
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ డిఫెండ్ చేసుకుంది. పంజాబ్ బౌలర్ల దాటికి కేకేఆర్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.
ఓ దశలో సునాయసంగా గెలిచేలా కన్పించిన కేకేఆర్‌ను స్పిన్నర్ యుజేంద్ర చాహల్ దెబ్బతీశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు అర్ష్‌దీప్, మార్కో జానెసన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు.
జానెసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, మాక్స్‌వెల్, బ్రాట్‌లెట్ తలా వికెట్ సాధించారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ రికార్డులకెక్కింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కూడా 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.
వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్‌వెల్(7) తీవ్ర నిరాశపరిచారు.