padma vibhushan
-
జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం
న్యూఢిల్లీ: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 73 ఏళ్ల హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజులుగా బాగా విషమించింది. దాంతో రెండు వారాల క్రితం అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించినట్టు వార్తలొచ్చాయి. జాకీర్ హుస్సేన్ సన్నిహితుడు, ప్రముఖ వేణువాద కళాకారుడు రాకేశ్ చౌరాసియా కూడా తొలుత దాన్ని ధ్రువీకరించారు. కాసేపటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశం సంగీత ధ్రువతారను కోల్పోయింది. సంగీత ప్రపంచానికి ఆయన సేవలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. విపక్ష నేత రాహుల్ గాం«దీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తదితరులు సంతాపం తెలిపారు. కానీ జాకీర్ హుస్సేన్ మృతి వార్తలను ఆయన సోదరి ఖుర్షీద్ ఖండించారు. ‘‘నా సోదరుని పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్న మాట నిజమే. కానీ ప్రస్తుతానికి ఆయన ప్రాణాలతోనే ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘జాకీర్ హుస్సేన్ మరణించారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వార్తలు మమ్మల్నెంతో బాధిస్తున్నాయి. వాటిని నమ్మొద్దని మీడియాకు, ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కోలుకోవాలని అంతా ప్రారి్థంచాల్సిందిగా కోరుతున్నాం’’ అని పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు మార్చినట్టు ఆయన మేనేజర్ నిర్మలా బచానీ కూడా పేర్కొన్నారు. కాసేపటికే ఐ అండ్ బీ శాఖ కూడా ఎక్స్‌లో చేసిన సంతాప పోస్ట్‌ను తొలగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి: బహుముఖ సంగీత ప్రజ్ఞకు జాకీర్ హుస్సేన్ నిలువెత్తు నిదర్శనం. హిందూస్తానీ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు జాజ్ ఫ్యూజన్లోనూ తిరుగులేని నైపుణ్యం సాధించారు. గ్రేటెస్ట్ తబలా ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్‌లో ఒకరిగా నిలిచారు. సంగీత దర్శకునిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇన్ కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాల్లో నటించారు కూడా. ఆయన ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడు. 1951 మార్చి 9న ముంబైలో జని్మంచిన ఆయన అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. తండ్రి బాటలో నడుస్తూ ఏడేళ్ల చిరుప్రాయంలోనే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించారు. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. జాకిర్ హుస్సేన్ అందుకున్న జాతీయ, అంతర్జాతీయ బహుమతులకు, పురస్కారాలకూ లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. పదేళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. -
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
సాక్షి,బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ (సోమనహళ్లి మల్లయ్య కృష్ణ) (92) ఏళ్ల వయసులో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు ఉదయం 2.30 -2.45 గంటల సమయంలో తన నివాసంలో మరణించారు. ఎస్ఎం కృష్ణ అక్టోబర్ 11,1999 నుండి మే 28,2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా, 1993 నుండి 1994 డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. 2009-2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అయితే, కాంగ్రెస్‌తో దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి స్వస్తి పలికారు. 2017 మార్చిలో బీజేపీలో చేరారు. పద్మవిభూషణ్ అవార్డ్తోప్రజా వ్యవహారాల (Public Affairs) రంగంలో ఎస్ఎం కృష్ణ అందించిన అసమాన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2023లో పద్మవిభూషణ్ అవార్డ్‌తో సత్కరించింది.సిలికాన్ సిటీ కేరాఫ్ ఎస్ఎం కృష్ణకర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఎస్ఎం కృష్ణ తన పదవీ కాలంలో ఐటీ రంగంలో చేసిన కృషి వల్లే బెంగళూరు సిలికాన్ వ్యాలీగా అవతరించిందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జాన్ కెన్నెడీ తరుఫున కృష్ణ ఎన్నికల ప్రచారం ఎస్ఎం కృష్ణ సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ (డల్లాస్), జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. 1960లో మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ తరుఫున ప్రచారం చేశారు. నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తన తరుఫున ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ 28 కృష్ణకు లేఖ రాశారు. దీంతో ఆయన జాన్ కెన్నెడీ మద్దుతగా ప్రచారంలో పాల్గొన్నారు. 1961లో కెన్నెడీ 35వ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కృష్ణ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. 1962లో కృష్ణ.. మద్దూరు నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 👉చదవండి : నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు! -
ఇళయరాజాకు పద్మవిభూషణ్
న్యూఢిల్లీ: 2018 సంవత్సరానికి 85 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులు, అద్భుతమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నా ఇన్నాళ్లుగా సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలకు పద్మ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా (74)తో పాటుగా హిందుస్తానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం (కన్యాకుమారి) అధ్యక్షుడు పరమేశ్వరన్‌లు కూడా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2009లో ఇళయరాజా పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ జాబితాలో పేదలకు సేవ చేసిన వారికి, ఉచిత పాఠశాలలు ఏర్పాటుచేసిన వారికి గిరిజన కళలకు ప్రపంచ ప్రఖ్యాతి అందించిన వారికి చోటు కల్పించింది. పద్మ భూషణ్ జాబితాలో ప్రముఖులు పద్మ భూషణ్ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్రపంచ చాంపియన్ పంకజ్ అడ్వాణీ, గోవా చిత్రకారుడు లక్ష్మణ్ పాయ్, ఆధ్యాత్మికవేత్త ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్, పురాతత్వవేత్త రామచంద్రన్ నాగస్వామిసహా తొమ్మిది మంది ఉన్నారు. సామాజికసేవ, ప్రజాసంబంధాలు, ఇంజనీరింగ్, వాణిజ్య, విద్య, వైద్య, సాహిత్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలందించిన 73 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కరే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. అభయ్ బంగ్–రాణిబంగ్ (సంయుక్తంగా వైద్యరంగం)–మహారాష్ట్ర, దామోదర్ గణేశ్ బాపత్ (సామాజికసేవ)–ఛత్తీస్‌గఢ్, సైకోమ్ మీరాబాయ్ చాను (వెయిట్‌లిఫ్టింగ్)– మణిపూర్ తదితరులు పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని వారికి సరైన గౌరవం కల్పిస్తామని చెబుతూ వస్తు న్న కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు తగ్గట్లుగా నే.. సామాజిక సేవ చేస్తున్న వారికి పద్మశ్రీ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది. అవార్డు గ్రహీతల్లో విదేశీయులు! ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 16 మంది విదేశీ, ఎన్నారై ప్రతినిధులున్నారు. ఇందులో ముగ్గురు మరణానంతరం పద్మ అవార్డులు అందుకోనున్నారు. భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడాకిన్‌కు (మరణానంతర) పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. వాణిజ్యరంగంలో సేవలకు గానూ ఫిలిప్పీన్స్‌కు చెందిన జోస్ మాజోయ్, మలేసియాకు చెందిన నృత్యరంగ ప్రముఖుడు రామ్లీ బిన్ ఇబ్రహీం, బౌన్లాప్ కియోకంగ్నా (లావోస్), టామీ కో (సింగపూర్), హున్ మెనీ (కంబోడియా), నౌఫ్ మార్వై (సౌదీ అరేబియా), తోమియో మిజోకమి (జపాన్), సోమ్డెట్ ఫ్రా మా (థాయ్‌లాండ్), థాంట్ మైయింట్ (మయన్మార్), ఐ న్యోమన్ నౌతా (ఇండోనేసియా), మలై హాజీ అబ్దుల్లా (బ్రూనై దారుస్సలాం), హబీబుల్లో రాజా బౌ (తజకిస్తాన్), డాక్టర్ సందుక్ రుయిత్ (నేపాల్), ఎన్గుయెన్ తీన్ (వియత్నాం)లు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ విజేతలు పద్మవిభూషణ్: ఇళయరాజా (సంగీతం)–తమిళనాడు, గులాం ముస్తఫాఖాన్ (సంగీతం)–మహారాష్ట్ర, పరమేశ్వరన్ పరమేశ్వరన్ (సాహిత్యం, విద్యారంగం)– కేరళ. పద్మ భూషణ్: మహేంద్ర సింగ్ ధోనీ (క్రికెట్)–జార్ఖండ్, పంకజ్ అడ్వాణీ (బిలియర్డ్స్)– కర్ణాటక, ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్ (ఆధ్యాత్మికం)–కేరళ, అలెగ్జాండర్ కడాకిన్ (ప్రజాసంబంధాలు)–రష్యా (మరణానంతర/విదేశీ), రామచంద్రన్ నాగస్వామి (పురాతత్వ విభాగం)–తమిళనాడు, వేదప్రకాశ్ నంద (సాహిత్యం, విద్యారంగం)–అమెరికా, లక్ష్మణ్ పాయ్ (కళారంగం)–గోవా, అరవింద్ పారిఖ్ (సంగీతం)–మహారాష్ట్ర, శారదాసిన్హా (సంగీతం)–బిహార్. మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో కొందరు లక్ష్మీ కుట్టి: కేరళకు చెందిన గిరిజన మహిళ ఈమె. 500 రకాల మూలికలతో మందులను తయారుచేసి వేల మంది గిరిజనులకు వైద్యసాయం అందిస్తున్నారు. కొండల్లో ఉంటూ పాముకాటుకు గురైన వారికి ప్రాథమిక వైద్యంతో ప్రాణాలు కాపాడుతున్నారు. కేరళ ఫోక్లోర్ అకాడమీలో చదువు చెప్పే లక్ష్మి కుట్టి.. అడవిలో గిరిజనులతో కలిసి తాటిచెట్టు ఆకులతో చేసిన చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. అరవింద్ గుప్తా: ఐఐటీ కాన్పూర్‌లో విద్యనభ్యసించారు. చెత్తనుంచి సైన్స్‌ను నేర్చుకోవటంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్నారు. నాలుగు దశాబ్దాల్లో 3వేల పాఠశాలలను సందర్శించి.. పనికిరాని వస్తువుల సాయంతో బొమ్మలను రూపొందించటంపై 18 భాషల్లో 6,200 లఘుచిత్రాలను రూపొందించారు. 1980ల్లో తరంగ్ పేరుతో విద్యార్థులకోసం టీవీషోను నిర్వహించారు. భజ్జు శ్యామ్: అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన గోండు చిత్రకారుడు భజ్జు శ్యామ్. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన భజ్జు శ్యామ్ రాత్రి వాచ్‌మన్‌గా, ఎలక్ట్రిషియన్‌గా కుటుంబ పోషణ చేసేవారు అనంతరం ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా యురప్‌లో గోండు పెయింటింగ్స్ (మధ్యప్రదేశ్‌లోని గిరిజన సంప్రదాయ చిత్రకళ) ద్వారా ప్రాముఖ్యత సంపాదించారు. ఐదు విదేశీ భాషల్లో ఈయన రూపొందించిన ‘ద లండన్ జంగిల్ బుక్’ 30వేల కాపీలు అమ్ముడుపోయింది. సుధాంషు బిశ్వాస్: 99 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు. ఇప్పటికీ పేదల సేవలోనే జీవితాన్ని గడుపుతున్నారు. వీరికోసం పాఠశాలలు, అనాథాశ్రమాలు ఏర్పాటుచేశారు. మురళీకాంత్ పేట్కర్: 1965 భారత్–పాక్ యుద్ధంలో భుజం తెగిపడినా తెగువప్రదర్శించారు. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించారు. ఎమ్ఆర్ రాజగోపాల్: కేరళలో సుపరిచితమైన వైద్య ప్రముఖుడీయన. నవజాత శిశువులకు సంబంధించిన వైద్యం ఈయన ప్రత్యేకత. సుభాషిణి మిస్త్రీ: గ్రామీణ పశ్చిమబెంగాల్లోని పేద మహిళ. ఈమె 20 ఏళ్లపాటు ఇళ్లలో పాచిపని, రోజూవారీ కూలీగా పనిచేసి పేద ప్రజల కోసం హాస్పిటల్ కట్టించారు. రాజగోపాలన్ వాసుదేవన్: భారత్‌లో ప్లాస్టిక్ రోడ్ల తయారీతో ఈయన ప్రాచుర్యం పొందారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను నిర్మించటంలో సృజనాత్మక పద్ధతుల్లో ప్రయత్నించినందుకు పెటెంట్ కూడా పొందారు. -
బిస్మిల్లాఖాన్ ‘పద్మ విభూషణ్’కు చెదలు
వారణాసి: దివంగత ప్రసిద్ధ షెహనాయ్ వాద్యకారుడు, భారతరత్న పురస్కార గ్రహీత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పద్మ విభూషణ్ ధ్రువపత్రంలో కొంత భాగాన్ని చెదలు తిన్నాయి. సోమవారం బిస్మిల్లా ఖాన్ 11వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన వస్తువులను శుభ్రం చేసి సర్దుతుండగా ఈ విషయాన్ని గుర్తించారు. 1980లో నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా బిస్మిల్లా ఖాన్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో భారత రత్న అందుకున్న ఖాన్ 2006లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఖాన్ ఉపయోగించిన సంగీత వాద్యాలు, సాధించిన పురస్కారాలు, ధ్రువపత్రాలను సంరక్షించేందుకు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదనీ ఆయన మనవడు వాపోయారు. -
పాటకు కులం.. మతం లేదు
► పద్మ విభూషణ్ కె.జె ఏసుదాస్ ఏసుదాస్ హిట్స్ – తెలుగు 1. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన (మేఘసందేశం) 2. గాలివానలో వాన నీటిలో (స్వయంవరం) 3. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (అంతులేని కథ) 4. చిన్ని చిన్ని కన్నయ్యా (భద్రకాళి) 5. సాయీ శరణం బాబా శరణం (శ్రీ షిర్డీ సాయిబాబా) హిందీ 1. ఆజ్ సే పహెలే (చిత్‌చోర్) 2. కా కరూ సజ్నీ (స్వామి) 3. కోయి గాతా మై సోజాతా (ఆలాప్) 4. దిల్ కే టుక్డే టుక్డే కర్కే (దాదా) 5. కహా సే ఆయె బదరా (చష్మే బద్దూర్) భక్తి... కరుణ... ప్రేమ... సంతోషం... విషాదం...ఏసుదాస్ ఏ పాట పాడినా శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర పడిపోతుంది. ఏ భాషలో పాడితే అది ఆయన మాతృభాష ఏమో అన్న భావన కలుగుతుంది. 50 ఏళ్లకు పైగా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ గాన గంధర్వుడి స్వరం ‘ఎవర్ గ్రీన్’. ‘పద్మ విభూషణ్’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా కె.జె. ఏసుదాస్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ... ► కంగ్రాట్స్ సార్... బుధవారం ఇంటర్వ్యూ ఇవ్వలేనంత బిజీ. గురువారం ఇస్తా అన్నారు. ఆలస్యమైనా ‘సాక్షి’తో మీరు ప్రత్యేకంగా మాట్లాడటం హ్యాపీగా ఉంది.. థ్యాంక్స్. ప్రశంసలు ఏ వ్యక్తికైనా ఉత్సాహాన్నిస్తాయి. నాకు ఉత్సాహా నివ్వడంతో పాటు నా గురువులను గుర్తు చేసాయి. నా తొలి గురువు మా నాన్న అగస్టీన్ జోసెఫ్. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎందరో గురువులు. కేఆర్ కుమారస్వామి అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, చెంబయ్ వైద్యనాథ భాగవతార్.. ఇలా ఎంతోమంది. వాళ్లు సాధించిన వాటి కంటే నేనేం ఎక్కువ సాధించలేదు. నా గొప్పతనం ఏమీ లేదు. నేనేం సాధించినా అదంతా నా గురువుల ఆశీర్వాద బలమే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సార్ దగ్గర నేను చదువుకోలేదు. కానీ, ఆయన్ను గురువులానే భావిస్తాను. ఆయన ప్రభావం కూడా నా మీద ఉంది. ఇంకా నేను చాలామంది గురువులకు ఏకలవ్య శిష్యుణ్ణి. ► గురువుల ఆశీస్సులే కారణం... నేను సాధించిందేమీ లేదనడం మీ గొప్పతనం. ఇవాళ మీరు దేశం గర్వించదగ్గ గాయకుడు కావడానికి మీ కృషి చాలానే ఉంది.. అది మా అమ్మానాన్న చేసిన తపస్సు అంటాను. వాళ్లు చేసిన పుణ్యమే నాకు వరం అయింది, నాకు సంగీత జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ పుణ్యఫలమే నన్నింతటివాణ్ణి చేసింది. అమ్మానాన్నలు పిల్లలకు ఎంతో చేస్తారు. వాళ్లకు పిల్లలు ఎంత చేసినా తక్కువే. ఈరోజు మా అమ్మానాన్న నాతో లేరు. అందనంత దూరంలో ఉన్నా వాళ్ల ఆశీర్వాదాలు నాకెప్పుడూ దగ్గరగానే ఉంటాయి. ► ఈ సందర్భంగా మీ అమ్మానాన్నల గురించి మీరు ఎప్పటికీ మరచిపోలేని విషయం ఏదైనా చెబుతారా? ఒక్క విషయం కాదు. చాలా ఉన్నాయి. అయితే గాయకుడిగా నేనీ స్థాయికి రావడానికి కారణమైన ఓ విషయం చెబుతాను. నా మొదటి గురువు మా నాన్నగారని చెప్పాను కదా. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించకపోతే ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఉదయం ప్రార్థన చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా పదాన్ని సరిగ్గా పలకపోతే సరిగ్గా పలికేవరకూ ఒప్పుకునేవారు కాదు. ‘మిగతా పనులు చేసుకోవాలి కదా.. త్వరగా ప్రార్థన ముగించండి’ అని అమ్మ అన్నప్పటికీ, నాన్నగారు పట్టించుకునేవారు కాదు. కరెక్ట్‌గా చెప్పాకే వదిలేవారు. ఆ రోజు ఆయన అలా చేయడం తర్వాత తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. ► ‘మా పాపాలు తొలగించు...’ అనే సాయిబాబా పాట, ‘హరివరాసనమ్ స్వామి విశ్వమోహనం..’ అనే అయ్యప్ప పాట మీ గొంతు నుంచి వచ్చినవే. పాటకు కులం లేదని పాడే తీరులో చెప్పేశారు... అవును.. పాటకు కులం లేదు.. మతం లేదు. అసలు కుల మతాలే లేవు. భగవద్గీత, ఖురాన్, బైబిల్.. ఇలా పెద్ద పెద్ద గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే.. దేవుణ్ణి ఎవరూ తయారు చేయలేదు. ‘దేవుడు ఒక్కడే’ అని చెప్పాయి. కానీ, ఆ దేవుడు తయారు చేసిన మనం మాత్రం మన సౌకర్యం కోసం ప్యాంటూ, షర్టూ వేసుకున్నట్లు కులం, మతం అని పెట్టుకున్నాం. మనంతట మనం పెట్టుకున్న నియమాల కోసం గొడవలు పడుతున్నాం. రాజకీయం చేసుకుంటున్నాం. ‘దేవుడు ఒక్కడే’ అని మహా గ్రంథాలు చెబుతున్నప్పుడు ‘నీ దేవుడు.. నా దేవుడు’ అని విభజించాం. ఈ విభజన సంతోషాన్నిస్తుందా? మనశ్శాంతిగా ఉండగులుగుతున్నామా? అని ప్రశ్నించుకోవాలి. ► ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా కులం కోసమో, మతం కోసమో, పదవుల కోసమో.. ఇలా అన్నీ గొడవలే.. 77 ఏళ్లుగా ప్రపంచాన్ని చూస్తున్న వ్యక్తిగా వీటి గురించి మీరేమంటారు? మానవ జన్మ అదృష్టం అంటారు. దాన్ని వరంగా మార్చుకోవడం, శాపంగా మార్చుకోవడం... ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. పోరాడతాం.. పోరాడతాం.. పోరాడతాం... ఎంత కాలం పోరాడతాం? ఈ భూమ్మీదకు వచ్చినవాళ్లు వెళ్లక తప్పదు. అందుకే వీలైనంత సంతోషంగా బతకాలి. శాంతంగా ఉండాలంటాను. ► గాయకుడిగా ఓసారి మీ తొలి రోజుల్లోకి వెళితే ఒకే రోజున నాలుగు సౌత్ మూవీస్‌కి పదకొండు పాటలు పాడారట.. ఎలా సాధ్యమైంది? ఇప్పుడున్న సౌకర్యాలకు 30 పాటలు కూడా పాడేయొచ్చు. అప్పట్లో ఒకే రోజు పదకొండు పాటలంటే చిన్న విషయం కాదు. గుర్తు చేసుకుంటే ఆనందంగా ఉంది. మీకో విషయం చెప్పాలి. ఆ రోజున పన్నెండో పాట కూడా పాడేంత టైమ్ ఉంది. కానీ ఒకే రోజున 12 పాటలు పాడితే దిష్టి తగులుతుందని భయపడ్డాను. అందుకే ఆ ఒక్క పాట వదిలేశాను (నవ్వుతూ). ► భక్తి పాటలు అద్భుతంగా పాడిన మీరు ‘ముద్దుతో ఓనమాలు దిద్దించనా..’ అంటూ రొమాంటిక్ సాంగ్, ‘ఆకాశ దేశాన.. ఆషాఢ మాసాన..’ అంటూ విరహ గీతమూ పాడారు.. ఇలాంటి పాటలు పాడినప్పుడు మీకెలా అనిపించేది? మీరు పాట రసం గురించి మాట్లాడుతున్నారు. భక్తి రసం, ప్రేమ రసం, దుఃఖ రసం.. ఇలా అన్ని రసాలకూ ఓ గాయకుడిగా ఊపిరి పోయడం నా బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానే తప్ప నేను గొప్ప అనుకోవడంలేదు. ఏ ట్యూన్ అయినా కంపోజర్‌కి బిడ్డలాంటిది. గాయకుడికి కూడా పాట అలాంటిదే. పాట పాడే ముందు ఆ పాట మూడ్‌ని దృష్టిలో పెట్టుకుని పాడతాను. ► భారతీయ భాషలన్నింటిలోనూ పాడారు కదా... మీ మాతృభాష మలయాళం తర్వాత మీకు సులువుగా ఉన్న భాష ఏదనిపించింది? కళాకారులకు భాషాభేధం లేదు. ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు. రికార్డింగ్‌కి వెళ్లే ముందు ‘పాట పాడటానికి వెళుతున్నాం’ అనుకుంటాను కానీ భాష గురించి ఆలోచించను. నేను భాష.. ఆ భాష తాలూకు పదాలకన్నా ‘అక్షరాల’ను నమ్ముతాను. పదాలను నమ్మను. కృష్ణుడు ముందు అక్షరం ‘క’తోనే మొదలవుతుంది. క్రీస్తులో కూడా ‘క’ అక్షరం ఉంది. కృష్ణుడులో ‘క్రి’ ఉంది.. క్రీస్తులోనూ ‘క్రి’ ఉంది. పదాలు చెప్పినప్పుడు భాష ఏంటో కనుక్కోగలుగుతాం కానీ అక్షరాలతో భాషను కనుక్కోవడం సాధ్యమా? ఉదాహరణకు, ‘ఆ’, ‘క’ అనే అక్షరాలు చెప్పి, ఇవి ఏ భాష అనడిగితే చెప్పగలుగుతామా? అన్ని భాషల్లోనూ అవి ఉన్నాయి కదా. అందుకే నేను అక్షరాలను మాత్రమే నమ్ముతాను. ► సూపర్ సార్. ఫైనల్లీ ‘పద్మవిభూషణ్’ ఏసుదాస్... గాయకుడిగా ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఈ ప్రపంచంలో దేనికైనా అంతం ఉంటుందేమో కానీ, ‘లెర్నింగ్’కి ఉండదు. ఇంకా చాలా నేర్చుకోవాలి. -
‘నాకుంది 12మంది ఎంపీలే.. నేనెలా రాష్ట్రపతిగా..’
ముంబయి: తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకొస్తానని అనవసరం ప్రచారం చేయొద్దని, అలాంటి ఊహాగానాలకు తెరదించాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. పద్మ విభూషణ్ పురస్కారం పవార్‌కు దక్కిన నేపథ్యంలో ఆయనను కలిసిన మీడియాలో పలు విషయాలు మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రశ్నించగా.. ‘కేవలం పన్నెండు మంది ఎంపీలను కలిగిన ఓ వ్యక్తి అంత పెద్ద స్థాయిని(రాష్ట్రపతి హోదా) ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరాదు. లోక్ సభలో, రాజ్యసభలో నా బలమెంతో నాకు బాగా తెలుసు. మొత్తం కలిపి నా దగ్గర ఉందే 12మంది ఎంపీలు. వారి సహాయంతో అది ఆశించకూడదు’ అని స్పష్టం చేశారు. ఇక ప్రధాని పదవిపై ఆయనకున్న శక్తి సామర్థ్యాలను ప్రశ్నించగా దేశంలో అలాంటి శక్తి గలవారు చాలామంది ఉన్నారని, అయితే, వారిలో ఒకరికి రాజకీయ శక్తిసామర్థ్యాలు అవసరం అని అన్నారు. రాజకీయాల్లో శక్తిసామర్ధ్యాలు చూడరని, రాజకీయ బలమే ముఖ్యం అని అన్నారు. తనకు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డును రైతులకు అంకితం ఇస్తున్నాని చెప్పారు. మొత్తం దేశానికి తాను చేసిన సేవలు గుర్తించే ఈ పురస్కారం లభించిందని తాను భావిస్తున్నానని అన్నారు. 76 ఏళ్ల తాను రాజకీయ క్షేత్రంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నానని, ఇది దేశం మొత్తం గుర్తించాల్సిన అంశం అన్నారు. దేశంలో దేశం వెలుపలా చేసిన అద్భుత కృషికి తనకు ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు దక్కిన విషయం గుర్తు చేశారు. కానీ, తనను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. -
జేసుదాస్‌కు పద్మవిభూషణ్
సంగీత దిగ్గజానికి రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. కొన్ని దశాబ్దాలుగా తన విలక్షణమైన గానమాధుర్యంతో యావద్దేశాన్ని అలరిస్తున్న ప్రముఖ గాయకుడు కె.జె. జేసుదాస్‌కు పద్మ విభూషణ్ లభించింది. ఆయనతో పాటు దివంగత నేతలు సుందర్‌లాల్ పట్వా, పీఏ సంగ్మాలకు కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఇప్పటివరకు ప్రతిసారీ ఎక్కువగా ప్రముఖులకు, అందరికీ తెలిసినవారికి మాత్రమే వస్తున్న పద్మ అవార్డులు ఈసారి సంఘసేవలో ఉన్నవారికి, వివిధరంగాల్లో లబ్ధప్రతిష్ఠులకు కూడా వచ్చాయి. కలరియపట్టు లాంటి యుద్ధ విద్యను గత 68 సంవత్సరాలుగా ప్రాక్టీసు చేస్తున్న మీనాక్షి అమ్మ, ఎయిడ్స్‌పై పోరాటం చేసిన సునీతి సాల్మన్.. ఇలాంటి పలువురికి ఈసారి పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కింది. అవార్డుల పూర్తి వివరాలు ఇవీ... పద్మవిభూషణ్ కె.జె. జేసుదాస్, జగ్గీ వాసుదేవ్, శరద్ పవార్, మురళీ మనోహర్ జోషి, ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు, సుందర్ లాల్ పట్వా, పీఏ సంగ్మా పద్మభూషణ్ విశ్వమోహన్ భట్, ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, తెహెమ్టన్ ఉద్వైదా, రత్నసుందర్ మహరాజ్, స్వామి నిరంజనానంద సరస్వతి, మహాచకి్ర సిరిందోర్న్ (విదేశీయులు), చో రామస్వామి పద్మశ్రీ బసంతి బిస్త్, చెమన్చెరి కున్హిరామన్ నాయర్, అరుణా మొహంతి, భారతీ విష్ణువర్ధన్, సాధు మెహర్, టి.కె. మూర్తి, లైష్రాం బీరేంద్రకుమార్ సింగ్, కృష్ణరామ్ చౌదరి, బవోవా దేవి, తిలక్ గితాయ్, ప్రొఫెసర్ ఎక్కా యాదగిరిరావు, జితేంద్ర హరిపాల్, కైలాష్ ఖేర్, పరస్సల బి. పొన్నమ్మాళ్, సుక్రి బొమ్మగౌడ, ముకుంద్ నాయక్, పురుషోత్తం ఉపాధ్యాయ్, అనురాధా పౌడ్వాల్, వారెప్ప నబా నీల్, త్రిపురనేని హనుమాన్ చౌదరి, టీకే వివ్వనాథన్, కన్వల్ సిబాల్, బిర్ఖా బహదూర్ లింబూ మురింగ్లా, ఎలి అహ్మద్, నరేంద్ర కోహ్లి, ప్రొఫెసర్ జి.వెంకటసుబ్బయ్య, అక్కితం అచ్యుతన్ నంబూద్రి, కాశీనాథ్ పండిత, చాము కృష్ణశాస్త్రి, హరిహర్ కృపాళు త్రిపాఠి, మైఖేల్ డానినో, పూనమ్ సూరి, వీజీ పటేల్, వి. కోటేశ్వరమ్మ, బల్బీర్ దత్, భావనా సోమయ్య, విష్ణు పాండ్య, సుబ్రతో దాస్, భక్తియాదవ్, మహ్మద్ అబ్దుల్ వహీద్, మదన్ మాధవ్ గోడ్బోలే, దేవేంద్ర దయాభాయ్ పటేపల్, ప్రొఫెసర్ హరికిషన్ సింగ్, ముకుట్ మింజ్, అరుణ్ కుమార్ శర్మ, సంజీవ్ కపూర్, మీనాక్షి అమ్మ, జెనాభాయ్ దర్గాభాయ్ పటేల్, చంద్రకాంత్ పిఠావా, ప్రొఫెసర్ అజోయ్ కుమార్ రే, చింతకింది మల్లేశం, జితేంద్రనాథ్ గోస్వామి, దారిపల్లి రామయ్య, గిరీష్ భరద్వాజ్, కరీముల్ హక్, బిపిన్ గణత్రా, నివేదితా రఘునాథ్ భిడే, అప్పాసాహెబ్ ధర్మాధికారి, బాబా బల్బీర్ సింగ్ సీచేవల్, విరాట్ కోహ్లీ, శేఖర్ నాయక్, వికాస గౌడ, దీపా మాలిక్, మరియప్పన్ తంగవేలు, దీపా కర్మాకర్, పీఆర్ శ్రీజేష్, సాక్షి మాలిక్, మోహన్ రెడ్డి వెంకట్రామ బోడనపు, ఇమ్రాన్ ఖాన్, అనంత్ అగర్వాల్, హెచ్ఆర్ షా, సునీతి సాల్మన్, అశోక్ కుమార్ భట్టాచార్య, డాక్టర్ మపుస్కర్, అనురాధా కొయిరాలా -
ధీరూభాయ్ కి పద్మ విభూషణ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీకి ప్రకటితమైన దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను ఆయన సతీమణి కోకిలాబెన్ రాష్ట్రపతిభవన్‌లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబసభ్యులు, ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోకిలాబెన్ మాట్లాడుతూ.. ఆయన మానవత్వంతో చాలా సాధారణ జీవితం గడిపారని, దేశం కోసం కష్టపడ్డారని చెప్పారు. తన భర్తకు ఈ అరుదైన గౌరవాన్ని కల్పించిన ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నా భారతావనిలో చాలా మంది ధీరూభాయ్‌లు జన్మించాలి. వారు దేశ సామాజికార్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యవత్తు ప్రజానికానికి వారి సేవలు తోడ్పాటునందించాలి’ అని ఆమె ఆకాంక్షించారు. ధీరూభాయ్‌కి పద్మ విభూషణ్ లభించడం భారతీయ వాణిజ్యతత్వ ఆకాంక్షకి, ఏ పనినైనా అత్యుత్తమంగా చేయాలనే లక్షణానికి గౌరవంగా భావిస్తున్నానని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ‘గొప్ప వ్యాపారవేత్త, సంపద సృష్టి కర్త అయిన మా నాన్నకు లభించిన అరుదైన గుర్తింపు ఈ పురస్కారం’ అని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పేర్కొన్నారు. -
విరబూసిన పద్మాలు
-
నగరానికి పద్మాభిషేకం
పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డుల పంట కొంతమందికి పద్మశ్రీ అవార్డులు సిటీబ్యూరో : భాగ్యనగరంలో ‘పద్మా’లు వికసించాయి. వివిధ రంగాల్లో మహోన్నత సేవలందించిన ప్రముఖులకు కేంద్రం సోమవారం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులు అందుకున్న వారిలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. సాహిత్యం, పాత్రికేయ రంగంలో అపార సేవలందించినందుకు‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును ‘పద్మవిభూషణ్’తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. సీనియర్ వైద్య నిపుణులు, ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్ ప్రొఫెసర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘పద్మ భూషణ్’ వరిం చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్,టెన్నిస్ తార సానియా మీర్జాలకూ ‘పద్మ విభూషణ్’ అవార్డు లభించింది. ప్రముఖ చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్, కార్డియో థొరాసిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మన్నం గోపీచంద్, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సునీత కృష్ణన్, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ టీవీ నారాయణలకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా లభించిన ఈ అవార్డులతో హైదరాబాద్ మురిసింది. అవార్డులు అందుకున్న ప్రముఖుల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి. ఇద్దరు క్రీడాకారులు సానియా, సైనాలకు అవార్డులు లభించడం పట్ల క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు వైద్య నిపుణులు, సామాజిక సేవా రంగానికి సైతం సముచితమైన గౌరవం లభించడంతో అంతటా సంతోషం వ్యక్తమైంది. -
పద్మ విజేతలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: వివిధ రంగాల్లో విశేష కృషి చేసి పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజంలో ఎంతో సేవలందించిన రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం సముచితమన్నారు. క్రీడల్లో హైదరాబాద్ పేరు నిలబెడుతున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్, వైద్య రంగంలో సేవలందించిన డాక్టర్ నాగేశ్వర్రెడ్డిలకు పద్మ భూషణ్ పురస్కారం రావడం వల్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. పద్మశ్రీకి ఎంపికైన సినీ దర్మకుడు రాజమౌళి, కె.లక్ష్మణ్‌గౌడ్ (ఆర్ట్ పెయింటింగ్), డాక్టర్ మన్నం గోపీచంద్ (కార్డియో థోరాసిక్ సర్జరీ), డాక్టర్ టి.వి.నారాయణ (సామాజిక సేవ), ఆల్ల గోపాలకృష్ణ గోఖలే (కార్డియాక్ సర్జరీ)లకు సీఎం అభినందనలు తెలిపారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన పండిట్ రవిశంకర్, రజనీకాంత్, పద్మ భూషణ్‌కు ఎంపికైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. -
'పద్మవిభూషణ్'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ
చెన్నై: 'నాకు పద్మవిభూషణ్ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్ చేశారు. అభిమానులకు, స్నేహితులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. Feeling deeply honoured for being awarded the Padma Vibhushan.My heartfelt thanks to my dear fans, well wishers & friends for all the wishes — Rajinikanth (@superstarrajini) January 25, 2016 -
రజనీ, సైనా, సానియాకు 'పద్మ' అవార్డులు
న్యూఢిల్లీ: తెలుగు తేజాలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. రజనీకాంత్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్.. సైనా, సానియా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్ రవిశంకర్, రిలయన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీలకు పద్మవిభూషణ్ అవార్డును ప్రధానం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు.. పద్మవిభూషణ్: రజనీకాంత్, రామోజీ రావు, జగ్మోహన్ (జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్), పండిట్ రవిశంకర్, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం), విశ్వనాథన్ శాంతా, ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం), డాక్టర్ వాసుదేవ్ ఆత్రే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అవినాశ్ దీక్షిత్ పద్మభూషణ్: సానియా మీర్జా, సైనా నెహ్వాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఏవీ రామారావు, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ (మాజీ కాగ్), బర్జీందర్ సింగ్, స్వామి తేజోమయనంద, స్వామి దయానంద సరస్వతి, రామ్ సుతార్, ప్రొఫెసర్ రామనుజ తాతాచార్య, హీస్నమ్ కన్హేలాల్, రాబర్ట్ బ్లాక్ విల్, షాపూర్జీ మిస్త్రీ, ఆర్సీ భార్గవ, హఫీజ్, ఇందు జైన్ పద్మశ్రీ: రాజమౌళి, టీవీ నారాయణ, సునీతా కృష్ణన్, యార్లగడ్డ నాయుడమ్మ, లక్ష్మా గౌడ్, గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ గోపీచంద్, ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, ఉజ్వల్ నికమ్ (న్యాయవాది), అవస్థీ, దీపికా కుమారి, సయీద్ జాఫ్రీ, ప్రతిభా ప్రహ్లాద్, బుకిదన్ గాద్వి, తులసీదాస్ బోర్కర్, ఓంకార్ శ్రీవాత్సవ, శ్రీబస్ చంద్ర సుపకార్, సోమా ఘోష్, నీలా మాదబ్ పాండ, మాధుర్ భండార్కర్, వెంకటేష్ కుమార్, మమత చంద్రకార్, లక్ష్మా గౌడ్, జై ప్రకాష్ లేఖివాల్, నరేష్ చందర్లాల్, ధీరేంద్ర నాథ్, రవీంద్ర నాగర్, అజయ్ పాల్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రెడ్రగ్ నికిక్, సల్మాన్ అమిన్, మైకేల్ పోస్టెల్, ప్రకాష్ చంద్ సురానా, దిలీప్ సంఘ్వి, మహేష్ శర్మ, సుశీల్ దోశి, అరుణాచలం మురుగంతం, సుధాకర్ ఓల్వె, గోపీనాథ్ నాయర్, శ్రీనివాసన్ దమల్, అజయ్ కుమార్ దత్తా, వీణా టాండన్, సతీష్ కుమార్, ఎంసీ మెహతా, నాగేంద్ర, రవీంద్ర కుమార్, ఎంఎం జోషీ, అనిల్ కుమారి మల్హోత్రా, దల్జిత్ సింగ్, ప్రవీణ్ చంద్ర -
రజనీ, సైనా, సానియాకు 'పద్మ' అవార్డులు
-
దిలీప్‌కుమార్‌కు 'పద్మవిభూషణ్' ప్రదానం
-
దిలీప్‌కుమార్‌కు పద్మవిభూషణ్ ప్రధానం
బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో ఈ సారి తన పుట్టినరోజును ఘనంగా నిర్వంచవద్దని అభిమానులను కోరిన దిలీప్ కుమార్ ఆ రోజు కూడా కేవలం తన ఇంటికే పరిమితమయ్యారు. ఈ శుక్రవారమే ఆయన పుట్టిన రోజు జరిగింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బయటికు రాని దిలీప్‌కుమార్‌కు ప్రభుత్వం తరుపున కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డ్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్ అవార్డ్ తో గౌరవించింది. -
అమితాబ్‌కు పద్మ విభూషణ్
ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(72) ప్రతిష్టాత్మక పౌరపురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. తెలుగు తేజాలైన ప్రవాసాంధ్రుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, తెలుగుసినీ నటుడు కోటా శ్రీనివాసరావులు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అమితాబ్‌తోపాటు న్యాయ కోవిదుడు కె.కె.వేణుగోపాల్, కర్ణాటకలోని శ్రీమంజునాథ స్వామి ఆలయ ధర్మాధికారి డి.వీరేంద్ర హెగ్డే, అణుశాస్త్రవేత్త ఎం.రామస్వామి శ్రీనివాసన్, ప్రముఖ వ్యాపారవేత్త కరీం అగా ఖాన్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ మంత్రులు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. అమితాబ్ భార్య జయా బచ్చన్, తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, కూతురు శ్వేతానంద, ఆమె కొడుకు అగస్త్య, కూతురు నవ్య నవేలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు ప్రముఖ సినీనటుడు దిలీప్ కుమార్(92) రాలేకపోయారు. ఇక పద్మ భూషణ్ అందుకున్న వారిలో సినీ ప్రముఖులు జాను బారువా, గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ మంజుల్ భార్గవ, కంప్యూటర్ సైంటిస్ట్ విజయ్ భట్కార్, ఆధ్యాత్మిక గురువు స్వామి సత్యమిత్రానంద్ గిరి, పండిట్ గోకులోత్సవ్ జి మహరాజ్, రాజ్యాంగ నిపుణులు సుభాశ్ సి కశ్యప్, ప్రముఖ వైద్యులు అంబరీశ్ మిట్టల్ ఉన్నారు. కర్ణాటకలోని శ్రీసిద్ధగంగ మఠం అధినేత శివకుమార స్వామి(107) పద్మభూషణ్ అవార్డు అందుకునేందుకు రాలేకపోయారు. -
విరబూసిన వాణిజ్య పద్మాలు
* అగాఖాన్కు పద్మ విభూషణ్ * బిల్-మిలిందా గేట్స్‌లకు పద్మభూషణ్ * పాయ్, నందరాజన్లకు పద్మశ్రీ న్యూఢిల్లీ: వాణిజ్యం, పరిశ్రమల కేటగిరి కింద ముగ్గురు వ్యక్తులకు పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఆయన సతీమణి మిలిందా గేట్స్‌లకు సామాజిక సేవ విభాగంలో పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. ఇక వాణిజ్యం, పరిశ్రమల కేటగిరిలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ల్లో నివసించే కరీమ్ ఆల్ హుస్సేని అగాఖాన్‌ను పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఇది దేశంలో రెండో అత్యున్నత అవార్డు. ఇన్ఫోసిస్ మాజీ బోర్డ్ సభ్యుడు టి. వి. మోహన్‌దాస్ పాయ్‌కు, ఇండో అమెరికన్ ఆర్థిక వేత్త నంద్రాజన్ రాజ్ చెట్టిలకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. బిల్‌గేట్స్, మిలిందాగేట్స్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద 8,200 కోట్ల డాలర్లపైనే. 1995 నుంచి 2014 వరకూ 2-3 ఏళ్లు మినహా ప్రతీ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తన భార్యతో కలిసి 2000లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. పేదరికం, ఆరోగ్యం, విద్య రంగాల్లో ఈ ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అగాఖాన్ షియా ఇస్లామ్‌కు సంబంధించిన నిజారి ఇస్లామిజమ్కు 49వ ఇమామ్‌గా వ్యహరిస్తున్న ఈయన ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హోటళ్ల వ్యాపారం ప్రధానమైనది. ఎన్నో రేసుగుర్రాలకు అధిపతి. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ఆయన సంపద 80 కోట్ల డాలర్లు. ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియాల్లో ధార్మిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నందరాజన్ రాజ్ చెట్టి న్యూఢిల్లీలో 1979లో జన్మించిన చెట్టి.. హార్వర్డ్‌లో 2003లో పీహెచ్డీ చేశారు. అత్యంత పిన్నవయస్సు(29 సంవత్సరాలు)లోనే హార్వర్డ్ ఎకనామిక్స్‌లో బోధన చేపట్టి రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం జర్నల్ ఆప్ పబ్లిక్ ఎకనామిక్స్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. టి. వి.మోహన్‌దాస్ పాయ్ 1994లో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో చేరిన పాయ్.. సీఎఫ్ఓ స్థాయికి ఎదిగారు. ఫైనాన్స్ ఏషియా నుంచి ఉత్తమ సీఎఫ్ఓ అవార్డును పొందారు. కామర్స్, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రుడైన ఆయన వృత్తిరీత్యా చార్టెర్ట్ అకౌంటెంట్. విద్య, పరిశోధన, మానవ వనరుల్లో మరింతగా కృషి చేయడానికి 2006లో ఇన్ఫీ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం అక్షర ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. -
ఆయన సినిమాలకు‘అభిమాన్’ను నేను: ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్
హృషీకేశ్ ముఖర్జీ నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ల్యాబ్ అసిస్టెంట్‌గా మొదలై ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే రచనల మీదుగా సినీ దర్శకుడు కావడం హృషీకేశ్జీకి కలిసొచ్చిన అంశం. కలకత్తాలో న్యూ థియేటర్సలో దర్శకుడు బిమల్‌రాయ్ దగ్గర నుంచి పలువురు దర్శకుల శైలినీ, వారి సామర్థ్యాన్నీ దగ్గర నుంచి గమనించే అవకాశం ఆయనకు వచ్చింది. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. వారిలోని సారాన్ని ఆయన గ్రహించారని నాకు అనిపిస్తుంటుంది. ‘ముసాఫిర్’తో మొదలుపెట్టి ‘అనుపమ’, ‘ఆనంద్’, ‘గుడ్డి’, ‘సత్యకావ్’ - ఇలా దాదాపు 50 చిత్రాలు తీసి, ప్రేక్షక హృదయాలను ఆయన గెలుచుకున్నారు. పద్మవిభూషణ్, ఫాల్కే పురస్కారాలందు కొన్నారు. హృషీకేశ్‌జీ చిత్రాలనగానే నాకు ఠక్కున గుర్తొచ్చేది ‘అభిమాన్’. నాకు ఎంతో ఇష్టమైన సినిమా అది. అందులోని సంగీతం, సున్నితమైన భావోద్వేగాలు, మనసును తాకే ఆ సన్నివేశ పరిమళాలు నా మనసులో ఇప్పటికీ అలా నిలిచిపోయాయి. ప్రతి సినిమాలో ఆయన మానవ సంబంధాలను అద్భుతంగా చూపిస్తారు. ‘అభిమాన్’లో కథానుసారం భార్యాభర్తల్లో ఒకరి ఆధిపత్య భావజాలం, వారి మధ్య నెలకొనే ఘర్షణ - చాలా సహజంగా చూపారు. ఒక సహజమైన భావోద్వేగాన్ని ఎక్కడా అతి చేయకుండా మామూలుగా చెబుతూనే, మనసుపై ముద్ర వేయడమనే హృషీకేశ్‌జీ శైలి నాకు నచ్చుతుంది. కథను తెరకెక్కించడంలో నా స్కూల్ కూడా అదే! అంతా తక్కువ మోతాదులోనే తప్ప, బీభత్సాలు, ఏడుపులు, పెడబొబ్బలు మా చిత్రాల్లో కనపడవు. అలాగే, చుట్టూ ఉన్న మనుషులు, వారి జీవితాలనే తప్ప, జీవితాన్ని మించిపోయిన అసహజమైన కథల జోలి కెళ్ళం. నిజానికి, ‘అభిమాన్’ స్ఫూర్తితో ఒక కథ నా మనసులో ఎప్పటి నుంచో తిరుగుతోంది. దానికెప్పటికైనా తెర రూపమివ్వాలని ఉంది. సినీ రంగంలోని చాలామందికి భిన్నంగా, హృషీకేశ్‌జీ ద్వారా పైకి వచ్చిన నటీనటులకు ఆయనంటే ఎంతో గౌరవం, గురుభావం. నటి జయభాదురి (బచ్చన్) ఒకసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ, హృషీకేశ్ పట్ల తనకున్న గౌరవాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ‘హృషీదా గనక ‘రేపటి నుంచి సినిమా ఉంది. నువ్వు నటించాలి’ అంటే చాలు... కథేమిటి, నా పాత్ర ఏమిటి లాంటివేవీ అడగనైనా అడగకుండానే, నా చేతిలో ఉన్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని మరీ ఆ సినిమాలో నటిస్తాను’ అని ఆమె బాహాటంగా చెప్పారు. ఒక దర్శకుడు తీర్చిదిద్దిన మైనంముద్దల లాంటి ఆర్టిస్టులు ఆ విషయాన్ని అంగీకరిస్తూ, అలా చెప్పడాన్ని మించిన కితాబు ఇంకేముంటుంది!హృషీకేశ్‌జీ మంచి సృజనశీలే కాక మంచి మనిషి కూడా! బొంబాయిలో నేను హిందీ చిత్రాలు తీస్తున్న సమయంలో రెండు మూడుసార్లు ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశాను. ఇంట్లో మంచం పక్కనే కుక్కలతో ఆయన సరదాగా గడిపేవారు. అప్పటికే హిందీ చిత్రం ‘సర్గమ్’ (‘సిరిసిరిమువ్వ’కు రీమేక్)తో అక్కడివాళ్ళకు నేను తెలుసు. ‘శంకరాభరణం’ దర్శకుడిగా ఆయన నన్నెప్పుడూ గుర్తుపెట్టుకొని మాట్లాడేవారు. చలనచిత్రోత్సవాలు, జాతీయ అవార్డు కమిటీలు, సెన్సార్ బోర్డు లాంటి వాటిలో కీలక బాధ్యతలు నిర్వహించడం వల్ల దక్షిణాదిలో ఆయనకున్న పరిచయాలూ ఎక్కువే. పనుల మీద మద్రాసుకు ఆయన వచ్చినప్పుడూ కలిశాను. ఒకసారి ఆయన ప్రసిద్ధ మలయాళ నటుడు గోపికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి, కేరళ వెళ్ళి మరీ చూసిరావడం నాకిప్పటికీ గుర్తే! సందర్భమేమిటో గుర్తులేదు కానీ, దక్షిణ, ఉత్తర భారతీయ సినిమా వాళ్ళం కొందరం కలసి ఒకసారి ఏదో పర్యటనకు వెళ్ళాం. ఆ బృందంలో హృషీకేశ్ ముఖర్జీ, గుల్జార్, నేను - ఇంకొందరం ఉన్నాం. నటి జయభాదురో, షబనా ఆజ్మీయో కూడా ఉన్నారు. ‘దర్శకుడు, రచయిత, నటి - ఇలా మనందరం ఇక్కడే ఉన్నాం కదా! ఇక్కడే ఒక సినిమాకు సన్నాహాలు చేద్దామా’ అని మేమందరం సరదాగా అనుకున్నాం. అవన్నీ తీపి జ్ఞాపకాలు. ఏమైనా, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన హృషీకేశ్ ముఖర్జీ, శ్యామ్‌బెనెగల్, బాసూ భట్టాచార్య, మృణాల్‌సేన్ లాంటి దర్శకులు, వారి చిత్రాలు మన జాతి సంపద. సంభాషణ: రెంటాల జయదేవ -
అరుదైన గౌరవం
* జయశంకర్‌కు పద్మవిభూషణ్, అంపశయ్య నవీన్‌కు, అంద్శైకి పద్మశ్రీ * కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశంలోని అత్యున్నత అవార్డులకు జిల్లాకు చెందిన ప్రముఖుల పేర్లు అగ్రభాగంలో ఉన్నాయి. పద్మ విభూషణ్ అవార్డు కోసం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, పద్మశ్రీ అవార్డుల కోసం కథానవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, తెలంగాణ వాగ్గేయకారుడు అంద్శై పేర్లను కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేసింది. గతంలో జిల్లాకు చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు పద్మవిభూషణ్, ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరేళ్లవేణుమాధవ్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆ తర్వాత చాలా విరామం ఏర్పడింది. గతంలో అవార్డులకు డాక్టర్ అంపశయ్యనవీన్, ఇంటాక్ జిల్లా కన్వీనర్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు, చిందు కళాకారుడు గడ్డం శ్రీనివాస్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నప్పటికీ.. వారికి రాలేదు. ఆచార్య జయశంకర్.. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 1934 లో జన్మించారు. బనారస్, ఆలీఘర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యావేత్తగా గుర్తింపు పొందారు. ప్రత్యేకించి తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవంగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన ప్రతి పాదనలు, ఎత్తుగడలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిపితగా పిలుచుకునే ఆచార్య జయశంకర్‌కు పద్మవిభూషణ్ ఇవ్వడం సమంజసమని తెలంగాణవాదులు, ఆయన అభిమానులు భావిస్తున్నారు. డాక్టర్ అంపశయ్య నవీన్.. కథానవలా రచయిత అంపశయ్యనవీన్ 1941లో జన్మిం చారు. ఆయన అసలుపేరు దొంగరి మల్లయ్య. తను రాసిన నవల పేరుతో అంపశయ్య నవీన్‌గా గుర్తింపు పొందారు. ఆయన 30కిపైగా నవలలు రాశారు. కాలరేఖ నవల సుదీర్ఘమైన తెలంగాణ పోరాట నేపథ్య పరిస్థితులను వివరించేదిగా 16 వందల పేజీలతో ప్రచురించబడింది. ఈ నవలా రచనకు గాను 2004లో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. కేయూ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. తెలంగాణలో మంచి సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఆయన కరీంనగర్లో ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి కొత్త ఉద్యమానికి నాంది పలికారు. గత నాలుగేళ్లుగా నవీన్ పేరిట ఆయన పుట్టినరోజున తెలుగు నవలా సాహిత్య అవార్డులను అందజేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే నవీన్ పేరు పద్మశ్రీ అవార్డులకోసం ప్రతిపాదించబడినప్పటికీ ఆయనకు రాలేదు. డాక్టర్ అంద్శై... తెలంగాణ జన జీవితంలో ప్రతిష్టాత్మకమైన రీతిలో గుర్తింపు పొందిన వాగ్గేయకారుడు డాక్టర్ అంద్శై. ఆయన అసలు పేరు అందె అయిలయ్య. జనగామ పరిధిలోని రేబర్తి గ్రామంలో 1961లో జన్మించారు. శృంగేరి మఠానికి చెందిన శంకర్‌మహారాజ్ బోధనలతో ప్రభావితుడై ప్రజాకవిగా, ప్రకృతి కవిగా మారారు. 2006లో గంగా సినిమాలో రాసిన పాటకు అంద్శై నంది అవార్డు అందుకున్నారు. 2009లో అంద్శై రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ఎర్రసముద్రం సినిమాలో ఉపయోగించుకోవడమేకాకుండా... యూనివర్సిటీ స్థాయి డిగ్రీ రెండో సంవత్సరం పాఠ్యాంశంగా చేర్చబడింది. అంద్శై రాసిన ‘పల్లె నీకు వందనాలమ్మో .., గలగల గజ్జెల బండి ఘల్లూ నీది ఓరుగల్లు నీది.., కొమ్మచెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా.., ఎల్లిపొతున్నావా తల్లి.., చూడా చక్కని తల్లి చక్కానీ జాబిల్లి.., జనజాతరలో మనగీతం జనకేతనమై ఎగరాలి’.. పాటలు ఆయనలోని తాత్వికతకు, చైతన్యశీలతకు నిదర్శనంగా కన్పిస్తాయి. అంద్శై రాసిన జయజయహే తెలంగాణ రాష్ట్రగీతంగా ఎంపికైంది. కేయూసీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంద్శైకి పద్మశ్రీ రావల్సిందేనని కళాకారులు, కవులు అంటున్నారు. -
నాకు సంగీతం తెలియదు... సంగీతానికి నేను తెలుసు!
ఆయన అపర త్యాగయ్య అంటారు కొందరు! ఆయనకు అహంకారమంటారు... ఇంకొందరు! మితిమీరిన ఆత్మవిశ్వాసమంటారు... మరికొందరు! ఎవరేమన్నా, అనుకొన్నా వెరవని స్వభావం... సంగీతంలో, జీవితంలో నిత్య ప్రయోగశీల వ్యక్తిత్వం... నమ్మినదాన్ని ఆచరించే పట్టుదల... నమ్మి వచ్చినవారికి ఆశ్రయమిచ్చే ఔదార్యం... సమకాలీన కర్ణాటక సంగీత ప్రపంచంలో అరుదైన వాగ్గేయకారుడిగా గౌరవం... 76 ఏళ్ళుగా పాడుతున్నా... ఇప్పటికీ వన్నె తగ్గని ఆ మధు మురళి... డాక్టర్ మంగళంపల్లి బాలమురళి. త్యాగరాజ స్వామి వారి శిష్యపరంపరలో అయిదో తరం వ్యక్తిగా... తెలుగువారి ఆస్తి ఆయన. ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’, ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సత్కారం ‘షెవాలియర్’... ఇలా అన్నీ ఈ భారత జాతిరత్నం ద్వారా తమ గౌరవాన్ని పెంచుకున్నవే. ఎంత ఎత్తు ఎదిగినా, హృదయంలోని పసితనాన్ని ఇప్పటికీ పోగొట్టుకోని... 84 వసంతాల నిత్య బాలుడాయన. నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ ముగ్ధమోహన గాన మురళితో ‘సాక్షి’ మాటకచ్చేరీ... త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా! గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం వెంకట స్వామి నాయుడుగారి వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను. తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే! నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల), ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం...’లాంటివి..! ఆత్మకథ రాయమని అడిగేవారికి నేను చెప్పేదొక్కటే... నా మీద ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. ఎంతోమంది నా జీవితానికి అక్షరరూపం ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. నా జీవితం, సంగీత కృషి మీద ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. పిహెచ్.డి. పట్టా కూడా దక్కాయి. ఇక నేను రాయడమెందుకు! సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం! ఎనిమిదేళ్ళు నిండీనిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ..? 1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్లో హాలు ప్రారంభోత్సవం... మా గురువుగారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తిగారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు. అసలు మీరు పుట్టింది... చదువుకున్నది ఏ ఊరిలో..? తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాలవితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మ గారు నన్ను పెంచారు. నేను స్కూల్లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్లో హెడ్మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు. మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. అంతా నా చుట్టూ చేరేవారు. అయితే, నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్మాస్టర్ నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా. రేడియోలో పని చేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థంకాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా. చిన్ననాటి అనుభవాలు మరికొన్ని... నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లివారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న దూబగుంట వారి సత్రంలో చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు. ఆయన పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్యగారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది. మీ జీవితంలో గురువుగారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత? మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట! కానీ, పారుపల్లి వారి వద్ద నేర్చుకున్న త్యాగరాయ సంగీతం కన్నా, మీ సొంత బాణీకీ, కృతులకే మీరు ప్రాధాన్యమిచ్చారని మరో విమర్శ... త్యాగరాజస్వామి ముందువాళ్ళు ఎవరు ఎలా పాడేవారో ఎవరికీ తెలీదు కదా! ఆయన ఆ రాగాల్లో కృతులు రాసుకొని, ఆలపించారు. ఆ త్యాగరాయ సంగీతం పరంపరాగతంగా మా వరకు వచ్చింది. ఆ సంగీతాన్ని పాడుతూనే, పెద్దగా పాపులర్ కాని రాగాల్లో సైతం కీర్తనలు రాసి పాడాను. రాగాలు కనిపెట్టాను. అలా రచన, గానంతో వాగ్గేయకారుణ్ణయ్యాను. నా పద్ధతి, పాట ‘బాలమురళి బాణీ’గా ప్రచారంలోకి వచ్చింది. అదేదో నేను ఉద్దేశపూర్వకంగా కొత్తగా, ధైర్యంగా చేశానని చెప్పను కానీ, అలా జరగాలని రాసి ఉంది.... జరిగింది. అంతే! రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట! అవును. ఆ రోజుల్లో కోరి మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆయా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం! విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం? ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళాసాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను. ఉత్తరాదిన ఎందరికో దక్కిన ‘భారతరత్న’ మీకు రాలేదు. వివక్ష కారణమా? ఫలానాది కావాలి, రావాలి అని నేనెప్పుడూ అనుకోలేదు... ‘భారతరత్న’ గురించీ అంతే! ఎవరికి ఏది ప్రాప్తమో అదే వస్తుంది. లతా మంగేష్కర్, భీమ్సేన్ జోషీ, బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరసియా, పండిట్ రవిశంకర్ లాంటి దిగ్గజాలూ, నేనూ కలిసి ఎన్నో వేదికలపై కచ్చేరీలు చేశాం. కానీ, దురదృష్టవశాత్తూ ఇవాళ ప్రతిదీ రాజకీయమైపోయింది. ఈ ఆధునిక యుగంలో కర్ణాటక సంగీతానికి భవిష్యత్తు ఉందంటారా? కర్ణాటక సంగీతం అనగానే మీరు గిరి గీసుకొని, సంకుచితంగా ఆలోచించకండి. చెవులకు ఇంపుగా ఉండేది అని ఆ మాటకు అసలైన అర్థం. కాబట్టి, శాస్త్రీయ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాలు ఏవైనా సరే, ఇంపుగా ఉంటే అది కర్ణాటక సంగీతమే. ప్రపంచమే ఓ కుగ్రామమైపోయి, సరిహద్దులు చెరిగిపోవడంతో, మునుపటితో పోలిస్తే ఈ తరానికి వేదికలు, అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కచ్చితంగా కర్ణాటక సంగీతానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. అయినా, కాలంతో పాటు వచ్చే మార్పులకు తగ్గట్లుగా కొత్త కూరలు వస్తాయి, రుచులు మారతాయే తప్ప, తినడమైతే మానేయం కదా! సంగీతమూ అంతే! అన్నట్లు, మీకు అత్యంత ఇష్టమైన రాగం..? 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే. వాటిలో ఏది ఎక్కువంటే చెప్పడం కష్టం. కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమని విన్నట్టు గుర్తు..? (నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా! అవును... రోజుకి ఎంత సేపు సాధన చేస్తుంటారు? కచ్చేరీకి వెళ్ళేముందు ఒక రిహార్సల్ కానీ, ప్రాక్టీస్ కానీ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. మైకు ముందుకు వెళ్ళే వరకూ ఏం పాడతానో నాకే తెలియదు. కూర్చోగానే, ఇవాళ పాడాలి కదా, వీళ్ళందరినీ సంతోషపెట్టాలి కదా అనిపిస్తుంది. అంతే... సంగీతం, పాట వాటంతట అవే వస్తాయి. వాటికి నేను వాహికనవుతాను. కానీ, ఇలా సాధన లేకుండా, అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని పాడేయడం..? నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా ఉంటాను. పాట నా నోట పలుకుతుంది. ఎందరికో సంగీతం నేర్పారు... వారసులు ఎవరంటారు? నా బాణీని కొనసాగించే, ప్రతిభావంతులైన శిష్యులు ఎందరో ఉన్నారు. వారందరూ నాకు సమానమే. నా శిష్యుల్లో ఎవరో ఒకరు ఈ పరంపరను కొనసాగిస్తారు. కానీ, ఫలానావాళ్ళు నా వారసులని చెప్పలేను.. చెప్పకూడదు కూడా! ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నవంబర్ 1న ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయొలిన్‌తో, మీరు గాత్రంతో రసానందంలో ముంచి తేల్చారని చదివా. కొత్త రాష్ట్రాల్లో కూడా ఆ భాగ్యం కలిగిస్తారా? నన్ను ఆహ్వానిస్తే... తప్పకుండా వెళ్ళి, అవతరణ దినోత్సవాల్లో పాడతాను. సంగీతామృతాన్ని పంచుతాను. గతంలోకి వెళితే... ఎన్టీఆర్‌తో మీ అనుబంధం? ఎన్టీఆర్ ముఖ్య మంత్రి పదవిలో ఉండగా, తెలుగు నేలపై పాడనని శపథం పట్టారే..? ఎన్టీఆర్ మంచి నటుడు, గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ తన తప్పు తెలుసుకొని, పంథా మార్చుకొని, సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను. కానీ, సంగీత, సాహిత్య, నాటక అకాడెమీలు పైరవీల మీద, ఆశ్రీతపక్షపాతం మీద నడవడం తప్పే కదా! అయినా అకాడెమీల అవసరం ఉందంటారా? అకాడెమీలు ఇవాళ్టికీ అవసరమే. ఇక, వాటిలో జరిగే తప్పొప్పులు అంటారా... అవన్నీ జరిగితేనే కదా, ఎలా చేయాలి, ఎలా చేయకూడదనే అనుభవం వస్తుంది. తప్పు జరిగిందని మొత్తం వ్యవస్థనే వద్దనడం తప్పు కదా?! సినిమా రంగంతో కూడా మీది అవిస్మరణీయమైన అనుబంధం... అక్కినేని, నా శిష్యురాలు ఎస్. వరలక్ష్మి నటించిన ‘సతీ సావిత్రి’ మొదలుకొని మొన్నామధ్య దాకా నన్ను అడిగినవాళ్ళకు పాడాను. అలాగే, ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’లో నారదుడిగా నటించాను. జి.వి. అయ్యర్ రూపొందించిన ‘హంస గీతె’ (కన్నడం), ‘ఆది శంకరాచార్య’ (సంస్కృతం), ‘మధ్వాచార్య’, ‘భగవద్గీత’ లాంటి చిత్రాలకు సంగీతం అందించాను. ఉత్తమ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులందుకున్నాను. బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు కనిపిస్తాను. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశాను. మీ భార్యాపిల్లల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు..? నా భార్య పేరు అన్నపూర్ణ. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ సంగీతం వచ్చు. కానీ, సంపాదనలో స్థిరత్వం ఉండని ఈ రంగం వైపు రావద్దని సూచించాను. మా పెద్దమ్మాయి అమ్మాజీ హైదరాబాద్‌లో ఉంటుంది. పెద్దబ్బాయి అభిరామ్ ప్రింటింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. రెండో అమ్మాయి లక్ష్మి గృహిణి. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇక, ఆ తరువాత పిల్లలైన సుధాకర్, వంశీ మోహన్‌లు డాక్టర్లు. సుధాకర్ చెన్నైలోనే ఆదంబాక్కమ్‌లో ఎస్.పి.హాస్పిటల్ పేరిట పెద్ద ఆసుపత్రి నడుపుతూ బిజీగా ఉన్నాడు. వంశీ మోహన్ పేరున్న డయాబెటాలజిస్ట్. నాతోనే చెన్నైలో ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇక, నా ఆఖరు అమ్మాయి మహతి కూడా మద్రాసులోనే ఉంటోంది. ఇదీ నా కుటుంబం. ‘మహతి’ పేరు బాగా ఇష్టమా? మీ ఇంటికీ అదే పేరు పెట్టుకున్నారు..? మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా... అందుకే, ఈ పేరు. దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా భావితరాలకు అందించే ప్రయత్నంచేసిన నర్తకి సరస్వతి మరణించడం...(తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్! ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది. మరి, మీ గాత్రంలోనే మీ కృతులన్నిటినీ వీడియో రికార్డు కూడా చేయాలన్న ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? దాదాపు 500 రచనల్లో కొన్ని రికార్డు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆ పని జరుగుతోంది. మీ పుట్టినరోజంటే, కచ్చేరీలు, ఇతర కళాకారులకు సన్మానాలతో సాగేవి. ఈ సారి ఎలా జరుపుకోబోతున్నారు? నేనెప్పుడూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోను. అభిమానులే చేస్తుంటారు. ఈ సారి ‘సరిగమ’ సంస్థవారు 1950ల నుంచి ఇప్పటి దాకా నా రికార్డింగుల్లోని ఆణిముత్యాలన్నిటినీ ఏరి, ‘సెలస్టియల్ ట్రెజర్’ అని ఓ సీడీ విడుదల చేస్తున్నారు. గడచిన 83 ఏళ్ళు మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తే, ఎలా బతకాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పటి బాల మురళీలాగానేనా? నా 83 ఏళ్ళ జీవితంలో నాకు చేతనైనంత మంచే చేశాను. నాకు నచ్చినట్లుగా బతికాను. ఏం జరిగినా, అది నా మంచికే అనుకుంటా. ప్రతి క్షణం నాకు చిరస్మరణీయమే! - రెంటాల జయదేవ -
అవార్డుల ‘అక్కినేని’
హైదరాబాద్, న్యూస్‌లైన్: పౌరాణికం.. చారిత్రకం.. సాంఘికం.. నవల.. చిత్రం ఎలాంటిదైనా ఆ పాత్రల్లో ఒదిగిపోవడం నటసామ్రాట్ అక్కినేనికి మాత్రమే సొంతం. తన నటనతో ఎన్నో అపురూపమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారాయన. అందుకే రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి అవార్డులు అక్కినేని సొంతమయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆయనను అవార్డుల అక్కినేనిగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. ఆయనకు వచ్చిన అవార్డులు వేల సంఖ్యలో ఉండడంతో వాటిని భద్రపరిచేందుకు, అభిమానులు తిలకించేందుకు అనువుగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా అక్కినేని అవార్డు గ్యాలరీని 2005లో ఏర్పాటు చేశారు. అక్కినేని అందుకున్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (1991)తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తదితర అవార్డులు, మెమోంటోలు, జ్ఞాపికలు ఈ గ్యాలరీలో భద్రపర్చారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను అందుకున్న అరుదైన బిరుదులు, జ్ఞాపికలకు సంబంధించిన జ్ఞాపకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. స్టూడియో సందర్శన కోసం వచ్చిన అభిమానులు, ప్రజల కోసం ఈ గ్యాలరీ తెరిచి ఉంచేవారు. ఇప్పటి వరకు ఈ గ్యాలరీని 12 లక్షల 46 వేల మంది సందర్శించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అక్కినేని కూడా తరచూ ఈ గ్యాలరీకి వచ్చి తాను అందుకున్న అవార్డులను మురిపెంగా చూసుకునేవారు. మానసిక ప్రశాంతత కావాల్సినప్పుడు ఆయన ఈ గ్యాలరీలో గడిపేవారని స్టూడియో వర్గాలు తెలిపాయి. అంతేకాదు అక్కినేనిపై పలువురు రాసిన పుస్తకాలు కూడా ఈ గ్యాలరీలో అందుబాటులో ఉంచారు. అక్కినేనికి సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ఆయన పలు పుస్తకాలు రాశారు. రచనల్లో ఆయనది అందె వేసిన చేయి. తన జీవితచరిత్రను ‘నేను నా జీవితం’ అనే పుస్తకంగా రాశారు. అమెరికాలో తన మొదటి పర్యటనను వివరిస్తూ ‘నేను చూసిన అమెరికా’ అనే పుస్తకాన్ని రాశారు. అ, ఆ లు, మనసులోని మాట అనే పుస్తకాలను సైతం ఆయన రచించారు. -
హాస్య పద్మాలు
అపురూపం ‘నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం రోగం’... అనేవారెప్పుడూ జంధ్యాలగారు. నవ్వించడం నటులకి అంత తేలిక కాదు. నవ్వించగలిగిన నటులకి మిగిలిన అన్ని రసాలు అభినయించడం తేలికే! అటువంటి హాస్యాన్ని పండించి మెప్పించిన హాస్యనటులు తెలుగులో ఎందరో! వారంతా ప్రజల గుర్తింపునూ పొందారు. వారిలో కొందరు ప్రభుత్వ గుర్తింపునూ పొందారు! ‘పద్మవిభూషణ్’, ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’. ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను 1954 నుండి భారత ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. దక్షిణాదిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందిన తొలి హాస్యనటుడు శ్రీ రేలంగి వెంకట్రామయ్య. ఆ తరువాత కాలంలో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంలు అందుకున్నారు. ఆ రోజుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ కమెడియన్ శ్రీ రేలంగి! 1970లో ఆయన, నాటి రాష్ట్రపతి వి.వి.గిరి నుండి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే యాభై సంవత్సరాల పాటు 1,013 చిత్రాలలో నవ్వించారు శ్రీ అల్లు రామలింగయ్య. ఆయన, 1990లో నాటి భారత రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. హీరో ఎవరైనా సరే... బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్! ఇది ప్రస్తుతం బ్రహ్మానందం స్థాయి! 28 సంవత్సరాల సినీ జీవితంలో అప్పుడే వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్న బ్రహ్మానందం ‘పద్మశ్రీ’ బిరుదును 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం పొందుతోన్న బ్రహ్మానందం అప్పుడు గాని... ఇప్పుడు గాని తెలుగులో ఉన్నంత మంది హాస్యనటులు మరే భాషలోనూ లేరు! అలాగే ముగ్గురు హాస్యనటులు ‘పద్మ’ పురస్కారాలను మరే భాషలోనూ అందుకున్న గుర్తూ లేదు!! హ్యాట్సాఫ్ టూ తెలుగు హాస్యనటులు!!! -నిర్వహణ: సంజయ్ కిషోర్