జైలర్‌తో ధనుష్‌? | Dhanush To Collaborate With Rajinikanth For Jailer 2 | Sakshi
Sakshi News home page

జైలర్‌తో ధనుష్‌?

Published Wed, Oct 23 2024 2:43 AM | Last Updated on Wed, Oct 23 2024 2:43 AM

Dhanush To Collaborate With Rajinikanth For Jailer 2

మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్‌  సిల్వర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్‌ టైటిల్‌ రోల్‌లో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో రజనీకాంత్‌తోనే ‘జైలర్‌ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్‌ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌.

ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్‌ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించారట నెల్సన్‌. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్‌ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్‌ సీక్వెన్‌ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement