మారన్ సోదరులకు ఊరట
ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసుల్లో అభియోగాలు కొట్టేసిన ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్ – మాక్సిస్ ఒప్పందా నికి సంబంధించిన కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , ఆయన సోదరు డు కళానిధి మారన్ కు ఊరట లభించింది. ఈ కేసులకు సంబంధించి వారిపై సీబీఐ, ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన అభియోగాలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కొట్టేసింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దయానిధి మారన్, కళానిధి మారన్ తో పాటు కళానిధి మారన్ భార్య కావేరీ కళానిధి, సౌత్ ఆసియా ఎంటర్‌టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, సన్ డైరెక్ట్ టీవీ ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీలకు విముక్తి లభించినట్లయింది. అయితే ఈ ఉత్తర్వులు మలేసియా జాతీయు లైన రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్‌కృష్ణన్ కు వర్తించవని, వారిపై విచారణను ప్రత్యేకంగా చేపట్టినందున ఈ ఉత్తర్వులు మారన్ సోదరులు మిగిలిన వారికి మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం చేసింది.
ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి మారన్ సోదరులతో పాటు రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్‌కృష్ణన్ , సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్‌వర్క్స్, మాక్సిస్ కమ్యూనికేషన్స్ , సౌత్ ఏషియా ఎంటర్‌టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, అదనపు కార్యదర్శి(టెలికాం) జేఎస్ శర్మపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వీరిపై 120బీ(నేరపూరిత కుట్ర), ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. కేసు దర్యా ప్తు సమయంలో జేఎస్ శర్మ మరణించారు. ఈడీ కూడా మారన్ సోదరులతో పాటు కళానిధి మారన్ భార్య కావేరి, సౌత్ ఏషియా ఎఫ్‌ఎం లిమిటెడ్ ఎండీ కె.షణ్ముగం, ఎస్‌ఏఎఫ్‌ఎల్, సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది.
2006లో మలేసియాకు చెందిన మ్యాక్సిస్‌కు ఎయిర్‌సెల్‌ను విక్రయిం చాలని దయానిధి ఆ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ ను ఒత్తిడి చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ ఆరోపిం చారు. అయితే ఈ ఆరోపణలను దయానిధి మారన్ తో పాటు మిగతా నిందితులు ఖండిం చారు. ఆరుగురు నిందితుల నుంచి వాంగ్మూ లం తీసుకున్న న్యాయస్థానం వీరిపై దాఖలైన అభియోగాలకు సంబంధించి సరైన సాక్ష్యా లు లేవంటూ ఉత్తర్వులు జారీ చేసింది.