'జైలర్‌'కు ఏడాది.. మూడు భాగాలుగా మేకింగ్‌ వీడియోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్‌ | Jailer Celebrating One Year Of The Record | Sakshi
Sakshi News home page

'జైలర్‌'కు ఏడాది.. మూడు భాగాలుగా మేకింగ్‌ వీడియోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్‌

Published Tue, Aug 13 2024 7:51 AM | Last Updated on Tue, Aug 13 2024 7:51 AM

 Jailer Celebrating One Year Of The Record

రజనీకాంత్‌ కథానాయకుడిగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'జైలర్‌'. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. సౌత్‌ ఇండియాలో ఈ సినిమా అనేక రికార్డ్స్‌ను క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 620 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. అంతటి విజయాన్ని అందుకున్న జైలర్‌ 2023 ఆగష్టు 10న విడుదలైంది. ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారు మేకర్స్‌.

జైలర్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సినిమా మేకింగ్ ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది.  జైలర్ సినిమా మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఆగష్టు 12న మేకింగ్ వీడియో ప్రివ్యూను తన సోషల్ మీడియా పేజీలో విడుదల చేసింది. ఆపై ఆగష్టు 16న సన్‌ నెక్ట్స్‌ ఓటీటీ వేదికగా జైలర్‌ మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్‌ చిత్రంలో రజనీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.  ప్రస్తుతం రజనీకాంత్‌ దర్శకుడు T.S.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో 'వెట్టయన్‌' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement