
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' హిట్ కావడం మాటేమో గానీ.. నిర్మాత కళానిధి మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్‌కి రెండు మూడు రెట్లు లాభాలు వచ్చేసరికి ఆయన ఆపడం ఎవరి తరం కావట్లేదు. దీంతో అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.
(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!)
సాధారణంగా ఏ సినిమా హిట్ అయినాసరే నిర్మాత ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. తెలుగు ప్రొడ్యూసర్స్‌లో కొందరు మాత్రం హీరోకి లేదా దర్శకుడికి ఖరీదైన కారు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ కూడా అలానే చేశారు. హీరో రజనీ బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్-మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కి ఖరీదైన పోర్సే కార్లని గిఫ్ట్స్‌గా ఇచ్చాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు.
ఓ సినిమా తీయాలంటే హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడితే పని అయిపోదు కదా. ఈ క్రమంలోనే 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి.. నిర్మాత కళానిధి మారన్ తలో గోల్డ్ కాయిన్ చొప్పున ఇచ్చారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!)
Mr.Kalanithi Maran felicitated more than 300 people who worked for #Jailer with gold coins today. #JailerSuccessCelebrations pic.twitter.com/qEdV8oo6dB
— Sun Pictures (@sunpictures) September 10, 2023