Rachin Ravindra
-
Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ
ముంబై: భారత్‌తో టెస్టు సిరీస్ విజయంలో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన బెంగళూరులో అద్భుత సెంచరీ సాధించి జట్టును తొలి టెస్టులో గెలిపించిన అతను సిరీస్ విజయానికి పునాది వేశాడు. అయితే ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది సిరీస్ విజయం తర్వాత తన తండ్రి అభినందిస్తూ మెసేజ్ పంపించడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని రచిన్ చెప్పాడు. నేను వంద శాతం న్యూజిలాండ్వాడినేచిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి రవి కృష్ణమూర్తి సమక్షంలోనే రచిన్ శతకంతో సత్తా చాటాడు. ‘నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే. అక్కడే పుట్టి పెరిగాను. కానీ మా అమ్మా నాన్న సొంత ఊరిలో నేను బాగా ఆడటం మరచిపోలేని క్షణం. అది ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇన్నేళ్లలో ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించడం ఎప్పుడూ చూడలేదు. కానీ ముంబై టెస్టు తర్వాత నిన్ను చూసి గర్విస్తున్నా అని నాన్న మెసేజ్ పంపించారు. అందుకే ఈ సిరీస్ విజయానందం రెట్టింపైంది. గెలిచాక మైదానంలో కూడా మా పరిస్థితి అంతా కొత్తగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనుఎజాజ్ చివరి వికెట్ తీయగానే ప్రతీ ఒక్కరూ ఆనందంతో సహచరుల వైపు పరుగెడుతున్నారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అందరం ఒక్కచోట చేరి ఆనందం పంచుకున్న అనుభూతిని నిజంగా మాటల్లో వర్ణించలేను. కానీ ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పగలను’ అని రచిన్ వివరించాడు. చదవండి: Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా -
వావ్! సుందర్ స్పిన్ మ్యాజిక్.. దెబ్బకు రవీంద్ర మైండ్ బ్లాంక్( వీడియో)
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించిన సుందర్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరులో ఔట్ చేశాడు.సుందర్ సంధించిన డెలివరీకి రవీంద్ర దగ్గర సమాధానమే లేకుండా పోయింది. సంచలన బంతితో వాషింగ్టన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 22 ఓవర్ వేసిన వాషీ ఐదో బంతిని కొంచెం వేగంతో లెంగ్త్ డెలివరీగా రచిన్‌కు సంధించాడు. అయితే ఆ డెలివరీని రచిన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం అతడి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. దీంతో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రచిన్ మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో కివీస్ పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ప్రస్తుతం బ్లాక్ క్యాప్స్ 250 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. కివీ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. pic.twitter.com/A4ogHu0XbW— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) October 25, 2024 -
వారెవ్వా వాషింగ్టన్.. దెబ్బకు కివీస్ ప్లేయర్ల ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, డార్లీ మిచెల్‌ను అద్బుతమైన బంతులతో సుందర్ బోల్తా కొట్టించాడు.ముఖ్యంగా రవీంద్ర, బ్లండెల్‌ను వాషీ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ స్ధానంలో జట్టులోకి వచ్చిన సుందర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు.తొలి స్పెల్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసిన సుందర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ 59 ఓవర్ల తర్వాత ఎటాక్‌లో తీసుకువచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రచిన్ రవీంద్రను పెవిలియన్‌కు పంపేందుకు హిట్‌మ్యాన్ సుందర్‌కు బంతి ఇచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని సుందర్ వమ్ము చేయలేదు.రచిన్ షాక్..కివీస్ ఇన్నింగ్స్ 60వ ఓవర్ వేసిన వాషింగ్టన్ తొలి బంతిని రచిన్‌కు రౌండ్ ది వికెట్ నుంచి మిడిల్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే ఆ డెలివరీని రచిన్ ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ మిడిల్ స్టంప్ దిశగా పడిన బంతి ఎవరూ ఊహించని విధంగా టర్న్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. చేసేదేమి లేక 65 పరుగులతో రచిన్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు బ్లండెల్‌ను కూడా సుందర్ ఈ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.62 ఓవర్లో ఆఖరి బంతిని సుందర్ బ్లండెల్‌కు ఔట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. కానీ బంతి మాత్రం ఒక్క సారిగా లోపలకు టర్న్ అవుతూ స్టంప్స్‌ను తాకింది. దెబ్బకు 3 పరుగులు చేసిన బ్లండెల్ బిత్తర పోయాడు. 76 ఓవర్ల ముగిసే సరికి న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో సుందర్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ఇప్పటివరకు 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్లో సుందర్‌కు ఇదే తొలి ఫైవ్ వికెట్ల హాల్ కావడం విశేషం.T. I. M. B. E. R! 🎯Cracker of a ball! 👌 👌Washington Sundar with a breakthrough 🙌 🙌Live ▶️ https://t.co/YVjSnKCtlI #TeamIndia | #INDvNZ | @Sundarwashi5 | @IDFCFIRSTBank pic.twitter.com/OC8VS7fnwT— BCCI (@BCCI) October 24, 2024చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే: సచిన్
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు బాగా హైలైట్ అయ్యారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. మరొకరు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. బెంగళూరు టెస్టులో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు.టీమిండియా పరువు నిలబెట్టిన సర్ఫరాజ్కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సర్ఫరాజ్ సాధించిన పరుగులు సున్నా. అయితే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగిందంటే మాత్రం అందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖానే!అద్భుత ఆట తీరుతో కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ మెరుపు సెంచరీ సాధించిన ఈ ముంబైకర్.. 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్న వేళ అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించి ఆటగాడిగా తన విలువను చాటుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) తండ్రి సొంతూరిలో కివీస్ తరఫున రచిన్ శతకంమరోవైపు.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర శతక్కొట్టి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరు వేదికగా టెస్టుల్లో రెండో సెంచరీ(157 బంతుల్లో 134) నమోదు చేశాడు. అతడికి తోడుగా టిమ్ సౌథీ(65) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.ఎవరిది పైచేయి అవునో?!ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌కు 107 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మరొక్కరోజు(ఆదివారం) మాత్రమే ఆట మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. బెంగళూరు సెంచరీ హీరోలు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రల గురించి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే‘‘మన మూలాలను అనుసంధానం చేసే మార్గం క్రికెట్‌కు ఉంది. రచిన్ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి కుటుంబం అక్కడి నుంచే వలస వెళ్లింది. అక్కడే అతడు శతకం బాదాడు.ఇక సర్ఫరాజ్ ఖాన్... తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?! టీమిండియాకు అత్యవసరమైన వేళ అతడు శతకం బాదాడు. ప్రతిభావంతులైన ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’’ అని సచిన్ టెండుల్కర్ రచిన్, సర్ఫరాజ్లపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Cricket has a way of connecting us to our roots. Rachin Ravindra seems to have a special connection with Bengaluru, where his family hails from! Another century to his name.And Sarfaraz Khan, what an occasion to score your first Test century, when India needed it most!… pic.twitter.com/ER8IN5xFA5— Sachin Tendulkar (@sachin_rt) October 19, 2024 -
ఎదురీత!
అనూహ్య తడబాటు నుంచి కోలుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఎదురీదుతోంది. బ్యాటింగ్‌కు అనువుగా మారిన బెంగళూరు పిచ్‌పై ప్రత్యర్థి భారీ స్కోరు చేయగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిస్తున్నారు. రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ, టిమ్ సౌతీ సమయోచిత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ రాణించింది. రోహిత్, కోహ్లి, సర్ఫరాజ్ అర్ధ శతకాలతో టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది. మూడో రోజు ఇన్నింగ్స్ చివరి బంతికి విరాట్ కోహ్లిను అవుట్ చేసి న్యూజిలాండ్ పైచేయి సాధించగా... కోహ్లి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మిగిలిన బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గట్టిగానే పోరాడుతోంది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కిన ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. 356 పరుగులతో వెనుకబడి శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (70; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 బ్యాటింగ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... యశస్వి జైస్వాల్ (35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 125 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న సర్ఫరాజ్‌తోపాటు ఇంకా రావాల్సిన కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ కోలుకోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 91.3 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో రెండో సెంచరీ సాధించాడు. మాజీ కెపె్టన్ టిమ్ సౌతీ (73 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రచిన్‌కు అండగా నిలిచాడు. చివరి బంతికి కోహ్లి అవుట్... తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ భారత టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడింది. యశస్వి, రోహిత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడంతో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక జైస్వాల్ అవుట్ కాగా... కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఎజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి. మరోసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి చకచకా పరుగులు చేస్తూ... ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కోహ్లి 70 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో చివరి బంతికి కోహ్లి అవుటవ్వడంతో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. ఆ భాగస్వామ్యం లేకుంటే... భారత సంతతి ఆటగాడు రచిన్... కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. మిచెల్ (18), బ్లండెల్ (5), ఫిలిప్స్ (14), హెన్రీ (8) విఫలమవడంతో కివీస్ జట్టు 233/7తో నిలిచింది. కాసేపట్లో కివీస్ ఆలౌట్ కావడం ఖాయమే అనుకుంటే... సౌతీ సహకారంతో రచిన్ రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 4 టెస్టు క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్‌గా ఈ మైలురాయి దాటిన 18వ ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 15; కాన్వే (బి) అశి్వన్ 91; యంగ్ (సి) కుల్దీప్ (బి) జడేజా 33; రచిన్ (సి) (సబ్) జురేల్ (బి) కుల్దీప్ 134; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 18; బ్లండెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 5; ఫిలిప్స్ (బి) జడేజా 14; హెన్రీ (బి) జడేజా 8; సౌతీ (సి) జడేజా (బి) సిరాజ్ 65; ఎజాజ్ (ఎల్బీ) కుల్దీప్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154, 4–193, 5–204, 6–223, 7–233, 8–370, 9–384, 10–402. బౌలింగ్: బుమ్రా 19–7–41–1, సిరాజ్ 18–2–84–2, అశ్విన్ 16–1–94–1, కుల్దీప్ 18.3–1–99–3, జడేజా 20–1–72–3.భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) ఎజాజ్ 35; రోహిత్ (బి) ఎజాజ్ 52; కోహ్లి (సి) బ్లండెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (బ్యాటింగ్) 70; ఎక్స్ ట్రాలు 4; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231. బౌలింగ్: సౌతీ 7–1–22–0; హెన్రీ 11–1–52–0; రూర్కే 11–1–48–0; ఎజాజ్ 12–2–70–2; ఫిలిప్స్ 8–1–36–1. -
IND vs NZ: కివీస్ 402 ఆలౌట్.. భారీ ఆధిక్యం
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్.రచిన్ రవీంద్ర సెంచరీమిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్ టిమ్ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్ ఫిలిప్స్(14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.ఇక గురువారం ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
రవీంద్ర సూపర్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ స్కోరంతంటే?
Update: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత బౌలింగ్‌లో భారత్‌ను కట్టడి చేసిన కివీస్.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా బ్యాక్ క్యాప్స్ జట్టు అడుగులు వేస్తోంది. మూడో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.క్రీజులో రచిన్ రవీంద్ర(104), టిమ్ సౌథీ(49) పరుగులతో ఉన్నారు. అయితే 180/3 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ డార్లీ మిచెల్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్లాండెల్ను బుమ్రా ఔట్ చేయగా, గ్లెన్ ఫిలిప్స్ జడేజా బోల్తా కొట్టించాడు.కేవలం 40 పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ తిరిగి గేమ్‌లోకి వచ్చిందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న రచిన్ రవీంద్ర మాత్రం అందరి అంచనాలను తారుమారు చేశాడు.రవీంద్ర సూపర్ సెంచరీ..వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి రవీంద్ర మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. వెటరన్ ప్లేయర్ టిమ్ సౌథీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 124 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను రవీంద్ర అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. మరోవైపు టిమ్ సౌథీ కూడా భారత బౌలర్లను ఓ ఆట ఆడేసికుంటున్నాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో సౌథీ ఉన్నాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 112 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. -
IND vs NZ: కొరకరాని కొయ్య.. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర శతకంతో మెరిశాడు. భారత బౌలర్లకు కొరకరానికి కొయ్యగా మారి.. వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆద్యంతం అద్భుత బ్యాటింగ్‌తో 124 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటేశాడు.అతడి తర్వాత.. కివీస్ తొలి బ్యాటర్గాకాగా టెస్టుల్లో రచిన్‌కు ఇది రెండో శతకం. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరులో సెంచరీ సాధించడం అతడి కెరీర్లో మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతేకాదు.. రచిన్ సాధించిన ఈ శతకానికి మరో ప్రత్యేకత కూడా ఉందండీ! న్యూజిలాండ్ తరఫున బెంగళూరులో 2012 తర్వాత సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రచిన్ రవీంద్ర కావడం విశేషం. నాడు రాస్ టేలర్ ఇదే వేదికపైన టీమిండియాపై 113 పరుగులు సాధించాడు.భారీ ఆధిక్యంలో కివీస్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షం వల్ల గురువారం మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, పిచ్‌ను తప్పుగా వేయడం వల్ల భారీ మూల్యం చెల్లించింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక రోహిత్ సేన 46 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ.. ఇదే వేదికపై న్యూజిలాండ్ బ్యాటర్లను మాత్రం కట్టడి చేయలేకపోయింది. గురువారం ఆట ముగిసే సరికి 180/3 స్కోరు చేసిన కివీస్.. శుక్రవారం ఆరంభం నుంచి నిలకడగా ఆడింది.భోజన విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 299 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లంచ్ బ్రేక్నకు ముందు రచిన్ రవీంద్ర 104, టిమ్ సౌతీ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తకరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. మరో రోజు ఆట మిగిలి ఉంది. ప్రస్తుతమున్న అవకాశాల ప్రకారం.. శ్రీలంకకే విజయావకాశాలు అధికంగా ఉన్నా.. కివీస్‌ను కూడా విస్మరించడానికి వీలు లేని పరిస్థితి ఉంది. కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర (91 నాటౌట్) క్రీజ్‌లో పాతుకుపోయి ఉన్నాడు. అజాజ్ పటేల్ (0 నాటౌట్), విలియమ్ ఓరూర్కీ సాయంతో అతను న్యూజిలాండ్‌ను గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రచిన్‌కు లోయర్ ఆర్డర్లో ఏ ఒక్కరి నుంచి సహకారం లభించినా పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న గ్లెన్ ఫిలిప్స్ (4), మిచెల్ సాంట్నర్ (2), టిమ్ సౌథీ (2) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. టాపార్డార్‌లో డెవాన్ కాన్వే (4), డారిల్ మిచెల్ (8) సైతం తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. టామ లాథమ్ (28), కేన్ విలియమ్సన్ (30), టామ్ బ్లండెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ చెరో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన కరుణరత్నే, చండీమల్, మాథ్యూస్అంతకుముందు శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్ (61), ఏంజెలో మాథ్యూస్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్ పటేల్ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టాడు. విలియమ్ ఓరూర్కీ 3, సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.లాథమ్, విలియమ్సన్, మిచెల్ ఫిఫ్టీలున్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్), రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్ (114) సెంచరీ.. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, అజాజ్ పటేల్ తలో 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ -
రచిన్ రవీంద్రకు బంపరాఫర్
న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్రకు బంపరాఫర్ దక్కింది. కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తొలిసారి అతడు చోటు దక్కించుకున్నాడు.గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రచిన్‌కు బోర్డు ఈ మేరకు సముచిత స్థానం కల్పించింది. 2024- 25 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రతిపాదిత జాబితాలోని 20 మంది ఆటగాళ్లలో 24 ఏళ్ల రచిన్‌కు చోటు ఇచ్చింది.బెంగళూరు మూలాలుభారత్లోని బెంగళూరు మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గతేడాది కివీస్ తరఫున అతడు 578 పరుగులు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ఆట తీరుతో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.అంతేకాదు.. ఈ ఏడాది మార్చిలో.. ప్రతిష్టాత్మక సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్ అందుకున్నాడు. తద్వారా ఈ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా రచిన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని.. ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్లాక్‌క్యాప్స్ తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. ఇప్పుడిలా కాంట్రాక్టు దక్కించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. రూ. 1.8 కోట్లుకాగా రచిన్ రవీంద్రతో పాటు బెన్ సియర్స్, విల్ ఓ రూర్కే, జాకోబ్ డఫీలు కూడా తొలిసారి న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించారు.న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన రచిన్ రవీంద్ర 519 పరుగులు చేశాడు. ఇక 25 వన్డేలు ఆడిన అతడి ఖాతాలో 820 పరుగులు ఉన్నాయి. ఇందులో మూడు సెంచరీలు. కాగా ఐపీఎల్లో రచిన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది వేలంలో రూ. 1.8 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు.ఇక 23 టీ20 ఆడిన రచిన్ 231 పరుగులు చేయగలిగాడు. అదే విధంగా.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా 10, 18, 13 వికెట్లు పడగొట్టాడు. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది సంబంధిత క్రికెట్ బోర్డు, క్రికెటర్ల మధ్య కుదిరే వార్షిక ఒప్పందం. అందుకు అనుగుణంగానే ప్లేయర్ల పారితోషికం, సదుపాయాలు ఉంటాయి.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 25గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఇవాల్టి (జూన్ 1) నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి సారి రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గతంలో ఈ టోర్నీ 12 జట్లతో సాగేది. క్రికెట్ పసికూనలకు ప్రోత్సహించడంలో భాగంగా ఐసీసీ ఈ ఎడిషన్ నుంచి 20 జట్లకు అవకాశం కల్పిస్తుంది.ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి ఒక్కరు.. యూఎస్ఏ నుంచి ఆరుగురు.. కెనడా నుంచి నలుగురు.. సౌతాఫ్రికా, ఒమన్‌ల నుంచి ఒక్కొక్కరు.. ఉగాండ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎడిషన్‌లో పాల్గొంటున్నారు.గతంలో ఎన్నడూ ఈ సీజన్లో పాల్గొంటున్నంత మంది భారత సంతతి ఆటగాళ్లు పాల్గొనలేదు. ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో అందరి కళ్లు న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రపై ఉన్నాయి. అలాగే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రదర్శనల కోసం కూడా భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొంటున్న భారత సంతతి ఆటగాళ్లు..రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)కశ్యప్ ప్రజాపతి (ఒమన్)అల్పేశ్ రాంజనీ (ఉగాండ)రోనక్ పటేల్ (ఉగాండ)రవీందర్ పాల్ సింగ్ (కెనడా)నిఖిల్ దత్తా (కెనడా)పర్గత్ సింగ్ (కెనడా)శ్రేయస్ మొవ్వ (కెనడా)మోనాంక్ పటేల్ (యూఎస్ఏ)హార్మీత్ సింగ్ (యూఎస్ఏ)మిలింద్ కుమార్ (యూఎస్ఏ)నిసర్గ్ పటేల్ (యూఎస్ఏ)నితీశ్ కుమార్ (యూఎస్ఏ)సౌరభ్ నేత్రావాల్కర్ (యూఎస్ఏ) -
#CSK: మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే!
కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు.‘‘ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్‌కు కట్టడి చేయగలిగారు.తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది.తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్‌రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. -
మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే: రుతు
కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు. ‘‘ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్‌కు కట్టడి చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది. తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్‌రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. Vintage Dhoni 👌#TATAIPL fans were treated to some strong hitting by MS Dhoni Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/eF4JsOwmsa — IndianPremierLeague (@IPL) March 31, 2024 అజింక్య రహానే(45), డారిల్ మిచెల్(34).. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని(37 నాటౌట్) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అద్భుత స్పెల్(2/21) వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: #Dhoni: స్ట్రైక్‌రేటు 231.25.. సీఎస్కే ఓడిందా?!.. అట్లుంటది మనతోని Season’s 1️⃣st Win 🙌@DelhiCapitals get off the mark in #TATAIPL 2024 with a collective team effort in Visakhapatnam 🙌 Scorecard ▶️ https://t.co/8ZttBSkfE8#DCvCSK pic.twitter.com/PB9tLAD13i — IndianPremierLeague (@IPL) March 31, 2024 These maximums 🤩 Some clean hitting tonight 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/4ps9IcmCbl — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్‌గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్‌ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్‌ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్‌లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్ కూడా అద్భుతం: రుతురాజ్
ఐపీఎల్-2024లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టి కృషితో గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట జట్టును ఓడించామని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రతి ఒక్క సీఎస్కే ఆటగాడూ రాణించాడని ప్రశంసలు కురిపించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే.. తాజాగా గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. సొంతమైదానం చెపాక్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో శుబ్‌మన్ గిల్ సేనపై జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ పరిపూర్ణమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మా వాళ్లు అదరగొట్టారు. సాధారణంగా చెన్నైలో వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేం. అందుకే తొలుత బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా రాణించడం మాత్రం ముఖ్యం. అయితే, వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే ఆఖర్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈరోజు రచిన్ పవర్ ప్లేలో అత్యద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేశాడు. అదే విధంగా.. దూబే.. అతడికి ఆత్మవిశ్వాసం మెండు. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా వ్యక్తిగతంగా అతడిని మెటివేట్ చేశాడు. జట్టులో తన పాత్ర ఏమిటో అతడికి బాగా తెలుసు. దూబే జట్టుతో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈరోజు నేను మా వాళ్ల ఫీల్డింగ్‌కు కూడా ఫిదా అయ్యాను’’ అని పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. Jubilant Chepauk 🏟️ witnessed @ChennaiIPL's consecutive win as they beat @gujarat_titans by a resounding 63 runs 💪 Recap of the #CSKvGT clash 🎥 👇 #TATAIPL pic.twitter.com/reeLzs1IEh — IndianPremierLeague (@IPL) March 27, 2024 చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46) రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే(23 బంతుల్లో 51) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపు అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్(24- నాటౌట్) సైతం తన వంతు పరుగులు జతచేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ గుజరాత్ 143 పరుగుల వద్దే నిలిచిపోవడంతో సీఎస్కే చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. డారిల్ మిచెల్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: #WHAT A CATCH: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో -
CSK Vs GT: చెన్నై ధనాధన్ గెలుపు
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండ్ షోకు నిరుటి రన్నరప్ గుజరాత్ టైటాన్స్ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్లో గుజరాత్‌కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు. ముందు రచిన్... తర్వాత దూబే... చెన్నై ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్‌గా సాగింది. తొలి దశను ఓపెనర్ రచిన్ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్ రెండో బంతికి రషీద్ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్వే కావడం విశేషం. తర్వాత రహానే (12), కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే రహానే అవుట్‌కాగా... శివమ్ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్ ఏ బౌలర్‌కు తలొగ్గకుండా దూబే బ్యాట్ దంచేసింది. మిచెల్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది. టైటాన్స్ వల్ల కాలేదు! కొండంత లక్ష్యం చూసే గుజరాత్ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్‌ప్లేలోనే కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్‌కు వెళ్లిపోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్ శంకర్ (12), మిల్లర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌కు వికెట్లు అప్పగించేశారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46; రచిన్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 46; రహానే (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 12; దూబే (సి) శంకర్ (బి) రషీద్ ఖాన్ 51; మిచెల్ (నాటౌట్) 24; సమీర్ రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14; జడేజా (రనౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–49–2, సాయికిషోర్ 3–0–28–1, జాన్సన్ 4–0–35–1, మోహిత్ శర్మ 4–0–36–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) తుషార్ (బి) దీపక్ 21; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ 8; సాయి సుదర్శన్ (సి) సమీర్ (బి) పతిరణ 37; విజయ్ శంకర్ (సి) ధోని (బి) మిచెల్ 12; మిల్లర్ (సి) రహానే (బి) తుషార్ 21; అజ్మతుల్లా (సి) రచిన్ (బి) తుషార్ 11; తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 6; రషీద్ ఖాన్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఉమేశ్ (నాటౌట్) 10; జాన్సన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–28–2, ముస్తఫిజుర్ 4–0–30–2, తుషార్ దేశ్‌పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్ 2–0–18–1, పతిరణ 4–0–29–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X ముంబై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: రచిన్ రవీంద్ర విధ్వంసం.. కేవలం 20 బంతుల్లోనే! వీడియో వైరల్
కివీస్ యవ సంచలనం, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన రవీంద్ర.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లను రవీంద్ర ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రవీంద్ర బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సీఎస్కేకు మరో సూపర్ స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు విధ్వంసం సష్టించారు. రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు. Rachin Ravindra is a superstar!!! ⭐pic.twitter.com/FUYcUekI9Y — Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024 -
#Kohli: అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?
Virat Kohli Reaction To Rachin Ravindra Dismissal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఈ భారత సంతతి ఆటగాడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న రచిన్ ఏకంగా 37(3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు రాబట్టి చెన్నై ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా విజయంలో తానూ భాగమై సత్తా చాటాడు రచిన్ రవీంద్ర. కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో జోరు మీదున్న సమయంలో రచిన్‌ను కర్ణ్ శర్మ అవుట్ చేశాడు. కర్ణ్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రచిన్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6⃣.5⃣ - SIX 6⃣.6⃣ - OUT That was an interesting passage of play! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB pic.twitter.com/JjiIclkEoj — IndianPremierLeague (@IPL) March 22, 2024 ఫలితంగా ఆర్సీబీ శిబిరంలో సంబరాలు షురూ కాగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. రచిన్‌ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ.. వెళ్లిపో అన్నట్లు కోహ్లి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. pic.twitter.com/HUcInu5yTz — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 22, 2024 దీంతో.. ‘‘అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి, వయసుకు ఇది తగదు చీకూ’’ అంటూ కోహ్లి అభిమానులు సైతం అతడి తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చెన్నై చేతిలో ఓడి పరాజయంతో సీజన్‌ను ఆరంభించింది. ఇక ఆర్సీబీ ఓపెనర్ కోహ్లి చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అదీ సంగతి!! అందుకే ఆ వైల్డ్ సెలబ్రేషన్! Fielder ki kamaal ki lapak aur khatam hua Kohli ka luck! 🤯 Lijiye mazaa #IPLonJioCinema ka Bhojpuri mein ek dum FREE!#TATAIPL #JioCinemaSports pic.twitter.com/3tCrsyTGBo — JioCinema (@JioCinema) March 22, 2024 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్లు: ►వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై ►టాస్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. బ్యాటింగ్ ►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు: 173/6 (20) ►చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు: 176/4 (18.4) ►విజేత: ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముస్తాఫిజుర్ రహ్మాన్ (4/29). చదవండి: IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు.. ఆర్సీబీ కొంపముంచాడు! ఎవరంటే? -
అరంగేట్రంలోనే సిక్సర్ల వర్షం.. అస్సలు తగ్గేదేలే!
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర.. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రవీంద్ర ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఈ కివీ స్టార్ టార్గెట్ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో సీఎస్కే అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎస్కేకు మరో స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సీఎస్కే నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. -
రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను రవీంద్ర పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్ నాలుగో బంతిని డుప్లెసిస్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డుప్లెసిస్ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్(35) పరుగులు చేశాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రచిన్ 10 మ్యాచ్‌లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్‌గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్‌గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్‌తో కొయెట్జీ గత వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్‌గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్‌రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్‌కు ఆల్‌రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్‌కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్‌ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్‌కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్‌ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్‌గా
ప్రపంచ క్రికెట్లో ఇటీవల సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఆ దేశపు బోర్డు నుంచి సముచిత గుర్తింపు దక్కింది. కివీస్ వార్షిక అవార్డుల్లో రచిన్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘సర్ రిచర్డ్ హ్యడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అటు టెస్టు, ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్లో గత ఏడాది కాలంలో 24 ఏళ్ల రచిన్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. వన్డే వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు సహా 578 పరుగులు సాధించిన రచిన్... ఇటీవల దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. అతి పిన్న వయసులో ‘హ్యాడ్లీ అవార్డు’ గెలుచుకున్న ప్లేయర్‌గా రచిన్ నిలిచాడు. న్యూజిలాండ్ ’టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కేన్ విలియమ్సన్కు దక్కింది. -
IPL 2024: కాన్వే ఔట్.. రుతురాజ్‌కు జోడీ ఎవరు..?
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాన్వే వైదొలగడంతో రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సీఎస్కే ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే అంశంపై ప్రస్తుతం నెట్టింట భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సీఎస్కేకు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను ఓపెనర్‌గా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వారిలో కొత్తగా జట్టులో చేరిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రచిన్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా సక్సెస్ సాధించాడు కాబట్టి అతన్నే రుతురాజ్‌కు జోడీగా పంపాలని మెజార్టీ శాతం సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీఎస్కే యాజమాన్యం ముందు రచిన్‌తో పాటు మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వెటరన్లు అజింక్య రహానే, మొయిన్ అలీల్లో ఎవరో ఒకరికి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని ధోని యోచిస్తున్నట్లు సమాచారం. రహానేకు గతంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉండటం అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రహానేకు గత సీజన్లో పేసర్లపై విరుచుకుపడిన ట్రాక్ రికార్డు కూడా ఉండటం సెకెండ్ అప్షన్ ఓపెనర్‌గా అతని పేరునే పరిశీలించే అవకాశం ఉంది. రచిన్, రహానేలతో పాటు మొయిన్ అలీ పేరును సైతం సీఎస్కే మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాటర్‌గా మొయిన్ అలీకి పెద్ద సక్సెస్ రేట్ లేకపోవడం, వయసు పైబడటం వంటి కారణాలు అతన్ని ఓపెనర్ రేసులో వెనకపడేలా చేయవచ్చు. సీజన్ ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సీఎస్కే యాజమాన్యం అతి త్వరలో ఓపెనింగ్ స్థానాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 22న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు.. ఎంఎస్ ధోని వికెట్కీపర్బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్) డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు తుషార్ దేశ్‌పాండే బౌలర్ 20 లక్షలు ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు సిమ్రన్‌జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు -
NZ vs Aus: 5 వికెట్లతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. రచిన్ ఫిఫ్టీ!
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆసీస్‌కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369.. మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ
Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కాన్వే స్థానంలో అతడు జట్టులోకి ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్‌కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్‌లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది. రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు న్యూజిలాండ్ టెస్టు జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్. చదవండి: Ind vs Eng: లండన్‌కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే!