Aircel Maxis
-
ఎయిర్‌సెల్ అధినేత కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. టెలికమ్యూనికేషన్స్ నుంచి చమురు, గ్యాస్ వరకు విభిన్న రంగాల్లో ఈయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, అక్కడ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఆనంద కృష్ణన్ నిలిచారు. తన మృతిని ధ్రువీకరిస్తూ మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ చాలా సేవలందించారు. అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణన్ సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయం’ అని ఇబ్రహీం అన్నారు.ఎవరీ ఆనంద కృష్ణన్?మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్ ప్రాంతంలో కృష్ణన్ ఏప్రిల్ 1, 1938న జన్మించారు. కృష్ణన్ పూర్వీకులకు భారత్‌తో సంబంధం ఉంది. ఆనంద మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1964లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పట్టా పొందరు. తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి చాలా అభివృద్ధి చెందారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆనందకు ముగ్గురు సంతానం. తన కుమారుడు థాయిలాండ్‌లో బౌద్ధ సన్యాసిగా మారాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు అతని వ్యాపార నిర్వహణలో పాలుపంచుకోలేదు.ఐపీఎల్ టీమ్‌కు స్పాన్సర్‌గా కూడా..ఒకప్పుడు ఆనంద ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను స్పాన్సర్ చేశారు. గతంలో దక్షిణాదిలో కార్యకలాపాలు సాగించిన ఎయిర్‌సెల్ టెలికాం కంపెనీకి సారథ్యం వహించారు. ఫోర్బ్స్ ప్రకారం కృష్ణన్ ప్రముఖ డీల్ మేకర్లలో ఒకరిగా ఎదిగారు. చమురు వ్యాపారంలోకి ప్రవేశించే ముందు బిజినెస్ కన్సల్టెన్సీని స్థాపించారు. మల్టీమీడియా వెంచర్లను ప్రారంభించారు. మ్యాక్సిస్ బీహెచ్డీ అనే టెలికా కంపెనీని ఏర్పాటు చేశారు. ఆనంద కృష్ణన్ మలేషియాలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచారు.అవినీతి ఆరోపణలు2006లో ఎయిర్‌సెల్‌పై మాక్సిస్ నియంత్రణ సాధిస్తుందని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి దేశంలోని పలు కంపెనీలు అభియోగాలు మోపడంతో కోర్టులో కేసు నడుస్తోంది.ఇదీ చదవండి: పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!ఆనంద స్థాపించిన కొన్ని ప్రముఖ కంపెనీలుఆస్ట్రో మలేషియా హోల్డింగ్స్: మలేషియాలో ప్రముఖ శాటిలైట్ టెలివిజన్ ప్రొవైడర్.బుమి అర్మడా: ఈ సంస్థ చమురు సర్వీస్ అందిస్తోంది.ఎయిర్ సెల్: ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్ గా వ్యవహరించిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఎయిర్ సెల్. -
దివాళా తీసిన ఈ కంపెనీ గుర్తుందా..? 3Gలో దీనిదే హవా!!
-
కేవలం రూ.3,400 కోట్లకే అమ్మించారు.. ఎయిర్‌సెల్ ఫౌండర్ ఆవేదన
రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు.అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. ‘రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్‌టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్‌సెల్ రూ. 6,500 కోట్లు చెల్లించింది. 2012 నవంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 5 మిలియన్ల 3G వినియోగదారులను కలిగి ఉంది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ సెల్ 3జీ టారిఫ్ ను అప్పట్లో భారీగా తగ్గించింది. 2011లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి యాపిల్ ఐఫోన్ 4 లాంచ్ భాగస్వామి అయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్ సెల్ 2018 ఫిబ్రవరిలో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. 2006లో మాక్సిస్ బెర్హాద్ 74 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ సెల్ ను స్వాధీనం చేసుకుంది. 2011లో తన వాటాను మ్యాక్సిస్ బెర్హాద్ కు విక్రయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చిన్నకన్నన్ శివశంకరన్ ఆరోపించారు. -
ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. -
ఇదీ.. చిదంబరం చిట్టా
యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ... ఐఎన్ఎక్స్: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా! స్టార్ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్ఎక్స్ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్ఎక్స్ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్ ముఖర్జియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్‌ఎక్స్‌లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్ఎక్స్ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది. ఎయిర్‌సెల్– మాక్సిస్: అక్రమ అనుమతులు! ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్‌కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్ సంస్థ ఎయిర్‌సెల్‌లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 సార్లు చిదంబరానికి ఊరట ఐఎన్ఎక్స్, ఎయిర్‌సెల్, మాక్సిస్ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా. బెయిల్‌పై ఉన్న కార్తీ ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. పెండింగ్‌లో మరిన్ని కేసులు ► ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ► రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ ్చంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్) ఫిర్యాదు చేసింది. ► ఇక శారదా చిట్‌ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. ► బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది. ► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్‌ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది. దాక్కోలేదు.. నిందితుడిని కాను న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు. కక్షగట్టారు: కాంగ్రెస్ చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహు ల్ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఓ ట్వీట్ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది. ‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్ ట్విట్టర్లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఇతర సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, శశి థరూర్ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. అరెస్ట్‌కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
చిదంబరానికి మధ్యంతర ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అరెస్ట్ కాకుండా కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబారానికి మంజూరు చేసిన మధ్యంతర ఊరటను ఢిల్లీ కోర్టు గురువారం ఈ నెల 9 వరకూ పొడిగించింది. కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఎప్పుడు సమన్లు జారీ చేసినా చిదబంరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం విచారణకు హాజరవుతారని వారి న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. చిదంబరం మార్చి 2006లో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఎఫ్‌డీఐకి ఆమోద ముద్ర వేశారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించాల్సి ఉండగా, చిదంబరం ఆర్థిక మంత్రి హోదాలో విదేశీ సంస్ధకు ఎఫ్ఐపీబీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. రూ 3500 కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు రూ 305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ దర్యాప్తు సంస్ధలు చిదంబరం పాత్రపై దర్యాప్తు సాగిస్తున్నాయి. -
కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు కార్తీకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మే, జూన్ నెలల మధ్యలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతంలోవి కాకుండా పూచీకత్తు కింద మరో రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ కార్తీని ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులకు సంబంధించి సీబీఐ, ఈడీ సంస్థలు ప్రస్తుతం కార్తీని విచారిస్తున్నాయి. అయితే టోటస్ టెన్నిస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ల కోసం తాను అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు కార్తీ తెలిపారు. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా చిదంబరంను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి లభించింది. కేసులో సేకరించిన సాక్ష్యాధారాలను సమర్పించిన మీదట చిదంబరంపై న్యాయపరమైన చర్యలతో ముందుకెళ్లేందుకు గతంలో న్యాయమంత్రిత్వ శాఖను దర్యాప్తు సంస్ధ ఆశ్రయించిన సంగతి తెలసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విచారణ అవసరమని సీబీఐ, ఈడీ ఈనెల 25న ఢిల్లీ హైకోర్టులో పేర్కొన్నాయి. కాగా ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన క్రమంలో తాజా పరిణామాలు ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చే క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు ముట్టాయని చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ ఆరోపిస్తోంది. -
‘ఎయిర్‌సెల్’ శివశంకరన్ ఆస్తులు అటాచ్
సాక్షి, చెన్నై: ‘ఎయిర్‌సెల్’ సంస్థ వ్యవస్థాపకుడు శివశంకరన్‌కు చెందిన చెన్నైలోని రూ.224 కోట్ల ఆస్తులను ఈడీ శనివారం అటాచ్ చేసింది. శివశంకరన్ కొంతకాలం క్రితం ఐడీబీఐ బ్యాంక్ నుంచి వ్యాపార నిమిత్తం రూ.600 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సొంత అప్పుల్ని తీర్చేందుకు వాడుకున్నాడు. వడ్డీ చెల్లించకపోవడంతో ఐడీబీఐ పలుమార్లు నోటీసులిచ్చింది. అసలు చెల్లించాలని ఒత్తిడి చేయగా శివశంకరన్ చేతులు ఎత్తేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఈడీ చెన్నైలో శివశంకరన్‌కు చెందిన రూ.224 కోట్ల విలువైన స్థిర, రూ.35 లక్షల చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
కార్తీ చిదంబరంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో విచారణ నిమిత్తం మార్చి తొలివారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. చట్టంతో చెలగాటమాడరాదని ఆయనను సర్వోన్నత న్యాయస్ధానం హెచ్చరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించే షరతుల్లో భాగంగా రూ పది కోట్లను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 21-28 తేదీల్లో తన ఫ్రాన్స్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కార్తీ గత ఏడాది నవంబర్‌లో అప్పీల్ చేశారు. ‘మీరు ఎక్కడికి వెళ్లదలుచుకుంటే అక్కడికి వెళ్లవచ్చు..ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.. అయితే చట్టంతో మాత్రం ఆడుకోవద్దు..విచారణకు సహకరించకుంటే మాత్రం తాము తీవ్ర చర్యలకు వెనుకాడబో’ మని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ కార్తీపై మండిపడింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో కార్తీ చిదంబరం మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్ధల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కార్తీ చిదంబరం ముడుపులు స్వీకరించారని దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. -
ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసు : చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు ఊరట లభించింది. వీరికి సీబీఐ, ఈడీ కేసుల్లో మధ్యంతర ఊరటను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 11 వరకూ పొడిగించింది. కేసుకు సంబంధించి మరిన్ని పత్రాలను సమీకరించేందుకు సమయం కావాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మారిషస్ కంపెనీకి అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చట్టవిరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించారన్న సీబీఐ ఆరోపణలను నిరాధారమైనవని చిదంబరం కోర్టు ముందు పేర్కొన్నారు. కాగా దర్యాప్తుకు చిదంబరం ఎంతమాత్రం సహకరించడం లేదని ఆయన ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపిస్తూ తెలిపింది. -
చిదంబరానికి సీబీఐ షాక్
-
చిదంబరానికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు సీబీఐ సోమవారం పటియాలా హౌస్ కోర్టుకు తెలిపింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు విచారణను చేపట్టిన ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఓపీ సైనీకి ఈ మేరకు సీబీఐ స్పష్టం చేసింది. చిదంబరంను ఈ వ్యవహారంలో ప్రాసిక్యూట్ చేసేందుకు దర్యాప్తు ఏజెన్సీ అనుమతించిన పత్రాలను సీబీఐ, ఈడీల తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితుల్లో ఆరుగురికి ప్రాసిక్యూషన్ అనుమతులు అవసరమని మెహతా తెలిపారు. మిగిలిన ఐదుగురు నిందితుల ప్రాసిక్యూషన్ కోసం అనుమతులు పొందే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నుంచి ఉపశమనం ఇస్తూ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు డిసెంబర్ 18 వరకూ కోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. కాగా, తనను కుట్రపూరితంగా అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని తనపై ఆరోపణలన్నీ కట్టుకథలుగా చిదంబరం కోర్టుకు నివేదించారు. -
చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి
న్యూడిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో నిజాలు రాబట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించడం తప్పనిసరని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని ఓ కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ నేత అయిన చిదంబరం విచారణలో తమకు సహకరించడం లేదనీ, అన్నీ దాటవేత సమాధానాలిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ముందస్తు బెయిలు కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. అనేక మంది ప్రముఖులతో సంబంధాలు కలిగిన ఆయన అత్యంత శక్తిమంతుడనీ, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను నాశనం చేయతగ్గ వ్యక్తి కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వకూడదని ఈడీ వాదించింది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించకపోతే దర్యాప్తును నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంది. కాగా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అభ్యర్థనను ఈ ఏడాది మే 30న కోర్టు తొలిసారి మన్నించడం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు ఈ వెసులుబాటును కోర్టు పొడిగించింది. గత నెల 8న కూడా ఆయనకు నవంబర్ 1 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
చిదంబరం కస్టడీని కోరిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈ కేసులో చిదంబరం కస్టడీ విచారణకు అనుమతించాలని బుధవారం ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎదుట ఈడీ తన స్పందనను తెలియచేస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వరాదని కోరింది. చిదంబరం తప్పించుకు తిరుగుతూ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించింది. కాగా, చిదంబరం బెయిల్ పిటిషన్‌పై గురువారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట వాదనలు కొనసాగనున్నాయి. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అక్టోబర్ 8న చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను నవంబర్ 1 వరకూ అరెస్ట్ చేయరాదని ఇచ్చిన ఉత్తర్వులు ముగియడంతో కోర్టు తదుపరి ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. -
చిదంబరంపై ఈడీ చార్జిషీటు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఎయిర్‌సెల్–మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలు చేసింది. అనుమతులు ఇచ్చే విషయంలో విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కయ్యారని అందులో ఈడీ ఆరోపించింది. చిదంబరం కుమారుడు కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరన్ పేరును కూడా స్పెషల్ జడ్జి ఓపీ సైనీ ఎదుట సమర్పించిన ఆ చార్జిషీటులో ప్రస్తావించింది. అయితే సీబీఐ, ఈడీ ఆరోపణలను చిదంబరం, ఆయన కుమారుడు ఖండించారు. ఈ చార్జిషీటులో ఎయిర్‌సెల్ మాజీ సీఈవో వి.శ్రీనివాసన్, మాక్సిస్‌కు చెందిన ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్, ఆస్ట్రో ఆల్ ఏసియా నెట్వర్క్స్ మలేసియా, ఎయిర్‌సెల్ టెలీవెంచర్స్ లిమిటెడ్, మాక్సిస్ మొబైల్ సర్వీసెస్, బుమీ అర్మడా బెర్హాద్ పేర్లను కూడా పొందుపరిచారు. నవంబర్ 26న ఈ చార్జిషీటు విచారణకు రానుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇచ్చిన అనుమతులను 2006లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఆమోదం తెలిపారని, ఈ వ్యవహారంలో రూ.1.6 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు : చిదంబరంపై చార్జిషీటు
సాక్షి, ముంబై: రూ. 3,500 కోట్ల ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. అంతేకాదు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన్ను ఎ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. చిదంబరంతోపాటు, ఆయర కుమారుడు కార్తీ చిదంబరం, ఎస్ భాస్కరన్ (కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్) వి. శ్రీనివాసన్ (ఎయిర్‌సెల్ మాజీ సీఈఓ), నాలుగు మాక్సిస్ కంపెనీలు సహా 9 మందిని నిందితులుగా ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఈ కేసు ఢిల్లీ కోర్టు విచారణకు రానుంది. నవంబర్ 26న ఈ చార్జిషీటును విచారణకు స్వీకరించనున్నట్లు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఓపీ సైనీ చెప్పారు. అయితే ఈ కేసులోనవంబరు 29 వరకు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీని అరెస్ట్ చేయకూడదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి అక్టోబర్ 25 వరకే ఉన్నా.. ఇవాళ మరోసారి దానిని పొడిగించింది. సీబీఐ, ఈడీ తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. -
ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు : చిదంబరం, కార్తీలకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో దర్యాప్తు సంస్థలు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను అరెస్ట్ చేయకుండా నవంబర్ 1 వరకూ మధ్యంతర రక్షణను ఢిల్లీ కోర్టు పొడిగించింది. నవంబర్ 1న తిరిగి కేసు విచారణను చేపడతామని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ వెల్లడించారు. చిదంబరం న్యాయవాదులు పీకే దూబే, అర్ష్‌దీప్ సింగ్‌ల అప్పీల్‌పై సవివర సమాధానం దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ, ఈడీల తరపు న్యాయవాదులు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, నితేష్ రాణాలు కోరారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో సీబీఐ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పేర్లను జులై 19న చార్జిషీట్లో పేర్కొంది. ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట సీబీఐ వీరిపై అనుబంధ చార్జిషీట్‌ను సైతం దాఖలు చేసింది. రూ 3500 కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ చిదంబరం పాత్రపై సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. -
సీబీఐ కావాలనే మీడియాకు లీకులిస్తోంది
న్యూఢిల్లీ: ‘ఎయిర్‌సెల్– మాక్సిస్’కేసులో సీబీఐ కావాలనే తనపై మీడియాకు లీకులిస్తూ న్యాయవ్యవస్థను ఎగతాళి చేస్తోందని కాంగ్రెస్ సీనియర్‌నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాదులు పీకే దుబే, అర్షదీప్ సింగ్‌లు వేసిన వ్యాజ్యాన్ని ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ షైని మంగళవారం విచారించారు. ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో చిదంబరంపై కోర్టు విచారణ జరిపేందుకు సీబీఐకి ఆసక్తి లేదని, మీడియానే విచారణ జరిపేందుకు తన పిటిషనర్‌పై ఉద్దేశపూర్వకంగా లీకులు అందజేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ఇంతవరకూ చార్జిషీటును కూడా కోర్టుకు అందివ్వలేదని, ఆ కాపీని తమకు అనుకూలమైన మీడియాకు అందజేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. -
చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద చిదంబరం వాంగ్మూలం తీసుకున్నారు. ఒప్పందానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) అధికారుల వాంగ్మూలాల్ని ఈడీ రికార్డు చేసింది. ఆయన హయాంలో ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతిచ్చేందుకు ఎఫ్ఐపీబీ అనుసరించిన ప్రమాణాలు, ఇతర అంశాలపై జూన్‌లో ప్రశ్నించారు. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌కి రూ.3,680 కోట్ల మేర ఎఫ్ఐపీబీ అనుమతులు జారీచేసింది. రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీనే అనుమతులివ్వాలి. చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి ఎలా అనుమతులిచ్చారనే విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. -
చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఆగస్ట్ 7 వరకూ పటియాలా హౌస్‌కోర్టు చిదంబరానికి మధ్యంతర ఊరట ఇవ్వగా, తాజాగా ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.గతంలో ఆయన ముందస్తు బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ జులై 10న ఈడీ బదులిచ్చింది. చిదంబరానికి ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు వెలుగుచూడటం సాధ్యం కాదని ఈడీ స్పష్టం చేసింది. మరోవైపు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ సహా 18 మంది నిందితులపై జులై 19న సీబీఐ ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంల ముందస్తు బెయిల్ అప్పీల్‌ను పటియాలా హౌస్ కోర్టు విచారిస్తోంది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ కంపెనీకి 800 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,680 కోట్ల) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు జారీచేశారు. కానీ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులు రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేయగలిగారన్న విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. -
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్‌సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
ఆ కేసులో చిదంబరానికి రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి ఊరట లభించింది. ఎయిర్‌సెల్- మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ జులై 10 వరకూ అరెస్ట్ చేయరాదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం పటియాలా హౌస్ కోర్టు ఆగస్ట్ 7 వరకూ పొడిగించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం తాజాగా అప్పీల్ చేసుకున్నారు. జులై 10న ఈ కేసులో ఈడీ కోర్టుకు సమగ్రంగా బదులిస్తూ చిదంబరం గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ముందస్తు బెయిల్ జారీ చేస్తే కేసులో వాస్తవాలను వెలికితీయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంటోంది.కాగా ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో సీబీఐ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ సహా 18 మంది నిందితులపై సీబీఐ తాజా చార్జిషీట్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చార్జిషీట్లో పలువురు ప్రస్తుత, పదవీవిరమణ చేసిన సీనియర్ అధికారుల పేర్లను సీబీఐ పొందుపరిచింది. -
సీబీఐ చార్జ్‌షీట్‌లో చిదంబరం, కార్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గురువారం అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీతో పాటు 10 మంది ప్రభుత్వాధికారులు, ఆరు సంస్థలను చేర్చింది. వీరందరిపై నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, అధికార దుర్వినియోగంతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ కంపెనీకి 800 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,680 కోట్ల) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు జారీచేశారు. కానీ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులు రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేయగలిగారన్న విషయమై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ అనుమతులకు ప్రతిఫలంగా కార్తీకి సంబంధించిన కంపెనీలకు రూ.1.14 కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కాగా, ఈ చార్జ్‌షీట్‌పై జూలై 31న విచారణ జరుపుతానని ప్రత్యేక సీబీఐ జడ్జి ఓపీ సైనీ తెలిపారు. కేంద్రం ఒత్తిడితోనే తనతో పాటు నిజాయితీపరులైన ప్రభుత్వాధికారుల పేర్లతో సీబీఐ అర్థరహితమైన చార్జ్‌షీట్ దాఖలుచేసిందని చిదంబరం మండిపడ్డారు.