రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు.