royal challengers bangalore
-
RR Vs RCB Highlights Photos: ఆర్సీబీ కల చెదిరే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విక్టరీ (ఫొటోలు)
-
లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్?
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమతో అందరని ఆకట్టుకున్నాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో కార్తీక్ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించాడు. అతడికి బౌలింగ్‌లో ఎలా చేయాలో ఆర్ధం కాక ఎస్ఆర్హెచ్ బౌలర్లు తలలపట్టుకున్నారు. భువనేశ్వర్, ప్యాట్ కమ్మిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్కు గట్టిపోటీ ఇవ్వగల్గింది. డికే ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్ వచ్చి తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ఉండవచ్చు.. డీకే మాత్రం మా మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు. pic.twitter.com/jqOIaCZAgL — Cricket Videos (@cricketvid123) April 15, 2024 -
IPL 2024: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి క్రికెటర్‌గా రికార్డు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 7,500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 130.36 స్ట్రైక్ రేట్‌తో 7575 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ పేరిటే ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 72 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. విరాట్ కోహ్లికి ఇది 8వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లినే కావడం విశేషం. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే.. విరాట్ కోహ్లి- 7575 పరుగులు (242 మ్యాచ్‌లు) శిఖర్ ధావన్- 6754 పరుగులు (221 మ్యాచ్‌లు) డేవిడ్ వార్నర్- 6545 పరుగులు (180 మ్యాచ్‌లు) రోహిత్ శర్మ- 6280 పరుగులు (246 మ్యాచ్‌లు) సురేశ్ రైనా- 5528 పరుగులు (205 మ్యాచ్‌లు) Make that 7500 runs and counting in the #TATAIPL for @imVkohli 👏👏 Live - https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/M5CS7PUW2Q — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
IPL 2024 RCB vs LSG: ఆర్సీబీని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.
IPL 2024 RCB vs LSG Live Updates: ఆర్సీబీని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీని దెబ్బతీశాడు. అతడితో పాటు నవీన్ ఉల్ హక్ రెండు,యశ్ ఠాకూర్, స్టోయినిష్, సిద్దార్డ్ తలా వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్ లామ్రోర్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఆర్సీబీకి ఇది మూడో ఓటమి. ఆరో వికెట్ డౌన్.. రజిత్ పాటిదార్ ఔట్ 104 పరుగుల ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన రజిత్ పాటిదార్(29).. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐదో వికెట్ డౌన్.. అనుజ్ రావత్ ఔట్ 94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అనుజ్ రావత్.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మహిపాల్ లామ్రోర్ వచ్చాడు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ : 85/4 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో రజిత్ పాటిదార్(25), అనుజ్ రావత్(8) పరుగులతో ఉన్నారు. . మయాంక్ యాదవ్ ఆన్ ఫైర్.. కష్టాల్లో ఆర్సీబీ 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గ్రీన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆర్సీబీకి బిగ్ షాక్.. ఒకే ఓవర్లో డుప్లెసిస్, మాక్సీ ఔట్ 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఫాప్ డుప్లెసిస్ తొలుత రనౌట్ కాగా.. ఆ తర్వాత మాక్స్వెల్ క్యాచ్ ఔటయ్యాడు తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి ఔట్ 40 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఎం సిద్ధార్థ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పాటిదార్ వచ్చాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 25/0 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), ఫాప్ డుప్లెసిస్(14) ఉన్నారు. లక్నో భారీ స్కోర్.. ఆర్సీబీ లక్ష్యం ఎంతంటే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో డికాక్ 81 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో మాక్స్వెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, టోప్లీ, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు. ఐదో వికెట్ డౌన్ ఎల్ఎస్జీ ఐదో వికెట్ కోల్పోయింది. 148 పరుగుల వద్ద ఆయుష్ బదోని డకౌట్‌గా వెనుదిరిగారు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జైయింట్స్.. 143 పరుగుల వద్ద ఎల్ఎస్జీ నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్ ఒపెనర్ క్వింటన్ డికాక్ (81) పరుగుల వద్ద అవుటయ్యారు. ప్రస్తుతం 17.4 ఓవర్లలో లక్నో స్కోర్..147/4.. ప్రస్తుతం క్రీజ్‌లో నికోలస్ పూరన్(7), ఆయుష్ బదోని (0)ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్ 129 పరుగుల వద్ద ఎల్ఎస్జీ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిష్.. మాక్స్వెల్ ఔటయ్యాడు. 15 ఓవర్లకు లక్నో స్కోర్: 131/3. క్రీజులో డికాక్(71), పూరన్(1) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు లక్నో స్కోర్: 121/2 13 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(70), స్టోయినిష్(17) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. పడిక్కల్ ఔట్ 73 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. సిరాజ్ బౌలింగ్ ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. రాహుల్ ఔట్ 53 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్.. మాక్స్వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్: 54/1. క్రీజులో డికాక్(32), పడిక్కల్(1) పరుగులతో ఉన్నారు. 2 ఓవర్లకు లక్నో స్కోర్: 19/0 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(17), కేఎల్ రాహుల్(2) ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పేసర్ అల్జారీ జోషఫ్ స్ధానంలో టోప్లే ఆర్సీబీ జట్టులోకి రాగా.. మోహ్సిన్ ఖాన్ స్ధానంలో యశ్ ఠాకూర్ లక్నో జట్టులోకి వచ్చాడు. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), రీస్ టాప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్ -
RCB vs LSG: 'గ్రీన్‌ను పక్కన పెట్టండి.. వారిద్దరిని జట్టులోకి తీసుకోండి'
ఐపీఎల్-2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగితా మూడు మ్యాచ్‌ల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆర్సీబీ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమవుతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్వెల్, గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో కూడా ఆర్సీబీ పూర్తిగా తేలిపోతోంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీకి ఏ మెరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో ఆర్సీబీని ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ వంటి స్టార్డమ్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని బ్రాడ్ తెలిపాడు. ఆర్సీబీపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు కారణం వారు ఒక్కసారి కూగా టైటిల్‌ను గెలవకపోవడం. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికి ట్రోఫీని ఎందుకు గెలవలేకపోయిందో నాకు అర్ధం కావడం లేదు. డివిలియర్స్, గేల్ వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఆర్సీబీకి ఆడారు. విరాట్ కోహ్లి ఇంకా ఆర్సీబీతోనే ఉన్నాడు.. ప్రతీ సీజన్లోనూ విరాట్ తన వంతు న్యాయం చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుత సీజన్లో విరాట్ మినహా మిగితా ఏ బ్యాటర్ కూడా తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు. మాక్స్వెల్, ఫాప్ డుప్లెసిస్ తిరిగి ఫామ్‌లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. నావరకు అయితే ఆర్సీబీ బౌలింగ్ పరంగా చాలా వీక్‌గా ఉంది. వారు ఇద్దరు ఓవర్సీస్ బౌలర్లతో బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. తదుపరి మ్యాచ్‌లకు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ రీస్ టోప్లీ ,లాకీ ఫెర్గూసన్‌లను తీసుకువస్తే బాగుంటుంది. కెమరూన్ గ్రీన్, జోషఫ్‌ను కొన్ని మ్యాచ్‌లకు పక్కనపెట్టాల్సిన అవసరముందని స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రాడ్ పేర్కొన్నాడు. -
IPL 2024 RCB Vs KKR Pics: ఆర్సీబీపై నైట్‌రైడర్స్ అలవోక విజయం (ఫొటోలు)
-
రూ.11 కోట్లు తీసుకున్నాడు.. ఆర్సీబీని నిండా ముంచేశాడు!
ఐపీఎల్-2024లో వెస్టిండీస్ పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన జోసెఫ్.. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 17.00 ఎకానమితో ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్.. జోసెఫ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడు వేసిన తొలి ఓవర్లోనే 2 సిక్స్‌లు బాది తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన జోసెఫ్ కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికి ఇంకా ఛాన్స్‌లు కల్పిస్తున్న ఆర్సీబీ మేనెజ్మెంట్ తీరును ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. అతడి స్ధానంలో లూకీ ఫెర్గూసన్ లేదా టోప్లీకి అవకాశమివ్వాలని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఐపీఎల్-2024 వేలంలో జోసెఫ్‌ను ఆర్సీబీ ఏకంగా రూ.11.50 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. కానీ జోసెఫ్ మాత్రం తన తీసుకున్న డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(83) మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆర్సీబీని గెలిపించలేకపోయాడు. RCB's premium pacer in IPL 2024, Alzarri Joseph (INR 11.5 Cr), hasn't lived up to the expectations in the first three games. 📸: BCCI/IPL pic.twitter.com/TYQlsHOA2O — CricTracker (@Cricketracker) March 29, 2024 Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 -
RCB Vs KKR: ఆర్సీబీని చిత్తు చేసిన కేకేఆర్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
IPL 2024 KKR vs RCB Match live Updates: ఆర్సీబీని చిత్తు చేసిన కేకేఆర్.. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో కేకేఆర్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 150/2 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి 36 బంతుల్లో 33 పరుగులు కావాలి. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(42), శ్రేయస్ అయ్యర్(18) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. సాల్ట్ ఔట్ ఫిల్ సాల్ట్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన సాల్ట్.. వైశ్యాఖ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 128/2. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(32), శ్రేయస్ అయ్యర్(12) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. నరైన్ ఔట్ 86 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 47 పరుగులతో దూకుడుగా ఆడిన సునీల్ నరైన్.. మయాంక్ దాగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. నరైన్ విధ్వంసం.. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(20 బంతుల్లో 47), ఫిల్ సాల్ట్(29) పరుగులతో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న కేకేఆర్.. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి ఊచకోత.. కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 3 సిక్స్‌లతో కార్తీక్ 20 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐదో వికెట్ డౌన్.. రావత్ ఔట్ ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రావత్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐదో వికెట్ డౌన్.. రావత్ ఔట్ ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అనూజ్ రావత్.. హర్షిత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 153/5. క్రీజులో విరాట్ కోహ్లి(62),కార్తీక్ (1) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్ ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 134/3. క్రీజులో విరాట్ కోహ్లి(62),రావత్ (1) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ గ్లెన్ మాక్స్వెల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్లు కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాక్స్వెల్.. నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 134/3. క్రీజులో విరాట్ కోహ్లి(62), రజిత్ పాటిదార్(1) పరుగులతో ఉన్నారు. విరాట్ కోహ్లి ఫిప్టీ.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 37 బంతుల్లో కోహ్లి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్:109/2. 52 పరుగులతో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. గ్రీన్ ఔట్ 82 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన గ్రీన్.. రస్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 61/1 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్ (24), కోహ్లి(28) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 30/1. క్రీజులో విరాట్ కోహ్లి(21), గ్రీన్(4) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఆర్సీబీ విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ కేకేఆర్ ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి -
'ఆర్సీబీకి చుక్కలు చూపించాడు.. వరల్డ్‌కప్‌లో ఛాన్స్ ఇవ్వాల్సిందే'
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన హర్‌ప్రీత్.. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్ వంటి కీలక ఆటగాళ్లను బ్రార్ ఔట్ చేశాడు. తన బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి పంజాబ్ ఆఖరి వరకు పోటీ ఇచ్చిందంటే అందుకు ప్రధాన కారణం హర్‌ప్రీత్. ఈ క్రమంలో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుత ప్రదర్శన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను సైతం ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత సెలక్టర్లు బ్రార్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలని పీటర్సన్ అన్నాడు. "ఐపీఎల్ ఎంతో మంది దేశవాళీ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. చాలా సంతోషంగా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీ20 వరల్డ్‌కప్ కోసం సెలక్టర్లు అతడి పేరును పరిశీలించాలి. ఇక విరాట్ మరోసారి తన క్లాస్‌ను చూపించడంటూ" పీటర్సన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ అనూహ్యంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది -
RCB Vs PBKS: 'డీకే' ది ఫినిషర్.. కేవలం 10 బంతుల్లోనే విధ్వంసం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఫినిషర్ అవతారమెత్తాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని ఈ వెటరన్ అందించాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ సైతం నిరాశపరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు వర్షం కురిపిస్తూ బౌలర్లను ఒత్తడిలోకి నెట్టే ప్రయత్నించాడు. పాటిదార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే పాటిదార్ ఎక్కువ సమయం పాటు కోహ్లికి సపోర్ట్‌గా నిలవకపోయాడు. హర్‌ప్రీత్ బరార్ బౌలింగ్‌లో పాటిదార్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ సైతం హర్‌ప్రీత్‌కే చిక్కాడు. మాక్స్వెల్ ఔటయ్యే సమయానికి ఆర్సీబీ స్కోర్ 12.1 ఓవర్లలో 103/3. అంటే ఆర్సీబీ విజయానికి 7.5 ఓవర్లలో 74 పరుగులు కావాలి. కొంచెం కష్టమైన టాస్క్ అయినప్పటికి కోహ్లి క్రీజులో ఉండడంతో అభిమానలు థీమాగా ఉన్నారు. కోహ్లికి తోడుగా రావత్ క్రీజులోకి వచ్చాడు. రావత్ సింగిల్స్ తీసుకుంటూ కోహ్లికి స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కోహ్లి వీలుచిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కాస్త తగ్గించాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదిన విరాట్ కోహ్లి.. ఆఖరి బంతికి ఔటయ్యాడు. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 77 పరుగులు చేసిన విరాట్ నిరాశతో మైదానాన్ని వీడాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మహిపాల్ లామ్రోర్ వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో రావత్ సైతం పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ వచ్చాడు. కార్తీక్ క్రీజులోకి వచ్చిన వెంటనే తన బ్యాట్‌కు పనిచెప్పాడు. సామ్ కుర్రాన్ వేసిన 17 ఓవర్‌ను ఫోర్ బాది కార్తీక్ ముగించాడు. ఆ తర్వాత 18 ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్ సిక్స్, ఫోరు బాది మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను ఫినిష్ చేసే బాధ్యతను కార్తీక్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా కార్తీక్ చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, సిక్స్ బాదిన డికే.. 20 ఓవర్లలో తొలి రెండు బంతులను బౌండరీలగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై ఆర్సీబీ అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. What an incredible finish by Dinesh Karthik! 🫡 DK - The finisher 🔥#RCBvsPBKS #DineshKarthik pic.twitter.com/3JzIDKKIxt — OneCricket (@OneCricketApp) March 25, 2024 -
IPL 2024: బెంగళూరు బల్లే బల్లే...
ఐపీఎల్ సీజన్ తొలి ఐదు మ్యాచ్‌లలో సొంతగడ్డపై ఆడిన జట్లే గెలిచాయి... ఆరో మ్యాచ్‌లో ఒకదశలో పరిస్థితి కాస్త భిన్నంగా అనిపించింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కాస్త తడబడింది. అయితే దినేశ్ కార్తీక్ దూకుడైన ఇన్నింగ్స్ చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీకీ కావాల్సిన విజయాన్ని అందించింది. బ్యాటింగ్ వైఫల్యంతో పంజాబ్ వెనుకబడగా... కోహ్లి అర్ధసెంచరీతో తన జట్టుకు చుక్కానిలా నిలిచాడు. బెంగళూరు: ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మలి పోరులో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి 3 ఓవర్లలో 10 పరుగులు... యశ్ దయాళ్ స్పెల్ ఇది! ఈ బౌలింగ్ వల్లే పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 40 పరుగులు కాగా... బెయిర్‌స్టో (8) పెవిలియన్ చేరాడు. అనంతరం ధావన్, ప్రభ్‌సిమ్రన్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేసి మ్యాక్స్‌వెల్ ఈ జోడీని విడదీయగా... కొద్ది సేపటికే వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్ (17), ధావన్ వెనుదిరగడం జట్టును దెబ్బ తీసింది. ఈ దశలో స్యామ్ కరన్ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే ఆరు బంతుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. జోసెఫ్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ సింగ్ (21 నాటౌట్) దూకుడుగా ఆడి 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో కింగ్స్ మెరుగ్గా ముగించగలిగింది. కోహ్లి జోరు... ఛేదనలో కరన్ వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లతో కోహ్లి జోరుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ ఓవర్ రెండో బంతికే ‘సున్నా’ వద్ద కోహ్లి ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌లో బెయిర్‌స్టో వదిలేయడం కూడా కలిసొచి్చంది. అర్‡్షదీప్ ఓవర్లో కూడా అతను 3 ఫోర్లతో ఆధిక్యం ప్రదర్శించారు. అయితే మరో ఎండ్‌లో ఏ బ్యాటర్ కూడా ప్రభావం చూపలేకపోయారు. డుప్లెసిస్ (3), గ్రీన్ (3), మ్యాక్స్‌వెల్ (3) పూర్తిగా విఫలం కాగా... చహర్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టినా... రజత్ పటిదార్ (18) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దాంతో భారం మొత్తం కోహ్లిపైనే పడింది. 31 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. 25 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే కార్తీక్, లోమ్రోర్ (17 నాటౌట్) కలిసి నాలుగు బంతుల ముందే ఆర్సీబీని గెలిపించారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (సి) కోహ్లి (బి) మ్యాక్స్‌వెల్ 45; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) సిరాజ్ 8; ప్రభ్‌సిమ్రన్ (సి) రావత్ (బి) మ్యాక్స్‌వెల్ 25; లివింగ్‌స్టోన్ (సి) రావత్ (బి) జోసెఫ్ 17; కరన్ (సి) రావత్ (బి) దయాళ్ 23; జితేశ్ (సి) రావత్ (బి) సిరాజ్ 27; శశాంక్ (నాటౌట్) 21; బ్రార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–98, 4–98, 5–150, 6–154. బౌలింగ్: సిరాజ్ 4–0–26–2, యశ్ దయాళ్ 4–0–23–1, జోసెఫ్ 4–0–43–1, గ్రీన్ 2–0–19–0, డాగర్ 3–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–29–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) బ్రార్ (బి) హర్షల్ 77; డుప్లెసిస్ (సి) కరన్ (బి) రబాడ 3; గ్రీన్ (సి) జితేశ్ (బి) రబాడ 3; పటిదార్ (బి) బ్రార్ 18; మ్యాక్స్‌వెల్ (బి) బ్రార్ 3; రావత్ (ఎల్బీ) (బి) కరన్ 11; కార్తీక్ (నాటౌట్) 28; లోమ్రోర్ (నాటౌట్) 17; ఎక్స్ట్రా లు 18; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–26, 2–43, 3–86, 4–103, 5–130, 6–130. బౌలింగ్: కరన్ 3–0–30–1, అర్‡్షదీప్ 3.2–0–40–0, రబాడ 4–0–23–2, బ్రార్ 4–0– 13–2, హర్షల్ 4–0–45–1, చహర్ 1–0–16–0. -
RCB Vs PBKS: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ బ్యాటింగ్ సందర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడు నేరుగా బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ సమయంలో కోహ్లి తన మంచి మనసును చాటుకున్నాడు. సదరు అభిమానిని పైకి లేపి బయటకు వెళ్లాలని సూచించాడు.ఆ తర్వాత కోహ్లిని హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆ అభిమాని అంతలోనే సెక్యూరిటి సిబ్బంది కూడా అక్కడికి వచ్చి అతడిని బయటకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మైదానంలోకి వచ్చిన అభిమాని పట్ల విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరును అభిమానులు కొనియాడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. A fan breached the field and touched Virat Kohli's feet. - King Kohli, an icon! ❤️pic.twitter.com/s82xq8sKhW — Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024 -
RCB Vs PBKS: సింగ్ ఈజ్ కింగ్.. సూపర్ హెలికాప్టర్ షాట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్ మరోసారి తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రభు సిమ్రాన్ కాసేపు తన బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభు సిమ్రాన్ హెలికాప్టర్ షాట్‌తో మెరిశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన కామెరాన్ గ్రీన్ నాలుగో బంతిని మిడిల్ స్టంప్ లైన్లో బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో కాస్త ఆఫ్ సైడ్ జరిగి హెలికాప్టర్ షాట్ ఆడాడు. అతడి బ్యాట్ స్పిడ్ దాటికి బంతి స్టాండ్స్‌లో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ధోనిలా ఆడాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(27), శశాంక్ సింగ్(21) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో మాక్స్వెల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, దయాల్ తలా వికెట్ సాధించారు. He Prabhsimran! Ye kya ho gaya 😵💫 What. A. Shot. #IPLonJioCinema #RCBvPBKS #TATAIPL pic.twitter.com/3bfj8NGwnq — JioCinema (@JioCinema) March 25, 2024 -
పంజాబ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ తుది జట్టు ఇదే? రూ.11 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(మార్చి 25) చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్, అల్జారీ జోషఫ్పై వేటు వేయనున్నట్లు సమాచారం. పాటిదార్ స్ధానంలో సుయాష్ ప్రభుదేసాయి, జోషఫ్ స్ధానంలో కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాడు. కాగా సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాటిదార్ డకౌట్ కాగా.. పేసర్ జోషఫ్ దారుణంగా విఫలమయ్యాడు. 3. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కరేబియన్ ఫాస్ట్ బౌలర్.. వికెట్ ఏమీ తీయకుండా 38 పరుగులిచ్చాడు. ఈ క్రమంలోనే పాటిదార్, జోషఫ్‌ను ఆర్సీబీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీవేలంలో జోషఫ్‌ను రూ.11. 50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పేసర్ యాష్ దయాల్‌ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకునే అవకాశముంది. ఆర్సీబీ తుది జట్టు(అంచనా) విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, లాకీ ఫెర్గూసన్, మయాంక్ దాగర్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్. -
అక్కడ ఉన్నది ధోని.. కొంచెం చూసి వెళ్లాలి కదా డీకే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్కే స్టార్ ఎంఎస్ ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. వికెట్ కీపింగ్‌లో మాత్రం తన క్లాస్‌ను చూపించాడు. మిస్టర్ కూల్ రెండు క్యాచ్‌లతో పాటు ఓ రనౌట్‌లో భాగమయ్యాడు. ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోయారు. మ్యాచ్‌లో చాలా వరకు ఎక్స్‌ట్రాస్ వెళ్లకుండా తన గ్లౌవ్ వర్క్‌తో అడ్డుకున్న ఎంఎస్.. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అద్భుతమైన రనౌట్ చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఆఖరిబంతికి దినేష్ కార్తీక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ఈ క్రమంలో కార్తీక్ బై రన్ కోసం పరిగెత్తమని నాన్ స్ట్రైక్‌లో ఉన్న అనుజ్ రావత్‌కు సిగ్నల్ ఇచ్చాడు. అనుజ్ రావత్ స్ట్రైకర్ ఎండ్‌వైపు వచ్చేలోపే ధోని స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో రావత్ రనౌటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది ధోని.. కొంచెం చూసి వెళ్లాలిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. THE DHONI MAGIC AT THE AGE OF 42. 🔥🤯pic.twitter.com/yRRzcqzMmi — Johns. (@CricCrazyJohns) March 22, 2024 -
IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు.. ఆర్సీబీని ముంచేశాడు!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్కే ఆటగాడు శివమ్ దూబే అదరగొట్టాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. రహానే ఔటయ్యక క్రీజులోకి వచ్చిన దూబే.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. డారిల్ మిచెల్ ఔటయ్యాక తన ఆటలో దూకుడు పెంచిన దూబే.. మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. 28 బంతులు ఎదుర్కొన్న దూబే.. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రచిన్ రవీంద్ర(37) పరుగులతో అదరగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో అనుజ్ రావత్(48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దినేష్ కార్తీక్(38 నాటౌట్), డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. Shivam Dube - the backbone of CSK middle order. 🫡pic.twitter.com/fWAXiy4Kzm — Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2024 -
అజింక్యా రహానే అద్భుత విన్యాసం.. కోహ్లికి మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు అజింక్యా రహానే అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. బౌండరీ లైన్ వద్ద రహానే ఫీల్డింగ్ విన్యాసానికి అందరూ ఆశ్చర్యపోయారు. బౌండరీ లైన్ వద్ద చాకచాక్యంగా వ్యవహరించిన రహానే.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. ఏం జరిగిందంటే ఆర్సీబీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన ముస్త్ఫిజర్ రెహ్మాన్ రెండో బంతిని కోహ్లికి షార్ట్‌పిచ్ డెలివరీగా సంధించాడు. దీంతో కోహ్లి డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటు వైపు ఫీల్డింగ్ చేస్తున్న రహానే కుడి వైపు పరుగెత్తి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. కానీ బౌండరీ రోప్ దగ్గరలో బ్యాలెన్స్ కోల్పోయిన రహానే.. సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ.. తనను ఫాలో అవుతూ స్క్వేర్ లెగ్ నుంచి పరుగెత్తుకొచ్చిన రచిన్ రవీంద్రకు బంతిని అందించాడు. క్యాచ్ రచిన్ ఖాతాలో చేరినప్పటికి.. రహానే ఎఫర్ట్‌కు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఆఖరికి విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి (20 బంతుల్లో సిక్స్‌తో 21) పరుగులు చేశాడు. Brilliant relay catch 👌 Timber strike 🎯 Mustafizur Rahman is making merry & so are @ChennaiIPL 🙌 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL | @ajinkyarahane88 pic.twitter.com/0GKADcZleM — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
అరంగేట్రంలోనే సిక్సర్ల వర్షం.. అస్సలు తగ్గేదేలే!
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర.. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రవీంద్ర ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఈ కివీ స్టార్ టార్గెట్ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో సీఎస్కే అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎస్కేకు మరో స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సీఎస్కే నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. -
IPL 2024 CSK Vs RCB: బోణీ కొట్టిన చెన్నై.. ఆర్సీబీపై ఘన విజయం
బోణీ కొట్టిన చెన్నై.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34), రవీంద్ర జడేజా(25) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కరణ్ శర్మ, దయాల్ తలా ఒక్క వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. డార్లీ మిచెల్ రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన రహానే.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 114/4. సీఎస్కే విజయానికి ఇంకా 42 బంతుల్లో 60 పరుగులు కావాలి. సీఎస్కే మూడో వికెట్ డౌన్.. అజింక్యా రహానే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన రహానే.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 109/3 రెండో వికెట్ డౌన్.. సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన కెప్టెన్ రచిన్ రవీంద్ర.. కరణ్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 7 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 71/2 తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రహానే వచ్చాడు. 4 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 38/1 చెలరేగిన రావత్, కార్తీక్.. సీఎస్కే టార్గెట్ 174 పరుగులు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 148/5 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(26 ), దినేష్ కార్తీక్(41) అదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 70 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 148/5 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/5 కష్టాల్లో పడిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను దినేష్ కార్తీక్(20), రావత్(18) చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 38 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/5 71 పరుగులకే 5 వికెట్లు.. సీఎస్కే పేసర్ ముస్తఫిజర్ రెహ్మాన్ ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అతడి దెబ్బకు ఆర్సీబీ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో ముస్తఫిజర్.. విరాట్ కోహ్లి,గ్రీన్‌లను ఔట్ చేశాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వచ్చాడు. నాలుగో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కోహ్లి.. ముస్తఫిజర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద అద్బుత క్యాచ్‌తో రహానే, రవీంద్ర కలిసి కోహ్లిని పెవిలియన్‌కు పంపారు. క్రీజులోకి అనుజ్ రావత్ వచ్చాడు. ఆర్సీబీకి బిగ్ షాక్.. వరుసగా 3 వికెట్లు ఆర్సీబీ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన ముస్తఫిజర్ రెహ్మాన్ బౌలింగ్‌లో డుప్లెసిస్, పాటిదార్ పెవిలియన్‌కు చేరగా.. ఆరో ఓవర్ వేసిన దీపక్ చాహర్ బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్వెల్ ఔటయ్యాడు. 7 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 48/3, క్రీజులో విరాట్ కోహ్లి(6), గ్రీన్(4) ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఖాతా తెరవకుండానే పాటిదార్.. రెహ్మన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్ 41 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ డుప్లెసిస్(8 ఫోర్లు) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ముస్తఫిజర్ రెహ్మాన్ బౌలింగ్‌లో రవీంద్రకు క్యాచ్ ఇచ్చి ఫాప్ ఔటయ్యాడు. క్రీజులోకి రజిత్ పాటిదార్ వచ్చాడు 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 15/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(14), విరాట్ కోహ్లి(1) ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ.. ఐపీఎల్-2024 సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ ఏడాది సీజన్లో సీఎస్కే సరికొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగింది. ఎంస్ ధోని స్ధానంలో రుత్‌రాజ్ గైక్వాడ్ చెన్నై సారథిగా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా కివీస్ స్టార్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, డార్లీ మిచిల్ సీఎస్కే తరపున ఐపీఎల్ అరంగ్రేటం చేయనున్నారు. వీరిద్దరికి తుది జట్టులో చోటు దక్కింది. వారితో పాటు భారత యువ ఆటగాడు సమీర్ రిజ్వీ సైతం ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. ఇక ఆర్సీబీ తరపున గ్రీన్, జోషఫ్ తొలిసారి ఐపీఎల్లో ఆడనున్నారు. అంతకముందు ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సహా కార్యదర్శి జై షా, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు. అదే విధంగా బాలీవుడ్ స్టార్స్ అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌లు చేస్తే అభిమానులను అలరించారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్ దేశభక్తిపాటలు పాడుతూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపారు. తుది జట్లు చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ -
IPL 2024: సూపర్ కింగ్స్‌తో బెంగళూరు తొలి పోరు.. బోణీ కొట్టేది ఎవరు?
క్రికెట్ అభిమానులు ఏంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సమరానికి సమయం అసన్నమైంది. మరో 24 గంటల్లో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుది. తొలి మ్యాచే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందనించనుంది. మార్చి 22న చెపాక్ వేదికగా జరగనున్న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు ఊవ్విళ్లరూతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దం చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్లో తిరిగులేని జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ ఏడాది సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనున్న సీఎస్కే.. ప్రత్యర్ధి జట్లను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాగా సీఎస్కే ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని. ఎటువంటి క్లిష్ట పరిస్థితులోనైనా ప్రత్యర్ధి జట్టును తన వ్యూహాలతో చిత్తు చేయడం ధోని స్పెషల్. ఇప్పటికే రికార్డు స్ధాయిలో ఐదు సార్లు సీఎస్కేను విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఆరోసారి తన జట్టుకు టైటిల్‌ను అందించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నాడు. ఇక సీఎస్కే బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దూరం కావడం సీఎస్కేను కాస్త కలవరపెట్టే విషయం అనే చెప్పుకోవాలి. గతేడాది సీఎస్కే ఛాంపియన్స్‌గా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర. కాగా కాన్వే స్ధానాన్ని మరో కివీ స్టార్ రచిన్ రవీంద్ర భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వేలంలో రవీంద్రతో పాటు డార్లీ మిచెల్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాబట్టి కాన్వే లేని లోటు వీరిద్దరిలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశముంది. రవీంద్ర, రుత్‌రాజ్ గైక్వాడ్ కలిసి చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా మిడిలార్డర్లో రహానే, దుబే వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్లో వీరిద్దరూ అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఆఖరిలో ధోని, జడేజా వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. అంతేకాకుండా శార్ధూల్ ఠాకూర్ మళ్లీ సీఎస్కేలో రావడం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం. శార్ధూల్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. కాగా ఈ ఏడాది సీజన్లో బౌలింగ్ పరంగా సీఎస్కే కాస్త వీక్‌గా కన్పిస్తోంది. గతేడాది సీజన్లో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా ఐపీఎల్-2024కు దూరమయ్యాడు. అతడు దూరం కావడం సీఎస్కే నిజంగా గట్టి ఎదురుదెబ్బే. ప్రస్తుత సీఎస్కే జట్టులో పెద్దగా అనుభవమున్న బౌలర్ ఒక్కడు కూడా కన్పించడం లేదు. ముస్తిఫిజర్ రెహ్మన్, థీక్షణ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో వారి ప్రదర్శన అంతంతమాత్రమే. కాబట్టి మరోసారి భారత యువ బౌలర్లు ముఖేష్ చౌదరి, సిమ్రాజత్ సింగ్‌పై సీఎస్కే ఆధారపడే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ.. గత 16 ఏళ్ల టైటిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ప్రతీ సీజన్లోనూ జట్టు నిండా స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా గెలిచి తమ 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ప్రతీసీజన్లానే ఈ సారి కూడా ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లతో కూడా కలకలడుతోంది. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఫాప్ డుప్లెసిస్,విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, గ్రీన్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో సిరాజ్, టోప్లీ జోషఫ్, ఫెర్గూసన్, టామ్ కుర్రాన్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే ఆర్సీబీలో మాత్రం చెప్పుకోదగ్గ స్పిన్నర్ మాత్రం లేడు. హెడ్ టూ హెడ్ రికార్డులు.. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆర్సీబీపై సీఎస్కే అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా మ్యాచ్ జరిగే చెపాక్‌లో మాత్రం ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. చెపాక్ లో చెన్నై జట్టుపై ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడితే ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచి.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. -
IPL 2024: ఆర్సీబీ ఈసారైన కప్ కొడుతుందా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవకపోయిన జట్లలో ఒకటి. ప్రతీసీజన్‌లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి బొక్కాబోర్లా పడడం ఆర్సీబీకి అలవాటుగా మారిపోయింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది. కానీ ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతీ ఏడాది 'ఈసాలా కప్ నమ్దే' అంటూ సందడి చేస్తూంటారు. తమ ఆరాద్య జట్టు ఎప్పుడు టైటిల్‌ను ముద్దాడుతుందా అని వెయ్యికళ్లుతో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2024 సీజన్‌కు సమయం అసన్నం కావడంతో అభిమానుల సందడి మొదలైపోయింది. ఆర్సీబీ కనీసం ఈసారైనా అభిమానుల కలను నెరవేరుస్తుందా? గతం ఇలా.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 2008 ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీ ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్‌కు చేరింది. కానీ మూడు సార్లు కూడా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. 2009లో తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన బెంగళూరు.. ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అనంతరం 2011 సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన ఆర్సీబీ.. చెన్నైసూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2016 సీజన్లో విరాట్ కోహ్లి సారథ్యంలో వరుస విజయాలతో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ మళ్లీ హైదరాబాద్ ఫ్రాంచైజీ చేతిలోనే పరభావం ఎదురైంది. ఆ తర్వాత 2017, 2018,19 సీజన్లలో దారుణంగా విఫలమైన ఆర్సీబీ.. వరుసగా 2020,21,22 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కొత్త కెప్టెన్ వచ్చినా అదే తీరు.. ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తమ నూతన కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ నియమించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే ఆర్సీబీనిప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. కానీ టైటిల్నుఅందించలేకపోయాడు. ఐపీఎల్-2022 సీజన్ క్వాలిఫెయర్1లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. అనంతరం 2023 సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబరిచి ఆరోస్ధానానికే పరిమితమైంది. బలాలు.. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లి, ఫాప్ డుప్లెసిస్, మాక్స్వెల్ వంటి వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు ఉన్నారు. వీరికి ఈ ఏడాది సీజన్లో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తోడవ్వడం ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం మరింత బలంగా మారింది. గ్రీన్‌కు బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉంది. గత సీజన్లో ఓపెనర్లుగా కోహ్లి, డుప్లెసిస్ అద్బుతమైన ఆరంభాలను అందించారు. ఈ సారి కూడా ఈ స్టార్ జోడీ చెలరేగితే ప్రత్యర్ధి జట్లకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ పరంగా కూడా ఆర్సీబీ బలంగా కన్పిస్తోంది. మహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ అటాకింగ్‌కు నాయకత్వం వహిస్తాడు. గతేడాది సీజన్లో సిరాజ్ అద్బుతంగా రాణించాడు. అతడితో పాటు ఈ ఏడాది సీజన్లలో కివీస్ స్పీడ్ స్టార్ లూకీ ఫెర్గూసన్, విండీస్ పేస్ బౌలర్ జోషఫ్, టామ్ కుర్రాన్ వంటి వారు కొత్తగా ఆర్సీబీలో చేరారు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమతూకుంగా కన్పిస్తోంది. బలహీనతలు.. అయితే ఆర్సీబీకి ప్రధాన బలహీనత.. బెంచ్ బలం. ఆర్సీబీ బెంచ్ స్ట్రెంగ్త్ బలంగా లేదు. బెంగళూరు ప్రతీ సీజన్లోనూ ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆధారపడుతూ వస్తోంది. పెద్దగా మార్పులు చేయరు. దానికి కారణం బెంచ్‌లో సరైన ఆటగాళ్లు లేకపోవడమే. ఈ సారి కూడా ఆర్సీబీ ఫారన్ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మనోజ్ భాండాగే, సౌరవ్ చౌహాన్ వంటి స్వదేశీ ఆటగాళ్లను ఆర్సీబీ సొంతం చేసుకున్నప్పటికీ.. వీరివ్వరికీ పెద్దగా అనుభవం లేదు. అంతేకాకుండా గత కొన్ని సీజన్లగా జట్టులో కొనసాగుతున్న అనుజ్ రావత్ కూడా పెద్దగా అకట్టుకోలేకపోయాడు. కానీ ఆర్సీబీ ఈ సారి కూడా అతడిని రీటైన్ చేసుకుంది. రావత్ ఇప్పటివరకు 19 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఫిప్టీ ప్లస్ స్కోర్లను సాధించాడు. గత సీజన్లో మరో యువ ఆటగాడు మహిపాల్ లోమ్రోర్పై కూడా ఆర్సీబీ భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ మహిపాల్ ఆర్సీబీ అంచనాలను అందుకోలేకపోయాడు. మరోయువ ఆటగాడు సుయాష్ ప్రభుదేశాయ్ పరిస్ధితి కూడా అంతంతమాత్రమే. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. తన కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడనున్న కార్తీక్ ఎలా రాణిస్తాడో అని అతృతగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో అయితే కార్తీక్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కార్తీక్‌కు మినహా సరైన వికెట్ కీపర్ కూడా ఆర్సీబీలో లేడు. ఇక ఆర్సీబీ స్పిన్ విభాగంలో పేలవంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం ఉన్న ఒక్క స్పిన్నర్ కూడా ఆర్సీబీలో లేడు. మ్యాక్సీ ఉన్నప్పటికీ పార్ట్‌టైమ్ బౌలర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇక ఐపీఎల్-2024లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, వైషక్ విజయ్‌కుమార్, మొహమ్ద్, ఆకాష్ దీప్, మొహమ్ద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్ మరియు స్వప్నిల్ సింగ్. -
WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్‌కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్‌లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మ్యాచ్‌పై ఆశలు రేపారు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్‌లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలి. -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. తేలిపోయిన గుజరాత్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ (4-0-14-2), సోఫీ మోలినెక్స్ (4-0-25-3), జార్జియా వేర్హమ్ (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. వికెట్లు తీయలేకపోయినా సోఫీ డివైన్ (4-0-12-0), ఆశా శోభన (3-0-13-0) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7), కేథరీన్ బ్రైస్ (3) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లుకు ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీ వారియర్జ్‌ను ఓడించి బోణీ కొట్టగా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన గుజరాత్ బోణీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ, ఆర్సీబీ, గుజరాత్, యూపీ వరస స్థానాల్లో ఉన్నాయి. -
వెస్టిండీస్ సంచలన బౌలర్‌కు బంపరాఫర్.. ఏకంగా ఐపీఎల్లో!?
వెస్టిండీస్ నయా పేస్ సంచలనం షమర్ జోసెఫ్.. ఐపీఎల్లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోషఫ్తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024లో వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ టామ్ కుర్రాన్ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్రాన్ ప్రత్యామ్నాయంగా జోషఫ్ తీసుకోవాలని ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. కుర్రాన్‌ను రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌కు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇక ప్రతష్టత్మక గబ్బా స్టేడియంలో జోషఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి విండీస్‌కు చారిత్రత్మక విజయం అందించాడు. జోషప్ బొటన వేలు గాయంతో బాధపడుతూనే ఆసీస్‌కు తమ సొంత గడ్డపై చుక్కలు చూపించాడు. ఈ ప్రదర్శనతో జోషఫ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడికి ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీలు నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ షమీర్తో ఒప్పందం కుదుర్చుకోగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఓ ఫ్రాంచైజీ కూడా అతడిని తమ జట్టులోకి చేర్చుకుంది. కానీ బొటన వేలి గాయం కారణంగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌కు షమర్ దూరమయ్యాడు.