దిలీప్కుమార్కు పద్మవిభూషణ్ ప్రధానం | rajnath singh presented padma vibhushan to dilip kumar | Sakshi
Sakshi News home page

దిలీప్కుమార్కు పద్మవిభూషణ్ ప్రధానం

Published Sun, Dec 13 2015 2:21 PM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

దిలీప్కుమార్కు పద్మవిభూషణ్ ప్రధానం

దిలీప్కుమార్కు పద్మవిభూషణ్ ప్రధానం

ఈ శుక్రవారం పుట్టినరోజు జరుపుకున్న బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని ఇబ్బందులకు...

బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో ఈ సారి తన పుట్టినరోజును ఘనంగా నిర్వంచవద్దని అభిమానులను కోరిన దిలీప్ కుమార్ ఆ రోజు కూడా కేవలం తన ఇంటికే పరిమితమయ్యారు. ఈ శుక్రవారమే ఆయన పుట్టిన రోజు జరిగింది.

కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బయటికు రాని దిలీప్కుమార్కు ప్రభుత్వం తరుపున కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డ్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్ అవార్డ్ తో గౌరవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement