
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్
4 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు
తిప్పేసిన నూర్ అహ్మద్
రాణించిన రచిన్, రుతురాజ్
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్‌లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. 2012 ఐపీఎల్‌లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు.
చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X లక్నో
వేదిక: విశాఖపట్నం
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment