Jailer Movie
-
శ్రీ ముకాంబిక ఆలయంలో జైలర్ విలన్ వినాయకన్, నటుడు జయసూర్య (ఫోటోలు)
-
మద్యం మత్తులో జైలర్ విలన్ అర్ధ నగ్నంగా హల్ చల్
-
తప్పతాగిన నటుడు.. అర్ధనగ్నంగా కేకలు వేస్తూ.. వీడియో వైరల్!
రజినీకాంత్ జైలర్ మూవీ పేరు వినగానే ఆయనే గుర్తుకు వస్తారు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్‌తో అభిమానులను అలరించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం రజినీకాంత్ ఖాతాలో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో తనదైన విలనిజంతో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. గతంలో వినాయకన్‌ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.వీడియో వైరల్..తాజాగా వినాయకన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫుల్‌గా తాగి గట్టిగా అరుస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇందులో వినాయకన్ అర్ధనగ్నంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఆయన ఇంట్లో బాల్కనీలో ఉండగా తీసినట్లు తెలుస్తోంది. విజువల్స్ చూస్తే ఎవరితోనో గొడవ పడుతున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్ ప్రవర్తనపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాల నుంచి అతన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లోనూ న్యూసెన్స్..గతంలో జైలర్ నటుడు వినాయకన్ మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోయాడు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.కాగా మలయాళ నటుడైన వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. చివరిసారిగా ఇటీవల రిలీజైన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కోలో కనిపించారు. #Vinayakan 🥃🔞🙉Actor or Drunker 😡He should be banned from acting.pic.twitter.com/JK3UWJTzop— Tharani ᖇᵗк (@iam_Tharani) January 20, 2025 -
హుకుం.. టైగర్ కా హుకుం...
ఇటీవల సరైన సక్సెస్‌లు లేక సతమతమవుతున్న నటుడు రజనీకాంత్‌కు నూతనోత్సాహాన్ని కలిగించిన చిత్రం జైలర్. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. నటి తమన్న ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 2023లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ తరువాత రజనీకాంత్ నటించిన లాల్ సలాం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తరువాత రజనీకాంత్ నటించిన వేట్టైయన్ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు.ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ మొదటి నుంచి చెబుతున్నారు. కాగా జైలర్ –2 చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను పొంగల్ సందర్భంగా మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేసి రజనీకాంత్ అభిమానులకు కానుకగా అందించారు. నాలుగు నిమిషాల పాటూ సాగే ఆ ట్రైలర్లో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ చిత్ర కథా చర్చల కోసం గోవా వెళతారు. అక్కడ వారు మాట్లాడుకుంటుండగా నటుడు రజనీకాంత్ రౌడీలను వెంటాడి వేటాడుతూ వస్తారు. దీంతో భయభ్రాంతులకు గురైన నెల్సన్, అనిరుధ్ ఈ సన్నివేశం బాగుందే దీన్నే కథగా రూపొందిద్దాం అని అనుకుంటారు. ట్రైలర్ చివరిలో రజనీకాంత్ హుక్కుమ్ టైగర్ కా హుక్కుమ్ అంటారు. మాస్ మసాలాగా రూపొందిన ఈ ట్రైలర్‌కు ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జైలర్– 2 చిత్ర షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థనే నిర్మిస్తోంది. -
జైలర్– 2లో కన్నడ బ్యూటీకి ఛాన్స్
నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అంతకు ముందు అపజయాలను ఎదుర్కొంటున్న రజనీకాంత్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చిన చిత్రం జైలర్. కాగా దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ చాలా కాలం ముందే వెల్లడించారు. అంతే కాదు చిత్ర కథ సిద్ధం అయ్యిందని, త్వరలోనే సెట్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి 'హుక్కుమ్' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తాజాగా జైలర్ – 2 చిత్రానికి సంబంధించిన అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు రజనీకాంత్ జైలర్– 2 చిత్రానికి సిద్దం అవుతున్నారనీ, ఈ చిత్రానికి సబంధించిన ప్రోమోను ఇటీవలే చిత్రీకరించినట్లు, ఆ ప్రోమోను చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసింది. ఇకపోతే జైలర్ చిత్రంలో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితర ప్రముఖ నటీనటులే నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, 'నువ్వు కావాలయ్యా' పాటతో యువతను గిలిగింతలు పెట్టించిన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. కాగా అదనంగా చిత్రంలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. కన్నడ చిత్రం కేజీఎఫ్‌లో నాయకిగా నటించిన ఈ అమ్మడు తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కన్నడలోనే కాకుండా తెలుగులోనూ నటిస్తున్న శ్రీనిధి శెట్టి తాజాగా కోలీవుడ్‌లో లక్కీఛాన్స్ వచ్చిందన్నది తాజా సమాచారం. దీంతో మరోసారి జైలర్ –2 చిత్రంతో ఈమె తమిళ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అయితే కోబ్రా చిత్రం నిరాశపరచడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. జైలర్– 2 చిత్రంతో తన కంటూ గుర్తింపును తెచ్చుకుంటారేమో చూడాలి. కాగా ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్‌ను 2025 ఫిబ్రవరి నెలలో పూర్తి చేయనున్నట్లు, తదుపరి మార్చి నెలలో జైలర్ 2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. -
సంక్రాంతికి కొత్తకబురు
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ‘జైలర్ 2’ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి, రజనీకాంత్ పాల్గొనగా నెల్సన్ అండ్ టీమ్ ఓ వీడియోను రికార్డు చేసిందని, సంక్రాంతికి ‘జైలర్ 2’ అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల జైపూర్‌లో పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ను కోయంబత్తూర్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. -
'జైలర్' అభిమానులకు శుభవార్త
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం తరువాత రజనీకాంత్ కోసం మరో చిత్రం ఎదురు చూస్తోంది. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన అందులో నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌కు భార్యగా నటించగా, నటి తమన్నా ప్రత్యేక పాత్రలో మెరిశారు. కాగా జైలర్ చిత్రం నిర్మా ణ దశలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ పేర్కొన్నారు. దీంతో ఈయన జైలర్– 2 చిత్ర కథను తయారు చేసే పనిలో ఉన్నారు. తా జాగా కథను రెడీ చేసి నెల్సన్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధం అయ్యారని సమాచారం. ఈ చిత్రానికి 'హుకూమ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాకపోయినా ప్రస్తుతం 'హుకూమ్' చిత్రం గురించి అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిశంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన పనులు స్థానిక పూందమల్లిలోని ఈవీపీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియోను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే రజనీకాంత్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
వర్త్ ...వర్మా వర్త్
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఆదివారం కడపలో హల్చల్ చేసిన ఓ వ్యక్తిని చూసినవారు ఇది నిజమేనని ఆశ్చర్యపోయారు. జైలర్ సినిమాలో వర్మ పేరుతో నటించిన వినాయకన్ విలన్ ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. అన్నమయ్య జిల్లా చిన్నమండెంకు చెందిన మాజిద్ అచ్చు వినాయకన్లాగే కనిపించి హల్చల్ చేశాడు. బీడీలు తాగుతూ వర్మ వేషధారణలో హావభావాలు ప్రకటించాడు. దీంతో ప్రజలు అతని చుట్టూ చేరి జైలర్ సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘వర్త్.. వర్మా వర్త్’ అంటూ కేరింతలు కొట్టారు. – మహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప -
జైలర్‌తో ధనుష్?
మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించారట నెల్సన్. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
జైలర్ సినిమా విలన్ వినాయక్ అరెస్ట్
-
'జైలర్'కు ఏడాది.. మూడు భాగాలుగా మేకింగ్ వీడియోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్
రజనీకాంత్ కథానాయకుడిగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియాలో ఈ సినిమా అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 620 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతటి విజయాన్ని అందుకున్న జైలర్ 2023 ఆగష్టు 10న విడుదలైంది. ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్.జైలర్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సినిమా మేకింగ్ ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది. జైలర్ సినిమా మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగష్టు 12న మేకింగ్ వీడియో ప్రివ్యూను తన సోషల్ మీడియా పేజీలో విడుదల చేసింది. ఆపై ఆగష్టు 16న సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా జైలర్ మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రంలో రజనీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ప్రస్తుతం రజనీకాంత్ దర్శకుడు T.S.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వెట్టయన్' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. -
జైలర్ డైరెక్టర్ తో బన్నీ డిస్కషన్స్..
-
సైమా అవార్డ్స్ 2024.
-
రజనీతో నటిస్తానని ఊహించలేదు, జైలర్ సీక్వెల్..: నటుడు
జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని నటుడు వసంత్ రవి పేర్కొన్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకున్నారు. చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న ఈయన ఆ తరువాత రాఖి అనే పుల్ యాక్షన్ మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ తరువాత అశ్విన్స్ అనే కథా చిత్రంలో నటించి సక్సెస్ అయ్యారు. అలాగే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం జైలర్‌లో వసంత రవి ఆయనకు కొడుకుగా ముఖ్యపాత్రను పోషించారు. రజనీతో పనిచేయడం.. అలాగే ఇటీవల అశోక్‌సెల్వన్‌తో కలిసి పొన్ ఒండ్రు కండేన్ చిత్రంలో నటించారు. జి.స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా ఏప్రిల్ 18న వసంత్ రవి పుట్టినరోజు కాగా చెన్నైలో ఆయన తన జర్నీ గురించి మాట్లాడారు. తాను మొదటి నుంచి డిఫరెంట్ బ్యానర్లలో నటిస్తున్నట్లు చెప్పారు. జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. జైలర్ 2లో? తాను నటుడుగా పరిచయం అయ్యే ముందు రజనీకాంత్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నానని, అయితే ఆ తరువాత ఆయనతో కలిసి నటిస్తానని ఊహించలేదన్నారు. జైలర్–2 చిత్రంలో నటిస్తారా? అని అడుగుతున్నారని, వాస్తవానికి ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదన్నారు. దాని గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు. అదే నా లక్ష్యం అన్ని రకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాను గ్లోబల్ స్థాయికి చేర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రస్తుతం వెపన్, ఇంద్ర చిత్రాల్లో నటిస్తున్నానని, ఇవి చాలా వైవిధ్య కథా చిత్రాలుగా ఉంటాయన్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. ఇంకా మంచి చిత్రాలు చేయాలన్నదే తన కోరిక అని వసంత్ రవి పేర్కొన్నారు. చదవండి: Vishal: జగన్ తప్పకుండా మళ్లీ గెలుస్తారు -
'జైలర్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అదిరిపోయే టైటిల్‌తో సీక్వెల్
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. అప్పటి వరకు హిట్ సినిమాలు లేని రజనీకాంత్‌కు జైలర్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ వార్త వైరల్ అవుతుంది. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ పనులను డైరెక్టర్ ప్రారంభించారట. 'హుకుమ్' పేరుతో పార్ట్ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారని టాక్ ఉంది. #Jailer2, #Hukum హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్‌మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు ఏప్రిల్ 22న టైటిల్ ఖరారు కానుంది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. జైలర్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మిర్నా మేనన్, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే.. వర్మన్‌గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్లో విజిల్స్ పడ్డాయి. జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. HUKUM... TIGER KA #HUKUM 🔥😎 Morattu excited for the re-entry of the character & combo 💥#Jailer2 #Vettaiyan #Thalaivar171 #ThalaivarNirandharam pic.twitter.com/VTdJI7leXq https://t.co/gBS4XMgze8 — Shreyas Srinivasan (@ShreyasS_) April 12, 2024 -
జైలర్ హిట్ అయ్యింది నావల్లే.. తమన్నా సంచలనం
-
'జైలర్' హిట్ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో నటి తమన్న ఒక్క పాట, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నటించారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించడానికి నెల్సన్ రెడీ అవుతున్నారు. కాగా నటి తమన్న తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసినట్టు టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ జైలర్ చిత్రం అంత సంచలన హిట్‌కు కారణం రజనీకాంత్ కాదని, తానేనని పేర్కొన్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో తమన్న నటించిన నువ్వు కావాలయ్యా అనే పాట పెద్ద హిట్ అయ్యింది. ఆమె అందాల ప్రదర్శన కర్రకారును విపరీతంగా అలరించింది. చిత్రం విడుదలైన తరువాత ఎక్కడ విన్నా 'నువ్వు కావాలయ్యాస పాటనే. అయితే ఆ పాట హిట్ అయినా, తమన్నకు మాత్రం ఇక్కడ మరో అవకాశం రాలేదు. ప్రస్తుతానికి హిందీ చిత్రాలతోనే సరి పెట్టుకుంటున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వరించింది. అది మినహా దక్షిణాదిలో ఒక్క చిత్రం కూడా లేదు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్న త్వరలో అతగాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయం అలా ఉంచితే ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ. 5 కోట్లకు పెంచేసిందని సమాచారం. అదేమంటే జైలర్ చిత్రం హిట్‌కు ప్రధాన కారణం తానేనని చెప్పుకుంటోందట. మరి దీనిపై జైలర్ చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. -
జైలర్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన నటి
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఈ మధ్య విడుదలై సంచలన విషయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటి తమన్నా కీలక పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని నెల్సన్ తెరకెక్కించారన్నది విదితమే. రూ.600 కోట్లు కొల్లగొట్టిన చిత్రం జైలర్. దీనికి సీక్వెల్ రూపొందనుందన్న విషయం చాలాకాలంగా జరుగుతోంది. దాన్ని ఇప్పుడు నటి మిర్నా మీనన్ ఖరారు చేశారు. ఈమె జైలర్ చిత్రంలో రజనీకాంత్‌కు కోడలుగా నటించారన్నది గమనార్హం. జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందన్న విషయాన్ని ఈమె స్పష్టం చేశారు. దీని గురించి నటి మిర్ణా తెలుపుతూ తాను దర్శకుడు నెల్సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తనతో చెప్పారన్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే దానికి సీక్వెల్లో తాను నటిస్తానో, లేదో తెలియదు అన్నారు. దీంతో జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందన్న విషయం స్పష్టం అయ్యింది. నటుడు రజనీకాంత్ ప్రస్తుతం వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యిందని సమాచారం. తర్వాత తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నట్లు సమాచారం. జైలర్–2 సెట్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇది రజనీకాంత్ నటించే 172వ చిత్రం అవుతుంది. -
రజనీకాంత్ 'జైలర్' సీక్వెల్లో స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అతిథి పాత్ర పోషించిన లాల్ సలాం చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన తెరపైకి రానుంది. ఆయన పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్ తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారనే వా తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈయన ఇంతకుముందు నటించిన జైలర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆయన సరసన నటి నయనతార నటించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ, దర్భార్, అన్నాత్తే మొదలగు ఐదు చిత్రాలలో కలిసి నటించింది. తాజాగా ఆరోసారి ఈ కాంబోలో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
జైలర్ మూవీ.. అలా చేయొద్దని హెచ్చరించారు: డైరెక్టర్
ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో జైలర్ ఒకటి. రజనీకాంత్ తన స్వాగ్తో సినిమాను రఫ్ఫాడించేశాడు. ఎమోషనల్ సీన్లలో జీవించేసి ఏడిపించేశాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కథ రాసుకున్నప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు పెద్ద చాలెంజ్ ఎదురైంది. చాలామంది జైలర్ మూవీలో రజనీకాంత్ సర్ వెంటుక్రలను తెల్లగా చూపించొద్దని చెప్పారు. అన్నింటికీ సిద్ధపడ్డా.. ఆయనతో ఏ ప్రయోగాలైనా చేయండి కానీ వయసు మీదపడ్డవారిలా తెల్ల జుట్టుతో మాత్రం చూపించొద్దని అడిగారు. ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ఇలాంటి మాటలే చెప్పేసరికి భయపడిపోయాను. పైగా ఆయన తన వయసుకు తగ్గ పాత్రలో నటించిన తొలి చిత్రం ఇదే! దీంతో నేనేం చేయాలా? అని చాలా తికమకపడ్డాను. ఏదైతే అదైందని ముందడుగు వేశాను. ఏదైనా విమర్శలు వస్తే స్వీకరించడానికి సిద్ధపడిపోయాను. కానీ పది రోజులు షూటింగ్ జరిగాక నాపై నాకు నమ్మకం వచ్చింది. జైలర్‌లో స్టార్ హీరోలు.. రజనీని అలా చూపించడం వల్ల ఏమాత్రం నష్టం లేదని అర్థమైంది. సినిమా రిలీజయ్యాక ఎటువంటి స్పందన లభించిందో మీ అందరికీ తెలిసిందే' అని చెప్పుకొచ్చాడు నెల్సన్. కాగా జైలర్ సినిమాలో తమన్నా భాటియా, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్, వినాయకన్ కీలక పాత్రల్లో నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, మలయాళం స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రల్లో మెప్పించారు. చదవండి: రెండు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం! -
నెల్సన్ నెక్ట్స్ ఏంటి.. జైలర్ తర్వాత ప్లాన్ ఇదేనా?
ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రలో కోలమావు కోకిల, విజయ్హీరోగా బీస్ట్, ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు నెల్సన్. కాగా జైలర్ చిత్రం విడుదలై 100 రోజులు కావస్తోంది. దీంతో సహజంగానే నెల్సన్ చేయబోయే నెక్ట్స్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు కోలీవుడ్‌లో అలాంటి చర్చే జరుగుతోంది. అయితే నెల్సన్ తాజా చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆయన ఒక కమర్షియల్ అంశాలతో కూడిన కథను సిద్ధం చేస్తున్నట్లు, ఇందులో నటుడు ధనుష్‌ను కథానాయకుడిగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ధనుష్ ఇప్పుడు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని తరువాత తెలుగు, హిందీ చిత్రాలు అంటూ వరుసగా కమిట్ ఇస్తారని టాక్. దీంతో దర్శకుడు మరో ఆప్షన్ కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఒకవేళ ధనుష్ కాల్షీట్స్ లభించకపోతే లేడీ సూపర్‌స్టార్ నయనతారతో చిత్రం చేయాలని భావిస్తున్నారట. ఈ బ్యూటీ కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి నెల్సన్ దర్శకత్వంలో నటించడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడాలి. ఏదేమైనా దర్శకుడు నెల్సన్ తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారన్నది గమనార్హం. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. -
'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?
వర్త్ వర్మ వర్త్.. ఈ డైలాగ్ వినగానే మీ 'జైలర్' సినిమాలో విలన్ గుర్తొస్తాడు. మూవీలో విలనిజంతో అదరగొట్టిన నటుడు వినాయకన్‌ని కేరళ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!) ఏం జరిగింది? కేరళకు చెందిన నటుడు వినాయకన్.. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాలు కూడా చేస్తున్నాడు. తాజాగా మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించాడట. కొందరు అతడిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ.. అతడు వినకపోగా వారిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టాడట. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఇక వినాయకన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకుళంలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే వినాయకన్ ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) -
వాళ్లకు లక్కీ నటుడిగా మారిపోయిన శివరాజ్ కుమార్?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడు అన్న విషయం తెలిసిందే. శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రాలకు కన్నడ ప్రేక్షకులు జేజేలు పలుకుతారు. అంత ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు ఈయన. అలాంటిది ఎప్పుడు తమిళంలో ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించడానికి వెనుకాడటం లేదు. రజనీకాంత్‌తో ఇటీవల జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. దీంతో జైలర్ చిత్రం తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ మంచి వసూళ్లు సాధించింది. దీనికి కారణం అక్కడ శివరాజ్ కుమార్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఏదేమైనా ఆయన ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించే చిత్రంలోని శివరాజ్ కుమార్ నటించే అవకాశం ఉన్ట్లు ప్రచారం జరుగుతోంది. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఘోస్ట్ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా కమలహాసన్‌తో దిగిన ఫొటోను శివరాజ్ కుమార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కమలహాసన్ వీరాభిమానినైనా తాను ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్, ధనుష్ తర్వాత కమలహాసన్ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ నటించబోతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. -
అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..
నటి తమన్నా రూటే సెపరేటు. పాలరాతి బొమ్మలాంటి అందాలు ఈమెకే సొంతం. మొదటినుంచి గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తమన్నా అలాంటి పాత్రలపైనే తన నట జీవిత సౌధాలను ఏర్పాటు చేసుకుంది అని చెప్పవచ్చు. తాజాగా సమీప కాలంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఒక్క పాటకి, ఒకటి రెండు సన్నివేశాలకే పరిమితమైంది. అయినా ఆ చిత్ర ప్రమోషన్ అంతా ఆమె పాటపైనే సాగిందని చెప్పవచ్చు. అందులో నువ్వు కావాలయ్యా అనే పాటలో తమన్న డాన్స్ యువతను గిలిగింతలు పెట్టింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) అయితే ఆ పాటలో తమన్నా హద్దులు మీరి అందాలను ఆరబోసిందని విమర్శలను ఎదుర్కొంటుంది. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక అభిమాని తమన్నాను అడగ్గా ఆమె అతనిపై ఫైర్ అయ్యింది. అవకాశాలు తగ్గడంతో ఆ విధంగా అందాలను విచ్చలవిడిగా తెరపై ఆరబోస్తున్నారా అన్న ఆ అభిమాని ప్రశ్నకు తమన్నా బదులిస్తూ తనకు అవకాశాలు లేవని ఎవరు చెప్పారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పింది. అంత బిజీగా ఇంతకుముందు ఎప్పుడులేనని కూడా పేర్కొంది. అయినా తన హద్దులు ఏమిటన్నది తనకు తెలుసని తాను ధరించే దుస్తులు ఆయా పాత్రలకు తగ్గట్టుగా ఉంటాయని చెప్పింది. తాను పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తానని, అలా ఒప్పుకున్న తర్వాత ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని పేర్కొంది. అరకొర తెలివితో ఇలాంటి ప్రశ్నలు వేయవద్దని హెచ్చరించింది. పెళ్లి ఎప్పుడు అన్న మరో అభిమాని ప్రశ్నకు తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటానని తమన్నా బదులిచ్చింది. (ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) -
రజనీకాంత్ 'జైలర్'కు మెగాస్టార్ చిరంజీవి చురకలు
ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన కొత్త పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భోళా శంకర్, జైలర్ రెండు సినిమాలు రోజుల వ్యవధిలోనే తెరపైకి వచ్చాయి. భోళాశంకర్ భారీ డిజాస్టర్ కాగా, జైలర్ సూపర్ హిట్ కొట్టింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ‘జైలర్’ సినిమా సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు అనిరుధ్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. జైలర్ విజయంలో అనిరుధ్ కూడా ఒక కారణమని, ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజీఎం సూపర్ అని రజనీ తెలిపాడు. సినిమా రీరికార్డింగ్‌కి ముందు చూసినప్పుడు అంతగా బెటర్ అనిపించలేదు కానీ.. ఈ సినిమాకు మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత జైలర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని ఆయన తెలిపాడు. ఒక రకంగా జైలర్‌ను అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే కాపాడిందని రజనీకాంత్ పరోక్షంగా ఒప్పుకున్నాడు. అలాంటి పరిస్థితి మనది కాదు: చిరంజీవి ఒక సినిమాలో చిరంజీవి హీరోయిజం ఎలా ఉండాలో తాజాగా జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడాలి అని మెగాస్టార్ అన్నారు. అభిమానుల కోసం నేను ఎప్పుడూ డ్యాన్స్‌లు, ఫైట్లు చేయాలని ఉంటుంది. నా నుంచి వారు కూడా అదే ఆశిస్తారు. ప్రొడ్యూసర్స్ కూడా నేను ఒళ్ళోంచి కష్టపడి డ్యాన్స్ లు ఫైట్స్ చేస్తేనే ఆనందపడతారు. కొందరు నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. నేను కూడా అలాగే హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి.. బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఉంది. (ఇదీ చదవండి: ప్లీజ్ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో తెలుగు నటి గాయత్రి) కానీ.. అలా చేస్తే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేరు. అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలాచేయకపోతే దర్శక- నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి. కానీ ఒక సీన్లో విషయం లేకున్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ బీజీఎంతోనే మ్యాజిక్ చేస్తున్నారు.' అని చిరంజీవి అన్నారు. ఇప్పుడా కామెంట్లను జైలర్ సినిమాకు నెటిజన్లు లింక్ చేస్తున్నారు. జైలర్ సినిమాను ఉద్దేశించే మెగాస్టార్ ఆ కామెంట్లు చేశాడని కొందరు అంటుండగా.. ఉన్న విషయమే ఆయన చెప్పాడని మరికొందరు అంటున్నారు. -
మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ
సినిమా హిట్ కావాలంటే హీరోలుండాలనేది పాత మాట. అనిరుధ్ కూడా ఉండాలనేది కొత్త మాట. ఎందుకంటే సాదాసీదా మూవీస్‌ని కూడా తన మ్యూజిక్‌తో బ్లాక్‌బస్టర్స్ చేస్తున్నాడు. అతడి పేరే అనిరుధ్ రవిచందర్. రీసెంట్గా రిలీజైన జైలర్, జవాన్ సినిమాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒక్కో సినిమా కోసం రూ.10 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్.. అస్సలు డబ్బులు తీసుకోకుండా పాడతాడని మీలో ఎంతమందికి తెలుసు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన అనిరుధ్.. ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం. తన సినిమాల్లో కాకుండా ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతుంటాడు. ఇలా పాడుతున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సంగతి రివీల్ చేశాడు. పాడటం తన ప్రొఫెషన్ కాదని కానీ దాన్ని ఎంజాయ్ చేస్తానని, అందుకే వేరే సంగీత దర్శకులు ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్లకోసం పాట పాడుతానని అనిరుధ్ చెప్పాడు. ఇలా చేయడం వల్ల వాళ్ల కంపోజింగ్ స్టైల్ తెలుస్తుందని, అది తన మ్యూజిక్ స్టైల్‌ని అప్డేట్ చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ ఇస్తే కోట్లు తీసుకునే ఓ మ్యూజిక్ డైరెక్టర్.. సింగర్‌గా ఫ్రీగా పాడతాడంటే విశేషమే కదా! (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
ఆ సినిమాల్లో నటించకపోవడమే మంచిది.. తమన్నా సంచలన వ్యాఖ్యలు
తమిళసినిమా: కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి ఒడ్డు దాటేవరకు ఓడన్నా, దాటిన తర్వాత బోడన్నా అన్న సామెతలా ఉంది. దక్షిణాది చిత్రాల్లో అవకాశాల కోసం పాకులాడి దర్శక నిర్మాతల ఆసరా, ప్రేక్షకుల ఆదరణతో ఉన్నత స్థాయికి ఎదిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ఇక తమకు అవకాశాలు రావని తెలియడంతో, ఇక ఆచిత్ర పరిశ్రమతో పనిలేదు అన్నట్లుగా ప్రవర్తించడం ఆనవాయితీగా మారింది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో. ఆమధ్య నటి ఇలియానా, తాప్సి వంటి వారు దక్షిణాది చిత్రాలతో ఎదిగి డబ్బు కూడబెట్టుకుని ఆ తర్వాత ముంబైకి మకాం మార్చి దక్షిణాది చిత్ర పరిశ్రమను కించపరిచేలా విమర్శలు చేసి ఆ తర్వాత నాలుక కరచుకుని అలా అనలేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు నటి తమన్నా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 18 ఏళ్లు తెలుగు చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ మిల్కీబ్యూటీని దక్షిణాది ప్రేక్షకులు ఇప్పటికీ నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు కారణం ఇటీవల విడుదలైన జైలర్ చిత్రమే నిజానికి. ఈ చిత్రంలో తమన్నా పెద్దగా నటించిందేమీ లేదు. ఒక్క పాటలో అంగాంగ ప్రదర్శన చేయడం తప్పా. అలాంటిది ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రాల్లో కమర్షియల్ అంశాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని చిత్రాలు అయితే తన పాత్రను కథకు సంబంధం లేకుండానే ఉంటున్నాయని చెప్పారు. దర్శకులకు ఆ కొరతను సరి చేయమని చెప్పిన ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. అందుకే అలాంటి చిత్రాల్లో నటించడం ఇష్టం లేక తప్పుకున్నానని చెప్పారు. దక్షిణాది భాషా చిత్రాల్లో హీరోలను సహించలేనంతగా ఆదరించేంతగా కథ చిత్రాలను రూపొందిస్తున్నారని అన్నారు. అలాంటి చిత్రాల్లో నటించకుండా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే నటించడం అంటే తనకు ఇష్టమని, జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోనని తమన్నా భాటియా అన్నారు. -
రజనీకాంత్ జూదంలో ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాడా..?
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విజయం సాధించడంతో రజనీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్కు, కారుతో సత్కరించారు చిత్ర నిర్మాత కళానిధి మారన్. అలాగే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు కూడా ఆయన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. జైలర్ సక్సెస్ మీటింగ్‌లో మాట్లాడిన రజనీ కూడా కళానిధి మారన్ కొని ఇచ్చిన కారులో వచ్చాను. ఇప్పుడిప్పుడే ధనవంతుడయ్యానన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సూర్య,జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తున్న కార్తీ మాటలు) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ స్పీచ్‌పై కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా క్రిటిక్ బిస్మీ ఇలా స్పందించాడు. రజనీకాంత్ ప్రసంగం ఒక కోణంలో సరైనదేనని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ కళానిధి మారన్‌కు మరో కోణంలో ఈ వ్యాఖ్యలు అతిశయోక్తి కలిగించి ఉంటాయని బిస్మి చెప్పాడు. రజనీ సూపర్‌స్టార్ అయినప్పటికీ చాలా ఏళ్లుగా అంబాసిడర్ కారునే వాడేవారు. పదేళ్ల క్రితం వరకు ఆయన అంబాసిడర్ కారునే వాడేవాడని ఆయన తెలిపాడు తర్వాత ఆయన ఇన్నోవా కారుకు మారారని తెలిపాడు. రజనీ తర్వాత వచ్చిన నటీనటులంతా విలాసవంతమైన కార్లలో వస్తుంటే, రజనీ మాత్రం సినిమా షూట్లకు వెళ్లి తిరిగి వచ్చేది సాధారణమైన కారులోనే అని ఆయన తెలిపాడు. రజనీ కాంత్ అప్పట్లో తలచుకుని ఉండుంటే ఎన్నో లగ్జరీ కార్లను కొని ఉండవచ్చు. కానీ అతను సింపుల్‌గానే ఉండాలని ఎందుకు అనుకున్నాడో ఎవరికీ అర్థం కాని ప్రశ్న.. ఎన్నో ఏళ్లుగా అంబాసిడర్ కారు వాడుతున్న రజనీ ఈ మధ్యే ఇన్నోవా కారుకు మారాడని గుర్తుచేశాడు. అందువల్లే కళానిధి మారన్ ఇచ్చిన గిఫ్ట్‌ను ధనవంతుల కారుగా ఆయన చెప్పి ఉండవచ్చు అని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: హోటల్ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!) ఒక విజయవంతమైన నటుడిగా ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. లెక్కలేనన్ని కోట్లు సంపాదించాడు. ఎంతో ధనవంతుడైన రజనీ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో చెప్పడం కష్టం అనే రేంజ్‌కు చేరుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి అంతలా లేదని కోలీవుడ్‌లో టాక్. ఇప్పటికే రజనీకాంత్‌తో పాటు ఆయన భార్యపై పలు చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో వినికిడి. జూదగాడు ఓడిపోయాడు ఇదిలా ఉంటే, రజనీ విలాసవంతమైన కార్లు నడపలేదు కానీ జీవితాంతం విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అని బిస్మీ చెప్పాడు. సినిమాకి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక లాస్ వెగాస్ వెళ్లి జూదం ఆడి ఇక్కడ సంపాదించిన డబ్బంతా రజనీ పోగొట్టుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఎంతో కష్టపడి ఇక్కడ సంపాదించడం కొన్ని నిమిషాల్లోనే ఆ డబ్బంతా అక్కడ పోగొట్టుకుని ప్రస్తుత జీవితాన్ని రజనీ గడుపుతున్నాడని తెలిపాడు. అలాంటప్పుడు నేడు కళానిధి మారన్ ఇచ్చిన లగ్జరీ కారు ఆయనకు ఇప్పటి పరిస్థితిల్లో గొప్పగానే ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం రజనీ వద్ద ఎలాంటి లగ్జరీ కారు లేనందునే కళానిధి మారన్ ఈ కానుకను ఇచ్చాడని తమిళనాట ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ గురించి బిస్మీ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. లాస్ వెగాస్‌లో ఆయన జూదం ఆడుతున్న ఫోటోలు ఇప్పటికీ నెట్టింట ఉన్నాయి. అప్పట్లో ప్రధాన నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఇదే విషయంపై పలు కథనాలను కూడా ప్రచురించింది. -
జైలర్ సినిమాను తిరస్కరించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఓ లవ్ స్టోరీ, రెండు,మూడు పాటలు, ఫైటింగ్‌లు.. చాలా సినిమాల్లో ఇదే జరుగుతుంది. కానీ కొన్ని చిత్రాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అందులో ఒకటి జైలర్. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ లేదు, రొమాంటిక్ సాంగ్స్ లేవు, రౌడీలను హీరో చితక్కొట్టే సన్నివేశాలూ పెద్దగా లేవు. అయినా బొమ్మ బ్లాక్‌బస్టర్.. అదీ రజనీకాంత్‌కు, ఆయన ఎంచుకున్న కథకు ఉన్న సత్తా! కొంతకాలంగా వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన జైలర్‌తో దుమ్ములేపాడు. జైలర్ కథ ఫస్ట్ ఆయనకే వినిపించాడా? ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంతటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాను ఓ హీరో చేజేతులా వదిలేనుకున్నాడంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి! డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మొదట ఈ కథను చిరంజీవికి వినిపించాడట! అయితే పెద్దగా పాటలు గట్రా లేకపోవడంతో చిరు అంతగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఏమని సమాధానం చెప్పాలో తెలియక తర్వాత చూద్దాంలే అని దాటవేశాడట. ఒకరికి బ్లాక్‌బస్టర్.. మరొకరికి డిజాస్టర్ విషయం అర్థమైన నెల్సన్.. రజనీకాంత్‌ను కలవగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట! ఇకపోతే రజనీ జైలర్(ఆగస్టు 9న), చిరంజీవి భోళా శంకర్ (ఆగస్టు 11న) కేవలం రెండు రోజుల వ్యవధితో థియేటర్లలో విడుదలయ్యాయి. భోళా శంకర్ ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని అపజయాన్ని మూటగట్టుకోగా జైలర్ హిట్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. చదవండి: రైతు బిడ్డకు 26 ఎకరాలు, 4 కార్లు, కోట్ల ఆస్తి?.. ప్రశాంత్ తండ్రి ఏమన్నాడంటే? -
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!
రజనీకాంత్ పేరు చెప్పగానే సూపర్‌స్టార్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే 170 సినిమాలతో ప్రేక్షకులకు అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడాడు అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కానీ తాజాగా సొంత కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎలివేషన్ ఇవ్వడం కోసం హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే అవమానించినంత పనిచేశాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఏం జరిగింది? సూపర్‌స్టార్ రజనీకాంత్ చాలా ఏళ్ల నుంచి హిట్ అనేది లేదు. అలాంటి ఇతడికి 'జైలర్' మూవీ రూపంలో అద్భుతమైన కంబ్యాక్ దక్కింది. స్టోరీ పరంగా కొత్తగా లేనప్పటికీ టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటి అంశాలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. దీంతో రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో 'జైలర్' సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ.. రజనీ దర్శకుడు నెల్సన్‌ని అవమానించాడు! (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) రజనీ ఏమన్నాడు? రీరికార్డింగ్ జరగడానికి ముందు 'జైలర్' సినిమాని నెల్సన్ ఫ్రెండ్, సన్ పిక్చర్స్‌కి చెందిన ఓ వ్యక్తితో కలిసి తాను చూశానని చెప్పాడు. నెల్సన్ ఫ్రెండ్ సూపర్‌హిట్ అని చెప్పగా, మరోవ్యక్తి యావరేజ్ అన్నాడని తనకు మాత్రం అబోవ్ యావరేజ్ అనిపించిందని రజనీ చెప్పాడు. కానీ అనిరుధ్ రీరికార్డింగ్ సినిమాకు చాలా ప్లస్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడికి అవమానం! రజనీ ఇలా మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలో 'భాషా' సినిమా విషయంలో ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎవరెంత పనిచేసినా దర్శకుడు క్రెడిట్ తక్కువ చేయడానికి అస్సలు లేదు. 'జైలర్' విషయంలో అనిరుధ్ ని మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ దర్శకుడిని తక్కువ చేసేలా రజనీ మాట్లాడటం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇలా ఏదైనా చెప్పాల్సి వస్తే.. అది వ్యక్తిగతంగా ఉండాలి గానీ స్టేజీపై అందరి ముందు చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!) -
ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' హిట్ కావడం మాటేమో గానీ.. నిర్మాత కళానిధి మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్‌కి రెండు మూడు రెట్లు లాభాలు వచ్చేసరికి ఆయన ఆపడం ఎవరి తరం కావట్లేదు. దీంతో అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!) సాధారణంగా ఏ సినిమా హిట్ అయినాసరే నిర్మాత ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. తెలుగు ప్రొడ్యూసర్స్‌లో కొందరు మాత్రం హీరోకి లేదా దర్శకుడికి ఖరీదైన కారు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు. 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ కూడా అలానే చేశారు. హీరో రజనీ బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్-మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కి ఖరీదైన పోర్సే కార్లని గిఫ్ట్స్‌గా ఇచ్చాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఓ సినిమా తీయాలంటే హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడితే పని అయిపోదు కదా. ఈ క్రమంలోనే 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి.. నిర్మాత కళానిధి మారన్ తలో గోల్డ్ కాయిన్ చొప్పున ఇచ్చారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) Mr.Kalanithi Maran felicitated more than 300 people who worked for #Jailer with gold coins today. #JailerSuccessCelebrations pic.twitter.com/qEdV8oo6dB — Sun Pictures (@sunpictures) September 10, 2023 -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు
మరో వీకెండ్‌కి అంతా రెడీ అయిపోయింది. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి', 'జవాన్' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఓటీటీలోనూ.. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రజనీకాంత్ 'జైలర్' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' Day-3 హైలైట్స్.. టాస్క్‌లో గెలిచిన ఇద్దరు!) అయితే 'జైలర్' మూవీ ఒక్కటి మాత్రమే ఆసక్తికరంగా ఉందంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'హడ్డీ' అనే హిందీ చిత్రం, 'లవ్' అనే తమిళ చిత్రం కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‌గా 22 కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఆయా సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. దిగువన 'స్ట్రీమింగ్ అవుతున్నాయి', 'ఇప్పటికే స్ట్రీమింగ్' అని ఉన్నావి గురువారం రిలీజైపోయినట్లు అర్థం. ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ ఏ టైమ్ కాల్డ్ యూ - కొరియన్ సిరీస్ బర్నింగ్ బాడీ - స్పానిష్ సిరీస్ రోజా పెరల్స్ టేప్స్ - స్పానిష్ సినిమా సెల్లింగ్ ద ఓసీ: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ స్పై వూప్స్ - ఇంగ్లీష్ సిరీస్ డియర్ చైల్డ్ - జర్మన్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) గామేరా రీ బర్త్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) కుంగ్ ఫూ పాండ: ద డ్రాగన్ నైట్ సీజన్ 3 -ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) టాప్ బాయ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) వాట్ ఇఫ్ - ఇంగ్లీష్ సినిమా - తగలాగ్ సినిమా (స్ట్రీమింగ్) అమెజాన్ ప్రైమ్ సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ - ఇంగ్లీష్ మూవీ జైలర్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) క్యారీ ఆన్ జెట్టా - పంజాబీ చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్) జీ5 హడ్డీ - హిందీ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్) ఆహా లవ్ - తమిళ సినిమా ఫ్యామిలీ ధమాకా - తెలుగు రియాలిటీ షో జియో సినిమా యే హై ప్లానెట్ ఇండియా - హిందీ డాక్యుమెంటరీ సోనీ లివ్ లొక్కీ చెహ్లే - బెంగాలీ సినిమా టెన్ పౌండ్స్ పొమ్స్ - ఇంగ్లీష్ సిరీస్ బుక్ మై షో లవ్ ఆన్ ద రోడ్ - ఇంగ్లీష్ మూవీ లయన్స్ గేట్ ప్లే ద బ్లాక్ డీమన్ - ఇంగ్లీష్ చిత్రం ఆపిల్ ప్లస్ టీవీ ద ఛేంజ్లింగ్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?) -
ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత
సూపర్ స్టార్ రజనీకాంత్ ఖాతాలో చాలా కాలం తర్వాత ‘జైలర్’తో ఓ హిట్ పడింది. అది ఆషామాషీ హిట్ కాదు.. ఇటీవల కాలంలో తమిళ్లో ఇలాంటి విజయం సాధించిన సినిమానే లేదు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టి..సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన చిత్రమిది. వాస్తవానికి ఈ స్థాయి విజయాన్ని ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఊహించలేదు. ప్రిరిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా వసూళ్లు వచ్చాయట. అందుకే చిత్ర నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. లాభాల్లోని కొంత భాగాన్ని హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్‌కి పంచేశారు. అంతటితో ఆగకుండా ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా అందించారు. జైలర్ విజయంలో కీలక పాత్ర వహించింది ఈ ముగ్గురే కాబట్టి..వారికి లాభాల్లోని కొంత మొత్తం ఇవ్వాల్సిందేనని నిర్మాత ఇలా చేశారట. కేవలం చిత్రబృందానికే కాకుండా లాభాల్లోని కొంత డబ్బును సామాజిక సేవ చేయడానికి ఉపయోగించాలని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు రూ.కోటి చెక్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ తరఫున నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి.. మంగళవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్, ఉపాసన కొణిదెల తాతయ్య డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ అందజేశారు. 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల కోసం ఆ డబ్బును అందించారట. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్ ద్వారా తెలియజేసింది. సన్ పిక్చర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లో వచ్చిన లాభాలను ఇలాంటి మంచి పనులకు ఉపయోగించడం గొప్ప విషయమని కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని హిట్ చిత్రాలను నిర్మించి, లాభాల్లో కొంత మొత్తాన్ని ఇలా సామాజిక సేవకు ఉపయోగించాలని కోరుకుంటున్నారు. On behalf of Sun Pictures, Mrs. Kavery Kalanithi handed over a cheque for Rs.1 Crore to Dr. Prathap Reddy, Chairman, Apollo Hospitals, towards heart surgery for 100 under privileged children. #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/o5mgDe1IWU — Sun Pictures (@sunpictures) September 5, 2023 -
'జైలర్' మరో హీరో అనిరుధ్‌కి కొత్త కారు గిఫ్ట్
'జైలర్'లో హీరో సూపర్‌స్టార్ రజనీకాంత్. అదే మరో హీరో ఎవరు అంటే దాదాపు ప్రతిఒక్కరూ చెప్పే పేరు అనిరుధ్. ఈ మూవీని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మరో రేంజుకి తీసుకెళ్లాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అతడి పనికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. నిర్మాత కళానిధి మారన్.. అదిరిపోయే బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?) చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక అల్లాడిపోయిన రజనీకాంత్‌కు 'జైలర్' రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. ఈ సినిమా స్టోరీ పరంగా కొత్తగా లేనప్పటికీ.. రజనీ స్టైల్, స్వాగ్ తోపాటు అనిరుధ్ మ్యూజిక్ బాగా ఎక్కేసింది. దీంతో మూవీ సూపర్ హిట్ అయిపోయింది. ప్రస్తుతం రూ.700 కోట్ల మేర వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. మూవీ ఈ రేంజులో హిట్ కావడంతో పాటు ఈ స్థాయిలో లాభాలొచ్చేసరికి నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొన్నిరోజుల ముందు హీరో రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కి ఖరీదైన కార్లతోపాటు చెక్ ని బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు అనిరుధ్ కి కూడా ఓ చెక్ ప్లస్ కాస్ట్ లీ పోర్స్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబరు 7 నుంచి 'జైలర్' స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: 'బిగ్ బాస్' భయపడ్డాడా? ఏకంగా ఆ విషయంలో!) -
థియేటర్లో రెండు సినిమాల మధ్య పోటీ.. ఓటీటీలో బోలెడన్ని చిత్రాలు..
సెప్టెంబర్ నెల ఖుషీగా మొదలైంది. చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఖుషి సినిమాతో బోణీ కొట్టారు. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. షారుక్ ఖాన్ నటించిన 'జవాన్'.. నవీన్ పొలిశెట్టి, అనుష్కల 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఒకేరోజు విడుదలవుతున్నాయి. అటు ఓటీటీలోనూ బోలెడన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ సెప్టెంబర్ 2వ వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు ► జవాన్ - సెప్టెంబర్ 7 ► మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి - సెప్టెంబర్ 7 ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ► వన్ షాట్ (వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 5 ► లక్కీ గౌ (హిందీ చిత్రం) - సెప్టెంబర్ 6 ► జైలర్ - సెప్టెంబర్ 7 ► సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 హాట్‌స్టార్ ► ఐయామ్ గ్రూట్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 6 ► ద లిటిల్ మెర్మాయిడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 6 జీ5 ► హడ్డీ - సెప్టెంబర్ 7 నెట్‌ఫ్లిక్స్ ► స్కాట్స్ హానర్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 5 ► షేన్ గిల్లీస్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 5 ► టాప్ బాయ్ (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► కుంగ్‌ఫూ పాండా (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► వర్జిన్ రివర్ (వెబ్ సిరీస్, ఐదో సీజన్) - సెప్టెంబర్ 7 ► సెల్లింగ్ ది ఓసీ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 8 బుక్ మై షో ► లవ్ ఆన్ ది రోడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 లయన్స్ గేట్ ప్లే ► ది బ్లాక్ డెమన్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 ఆపిల్ టీవీ ప్లస్ ► ది ఛేంజ్లింగ్ (హాలీవుడ్) - సెప్టెంబర్ 8 హైరిచ్ ► ఉరు(మలయాళం) - సెప్టెంబర్ 4 చదవండి: ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు: గదర్-2 డైరెక్టర్ కామెంట్స్ వైరల్! -
ఇట్స్ అఫీషియల్.. జైలర్ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది..
నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి.. అని తమన్నా స్టెప్పులతో రెచ్చిపోయింది. జైలర్ సినిమా రిలీజ్‌కు ముందు ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. జైలర్ థియేటర్లలోకి వచ్చేశాక సినిమా చూసి రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. తలైవా ఈజ్ బ్యాక్ అని కాలర్ ఎగరేసి మరీ సంబరాలు చేసుకున్నారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జైలర్. రమ్యకృష్ణ, మీర్నా మీనన్, జయం రవి కీలక పాత్రల్లో నటించారు. శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్‌లాల్ ముఖ్య పాత్రల్లో మెరిసి సినిమా సక్సెస్‌లో భాగమయ్యారు. ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టి అందరినీ అబ్బురపరిచింది. సినిమా ఓటీటీలోకి రావాలయ్యా.. జైలర్ కావాలయ్యా అని అభిమానులు ఓటీటీ రిలీజ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ అధికారిక ప్రకటన వెలువడింది. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొదట సన్ నెక్స్ట్లో ప్రసారం అవుతుందని అందరూ ఊహించారు, హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. అమెజాన్ ప్రైమ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించి రూమర్స్‌కు స్వస్తి పలికింది. మొత్తానికి జైలర్ ఓటీటీ విడుదల తేదీతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వారంలోపే ఓటీటీ సందడి చేయనుందని తెగ ఎగ్జయిట్ అవుతున్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జైలర్ ఓటీటీలోనూ దుమ్ము దులపడం ఖాయం అని ఫిక్సయిపోతున్నారు. Jailer's in town, it's time to activate vigilant mode! 🔒🚨#JailerOnPrime, Sept 7 pic.twitter.com/2zwoYR6MqV — prime video IN (@PrimeVideoIN) September 2, 2023 -
జైలర్ డైరెక్టర్‌కు జాక్‌పాట్.. చెక్, కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారు!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా భాటియా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. (ఇది చదవండి: వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !) కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. ఈ మూవీ ఘనవిజయంతో చిత్రబృందం ఫుల్ ఖుషీలో ఉన్నారు. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత హీరో రజినీకాంత్‌తో పాటు డైరెక్టర్ దిలీప్ కుమార్‌కు వాటాతో పాటు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. భారీ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగా దిలీప్ కుమార్‌కు సైతం కోట్ల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుకరించారు. దీంతో పాటు చెక్‌ను కూడా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే తలైవాకు రూ.100 కోట్ల చెక్‌తో పాటు బీఎండబ్లూ కారును కూడా అందజేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, టైగర్ ష్రాఫ్, సునీల్, వినాయకన్, వసంత్ రవి, మర్నా, యోగి బాబు, జాఫర్ సాదిక్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!) Mr.Kalanithi Maran congratulated @Nelsondilpkumar and handed over a cheque to him, celebrating the Mega Blockbuster #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/b6TGnGaFd6 — Sun Pictures (@sunpictures) September 1, 2023 -
'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!
భారతీయ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా పేరుగాంచిన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలు విడుదలైతే ఆ తేదీకి తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం పరిపాటి. తెలుగులో కూడా స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని క్రేజ్.. తన సినిమాల కలెక్షన్ల రికార్డులను ఆయన మాత్రమే తిరిగి కొట్టగలడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన వరుస సినిమాలు పర్వాలేదనిపించడంతో ఆయనపై రకరకాల విమర్శలు చుట్టుముట్టాయి. ఈ దశలోనే నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజనీ నటించనున్నట్లు ప్రకటించారు. దీంతో కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అంతకుముందే నెల్సన్- విజయ్ కాంబోలో వచ్చిన బీస్ట్ చిత్రం డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో రజనీపై ఆ ప్రెజర్ పడింది. కానీ రజనీ మాత్రం నెల్సన్‌ను నమ్మి జైలర్ అవకాశం ఇచ్చాడు.ఈ చిత్రంలో తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా ప్లస్ అయ్యారు. ఆగస్ట్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదలై విశేష స్పందనను అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ వర్షం కురిసింది. దీంతో రజనీకాంత్ కూడా చాలా సంతోషించారు. ఈ మెగా హిట్ విమర్శకులందరికీ సమాధానంగా నిలిచింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇద్దరి ప్రత్యేక సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయి. గత ఏడాది విడుదలై తమిళ చిత్రసీమలో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. దీంతో చాలా ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగ (ఆగస్టు 31) రజనీకాంత్‌ను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా లాభాల్లో కొంత భాగాన్ని రజనీకాంత్‌కి కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చెక్కును కవర్‌పై 'ది రియల్ రికార్డ్ మేకర్' అని రాసి ఉండటం గమనార్హం. రజనీకాంత్‌కు గిఫ్ట్‌గా రెండు కార్లు తీసుకెళ్తే.. ఈ చెక్‌తో పాటు ఆయనకు బీఎండబ్ల్యూ కారును కూడా కళానిధి మారన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. రెండు బీఎండబ్ల్యూ కారులను ఆయన రజనీ వద్దకు తీసుకువెళ్లి.. అందులో నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలని కోరారు. బీఎండబ్ల్యూ ఎక్స్7 మోడల్ కారును రజనీ సెలెక్ట్ చేసుకున్నారు. దీని ధర సుమారు రూ. 2.25 కోట్లు అని సమాచారం. అందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ వారు షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు రెమ్యునరేషన్‌గా రూ. 110 కోట్లు రజనీకాంత్ తీసుకున్నారని టాక్.. సినిమాకు భారీగా లాభాలు రావడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్ మరో రూ.100 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇలా మెత్తంగా జైలర్ కోసం రజనీకాంత్ అందుకున్న పారితోషకం రూ . 210 కోట్లకు చేరింది. ఇదీ ఇండియన్ సినీ చరిత్రలో రికార్డ్‌గా నిలవనుంది. ఇప్పటికీ కూడా పలు థియేటర్లలో జైలర్ మానీయా నడుస్తూనే ఉంది. #JailerSuccessCelebrations continue! Superstar @rajinikanth was shown various car models and Mr.Kalanithi Maran presented the key to a brand new BMW X7 which Superstar chose. pic.twitter.com/tI5BvqlRor — Sun Pictures (@sunpictures) September 1, 2023 Mr. Kalanithi Maran met Superstar @rajinikanth and handed over a cheque, celebrating the historic success of #Jailer pic.twitter.com/Y1wp2ugbdi — Sun Pictures (@sunpictures) August 31, 2023 -
'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. ఈ మూవీలో రజనీతోపాటు శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి స్టార్స్ నటించినప్పటికీ.. విలన్‌గా చేసిన వినాయకన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం బయటపడింది. కేరళకు చెందిన వినాయకన్..1995 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. కెరీర్ మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేసిన ఇతడు.. మెల్లమెల్లగా విలన్ తరహా పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అయితే 'జైలర్'లో ప్రతినాయకుడిగా చేయడం ఇతడికి దక్షిణాదిలో చాలా పేరు తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో ఇతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం షాకింగ్‌గా అనిపించింది. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) ఏం జరిగింది? ఈ సంఘటన 2019లో జరిగినట్లు తెలుస్తోంది. మోడల్ మృదులా దేవితో ఇతడు ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు. ఆమెతో పాటు తల్లిని కూడా తన రూమ్‌కి తీసుకురావాలని కామెంట్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా వాళ్లు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వినాయకన్ కామెంట్స్ నిజమేనని తేలింది. తొలుత అరెస్ట్ చేశారు కానీ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వివాదం.. ఇప్పుడు 'జైలర్' హిట్ కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగులో కూడా అయితే ఎక్కువగా మలయాళ సినిమాలు చేసిన వినాయకన్.. తెలుగులోనూ జగపతిబాబు 'అసాధ్యుడు'లో విలన్ గ్యాంగ్‌లో ఒకడిగా చేశాడు. ప్రస్తుతం విక్రమ్-గౌతమ్ మేనన్ కాంబినేషన్ లో తీస్తున్న 'ధ్రువనక్షత్రం' మూవీలో నటిస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఏదేమైనా ఓ నటుడికి కాస్త పేరు వస్తే చాలు అతడు గతంలో చేసినవన్నీ తెరపైకి వస్తుంటాయి. (ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అమ్మాయిలో ఆ క్వాలిటీస్!) -
జైలర్ చిత్రయూనిట్‌కు ఊహించని షాక్.
రజనీకాంత్ పనైపోయిందంటారా?.. తలైవా ఇక్కడ.. తలైవాతో అంత ఈజీ కాదు. ఒక్క సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు సూపర్‌స్టార్. తన కమ్‌బ్యాక్‌తో రికార్డుల మోత మోగించాడు. హుకుం.. టైగర్ కా హుకుం.. అన్న జైలర్ డైలాగ్‌కు కోట్లాది కలెక్షన్స్ బాక్సాఫీస్ మీద కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్ల వసూళ్లు రాబట్టిన జైలర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలింది. హెచ్డీ ప్రింట్ లీక్ ఆన్లైన్లో అనూహ్యంగా హెచ్డీ ప్రింట్ లీకైంది. ఇది చూసి అభిమానులు సైతం షాకయ్యారు. అయితే ఆ లింక్స్ షేర్ చేయొద్దని, పైరసీని ఎంకరేజ్ చేయకండి అని అభ్యర్థిస్తున్నారు రజనీ ఫ్యాన్స్. మరోవైపు చాలామంది హెచ్డీ ప్రింట్లో ఉన్న సినిమా స్క్రీన్‌షాట్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. జైలర్ సినిమా ఆన్లైన్లో లీక్ కావడం వల్ల థియేటర్లలో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. దీంతో సన్ నెక్స్ట్ వీలైనంత త్వరగా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశమూ లేకపోలేదు. అటు హిందీ డబ్బింగ్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. జైలర్ సినిమా.. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జైలర్. రమ్యకృష్ణ, వసంత రవి, వినాయకన్, యోగి బాబు, మిర్నా మీనన్ ప్రముఖ పాత్రలు పోషించారు. మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో మెరిశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది. చదవండి: పెళ్లైన హీరోలతో ప్రేమాయణం.. 48 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే.. -
'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ!
టైటిల్ చూడగానే మీరు కచ్చితంగా అవాక్కై ఉంటారు. ఎందుకంటే రజనీకాంత్ 'జైలర్' సినిమాతో.. ఆర్సీబీ జెర్సీకి ఏంటి సంబంధం అని తెగ ఆలోచిస్తున్నారేమో కదా! అంత ఇబ్బంది పడొద్దులేండి. ఏం జరిగిందో వివరిస్తాం. అలా చదివేస్తే అసలేం జరిగిందనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?) ఏం జరిగింది? సూపర్‌స్టార్ రజనీకాంత్ రీసెంట్ మూవీ 'జైలర్'. చాలారోజుల నుంచి హిట్ లేని రజనీకి ఇది కమ్ బ్యాక్ సినిమా అనొచ్చు. ఎందుకంటే సినిమా నార్మల్‌గా ఉన్నప్పటికీ.. పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో రజనీ.. తన మనవడిని చంపడానికొచ్చిన విలన్ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిని చంపేస్తాడు. అప్పుడు అతడు ఆర్సీబీ జెర్సీతో కనిపిస్తాడు. దిల్లీ హైకోర్ట్ తీర్పు అయితే ఆ సీన్ లో బెంగళూరు జట్టు జెర్సీని తొలగించాలని దిల్లీ హైకోర్టు.. 'జైలర్' చిత్రబృందానికి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1 నుంచి అన్ని థియేటర్లలోనూ ఇది అమలయ్యేలా చూడాలని తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆర్సీబీ మేనేజ్మెంట్ గానీ, వేరే వ్యక్తులు గానీ దీనిపై ఫిర్యాదు చేసినట్లు లేదు. కానీ స్వయంగా కోర్టు ఇలా ఆదేశాలు జారీ చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ!) -
నా గ్లామర్ రహస్యం ఇదే: తమన్నా
తమిళసినిమా: అందం తిన్నానండి. అందుకే ఇలా ఉన్నాయండి అని ఒక పాటలో తన అందం గురించి తానే పొగుడుకున్న నటి తమన్నా భాటియా. అది నిజం కాకపోయినా ఈమె అందగత్తె అన్నది ముమ్మాటికీ నిజం అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఇప్పటికే బిజీగా ఉన్న తమన్నా వయసు 33 ఏళ్లు. నటిగా గత 18 ఏళ్లుగా తన అందాలను రకరకాల కోణాల్లో తెరపై ఆరబోస్తూనే ఉన్నారు. ఇటీవల నటించిన జైలర్ చిత్రంలో కూడా తాజా అందాలతో మెరిసిపోయి, ప్రేక్షకులను మైమరిపించారు. అంతగా అభిమానులకు కిక్ ఇస్తున్న తన అందం రహస్యాన్ని తమన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఈ గ్లామర్ ప్రపంచంలో ఫిట్నెస్గా ఉండడం చాలా అవసరం అన్నారు. అందుకు శారీరక కసరత్తులు ఎంత ముఖ్యమో, ఆహారపు అలవాట్లు అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తాను ఆహారపు అలవాట్లకు ప్రాముఖ్యతనిస్తానన్నారు. ఉదయం నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను సమానంగా తీసుకుని తింటానని చెప్పారు. మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు తీసుకుంటానన్నారు. అదే విధంగా సాయంత్రం 5.30 డిన్నర్ ముగించేస్తానని, ఆ తరువాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తిననని చెప్పారు. ఇలా 12 గంటలు తినకుండా ఉంటానన్నారు. దీంతో చర్మం కాంతులీనుతుందని చెప్పారు. ఇక గ్రీన్ టీ, ఆమ్లాజ్యూస్ వంటివి తన ఆరోగ్య రహస్యం ఒక భాగం అని మిల్కీ బ్యూటీ పేర్కొన్నారు. -
ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే
కోలీవుడ్ నటుడు జాఫర్ సాదిఖ్ పేరు జైలర్ సినిమాతో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్- కమల్ హాసస్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో మరగుజ్జుగా ఆయన నటించిన తీరు అందరనీ ఆకట్టుకుంటుంది. తాజాగ ఆయన ప్రియురాలు 'సిద్ధికా షెరిన్'ను ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులకు పరిచయం చేశాడు. ఎక్కడ పరిచయం కోలీవుడ్‌లో విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోలలో జాఫర్ సాదిఖ్ పాల్గొనేవాడు. అదే టీవీలో ఆమె కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, జోడి నంబర్ 1, ఉంజాలిల్ యార్ ప్రభుదేవా-2 వంటి డ్యాన్స్ షోలలో సిద్ధిక పోటీదారురాలిగా కనిపించింది. మొదట ప్రకాశ్‌రాజ్-సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన పావ కథైగల్ అనే వెబ్ సీరిస్తో జాఫర్ సాదిఖ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో పలు విభాగాలుగా విడుదలైంది. అది చూసి లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో ఓ పాత్ర ఇచ్చి సినీ రంగానికి పరిచయం చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌లో ఒకరిగా జాఫర్ మాస్‌గా నటించాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ సీన్లో కమల్ కాలు కోసే ప్రయత్నంలో జాఫర్ సాదిఖ్ కనిపిస్తాడు. ఈ సన్నివేశమే ఆతన్ని పాపులర్ చేసింది. మరోవైపు అతను కొరియోగ్రాఫర్‌గా కూడా బిజీగా ఉన్నాడు. అతను తన స్వంత డ్యాన్స్ స్టూడియోను కూడా నడుపుతున్నాడు. విక్రమ్ సినిమా తర్వాత అతనికి శింబుతో సినిమా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జైలర్ ఇలా వరుసగా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో కూడా జాఫర్ కొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాడు. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న జాఫర్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. జాఫర్ యొక్క ప్రత్యేక లక్షణం అతని పొట్టి పొట్టితనమే. కానీ అతని స్నేహితురాలు జాఫర్ కంటే పెద్దది, అందమైనది కూడా. వీరిద్దరూ స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాఫర్ ప్రియురాలి పేరు సిద్ధిక అని వెల్లడించారు. ఆమె కోలీవుడ్‌లో మంచి డ్యాన్సర్‌గా రానిస్తుంది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్లకు కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్ చేస్తుంది. (ఇదీ చదవండి; ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి) జాఫర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మూడు మాత్రమే కానీ అతనికి అభిమానుల నుంచి మరింత మద్ధతు అందుతున్నందున మరెన్నో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆనందంలో తన ప్రియురాలు సిద్ధికను కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఈ వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నా తాజాగ ఆయన ప్రకటించాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by sidhiqa sherin (@sidhiqasherink) -
డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా
రజనీకాంత్ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలో దద్దరిల్లిపోతోంది. కారణం ఆయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడమే. కాగా తదుపరి 'లాల్‌సలామ్' చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో రజనీకాంత్ మొయిదీన్ బాబాగా అతిథిపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం. (ఇదీ చదవండి: ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!) లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ముందుగా రజనీకాంత్ గెస్ట్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరగ్గా తాజాగా ఆయనది ఈ చిత్రంలో ఎక్సెంట్ క్యామియో పాత్ర అని తెలిసింది. ఇంతకు ముందు రజనీకాంత్ భాషాలో పోషించిన పాత్రకు 10 రెట్లు పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈయన పాత్ర చిత్రం విలువ భాగంలో ఫుల్లుగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జైలర్ చిత్రం తరువాత విడుదలవుతున్న లాల్‌సలామ్ చిత్రంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జైలర్ నటుడికి రజనీకాంత్ మర్చిపోలేని గిఫ్ట్!
ఎంతైనా సూపర్‌స్టార్ రేంజే వేరు.. స్లోమోషన్లో నడుచుకుంటూ వస్తే చాలు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు ఆయనకు దాసోహమయ్యాయి. గతంలో రోబో 2 సినిమాతో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన రజనీకాంత్ ఇన్నాళ్ల తర్వాత జైలర్ సినిమాతో మరోసారి ఆ స్థాయిలో బాక్సాఫీస్ మీద వసూళ్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ అంతా జైలర్ మేనియాలో ఉన్నారు. ఈ సినిమాలో రజనీ వాడిన ఆయుధం ఏదైనా ఉందా? అంటే అది కళ్లజోడే! స్టైలిష్ లుక్ కోసం రజనీ సన్‌గ్లాసెస్ వాడాడు. ఏదైనా అరాచకం చేసేముందు రజనీ తన గాగుల్స్‌ను పెట్టుకుంటూ చిన్నపాటి నవ్వు విసురుతాడు. ఈ గాగుల్స్‌ను రజనీ ఒకరికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంతకీ అంతటి అమూల్యమైన బహుమతి అందుకుంది మరెవరో కాదు, జైలర్ నటుడు జాఫర్ సాదిఖ్. ఇతడు జైలర్‌లో రజనీకి అనుచరుడిగా నటించాడు. ఆ సమయంలోనే ఆ సన్‌గ్లాసెస్ తనకు ఇవ్వాలని సూపర్‌స్టార్‌ను అభ్యర్థించాడు. అతడి కోరిక మేరకు రజనీ తన కళ్లజోడును జాఫర్‌కు ఇచ్చేశాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ఇది నాకిచ్చిన సూపర్‌స్టార్‌కు కృతజ్ఞతలు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇంతటి అమూల్యమైన వస్తువు సాధించావంటే గ్రేట్, అది మాకు దక్కితే ఎంత బాగుండేదో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by J A F F E R S A D I Q (@jaffer__sadiq) చదవండి: వనిత కూతుర్ని చూశారా? 18 ఏళ్లకే హీరోయిన్గా.. -
'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. దీంతో చాలామంది ఆయన పని అయిపోయిందనుకున్నారు. కానీ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్ని బ్రేక్ చేశారు. తలైవా ఈజ్ బ్యాక్ అని అందరూ అనుకునేలా చేశారు. థియేటర్లలో ఇప్పటికీ ఎంటర్ టైన్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 'జైలర్'కి అది ప్లస్ 'జైలర్' సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే రజనీ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. గత మూవీ 'బీస్ట్' సరిగా ఆడలేదు. అలా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆడియెన్స్ సినిమాకు వెళ్లారు. కానీ 'జైలర్' చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. వేరే పెద్ద సినిమాలు కూడా లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ వల్లే భోళా శంకర్ ఫ్లాప్.. ఆయనకు తెలుసు!: బేబి నిర్మాత) ఆరోజు నుంచే? రజనీకాంత్ చరిష్మా, అనిరుధ్ మ్యూజిక్ వల్ల 'జైలర్' బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి చెందిన సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. అయితే సెప్టెంబరు 7 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. హిందీ డబ్బింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదే రోజు రిలీజ్ కానుందని సమాచారం. దాదాపు ఇది కన్ఫర్మ్, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్ ఎంత? థియేటర్లలోకి వచ్చి 13 రోజులు పూర్తి చేసుకున్న 'జైలర్'.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలానే లాంగ్ రన్లో ఇది రూ.600 కోట్ల మార్క్ ని దాటేయొచ్చని అనిపిస్తుంది. ఫైనల్ గా ఎన్ని కోట్లు వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) -
సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జైలర్ సక్సెస్‌లో ఆయన ఉన్నారు. ఆగష్టు 10న విడుదలైన జైలర్ ఇప్పటికి కూడా కలెక్షన్స్‌లలో తగ్గడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాల యాత్రకు వెళ్లి వచ్చిన తలైవా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు లక్నోలోని ఆయన నివాసానికి రజనీ వెళ్లారు. ఆ సమయంలో యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారు. దీంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయింది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా) అయితే రజనీకాంత్ చేసిన పనికి నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. తలైవా తీరును కొందరు తప్పుపట్టినా మరికొందరు మాత్రం సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థించారు. రజినీకాంత్ ఎందుకలా చేశాడంటూ నెట్టింట భారీ చర్చ మొదలైంది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం ఏంటని తలైవాపై పలు ప్రశ్నలు వచ్చాయి. తాజాగ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రజనీ ఇదే విషయంపై మీడియాతో ఇలా స్పందించారు. ' యోగులు, సన్యాసిల పాదాలను తాకి, వారి ఆశీర్వాదం తీసుకోవడం నా అలవాటు, వారు నా కంటే చిన్నవారైనా, నేను ఆ పని తప్పకుండా చేస్తాను. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించాను. అంతకు మించి మరో ఉద్దేశ్యం లేదు.' అని ఆయన తెలిపారు. రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో జైలర్ దూసుకెళ్తుండటంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జైలర్ ద్వారా తనకు భారీ విజయాన్ని అందించినందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినీ ప్రేమికులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు. (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే) -
త్వరలో జైలర్ నటుడి పెళ్లి, తలైవా ఆశీర్వాదాలు కూడా..
మాస్ ఫైటింగ్స్.. హీరోయిన్‌తో డ్యూయెట్స్.. ఇవేవీ లేకుండా సినిమా తీయొచ్చు.. హిట్టు కొట్టనూవచ్చు అని నిరూపించాడు తలైవా. తను స్లోమోషన్లో నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే తన ముందు మోకరిల్లుతాయని జైలర్‌తో చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంంగా దూసుకుపోతూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అందులో జాఫర్ సాదిఖ్ కూడా ఒకరు! ఈయన తమిళనాడులో ఫేమస్ కొరియోగ్రాఫర్. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన పావ కథైగల్ సిరీస్‌లో తొలిసారి నటించాడు. ఈ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్లో మాత్రమే ఆయన నటించాడు. తర్వాత అతడు వేందు తనైంతాతు కాదు అనే చిత్రంలో నెగెటివ్ రోల్లో మెరిశాడు. కానీ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ విక్రమ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ జైలర్‌లో నటించి మరిన్ని మార్కులు కొట్టేశాడు. జైలర్ సినిమాలో జాఫర్ రజనీకాంత్‌ను కత్తితో భయపెట్టాలని చూస్తాడు.. అందుకుకానీ శివరాజ్‌కుమార్.. అతడిని ఫ్యాన్‌కు కట్టేసి తిప్పుతాడు. ఈ సీన్ చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇకపోతే త్వరలో ఇతడు పెళ్లిపీటలెక్కబోతున్నాడట. జాఫర్ కొంతకాలంగా తన కో డ్యాన్సర్ షెరిన్తో ప్రేమలో ఉన్నాడు. తనతో కలిసి అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తుంటాడు. జైలర్ షూటింగ్ సమయంలో జాఫర్ తన ప్రియురాలిని రజనీకి పరిచయం చేశాడట. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ రజనీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. మరి తన పెళ్లి తేదీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి! ఇకపోతే సైతాన్ వెబ్ సిరీస్‌లోనూ నటించిన జాఫర్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. చదవండి: క్రికెటర్‌తో కూతురి ప్రేమాయణం.. దగ్గరుండి పెళ్లి చేసిన ప్రముఖ నటుడు 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు! -
రజనీ కొత్త సినిమా.. స్టార్ట్ అప్పుడే
‘జైలర్’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు హీరో రజనీకాంత్. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాల్లో కొంత సమయం గడిపారు రజనీ. అలాగే దేశంలోని మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నారాయన. అయితే రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందట. దీంతో ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమాపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని, సెప్టెంబరు రెండోవారంలో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్లో 170వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ఓ కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్, ప్రతినాయకుడి ఛాయలు ఉండే మరో కీలక పాత్రలో శర్వానంద్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది. -
రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు
సూపర్‌స్టార్ రజనీకాంత్ పనైపోయిందన్నారు. సినిమాలు చేయడం ఆపేస్తే బెటర్ అన్నారు. కట్ చేస్తే 'జైలర్' బ్లాక్‌బస్టర్ అయింది. దెబ్బకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ గల్లంతైపోతున్నాయి. ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాతో రజనీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆ విషయం ఆలోవర్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటి రికార్డ్? రజనీకాంత్ 'రోబో' సినిమా సంచలనం సృష్టించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'రోబో 2.0'.. కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు గానీ వసూళ్లు మాత్రం రూ.500 కోట్లకు పైనే వచ్చాయి. దీని తర్వాత సూపర్‌స్టార్ పలు సినిమాలు చేస్తున్నప్పటికీ డబ్బులు సాధించలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు 'జైలర్' వల్ల రజనీ మూవ రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) ప్రభాస్ తర్వాత అయితే రజనీకాంత్ కంటే ముందు ఈ లిస్టులో ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. 'బాహుబలి' రెండు పార్ట్లతో రూ.500 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. సౌత్ నుంచి ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది ప్రభాస్ మాత్రమే. ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరడం కొత్త జోష్ తీసుకొచ్చింది. ఏదేమైనా ఇక పనైపోయిందనుకునే టైంలో రజనీ కమ్‌బ్యాక్ ఇవ్వడం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. కలెక్షన్స్ ఎంత? 'జైలర్' ప్రస్తుతం 10 రోజుల్లో రూ.560 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే హైయస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. ఇక తెలుగులో రూ.60 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం.. యూఎస్‌లోనూ 5 మిలియన్ల కలెక్షన్స్ క్రాస్ అయిపోయింది. కన్నడ, మలయాళంలోనూ మంచి నంబర్స్ నమోదు చేయడం విశేషం. లాంగ్ రన్లో ఎన్ని కోట్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!) -
సీఎం పాదాలకు మొక్కిన తలైవా.. మండిపడుతున్న నెటిజన్స్!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తలైవా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. అంతే కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూసేందుకు ప్రత్యేకంగా లక్నో వెళ్లారు. (ఇది చదవండి: యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!) అయితే యోగిని కలిసిన రజినీకాంత్ ఎవరూ ఊహించని విధంగా ఆయన కాళ్లకు మొక్కారు. లక్నోలోని యూపీ నివాసానికి వెళ్లిన సమయంలో యోగి పాదాలకు నమస్కరించారు. అయితే రజినీకాంత్ చేసిన పనికి నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో తలైవా తీరును తప్పుబడుతున్నారు. మరికొందరైతే సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఎందుకలా చేశాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది,. అయితే రజినీకాంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి కాళ్లు మొక్కలేదని.. యోగి సన్యాసి కాబట్టే అలా చేశాడని అంటున్నారు. రజినీకాంత్‌కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ అని.. యోగి గతంలో గోరఖ్ పూర్ పీఠాధిపతి పదవిలో ఉండేవారని.. అదే భక్తి భావంతో యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారని భావిస్తున్నారు. ఏది ఏమైనా వయసులో చిన్నవాడైనా యోగి కాళ్లకు తలైవా నమస్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: ఖుషి రెమ్యునరేషన్.. ఒక్కొక్కరు అన్ని కోట్లు తీసుకున్నారా?) Rajnikanth who is both bigger in stature and age than Yogi Adityanath is touching his feet. Rajnikanth is 72, Yogi is 51. Why is a superstar touching the feet of a politician? He lost all respect today. pic.twitter.com/edY8rjJ6g9 — Roshan Rai (@RoshanKrRaii) August 19, 2023 అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూసేందుకు వెళ్లిన రజినీకాంత్ ఆయనతో కలిసి చూడలేకపోయారు. అత్యవసర పనుల కారణంగా యోగి ఆదిత్యనాథ్ అందుబాటులో లేకపోవడంతో.. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి జైలర్ చిత్రాన్ని వీక్షించారు. ఆ తర్వాతనే లక్నోలోని యోగి ఆదిత్యనాథ్ నివాసానికి వెళ్లి కలిశారు. కాగా.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌గా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. -
జైలర్ సినిమాలో మెగాస్టార్ ఉండాల్సింది, సైడ్ చేసిన రజనీకాంత్!
సాధారణంగా సినిమాలో ఇద్దరు స్టార్స్ ఉంటేనే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటిది జైలర్‌లో ఒకరిద్దరు కాదు, అనేకమంది స్టార్స్ ఉన్నారు. కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్.. ఇలా వివిధ భాషల నుంచి వేర్వేరు స్టార్స్‌ను తీసుకువచ్చారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎవరి ప్రాధాన్యతను తగ్గించకుండా అందరికీ సమన్యాయం చేస్తూ అందరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు డైరెక్టర్. విలన్‌గా ఈయన చేయాల్సింది కాదు ఇకపోతే ఈ సినిమాలో విలన్ వర్మాన్ పాత్ర కూడా బాగా పండింది. నటుడు వినాయకన్ ఈ పాత్రకు సరిగ్గా సెట్టయ్యాడు. అయితే విలన్ పాత్ర ఈయన చేయాల్సింది కాదట! మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చేయాల్సిందట! ఈ విషయాన్ని జైలర్‌లో రజనీ కొడుకుగా నటించిన వసంత రవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మమ్ముట్టి సర్‌ను విలన్‌గా అనుకున్నారు. రజనీకాంత్ సరే సెట్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. కానీ మమ్ముట్టికి అలాంటి పాత్ర ఇవ్వడానికి ఆయనకు మనసొప్పలేదు. మమ్ముట్టికి అలాంటి పాత్రనా? బాధపడ్డ రజనీ నెగెటివ్ పాత్రలో తనను ఊహించుకోలేకపోయాడు. ఆయనే స్వయంగా మమ్ముట్టి సర్‌కు ఫోన్ చేసి మనం ఇది కాకుండా మరో సినిమాలో కలిసి నటిద్దాం అని చెప్పాడు. అలా ఆయన విలన్‌గా చేయలేదు అని పేర్కొన్నాడు. ఇకపోతే మమ్ముట్టి ప్రస్తుతం భ్రమయుగం అనే సినిమా చేస్తున్నాడు. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. చదవండి: జైలర్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
జైలర్‌లో డ్యాన్సర్ గుర్తున్నాడా? సక్సెస్ చూడకముందే..
వరుసగా ఫ్లాపులతో సతమతమైన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్‌తో తన రేంజ్ ఏంటో చూపించాడు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను నేలమట్టం చేస్తూ కలెక్షన్స్‌తో విజృంభించాడు. ఆగస్టు 10న రిలీజైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. సౌత్‌లో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలో ఐదు వందల కోట్ల మార్క్‌ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జైలర్ డ్యాన్సర్ ఎవరో తెలుసా? ఇందులో నటించిన ఆర్టిస్టులందరికీ జైలర్ మూవీ బోలెడంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో విలన్ చిల్ అయ్యేందుకు తన దగ్గర పనిచేసేవాళ్లను డ్యాన్స్ చేయమంటూ ఉంటాడు. అందులో ఒకరు అందరినీ నవ్వించేలా స్టెప్పులేస్తూ ఉంటాడు. ఈయన పర్ఫామెన్స్ చూసి నవ్వనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా తన నటనతో మెప్పించిన వ్యక్తి పేరు రమేశ్. ఈయన తమిళ నటుడు, డ్యాన్సర్. ఈయన టిక్‌టాక్‌లో మూన్ వాక్‌లు, డిఫరెంట్ డ్యాన్స్‌లతో ఫేమస్ అయ్యాడు. తునివు చిత్రంలోనూ ఈయన నటించినట్లు తెలుస్తోంది. తాజాగా జైలర్‌లో నటించడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో ఈయన గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్, సోషల్ మీడియాలో వెతుకులాట ప్రారంభించారు. జైలర్‌కు ముందే మరణం అయితే ఆయన మన మధ్య లేరు. జైలర్ విజయాన్ని చూడకముందే కన్నుమూశారు. జనవరి 27న తన అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. కోలీవుడ్ కథనాల ప్రకారం ఆయన తీవ్రమైన ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారట. ఈ క్రమంలోనే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. రమేశ్ మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తను బతికి ఉండుంటే మరిన్ని అవకాశాలు వచ్చేవని కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/OtT0TvmyXB https://t.co/dWYwGkiUTK — madhoe (@madhuuyaar) August 15, 2023 His (Ramesh) Dance in #Jailer 👌 [Sad thing is he's no longer alive to see this] Ramesh Passed away this Jan 2023. He was famous during TikTok times for his unique dance steps & MoonWalk. He had also done a cameo in #Thunivu pic.twitter.com/kVacm3s5jU — Christopher Kanagaraj (@Chrissuccess) August 17, 2023 చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది: డిస్కో శాంతి -
Mirnaa Menon: ‘జైలర్’ కోడలు బ్యూటీఫుల్ లుక్.. మిర్నా మీనన్ (ఫొటోలు)
-
'జైలర్' కలెక్షన్స్.. రజనీ దెబ్బకు 'విక్రమ్' రికార్డ్ బ్రేక్
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం చూసి చాలా ఏళ్లయిపోయింది. 'రోబో' తర్వాత సినిమాలు చేస్తున్నారు. డబ్బులు ఓ మాదిరిగా వస్తున్నాయి. తాజాగా రిలీజైన 'జైలర్' మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంభోలా చేస్తోంది. రజనీ దెబ్బకు ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి. అన్ని కోట్ల వసూళ్లు ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమాకు తొలిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండోరోజు నుంచి మాత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ వినిపించింది. మరోవైపు 'భోళా శంకర్' అంతగా ఆకట్టుకోలేకపోవడం రజనీ మూవీకి ఓ రేంజులో కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు అంటే ఆరు రోజుల్లో రూ.416 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.40 కోట్ల వరకు వచ్చాయట. (ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!) 'విక్రమ్' రికార్డ్ బ్రేక్ అయితే గతేడాది కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు లాంగ్ రన్ లో మొత్తంగా రూ.410 కోట్లు వచ్చాయి. కానీ రజనీ 'జైలర్' మాత్రం ఆ మార్క్ ని ఆరు రోజుల్లోనే దాటేయడం విశేషం. ఇప్పటివరకు తమిళ సినిమాలు సెట్ చేసిన రికార్ట్స్ బ్రేక్ చేసిన 'జైలర్'.. లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందనేది చూడాలి. 'జైలర్'కి అదే ప్లస్ రజనీకాంత్ నటించిన 'జైలర్' స్టోరీ కొత్తదేం కాదు. అయినాసరే రజనీ స్వాగ్, స్టైల్ తోపాటు అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఈ వీకెండ్ లో మరో పెద్ద మూవీ ఏదీ థియేటర్లలో లేకపోవడం.. ఇలా అన్ని అంశాలు 'జైలర్'కు కలిసొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోతోంది. (ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి) -
'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!
లెజెండ్ శరవణన్.. చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించాడు. గతేడాది 'లెజెండ్' మూవీతో ఎంటర్టైన్ చేసిన ఇతడు.. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా రజనీ 'జైలర్' పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు. అయితే డిఫరెంట్ గెటప్‌తో ఉండేసరికి నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేదు. కానీ ఆ తర్వాత మాత్రం వీడియోని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు. గతేడాది విడుదలైన ఈ మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే ట్రోల్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి. 'లెజెండ్' తర్వాత బయటపెద్దగా కనిపించని శరవణన్.. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా డిఫరెంట్ గెటప్‌లో ప్రత్యక్షమయ్యాడు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులకు గిఫ్ట్స్ ఇచ్చిన ఇతడు.. ఆ తర్వాత 'జైలర్'లోని హుకుమ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు. అందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లోనే పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. పలువురు నెటిజన్స్ ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX — Legend Saravanan (@yoursthelegend) August 15, 2023 (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్‌పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్‌కు రూ.8 కోట్లు, శివరాజ్‌కుమార్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!
సూపర్‌స్టార్ 'జైలర్' రచ్చ మాములుగా లేదు. ఐదు రోజులు అవుతున్నా హీరో రజినీకాంత్ హవా తగ్గట్లేదు. అయితే ఈ సినిమాలో రజినీ కోడలి పాత్రలో ఓ బ్యూటీ నటించింది. బయట హాట్‌నెస్‌తో రెచ్చిపోయే ఆమెని.. స్క్రీన్‌పై పద్ధతిగా చూపించారు. గ్లామర్ చూపించే ఛాన్స్ రాలేదు. ఆమె తెలుగు సినిమాల్లో ఇప్పటికీ హీరోయిన్గా చేసిందని మీలో ఎవరికైనా తెలుసా? ఇంతకీ ఆ నటి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె డీటైల్స్ 'జైలర్'లో రజినీకాంత్ కోడలిగా కొన్ని సీన్స్‌కి పరిమితమైన ఈ భామ పేరు అదితి. అయితే సినిమాల్లోకి వచ్చాక మిర్నా మేనన్గా పేరు మార్చుకుంది. కేరళలోని ఇడుక్కిలో పుట్టిన ఈమె.. నటి కాకముందు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. కొన్నాళ్లకు ఈమె ఫొటోలని చూసిన ఓ డైరెక్టర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అలా 2016లో 'పట్టదారి' మూవీలో నటించింది. 2018లో 'కలవని మప్పిలై' అనే మరో చిత్రం చేసింది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) మోహన్‌లాల్‌తో తమిళంలో తొలి రెండు సినిమాలు చేసిన మిర్నా.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ 'బిగ్ బ్రదర్'లో నటించింది. దీంతో ఈమెకు కాస్త గుర్తింపు దక్కింది. అలా తెలుగులో ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో', అల్లరి నరేశ్ 'ఉగ్రం'లో హీరోయిన్గా చేసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆడనప్పటికీ.. ఈమె యాక్టింగ్‌కి మాత్రం బాగానే పేరొచ్చింది. 'జైలర్'కి కోడలిగా అయితే ఇప్పటివరకు పలు చిన్న సినిమాల్లో నటించిన మిర్నా.. రజినీకాంత్ 'జైలర్'లో నటించి దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ సినిమాలో పద్ధతిగా కనిపించింది కానీ సోషల్ మీడియాలో గ్లామర్ చూపించడంలో అస్సలు మొహమాటం చూపించట్లేదు. అయితే డైరెక్టర్స్ ఈమెలోని హాట్నెస్ యాంగిల్‌ని తొక్కేస్తున్నారని పలువురు నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మరో మలయాళ బ్యూటీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల క్రష్ లిస్టులోకి చేరిందనిపిస్తుంది. View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) -
జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు వసూళ్లు సాధించి ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని సినీ ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. ఈ రికార్డ్ స్థాయిలో వసూళ్లతో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రాన్ని అధిగమించింది. పొన్నియన్ సెల్వన్-2 బాక్సాఫీస్ వద్ద రూ.345 కోట్లు వసూళ్లు చేయగా.. తాజాగా ఆ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. పొన్నియిన్ సెల్వన్ -2లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. అత్యధిక వసూళ్లలో మూడోస్థానం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా జైలర్ నిలిచింది. ఆ లిస్ట్‌లో షారుఖ్ ఖాన్ పఠాన్, ప్రభాస్ ఆదిపురుష్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జైలర్ తమిళ వెర్షన్ ఇప్పటికే రూ. 139 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రూ.400 కోట్లే లక్ష్యంగా జైలర్ దూసుకెళ్తోంది. కాగా.. జైలర్‌లో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణన్, వినాయకన్, శివరాజ్‌కుమార్, సునీల్, నాగేంద్ర బాబు కీలకపాత్రల్లో నటించారు. -
తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్
నెల్సన్ దిలీప్ కుమార్.. గత కొద్దిరోజులుగా ఈ పేరు మార్మోగిపోతోంది. 2018లో వెండితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించాడీ తమిళ డైరెక్టర్. రచయితగా, దర్శకుడిగా సత్తా చాటుతున్న నెల్సన్ దిలీప్ కుమార్ తొలి సినిమా కోలమావు కోకిల. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన మరో సినిమా డాక్టర్. ఈ సినిమా కూడా హిట్టే! మూడో సినిమా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో చేశాడు. గతేడాది రిలీజైన ఈ బీస్ట్ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. అయితే కలెక్షన్లపరంగా మాత్రం రెండు వందల కోట్లపైనే వసూలు చేసింది. ఈసారి తలైవాతో జైలర్ సినిమా తీశాడు నెల్సన్. ఈయన అందించిన కథ, డైరెక్షన్ అన్నీ పర్ఫెక్ట్గా కుదరాయి. ఫలితంగా జైలర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నాలుగు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా ప్రతి చిత్రంలోనూ యోగి బాబు నటించారు. జైలర్ సినిమాకు వస్తున్న స్పందన చూసి సంతోషం వ్యక్తం చేసిన నెల్సన్ త్వరలో దీనికి సీక్వెల్ కూడా తీయనున్నాడట! అంతేకాదు, ఇప్పటివరకు తీసిన మూడు సినిమాల(బీస్ట్, డాక్టర్, కోలమావు కోకిల)కు కూడా రెండో పార్ట్ తీయాలన్న ఆలోచనలో ఉన్నాడట. విజయ్, రజనీకాంత్‌ను ఒకే సినిమాలో కలిసి చూపించాలన్నది కూడా తన కల అని నెల్సన్ చెప్పాడంటూ తమిళ సినీ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ ట్విటర్లో రాసుకొచ్చాడు. మరి అది సాధ్యమయ్యే పనేనా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి! #Jailer2 CONFIRMED✅ "There are plans to take #Jailer part 2. Also, I'm planning to make part two for #Beast, #Doctor, #KolamaavuKokila. I have also dream to do one film featuring #Vijay & #Rajinikanth together." - Nelson Dilipkumar pic.twitter.com/F6LtIQ7V9t — Manobala Vijayabalan (@ManobalaV) August 14, 2023 చదవండి: Jailer Movie: ఊచకోత మొదలుపెట్టిన తలైవా.. రూ. 300 కోట్ల క్లబ్బులో జైలర్.. తెలుగులో ఎంతంటే? మెగాస్టార్‌కు మరోసారి సర్జరీ.. సినిమాలకు బ్రేక్ -
ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!
పెద్ద సినిమాలు ఎప్పుడూ ఒకే టైంలో విడుదల చేయరు. ఎందుకంటే థియేటర్ల సమస్య, కలెక్షన్స్ తగ్గుదల లాంటివి వస్తాయని దర్శకనిర్మాతలు భయపడుతుంటారు. అయితే గత వీకెండ్ మాత్రం ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. వీటి రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటా రికార్డ్? గత వారం రజినీకాంత్ 'జైలర్', చిరు 'భోళా శంకర్', అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2', సన్నీ డియోల్ 'గదర్ 2'. వీటిలో రజినీ, సన్నీ చిత్రాలకు హిట్ టాక్ రాగా.. అక్షయ్ మూవీకి మిక్స్డ్ టాక్, చిరు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితేనేం వీకెండ్లో మాత్రం దుమ్ముదులిపే వసూళ్లు దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ నాలుగు సినిమాలకు ఆగస్టు 11-13 మధ్య రూ.390 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) దేశ సినీ చరిత్రలో ఓ వీకెండ్ ఇన్ని కోట్ల కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే మూడు రోజుల్లో ఏకంగా 2.10 కోట్ల మంది థియేటర్లలోకి వచ్చారని పేర్కొంది. కరోనా తగ్గుదల తర్వాత థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏయే సినిమాలకు ఎంత? ఈ నాలుగు సినిమాల్లో 'జైలర్' కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రూ.32 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన రజినీ చిత్రం.. ఓవరాల్‌గా రూ.300 కోట్ల మార్క్ దాటేసినట్లు సమాచారం. మరోవైపు 'గదర్ 2' వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.134 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలానే అక్షయ్ 'ఓ మై గాడ్ 2' చిత్రం రూ.50 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. చిరు 'భోళా శంకర్'కు రూ.20 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా గత వీకెండ్ సినీ ప్రియులకు వినోదం పంచింది. చాలారోజుల తర్వాత బాక్సాఫీస్ బద్దలైపోయేలా చేసింది. BIGGGEST NEWS… ⭐️ #Jailer ⭐️ #Gadar2 ⭐️ #OMG2 ⭐️ #BholaaShankar 🔥 COMBINED Gross BO of ₹ 390 cr+ 🔥 COMBINED Footfalls of 2.10 cr+ 🔥 ALL-TIME Theatrical Gross #BO record in 100+ year history Note: 11 - 13 Aug 2023 weekend Multiplex Association of India and Producers Guild… pic.twitter.com/kofNvtXNpc — taran adarsh (@taran_adarsh) August 14, 2023 (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ కి సర్జరీ.. కారణం అదే!) -
జైలర్‌కు తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్సా? అప్పుడే మూడు రెట్ల లాభాలు!
బాక్సాఫీస్ దగ్గర జైలర్ జోరు కొనసాగుతోంది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ పడింది. ఆగస్టు 10న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ చిత్రం తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోనూ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం నాలుగురోజుల్లోనే ఇక్కడ రూ.32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి రజనీకాంత్ గత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో జైలర్ తెలుగు రైట్స్‌కు పెద్ద ధర పలకలేదు. తక్కువ బిజినెస్.. ఎక్కువ లాభాలు గతంలో కబాలి సినిమా రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ.31 కోట్లకు అమ్మారు. రోబో 2.0 సినిమాకు దాదాపు రూ.70 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కానీ పేట, దర్బార్ మాత్రం పదిహేను కోట్లలోపే బిజినెస్ జరిగింది. ఈ క్రమంలో జైలర్ థియేట్రికల్ హక్కులను కేవలం రూ.12 కోట్లకు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తలైవా సినిమాకు తొలి రోజే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయగా ఈ నాలుగురోజుల్లో దాదాపు మూడు రెట్ల లాభాలు వచ్చాయి. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండటంతో నిర్మాతలకు మరింత లాభం చేకూరనుంది. రూ.300 కోట్ల క్లబ్బులో జైలర్ జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లు రాబట్టింది. రజనీకి ఈ రికార్డు కొత్తేం కాదు, గతంలో ఆయన నటించిన రోబో 2.0, కబాలి, ఎంతిరన్ సినిమాలు సైతం రూ.300 కోట్ల క్లబ్బులో చేరాయి. అయితే జైలర్ హవా ఇక్కడితో ఆగిపోయేట్లు కనిపించడం లేదు. లాంగ్ రన్లో రూ.500 కోట్లు సులువుగా సాధించేట్లు కనిపిస్తోంది. జైలర్ సినిమా విషయానికి వస్తే రజనీకాంత్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, తమన్నా, ప్రియాంక మోహన్, జాకీ ష్రాఫ్, మీర్నా మీనన్, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. Super 🌟 @rajinikanth's Rampage Continues at the Telugu box office grossing 32CR in just 4⃣ Days Across AP/TS 🔥💥 Book Your Tickets Now 🎟 https://t.co/xMpl1jGcVT@Nelsondilpkumar @tamannaahspeaks @anirudhofficial @sunpictures @AsianCinemas_ @UrsVamsiShekar #JailerTelugu pic.twitter.com/hov3e6m2Ro — Suresh Productions (@SureshProdns) August 14, 2023 #Jailer crossed the ₹ 300 Crs gross Mark at the WW Box office in 4 days! This is the 4th movie for #SuperStar @rajinikanth to enter the 300cr Club.. #Enthiran#Kabali#2Point0#Jailer — Ramesh Bala (@rameshlaus) August 14, 2023 చదవండి: నేనలా అనలేదు, ఇమేజ్ దెబ్బ తీయొద్దు: కార్తికేయ -
మామకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని లాక్ చేసిన అల్లుడు
-
బీస్ట్ ఫ్లాప్.. నాపై కోపంగా ఉందా? అని విజయ్ను అడిగా: జైలర్ డైరెక్టర్
నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'కోలమావు కోకిల' చిత్రంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన శివకార్తికేయన్‌తో 'డాక్టర్' సినిమా తీయగా ఇది ఈజీగా వంద కోట్ల క్లబ్లో చేరింది. తర్వాత విజయ్ హీరోగా 'బీస్ట్' తీశాడు. దీనికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ రూ.200 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఇతడు దర్శకత్వం వహించిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.220కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెల్సన్ దిలీప్ కుమార్ 'బీస్ట్' నెగెటివ్ టాక్‌పై స్పందించాడు. 'మేము సినిమా తీశాం. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. దానికి మేమేం చేయలేము. మా కష్టంలో నిజాయితీ ఉంది. కానీ, వర్కవుట్ కాలేదు. సరే, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ కష్టపడతాం మరింత కొత్తగా ప్రయత్నిస్తాం. అయితే బీస్ట్ సినిమా రిజల్ట్ నెగెటివ్ వచ్చినప్పుడు నేను కూడా విజయ్‌తో మాట్లాడాను. నీకేమైనా కోపంగా ఉందా? అని అడిగాను. దానికతడు నాకెందుకు నీపై కోపం ఉంటుంది? అని తిరిగి ప్రశ్నించాడు. అంటే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది కదా అని చెప్పగానే అయ్యో అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడే వచ్చి నేనెందుకు కోప్పడతాను. మనం కష్టపడి సినిమా తీశాం. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. దానికి మనమేం చేయగలం.. నెక్స్ట్ టైం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అయినా మన స్నేహాన్ని సినిమాల వరకే పరిమితం చేస్తున్నావా? అన్నాడు. ఆ మాట నా మనసుకు తాకింది. జైలర్ సినిమా రిలీజయ్యాక విజయ్ నాకు అభినందనలు తెలిపాడు. కంగ్రాచ్యులేషన్స్, నీ సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉంది అని మెసేజ్ చేశాడు' అని చెప్పుకొచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్. చదవండి: బాలీవుడ్ నటి ఇంట విషాదం.. తండ్రి పాడె మోస్తూ -
'జైలర్'పై రజనీ మొదటి రియాక్షన్ ఇదే
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్‌తో ప్రపంచం మొత్తం సినీ అభిమానులను తనపైపు తిప్పుకున్నారు. ఈరోజు తలైవా పేరు ఎక్కడ చూసిన మారుమ్రోగిపోతుంది. దాదాపు మూడేళ్ల తరువాత భారీ హిట్‌ను ఆయన అందుకున్నారు. గతంలో ఆయన నటించిన దర్బార్, అన్నాతే సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోవడం. ఆ తర్వాత తలైవా అనారోగ్యం పాలవడం జరిగాయి. దీంతో ఇక ఆయన సినిమాలకు దూరం కావడం మంచిదనే సలహాలు కూడా పలువురు ఇచ్చారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) మరికొందరైతే ఏకంగా 72 ఏళ్ల వయస్సులో ఇంకేం సినిమాలు తీస్తాడు. ముందు ఆయనకు కథలు ఎంచుకోవడమే చేతకావడం లేదని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో డైరెక్టర్ నెల్సన్‌కు రజనీ అవకాశం ఇచ్చాడు. అప్పటికే విజయ్‌తో బీస్ట్ సినిమా తీసి ప్లాప్ మూటగట్టుకున్న డైరెక్టర్ నెల్సన్‌కు రజనీ అవకాశం ఇవ్వడంతో ఇక రజనీ పని అయిపోయినట్లే అంటూ కొందరు చెప్పుకొచ్చారు ఇలా రకరకాలుగా రజినీపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా సినిమా విడుదలకు ముందే ఆయన ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. తాజాగా బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించి అనంతరం రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మొదటిసారి ఆయన 'జైలర్' గురించి మాట్లాడారు. సినిమా షూటింగ్ ప్రారంభంలో చాలా ఒత్తిడి ఉండేదని ఇలా చెప్పారు. 'భారీ అంచనాల మధ్య 'జైలర్' విడుదలైంది. ఒక సందర్భంలో నేను కూడా సినిమా ఫలితం ఎలా ఉంటుందని అనుకున్నా. ఆ సమయంలో స్వామిజీ ఒక మాట చెప్పారు 'కంగారుపడొద్దు.. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంది.' అని అన్నారు. స్వయంగా ఆయనే ఆ మాట చెప్పారంటే ఇంకెందుకు ఆలోచించడం.. తప్పకుండా 'జైలర్' హిట్ అయినట్టే అని రజనీ అన్నారు. ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు వసూళ్లు చేసిందని సినీ ట్రేడర్స్ అంచనా వేశారు. Superstar FIRST speech after Jailer release. "#Jailer released with lot of expectations. Swamiji said don't worry, picture will become HIT. If he himself says, then #Jailer is hit only" - #Rajinikanth pic.twitter.com/jEiGdzbJsd — Manobala Vijayabalan (@ManobalaV) August 12, 2023 (ఇదీ చదవండి: జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!) -
జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు
రజనీకాంత్ రంగంలోకి దిగితే వార్ వన్‌సైడే! సరైన కంటెంట్ పడాలే కానీ ఆయన్ను ఆపడం ఎవరితరమూ కాదు. చాలాకాలం తర్వాత రజనీ జైలర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అది కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు కొల్లగొడుతున్నాడు. కొన్ని సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్‌ను సైతం కేవలం రెండు, మూడు రోజుల్లోనే రాబట్టాడు. టైగర్ కా హుకుం అన్నట్లుగా బాక్సాఫీస్ రికార్డులు జైలర్ సినిమాకు దాసోహమవుతున్నాయి. ఆగస్టు 10న జైలర్ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి నుంచీ పెద్దగా ప్రచారం లేదు కానీ ప్రీరిలీజ్ నుంచి ప్రచారం జోరందుకుంది. తీరా బాక్సాఫీస్‌లో బొమ్మ పడ్డాక బ్లాక్‌బస్టర్ హిట్ టాక్.. రెండో రోజు వసూళ్లు కాస్త నెమ్మదించినా మూడో రోజుకు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.220 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కలెక్షన్స్(రూ.70 కోట్లు)తో 2023లో తమిళనాడులో బిగ్గెస్ట్ ఓపెనింగ్, బిగ్గెస్ట్ ఇండియన్ ప్రీమియర్ ఆఫ్ 2023 ఇన్ యూఎస్ఏ, బిగ్గెస్ట్ తమిళ్ ఓపెనర్ ఆఫ్ ఓవర్సీస్ ఇన్ 2023 రికార్డులు జైలర్ హస్తగతమయ్యాయి. రజనీ కేవలం తమిళ హీరోనే కాదు దశాబ్ధ కాలం నుంచి తెలుగులోనూ అతడి చిత్రాలు రిలీజవుతూ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఆయనకు మంచి ఫ్యాన్‌బేస్ ఉంది. ఫలితంగా జైలర్‌కు తెలుగులోనూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. భోళా శంకర్‌కు మిశ్రమ స్పందన వస్తుండటంతో చాలా థియేటర్లలో ఈ సినిమాను జైలర్‌తో రీప్లేస్ చేస్తున్నారు. అటు వసూళ్లు కూడా భోళా శంకర్ కన్నా జైలర్కే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం జైలర్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 12th August Box Office #Jailer Day 3 AP/TS, TN, KA, KL, India, WW >> #BholaaShankar Day 2 pic.twitter.com/c0j5zKUa9s — Manobala Vijayabalan (@ManobalaV) August 13, 2023 చదవండి: జైలర్ నటుడి కొత్త సినిమా.. ఇద్దరు హీరోయిన్లతో ఆ హీరోని చెంపదెబ్బ కొట్టినా, అతనిపై ఉమ్మినా..రూ.10 లక్షలు నజరానా! -
జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
సినిమాల్లో కేవలం హీరోయిన్ల కోసం వచ్చే ప్రేక్షకులూ ఉంటారన్నది వాస్తవం. కొన్నిసార్లు ఈ కారణంగానే దర్శక నిర్మాతలు యువ హీరోల సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. తాజాగా హీరో వసంత రవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా తానేమిటో నిరూపించుకున్నాడు వసంత రవి. ఆ తర్వాత రాఖి చిత్రంతో యాక్షన్ హీరోగా విజయాన్ని అందుకున్నారు. ఇటీవల అశ్విన్స్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్ కొడుకుగా విభిన్న పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. కాగా వసంత రవి ఇప్పుడు కథానాయకుడిగా తన ఏడవ చిత్రానికి సిద్ధమయ్యారు. జేఎస్ఎం పిక్చర్స్, ఎంపీరర్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శబరీష్ నందా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా వసంత రవికి జంటగా పటాస్, నోటా చిత్రాల ఫేమ్ మెహ్రీన్, హీరోయిన్ అనికా సురేంద్రన్ నటిస్తున్నారు. అజ్మల్ దాసిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రం కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. టైటిల్ సహా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నాడు. చదవండి: Varun Dhawan: కొత్త సినిమా.. గాయపడ్డ హీరో వరుణ్! -
'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!
'జైలర్' హవా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సూపర్‌స్టార్ రజినీకాంత్ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రజినీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాగా హైలైట్ అయ్యాడు. మరి 'జైలర్'కి మరో హీరో అయిన అనిరుధ్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ. రజినీకాంత్ 'జైలర్' స్టోరీ నార్మల్‌గా ఉన్నప్పటికీ.. ఈ రేంజులో సినిమా హిట్ అయిందంటే దానికి కారణం అనిరుధ్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సాధారణమైన సీన్స్‌ని కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 'హుకుమ్' పాట అయితే ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇలాంటి టైంలో అనిరుధ్ రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'జైలర్' హీరోగా నటించిన రజినీకాంత్‌కు రూ.110 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇక మిగిలిన వారిలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కే ఎక్కువట. ఏకంగా రూ.10 కోట్ల వరకు ఇతడు అందుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు రూ.8 కోట్లు మాత్రమే తీసుకున్న అనిరుధ్.. 'జైలర్'తో ఏఆర్ రెహమాన్(రూ.8 కోట్లు)నే దాటేశాడు. అలానే ఇతడు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తం, చాలామంది యంగ్ హీరోలకు ఇచ్చేదాని కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. మరోవైపు అనిరుధ్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు నిర్మాతలు కూడా మనోడి వెంట పడుతున్నారు. రూ.10 కోట్లు కంటే ఎక్కువే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు పవన్ 'అజ్ఞాతవాసి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. నాని 'జెర్సీ'తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తీస్తున్న 'దేవర' కోసం పనిచేస్తున్నాడు. ఏదేమైనా సరే ఓ సంగీత దర్శకుడు గురించి ఇంతలా మాట్లాడుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!) -
'జైలర్' సినిమా.. జపాన్ ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజులో!
రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా మన దేశంలో ఉన్న జపాన్ అంబాసిడర్ రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘బెస్ట్ విషెస్’ చెప్పాడు. ఇక ‘ముత్తు’ నాటి నుంచి రజనీకి ఫ్యాన్స్‌గా ఉన్న ఒక జంట ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి వచ్చింది సినిమా చూడటానికి!రజనీ హవా అలా ఉంది. ‘హుకుమ్... టైగర్ కా హుకుమ్’ అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సినిమా హాల్లో విజిల్స్‌ను మోతెక్కిస్తోంది. ప్రపంచాన్ని ఇప్పుడు రజనీ చుట్టుముట్టి ఉన్నాడు– జైలర్ సినిమాతో. అసలే రజనీ అనుకుంటే అతనికి తోడు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివ రాజ్‌కుమార్ కూడా సినిమాలో ఉండేసరికి మాస్ ఆడియెన్స్ పోటెత్తుతున్నారు. అయితే ఈ సంబరంలో ఇండియన్స్ మాత్రమే లేరు... జపనీయులు కూడా ఉన్నారు. ‘ముత్తు’ కాలం నుంచి ఇండియాలో రజనీ ఎంతో జపాన్‌లో కూడా అంతే. అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ. అందుకే ఇండియాలో ఉన్న జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకీ ఒక వీడియో రిలీజ్ చేసి అందులో రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘రజనీ యూ ఆర్ జస్ట్ సూపర్.. విష్ యూ గ్రేట్ సక్సెస్’ అని చెప్పాడు. ఇలాంటి మర్యాద ఏ స్టార్‌కూ దక్కలేదు. ఇక జపాన్‌లోని ఒకాసా నుంచి యసుదా హిదెతోషి అనే ఆసామి తన భార్యతో ఏకంగా చెన్నైలో ల్యాండ్ అయ్యాడు ‘జైలర్’ చూసేందుకు. అతను జపాన్‌లో ఆల్ జపాన్ రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అట. నెల్సన్ డైరెక్ట్ చేసిన ‘జైలర్’ ప్రస్తుతం కలెక్షన్ల హవా సృష్టిస్తోంది. -
'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. విజయ్‌తో నెల్సన్ బీస్ట్ సినిమా తీశాడు. ఇది ప్లాప్ కావడంతో ఎంతో కసితో జైలర్‌ను తెరకెక్కించి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, జాకీష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఉన్నారు. దీంతో సౌత్ ఇండియన్ స్టార్స్ అంతా మొదటిరోజు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో, నటుడు ధనుష్ కూడా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నా సమయం తీసుకొని జైలర్ కోసం థియేటర్‌కు వెళ్లాడు. కానీ అప్పటికే అక్కడ తన మాజీ అత్తగారు కూడా సినిమా చూడటానికి వెళ్లారు. అంత వరకు బాగుంది. కానీ నటి త్రిషతో కలిసి సినిమా చూసేందుకు ధనుష్ వచ్చాడని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరూ థియేటర్ లోపల ఉన్న ఫోటోలు ఇవే అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి) ఐశ్వర్య రజనీకాంత్‌తో విబేదాల వల్ల ధనుష్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో త్రిషతో ధనుష్ ప్రేమాయణం నడుపుతున్నాడంటూ పలు వార్తలు వెంటనే వచ్చేశాయి. దీనిని ధనుష్ అభిమానులు ఖండించారు. తలైవా సినిమాకు ధనుష్ వెళ్లడం వరకు నిజమేనని, త్రిషతో కలిసి వెళ్లలేదని వారు తెలిపారు. పెట్టా సినిమా రిలీజ్ సమయంలో వారిద్దరూ కలిసి వెళ్లి మూవీ చూశారని వారు పేర్కొన్నారు. అప్పటి ఫోటోలను మళ్లీ నెట్టింట్లో షేర్ చేస్తున్నారని ఆయన అభిమానులు వివరణ ఇచ్చారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయకండని వారు కోరారు. -
జైలర్ మూవీ పై పగ తీర్చుకుంటున్న దళపతి ఫ్యాన్స్..
-
జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సక్సెస్ కోసం రజనీకాంత్.. రజనీ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. జైలర్ చిత్రంతో వీరి కల నిజమైంది. తలైవా స్టైల్, యాక్షన్, డైలాగ్ డెలివరీకి అభిమానులు ముచ్చటపడిపోతుంటే.. పాజిటివ్ టాక్ రావడంతో రజనీ పండగ చేసుకుంటున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది. ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం రూ.24 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. కేరళలో రూ.6 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో చెరో రూ.5 కోట్లు, కర్ణాటకలో రూ.10 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ అదిరిపోయే కలెక్షన్స్ రాగా.. వీటన్నింటినీ కలుపుకుని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.75-85 కోట్ల మేర సాధించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కాకపోయినా ఇన్ని కోట్లు రాబట్టిందంటే మామూలు విషయం కాదంటున్నారు ఫ్యాన్స్. కొందరు హీరోలకు ఇవి లైఫ్‌టైమ్ వసూళ్లు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి రోజు థియేటర్ల వద్ద రజనీ అభిమానులు సందడి చేశారు. ఈ క్రమంలో సినిమా బాలేదని నెగెటివ్ రివ్యూ ఇచ్చిన ఇద్దరినీ చెన్నైలో చితక్కొట్టారు. సోషల్ మీడియా ప్రచారం ఎలా ఉన్నా మౌత్ టాక్‌తో సినిమాకు లాభాల పంట పండటం ఖాయంగా కనిపిస్తోంది. జైలర్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, యోగిబాబు, రమ్యకృష్ణ తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్ ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇతడి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి: జేమ్స్‌బాండ్‌లా పోజు కొడుతున్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా? -
తొలిరోజే 80 కోట్లు !
-
జైలర్‌పై నెగెటివ్ రివ్యూ.. చితక్కొట్టిన ఫ్యాన్స్, వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది. సినిమాలో రజనీ స్టైల్, యాక్షన్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సెకండాఫ్ పర్వాలేదనిపించినా ఫస్టాఫ్ మాత్రం అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు. రజనీ సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే! థియేటర్లో పేపర్లు చిరగాల్సిందే, రచ్చ చేయాల్సిందే! ఇంత మంచి ఊపు మీదున్న అభిమానులను హర్ట్ చేశారు కొందరు యువకులు. సినిమా బాలేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇది రజనీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. తమ అభిమాన హీరో సినిమా బాలేదంటారా? అని కోపంతో ఊగిపోతూ వారిని చితకబాదారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వాళ్లు దళపతి విజయ్ ఫ్యాన్స్ అని, కావాలనే తలైవా సినిమాపై వ్యతిరేకత తీసుకువచ్చేందుకు ఇలా కుట్రపన్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి రజనీకాంత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. జైలర్ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. #Rajinikanth fans continue to embarrass their ‘#Thalaivar’ @rajinikanth by engaging in violent activities. They beat up a harmless #ThalapathyVijay fan for expressing his opinion on the #Jailer movie. These cowards should be severely punished #JailerReviewpic.twitter.com/CKlgvJZZbw — Ajay AJ (@AjayTweets07) August 10, 2023 చదవండి: జైలర్ సినిమా రివ్యూ వరదలో మూడు కార్లు కొట్టుకుపోయాయి: సన్నీలియోన్ -
Jailer Movie Release Fans Celebration: రజనీకాంత్ ‘జైలర్’మూవీ విడుదల.. అభిమానుల సందడి (ఫోటోలు)
-
'జైలర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తలైవా మేనియాతో అంతా సందడి సందడిగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఓ మాదిరిగా సక్సెస్ అయింది. దీంతో ఈ వీకెండ్ బాగానే వసూళ్లు రాబట్టే అవకాశముంది. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీ పార్ట్నర్ని ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతం ఆ విషయాలు బయటకొచ్చేశాయి. ఇంతకీ 'జైలర్' ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) 'జైలర్' కథేంటి? టైగర్ ముత్తువేల్ పాండియన్(రజినీకాంత్) రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీ అధికారి. విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. దీంతో కొడుకు ఆచూకీ కోసం ముత్తు చాలా తిరుగుతాడు. మరి ముత్తు, కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? అనేదే 'జైలర్' స్టోరీ. ఆ ఓటీటీలేనే? రజినీకాంత్ 'జైలర్' సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతమందించగా, నెల్సన్ దర్శకుడు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీపడినప్పటికీ.. సన్ పిక్చర్స్ సొంత సంస్థ సన్ నెక్స్ట్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెలన్నర తర్వాత అంటే సెప్టెంబరు చివర్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!) -
Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ
టైటిల్: జైలర్ నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్ నిర్మాత: కళానిధి మారన్ దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఎడిటర్: ఆర్.నిర్మల్ సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్ విడుదల తేది: 2023 ఆగస్టు 10 'జైలర్' కథేంటి? ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అందరూ ఇతడిని టీజ్ చేస్తుంటారు. ఇకపోతే ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీగా పనిచేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా సరే విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. దీంతో కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే కొడుకు ఆచూకీ కోసం ముత్తు అన్నిచోట్లకు వెళ్తాడు. అలాంటి ముత్తు.. కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? ఈ స్టోరీలో వర్మ(వినాయగన్), బ్లాస్ట్ మోహన్(సునీల్), కామ్నా(తమన్నా) ఎవరు? అనేది తెలియాలంటే 'జైలర్' చూడాల్సిందే. ఎలా ఉందంటే? ముత్తు అదేనండి రజినీకాంత్.. విలన్ డెన్లోకి వెళ్లి, అతడికి వార్నింగ్ ఇస్తాడు. స్టైల్‌గా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగిస్తాడు. ఇంటర్కట్లో మరో రెండు చోట్ల శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ కూడా అదే టైంకి సిగరెట్స్ స్టైల్‌గా వెలిగిస్తారు. దీనికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇదంతా చెప్పడానికి చాలా నార్మల్‌గా ఉన్నాసరే.. స్క్రీన్‌పై ఈ సీన్ చూస్తున్నప్పుడు మీరు రజినీకాంత్ మేనియాలోకి వెళ్లిపోతారు. ఇలాంటి సీన్స్ సినిమాలో బాగానే ఉన్నాయి. ఫస్టాప్ విషయానికొస్తే.. అరక్కోణం అనే ఊరిలోని ఓ గుడిలో పూజారిని మర్డర్ చేసి, విగ్రహాం దొంగతనం చేసిన సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే ముత్తు(రజినీకాంత్), అతడి ఫ్యామిలీ గురించి చూపిస్తారు. పాపం.. రిటైర్ అయి ఇంట్లో ఉండేసరికి మనవడితో సహా అందరూ ముత్తుని ఆడేసుకుంటూ ఉంటారు. చివరకు అదే వీధిలో ఉండే క్యాబ్ డ్రైవర్(యోగిబాబు) కూడా ఏడిపిస్తుంటాడు. కొన్నాళ్లకు తన కొడుకు కనిపించకుండా పోవడం.. పోలీసుల దగ్గరకెళ్లి ముత్తు ప్రాధేయపడటం.. ఇలా సీన్ బై సీన్ మంచి ఫ్లోలో వెళ్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ అయితే మంచి హై ఇస్తుంది. ఇంటర్వెల్ వరకు రజినీకాంత్ ఇమేజ్, స్టోరీని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ నెల్సన్.. సెకండాఫ్‌లో మాత్రం గందరగోళానికి గురిచేశాడు. అప్పటివరకు ఓ టెంపోలో వెళ్లిన కథ.. సెకండాఫ్‌లో ఎటెటో పోతుంది. అసలేం జరుగుతుందని ప్రేక్షకుడు అనుకుంటాడు. ఫైనల్లీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్లీ స్టోరీ గాడిన పడుతుంది. ఓ మంచి హై ఇచ్చే యాక్షన్ సీన్, ఊహించని సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. 'జైలర్' కథ కొత్తదేం కాదు. ట్విస్టులు కూడా ఊహించేయొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్టోరీలో రజినీకాంత్ హీరోయిజం తప్ప ఇంకేం లేదు! డార్క్ కామెడీ తీయడంలో స్పెషలిస్ట్ అయిన నెల్సన్.. 'జైలర్' విషయంలోనూ అదే ఫార్ములా పాటించాడు. ఫస్టాప్‌లో రజినీకాంత్-యోగిబాబు మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ పై కనిపించే యాక్టర్స్ అందరూ సీరియస్ యాక్టింగ్ చేస్తుంటారు. మనకు మాత్రం నవ్వొస్తుంటుంది. అదే 'జైలర్'లో మ్యాజిక్. ఎవరెలా చేశారంటే? 'జైలర్'లో రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. మాస్-క్లాస్-యూత్-ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కవర్ చేస్తూ ఎంటర్టైన్ చేశారు. ఆయనకు ఇలాంటివన్నీ కొత్తేం కాదుగా! తన మార్క్ మేనరిజమ్స్‌తో.. విజిల్స్ వేయించే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో రజినీ యాక్టింగ్ మీకు కచ్చితంగా హై ఇస్తుంది. రజినీకి భార్యగా రమ్యకృష్ణ హుందాగా నటించింది. కొడుకు అర్జున్‌గా వసంత్ రవి డిఫరెంట్ పాత్రలో ఓకే అనిపించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ నిడివి చాలా తక్కువ. కానీ ఉన్నంతలో వీళ్లకు ఎలివేషన్స్ బాగా పడ్డాయి. విలన్‌గా మలయాళ నటుడు వినాయగన్ బాగానే చేశాడు. కానీ అతడు పాత్రలో తమిళ నేటివిటి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. సునీల్ ఇందులో బ్లాస్ మోహన్ అనే సినిమా హీరో పాత్రలో నటించాడు. కానీ ఇతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. తమన్నా.. ఓ పాట, రెండు మూడు సీన్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. యోగిబాబు, వీటీవీ గణేశ్ ఉన్నంతసేపు నవ్వించారు. మిగిలిన వాళ్లు తమ తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే ఈ సినిమాలో రజినీకాంత్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో హీరో అని చెప్పొచ్చు. పాటల సంగతి పక్కనబెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రజినీకాంత్‌ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు. మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడలేదు. ఓవరాల్‌గా చెప్పుకుంటే నార్మల్ ఆడియెన్స్‌కి 'జైలర్' నచ్చుతుంది. రజినీకాంత్ అభిమానులకు అయితే ఇంకా బాగా నచ్చేస్తుంది! -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
రజనీ కాంత్ రేంజ్ ఏంటో చెప్పే సంఘటన
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో తలైవా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలేషియా,జపాన్ సింగపూర్‌లో ఈయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ 'బాషా', 'ముత్తు' లాంటి సినిమాలు అక్కడి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వాటిని రిపీటెడ్‌గా చూస్తారు. కానీ ఆయన నటించిన గత చివరి సినిమాలు 'పేట', 'దర్బార్', 'అన్నాత్తే' కమర్షియల్‌గా అక్కడ హిట్ కొట్టాయి. (ఇదీ చదవండి: నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్) తాజాగా జైలర్ సినిమాను చూసేందకు జపాన్‌లోని ఒసాకా నుంచి ఒక జంట చెన్నైకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలైంది. కానీ తలైవా గడ్డపైనే జైలర్‌ను చూడాలని వారు ఇంత దూరం వచ్చినట్టు రజనీకాంత్ జపాన్ ఫ్యాన్స్ అసోషియేషన్ లీడర్ యసుదా హిడెతోషి తెలిపారు. ఆయన రజనీ పేరుతో జపాన్‌లో పలు సేవా కార్యక్రమాలు చేశారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాల కోసం జపాన్‌కు రజనీ వెళ్తే ఆ ఏర్పట్లాన్ని యసుదానే చూసుకుంటారు. ఇక, జపాన్‌లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అత్యంత అధికంగా ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన సినిమాలు అక్కడ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. కథల పుస్తక రూపంలో అక్కడ ఎంతగానో ఆకట్టుకుంది. -
ఉద్యోగుల కోసం 7 స్క్రీన్లు బుక్ చేసిన సీఈఓ - తలైవా సినిమా అంటే అట్లుంటది!
మన దేశంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్స్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తమిళనాడులో ఇది మరింత ఎక్కువగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జైలర్ సినిమా ఈ రోజు విడుదలైంది. దీనికోసం తమిళనాట ఒక కంపెనీ సీఈఓ తమ ఎంప్లాయిస్ కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ గిరీష్ మాతృభూతం తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం జైలర్ స్పెషల్ షోలు వేయిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా ఏడు స్క్రీన్స్ బుక్ చేసుకున్నాడు. తమ 2200 మంచి ఉద్యోగుల కోసం ఇవి బుక్ చేసినట్లు తానే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తోంది. ఈ సంస్థ సీఈఓ రజినీకాంత్ వీరాభిమాని.. కావున జైలర్ సినిమా రిలీజ్ రోజునే ఉద్యోగులకు సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కబాలి మూవీ విడుదల సమయంలో కూడా చెన్నైలో ఒక థియేటర్ బుక్ చేసాడు. అంతకు ముందు కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. గిరీష్ చేస్తున్న పనికి తమళనాడులో అతని పేరు మారుమ్రోగిపోతోంది. రజిని అభిమానులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 2200 tickets 7 screens Freshworks employees only #thalaivaralaparai #TigerkaHukum #ThalaivarNirandharam #freshworksda pic.twitter.com/shjOumBeaY — Girish Mathrubootham (@mrgirish) August 9, 2023 -
నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా
గ్లామర్‌కు కేరాఫ్ మిల్కీబ్యూటీ తమన్న. ఈమె ఇంత కాలం నటిగా నిలబడ్డారంటే అందాలారబోత ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కాగా కథానాయకిగా నటిస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్‌లకు సై అంటున్న ఈ బ్యూటీ తాజాగా తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్, తెలుగులో రజనీకాంత్‌తో జైలర్ చిత్రాల్లో నటించారు. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అవుతున్నాయి. మరో విషయం ఏమిటంటే జైలర్ చిత్రంలో తమన్న రజనీకాంత్‌కు ఫెయిర్ కాదు. ఇక భోళాశంకర్ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తీసురేష్కే అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. కాగా ఇద్దరు సీనియర్ హీరోలతో నటించడం గురించి తమన్నపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. సీనియర్ నటులతో జత కట్టడానికి ఎందుకు అంగీకరిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు? అవకాశాలు రాకా, లేక డబ్బు కోసమా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఇదేనా?) దీనికి స్పందించిన తమన్న నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఎందుకు మాట్లాడతారు? నటించే పాత్రలను చూడండి అని ఘాటుగా పేర్కొన్నారు. కాదూ కూడదూ అంటారా వయసు గురించి మాట్లాడాలంటే తాను హలీవుడ్ నటుడు టామ్ క్రూస్ మాదిరి సాహసాలు చేయగలను, డాన్స్ చేయగలను అని పేర్కొన్నారు. ఇకపోతే సీనియర్ నటులతో కలిసి నటించడం తనకు ఎప్పుడూ సంతోషమేనన్నారు.