ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో ప్రేక్షకులు.. కోహ్లి నామస్మరణ చేస్తూ తనను అవహేళన చేయడంపై లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్ స్పందించాడు. ఇలా చేయడం వల్ల తనలో కసి పెరిగి ఇంకా బాగా ఆడతానని ఆయన అన్నాడు. వాస్తవానికి మైదానంలో ప్రేక్షకులు ఎవరి పేరును జపించినా తాను ఆస్వాధిస్తానని, కోహ్లి పేరును జపించడం అదనపు కిక్‌ను ఇస్తుందని తెలిపాడు.
తాను బరిలో ఉన్నప్పుడు బయటి శబ్దాలపై దృష్టి పెట్టనని, నా పని నేను చేసుకుంటూ పోతానని అన్నాడు. స్టాండ్స్‌లో ప్రేక్షకులు చేసే అల్లరి తనను ప్రభావితం చేయదని, ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా నేను దాన్ని పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. ఏ క్రీడలో అయినా బాగా ఆడినప్పుడు ప్రశంసలు, తేలిపోయినప్పుడు విమర్శలు తప్పవని చెప్పుకొచ్చాడు.
Naveen Ul Haq (on 'Kohli, Kohli' chants) said, "I like that everybody in the ground is chanting his name or any player's name. I enjoy it. It gives me passion to do well for my team". pic.twitter.com/Iyqt6Ozqec
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2023
కాగా, ముంబై ఇండియన్స్‌తో నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా చిదంబరం స్టేడియంలోని ప్రేక్షకులు నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌కు వచ్చిన సమయంలో కోహ్లి నామస్మరణతో స్టేడియం మొత్తాన్ని మార్మోగించారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్‌లో నవీన్.. కోహ్లి అంశంపై స్పందించాడు.
ఇదిలా ఉంటే, ముంబైతో మ్యాచ్‌లో నవీన్ (4/34) అద్భుతంగా రాణించినప్పటికీ లక్నో జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో ఆకాశ్ మధ్వాల్ (3.3-0-5-5) ధాటికి కుదేలైన లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment