రజనీ, సైనా, సానియాకు 'పద్మ' అవార్డులు
న్యూఢిల్లీ: తెలుగు తేజాలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. రజనీకాంత్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్.. సైనా, సానియా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్ రవిశంకర్, రిలయన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీలకు పద్మవిభూషణ్ అవార్డును ప్రధానం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు..
పద్మవిభూషణ్: రజనీకాంత్, రామోజీ రావు, జగ్మోహన్ (జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్), పండిట్ రవిశంకర్, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం), విశ్వనాథన్ శాంతా, ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం), డాక్టర్ వాసుదేవ్ ఆత్రే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అవినాశ్ దీక్షిత్
పద్మభూషణ్: సానియా మీర్జా, సైనా నెహ్వాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఏవీ రామారావు, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ (మాజీ కాగ్), బర్జీందర్ సింగ్, స్వామి తేజోమయనంద, స్వామి దయానంద సరస్వతి, రామ్ సుతార్, ప్రొఫెసర్ రామనుజ తాతాచార్య, హీస్నమ్ కన్హేలాల్, రాబర్ట్ బ్లాక్ విల్, షాపూర్జీ మిస్త్రీ, ఆర్సీ భార్గవ, హఫీజ్, ఇందు జైన్
పద్మశ్రీ: రాజమౌళి, టీవీ నారాయణ, సునీతా కృష్ణన్, యార్లగడ్డ నాయుడమ్మ, లక్ష్మా గౌడ్, గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ గోపీచంద్, ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, ఉజ్వల్ నికమ్ (న్యాయవాది), అవస్థీ, దీపికా కుమారి, సయీద్ జాఫ్రీ, ప్రతిభా ప్రహ్లాద్, బుకిదన్ గాద్వి, తులసీదాస్ బోర్కర్, ఓంకార్ శ్రీవాత్సవ, శ్రీబస్ చంద్ర సుపకార్, సోమా ఘోష్, నీలా మాదబ్ పాండ, మాధుర్ భండార్కర్, వెంకటేష్ కుమార్, మమత చంద్రకార్, లక్ష్మా గౌడ్, జై ప్రకాష్ లేఖివాల్, నరేష్ చందర్లాల్, ధీరేంద్ర నాథ్, రవీంద్ర నాగర్, అజయ్ పాల్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రెడ్రగ్ నికిక్, సల్మాన్ అమిన్, మైకేల్ పోస్టెల్, ప్రకాష్ చంద్ సురానా, దిలీప్ సంఘ్వి, మహేష్ శర్మ, సుశీల్ దోశి, అరుణాచలం మురుగంతం, సుధాకర్ ఓల్వె, గోపీనాథ్ నాయర్, శ్రీనివాసన్ దమల్, అజయ్ కుమార్ దత్తా, వీణా టాండన్, సతీష్ కుమార్, ఎంసీ మెహతా, నాగేంద్ర, రవీంద్ర కుమార్, ఎంఎం జోషీ, అనిల్ కుమారి మల్హోత్రా, దల్జిత్ సింగ్, ప్రవీణ్ చంద్ర