ధోని కొట్టిన ఆ సిక్స్‌ ఇంకా.. | Ms Dhoni Winning Six,Never Ever Forget | Sakshi
Sakshi News home page

ధోని కొట్టిన ఆ సిక్స్‌ ఇంకా..

Published Tue, Apr 2 2019 1:06 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కొట్టిన ఆ సిక్స్‌ ఇంకా.. కళ్లముందు కదలాడుతోంది. అవును మరి అది ఏమైనా మాములు సిక్సా.. 28 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరదించిన సిక్స్‌.. కెరీర్‌లో అన్ని ఘనతలు అందుకొని ఇదొక్కటి సాధిస్తే ఇక చాలని ఎదరు చూస్తున్న ఓ దిగ్గజం కల నెరవేర్చిన సిక్స్‌.. యావత్‌ భారత క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సిక్స్‌. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలబెట్టిన సిక్స్‌. సరిగ్గా ఎనిమిదేళ్ల కింద ఇదే రోజు మహేంద్రుడి బ్యాట్‌ నుంచి జాలువారిన ఆ సిక్స్‌ను ఎవరూ ఎప్పుడూ మర్చిపోలేరు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement