ఎయిర్‌సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్ | Aircel launches 'High Flyer Contest' | Sakshi
Sakshi News home page

ఎయిర్‌సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్

Published Thu, Apr 3 2014 1:48 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

ఎయిర్‌సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్ - Sakshi

ఎయిర్‌సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్

హైదరాబాద్: ఎయిర్‌సెల్ కంపెనీ వినియోగదారుల కోసం ఎయిర్‌సెల్ హై ఫ్ల్లయర్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. ఈ పోటీలో గెల్చిన అభ్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) క్రికెట్ జట్టుతో ప్రయాణించే, ఆ జట్టు బస చేసిన హోటల్‌లోనే బస చేసే అవకాశాలతో పాటు, ఈ జట్టు ఆడే ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత టికెట్లను పొందవచ్చని ఎయిర్‌సెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలో ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులందరూ పాల్గొనవచ్చని ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ పేర్కొన్నారు. రూ.100 అంతకుమించి రీచార్జ్ చేసుకునే ప్రి-పెయిడ్ వినియోగదారులు, చివరి బిల్లులో ఎలాంటి బకాయిలు లేని పోస్ట్-పెయిడ్ వినియోగదారులు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు.

 దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నుంచే ప్రారంభించామని వివరించారు. ఇక ఈ పోటీలో పాల్గొనే వారందరికీ 10 నిమిషాల టాక్ టైమ్‌ను (ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్)కు ఉచితంగా అందిస్తామని, అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి 800 టికెట్లను గెల్చుకునే అవకాశముందని   అనుపమ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement