'పద్మభూషణ్‌' కోసం నటి లాబీయింగ్! | Nitin Gadkari says Asha Parekh lobbied for Padma Bhushan | Sakshi
Sakshi News home page

'పద్మభూషణ్‌' కోసం నటి లాబీయింగ్!

Published Sun, Jan 3 2016 6:32 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

'పద్మభూషణ్‌' కోసం నటి లాబీయింగ్! - Sakshi

'పద్మభూషణ్‌' కోసం నటి లాబీయింగ్!

పద్మభూషణ్‌ పురస్కారం కోసం అలనాటి బాలీవుడ్ నటి ఆశా పరేఖ్‌ తన వద్ద లాబీయింగ్ చేసిందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అవార్డులకు తమ పేర్లను సిఫారసు చేయాలని పలువురు వ్యక్తులు తనను వెంటాడుతున్నారని ఆయన చెప్పారు.

' పద్మభూషణ్‌ పురస్కారం కోసం తన పేరు సిఫారసు చేయాలని ఆశా పరేఖ్‌ నన్ను కోరింది. మా అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ పనిచేయడం లేదు. అందువల్ల 12 అంతస్తుల ఎక్కి వచ్చి మరీ ఆమె నన్ను వ్యక్తిగతంగా కలిసింది. ఇది నాకేమీ మంచిగా అనిపించలేదు' అని గడ్కరీ పేర్కొన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మేరకు విస్మయకర విషయాలు తెలిపారు. భారత సినిమా పరిశ్రమకు అపారమైన సేవలందించిన తాను పద్మభూషణ్‌ పురస్కారానికి పూర్తిగా అర్హురాలని ఆశా పరేఖ్‌ తనకు చెప్పిందని గడ్కరీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement