న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర.. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రవీంద్ర ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఈ కివీ స్టార్ టార్గెట్ చేశాడు.
కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో సీఎస్‌కే అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎస్‌కేకు మరో స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సీఎస్‌కే నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment