమెకు తెలిశాయి. పృథ్వీ థియేటర్లో నాటకం వేస్తే గ్రూప్‌లో ఒకరిగా స్టేజ్ ఎక్కేసేది. స్కూల్లో కూడా స్టేజ్ వదిలేది కాదు. కాలేజీలో చేరితే అక్కడ కేవలం ఇంగ్లిష్ థియేటరే నడుస్తూ ఉంటే తన సీనియర్ అయిన నటుడు ఫరూక్ షేక్‌తో కలిసి హిందీ డ్రామా ప్రారంభించింది. అన్ని పోటీల్లో ప్రైజులు కొట్టేది. షబానాకు తాను నటించగలనని తెలుసు. కాని నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్న సందర్భం వేరు. షబానా ఆజ్మీ ఒకసారి జయ భాదురి నటించిన ‘సుమన్’ అనే సినిమా చూసింది. అందులో జయ భాదురి నటన కొత్తగా అనిపించింది. ‘ఈమెలాగా నేనూ నటిని కావాలి’ అనుకుని తండ్రితో చెప్పి, పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరతానంటే ‘నువ్వు ఏ రంగమైనా ఎంచుకో. కాని అందులో బెస్ట్‌గా నిలువు’ అని ఆయన అన్నాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో షబానా నటిగా తొలిరోజుల్లోనే అందరి దృష్టిలో పడింది. పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘అంకుర్’ కూడా అలాగే వచ్చింది. నగరమే తప్ప పల్లెటూరు చూసి ఎరగని షబానా ‘అంకుర్’ కోసం చాలా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. మడమల మీదుగా చీర కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్న పల్లెటూళ్లలో అలా ఉండే స్త్రీలను గమనించింది. అంతవరకూ ఆమెకు మునికాళ్ల మీద కూచోవడం రాదు. ‘లక్ష్మి’ పాత్ర వంట చేయాలన్నా పనులు చేయాలన్నా మునికాళ్ల మీద కూచోవాలి. అందుకని శ్యాం బెనగళ్ ఆమెను ‘నువ్వు మునిగాళ్ల మీద కూచుని భోం చేయ్’ అని డైనింగ్ టేబుల్ మీద కూచోనిచ్చేవాడు కాదు. ‘అంకుర్’ సినిమాలో షబానా తన నడక, మాట తీరు, ముఖ కవళికలు వీటన్నింటితో లక్ష్మి పాత్రను గొప్పగా తెర మీద ప్రతిష్టించింది. ఆ సినిమా వేసిన అంకురం అతి త్వరగానే మహా వృక్షమైంది. ఒక కాలం అది. నసీరుద్దీన్ షా, ఫరూక్ షేక్, ఓంపురి, స్మితాపాటిల్, షబానా ఆజ్మీ... వీళ్లు భారతీయ పారలల్ సినిమాకు ఊతంగా నిలబడ్డారు. వీరే పునాది, వీరే గోడలు, వీరే పైకప్పు. స్మితా పాటిల్, షబానా ఆజ్మీల మధ్య పోటీ ఉండేది. కాని ఎవరికి వారు తమ పాత్రలలో చెలరేగి ఎవరు గొప్పో చెప్పడం కష్టం చేసి పెట్టేవారు. శేఖర్ కపూర్ ‘మాసూమ్’ లో భర్త అక్రమ సంతానాన్ని అంగీకరించేందుకు మథన పడే భార్యగా షబానా గొప్ప నటన ప్రదర్శించింది. మహేశ్ భట్ ‘అర్థ్’లో మరొక స్త్రీ ఆకర్షణలో పడిన భర్త గురించి ఆమె పడిన సంఘర్షణ ప్రేక్షకులను కదిలించింది. శ్యామ్ బెనగళ్ ‘మండీ’, మృణాల్‌సేన్ ‘ఖండర్’, గౌతమ్‌ఘోష్ ‘పార్’... దర్శకులు ఆమె వల్ల ఆమె దర్శకుల వల్ల భారతీయ సినిమాను ఉత్కృష్ట ప్రమాణాలకు చేర్చారు. దీపా మెహతా ‘ఫైర్’, శాయి పరాంజపె ‘స్పర్శ్’, సత్యజిత్ రే ‘షత్రంజ్ కే ఖిలాడీ’, తపన్ సిన్హా ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ ఆమెను తలిస్తే తలువబడే సినిమాలు. తెలుగు దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘మార్నింగ్ రాగా’లో క్లాసికల్ సింగర్‌గా నటించిందామె. మూస తల్లి పాత్రలు, మూస వదిన, అత్త పాత్రలు ఆమె ఏనాడూ చేయలేదు. ఆమెకు పాత్ర రాసి పెట్టి ఉండాలి. పాత్రకు ఆమె రాసి పెట్టి ఉండాలి. ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘ఫకీరా’ వంటి కమర్షియల్ సినిమాలు చేసినా ఆమె అందుకు పుట్టలేదు. ఆ తర్వాత ఆ దారి పట్టలేదు. షబానా ఆజ్మీ గీతకర్త జావేద్ అఖ్తర్‌ను వివాహం చేసుకుంది. రాజ్యసభ సభ్యురాలిగా పని చేసింది. సామాజిక కార్యకలాపాలలో పాల్గొంది. తండ్రి పేరు మీద ఆయన స్వగ్రామంలో స్త్రీల కోసం ఉపాధి కల్పనా కేంద్రాలను తెరిచింది. ఆమెకు ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. షబానా వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. దాని మెరుపులు మరిన్ని కొనసాగాలి. -
'పద్మ' అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వచ్చే ఏడాది (2021) గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాలకు ఆన్లైన్ నామినేషన్లు లేదా సిఫారసులకు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గడువు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. నామినేషన్లు లేదా సిఫారసులను కేవలం ఆన్లైన్ ద్వారా, పద్మ పురస్కారాల పోర్టల్ ద్వారా స్వీకరిస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ పురస్కారాలు, పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలు. పద్మ పోర్టల్ అందుబాటులో ఉన్న నిర్ణీత నమూనా ప్రకారం నామినేషన్లు లేదా సిఫారసులు ఉండాలి. నామినేట్ లేదా సిఫారసు చేస్తున్న వ్యక్తి, సంబంధింత రంగంలో సాధించిన విజయాలు లేదా సేవల గురించి 800 పదాలకు మించకుండా స్పష్టంగా రాయాలి. సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న అర్హులైన మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు వంటి ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రయత్నాలు చేయమని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, అత్యున్నత సంస్థలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 15న ముగుస్తుందని ఈలోగా దరఖాస్తులు పంపాల్సిందిగా పేర్కొంది. 1954 నుంచి మొదలైన ఈ అవార్డుల పర్వం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతోంది. జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా కళ,సాహిత్యం, విద్య,క్రీడలు, సామాజికం, సైన్స్ అండ్ టెక్నాటజీ సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించినవారు పద్మ అవార్డులకు అర్హులు. అంతేకాకుండా సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలు, పద్మ అవార్డుల గ్రహీతలకు కేంద్ర హోంశాఖ కోరింది. అంతేకాకుండా పౌరులు కూడా స్వతహాగా నామినేషన్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. గరిష్టంగా 800 పదాలకు మించకుండా సిఫారసులో సూచించిన ఫార్మాట్ తరహాలో పద్మ అవార్డుల పోర్టల్‌లో సంబంధిత వివరాలను నమోదు చేయాలని తెలిపింది. (కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ) -
సింధుకు హైదరాబాద్ హంటర్స్ ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పీబీఎల్ హైదరాబాద్ హంటర్స్ టీమ్ ఘనంగా సన్మానించింది. పూలమాలతో సింధును సత్కరించి.. పద్మభూషణ్ అవార్డు పొందినందుకు అభినందనలు తెలిపింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హంటర్స్ టీమ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ అభిమానులు తమ టీమ్‌కు ఎంతగానో సపోర్ట్ చేశారని చెప్పారు. ఈ సీజన్లో సింధు సారథ్యంలో హంటర్స్ టీమ్ పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేటీఆర్ తమకు ఎంతగానో సపోర్టుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. హంటర్స్ తరఫున ఆడటం సంతోషంగా ఉందన్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. అభిమానులు భారీగా తరలివచ్చి హంటర్స్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి మాట్లాడుతూ.. హంటర్స్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింధుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలసిందే. -
అభివృద్ధి కోసం పరిశోధనలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక, సామాజిక శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్ష నెరవేరాలంటే మౌలిక పరిశోధనలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందేనని పద్మభూషణ్ జి.పద్మనాభన్ స్పష్టం చేశారు. ఐటీ, అంతరిక్ష పరిశోధనల్లో దేశం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానవాభివృద్ధి సూచీల్లో 129వ స్థానంలో ఉండటం, ఆరోగ్య సేవల విషయంలో ప్రపంచదేశాల జాబితాలో అట్టడుగు భాగంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్లో (నార్మ్) శనివారం ఓ జాతీయ సదస్సు ప్రారంభమైంది. ‘శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యాపారాభివృద్ధి’ అనే అంశంపై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా (నాసి) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పద్మనాభన్ మాట్లాడుతూ.. దేశ వ్యవసాయ, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఐటీ, అంతరిక్ష పరిశోధనలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ ఎ.వి.రామారావు, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మంజు శర్మ, నాసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సత్యదేవ్, నార్మ్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పద్మభూషణ్ వెనక్కిచ్చేస్తా: హజారే
రాలేగావ్‌సిద్ధి: కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. రాలేగావ్ సిద్ధిలో చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరింది. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 1992లో ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తక్షణమే లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు చే పట్టాలని డిమాండ్ చేశారు. కాగా, హజారేకు డాక్టర్ ధనంజయ పొటే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదురోజుల్లోనూ ఆయన 3.8 కేజీల బరువు తగ్గిపోయినట్లు తెలిపారు. హజారే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాలేగావ్ సిద్ధి గ్రామప్రజలు అహ్మద్‌నగర్–పుణె జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో బైఠాయించారు. దీంతో ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
స్టార్ హీరోకు ‘పద్మ’ అవార్డుపై సెటైర్లు
న్యూఢిల్లీ: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది ఆయనను అభినందిస్తుంటే, మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినందుకు ‘ఫలితం’ దక్కిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మోదీని మోహన్‌లాల్ కలిశారు. తాను నిర్వహిస్తున్న సేవా సంస్థ విశ్వశాంతి ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ప్రధానమంత్రిని కలిసినట్టు అప్పట్లో ఆయన చెప్పారు. సానుకూలంగా తమ భేటీ జరిగిందన్నారు. ‘సానుకూల సమావేశం వృధాగా పోలేదు. పద్మభూషణ్ పురస్కారం తెచ్చిపెట్టింద’ని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలని చూస్తున్న గౌతమ్ గంభీర్, మోహన్‌లాల్ పద్మపురస్కారాలు దక్కించుకున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా సినిమాల్లో కొనసాగుతున్న మోహన్‌లాల్ నటనకు స్వస్తిచెప్పి కేరళ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కాగా, తనకు దక్కిన పద్మభూషణ్ పురస్కారాన్ని తనను అభిమానించే వారికి అంకితం చేస్తున్నట్టు మోహన్‌లాల్ ప్రకటించారు. #Mohanlal and #GautamGambir Awarded with #Padmabhusan And #Padmashri both are waiting for ticket to contest in upcoming election 2019 for #BJP Lightsonmedia New Cable Sankar Suresh Eav — sundhara krishna (@sundhartrader) January 27, 2019 His positive energy trip was not wasted!#mohanlal #PadmaAwards2019 @VTBALRAM pic.twitter.com/YBEP4t5dnr — Mohammed Rafeeq Thalangara (@MrqThalangara) January 27, 2019 Sir I reckon u met hon'ble PM just few months back... Sir congrats the meeting didn't go invain.. pic.twitter.com/tXnzJr6VBI — Arif shaikh (@Arifshaikh1910) 26 January 2019 Is it true 40 years??... Really??..When u gonna stop acting romance in movie.. sometime its look ugly both u and mammooka.... now time to serve people of kerala who hardly find their food everyday... — Fazal (@Fazalvellur) 26 January 2019 -
నంబీ నారాయణ్‌కు పద్మపురస్కారమా? షాకింగ్..!
తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంపై కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ అంతరిక్ష పరిశోధన రహస్యాలను విదేశాలకు అమ్మేందుకు ప్రయత్నించారంటూ 1990లో క్రయోజనిక్ నిపుణుడైన నంబీ నారాయణ్ అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇస్రోను కుదిపేసిన ఈ గూఢచర్య కేసులో నంబీతోపాటు మరో శాస్త్రవేత్త అయిన డీ శశికుమార్ అరెస్టయ్యారు. మాల్దీవులకు చెందిన మహిళలతో ఉండగా వారిని 1994లో అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి పూర్తిగా నంబీ నారాయణ్ బయటపడకముందే ఆయనకు పద్మ పురస్కారాన్ని ఎలా ప్రకటిస్తారని మాజీ డీజీపీ సేన్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఏ ప్రాతిపదికన ఆయనకు అవార్డు ఇచ్చారో అర్థం కావడం లేదు. తేనెలో విషం కలిపిన చందంగా ఇది ఉంది. ఇస్రో గూఢచర్య కేసులో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ విచారణ జరుపుతున్న దశలో అతని పేరును అవార్డుకు ఎలా పరిగణనలోకి తీసుకున్నారు’ అని సేన్‌కుమార్ ప్రశ్నించారు. ఆయన పేరును ప్రతిపాదించిన వ్యక్తులు మున్ముందు దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిజాయితీపరుడైన ఐపీఎస్‌గా పేరొందిన సేన్‌కుమార్ మూడేళ్ల కిందట డీజీపీ పదవి నుంచి తనను పినరయి విజయన్ ప్రభుత్వం తొలగిస్తే.. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడి పదవిని తిరిగిపొందారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘నంబీ నారాయణ్ దేశానికి చేసిన సేవలేమిటి? ఆయనో మామూలు శాస్త్రవేత్త. ఇస్రో నుంచి స్వయంగా తప్పుకున్నాడు. ఆయనకు బదులు ఓ యువ శాస్త్రవేత్తకు ఈ పురస్కారం అందజేసి ఉంటే నేను సంతోషించి ఉండేవాడిని’ అని అన్నారు. ఇస్రో గూఢచర్యం కేసును ఇప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కడంపై నంబీ నారాయణ్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని, తాను అమాయకుడినని చాటడానికి ఈ పురస్కారమే నిదర్శనమన్నారు. -
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
-
‘హిందుస్తానీ’ దిగ్గజం అన్నపూర్ణ కన్నుమూత
ముంబై: ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణదేవి(92) కన్నుమూశారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. హిందుస్తానీ సంగీతానికి విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణాదేవిని 1977లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ప్రముఖ హిందుస్తానీ సంగీతకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఆమె సోదరుడే. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌ను అన్నపూర్ణాదేవి 1941లో వివాహమాడి, 1962లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తన జీవితకాలంలో అధికభాగం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అన్నపూర్ణాదేవి..ముంబైకి మకాం మార్చి కొద్ది మంది శిష్యులకు శిక్షణ ఇవ్వడానికే అంకితమయ్యారు. ఆమె శిష్యుల్లో హరిప్రసాద్ చౌరాసియా(బన్సూరి), ఆశిష్ ఖాన్(సరోద్), అమిత్ భట్టాచార్య(సరోద్), బహదూర్ఖాన్(సరోద్), బసంత్ కాబ్రా(సరోద్), , జోతిన్ భట్టాచార్య(సరోద్), నిఖిల్ బెనర్జీ(సితార్), నిత్యానంద్ హల్దీపూర్(బన్సూరి), పీటర్ క్లాట్(సితార్), ప్రదీప్ బారట్(సరోద్), సంధ్యా ఫాడ్కే(సితార్), సరస్వతి సాహా(సితార్), సుధీర్ ఫాడ్కే(సితార్), సురేశ్ వ్యాస్(సరోద్) తదితర ప్రముఖులున్నారు. అన్నపూర్ణదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. తండ్రే గురువు.. ‘మా’గా పిలుచుకునే అన్నపూర్ణాదేవిది సంప్రదాయ సంగీత నేపథ్యమున్న కుటుంబం. 1927లో మధ్యప్రదేశ్‌లోని మైహర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్ కాగా, అప్పటి మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఐదేళ్ల ప్రాయం నుంచే తండ్రి ఉస్తాద్ బాబా నుంచి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. తొలుత సితార్ వైపు మొగ్గుచూపినా, తరువాత సూర్బహర్(తక్కువ పిచ్ ఉండే సితార్)పై మక్కువ పెంచుకుని అందులోనే ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయ హిందుస్తానీ సంగీతంలో ‘సేనియా మైహర్ ఘరానా’ అనే శైలిని నెలకొల్పడంలో ఆమె తండ్రి విశేష కృషి చేశారు. -
జస్టిస్ పీసీ రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: న్యాయకోవిదుడు, పద్మభూషణ్ జస్టిస్ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ పీసీ రావుకు భార్య, నలుగురు కుమార్తెలున్నారు. ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.82లో నివాసముండేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో ఆయన 1936 ఏప్రిల్ 22న జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బీఎల్, ఎంఎల్, ఎల్ఎల్డీ (డాక్టర్ ఆఫ్ లాస్) పట్టాలు, హైదరాబాద్ నల్సార్ వర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. రాజ్యాంగపరమైన అంశాల్లో బాగా లోతుగా అధ్యయనం చేసి ఆయన తనదైన ముద్ర వేశారు. ఆర్బిట్రేషన్ లా (మధ్యవర్తిత్వ న్యాయ), అంతర్జాతీయ సముద్ర జలాల న్యాయ వివాదాలు తదితర చట్టాల్లో ఆరితేరిన వ్యక్తిగా పేరొందారు. దేశం తరఫున అంతర్జాతీయ జల చట్టాల పరిశోధనాధికారిగా కూడా పనిచేశారు. భారత ప్రభుత్వ న్యాయశాఖ, డిప్యూటీ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్లో అదనపు కార్యదర్శి, కార్యదర్శితో సహా పలు ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలను ఆయన చేపట్టారు. 2017 వరకు ‘ట్రిబ్యునల్’ న్యాయమూర్తిగా.. హంబర్గ్‌లోని అంతర్జాతీయ సముద్ర జల వివాదాల ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా (1999 నుంచి 2002 వరకు), న్యాయమూర్తిగా 2017 వరకు జస్టిస్ పీసీ రావు పనిచేశారు. ఇటలీ–చైనా సముద్ర జలాల వివాదాలపై 1996 నుంచి మధ్యవర్తిగా వ్యవహరించారు. భారత ప్రధానులుగా చేసిన ఐదుగురితో కలసి పనిచేశారు. రాజ్యాంగ అంశాలపై సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. స్థానిక సంస్థలు, మానవహక్కులు, న్యాయపరమైన పలు రాజ్యాంగ సవరణలు తీసుకురావడంలో జస్టిస్ పీసీ రావు సేవలున్నాయి. రాజ్యాంగ అంశాలపైనే కాకుండా మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ చట్టాలపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది. జస్టిస్ పీసీ రావు మరణ వార్త తెలియగానే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ జస్టిస్ పీసీ రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అమెరికా నుంచి కుమార్తెలు వచ్చాక ఆదివారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జస్టిస్ పీసీ రావు అంత్యక్రియలు జరుగనున్నాయి. -
‘పద్మభూషణ్’ దుర్వినియోగంపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ శాంతారాం బల్వంత్ మజుందార్ తన పేరు ముందు పద్మభూషణ్ బిరుదును ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, శాంతారాం బల్వంత్ మజుందార్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మభూషణ్‌ను శాంతారాం మజుందార్ దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో అవార్డును వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాది వై.శ్రీధర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ కన్నుమూత
మంగళూరు : ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ షెనాయ్ నిన్న (మంగళవారం) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేరళలోని ఎర్నాకుళంలో జనించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించారు. జర్నలిజంలో షెనాయ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2003లో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. షెనాయ్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలియజేశారు. వృత్తిలో భాగంగా ఎక్కువ కాలం ఢిల్లీలోనే గడిపిన షెనాయ్ కేరళకు ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించారని విజయన్ అన్నారు. కాగా షెనాయ్ కుమార్తె సుజాత యూఎస్‌లో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. -
ఆర్మీ అధికారులకు ధోని స్పెషల్ మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్‌లో ‘భారత మూడో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆర్మీ దుస్తుల్లో అందుకోవడంతో నా సంతోషం పదిరెట్లు అయింది. మీ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి.. దేశ పౌరులు రాజ్యాంగ హక్కులను స్వేచ్చగా వినియోగించుకునేలా.. దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులందరికీ ధన్యవాదాలు. జైహింద్’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ధోని పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ధోని ఆర్మీ దుస్తుల్లో వచ్చి కవాతు చేస్తూ మరి అవార్డు స్వీకరించాడు. 2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. అయితే కెప్టెన్‌గా ధోని సరిగ్గా ప్రపంచకప్ అందించిన రోజే ఈ అత్యున్నత పురస్కారం అందుకోవడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మీరు మాకెప్పుడు ఆదర్శమేనంటూ’.. కామెంట్ చేస్తున్నారు. ఆర్మీ డ్రెస్‌లో ఉన్న ధోని కూతురు జీవాకు ఆర్మీ క్యాప్ పెట్టి ఉన్న ఫొటోను ఈ పోస్ట్‌కు ట్యాగ్ చేశాడు. ఈ ఫొటో సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది. An honour to get the Padma Bhushan and receiving it in Uniform increases the excitement ten folds.thanks to all the Men and Women in Uniform and their families for the Sacrifices they make so that all of us could enjoy our Constitutional Rights.Jai Hind A post shared by @ mahi7781 on Apr 2, 2018 at 11:36pm PDT -
ధోని... ఇప్పుడు ‘పద్మభూషణ్’
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు. ధోని సిక్సర్‌తో వన్డే ప్రపంచకప్ అందించిన రోజు. ఇపుడు సరిగ్గా ఏడేళ్ల తర్వాత మళ్లీ ఏప్రిల్ 2న ధోని ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నాడు. భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును మాజీ కెప్టెన్ ఆర్మీ డ్రెస్‌లో అందుకోవడం మరో విశేషం. సోమవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) అయిన ధోని... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకునేందుకు మిలిటరీ డ్రస్‌లో వచ్చాడు. 2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. రెండు ఆసియా గేమ్స్ (2006, 2010)లలో భారత్‌కు బంగారు పతకాలు అందించడంతోపాటు కెరీర్లో మొత్తం 19 సార్లు వివిధ ఫార్మాట్లలో ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి కూడా రాష్ట్రపతి ‘పద్మభూషణ్’ అవార్డు అందజేశారు. -
పద్మభూషణ్ అవార్డు అందుకున్న ధోని
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు ధోని భారత్‌కు ప్రపంచకప్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు ధోని దేశ మూడో అత్యున్నత పురస్కారం అందుకోవడం విశేషం. దీంతో ఏప్రిల్ 2 ధోనికి అతని అభిమానులకు ఓ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని అద్భుత సిక్సుతో భారత అభిమానుల కల సాకారమైంది. ధోని భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం గతంలోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
పద్మభూషణ్ అవార్డు అందుకున్న ధోని, పంకజ్ అద్వాని
-
ప్రపంచకప్ అందించిన రోజే పద్మభూషణ్!
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అతని అభిమానులకు ఏప్రిల్ 2 ఓ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోని.. ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నాడు. రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో ధోనీని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించనుంది. ధోనీతోపాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ కూడా పద్మ భూషణ్ అందుకోనున్నాడు. ఇక గత మార్చి 20న తొలి బ్యాచ్‌కు ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. క్రీడల విభాగంలో టెన్నిస్ ఆటగాడు సోమదేవ్ దేవర్మన్, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్, 1972 పారాలింపిక్స్ స్వర్ణ విజేత, స్మిమ్మర్ మురళీకాంత్ పటేకర్లు ఈ అవార్డులు అందుకున్నారు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. 2011, ఏప్రిల్ 2న ధోనీ సారథ్యంలోని టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు ధోని దేశ మూడో అత్యున్నత పురస్కారం అందుకోవడం విశేషం. ధోని భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం గతంలోనే పద్మశ్రీతో సత్కరించింది. -
ఆ మాట నాకు పద్మభూషణ్‌తో సమానం – విజయ నిర్మల
‘‘అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో సినిమా తీసిన ఏకైక లేడీ డైరెక్టర్ విజయనిర్మల. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 44 చిత్రాల్లో సగానికిపైగా సినిమాల్లో నేను నటించినందుకు సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. నటి–దర్శక–నిర్మాత విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో మంగళవారం జరిగాయి. కృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏడాది మా ఇంటికి విచ్చేసి, అభిమానాన్ని చాటుకొంటున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గౌరవించిన విజయనిర్మలను త్వరలోనే భారత ప్రభుత్వం తగిన రీతిలో సత్కరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఒకసారి దాసరి నారాయణరావుగారు మా ఇంటికొచ్చారు. నా పుట్టినరోజు వేడుకలకు అభిమానులు రావడం చూసి.. ‘ఏ స్టార్ హీరోయిన్‌కీ ఈ రేంజ్ క్రేజ్ లేదు’ అన్నారు. ఆ మాట నాకు పద్మభూషణ్ అవార్డుతో సమానం’’ అన్నారు విజయ నిర్మల. ‘‘దాసరి, బాపు వంటి టాప్ డైరెక్టర్స్ తొలి హీరోయిన్ విజయనిర్మలగారు. విజయశాంతిలాంటి స్టార్ హీరోయిన్ని ‘కిలాడి కృష్ణుడు’తో తెలుగు తెరకు పరిచయం చేసిన విజయనిర్మలగారి పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములవడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత బి.ఏ.రాజు. 73వ పుట్టినరోజు సందర్భంగా ‘మా’ అసోసియేషన్‌కు విజయనిర్మల 73 వేల రూపాయల చెక్ అందించారు. నటుడు నరేశ్, హీరో నవీన్ విజయ్‌కృష్ణ, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, సురేశ్ కొండేటి పాల్గొన్నారు. -
ఇళయరాజాకు పద్మవిభూషణ్
న్యూఢిల్లీ: 2018 సంవత్సరానికి 85 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులు, అద్భుతమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నా ఇన్నాళ్లుగా సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలకు పద్మ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా (74)తో పాటుగా హిందుస్తానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం (కన్యాకుమారి) అధ్యక్షుడు పరమేశ్వరన్‌లు కూడా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2009లో ఇళయరాజా పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ జాబితాలో పేదలకు సేవ చేసిన వారికి, ఉచిత పాఠశాలలు ఏర్పాటుచేసిన వారికి గిరిజన కళలకు ప్రపంచ ప్రఖ్యాతి అందించిన వారికి చోటు కల్పించింది. పద్మ భూషణ్ జాబితాలో ప్రముఖులు పద్మ భూషణ్ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్రపంచ చాంపియన్ పంకజ్ అడ్వాణీ, గోవా చిత్రకారుడు లక్ష్మణ్ పాయ్, ఆధ్యాత్మికవేత్త ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్, పురాతత్వవేత్త రామచంద్రన్ నాగస్వామిసహా తొమ్మిది మంది ఉన్నారు. సామాజికసేవ, ప్రజాసంబంధాలు, ఇంజనీరింగ్, వాణిజ్య, విద్య, వైద్య, సాహిత్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలందించిన 73 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కరే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. అభయ్ బంగ్–రాణిబంగ్ (సంయుక్తంగా వైద్యరంగం)–మహారాష్ట్ర, దామోదర్ గణేశ్ బాపత్ (సామాజికసేవ)–ఛత్తీస్‌గఢ్, సైకోమ్ మీరాబాయ్ చాను (వెయిట్‌లిఫ్టింగ్)– మణిపూర్ తదితరులు పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని వారికి సరైన గౌరవం కల్పిస్తామని చెబుతూ వస్తు న్న కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు తగ్గట్లుగా నే.. సామాజిక సేవ చేస్తున్న వారికి పద్మశ్రీ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది. అవార్డు గ్రహీతల్లో విదేశీయులు! ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 16 మంది విదేశీ, ఎన్నారై ప్రతినిధులున్నారు. ఇందులో ముగ్గురు మరణానంతరం పద్మ అవార్డులు అందుకోనున్నారు. భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడాకిన్‌కు (మరణానంతర) పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. వాణిజ్యరంగంలో సేవలకు గానూ ఫిలిప్పీన్స్‌కు చెందిన జోస్ మాజోయ్, మలేసియాకు చెందిన నృత్యరంగ ప్రముఖుడు రామ్లీ బిన్ ఇబ్రహీం, బౌన్లాప్ కియోకంగ్నా (లావోస్), టామీ కో (సింగపూర్), హున్ మెనీ (కంబోడియా), నౌఫ్ మార్వై (సౌదీ అరేబియా), తోమియో మిజోకమి (జపాన్), సోమ్డెట్ ఫ్రా మా (థాయ్‌లాండ్), థాంట్ మైయింట్ (మయన్మార్), ఐ న్యోమన్ నౌతా (ఇండోనేసియా), మలై హాజీ అబ్దుల్లా (బ్రూనై దారుస్సలాం), హబీబుల్లో రాజా బౌ (తజకిస్తాన్), డాక్టర్ సందుక్ రుయిత్ (నేపాల్), ఎన్గుయెన్ తీన్ (వియత్నాం)లు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ విజేతలు పద్మవిభూషణ్: ఇళయరాజా (సంగీతం)–తమిళనాడు, గులాం ముస్తఫాఖాన్ (సంగీతం)–మహారాష్ట్ర, పరమేశ్వరన్ పరమేశ్వరన్ (సాహిత్యం, విద్యారంగం)– కేరళ. పద్మ భూషణ్: మహేంద్ర సింగ్ ధోనీ (క్రికెట్)–జార్ఖండ్, పంకజ్ అడ్వాణీ (బిలియర్డ్స్)– కర్ణాటక, ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్ (ఆధ్యాత్మికం)–కేరళ, అలెగ్జాండర్ కడాకిన్ (ప్రజాసంబంధాలు)–రష్యా (మరణానంతర/విదేశీ), రామచంద్రన్ నాగస్వామి (పురాతత్వ విభాగం)–తమిళనాడు, వేదప్రకాశ్ నంద (సాహిత్యం, విద్యారంగం)–అమెరికా, లక్ష్మణ్ పాయ్ (కళారంగం)–గోవా, అరవింద్ పారిఖ్ (సంగీతం)–మహారాష్ట్ర, శారదాసిన్హా (సంగీతం)–బిహార్. మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో కొందరు లక్ష్మీ కుట్టి: కేరళకు చెందిన గిరిజన మహిళ ఈమె. 500 రకాల మూలికలతో మందులను తయారుచేసి వేల మంది గిరిజనులకు వైద్యసాయం అందిస్తున్నారు. కొండల్లో ఉంటూ పాముకాటుకు గురైన వారికి ప్రాథమిక వైద్యంతో ప్రాణాలు కాపాడుతున్నారు. కేరళ ఫోక్లోర్ అకాడమీలో చదువు చెప్పే లక్ష్మి కుట్టి.. అడవిలో గిరిజనులతో కలిసి తాటిచెట్టు ఆకులతో చేసిన చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. అరవింద్ గుప్తా: ఐఐటీ కాన్పూర్‌లో విద్యనభ్యసించారు. చెత్తనుంచి సైన్స్‌ను నేర్చుకోవటంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్నారు. నాలుగు దశాబ్దాల్లో 3వేల పాఠశాలలను సందర్శించి.. పనికిరాని వస్తువుల సాయంతో బొమ్మలను రూపొందించటంపై 18 భాషల్లో 6,200 లఘుచిత్రాలను రూపొందించారు. 1980ల్లో తరంగ్ పేరుతో విద్యార్థులకోసం టీవీషోను నిర్వహించారు. భజ్జు శ్యామ్: అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన గోండు చిత్రకారుడు భజ్జు శ్యామ్. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన భజ్జు శ్యామ్ రాత్రి వాచ్‌మన్‌గా, ఎలక్ట్రిషియన్‌గా కుటుంబ పోషణ చేసేవారు అనంతరం ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా యురప్‌లో గోండు పెయింటింగ్స్ (మధ్యప్రదేశ్‌లోని గిరిజన సంప్రదాయ చిత్రకళ) ద్వారా ప్రాముఖ్యత సంపాదించారు. ఐదు విదేశీ భాషల్లో ఈయన రూపొందించిన ‘ద లండన్ జంగిల్ బుక్’ 30వేల కాపీలు అమ్ముడుపోయింది. సుధాంషు బిశ్వాస్: 99 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు. ఇప్పటికీ పేదల సేవలోనే జీవితాన్ని గడుపుతున్నారు. వీరికోసం పాఠశాలలు, అనాథాశ్రమాలు ఏర్పాటుచేశారు. మురళీకాంత్ పేట్కర్: 1965 భారత్–పాక్ యుద్ధంలో భుజం తెగిపడినా తెగువప్రదర్శించారు. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించారు. ఎమ్ఆర్ రాజగోపాల్: కేరళలో సుపరిచితమైన వైద్య ప్రముఖుడీయన. నవజాత శిశువులకు సంబంధించిన వైద్యం ఈయన ప్రత్యేకత. సుభాషిణి మిస్త్రీ: గ్రామీణ పశ్చిమబెంగాల్లోని పేద మహిళ. ఈమె 20 ఏళ్లపాటు ఇళ్లలో పాచిపని, రోజూవారీ కూలీగా పనిచేసి పేద ప్రజల కోసం హాస్పిటల్ కట్టించారు. రాజగోపాలన్ వాసుదేవన్: భారత్‌లో ప్లాస్టిక్ రోడ్ల తయారీతో ఈయన ప్రాచుర్యం పొందారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను నిర్మించటంలో సృజనాత్మక పద్ధతుల్లో ప్రయత్నించినందుకు పెటెంట్ కూడా పొందారు. -
‘పద్మ భూషణ్’ ధోని, పంకజ్
న్యూఢిల్లీ: తన నాయకత్వ పటిమతో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన మేటి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని... క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో ప్రపంచ టైటిల్స్‌ను అలవోకగా సాధించే అలవాటున్న భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కేంద్ర ప్రభుత్వం అం దించే దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’కు ఎంపికయ్యారు. మరో నలుగురు క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్–ఆంధ్రప్రదేశ్), సోమ్‌దేవ్ (టెన్నిస్–త్రిపుర), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్–మణిపూర్), మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్–మహారాష్ట్ర)లకు ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. జార్ఖండ్‌కు చెందిన 36 ఏళ్ల ధోని కెప్టెన్సీలో భారత్ టి20 వరల్డ్ కప్ (2007లో), వన్డే వరల్డ్ కప్ (2011లో), చాంపియన్స్ ట్రోఫీ (2013లో) టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధోని 2014లో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో ‘పద్మశ్రీ’ పురస్కారం గెల్చుకున్న ధోని ప్రస్తుతం వన్డే, టి20 ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల పంకజ్ అద్వానీ ఇప్పటివరకు 18 ప్రపంచ టైటిల్స్ సాధించాడు. గతేడాది వరల్డ్, ఆసియా స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2009లో ‘పద్మశ్రీ’ అవార్డు పొందిన పంకజ్ 2006లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... 2004లో ‘అర్జున అవార్డు’ కూడా పొందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ గతేడాది అద్వితీయ ప్రదర్శన చేశాడు. నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ (ఇండో నేసియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల మీరాబాయి చాను గతేడాది ప్రపంచ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 1995లో కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రెండో లిఫ్టర్‌గా ఆమె గుర్తింపు పొందింది. త్రిపురకు చెందిన 32 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 2010 కామన్వెల్త్ గేమ్స్, 2010 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన సోమ్‌దేవ్ డేవిస్‌కప్‌లో గొప్ప విజయాలు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 70 ఏళ్ల స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ 1972 పారాలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో 37.33 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు సృష్టించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడిగా చరిత్ర లిఖించారు. -
‘పద్మభూషణ్’ సింధు!
న్యూఢిల్లీ: గతేడాది రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును కేంద్ర క్రీడా శాఖ ‘పద్మభూషణ్’ పురస్కారం కోసం ప్రతిపాదించింది. ‘దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం కోసం సింధు పేరును మేం ప్రతిపాదించాం’ అని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2015లోనే ఆమె పద్మశ్రీ పురస్కారం పొందింది. వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2013, 2014) కాంస్యాలు సాధించిన 22 ఏళ్ల సింధు ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్‌ను కనబరుస్తోంది. గతేడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లతో పాటు గత నెలలో గ్లాస్గో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం అందుకుంది. ఇక ఈనెలలో కొరియా ఓపెన్ రూపంలో కెరీర్లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే మూడుసార్లు మకావు ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది భారత్‌లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఈ సూపర్ షో కారణంగా గత వారం తిరిగి ప్రపంచ రెండో ర్యాంకర్ స్థానాన్ని దక్కించుకుంది. 2014లో సింధు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్, ఇంచియోన్ ఆసియా గేమ్స్, ఉబెర్ కప్, ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు అందుకుంది. క్రీడా శాఖకు కృతజ్ఞతలు... ‘పద్మభూషణ్’ కోసం తన పేరును ప్రతిపాదించడంపై తెలుగు తేజం సింధు సంతోషం వ్యక్తం చేసింది. ‘పద్మభూషణ్‌కు నా పేరును ప్రతిపాదించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో కేంద్ర క్రీడా శాఖకు కృతజ్ఞతలు’ అని ఈ హైదరాబాదీ ప్లేయర్ తెలిపింది. అలాగే సింధు తండ్రి పీవీ రమణ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు. -
‘పద్మభూషణ్’కు ధోని
న్యూఢిల్లీ: దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. ‘ఈసారి పద్మ పురస్కారాల కోసం బీసీసీఐ ధోని పేరును మాత్రమే ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. భారత జట్టు వన్డే అత్యుత్తమ ఆటగాళ్లలో అతను ఒకడు. వన్డేల్లో దాదాపు పది వేల పరుగులు చేయడంతోపాటు 90 టెస్టులు ఆడాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఈ అవార్డుకు ధోనిని మించిన వారు కనిపించలేదు’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు. గతంలో కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, చందూ బోర్డే, దేవధర్, సీకే నాయుడు, లాలా అమర్నాథ్, రాజా భళీంద్ర సింగ్, విజయ ఆనంద్ ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు. -
పద్మభూషణ్‌కి విజయనిర్మలగారి పేరును ప్రతిపాదిస్తాం
– తలసాని శ్రీనివాస యాదవ్ ‘‘విజయనిర్మలగారు గొప్ప నటి. మంచి దర్శకురాలు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ ఆమె. విజయనిర్మలగారి పేరును పద్మభూషణ్ పురస్కారానికి ప్రభుత్వం తరపున సిఫార్సు చేయనున్నాం’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, దర్శకురాలు, నటి విజయ నిర్మలకు రాయల్ అకాడమీ డాక్టరేట్‌ను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణ, విజయనిర్మలను శాలువాతో సత్కరించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేశ్, ఇతర సభ్యులు శ్రీకాంత్, వేణు మాధవ్, హేమ తదితరులు పాల్గొన్నారు. -
చిత్రసీమ తలలో నాలుక
అక్షర తూణీరం బాలు గొంతుతో నటిస్తున్నాడని కొందరు ఆక్షేపించారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ. ఇండియన్ సినిమా శత వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో గానగంధర్వుని విశిష్ట పురస్కారంతో సన్మానించ నున్నారు. సినిమా శతాబ్ది చరిత్రలో అర్ధ శతాబ్దిని ఇప్పటిదాకా ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం తన స్వరంతో శ్వాసించారు. ఆనక శాసించారు. గడచిన యాభై ఏళ్లలో వచ్చిన అనేక భారతీయ సినిమా రీళ్లను పరిశీలిస్తే, వాటి సౌండ్‌ట్రాక్స్‌లో బాలు వినిపి స్తారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ.. మరి కొన్ని భాషలలో నలభై వేల పాటలు పాడారు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. పద్మభూషణుడైనారు. ప్రముఖ సంగీత దర్శకులు కోదండపాణి దీవెనలతో చిత్రసీమలో బాలు అడుగు పెట్టారు. అప్పటినుంచీ అడుగులు వేస్తూనే ఉన్నారు. ప్రజాకోటి ఆయన అడుగులకు మడుగులొత్తుతూనే ఉంది. తొలినాళ్లలో అంటే అర్ధ శతాబ్దికి పూర్వం ఆయన పాడిన ఏమి ఈ వింత మోహం, ఓహోహో బంగారు పిచ్చుకా, మేడంటే మేడా కాదు లాంటి ఎన్నో పాటలు నేటికీ కొత్త చిగుళ్లుగానే అలరిస్తున్నాయి. ‘‘రావ మ్మా మహాలక్ష్మీ రావమ్మా’’ పాటలో ఆర్ద్రత తొణికిసలాడుతుంది. మొదట్నించీ పాట సాహిత్య సౌరభాన్ని తన పలుకు బడితో మరింతగా గుబాళింపచేయడం బాలు అలవరచుకున్నారు. తేనెలో కల కండ పలుకులు కలసి ప్రవహిస్తున్నట్టుంటుంది ఆ స్వరం. కలకండ పలుకులు ఉచ్ఛా రణలో సుస్పష్టత కోసం నిలిచాయి. మకరందం మాధుర్యాన్నిచ్చింది. ఆ తరం కవుల నుంచి ఈనాటి కవులదాకా తమ గీతాన్ని బాలు పాడాలని అభిలషిస్తారు. తమ సాహి త్యానికి న్యాయం జరుగుతుందని అలా ఆశ పడతారు. దర్శకునిగా బాపు రెండో చిత్రం బంగారు పిచిక. అందులో బాలుని కథానాయకుడుగా, ఓ ప్రసిద్ధ యువ రచయిత్రిని హీరో యిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇతరేతర కార ణాలవల్ల ఆ కథ అలా నడవలేదు. బాలు మంచి రూపు అని చెప్పడానికి ఈ పాత నిజం చెప్పాను. బాలు జీనియస్. లలితలలితమైన కంఠస్వరంతో సునామీని సృష్టించాడు. చాలా మంది ఆనాటి గాయకుల్ని తోసిరాజన్నాడు. గళంలో వైవిధ్యాన్ని చూపాడు. కొందరు గొంతుతో నటిస్తున్నాడని ఆక్షేపించారు. నాలాంటి సగటు శ్రోతలు పర్వాలేదన్నారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు పండితులు ప్రజల్ని హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ. అర్జున ధనుష్ఠంకారం, అక్షయ తూణీరంలోని అమ్ముల్లా తరగని పాటలు బాలుకి పేరు తెచ్చిపెట్టాయి. పద్మశ్రీ తుర్ల పాటి దశకంఠునిగా అభివర్ణించి, శ్లాఘించారు. ‘‘హీరోలకి, కమెడియన్లకి, కానివారికి, అయిన వారికి ఇలాగ సినిమాలో అందరికీ ఈయనే పాడేస్తున్నాడు బాబోయ్!’’ అంటూ ఒకాయన గావుకేక పెడితే, హీరోయిన్లని వదిలేశాడు సంతోషించమని మరొకాయన శాంతపరిచాడు. బాలు పాడిన గొప్ప పాటల్ని ఏకాక్షరంతో గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. ఏకవీర పాటల్ని మరచిపోలేం. ప్రతి రాత్రి వసంత రాత్రి పాట బాలు, ఘంటసాలల యుగళగీతం. వారిద్దరినీ కలిపి ఆస్వాదించడం ఓ గొప్ప అనుభవం. బాల సుబ్రహ్మణ్యం గాయకుడు, నిర్మాత, గాత్రదాత, నటుడు, సంగీత దర్శకుడు, స్నేహశీలి, సరసుడు ఇంకా అన్నీను. స్నేహానికి పోయి ఎడంవైపున, సొంతానికి పోయి కుడివేపున చేవ్రాళ్లు చేసి, ఆనక పాటలు పాడుకుంటూ అప్పులు తీర్చే భాగ్యశాలి బాలు. మిగిలినవన్నీ ఒక ఎత్తు, పాడుతా తీయగాతో ఆయన నడుపుతున్న పాటశాల ఒక ఎత్తు. మిథునంలో అప్పదాసు పాత్ర ధరించి నాకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఇంకా ఎన్నో చెప్పాలి. ఆయన తగని మొహమాటస్తుడు, తగిన మర్యాదస్తుడు. ‘‘బాలు మగపిల్లాడుగా పుట్టాడు కాబట్టి సరిపోయింది. ఆ మోహ రూపుకి ఆడపిల్లగా పుడితే... పాపం చాలా ఇబ్బందయేదని’’ బాపు తరచూ ఆనందించేవారు. శతమానం భవతి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పద్మభూషణ్‌కు పంకజ్ పేరు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును మరోసారి ప్రతిపాదించారు. గతేడాది కూడా అతడి పేరును భారత బిలియర్డ్అండ్ స్నూకర్ సమాఖ్య (బీఎస్ఎఫ్ఐ) పంపించింది. ‘వరుసగా రెండో ఏడాది కూడా పంకజ్ పేరును మేం ప్రతిపాదించాం. అతడు కచ్చితంగా ఈ పురస్కారానికి అర్హుడు. ఈసారి మాకు నిరాశ కలగదనే అనుకుంటున్నాం’ అని బీఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఎస్.బాలసుబ్రమణియన్ తెలిపారు. పంకజ్‌కు గతంలో పద్మశ్రీ, ఖేల్త్న్ర, అర్జున అవార్డులు దక్కాయి. క్వార్టర్స్‌లో అద్వానీ : బ్యాంకాక్‌లో జరుగుతున్న సాంగ్సోమ్ 6 రెడ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. గ్రూప్ దశలో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంకజ్ ... ప్రిక్వార్టర్స్‌లో యువాన్ సిజున్ (చైనా)పై 5-4తో గెలిచాడు. -
నా కెరీర్ ఏమవుతుందో : సుశీల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తనకు అవకాశం కల్పించక పోవడంపై భారత రెజ్లర్ సుశీల్ కుమార్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో భారత్‌కు పతకాలు అందించిన ఏకైక ప్లేయర్ సుశీల్. రియో వివాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. రియోలో పాల్గొనక పోవడం తన కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. రియో ఒలింపిక్స్ కోసం ఎంతగానో శ్రమించానని చెప్పాడు. వరుసగా మూడో ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి తన వంతుగా మూడో పతకం సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేరలేదని వాపోయాడు. దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తన పేరును ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ ఇప్పటికైనా తన విజయాలను గుర్తించిందన్నాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ డోపీగా తేలడంతో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ దత్ రజతానికి అప్ డేట్ అవడంపై సుశీల్ స్పందించాడు. యోగేశ్వర్ కు అభినందనలు తెలిపాడు. ఆ పతకం కుదుకోవ్ కుటుంబం వద్ద ఉంటడమే కరెక్ట్ అని చెప్పి యోగేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నాడని ప్రశంసించాడు. 74 కేజీల విభాగంలో భారత్ నుంచి నర్సింగ్ యాదవ్ ను రియోకు పంపించగా నాటకీయ రీతిలో డోపింగ్ కారణాలతో అవకాశం ఇవ్వకపోగా, నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
పద్మభూషణ్‌కు సుశీల్ పేరు
న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేశారు. వ్యక్తిగత విభాగంలో రెండు సార్లు ఒలింపిక్స్ పతకం అందుకున్న ఏకై క అథ్లెట్‌గా 33 ఏళ్ల సుశీల్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే సుశీల్‌తో పాటు అతడి కోచ్ యశ్వీర్ సింగ్, మహిళా రెజ్లర్ అల్కా తోమర్ పేర్లను కూడా దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) ప్రతిపాదించింది. ఈ మగ్గురి పేర్లను గత నెలలోనే కేంద్రానికి పంపినట్టు సమాఖ్య సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. రెండేళ్ల క్రితమే సుశీల్ పేరును ఈ పురస్కారానికి పంపినా తిరస్కరించారు. -
కనువిందుగా పద్మ అవార్డుల ప్రదానం
56 మంది ప్రముఖులకు అందించిన రాష్ట్రపతి పురస్కార గ్రహీతల్లో 8 మంది తెలుగువారు న్యూఢిల్లీ: రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పురస్కారాల్ని అందచేశారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు దివంగత ధీరుభాయ్ అంబానీ తరఫున ఆయన సతీమణి కోకిలాబెన్ పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. కుమారులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీలతో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగువారైన ప్రముఖ కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి, అమెరికాకు చెందిన భారతీయ ఆర్థికవేత్త అవినాష్ కమలాకర్ దీక్షిత్, జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, శ్రీశ్రీ రవిశంకర్‌లు పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు, ప్రఖ్యాత వైద్యుడు డి. నాగేశ్వర్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో పాటు ప్రముఖ శిల్పి హఫీజ్ సొరబ్ కాంట్రాక్టర్, సంపాదకుడు బర్జీందర్ సింగ్ హమ్దర్ద్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, పారిశ్రామిక వేత్త పల్లోంజి షాపూర్జీ మిస్త్రీ, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్‌లు పద్మభూషణ్ అందుకున్నారు. 43 మందికి పద్మశ్రీ పురస్కారాలను బహూకరించారు. తెలుగువారైన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు యార్లగడ్డ నాయుడమ్మ, సంఘసంస్కర్త టీవీ నారాయణ, గుండె వ్యాధి నిపుణుడు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, చిత్రకారుడు కలాల్ లకా్ష్మగౌడ్లు రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీలు స్వీకరించారు. ఇస్రో శాటిలైట్ కేంద్ర డైరక్టర్ ఎం.అన్నాదురై, దర్శకుడు మధుర్ భండార్కర్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్‌పాల్ సింగ్, ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్, హర్మోనియం విద్వాంసుడు పండిట్ తులసీదాస్ బోర్కర్లు, ఆర్చర్ దీపికా కుమారి , జానపద గాయని మాలిని అశ్వతిలు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 112 మంది ప్రముఖులకు పద్మ అవార్డుల్ని ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రజనీకాంత్, సానియా మీర్జా, ప్రియాంకాచోప్రా తదితరులకు పద్మ పురస్కారాలు బహూకరిస్తారు. గ్యాస్ట్రో ఎంటరాలజీకి దక్కిన గౌరవం: డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పద్మభూషణ్‌ను తనకు గుర్తింపుగా కాకుండా గ్యాస్ట్రో ఎంటరాలజీకి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశంలో పేద ప్రజలకే ఎక్కువ శాతం గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు వస్తున్నాయని, అతి తక్కువ ఖర్చుతో వైద్యం కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ట్రిక్ జబ్బులపై సమగ్ర సర్వేను కేంద్ర ప్రభుత్వానికి అందించామని తెలిపారు. యువత పరిశోధనపై దృష్టి పెట్టాలి: డాక్టర్ ఆళ్ల వెంకట రామారావు దేశ యువత పరిశోధనా రంగంపై దృష్టి సారించాలని డాక్టర్ ఆళ్ల వెంకట రామారావు అన్నారు. అమెరికా కంటే భారత్‌లోనే తక్కువ ధర కు జనరిక్ మందులు దొరుకుతున్నాయని, పెరుగుతున్న పరిశోధనల వల్లే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. -
కేన్సర్, ఆల్జీమర్స్‌కు కొత్త మందుల గుర్తింపు
♦ త్వరలో క్లినికల్ ట్రయల్స్ ♦ ఐదేళ్లలో అందుబాటులోకి ♦ ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సాక్షి, హైదరాబాద్: కేన్సర్, ఆల్జీమర్స్ చికిత్సకు ఉపయోగపడే రెండు కీలకమైన రసాయనాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) గుర్తించినట్లు సంస్థ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ రెండు రసాయనాల క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని మరో ఐదేళ్లలో అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. ఐఐసీటీలో మాజీ డెరైక్టర్ డాక్టర్ ఎ.వి.రామారావుకు పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా బుధవారం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఈ రెండు కొత్త మందులను గుర్తించినట్లు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో అనుభవమున్న భాగస్వామితో కలసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారతీయులకు తక్కువ ఖర్చుతో మందులు అందించే షరతుతో దీనికి అవసరమైతే భాగస్వామ్య కంపెనీకి తమ పేటెంట్‌ను లీజ్‌కు ఇస్తామని చెప్పారు. ప్రపంచస్థాయి పరిశోధనలకే ప్రాధాన్యం: డాక్టర్ ఏవీ రామారావు శాస్త్రవేత్తగా, ఐఐసీటీ డెరైక్టర్ హోదాలోనూ తన ఆలోచనలు అంతర్జాతీయ స్థాయి, లేదా సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేపట్టడంపైనే ఉండేవని... ఆ శ్రమకు, క్రమశిక్షణకు గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చిందని భావిస్తున్నట్లు డాక్టర్ ఎ.వి.రామారావు తెలిపారు. రిటైర్మెంట్ తరువాత కూడా ఇతరులకు సాధ్యం కాని పనులు మాత్రమే చేయాలన్న స్ఫూర్తిని ఆవ్రా లేబొరేటరీస్ ద్వారా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పద్మభూషణ్ లభించిన సందర్భంగా ఐఐసీటీ ఉద్యోగులు తనను సత్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పూణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీ నుంచి ఐఐసీటీ డెరైక్టర్‌గా, శాస్త్రవేత్తగా తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో సీసీఎంబీ మాజీ డెరైక్టర్ డాక్టర్ బాలసుబ్రమణియన్, ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నగరానికి పద్మాభిషేకం
పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డుల పంట కొంతమందికి పద్మశ్రీ అవార్డులు సిటీబ్యూరో : భాగ్యనగరంలో ‘పద్మా’లు వికసించాయి. వివిధ రంగాల్లో మహోన్నత సేవలందించిన ప్రముఖులకు కేంద్రం సోమవారం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులు అందుకున్న వారిలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. సాహిత్యం, పాత్రికేయ రంగంలో అపార సేవలందించినందుకు‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును ‘పద్మవిభూషణ్’తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. సీనియర్ వైద్య నిపుణులు, ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్ ప్రొఫెసర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘పద్మ భూషణ్’ వరిం చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్,టెన్నిస్ తార సానియా మీర్జాలకూ ‘పద్మ విభూషణ్’ అవార్డు లభించింది. ప్రముఖ చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్, కార్డియో థొరాసిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మన్నం గోపీచంద్, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సునీత కృష్ణన్, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ టీవీ నారాయణలకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా లభించిన ఈ అవార్డులతో హైదరాబాద్ మురిసింది. అవార్డులు అందుకున్న ప్రముఖుల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి. ఇద్దరు క్రీడాకారులు సానియా, సైనాలకు అవార్డులు లభించడం పట్ల క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు వైద్య నిపుణులు, సామాజిక సేవా రంగానికి సైతం సముచితమైన గౌరవం లభించడంతో అంతటా సంతోషం వ్యక్తమైంది. -
‘పద్మ భూషణ్’ సానియా, సైనా
♦ ఇద్దరు మేటి క్రీడాకారిణులకు ♦ దేశ మూడో అత్యున్నత పురస్కారం ♦ ఆర్చర్ దీపిక కుమారికి ‘పద్మశ్రీ’ న్యూఢిల్లీ: గతేడాది తమ అద్వితీయ ఆటతీరుతో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారత స్టార్ క్రీడాకారిణులు సానియా మీర్జా (టెన్నిస్), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్)లకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన ‘పద్మ భూషణ్’ను ఫ్రకటించింది. వీరిద్దరితోపాటు గత సంవత్సరం నిలకడగా రాణించిన మహిళా ఆర్చర్ దీపిక కుమారికి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో... సైనా నెహ్వాల్ మంగళవారం మొదలయ్యే సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇప్పటికే తమ కెరీర్లో అర్జున అవార్డు, పద్మశ్రీ, రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర పురస్కారాలను సంపాదించిన ‘హైదరాబాద్ క్రీడా ఆణిముత్యాలు’ సానియా, సైనాల ఖాతాలో మరో గౌరవం చేరడం విశేషం. జైత్రయాత్ర... గత సంవత్సరం సానియా మీర్జా తన కెరీర్లోనే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. ఏకంగా 10 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకుంది. స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో జతకట్టిన తర్వాత ఈ హైదరాబాదీ మహిళల డబుల్స్‌లో అప్రతిహత విజయాలు సాధించింది. బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఒక టైటిల్‌ను సాధించిన సానియా... హింగిస్‌తో కలిసి తొమ్మిది టైటిల్స్‌ను చేజిక్కించుకుంది. ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ కూడా ఉండటం విశేషం. ఓవరాల్‌గా గతేడాది సానియా 65 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సూపర్ సైనా... ఇక బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ కూడా గతేడాది చిరస్మరణీయ విజయాలు దక్కించుకుంది. సొంతగడ్డపై సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌తో సీజన్‌ను ప్రారంభించిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచింది. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంతో సైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అనంతరం ఎంతోకాలంగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని సైనా తన ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో సైనా ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సంపాదించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అదిరిన ‘గురి’ ఆర్చరీలో దీపిక కుమారి కూడా గొప్ప విజయాలు సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన సహచరులు రిమిల్ బురులీ, లక్ష్మీరాణిలతో కలిసి దీపిక టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజత పతకాన్ని అందించింది. దాంతోపాటు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జార్ఖండ్‌కు చెందిన దీపిక వరల్డ్ కప్ ఫైనల్లో రజతం, వరల్డ్ కప్ స్టేజ్-2 టోర్నీలో, ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచింది. పద్మ భూషణ్ లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తుంది. -సానియా ఈ పురస్కారాన్ని నేనూహించలేదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని కలిగించింది. 25 ఏళ్లకే ఈ అవార్డును పొందిన నేను భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించేందుకు ఉత్సాహాన్నిస్తుంది. -సైనా పద్మశ్రీ రావడం నమ్మలేకపోతున్నాను. ఈ పురస్కారాన్ని నా కుటుంబ సభ్యులకు, కోచ్‌లకు అంకితం ఇస్తున్నాను. 2012లో అర్జున అవార్డు వచ్చినపుడు నాన్నతో కలిసివెళ్లి పురస్కారాన్ని అందుకున్నాను. ఈసారి నా తల్లిదండ్రులిద్దరినీ వెంట తీసుకెళతాను. -దీపిక -
రజనీ, సైనా, సానియాకు 'పద్మ' అవార్డులు
న్యూఢిల్లీ: తెలుగు తేజాలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. రజనీకాంత్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్.. సైనా, సానియా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్ రవిశంకర్, రిలయన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీలకు పద్మవిభూషణ్ అవార్డును ప్రధానం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు.. పద్మవిభూషణ్: రజనీకాంత్, రామోజీ రావు, జగ్మోహన్ (జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్), పండిట్ రవిశంకర్, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం), విశ్వనాథన్ శాంతా, ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం), డాక్టర్ వాసుదేవ్ ఆత్రే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అవినాశ్ దీక్షిత్ పద్మభూషణ్: సానియా మీర్జా, సైనా నెహ్వాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఏవీ రామారావు, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ (మాజీ కాగ్), బర్జీందర్ సింగ్, స్వామి తేజోమయనంద, స్వామి దయానంద సరస్వతి, రామ్ సుతార్, ప్రొఫెసర్ రామనుజ తాతాచార్య, హీస్నమ్ కన్హేలాల్, రాబర్ట్ బ్లాక్ విల్, షాపూర్జీ మిస్త్రీ, ఆర్సీ భార్గవ, హఫీజ్, ఇందు జైన్ పద్మశ్రీ: రాజమౌళి, టీవీ నారాయణ, సునీతా కృష్ణన్, యార్లగడ్డ నాయుడమ్మ, లక్ష్మా గౌడ్, గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ గోపీచంద్, ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, ఉజ్వల్ నికమ్ (న్యాయవాది), అవస్థీ, దీపికా కుమారి, సయీద్ జాఫ్రీ, ప్రతిభా ప్రహ్లాద్, బుకిదన్ గాద్వి, తులసీదాస్ బోర్కర్, ఓంకార్ శ్రీవాత్సవ, శ్రీబస్ చంద్ర సుపకార్, సోమా ఘోష్, నీలా మాదబ్ పాండ, మాధుర్ భండార్కర్, వెంకటేష్ కుమార్, మమత చంద్రకార్, లక్ష్మా గౌడ్, జై ప్రకాష్ లేఖివాల్, నరేష్ చందర్లాల్, ధీరేంద్ర నాథ్, రవీంద్ర నాగర్, అజయ్ పాల్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రెడ్రగ్ నికిక్, సల్మాన్ అమిన్, మైకేల్ పోస్టెల్, ప్రకాష్ చంద్ సురానా, దిలీప్ సంఘ్వి, మహేష్ శర్మ, సుశీల్ దోశి, అరుణాచలం మురుగంతం, సుధాకర్ ఓల్వె, గోపీనాథ్ నాయర్, శ్రీనివాసన్ దమల్, అజయ్ కుమార్ దత్తా, వీణా టాండన్, సతీష్ కుమార్, ఎంసీ మెహతా, నాగేంద్ర, రవీంద్ర కుమార్, ఎంఎం జోషీ, అనిల్ కుమారి మల్హోత్రా, దల్జిత్ సింగ్, ప్రవీణ్ చంద్ర -
సూపర్‌స్టార్‌కు పద్మవిభూషణ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పద్మవిభూషణ్ పురస్కారం దక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే ప్రచారం జోరందుకుంది. నిజానికి రజనీకాంత్ ఎలాంటి అవార్డులను ఆశించి చిత్రాలు చేయలేదన్నది నిజం. తన నిర్మాత శ్రేయస్సు, బయ్యర్ల ప్రయోజనాలు, అభిమానుల ఆనందాలకు ప్రాముఖ్యతనిచ్చిన నటుడు రజనీకాంత్. అందుకే అవార్డుకు చిహ్నంగా చెప్పబడే కథా చిత్రాల జోలికి పోకుండా, వాణిజ్య విలువలతో కూడిన జనరంజక కథాచిత్రాలనే చేసుకుంటూ వస్తున్నారు. అయితే వాటిలో దక్షిణాది చిత్రాలే కాకుండా హిందీ, ఇంగ్లీష్ తదితర భాషా చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ తమిళ చిత్రాలతోనే జపాన్, కెనడా, మలేషియా, సింగపూర్ మొదలగు దేశాల్లో కూడా అశేష అభిమానులను పొందారు. అలాంటి నటుడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన నటనా సేవకు తగిన గుర్తింపునివ్వలేదనే అపవాదు ఒక వర్గం వ్యక్తం చేస్తోందన్నది వాస్తవం. ఒక సామాన్య బస్సు కండక్టర్ స్థాయి నుంచి భారతీయ చిత్రసీమలో ఒక బలమైన నటుడిగా ఎదిగారాయన. తమిళ సినీ అభిమానుల మధ్య సూపర్‌స్టార్‌గా నేటికీ వెలుగొందుతున్న రజనీకాంత్‌ది నాలుగు పదుల నటజీవితం. ఈ కాలంలో శతాధిక చిత్రాలు చేసిన రజనీకాంత్‌కు భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురష్కారంతో గౌరవించింది. ఇతర ప్రైవేట్ అవార్డులు పలు వరించినా, ప్రభుత్వపరంగా ఇప్పటికి పద్మభూషణ్ ఒక్కటే అందుకున్నారు. అభిమానుల ఆనందహేలల్నే అన్నిటికీ మించిన అవార్డులు, రివార్డులుగా భావించే మన సూపర్‌స్టార్‌కు తాజాగా భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డులలో ద్వితీయ స్థాయి పద్మవిభూషణ్ అవార్డు వరించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. గణతంత్ర దినోత్సం సందర్భంగా రాష్ట్రపతి వెల్లడించనున్న అవార్డు గ్రహీతల పేర్లలో రజనీకాంత్ పేరు చోటు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం రజనీ ఏకధాటిగా కబాలీ, 2.ఓ చిత్రాలలో నటిస్తున్నారు. -
'పద్మభూషణ్' కోసం నటి లాబీయింగ్!
పద్మభూషణ్ పురస్కారం కోసం అలనాటి బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ తన వద్ద లాబీయింగ్ చేసిందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అవార్డులకు తమ పేర్లను సిఫారసు చేయాలని పలువురు వ్యక్తులు తనను వెంటాడుతున్నారని ఆయన చెప్పారు. ' పద్మభూషణ్ పురస్కారం కోసం తన పేరు సిఫారసు చేయాలని ఆశా పరేఖ్ నన్ను కోరింది. మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ పనిచేయడం లేదు. అందువల్ల 12 అంతస్తుల ఎక్కి వచ్చి మరీ ఆమె నన్ను వ్యక్తిగతంగా కలిసింది. ఇది నాకేమీ మంచిగా అనిపించలేదు' అని గడ్కరీ పేర్కొన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మేరకు విస్మయకర విషయాలు తెలిపారు. భారత సినిమా పరిశ్రమకు అపారమైన సేవలందించిన తాను పద్మభూషణ్ పురస్కారానికి పూర్తిగా అర్హురాలని ఆశా పరేఖ్ తనకు చెప్పిందని గడ్కరీ తెలిపారు. -
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
-
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మ అవార్డును వెనక్కిచ్చిన పీఎం భార్గవ భార్గవ బాటలో మరికొందరు శాస్త్రవేత్తలు నిరసన వ్యక్తం చేసిన 53మంది చరిత్రకారులు * వాదనలకు బుల్లెట్లతో జవాబిస్తున్నారని ఆరోపణ * బీజేపీపై వ్యతిరేకతే కారణం: వెంకయ్య సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రచయితలు, కళాకారులు.. సినీ ప్రముఖుల కోవలో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా చేరారు. భారత దేశంలో ‘అసహన’ వాతావరణం పెచ్చుమీరుతోందని.. దీన్ని నియంత్రించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ విధమైన హామీ ప్రకటన చేయకపోవటాన్ని నిరసిస్తూ గురువారం దేశంలోని 53మంది ప్రముఖ చరిత్రకారులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ప్రఖ్యాత శాస్త్రవేత్త పీఎం భార్గవ తనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు హైదరాబాద్‌లో ప్రకటించారు. సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)వ్యవస్థాపక డెరైక్టర్ అయిన పుష్ప ఎం భార్గవ 1986లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.‘‘ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. మోదీ ప్రభుత్వం భారత్‌ను హిందూ ఛాందసవాద దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇది నాలాంటి వారికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు..’’ అని పేర్కొన్నారు. దేశ పౌరులందరూ శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంటే... కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ (సీఎస్ఐఆర్) సమావేశాల్లో పాల్గొనడం ఇలాంటిదేనన్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు తన దృష్టిలో ఏమాత్రం సానుభూతి లేదని... బీజేపీ ఆ సంస్థకు రాజకీయ విభాగంగా పనిచేస్తుండటం మరింత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భార్గవతో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు అశోక్‌సేన్, పీ.బలరాం, మాడభూషి రఘునాథన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డీ.బాలసుబ్రమణియన్‌లు కూడా తమ అవార్డులను వెనక్కి ఇవ్వాలని ఇంతకుముందే నిర్ణయించుకున్నారు. వీరంతా తమ నిరసనను వెబ్సైట్లో ప్రకటన ద్వారా తెలియజేశారు. బుల్లెట్లా సమాధానం?: దేశంలో వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా కలుషితమైపోయిందని దేశంలోని ప్రఖ్యాత చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, కేఎన్ ఫణిక్కర్, మృదులా ముఖర్జీలతో సహా మొత్తం 53మంది చరిత్రకారులు దేశంలో ప్రస్తుతం కల్లోల పరిస్థితి నెలకొన్నదంటూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దాద్రీ ఘటన, సుధీంద్ర కులకర్ణిపై ఇంక్‌తో దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. ‘అభిప్రాయభేదాలను వ్యక్తం చేస్తే వాటికి భౌతిక దాడులకు పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నారు. వాదనలకు ప్రతివాదనలు చేయకుండా బుల్లెట్లతో సమాధానాలిస్తున్నారు. ఒకరి తరువాత మరొకరు అవార్డులు వెనక్కి ఇస్తుంటే, రచయితలను రాయడం ఆపేయమని సలహా ఇవ్వ టం, మేధావులను మౌనంగా ఉండమని అన్యాపదేశంగా చెప్పటమే...’ అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం గా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు రక్షణ కల్పించటం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, భిన్నత్వాన్ని పరిరక్షించటం ప్రభుత్వ బాధ్యత అని వారన్నారు. ఇప్పటికే 36 మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇవ్వటం, మరో అయిదుగురు తమ అధికారిక పదవులను విడిచిపెట్టడం, ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియావిద్యార్థులు 139రోజులు సమ్మె చేయటంతో పాటు 10మంది సినీ కళాకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం తెలిసిందే. అదొక ప్రదర్శన హైదరాబాద్: శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం ఒక ప్రదర్శన అని ఇస్రో మాజీ చైర్మన్, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త మాధవన్ నాయర్ గురువారం ఆరోపించారు. భారత్ లాంటి పెద్ద దేశంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని.. వాటన్నిం టికీ ప్రభుత్వమే కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. జీవిత సాఫల్యానికి గుర్తింపుగా దేశం గౌరవంగా ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చి వాటిని అవమానించటం తగదని ఆయన హితవు చెప్పారు. కాగా, ఈ నిరసనలతో మోదీసర్కారు ఇరుకున పడిందని తొలుత తన అవార్డును వెనక్కి ఇచ్చిన ప్రఖ్యాత రచయిత్రి నయనతార సెహగల్ అన్నారు. వీరంతా బీజేపీ వ్యతిరేకులు: అరుణ్‌జైట్లీ పట్నా/ముంబై: అవార్డులు వెనక్కి ఇస్తున్న వారంతా ‘తయారుచేయబడిన తిరుగుబాటుదారుల’ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. అవార్డులు వెనక్కి ఇస్తు న్న వారంతా రాజకీయం చేస్తున్నారు. ‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా.. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలను ఫేస్బుక్, ట్విటర్లలో జాగ్రత్తగా గమనించండి. వారు బీజేపీపై పిచ్చి వ్యతిరేకతతో ఉన్నవారన్నది స్పష్టం అవుతుంది.’అని జైట్లీ అన్నారు. జైట్లీ మాట లు విమర్శను సహించని వైఖరిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. వీరంతా భారత ప్రతిష్టను, హిందూ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పక్షాలు, వామపక్ష భావజాల వర్గాలు పనిగట్టుకుని దుష్ర్పచారానికి పూనుకున్నాయని వెంకయ్య ఆరోపించారు. పీఎం భార్గవ బీజేపీ వ్యతిరేక సైన్యానికి నాయకుడని, బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. మరోవైపు తనకు ఇచ్చిన అవార్డును వెనక్కి ఇవ్వబోనని ప్రముఖ నటి విద్యాబాలన్ తేల్చి చెప్పారు. -
కన్నడ నాట విరిసిన పద్మాలు
ఏడుగురికి పద్మ అవార్డులు వీరేంద్రహెగ్డేకు పద్మవిభూషణ్, శ్రీ శివకుమారస్వామీజీకి పద్మభూషణ్ బెంగళూరు: భారతదేశ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులకు కన్నడ నాడు నుంచి వివిధ రంగాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఎంపికయ్యారు. వీరిలో 1968 నుంచి ధర్మస్థల ధర్మాధికారిగా ఉన్న డాక్టర్ డి.వీరేంద్ర హెగ్డేను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఇక నడిచే దేవుడిగా భక్తులు పిలుచుకునే సిద్ధగంగా మఠం పీఠాధిపతి శ్రీ శివకుమార స్వామీజీ, ప్రముఖ శాస్త్రవేత్త కరాక్సింగ్ వాల్దియాలకు కేంద్రం పద్మభూషణ్‌ను ప్రకటించింది. శాస్త్రవేత్తలు కె.ఎస్.శివకుమార్, ఎస్.అరుణన్, వసంతశాస్త్రి, వ్యాపారవేత్త మోహన్‌దాస్ పైలు పద్మశ్రీకి ఎంపికైన వారిలో ఉన్నారు. కర్ణాటక నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారి వివరాలు.... డాక్టర్ డి.వీరేంద్రహెగ్డే..... 1948 నవంబర్ 25న జన్మించిన వీరేంద్రహెగ్డే 20 ఏళ్ల వయస్సులోనే (1968లో)దక్షిణ కన్నడ ప్రాంతాలోని ధర్మస్థల ధర్మాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మాధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ధర్మస్థల క్షేత్ర ప్రాభవాన్ని దేశవ్యాప్తం చేసేందుకు కృషి చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యావకాశాలను నిరుపేదలకు సైతం చేరువ చేసేందుకు శ్రమిస్తున్నారు. డాక్టర్ శ్రీ శివకుమార స్వామీజీ.... కర్ణాటకలోని మాగడి తాలూకాలోని వీరాపుర గ్రామంలో 1907 ఏప్రిల్ 1న శ్రీశివకుమార స్వామీజీ జన్మించారు. సిద్ధగంగా మఠం పీఠాధిపతిగా సిద్ధగంగా మఠం ట్రస్ట్ తరఫున అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేయడంతో పాటు వారికి ఆశ్రయం సైతం కల్పిస్తున్నారు. నడయాడే దేవుడిగా ఆయన్ను ప్రజలు భక్తి భావనలతో పిలుచుకుంటారు. కరక్ సింగ్ వాల్దియా.... ప్రముఖ శాస్త్రవేత్తగా దేశానికి సుపరిచితులైన కరక్ సింగ్ వాల్దియా 2007లోనే పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో అనేక పరిశోధనలు నిర్వహించిన కరక్ సింగ్ వాల్దియా 14 పుస్తకాలను సైతం రాశారు. ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసర్చ్‌లో హానరరీ ప్రొఫెసర్‌గా, ఐఐటీ ముంబైలో గెస్ట్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. టి.వి.మోహన్ దాస్‌పై..... నగరంలోని సెయింట్‌జోసెఫ్ కాలేజ్ ఆప్ కామర్స్ నుంచి మోహన్‌దాస్‌పై గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. దేశంలోనే ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ బోర్డ్ మెంబర్‌గా 1994లో చేరిన మోహన్‌దాస్ పై సామాజిక సేవా రంగంలో సైతం తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. నగరంలోని వివిధ సమస్యలపై పోరాటం చేస్తున్న బెంగళూరు పొలిటికల్ యాక్షన్ కమిటీకి మోహన్ దాస్‌పై ప్రస్తుతం వైస్ ప్రసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్.కె.శివకుమార్.... మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎస్.కె.శివకుమార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి బీఈ(ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్), ఎంటెక్ (ఫిజికల్ ఇంజనీరింగ్)లను పూర్తి చేశారు. చంద్రయాన్‌కు సంబంధించిన టెలీమెట్రీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందంలో శివకుమార్ ఒకరు. ప్రస్తుతం ఇస్రో సంస్థ డెరైక్టర్‌గా శివకుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్.అరుణన్..... కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుబ్యయ్య అరుణన్ 1984లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో విధుల్లో చేరారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరుగా ప్రఖ్యాతి గాంచారు. భారత్ ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)కు అరుణన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వ్యవహరించారు. -
సైనాకిస్తే నాకూ ఇవ్వాల్సిందే
పద్మభూషణ్ అవార్డుపై బాక్సర్ విజేందర్ న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డు కోసం ఇప్పుడు బాక్సర్ విజేందర్ కూడా గళమెత్తుతున్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా దరఖాస్తును ముందుగా తిరస్కరించినప్పటికీ తను అభ్యంతరం తెలపడంతో క్రీడా శాఖ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డు రావాలని కోరుకుంటున్నట్టు విజేందర్ తెలిపాడు. ‘సైనాకు, నాకు 2010లోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రదర్శన పరంగా ఇద్దరం సమానంగానే ఉన్నాం. 2008లో ఒలింపిక్ కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా గేమ్స్‌లో, ప్రపంచ పోలిస్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించాను. ఒకవేళ ఆమె పేరును ఈ అవార్డు కోసం ప్రతిపాదిస్తే నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా’ అని విజేందర్ అన్నాడు. -
నా ఉద్దేశం అది కాదు:సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ అవార్డు కోసం డిమాండ్ చేసే స్థాయి తనకు లేదని స్పష్టం చేసింది. ‘పద్మభూషణ్’ విషయంలో తన ఆవేదనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని సైనా నెహ్వాల్ ఆరోపించింది. తానేనాడూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం డిమాండ్ చేయలేదని తెలిపింది. ‘పద్మభూషణ్ అవార్డును నాకెందుకు ఇవ్వరు? అనే ఉద్దేశంతో అడిగినట్టు మీడియా ఫోకస్ చేసింది. కానీ నా ఉద్దేశం అది కాదు. నా పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తెలుసుకోవాలనుకున్నాను'అని సైనా తెలిపింది. -
వివాదం ముగిసింది
న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అనుకున్నది సాధించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె పేరును ప్రత్యేకంగా హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. దీంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న వివాదం ముగిసినట్టయ్యింది. అయితే నిర్ణీత గడువులోగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆమె నామినేషన్‌ను తమకు పంపలేదని మరోసారి తేల్చి చెప్పింది. ‘సైనా నెహ్వాల్ సాధించిన ఘన విజయాల ఆధారంగా ఆమె పేరును ప్రత్యేక కేసుగా పరిగణించి హోం శాఖకు ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ఏడాదే కాకుండా 2013లోనూ సైనా పేరును ప్రతిపాదిస్తూ బాయ్ నుంచి మాకు ఎలాంటి లేఖ అందలేదు. అందుకే హోం శాఖకు ఆమె పేరును పంపలేకపోయాం. అలాంటప్పుడు పద్మ అవార్డుల విషయంలో ఐదేళ్ల నిర్ణీత గడువు ముగిసినా పట్టించుకోవడం లేదనే వాదన అర్థరహితం. ఈనెల 3న మాత్రమే బాయ్ నుంచి నామినేషన్ అందింది’ అని క్రీడా శాఖ తెలిపింది. డిమాండ్ చేయడానికి నేనెవర్ని: సైనా ‘పద్మభూషణ్’ విషయంలో తన ఆవేదనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని సైనా నెహ్వాల్ ఆరోపించింది. తానేనాడూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం డిమాండ్ చేయలేదని స్పష్టం చేసింది. ‘పద్మభూషణ్ అవార్డును నాకెందుకు ఇవ్వరు? అనే ఉద్దేశంతో అడిగినట్టు మీడియా ఫోకస్ చేసింది. కానీ నా ఉద్దేశం అది కాదు. అసలు ఆ అవార్డును డిమాండ్ చేసేందుకు నేనెవర్ని? నేను కేవలం క్రీడాకారిణిని. దేశం కోసం ఆడుతున్నాను. నా పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయంలో క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని సైనా స్పందించింది. రాష్ట్రపతి నామినేట్ చేయాల్సి ఉంటుంది పద్మభూషణ్ అవార్డు కోసం బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేరును గడువు ముగిసినా కేంద్ర క్రీడా శాఖ... హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించినప్పటికీ ఈ అవార్డు ఆమెకు దక్కడం సందేహంగానే ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని లేక హోం మంత్రి మాత్రమే చివరి నిమిషంలో ఎవరి పేరునైనా పద్మ అవార్డుల కమిటీకి ప్రతిపాదించే అధికారం ఉంటుంది. మరోవైపు సైనా పేరును సోమవారం ప్రతిపాదించామని, తుది నిర్ణయం హోం శాఖ తీసుకుంటుందని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 15నే నామినేషన్ల గడువు ముగియగా అవార్డుల కోసం 1878 నామినేషన్లు వచ్చాయి. ఇందులో నుంచి రెండు పద్మవిభూషణ్, 24 పద్మభూషణ్, 101 పద్మశ్రీ అవార్డులను ఈనెల 26న ప్రకటిస్తారు. -
'పద్మభూషణ్'కు సైనా పేరు..!
-
'పద్మభూషణ్ ' కు సైనా పేరు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేరును సిఫార్సు చేయడానికి కేంద్రం సిద్దమయ్యింది. ఈ అవార్డు కోసం సైనా చేసుకున్న దరఖాస్తు శనివారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అందింది. తొలుత ఆమె పేరును పద్మ భూషణ్ అవార్డుకు పంపే అవకాశాలను పరిశీలించిన పిదప అందుకు రంగం సిద్ధం చేసింది. ‘పద్మభూషణ్’ అవార్డు ఎంపిక కోసం తన దరఖాస్తును తిరస్కరించడంపై ఆమె ఆవేదనతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల క్రితం ‘పద్మశ్రీ’ పొందిన తనకు నిబంధనల ప్రకారం ఈ అవార్డు పొందే అర్హత ఉందని, తనను కాదని రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ఎలా పరిగణనలోకి తీసుకున్నారని సైనా ప్రశ్నించింది. దీంతో డైలామాలో పడిన క్రీడామంత్రిత్వ శాఖ చివరకు సైనా పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించేందుకు సిద్దమయ్యింది. -
నాకు పద్మభూషణ్ ఎందుకివ్వరు ?
-
నాకు పద్మభూషణ్ ఎందుకివ్వరు?
ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించినా.. దేశం తరఫున మంచి ప్రదర్శనలు చూపించినా తన పేరును పద్మభూషణ్ అవార్డుకు ఎందుకు పంపలేదని సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సంవత్సరం ఆగస్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సైనా పేరును క్రీడా మంత్రిత్వశాఖకు పంపింది. కానీ, క్రీడా శాఖ మాత్రం సైనా పేరును పక్కన పెట్టి.. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును హోం శాఖకు ప్రతిపాదించింది. దీనిపైనే సైనా స్పందించింది. ''సుశీల్ కుమార్ పేరును ప్రత్యేకంగా పద్మ అవార్డుకు పంపినట్లు తెలిసింద.ఇ నా పేరు మాత్రం పంపలేదు. రెండు పద్మ అవార్డుల మధ్య రెండేళ్ల తేడా ఉండాలన్నది మంత్రిత్వశాఖ నిబంధన అని చెబుతున్నారు. అయినా అతడి పేరు పంపారు గానీ, నా పేరు మాత్రం పంపలేదు. నాకు ఐదేళ్ల తేడా ఉన్నా పంపనందుకు చాలా బాధగా ఉంది" అని సైనా చెప్పింది. గత సంవత్సరం కూడా ఇవే కారణాలతో తన దరఖాస్తు తిరస్కరించారని.. ఈసారి దరఖాస్తు చేసినా ఫలితం లేదని అంటోంది. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడానని, వాళ్లు మాత్రం ఇప్పటికే సుశీల్ పేరు వెళ్లిపోయినట్లు చెప్పారని సైనా తెలిపింది. తామిద్దరికీ ఒలింపిక్స్‌లో పతకాలు వచ్చాయని, అలాంటప్పుడు తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది. ఆమెకు ఇంతకుముందు 2010లో రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. 2009లో అర్జున అవార్డు కూడా వచ్చింది. -
యోగా గురు అయ్యంగర్ అస్తమయం
పుణే: ‘ఐయ్యంగార్ యోగా’ వ్యవస్థాపకుడు , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగా గురు బీకేఎస్ ఐయ్యంగార్ బుధవారం తెల్లవారుజామున అస్తమించారు. ఆయన వయస్సు 96 యేళ్లు. వయోభారంతోనే ఆయన చనిపోయినట్లు బంధువులు చెప్పారు. యోగాపై ఆయన పలు పుస్తకాలు రచించారు. యోగాకు చేసిన సేవలకు గాను 1991లో ఆయనను పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. 2004లో టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 100 మంది ప్రతిభావంతుల లిస్టులో అయ్యంగార్ పేరు కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉండగా, అయ్యంగార్ మృతిపై ప్రధాన మంత్రి మోడీ తన సంతాపాన్ని ప్రకటించారు. ముందు తరాల వారు యోగా గురువుగా అయ్యంగార్ను గుర్తించుకుంటారని ఆయన కొనియాడారు. యోగా వ్యాప్తికి అయ్యంగార్ అంకితభావంతో పనిచేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యోగా ద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచమంతా ఇనుమడింపజేశారని అయ్యంగార్ సేవలను ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కీర్తించారు. అయ్యంగార్ కర్ణాటక రాష్ట్రం బెల్లూర్లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1918 డిసెంబర్ 14వ తేదీన జన్మించారు. అతడి పూర్తిపేరు బెల్లూర్ కృష్ణమాచార్య సుందరరాజ అయ్యంగార్. చిన్నతనంలో ఆయన మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడేవారు. అతడి 16వ యేట గురువు టి. కృష్ణమాచార్య వద్ద యోగాభ్యాసం మొదలుపెట్టారు. రెండేళ్ల తర్వాత పుణే వెళ్లి యోగాలో ఇతరులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కాలక్రమేణా ‘అయ్యంగార్ యోగా’ను ప్రారంభించి ఎందరికో యోగాలో శిక్షణ ఇవ్వడమే కాక సొంతంగా కొన్ని మెళకువలను కనిపెట్టారు. ఆయన కనిపెట్టిన ‘అష్టాంగ యోగా’ ఇప్పుడు యోగా ఉపాధ్యాయులకు ఒక పాఠ్యాంశంగా మారింది. అయ్యంగార్‌కు 1943లో వివాహమైంది. ఆరుగురు సంతానం ఉన్నారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన వారిలో జె.కృష్ణమూర్తి, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వార్ధాన్ వంటి వారు ఉన్నారు. అలాగే బెల్జియంకు చెందిన మదర్ ఎలిజిబెత్ రాణి కూడా తన 80 వ యేట ఈయన వద్ద యోగా మెళకువలు నేర్చుకున్నారు. అయ్యంగార్‌పై గౌరవ సూచకంగా చైనాకు చెందిన బీజింగ్ పోస్ట్ 2011లో స్టాంప్‌ను విడుదల చేసింది. అలాగే శాన్ఫ్రాన్సిస్కో 2005 అక్టోబర్ 3వ తేదీన బీకేఎస్ డేగా ప్రకటించింది. అయ్యంగార్ తన భార్య రమామణి జ్ఞాపకార్థం 1975లో పుణేలో రమామణి మెమోరియల్ యోగా ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు. లైట్ ఆఫ్ యోగా, లైట్ ఆఫ్ ప్రాణాయామా, లైట్ ఆన్ ది యోగా సూత్రాస్ ఆఫ్ పతంజలి వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించారు. -
నేను చాలా సాధించాలి
‘‘నేను సాధించింది చాలా తక్కువ. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.’’ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు సకలకళా వల్లభుడు, పద్మశ్రీ కమల్ హాసన్. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక అన్నాశాలైలోని రాణి సీతై హాలులో గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంగీతం సాహిత్యం, నాటక రంగం తదితర మూడు విభాగాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుమారు 200 మంది పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ ప్రధానాధికారి రవి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమల్ జోతిప్రజ్వలన చేసి అనంతరం ప్రసంగించారు. కళారంగంలో తాను సాధించింది చాలా తక్కువన్నారు. సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ శాఖ ఐజీ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లిద్దరి మధ్య మరిన్ని ఫైనల్స్: గోపీచంద్
లక్నో: హైదరాబాదీ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధుల మధ్య ఇకపై మరిన్ని ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడి ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్ పోరులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు తలపడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్’కు ఎంపికైన గోపీచంద్ తన శిష్యురాళ్ల ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘చైనా ఆటగాళ్ల ఆధిపత్యానికి మనవాళ్లు గండికొట్టారు. ఇండి గ్రాండ్ ప్రి ఫైనల్లో ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ కష్టపడి బాగా ఆడారు. అందుకే సుదీర్ఘ ర్యాలీలు సాగాయి’ అని గోపీ చెప్పారు. సైనా, సింధు ఫైనల్‌కు చేరడంతో తన బాధ్యత పూర్తయిందని, అందుకే తుది పోరుకు కోచింగ్‌కు దూరంగా ఉన్నానని తెలిపారు. ‘ఈ టోర్నీలో సింధు బాగా ఆడింది. అయితే సైనాకు మాత్రం తీపిగుర్తునిచ్చిన ఈవెంట్ ఇది. వైఫల్యాలకు తెరదించుతూ సాధించిన టైటిల్ విజయం నిజంగా ఆమె ప్రగతికి నిదర్శనం’ అని 40 ఏళ్ల గోపీచంద్ అన్నారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో చేజేతులా ఓడిన మరో ఏపీ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు ఈ టోర్నీ ఓ పాఠంలాంటిదన్నారు. అనుభవలేమితోనే చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. ఏదేమైనా శ్రీకాంత్ గతేడాది నుంచి నిలకడైన ఆటతీరుతో మంచి విజయాలు సాధించాడని ప్రశంసించారు. -
పురస్కారాలు పదిలం చేసుకోవాలి
పురస్కారాలను పొందడం ఎంత ప్రధానమో వాటిని పదిలపరచుకోవడం అంతే ముఖ్యమని ప్రఖ్యాత నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మభూషణ్‌ను సొంతం చేసుకున్న ఈ సకల కళావల్లభుడు ఆదివారం స్థానిక ఆల్వార్‌పేటలోని తన కార్యాలయంలో మీడియూతో మాట్లాడారు. పద్మభూషణ్ అవార్డు తనను వరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పురస్కారం కోసం ఎందరో ఎదురు చూస్తుంటారని, అలాంటి అవార్డు తనకు దక్కడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కమల్ హాసన్ కింది విధంగా బదులిచ్చారు. ఈ అవార్డు రావడానికి కారణం ఎవరు? కచ్చితంగా నా తల్లిదండ్రులు, గురువులే. తల్లిదండ్రులు ఏర్పరచిన పునాది, గురువులు బోధించిన విద్యనే కారణం. దర్శకుడు కె.బాలచందర్, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణలాంటి వారే పద్మభూషణ్ లాంటి వారు. వారు నాకు గురువులు కావడం నా అదృష్టం. నిజానికి వారి స్థారుు అంత ఉందనినాకప్పుడు అనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తోంది. నాతోపాటు ప్రముఖ గీత రచయిత వైరముత్తుకు పద్మభూషణ్ అవార్డు లభించడం సాహితీ రంగానికే గర్వకారణం అన్నారు. పద్మభూషణ్‌పై మీకు రావడంపై కామెంట్? అవార్డును పొందడం దక్కించుకోవడం సంతోషంగా ఉన్నా దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. పురస్కారాన్ని పొందాలి, దాన్ని పదిలపరచుకోవాలి. అలాగే ఇలాంటి అత్యుత్తమ అవార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతిభావంతులు చాలా రంగాల్లో ఉన్నారు. అలాంటి వారికి నేను సిఫార్సు చేయడానికి సిద్ధమే. ఆహా మనకూ స్థానం దక్కిందని వాళ్లు సం తోషిస్తారు. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందిస్తున్న భారత దేశానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దక్షిణ చిత్ర పరిశ్రమపై మీ అభిప్రాయం ఏమిటి? దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ప్రయాణిస్తోంది. అది మన కళాకారుల గొప్పతనం. ఇలాంటి పురస్కారాలతో మన దేశ సంస్కృతికి విజయం దక్కిం దని భావిస్తున్నాను. దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది. అనువాద చిత్రాల సమస్యలపై ఏమంటారు? భిన్నత్వంలో ఏకత్వం అంటారు. దాన్ని పాటిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరి సంస్కృతిని ఇతరులు గౌరవించాలి. మాతృ భాష అనేది ఆ మని షిని చాలా దగ్గరగా తీసుకెళుతుంది. వేరే భాషలో అంతగా తాత్పర్యం ఇవ్వడం సాధ్యం కాదు. అయి నా ప్రేక్షకులు పరిభాషా చిత్రాలను ఆదరిస్తున్నారు. అలాంటి చిత్రాలను నిషేధించడం సరైన పద్ధతి కాదు. ఎవరికి నచ్చిన చిత్రాన్ని వారు చూస్తారు. విశ్వరూపం-2 ఏ దశలో ఉంది? విశ్వరూపం - 2 చిత్రం తొలి భాగం కంటే సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అన్ని విధాలుగా బెటర్‌గా ఉంటుంది. చిత్ర ఆడియోను కూడా మరింత ప్రత్యేకంగా తీర్చి దిద్దుతున్నాం. విశ్వరూపం -2 కోసం మరికొంత షూటింగ్ చేయాల్సి ఉంది. లొకేషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నాం. మరో మూడు నెలల్లో చిత్రం విడుదలవుతుంది. చివరిగా మీ కూతురు శృతి హాసన్ గురించి? శృతి సినీ, సంగీత రంగాల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం నటిగా పలు భాషల్లో ప్రకాశిస్తున్నారు. ఆమె కూడా నాకు ఒక అవార్డులాంటిదే. ఆ విధంగా పుత్రికోత్సాహాన్ని అనుభవిస్తున్నాను. -
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు
నాగండ్ల (ఇంకొల్లు), న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన పుల్లెల గోపీచంద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును శనివారం ప్రకటించడంతో ఆయన స్వగ్రామం ఇంకొల్లు మండలం నాగండ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కీర్తి కిరీటంలో ఇప్పటికే ఎన్నో అవార్డులున్నాయి. గతంలో అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్త్న్ర, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డులు ఆయనకు లభించాయి. గోపీచంద్ ప్రాథమిక విద్య ఒంగోలులోనే పద్మభూషణుడు పూర్తిచేశారు. ఉన్నత విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. పిన్ని మాంచాల ప్రోద్బలంతో అన్నదమ్ములు బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచారు. గోపీచంద్, ఆయన అన్న రాజశేఖర్ ఇద్దరూ డబుల్స్ ఆడుతూ జాతీయ క్రీడాకారులుగా మంచి గుర్తింపు పొందారు. రాజశేఖర్‌కు ఐటీఐ సీటు లభించడంతో క్రీడలకు స్వస్తి పలికారు. తల్లి సుబ్బరావమ్మ గృహిణి కాగా తండ్రి పుల్లెల శుభాష్‌చంద్రబోస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన స్వగ్రామంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలు గోరంట్ల వీరయ్య, ఆదిలక్ష్మిలతో పాటు ఆలిండియా బ్యాడ్మింటన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, బాబాయిలు సోమేపల్లి రామ్మోహన్రావు, మార్కండేయులు, కొరిటాల శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
పుల్లెల గోపీ మనోడే
నిజామాబాద్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఈరోజు దేశంలో బ్యాడ్మింటన్ అంటే గోపీచంద్. ఆ క్రీడకే వన్నెతెచ్చిన గొప్ప ఆటగాడు. అంతర్జాతీయంగా ఆటలో రాణించి దేశ కీర్తిని ఇనుమడింపజేశాడు. ఇప్పుడు బ్యాడ్మింటన్ కోచ్‌గా క్రీడలో శిక్షణ ఇస్తూ సైనానెహ్వాల్, పి.వి. సింధూలాంటి ఎంతోమంది క్రీడాకారులను తయారుచేశాడు. అందరితో శభాష్ అనిపించుకుంటూ.. అందరి మన్ననలను పొందుతున్న గోపీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడలతో దేశానికి సేవచేస్తున్న ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగినట్లుండే గోపీ మనోడే. డిచ్పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన సుభాష్‌చంద్రబోస్, సుబ్బారావమ్మల ముద్దుల కుమారుడే పుల్లెల గోపీచంద్. ఆయనకు అన్న రాజశేఖర్, చెల్లె సుమబిందు ఉన్నారు. కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేసే తమ పిన్ని షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుండటాన్ని చిన్నప్పటి నుంచి ఆసక్తిగా చూసిన గోపీ ఆ ఆటపై మక్కువ పెంచుకున్నారు. నిత్యసాధనతో దానిపై పట్టుసాధించారు. ఐవోబీ బ్యాంక్ ఉద్యోగి అయిన సుభాష్‌చంద్రబోస్ ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాలకు బదిలీ అయ్యారు. అలా వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ప్రభుత్వం శనివారం రాత్రి పద్మభూషణ్‌కు గోపీచంద్‌ను ఎంపికచేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తంచేశారు. ఎంతోమందిని తయారు చేశారు.. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అలవర్చుకొన్న గోపీచంద్ ఉత్తమ క్రీడాకారుడిగా, ఉత్తమ శిక్షకుడిగా ఎదిగారు. సైనానెహ్వాల్, సింధూ, కశ్యప్ తదితర క్రీడాకారులు ఆయన శిష్యులే. ఈరోజు ఆయనకు పద్మభూషణ్ రావడంతో జిల్లా క్రీడాకారులు, ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. -కర్నేటి వాసు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యువక్రీడాకారులకు ఆదర్శం.. క్రీడాకారుడిగా, కోచ్‌గా పుల్లెల గోపీచంద్ అందనంత ఎత్తుకు ఎదిగారు. పద్మభూషణ్ పొందిన ఆయన మన జిల్లావాసి కావడం గర్వకారణం. టీవీల్లో ఆయన ఆడిన ఆటను చూసి నేను బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ముందుకెళ్తున్నాను. నాలాంటి యువ క్రీడాకారులందరికీ గోపీ ఆదర్శం. -నవీన్, పాలిటెక్నిక్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆలస్యంగా వచ్చిన ఆనందమే.. గోపీచంద్‌కు చాలా కాలం క్రితమే ఈ అవార్డు రావాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చినా చాలా ఆనందంగా ఉంది. బ్యాడ్మింటన్ క్రీడలో తాను ఎదగడమే కాకుండా ఎంతోమంది క్రీడాకారులను ఆయన తయారు చేశారు. -సంఘమిత్ర, క్రీడాకారుడు, నిజామాబాద్ -
స్ట్రక్చరల్ డిజైనింగ్‌లో మేటి
కొవ్వూరు, న్యూస్‌లైన్:అనుమోలు రామకృష్ణ కొవ్వూరులోనే పుట్టారు. గోదావరి గట్టువెంబడి తిరిగారు. ఇక్కడే చదివారు. దేశం గర్వించే వ్యక్తిగా ఎదిగారు. 1939 డిసెంబర్ 20న జన్మించిన రామకృష్ణ ఇంటర్మీడియెట్ వరకూ కొవ్వూరులో విద్యనభ్యసించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేసిన అనంతరం తూర్పు జర్మనీ వెళ్లారు. అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో రాణించారు. నిర్మాణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలను ముందుండి నడిపించారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో రామకృష్ణ అందించిన సేవలను గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం ఆయన మరణానంతరం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది ఆగస్టు 20న పరమపదించారు. రామకృష్ణ తండ్రి వెంకటప్పయ్య ఉద్యోగరీత్యా కృష్ణాజిల్లా నుంచి వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో 34 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. వెంకటప్పయ్య దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, రామకృష్ణ మొదటి వారు. రెండో కుమారుడు సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యూరు. రామకృష్ణ కుటుంబం చెన్నయ్‌లో స్థిరపడింది. తండ్రి జ్ఞాపకార్థం సేవలు రామకృష్ణ తండ్రి వెంకటప్పయ్య జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులంతా కలసి 2009లో వెంకటప్పయ్య చారిటబుల్ ట్రస్టును నెలకొల్పారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు నాలుగేళ్ల నుంచి స్కాల ర్షిప్లు అందిస్తున్నారు. ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరిస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు వంటివి చెల్లిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణాజిల్లాలోనూ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నారు. కొవ్వూరు వాసికి అరుదైన గౌరవం దక్కడంతో పట్టణ ప్రజలు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. -
పద్మభూషణుడైన సకలకళావల్లభుడు
పురస్కారాలు అందుకోవడం తొలి నుంచే అలవాటైంది కమల్‌హాసన్‌కి. అయిదేళ్ల వయసులోనే మొదటి సినిమా ‘కలత్తూర్కన్నమ్మ’ (1959) ద్వారా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారాయన. అప్పట్నుంచి బిరుదులు, పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలోకి చేరుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, ప్రైవేటు పురస్కారాలైతే... అసలు లెక్కే లేదు. పాతికేళ్ల క్రితమే కమల్ ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్నారు. అయితే... ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారం ఈ మహానటుణ్ణి వరించింది. 55ఏళ్ల నటప్రస్థానాన్నీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాను చేసిన అద్వితీయ పాత్రలని, కళలకు తాను చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’కి కమల్ని కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఇది దక్షిణాది సినీ పరిశ్రమనే కాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమల్ అభిమానులందరినీ ఆనందపరిచే విషయం. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కమల్‌హాసన్‌ని తమిళ చిత్రపరిశ్రమ తొలినాళ్లల్లో బాగానే ప్రోత్సహించింది. బాలనటునిగా ఆరు చిత్రాల్లో నటించారాయన. ఆరేళ్ల వయసులోనే ‘పార్తాల్ పసి తీరుమ్’(1960) చిత్రం పుణ్యమా అని మహానటుడు శివాజీగణేశన్‌తో అభినయించే క్రెడిట్ కొట్టేశారు. ‘ఆ సినిమాలో శివాజీసార్ నన్ను ఎత్తుకున్నారు. ముద్దాడారు’ అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు కమల్. బాలనటునిగా తెరపై తేలిగ్గానే కనిపించినా, సినీపరిశ్రమలో ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి కమల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఓ వయసొచ్చాక... కొన్నాళ్ల పాటు పలువురు డాన్స్ మాస్టర్స్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. అక్కినేని, కృష్ణంరాజు లాంటి ప్రముఖులకు డాన్స్ మూమెంట్స్ కూడా నేర్పారు. ఆ తర్వాత అలా కనిపించి, ఇలా మాయమయ్యే పాత్రలు చాలానే చేశారు. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘అరంగేట్రం’(1974) కమల్‌కి తొలి బ్రేక్‌గా నిలిస్తే... బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘అపూర్వరాగంగళ్’(1975) ఆయన్ను స్టార్‌ని చేసింది. తెలుగు ప్రేక్షకులకు కమల్ని పరిచయం చేసింది కూడా బాలచందరే. ‘అంతులేని కథ’ తెలుగుతెరపై కమల్ కనిపించిన తొలి సినిమా. ‘మరోచరిత్ర’(1978)తో ఆయన తెలుగునాట కూడా స్టార్‌గా అవతరించారు. ఇక అప్పట్నుంచి నటనకు భాషతో నిమిత్తం లేదు అని నిరూపిస్తూ... హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి మహానటుడిగా అవతరించారు కమల్. తెలుగులో డెరైక్ట్‌గా కమల్ నటించిన అంతులేని కథ, మరోచరిత్ర, ఇది కథ కాదు, అందమైన అనుభవం, సొమ్మొకడిదీ సోకొకడిది, ఆకలిరాజ్యం, సాగరసంగమం, స్వాతిముత్యం, ఒకరాధా ఇద్దరు కృష్ణులు, శుభసంకల్పం, ఇంద్రుడు-చంద్రుడు చిత్రాలు ఆయన్ను తెలుగు నటుణ్ణి చేసేశాయి. తెలుగులో డెరైక్ట్‌గా ఇన్ని విజయాలు అందుకున్న పరభాషా నటుడు మరొకరు లేరు. ఎర్రగులాబీలు, అమావాస్య చంద్రుడు, ఖైదీవేట, నాయకుడు, విచిత్రసోదరులు, మైకేల్ మదనకామరాజు, చాణక్య, సతీలీలావతి, గుణ, భామనే.. సత్యభామనే, మహానది, సత్యమే శివం, దశావతారం, విశ్వరూపం.. ఇలా ఎన్నో అనువాదాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు కమల్. ఇక ‘పుష్పక విమానం’ సంగతి సరేసరి. ఆయన తమిళ నటుడంటే మింగుడు పడనంతగా ప్రేమను పెంచుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ పనిలో ఉన్నారాయన. ఈ సందర్భంలో ఆ మహానటుడికి ‘పద్మభూషణ్’ రావడం పట్ల.. భాషతో ప్రమేయం లేకుండా సినీ అభిమాని అయిన ప్రతి ఒక్కరూ హర్షం వెలిబుచ్చుతున్నారు. -
‘పద్మ భూషణు’డు
కలత్తూర్ కన్నమ్మ తమిళ చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పద్మశ్రీ కమల్ హాసన్‌ను ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు వరించింది. కలత్తూర్ కన్నమ్మ చిత్రంలో కమల్‌హాసన్(4) నటనకు ఆనాడే రాష్ట్రపతి స్వర్ణకమలం లభించింది. 1962లో విడుదలైన ఈ చిత్రం అఖండమైన విజయాన్ని సాధించడమే కాక ఆయన్ను మలయాళ చిత్ర రంగంలోకి కూడా ప్రవేశింప చేసింది. సకలకళా వల్లభుడిగా తమిళ ప్రేక్షకుల చేత మన్ననలు అందుకున్న ఈ నట శిఖరం గురించి ఈ ప్రత్యేక కథనం. -న్యూస్‌లైన్, అన్నానగర్ కమల్‌హాసన్ 1954, నవంబర్ 7న నేటి రామనాథపురం జిల్లాగా పిలుస్తున్న పరమకుడిలో జన్మించారు. తన సోదరులైన చంద్రహాసన్, చారుహాసన్ మాదిరిగానే న్యాయవాది కావాలనుకున్న కమల్ అనుకోకుండా చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. భారత చలన చిత్ర రంగంలోని అగ్రనటుల్లో ఒకరుగా ఆయన ఎదిగారు. కమల్ సోదరి నళిని నృత్యకారిణి కావడం కమల్‌లోని కళాతృష్ణకు తొలి భీజం వేసింది. కమల్ కుటుంబ వైద్యులు ఒకరు కమల్‌ను, ఆయన తల్లిని ఎవియం ఎం.శరవణన్ దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఆయన నటనా జీవితానికి భీజం పడింది. ఎవిఎం నిర్మించబోతున్న కలత్తూర్ కన్నమ్మ చిత్రంలో నిర్మాత శరవణన్ కమల్‌కు బాల నటుడి పాత్రను ఇచ్చారు. 1959-1963లో కమల్ బాల నటుడిగా ముద్ర వేసుకున్నారు. 1970-1975లో మన్నవన్, కె.బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రం, అవల్ ఒరు తొడర్ కథై వంటి తమిళ చిత్రాలు కమల్‌కు పరిణితి గల నటుడిగా పేరు తెచ్చాయి. 1974లో కమల్ కన్యాకుమారి అనే మలయాళ చిత్రంలో నటించారు. దీనికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. కె.బాలచందర్ నేతృత్వంలో కమల్ నటించిన అపూర్వ రాగంగళ్కి సైతం జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం కోసం కమల్ మృదంగం నేర్చుకున్నారు కూడా. అపూర్వ రాగంగళ్లోని కమల్ నటనకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. తెలుగు, తమిళ, మల యాళ, కన్నడ, హిందీ భాషల్లో కమల్ నటించిన చిత్రాల సంఖ్య 225కి పై మాటే. కమల్ తన నటనా జీవితంలో 17 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. రాజ్‌కమల్ ఇంటర్ నేషనల్ అనే బ్యానర్‌తో సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తెలుగులో కమల్ నటించిన మరో చరిత్ర, ఇది కథ కాదు, అంతులేని కథ, సాగర సంగమం, స్వాతిముత్యం, వసంతకోకిల, విశ్వరూపం, ఈనాడు, ఇంద్రుడు - చంద్రుడు, అపూర్వ సహోదరులు, వయసు పిలిచింది, అమరప్రేమ, అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, అందగాడు, మన్మథలీల, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, శుభ సంకల్పం, పుష్పక విమానం, అమావాస్య చంద్రుడు వంటి హిట్ చిత్రాల్లో నటించారు.హిందీలో సాగర్, ఏక్ దూజే కేలియే, ఆయేనా, సనం తేరి కసమ్, ఏతో కమాల్ హోగయా, జరాసి జిందగీ, సద్మా (ఇది తెలుగులో వసంత కోకిలగా, తమిళంలో మూండ్రాంపిరైగా వచ్చింది), ఏదేశ్, ఏకనయిపహిలే, యాద్గర్, రాజాలి ఎన్ కరిష్మా, గిరఫతార్, దేఖాఫ్యార్ తుహ్హారా, చాచి 420 హేరామ్, ముంబై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల్లో నటించి ఔరా అనిపించారు. నిర్మాతగా కమల్ రాజా పార్వై (తెలుగులో అమావాస్య చంద్రుడు) విక్రం, సత్య, పుష్పక విమానం, అపూర్వ సహోదరగళ్, మైఖేల్ మదన్ కామరాజు, దేవర్ మగన్, సతీ లీలావతి, హేరాం, చాచి 420, నలదమయంతి, విరుమాండి, ముంబయి ఎక్స్‌ప్రెస్, ఈనాడు, విశ్వరూపం పేరిట చిత్రాలను నిర్మించారు. వివిధ భాషలకు చెందిన 50 చిత్రాల్లో కమల్ గాయకుడిగా కూడా తన గళాన్ని వినిపించారు. హేరాం, విరుమాండి, ఉన్నైప్పోల్ ఒరువన్, మన్మథన్ అంబు, విశ్వరూపం చిత్రాల్లో పాటలు కూడా రాశారు. విశ్వరూపం, విరుమాండి, హేరాం, చాచి 420 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీమంతుడు చిత్రానికి కమల్ సహాయక నృత్య దర్శకుడిగా పని చేశారు. సావళి సమళి, నూట్రుక్కునూరు, వెళివిళా, కన్నా నళమా, నాన్ అవన్ ఇళ్లై, అవర్గళ్, ఆయేనా (హిందీ) విరాసత్ (హిందీ) అన్భే శివం వంటి చిత్రాలకు కమల్ సహాయక దర్శకుడిగా, కథా రచయితగా, సహాయక నృత్య దర్శకుడిగా కూడా పని చేశారు. సినిమాలోని ప్రతి విభాగంలోనూ పద్మశ్రీ కమల్ తనదైన ప్రతిభను చాటారు. అందుకే ఆయన్ను తమిళ రసకంలో సకల కళా వల్లభన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.సంఘ సేవలోనూ మేటి: చెన్నైలోని పోరూరు రామచంద్రా యూనివర్శిటీ, తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్ విభాగం వంటి సంస్థలకు కమల్ రూ.50 లక్షలను సహాయంగా అందచేసి సంఘసేవకుడిగా పేరు పొందారు. కమలహాసన్ సంక్షేమ సమాఖ్య అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా నగరంలోని సంఘ సేవకులకు ప్రత్యేక నగదు బహుమతులను,అవార్డులను కూడా అందచేస్తున్నారు. కమలహాసన్ చేస్తున్న సంఘసేవకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన అబ్రహాం కోవూరు అవార్డు లభించింది. అవార్డుల్లో కూడా రికార్డులే: కమల్ తన నటనా జీవితంలో నేటి వరకు 66 సార్లు అవార్డులకు ప్రతిపాదనకు నోచుకున్న ఏకైక భారతీయ నటుడు. ఇందులో ఆయన 56 సార్లు అవార్డులను గెలుచుకోవడం మరో అరుదైన రికార్డు. వాణిగణపతి, సారికతో వివాహబంధంలో ఇమడలేని కమల్ ప్రస్తుతం ప్రముఖ తెలుగు నటి గౌతమితో కలసి సహజీవనం చేస్తున్నారు. కమల్‌కు శృతిహాసన్, అక్షర హాసన్ కుమార్తెలున్నారు. వీరిలో శృతిహాసన్ నటి, సంగీత దర్శకులు కూడా. స్థానికంగా ప్రాంతీయ భాషల్లోనూ కమల్ పొందిన అవార్డులకు - సన్మానాలకు లెక్కలేదు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిని నేడు పద్మభూషణ్ వరించడంలో ఆశ్చర్యమేముంది? -
పలువురు నగరవాసులకు ‘పద్మాలు’
న్యూఢిల్లీ: జాతికి విశిష్ట సేవలు అందించిన వారికి ప్రకటించే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఈసారి పలువురు ఢిల్లీవాసులకు దక్కాయి. ప్రజావ్యవహారాల విభాగంలో న్యాయమూర్తి దల్వీర్ భండారి, సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ తిరుమలాచారి రామసామి, డాక్టర్ వినోద్ ప్రకాశ్ శర్మ, సాహిత్య, విద్య విభాగంలో మృత్యుంజయ్ ఆచార్య, పౌరసేవల విభాగంలో విజయేంద్రనాథ్ కౌల్, వైద్యవిభాగంలో డాక్టర్ నీలమ్ క్లేర్‌కు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. పద్మశ్రీ పురస్కారాలు ప్రముఖ శిల్పి ప్రొఫెసర్ బీహారీ దాస్, ఒడిస్సీ నృత్య విభాగంలో గీతా మహాలిక్, చిత్రకళాకారుడు పరేశ్ మైటీ, సామాజిక సేవకుడు జేఎల్ కౌల్, సైన్స్, ఇంజనీరింగ్ నిపుణుడు బ్రహ్మసింగ్, రామస్వామి అయ్యర్, ప్రముఖ అంకాలజిస్టు లలిత్‌కుమార్, ఎముకల వైద్యుడు డాక్టర్ అశోక్ రాజ్‌గోపాల్, దంతవైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ మహేశ్ వర్మ, డాక్టర్ తితియాల్, కంటి వైద్యుడు డాక్టర్ నితీశ్ నాయక్, హృద్రోగాల నిపుణుడు డాక్టర్ సుబ్రత్ కుమార్ ఆచార్య, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ అశోక్ చక్రధర్, సాహితీకారులు కేకేఈ దారువాలా, మనోరమ జఫా, రెహానా ఖటూన్, దినేశ్ సింగ్, అంజుమ్ చోప్రా, ప్రముఖ క్రికెటర్ లవ్‌రాజ్ సింగ్, పర్వతారోహణ క్రీడాకారుడు ధర్మశక్తు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. -
హాస్య పద్మాలు
అపురూపం ‘నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం రోగం’... అనేవారెప్పుడూ జంధ్యాలగారు. నవ్వించడం నటులకి అంత తేలిక కాదు. నవ్వించగలిగిన నటులకి మిగిలిన అన్ని రసాలు అభినయించడం తేలికే! అటువంటి హాస్యాన్ని పండించి మెప్పించిన హాస్యనటులు తెలుగులో ఎందరో! వారంతా ప్రజల గుర్తింపునూ పొందారు. వారిలో కొందరు ప్రభుత్వ గుర్తింపునూ పొందారు! ‘పద్మవిభూషణ్’, ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’. ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను 1954 నుండి భారత ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. దక్షిణాదిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందిన తొలి హాస్యనటుడు శ్రీ రేలంగి వెంకట్రామయ్య. ఆ తరువాత కాలంలో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంలు అందుకున్నారు. ఆ రోజుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ కమెడియన్ శ్రీ రేలంగి! 1970లో ఆయన, నాటి రాష్ట్రపతి వి.వి.గిరి నుండి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే యాభై సంవత్సరాల పాటు 1,013 చిత్రాలలో నవ్వించారు శ్రీ అల్లు రామలింగయ్య. ఆయన, 1990లో నాటి భారత రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. హీరో ఎవరైనా సరే... బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్! ఇది ప్రస్తుతం బ్రహ్మానందం స్థాయి! 28 సంవత్సరాల సినీ జీవితంలో అప్పుడే వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్న బ్రహ్మానందం ‘పద్మశ్రీ’ బిరుదును 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం పొందుతోన్న బ్రహ్మానందం అప్పుడు గాని... ఇప్పుడు గాని తెలుగులో ఉన్నంత మంది హాస్యనటులు మరే భాషలోనూ లేరు! అలాగే ముగ్గురు హాస్యనటులు ‘పద్మ’ పురస్కారాలను మరే భాషలోనూ అందుకున్న గుర్తూ లేదు!! హ్యాట్సాఫ్ టూ తెలుగు హాస్యనటులు!!! -నిర్వహణ: సంజయ్ కిషోర్ -
‘పద్మ భూషణ్’కు పేస్!
బెంగళూరు: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పేరును ఈ ఏడాది ‘పద్మ భూషణ్’ పురస్కారానికి సిఫారసు చేశారు. ఈ అవార్డు కోసం క్రీడాకారుల జాబితాలో పేస్ పేరును మాత్రమే కేంద్ర క్రీడా శాఖ పంపించినట్టు సమాచారం. 40 ఏళ్ల పేస్ తన కెరీర్లో ఇప్పటివరకు 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 53 అంతర్జాతీయ టైటిల్స్‌ను సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. 1990లో ‘అర్జున అవార్డు’ పొందిన పేస్‌కు 1997లో ‘రాజీవ్ ఖేల్త్న్ర’... 2001లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి పతకాన్ని అందించిన దివంగత రెజ్లర్ ఖాషాబా జాదవ్... షూటింగ్ జట్టు మాజీ కోచ్ సన్నీ ... ఫుట్‌బాలర్ అరుణ్ ఘోష్ పేర్లను ‘పద్మశ్రీ’ పురస్కారాలకు నామినేట్ చేశారు. -
నూకల చిన సత్యనారాయణ కన్నుమూత