Kalanidhi Maran
-
'రాయన్'తో లాభాలు.. ధనుష్‌కు గిఫ్ట్‌గా రెండు చెక్కులు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా ధనుష్‌ను కలిసి రెండు చెక్కులు అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది.ధనుష్ హీరోగా, డైరెక్టర్‌గా తన ప్రతిభను రాయన్‌లో చూపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ. 158 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా రాయన్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా, అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. ధనుష్‌ని స్వయంగా కలుసుకున్న నిర్మాత ఆపై రెండు చెక్కులను చిత్ర విజయానికి బహుమతిగా అందజేశారు. ఒకటి హీరోకి,మరొకటి దర్శకుడికి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ధనుష్‌కు ఎంత మొత్తం ఇచ్చారని చెప్పలేదు. కానీ, సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చి ఉంటారని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఓటీటీలో రాయన్రాయన్ సినిమా నేడు (ఆగష్టు 23) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
స్పైస్‌జెట్ సంస్థ నుంచి రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్నట్లు ఆ సంస్థ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ తెలిపారు. ఇటీవల మారన్ నుంచి రూ.450 కోట్లు పరిహారం కోరతామని స్పైస్‌జెట్ వెల్లడించిన నేపథ్యంలో మారన్, ఆయన కంపెనీ కేఏఎల్ ఎయిర్వేస్ ఈ మేరకు ప్రకటన వెల్లడించారు.స్పైస్‌జెట్‌కు గతంలో ప్రమోటర్‌గా వ్యవహరించిన కళానిధి మారన్ సంస్థలో తన 58.46 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా తనకు రావాల్సిన వారంట్స్, షేర్లు జారీ చేయలేదని మారన్ ఆరోపించారు. ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. దీనిపై మధ్యవర్తిత్వ కోర్టు, దిల్లీ సింగిల్ బెంచ్ తీర్పులను అనుసరించిన స్పైస్‌జెట్.. మారన్, ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్కు రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్లు వడ్డీ చొప్పున రూ.730 కోట్లు చెల్లించింది.స్పైస్‌జెట్, కంపెనీ ప్రస్తుత ప్రమోటరు అజయ్‌సింగ్ మారన్‌కు రూ.580 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను సమర్థించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ మే 17న దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దాంతో కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్ ఎయిర్వేస్కు చెల్లించిన రూ.730 కోట్ల మొత్తం నుంచి రూ.450 కోట్లు రీఫండ్ ఇవ్వాలని కోరనున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది.దాంతో మారన్ దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాససం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు తెలిపారు. ఎఫ్టీఐ కన్సల్టింగ్ ఎల్ఎల్పీ నిర్ణయించిన రూ.1323 కోట్ల నష్టాన్ని సైతం స్పైస్‌జెట్ నుంచి కోరనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. -
దెబ్బ మీద దెబ్బ : అమ్మకానికి డిస్నీ.. కొనుగోలు రేసులో ఎవరెవరున్నారంటే?
అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా దిగ్గజం ది వాల్ట్ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో వాల్ట్ డిస్నీకి సంబంధించిన ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు పలునివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా బిలియనీర్ గౌతమ్ అదానీ, మీడియా మొఘల్, సన్ నెట్ గ్రూప్ అధినేత కళా నిధి మారన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత్‌లో నిర్వహించే కార్యకలాపాలలో కొంత భాగాన్ని విక్రయించడం లేదా, స్పోర్ట్స్ రైట్స్, లోకల్ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో సహా ఇతర ఆస్తుల్ని కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తేలింది. ముఖేష్ అంబానీతో చర్చలు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సైతం ఆస్తుల అమ్మే అంశంపై చర్చలు ఇప్పటికే జరిగాయని బ్లూమ్‌బెర్గ్ గతంలో నివేదించింది. తద్వారా భారత్‌లో డిస్నీ తన వ్యాపారాన్ని అమ్మేడం లేదంటే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ దెబ్బ.. ఆపై హెచ్‌బీఓ కాంట్రాక్ట్ సైతం జూలైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్ 18 మీడియా దక్కించుకున్న తరువాత ఆస్తుల అమ్మకం తెరపైకి వచ్చింది. దీనికితోడు వార్నర్ బ్రదర్స్‌కు చెందిన హెచ్‌బీఓ కాంట్రాక్టును సైతం రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 దక్కించుకోవడం కూడా ప్రభావం చూపింది. అప్పటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు. దీంతో ఆస్తుల్ని అమ్మేందుకు మొగ్గుచూపింది. అదానీ వర్సెస్ మారన్ ఆస్తులు,స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు కళానిధి మారన్ సుమఖత వ్యక్తం చేస్తుండగా.. అదానీ సైతం తన మీడియా సంస్థ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌ను (ఎన్డీటీవీ)ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, క్రయ,విక్రయ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలుగులోకి రాలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
రజనీకాంత్ జూదంలో ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాడా..?
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విజయం సాధించడంతో రజనీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్కు, కారుతో సత్కరించారు చిత్ర నిర్మాత కళానిధి మారన్. అలాగే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు కూడా ఆయన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. జైలర్ సక్సెస్ మీటింగ్‌లో మాట్లాడిన రజనీ కూడా కళానిధి మారన్ కొని ఇచ్చిన కారులో వచ్చాను. ఇప్పుడిప్పుడే ధనవంతుడయ్యానన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సూర్య,జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తున్న కార్తీ మాటలు) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ స్పీచ్‌పై కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా క్రిటిక్ బిస్మీ ఇలా స్పందించాడు. రజనీకాంత్ ప్రసంగం ఒక కోణంలో సరైనదేనని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ కళానిధి మారన్‌కు మరో కోణంలో ఈ వ్యాఖ్యలు అతిశయోక్తి కలిగించి ఉంటాయని బిస్మి చెప్పాడు. రజనీ సూపర్‌స్టార్ అయినప్పటికీ చాలా ఏళ్లుగా అంబాసిడర్ కారునే వాడేవారు. పదేళ్ల క్రితం వరకు ఆయన అంబాసిడర్ కారునే వాడేవాడని ఆయన తెలిపాడు తర్వాత ఆయన ఇన్నోవా కారుకు మారారని తెలిపాడు. రజనీ తర్వాత వచ్చిన నటీనటులంతా విలాసవంతమైన కార్లలో వస్తుంటే, రజనీ మాత్రం సినిమా షూట్లకు వెళ్లి తిరిగి వచ్చేది సాధారణమైన కారులోనే అని ఆయన తెలిపాడు. రజనీ కాంత్ అప్పట్లో తలచుకుని ఉండుంటే ఎన్నో లగ్జరీ కార్లను కొని ఉండవచ్చు. కానీ అతను సింపుల్‌గానే ఉండాలని ఎందుకు అనుకున్నాడో ఎవరికీ అర్థం కాని ప్రశ్న.. ఎన్నో ఏళ్లుగా అంబాసిడర్ కారు వాడుతున్న రజనీ ఈ మధ్యే ఇన్నోవా కారుకు మారాడని గుర్తుచేశాడు. అందువల్లే కళానిధి మారన్ ఇచ్చిన గిఫ్ట్‌ను ధనవంతుల కారుగా ఆయన చెప్పి ఉండవచ్చు అని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: హోటల్ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!) ఒక విజయవంతమైన నటుడిగా ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. లెక్కలేనన్ని కోట్లు సంపాదించాడు. ఎంతో ధనవంతుడైన రజనీ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో చెప్పడం కష్టం అనే రేంజ్‌కు చేరుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి అంతలా లేదని కోలీవుడ్‌లో టాక్. ఇప్పటికే రజనీకాంత్‌తో పాటు ఆయన భార్యపై పలు చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో వినికిడి. జూదగాడు ఓడిపోయాడు ఇదిలా ఉంటే, రజనీ విలాసవంతమైన కార్లు నడపలేదు కానీ జీవితాంతం విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అని బిస్మీ చెప్పాడు. సినిమాకి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక లాస్ వెగాస్ వెళ్లి జూదం ఆడి ఇక్కడ సంపాదించిన డబ్బంతా రజనీ పోగొట్టుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఎంతో కష్టపడి ఇక్కడ సంపాదించడం కొన్ని నిమిషాల్లోనే ఆ డబ్బంతా అక్కడ పోగొట్టుకుని ప్రస్తుత జీవితాన్ని రజనీ గడుపుతున్నాడని తెలిపాడు. అలాంటప్పుడు నేడు కళానిధి మారన్ ఇచ్చిన లగ్జరీ కారు ఆయనకు ఇప్పటి పరిస్థితిల్లో గొప్పగానే ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం రజనీ వద్ద ఎలాంటి లగ్జరీ కారు లేనందునే కళానిధి మారన్ ఈ కానుకను ఇచ్చాడని తమిళనాట ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ గురించి బిస్మీ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. లాస్ వెగాస్‌లో ఆయన జూదం ఆడుతున్న ఫోటోలు ఇప్పటికీ నెట్టింట ఉన్నాయి. అప్పట్లో ప్రధాన నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఇదే విషయంపై పలు కథనాలను కూడా ప్రచురించింది. -
ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' హిట్ కావడం మాటేమో గానీ.. నిర్మాత కళానిధి మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్‌కి రెండు మూడు రెట్లు లాభాలు వచ్చేసరికి ఆయన ఆపడం ఎవరి తరం కావట్లేదు. దీంతో అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!) సాధారణంగా ఏ సినిమా హిట్ అయినాసరే నిర్మాత ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. తెలుగు ప్రొడ్యూసర్స్‌లో కొందరు మాత్రం హీరోకి లేదా దర్శకుడికి ఖరీదైన కారు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు. 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ కూడా అలానే చేశారు. హీరో రజనీ బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్-మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కి ఖరీదైన పోర్సే కార్లని గిఫ్ట్స్‌గా ఇచ్చాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఓ సినిమా తీయాలంటే హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడితే పని అయిపోదు కదా. ఈ క్రమంలోనే 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి.. నిర్మాత కళానిధి మారన్ తలో గోల్డ్ కాయిన్ చొప్పున ఇచ్చారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) Mr.Kalanithi Maran felicitated more than 300 people who worked for #Jailer with gold coins today. #JailerSuccessCelebrations pic.twitter.com/qEdV8oo6dB — Sun Pictures (@sunpictures) September 10, 2023 -
జైలర్ డైరెక్టర్‌కు జాక్‌పాట్.. చెక్, కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారు!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా భాటియా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. (ఇది చదవండి: వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !) కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. ఈ మూవీ ఘనవిజయంతో చిత్రబృందం ఫుల్ ఖుషీలో ఉన్నారు. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత హీరో రజినీకాంత్‌తో పాటు డైరెక్టర్ దిలీప్ కుమార్‌కు వాటాతో పాటు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. భారీ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగా దిలీప్ కుమార్‌కు సైతం కోట్ల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుకరించారు. దీంతో పాటు చెక్‌ను కూడా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే తలైవాకు రూ.100 కోట్ల చెక్‌తో పాటు బీఎండబ్లూ కారును కూడా అందజేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, టైగర్ ష్రాఫ్, సునీల్, వినాయకన్, వసంత్ రవి, మర్నా, యోగి బాబు, జాఫర్ సాదిక్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!) Mr.Kalanithi Maran congratulated @Nelsondilpkumar and handed over a cheque to him, celebrating the Mega Blockbuster #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/b6TGnGaFd6 — Sun Pictures (@sunpictures) September 1, 2023 -
'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!
భారతీయ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా పేరుగాంచిన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలు విడుదలైతే ఆ తేదీకి తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం పరిపాటి. తెలుగులో కూడా స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని క్రేజ్.. తన సినిమాల కలెక్షన్ల రికార్డులను ఆయన మాత్రమే తిరిగి కొట్టగలడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన వరుస సినిమాలు పర్వాలేదనిపించడంతో ఆయనపై రకరకాల విమర్శలు చుట్టుముట్టాయి. ఈ దశలోనే నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజనీ నటించనున్నట్లు ప్రకటించారు. దీంతో కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అంతకుముందే నెల్సన్- విజయ్ కాంబోలో వచ్చిన బీస్ట్ చిత్రం డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో రజనీపై ఆ ప్రెజర్ పడింది. కానీ రజనీ మాత్రం నెల్సన్‌ను నమ్మి జైలర్ అవకాశం ఇచ్చాడు.ఈ చిత్రంలో తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా ప్లస్ అయ్యారు. ఆగస్ట్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదలై విశేష స్పందనను అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ వర్షం కురిసింది. దీంతో రజనీకాంత్ కూడా చాలా సంతోషించారు. ఈ మెగా హిట్ విమర్శకులందరికీ సమాధానంగా నిలిచింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇద్దరి ప్రత్యేక సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయి. గత ఏడాది విడుదలై తమిళ చిత్రసీమలో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. దీంతో చాలా ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగ (ఆగస్టు 31) రజనీకాంత్‌ను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా లాభాల్లో కొంత భాగాన్ని రజనీకాంత్‌కి కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చెక్కును కవర్‌పై 'ది రియల్ రికార్డ్ మేకర్' అని రాసి ఉండటం గమనార్హం. రజనీకాంత్‌కు గిఫ్ట్‌గా రెండు కార్లు తీసుకెళ్తే.. ఈ చెక్‌తో పాటు ఆయనకు బీఎండబ్ల్యూ కారును కూడా కళానిధి మారన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. రెండు బీఎండబ్ల్యూ కారులను ఆయన రజనీ వద్దకు తీసుకువెళ్లి.. అందులో నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలని కోరారు. బీఎండబ్ల్యూ ఎక్స్7 మోడల్ కారును రజనీ సెలెక్ట్ చేసుకున్నారు. దీని ధర సుమారు రూ. 2.25 కోట్లు అని సమాచారం. అందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ వారు షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు రెమ్యునరేషన్‌గా రూ. 110 కోట్లు రజనీకాంత్ తీసుకున్నారని టాక్.. సినిమాకు భారీగా లాభాలు రావడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్ మరో రూ.100 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇలా మెత్తంగా జైలర్ కోసం రజనీకాంత్ అందుకున్న పారితోషకం రూ . 210 కోట్లకు చేరింది. ఇదీ ఇండియన్ సినీ చరిత్రలో రికార్డ్‌గా నిలవనుంది. ఇప్పటికీ కూడా పలు థియేటర్లలో జైలర్ మానీయా నడుస్తూనే ఉంది. #JailerSuccessCelebrations continue! Superstar @rajinikanth was shown various car models and Mr.Kalanithi Maran presented the key to a brand new BMW X7 which Superstar chose. pic.twitter.com/tI5BvqlRor — Sun Pictures (@sunpictures) September 1, 2023 Mr. Kalanithi Maran met Superstar @rajinikanth and handed over a cheque, celebrating the historic success of #Jailer pic.twitter.com/Y1wp2ugbdi — Sun Pictures (@sunpictures) August 31, 2023 -
కళానిధి మారన్-స్పైస్‌జెట్: సుప్రీం కీలక ఆదేశం
న్యూఢిల్లీ: కళానిధి మారన్-స్పైస్‌జెట్ కేసులో ఇచ్చిన ఆర్బిట్రల్ అవార్డ్ అమలు దిశగా సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.270 కోట్ల బ్యాంకు గ్యారంటీని వెంటనే నగదుగా మార్చుకుని, ఆ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది.పెండింగ్‌లో ఉన్న రూ.578 కోట్లకు గాను ఇప్పటికే రూ. 308 కోట్ల నగదు చెల్లించామని స్పైస్‌జెట్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బిట్రల్ అవార్డులో రూ.75 కోట్లను మూడు నెలల్లోగా కళానిధి మారన్, కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిక్రీ హోల్డర్‌కు ఇప్పటికే రూ.308 కోట్లను స్పైస్ జెట్ చెల్లించగా, బ్యాంక్ గ్యారంటీగా ఉన్న రూ.275 కోట్లను వెనక్కి తీసుకుని చెల్లించేయాలని ధర్మాసనం సూచించింది. స్పైస్ జెట్‌కు, మాజీ ప్రమోటర్ అయిన కళానిధి మా రన్, కల్ ఎయిర్వేస్ మధ్య షేర్ల బదిలీ వివాదం కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ట్.. రూ.243 కోట్లను వడ్డీ కింద డిపాజిట్ చేయాలని స్పైస్‌జెట్‌ను 2020 నవంబర్ 2 ఆదేశించడం తెలిసిందే. (ఇదీ చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్ ) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ. 270 కోట్లు వెంటనే చెల్లిస్తామని,అయితే కోర్టు ఆదేశాల మేరకు వడ్డీ కింద అదనంగా రూ. 75 కోట్లు మూడు నెలల్లో అందిస్తానమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుది పరిష్కార దిశగా ఇది తుది అడుగు అని తాము భావిస్తున్నామని స్పైస్‌జెట్ పేర్కొంది. -
'బీస్ట్' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు ?.. వచ్చేది ఆరోజే !
Vijay Beast Movie OTT Release Date Confirmed: కరోనా కాలం, లాక్డౌన్ తర్వాత సినిమాలు థియేటర్లలో పాటు ఓటీటీల్లో కూడా ఎప్పుడు రిలీజవుతాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిన్న, పెద్ద హీరోలు, సినిమాలు అంటూ ఎలాంటి బేధం లేకుండా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం బీస్ట్. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. కళానిధి మారన్ నిర్మాతగ వ్యవహించిన 'బీస్ట్' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓటీటీ అప్డేట్ వచ్చింది. మే రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ మూవీ ప్రొడక్షన్ హౌజ్ సన్ టీవీ నెట్‌వర్క్‌కు సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఓటీటీలో 'బీస్ట్' తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది. ఇక బీస్ట్ హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. ప్రస్తుత సమాచారం ప్రకారం 'బీస్ట్' మే 13న అన్ని భాషల్లో ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్.. 'బీస్ట్'పై ప్రేక్షకుల రివ్యూ చదవండి: విజయ్ ‘బీస్ట్’ మూవీ ఎలా ఉందంటే.. -
IPL 2022 Auction: వేలంలో ప్రత్యేక ఆకర్షణ.. అందరి కళ్లు తన మీదే.. అసలు ఎవరామె?
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలం ముగిసినా సోషల్ మీడియాలో ఆ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడు పోయాడు? ఏ ఫ్రాంఛైజీది సరైన ఎంపిక? ఎవరు అనవసరంగా డబ్బు ఖర్చు చేశారు? తదితర అంశాల గురించి ఐపీఎల్ ప్రేమికులు చర్చిస్తూనే ఉన్నారు. ఆటగాళ్ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే... తన ఆకర్షణీయ రూపం, అందమైన నవ్వుకు తోడు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఓ యువతి వేలంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. ఆమె మరెవరో కాదు... సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్. ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన హావభావాలతో ఎన్నో సార్లు మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచారు ఆమె. 2018 వేలం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కావ్య పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలం-2022లో కూడా 30 ఏళ్ల కావ్య మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రెండింగ్‌లో నిలిచారు. చాలా మంది నెటిజన్లు ఆమె గురించి సెర్చ్ చేశారు. అసలు ఎవరీ కావ్య మారన్? మీడియా మొఘల్‌గా పేరొందిన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు చూస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కళానిధి మారన్ బంధువన్న విషయం తెలిసిందే. ఇక ఆయన సోదరుడు దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన కావ్య... ఎస్ఆర్హెచ్లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవడం విశేషం. ఇక ఎస్ఆర్హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి ఆమె ఐపీఎల్ మెగా వేలం-2022లో పాల్గొన్నారు. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఆక్షన్‌లో హైదరాబాద్ అత్యధికంగా 10.75 కోట్లు వెచ్చించి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను సొంతం చేసుకుంది. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ? IPL 2022 Mega Auction: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. -
స్పైస్‌జెట్ ప్రతిపాదనలను అంగీకరించం
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌తో రూ.600 కోట్ల తమ వివిద పరిష్కారానికి సంబంధించి ఆ సంస్థ చేసిన రెండు ప్రతిపాదనలూ తమకు ఆమోదయోగం కాదని కేఏఎల్ ఎయిర్వేస్, మీడియా దిగ్గజం కళానిధి మారన్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. స్పైస్‌జెట్ రెండు ప్రతిపాదనలను అంగీకరిస్తారా? అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కాల్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్, మారన్ల అభిప్రాయాన్ని అడిగినప్పుడు, ఈ ప్రతిపాదనలు ఆమోదయోగం కాదని పేర్కొన్నాయి. కేసు తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది. కళానిధి మారన్ స్పైస్‌జెట్ మాజీ ప్రమోటర్. ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ ట్రాన్స్పోర్ట్ సేవలను నిర్వహిస్తోంది. కేసు వివరాలు క్లుప్తంగా... కేఏఎల్, మారన్లు స్పైస్‌జెట్‌లో తమ షేర్‌హోల్డింగ్‌ను 2015 ఫిబ్రవరిలో కంట్రోలింగ్ షేర్‌హోల్డర్, సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్‌కు బదలాయించారు. అయితే ఈ డీల్‌కు సంబంధించి ప్రిఫర్డ్ షేర్లు, వారెంట్లను మారన్‌కు అనుకూలంగా జారీ చేయకపోవడంపై వివాదం నెలకొంది. స్పైస్‌జెట్‌లోని తమ మొత్తం 350.4 మిలియన్ల ఈక్విటీ షేర్లను, ఎయిర్‌లైన్‌లో 58.46 శాతం వాటాను దాని సహ వ్యవస్థాపకుడు సింగ్‌కు ఫిబ్రవరి 2015లో కేవలం రూ. 2కి మారన్, కేఏఎల్ ఎయిర్వేస్కు చేశారు. స్పైస్‌జెట్‌తో వాటా బదిలీ వివాదంపై మారన్ కేఏఎల్ ఎయిర్వేస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈక్విటీ షేర్లుగా రీడీమబుల్ చేయదగిన 18 కోట్ల వారెంట్లను తమకు బదలాయించాలని డిమాండ్ చేశాయి. 2016 జూలై 29న హైకోర్టు రూలింగ్ ఇస్తూ, ఆర్బిట్రేషన్ కింద వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. రూ.579 కోట్లను హైకోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా స్పైస్‌జెట్, సింగ్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తదుపరి ఆదేశాల మేరకు స్పైస్‌జెట్ హైకోర్టులో రూ.329 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని, రూ.250 కోట్ల నగదును డిపాజిట్ చేసింది. అయితే దీనిపై స్పైస్‌జెట్ చేసిన అప్పీల్‌ను 2017 జూలైలో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు 2018 జూలై 20వ తేదీన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అవార్డు ఇస్తూ, వారెంట్లు ఇష్యూ చేయనందుకు రూ.1,323 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలన్న మారన్ కేఏఎల్ క్లెయిమ్‌ను కొట్టేసింది. అయితే వడ్డీసహా రూ.579 కోట్ల రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఆర్బిట్రేషన్ అవార్డుపై సన్ టీవీ నెట్వర్క్ యజమాని కూడా అయిన మారన్, కేఏఎల్ ఎయిర్‌వేస్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు 2020 నవంబర్ 2వ తేదీన ఆదేశాలు ఇస్తూ, ఈ వివాదంలో వడ్డీకి సంబంధించి రూ.243 కోట్ల డిపాజిట్ చేయలని స్సైస్జెట్ను ఆదేశించింది. స్పైస్‌జెట్ నవంబర్ 7న సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఈ ఉత్తర్వుపై స్టే పొందింది. రెండు ప్రతిపాదనలు ఇవీ.. అత్యున్నత న్యాయస్థానంలో వివాద శాశ్వత పరిష్కారానికి స్పైస్‌జెట్ రెండు ప్రతిపాదనలు చేసింది. అందులో ఒకటి– ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా రూ.300 కోట్ల చెల్లింపులు. ఢిల్లీ హైకోర్టులో డిపాజిట్ చేసిన రూ. 270 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలో ప్రస్తుతానికి రూ.100 కోట్లు చెల్లించి, కేసు తదుపరి విచారణ ఢిల్లీ హైకోర్టులో వేగవంతం చేసేలా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు పొందడం రెండవ ఆఫర్. తాజాగా ఈ రెండు ఆఫర్లను కేఏఎల్ ఎయిర్వేస్, మారన్లు తిరస్కరించారు. ఆర్బిట్రేషన్ అవార్డు కింద తమకు రూ.920 కోట్లు స్పైస్‌జెట్ నుంచి రావాల్సి ఉందని డిమాండ్ చేశాయి. -
రూ.1,323 కోట్ల ఆర్బిట్రేషన్‌ను కోల్పోయిన మారన్
ముంబై: స్పైస్‌జెట్ మాజీ యజమాని, సన్ టీవీ గ్రూపు అధినేత కళానిధి మారన్‌కు రూ.1,323 కోట్ల నష్ట పరిహారాన్ని స్పైస్‌జెట్ చెల్లించక్కర్లేదని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తేల్చింది. కన్వర్టబుల్ వారంట్లు, ప్రిఫరెన్షియల్ షేర్లు జారీ చేయనందుకు ఈ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కాల్ ఎయిర్వేస్కు చెల్లించాలన్న అభ్యర్థనను ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కొట్టివేసినట్టు స్పైస్‌జెట్ తెలిపింది. అయితే, అదే సమయంలో మారన్‌కు రూ.579 కోట్లను 12 శాతం వడ్డీ రేటుతో వెనక్కి చెల్లించేయాలని ఆదేశించినట్టు పేర్కొంది. ఈ కేసు 2015 జనవరి ముందు నాటిది. స్పైస్‌జెట్‌ను కళానిధి మారన్ నుంచి దాని మాజీ యజమాని అజయ్ సింగ్ కొనుగోలు చేయగా... నాడు చేసుకున్న ఒప్పందాన్ని సింగ్ అమలు చేయలేదని మారన్ ఆరోపణ. -
తలైవా@165
పక్కా... పొలిటికల్ ఎంట్రీకి ముందే రజనీ ఓ సినిమా చేయడం పక్కా అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. ‘కాలా’, ‘2.0’ చిత్రాల తర్వాత రజనీ నెక్ట్స్ చిత్రం ఏంటీ? అని వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఆయన నెక్ట్స్ చిత్రం ఫిక్సైంది. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కళానిధి మారన్ సమర్పణలో ఓ సినిమా రూపొందనుంది. ఇది రజనీకాంత్ కెరీర్లో 165వ సినిమా అట. తలైవా (నాయకుడు)ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కార్తీక్ సుబ్బరాజుకు దక్కడం ఊహించని విషయమని అంటున్నారు కోలీవుడ్వాసులు. ‘‘నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. తలైవాతో సినిమా చేయాలనే నా కల నిజమైంది. తలైవాకి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజు. ‘పిజ్జా, జిగర్‌దండా, బెంచ్ టాకీస్, ఇరైవి, ‘మెర్క్యురీ’ వంటి చిత్రాలను తెరకెక్కించారు కార్తీక్ సుబ్బరాజు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్క్యురీ’ ఏప్రిల్ 13 రిలీజ్ కానుంది. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘కాలా’ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీపావళికే విజయ్, సూర్య, అజిత్ సినిమాలతో పాటు బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. సో.. దీపావళికి గట్టి పోటీ అన్నమాట. -
కోర్టుకు బ్రదర్స్!
► చార్జ్‌షీట్ నకలు అప్పగింత ► మీడియాపై న్యాయవాదుల చిందులు ► మౌనంగా మారన్ ముందుకు సాక్షి, చెన్నై: మారన్ బ్రదర్స్ మంగళవారం చెన్నై సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును వీరికి కోర్టు వర్గాలు అప్పగించాయి. తదుపరి విచారణ జూలై 28కి న్యాయమూర్తి జవహర్ వాయిదా వేశారు. యూపీఏ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో దయానిధిమారన్ హై స్పీడ్ ఇంటర్నెట్ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలు బయలు దేరాయి. ఈ కనెక్షన్లను తమ కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్‌వర్క్‌కు అప్పగించడంతో ప్రభుత్వానికి కోటి 78 లక్షల మేరకు ఆదాయానికి గండి పడిందని సీబీఐ గుర్తించి కేసు నమోదు చేసింది. దయానిధిమారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌తో పాటు అప్పటి బీఎస్ఎన్ఎల్ అధికారులు బ్రహ్మనాథన్, వేలుస్వామి, మారన్ వ్యక్తిగత కార్యదర్శి గౌతమన్, సన్‌టీవీ సిబ్బందికన్నన్, రవి మీద అభియోగం మోపుతూ ఈ కేసులు దాఖలయ్యాయి. కేసు విచారణ చెన్నై సీబీఐ కోర్టులో సాగుతూ వస్తోంది. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ ఎనిమిదో తేదీన సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి జవహర్ ఆదేశించారు. ఆ మేరకు మారన్ బ్రదర్స్ మంగళవారం కోర్టుమెట్లు ఎక్కారు. కోర్టుకు బ్రదర్స్ : కళానిధి మారన్, దయానిధి మారన్‌తో పాటు మిగిలిన వారు ఉదయాన్నే హైకోర్టు ఆవరణలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టుకు హాజరైన వీరిని వీడియో, ఫొటోలు తీయడానికి మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. అయితే, ఆ బ్రదర్స్ తరఫు న్యాయవాదులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. కోర్టులో న్యాయమూర్తి జవహర్ ఆదేశాల మేరకు 2500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్ నకలును ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ అందజేశారు. వీటిని పరిశీలించి, తదుపరి తమ వాదన వినిపించేందుకు తగ్గ సమయాన్ని కోర్టు కేటాయించింది. తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు నుంచి వెలుపలకు వస్తున్న మారన్ బ్రదర్స్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా యత్నించగా, వారి న్యాయవాదులు మళ్లీ అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోల్ని తీయనివ్వకుండా మీడియా మీద తిరుగబడ్డారు. మీడియా వర్గాలను బెదిరిస్తూ, కాస్త దూకుడు ప్రదర్శించారు. న్యాయవాదులు రవీంద్రన్, స్నేహ అయితే, కాస్త దూకుడుగా ప్రదర్శించడంతో మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీడియా మీద తమ న్యాయవాదులు దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నా, ఓ మీడియా సంస్థలకు అధిపతిగా ఉన్న మారన్ బ్రదర్స్ వారించకుండా మౌనంగా ముందుకు సాగడం గమనార్హం. -
మారన్ల చుట్టూ మళ్లీ ఉచ్చు
ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో ఢిల్లీ హైకోర్టు విచారణ - అక్రమాలు జరిగినట్లు బలమైన సాక్ష్యాలున్నాయన్న ఈడీ న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్‌లకు మళ్లీ ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసు ఉచ్చు బిగుసుకోనుంది. ఈ కేసునుంచి మారన్ సోదరులకు విముక్తి కల్పించిన ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతవారం ఢిల్లీ హైకోర్టును సంప్రదించింది. వారి అక్రమాలకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలున్నాయని తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్పీ గార్గ్.. ఈడీ పిటిషన్‌పై నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని మారన్ సోదరులతోపాటు ఐదుగురికి నోటీసులు జారీచేశారు. దయానిధి, కళానిధి, కావేరీ కళానిధి (ఎస్‌ఏఎఫ్‌ఎల్), ఈ సంస్థ ఎండీ షణ్ముగం, సన్ డైరెక్ట్ టీవీలకు నోటీసులిచ్చారు. ఫిబ్రవరి నాటి తీర్పులో ఈడీ, సీబీఐ వేసిన కేసులను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందంతో మారన్ సోదరులతోపాటు మిగిలిన వారికి సంబంధం లేదని తీర్పునిచ్చింది. తాజా పిటిషన్లో ఈ కేసుకు సంబంధించిన కార్పొరేట్ ప్రముఖుల అక్రమాలపై ఇచ్చిన వివరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ‘కళానిధి, కావేరిలు, మారన్ గ్రూప్ కంపెనీలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి’ అని పేర్కొంది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ మొదట సుప్రీంకోర్టును సంప్రదించింది. కార్తీపై ఈడీ కేసు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై ఈడీ శుక్రవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్న కార్తీ, ఐఎన్ఎక్స్ మీడియా, దాని డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణి ముఖర్జియా, ఇతరులపై పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను నమోదు చేసింది. కార్తీకి ఐఎన్ఎక్స్ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఈడీ తొలుత సమాచారం వెల్లడించడంతో ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. -
‘మనీల్యాండరింగ్’ కిందకు రాదు!
మారన్ సోదరుల కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో మారన్ సోదరులకు ప్రత్యేక న్యాయస్థానం విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ, సీబీఐ తరఫున ఈ కేసును వాదించడానికి నియమితులైన ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్పీపీ) ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దయానిధి మారన్ , కళానిధి మారన్ లకు బెయిల్ మంజూరు చేయడం, ఈ కేసుకు సంబంధించి జప్తు చేసిన రూ. 742 కోట్లను విడుదల చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అయితే ఈ కేసులో మనీల్యాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీలేవని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో జప్తు చేసిన రూ. 742 కోట్లు నేర సంబంధిత ఆదాయం కిందకు రాదు. అందువల్ల మనీల్యాండరింగ్ ఏ మాత్రం కాదు’’ అని స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ లో అనేక లోపాలున్నాయని తెలిపింది. లోపాలను సరిచేసుకొని సరైన పిటిషన్ తో రావడానికి ఆనంద్ గ్రోవర్‌కు బుధవారం(8వ తేదీ) వరకు సమయమిచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా మారన్ సోదరులకు బెయిల్ మంజూరు చేయకూడదని, జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయకూడదనే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ కోసం ఎదురు చూడకుండా తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు గ్రోవర్ కోర్టుకు తెలిపారు. -
మారన్ సోదరులకు ఊరట
ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసుల్లో అభియోగాలు కొట్టేసిన ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్ – మాక్సిస్ ఒప్పందా నికి సంబంధించిన కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , ఆయన సోదరు డు కళానిధి మారన్ కు ఊరట లభించింది. ఈ కేసులకు సంబంధించి వారిపై సీబీఐ, ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన అభియోగాలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కొట్టేసింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దయానిధి మారన్, కళానిధి మారన్ తో పాటు కళానిధి మారన్ భార్య కావేరీ కళానిధి, సౌత్ ఆసియా ఎంటర్టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, సన్ డైరెక్ట్ టీవీ ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీలకు విముక్తి లభించినట్లయింది. అయితే ఈ ఉత్తర్వులు మలేసియా జాతీయు లైన రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్‌కృష్ణన్ కు వర్తించవని, వారిపై విచారణను ప్రత్యేకంగా చేపట్టినందున ఈ ఉత్తర్వులు మారన్ సోదరులు మిగిలిన వారికి మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం చేసింది. ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి మారన్ సోదరులతో పాటు రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్‌కృష్ణన్ , సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్వర్క్స్, మాక్సిస్ కమ్యూనికేషన్స్ , సౌత్ ఏషియా ఎంటర్టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, అదనపు కార్యదర్శి(టెలికాం) జేఎస్ శర్మపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వీరిపై 120బీ(నేరపూరిత కుట్ర), ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. కేసు దర్యా ప్తు సమయంలో జేఎస్ శర్మ మరణించారు. ఈడీ కూడా మారన్ సోదరులతో పాటు కళానిధి మారన్ భార్య కావేరి, సౌత్ ఏషియా ఎఫ్ఎం లిమిటెడ్ ఎండీ కె.షణ్ముగం, ఎస్‌ఏఎఫ్‌ఎల్, సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. 2006లో మలేసియాకు చెందిన మ్యాక్సిస్‌కు ఎయిర్‌సెల్‌ను విక్రయిం చాలని దయానిధి ఆ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ ను ఒత్తిడి చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ ఆరోపిం చారు. అయితే ఈ ఆరోపణలను దయానిధి మారన్ తో పాటు మిగతా నిందితులు ఖండిం చారు. ఆరుగురు నిందితుల నుంచి వాంగ్మూ లం తీసుకున్న న్యాయస్థానం వీరిపై దాఖలైన అభియోగాలకు సంబంధించి సరైన సాక్ష్యా లు లేవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సమష్టి నిర్ణయంతో సన్‌టీవీకి అనుమతులు
న్యూఢిల్లీ: కళానిధి మారన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 33 టీవీ చానళ్ల సన్ టీవీ నెట్వర్క్ ప్రసారాలకు అనుమతులు మంజూరు చేయాలంటే కేంద్రంలోని సంబంధిత శాఖలు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సోమవారం కేంద్రం తెలిపింది. ఈ అంశంపై కీలకమైన కేంద్ర హోం , కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కళానిధి, అతడి సోదరుడు కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్‌లపై ఉన్న పెండింగ్ కేసులను సన్‌టీవీ చానళ్లను నిర్వహిస్తున్న ఆయా కంపెనీలు ప్రభావితం చేసే అవకాశముందని హోం శాఖ భావిస్తోంది. దీంతో సన్‌టీవీ నెట్‌వర్క్‌కు భద్రతాపరమైన అనుమతులను నిరాకరిస్తోంది. -
దయానిధి మారన్‌కు సమన్లు
-
2జీ కేసులో మారన్ సోదరులకు సమన్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో మారన్ సోదరులకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్‌కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి. మాక్సిస్ గ్రూపు అధికారి అగస్టస్ మార్షల్ కూడా కోర్టుకు హాజరు కావాలని తెరలిపింది. సన్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరో నాలుగు కంపెనీలకు సైతం ఈ సమన్లు జారీ అయ్యాయి. -
‘మారన్‌లపై చార్జిషీట్ నమోదు చేయొచ్చు!’
న్యూఢిల్లీ: ‘ఎయిర్‌సెల్, మాక్సిస్’ ఒప్పందానికి సంబంధించిన కేసులో కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధిల మారన్‌లపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ అభిప్రాయపడ్డారు. రోహత్గీ నుంచి సోమవారం ఉదయం ఆ అభిప్రాయం అందిందని, దాన్ని సీబీఐ పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఏజీ అభిప్రాయాన్ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం సీబీఐకి లేదన్నాయి. మారన్ సోదరులపై చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో దర్యాప్తు బృందానికి, సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో.. ఆ అంశాన్ని ఏజీకి నివేదించారు. చార్జిషీట్‌కు అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని దర్యాప్తు బృందం పేర్కొనగా.. సాక్ష్యాధారాల్లోని లోపాలను సిన్హా ఎత్తిచూపారు.