Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Yoga Teachers Protest At CM Chandrababu Karakatta House1
సీఎం కరకట్ట నివాసం వద్ద యోగాసనాలతో నిరసన

సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్‌ తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. అయితే.. సీఎం కరకట్ట నివాసం వద్ద నిరసనలకు పోలీసులు యోగా టీచర్లకు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మర్యాదగా వెళ్లిపోవాలంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. తమ సమస్యేంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. పాఠశాలల్లో పని చేస్తున్న 1,056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్‌ చేస్తున్నారు వాళ్లు. ఈ విషయమై మంత్రి లోకేష్‌కు గతంలో విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు.

Minister Konda Sureka And Murali Meets IN charge Meenakshi Natarajan2
వరంగల్‌ రాజకీయంలో కొత్త ట్విస్ట్‌.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్‌ జిల్లాలోగ్రూప్‌ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం​ చెప్పారు. ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్‌ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్‌ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్‌లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్‌ చేశారు.

Reliance Communications and Anil Ambani contested the SBI decision3
‘ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌బీఐ తీరు’

దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) రుణ ఖాతాను ‘ఫ్రాడ్‌’ అకౌంట్‌గా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వర్గీకరించనుంది. అలాగే రిజర్వ్‌ బ్యాంకుకి ఇచ్చే నివేదికలో సంస్థ మాజీ డైరెక్టర్‌ అనిల్‌ అంబానీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది. జూన్‌ 23వ తేదీతో ఎస్‌బీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఆర్‌కామ్‌ తెలిపింది. దీని ప్రకారం ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31,580 కోట్ల రుణం తీసుకున్నాయి.ఆర్‌కామ్‌కి పంపిన లేఖ ప్రకారం.. రుణంగా తీసుకున్న నిధులను సంక్లిష్టమైన విధంగా వివిధ గ్రూప్‌ సంస్థలు మళ్లించినట్లు గుర్తించామని ఎస్‌బీఐ పేర్కొంది. దీనిపై జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకి కంపెనీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌ ఖాతాను ‘ఫ్రాడ్‌’గా వర్గీకరించాలని ఫ్రాడ్‌ ఐడెంటిఫికేషన్‌ కమిటీ నిర్ణయించినట్లు వివరించింది. ‘ఫ్రాడ్‌’గా మారిస్తే..ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఏదైనా ఖాతాను ‘ఫ్రాడ్‌’గా వర్గీకరించినప్పటి నుంచి 21 రోజుల్లోగా ఆ విషయాన్ని ఆర్‌బీఐకి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీఐ/ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మోసం చేసిన రుణగ్రహీతపై (ప్రమోటర్‌ డైరెక్టర్, ఇతరత్రా హోల్‌టైమ్‌ డైరెక్టర్లు సహా) కఠినచర్యలు ఉంటాయి. డిఫాల్ట్‌ అయిన రుణగ్రహీతలు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన అయిదేళ్ల వరకు మరే ఇతర బ్యాంకులు, డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు, ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు తీసుకోవడానికి ఉండదు.ఇదీ చదవండి: ‘యాపిల్‌ రహస్యాలు దొంగతనం’ఆర్‌కామ్‌ స్పందన ఇదే..ఎస్‌బీఐ నిర్ణయంపై ఆర్‌కామ్‌ స్పందించింది. తమ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడమనేది ఆర్‌బీఐ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 2న బ్యాంకుకు ఆర్‌కామ్‌ లాయర్లు ఈ మేరకు లేఖ రాశారు. ఆరోపణలపై వ్యక్తిగతంగా వివరణనిచ్చేందుకు అనిల్‌ అంబానీకి కనీసం అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎస్‌బీఐ నిర్ణయం తీసుకోవడం షాక్‌కు గురి చేసిందని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆర్‌కామ్‌లోని ఇతర నాన్‌–ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసును విత్‌డ్రా చేసుకున్న ఎస్‌బీఐ, అంబానీ కూడా నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరే అయినప్పటికీ ఆయన్ను మాత్రం వేరుగా చేసి చూడటం సరికాదని లాయర్లు వివరించారు. షోకాజ్‌ నోటీసుకు వివరణ ఇచ్చిన దాదాపు ఏడాది వరకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ వివరణ సంతృప్తికరంగానే ఉందని భావించినట్లు తెలిపారు.

KSR Comment On Chandrababu No Answers To AP People Questions4
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా బాబూ?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్‌ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, కీలక మంత్రి లోకేశ్‌లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్‌బుక్‌ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్‌, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?. 👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ.. 👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే! గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్‌సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్‌సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?. 👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్‌లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?. 👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి. అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Amarnath Yatra First Aarti Devotees Security Forces Latest Updates5
అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్‌ హర్‌ మహదేవ్‌’ నినాదాలు

శ్రీనగర్‌: జమ్ము కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహాలయంలో గురువారం ఉదయం మొదటి హారతి అందించడంతో వార్షిక అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం 5,892 మంది యాత్రికుల మొదటి బ్యాచ్‌ ప్రయాణాన్ని జమ్ములోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం కశ్మీర్ లోయకు చేరుకోగానే అక్కడి అధికారులు, స్థానికులు వారికి స్వాగతం పలికారు. The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t— crpf_fan (@CrprepostFan) July 2, 2025బాల్తాల్, నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంపుల మీదుగా యాత్రికుల మొదటి బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారంతా ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ పెద్ద ఎత్తున శివనామస్మరణలు చేశారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర పహల్గామ్, బాల్తాల్ మార్గాల ద్వారా ముందుకు సాగనుంది. ఆగస్టు 9న రక్షాబంధన్‌తో ఈ యాత్ర ముగియనుంది. గత ఏడాది ఐదు లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ సందర్శించుకున్నారు. ఈ సంవత్సరం యాత్రా వ్యవధి తక్కువగా ఉన్నప్పటికీ యాత్రికులు అధికంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా భక్తులు యాత్ర కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆన్-ది-స్పాట్ రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసేందుకు జమ్ములో సరస్వతి ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభలలో అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజూ సుమారు రెండు వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. యాత్రామార్గంలో అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం

Vaibhav Suryavanshi Creates History, Breaks Suresh Rainas Record6
చ‌రిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

ఇంగ్లండ్ గడ్డపై భారత అండర్‌-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుధవారం నార్తాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ అండర్‌-19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 269 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన తుపాన్ ఇన్నింగ్స్‌లో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్‌ సాధించిన రికార్డులు ఇవే..👉అండర్‌-19 వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80 ప్లస్ రన్స్‌ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 2004లో స్కాట్లాండ్ అండర్‌-19 జట్టుపై 236.84 స్ట్రైక్‌రేట్‌తో 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 31 బంతుల్లో 277.41 స్ట్రైక్‌రేట్‌తో 86 ప‌రుగులు చేసిన వైభ‌వ్‌.. రైనా ఆల్‌టైమ్ రికార్డు రికార్డు బ్రేక్‌ను చేశాడు.👉అండర్ 19 వన్డేలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. వైభశ్ సూర్యవంశీ కంటే ముందు రిషభ్ పంత్.. అండర్ 19 వన్డేల్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.👉అండ‌ర్‌-19 యూత్ వ‌న్డేలో భార‌త త‌రపున అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా వైభ‌వ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మన్‌దీప్ సింగ్(8 సిక్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో 9 సిక్సర్లు బాది మన్‌దీప్ రికార్డును వైభవ్ అధగమించాడు.చదవండి: #Shubman Gill: చ‌రిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్‌.. తొలి భారత ప్లేయర్‌గా

Haryana Faridabad 170kgs Man Collapsed During Gym Video Viral7
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు

బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్‌ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్‌, ప్రోటీన్‌ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. హర్యానా ఫరీదాబాద్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్‌ సింగ్‌ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్‌ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్‌ను ఆశ్రయించాడు. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్‌ సెక్టార్‌ 9లో ఉన్న జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్‌తో కలసి జిమ్‌కు వెళ్లాడు. బ్లాక్‌ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్‌లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్‌ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్‌కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎక్సర్‌సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండిశరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరంస్టెరాయిడ్స్‌, సప్లిమెంట్స్‌లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి హార్ట్‌బీట్‌, బీపీలను నిరంతరం చెక్‌ చేసుకుంటూ ఉండాలివ్యాయామాలకు ఉదయం సరైన సమయంజిమ్‌ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలిఅలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్‌కు వెళ్లకూడదుజిమ్‌ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమంభారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదుట్రెడ్‌మిల్‌ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదుఎక్సర్‌సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

AP police Involved In IPS Siddharth Kaushal VRS8
ఐపీఎస్‌ సిద్ధార్థ్‌ కౌశల్‌ వీఆర్‌ఎస్‌.. ఏపీ పోలీస్‌ బిగ్‌ బాస్‌ ఎంట్రీ!

సాక్షి, అమరావతి: వేధింపులు, అవమానాలతో ఐపీఎస్‌ సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా జీపీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్‌) సిద్ధార్థ్‌ కౌశల్‌పై ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. ‘ఐపీఎస్‌కు సిద్ధార్థ్‌ కౌశల్‌ గుడ్‌ బై’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రిక బుధవారం ప్రచు­రించిన కథనం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది.అసలు రాష్ట్ర పోలీసు శాఖలో ఏం జరు­గుతోంది.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తీవ్రస్థాయిలో చర్చించుకున్నాయి. రానున్న రోజుల్లో పోలీసు శాఖలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని ఆవేదన వ్యక్తంచేశాయి. తమ వేధింపుల వ్యవహారం మరోసారి బట్టబయలు కావడంతో హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు వెంటనే పోలీస్‌ బిగ్‌ బాస్‌ను రంగంలోకి దించారు.కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎస్‌ సర్వీసు నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాలని సిద్ధార్థ్‌ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తాము చెప్పినట్టు ప్రకటన జారీ చేయకపోతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం ఆయన చేసిన దరఖాస్తును ఆమోదించబోమని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీస్‌ బిగ్‌ బాస్‌ ఒత్తిడికి ఆయన తలొగ్గారు. అనంతరమే సిద్ధార్థ్‌ కౌశల్‌ పేరుతో ఓ పత్రికా ప్రకటనను పోలీసు వర్గాలు విడుదల చేశాయి. సిద్ధార్థ్‌ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనతో పత్రికా ప్రకటన జారీ చేయించిందని పోలీసు వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వీఆర్‌ఎస్‌: సిద్ధార్థ్‌ కౌశల్‌ సుదీర్ఘంగా ఆలోచించి, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐపీఎస్‌ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్ధార్థ్‌ కౌశల్‌ బుధ­వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఐపీఎస్‌ అధికారిగా పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమన్నారు. తనకు సహ­కరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Smriti Irani: My Mother Was Thrown Out of House Because She Could Not Have Son9
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ

బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్‌ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్‌లో.. తర్వాత సీరియల్స్‌లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్‌ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్‌ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్‌ కుచ్‌ హోతా హై మూవీ నుంచి నా లైఫ్‌ సడన్‌గా అగ్నిపథ్‌ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్‌ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్‌లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్‌లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్‌ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్‌ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్‌ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్‌ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన భారీ బడ్జెట్‌ మూవీ.. ఎక్కడంటే?

Broke Up With Mobile says IAS Neha Byadwal10
ఇల్లే ఆమె ట్యుటోరియల్‌ కాలేజీ

23 ఏళ్లకే ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌ అయ్యి 25 ఏళ్ల వయసులో జాయింట్‌ కలెక్టర్‌గా పని చేస్తున్న నేహా బైద్వాల్‌ ఒక స్ఫూర్తి పాఠం. అమ్మాయిల చదువును అంతగా ప్రోత్సహించని రాజస్థాన్ లో పుట్టిన నేహా మూడేళ్ల పాటు ఫోన్ ని తాకకుండా పట్టుపట్టి చదివి ఐ.ఏ.ఎస్‌. సాధించారు. గమ్యం చేరాలంటే ఫోన్ ని పక్కన పెట్టాలంటున్న ఆమె మాటలు చర్చను లేవనెత్తుతున్నాయి.‘మా ఇంట్లో టీవీ ఉండదు. మా నాన్నగారు టీవీని ఉండనివ్వలేదు. దాని బదులు ఒక బ్లాక్‌బోర్డ్‌ ఉంది. మాది జాయింట్‌ ఫ్యామిలీ. ఎప్పుడూ చదువుకుంటూ పరీక్షలు రాసే పిల్లలు ఐదారుమంది ఉండేవారు. వారికి ఆ బోర్డు మీద పాఠాలు సాగుతుండేవి. నేను కూడా అలాగే చదువుకున్నాను. మా నాన్న ఆఫీసు నుంచి వచ్చాక రాత్రి భోజనం దగ్గర పిల్లలందరూ ఆ వేళ ఏం చదివారో అడిగేవారు... జవాబులు తెలుసుకునేవారు. ఎవరైనా సరిగ్గా చదవలేదని అనిపిస్తే వారికి క్లాస్‌ పడేది. రాజస్తాన్‌ కుటుంబాల్లో/పల్లెల్లో ఆడపిల్ల చదువును ప్రోత్సహించరు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆయన ఉద్యోగ రీత్యా మేమంతా ఎక్కువ సంవత్సరాలు ఛత్తిస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండటం వల్ల మా చదువుకు ఎటువంటి ఆటకం కాలేదు. చదువు ముఖ్యం అని చిన్నప్పుడే మా నాన్న నూరి΄ోశారు’ అంటుంది నేహా బైద్వాల్‌.2023 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఆమెకు 569 ర్యాంకు వచ్చింది. మొత్తం 960 మార్కులతో (ఇంటర్వూలో 151) ఆమె ఈ విజయం సాధించింది. అయితే ఇదంత సులువు కాలేదు. అందుకు నాలుగేళ్లు కష్టపడింది. మూడుసార్లు విఫలమయ్యి నాలుగోసారి విజయం సాధించింది.5వ తరగతి ఫెయిల్‌నేహా మొదటి నాలుగేళ్లు రాజస్థాన్‌లో ఉన్న తాతగారి ఇంట్లో చదువుకుంది. అది పల్లెటూరి. అక్కడ రాజస్థానీ మీడియంలోని చిన్న బడి ఉండేది. అయితే ఐదోక్లాస్‌ నాటికి తండ్రి ఆమెను తాను ఉద్యోగం చేస్తున్న చోటుకు తెచ్చి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో వేశాడు. అప్పటికి ఇంగ్లిష్‌లో ఏ మాత్రం ప్రవేశం లేని నేహా ఐదోక్లాస్‌లో ఫెయిల్‌ అయ్యింది. స్కూల్‌ వాళ్లు హిందీ మీడియంలోకి వేస్తామన్నారు. కాని నేహా పట్టుదలతో ఆరో క్లాస్‌ నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో పుంజుకుంది.లాయర్‌ కావాలనుకుని...నేహా అడ్వకేట్‌ అవుదామనుకుంది. ‘బాధితులకు న్యాయం జరగాలంటే అదొక మంచి మార్గం అనుకున్నాను’ అంటుందామె. కాని అంతకంటే ఎక్కువమందికి నువ్వు మేలు చేయాలంటే ఐ.ఏ.ఎస్‌ కావాలి అని తండ్రి దిశా నిర్దేశం చేశాడు. రాయ్‌పూర్‌లోని మహిళా కళాశాలలో డిగ్రీ చదివిన నేహా అందుకు మార్గం ఏమిటని తండ్రిని అడిగితే కాలాన్ని గెలవడమే అని చె΄్పాడు. ‘పనికిరాని వాటికి సమయాన్ని వృథా చేయడం కంటే దానిని పూర్తిగా సద్వినియోగం చేయడమే విజయానికి మార్గం అని తెలుసుకున్నాను’ అంటుంది నేహా. టీవీ లేని ఆ ఇంట్లో ఆమె ఇక ఫోన్‌ కూడా పక్కన పెట్టేసింది. ఇల్లే ఆమె ట్యుటోరియల్‌ కాలేజీ, ప్రిపరేషన్‌ జరిగే చోటు.నాలుగోసారి‘నేను ఆశాజీవిని. ఓడి΄ోక ప్రయత్నించడం మన బాధ్యత’ అంటుంది నేహా. నేహాకు మొదటి అటెంప్ట్‌లో అసలేమీ రిజల్ట్‌ కనపడలేదు. రెండో అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో 2 మార్కులు తక్కువ రావడంతో అర్హత రాలేదు. మూడో అటెంప్ట్‌లో మెయిన్స్‌లో అర్హతకు 8 మార్కులు తక్కువ వచ్చాయి. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగోసారి మళ్లీ పరీక్షకు కూచోవడం ఎవరికైనా కష్టమే. కాని నేహా నాలుగోసారి రాసింది. ఈసారి ఆమె శ్రమ వృథా కాలేదు. 2023 సంవత్సరంలో ఆమెకు 569వ ర్యాంకు వచ్చింది. గుజరాత్‌ కేడర్‌ అలాట్‌ అయ్యింది. శిక్షణ తర్వాత గుజరాత్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ΄ోస్టింగ్‌ వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిన్ను నీవు మోసం చేసుకోకుండా కష్టపడితే విజయం తథ్యం’ అంటోందామె.అందరూ తోడేనేహా చదువుకుంటూ ఉంటే ఒక్కోరోజు ఒక్కొక్కరు తోడు కూచునేవారు. ఒకరోజు తండ్రి, మరోరోజు బాబాయి... ‘మేమున్నాం తోడుగా. నీ ప్రిపరేషన్‌ నువ్వు, మేము నీకు తోడు అనే భరోసా దీని ద్వారా అందేది’ అంటుంది నేహా. ఆమెకు ముగ్గురు తమ్ముళ్లు. వారిలో ఒక తమ్ముడు మెయిన్స్‌కు అన్ని ప్రశ్నలు సమయానికి రాయడం ఎలాగో టిప్స్‌ చెప్పి సాధన చేయించాడు. ‘మా ఇంట్లో రోజూ నాకు మాక్‌ ఇంటర్వ్యూలు ఉండేవి. రోజూ ఎవరో ఒకరు ఐ.ఏ.ఎస్‌. కోసం బోర్డు ఎలా అయితే ప్రశ్నలు అడుగుతుందో అలా ప్రశ్నలు ప్రిపేరయ్యి మరీ నన్ను అడిగేవారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది నేహా.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement