రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్.
త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్‌లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్‌పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment