Naveen-ul-Haq
-
భారత్‌కు ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్ ఖాన్ బృందం టీ20 వరల్డ్‌కప్-2024లో సెమీస్ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే. న్యూజిలాండ్‌పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దాకా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో అఅఫ్గన్ క్రికెట్ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్‌కు తాలిబన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ ఖాన్ ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక అఫ్గన్ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్ నేతలు, అఫ్గన్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..రషీద్ ఖాన్కెప్టెన్గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ఓపెనర్గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్ ఉల్ హక్ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.ట్రవిస్ హెడ్‌ను క్లీన్»ౌల్డ్ చేసిన అతని అవుట్‌స్వింగర్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్ జడేజా (వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్ బ్రేవో (బౌలింగ్ కన్సల్టెంట్): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్ ట్రాట్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన ట్రాట్ హెడ్ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్ కొనసాగించింది. ట్రాట్ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. మహ్మద్ నబీ15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్–డివిజన్–5లో జపాన్, బోట్స్వానావంటి జట్లతో తలపడిన టీమ్ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్ కప్ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్ టీమ్ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. కల నిజమైందిసెమీస్కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్ ఖాన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్ -సాక్షి. క్రీడా విభాగం -
వారెవ్వా.. అప్పుడు ఒక్కరు లేరు.. ఇప్పుడేమో: నవీన్ పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సమష్టి ఆటతీరుతో అఫ్గానిస్తాన్ తమ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం అందుకుంది. ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ తొలిసారి ఓడించింది.గతంలో ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగు వన్డేలలో, ఒక టి20 మ్యాచ్‌లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ ఆరో ప్రయత్నంలో మాత్రం క్రికెట్ అభిమానులందరూ అబ్బురపడే ఫలితాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అఫ్గాన్ క్రికెటర్లు ఆ అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో ఆస్ట్రేలియా తొలిసారి అఫ్గానిస్తాన్ ముందు తలవంచక తప్పలేదు. అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా తద్వారా.. ప్రపంచ క్రికెట్లో ఇక నుంచి తమను చిన్న జట్టుగా ఎవరూ పరిగణించకూడదని అఫ్గానిస్తాన్ చాటి చెప్పింది. అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా తమలోనూ ఉందని... క్రమం తప్పకుండా తమతో మేటి జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే మరింత రాటుదేలుతామని అఫ్గానిస్తాన్ క్రికెటర్లు నిరూపించారు.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సూపర్‌గా ఆడారంటూ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభినందిస్తున్నారు. అంతేకాదు అఫ్గన్లోనూ అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు.ఇప్పుడు ఆహా ఓహో అంటూఈ క్రమంలో అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. క్లిష్ట సమయాల్లో తమకు అండగా రాని వాళ్లు సైతం.. ఇప్పుడు ఆహా ఓహో అంటూ ప్రశంసిస్తున్నారంటూ ఫొటో ద్వారా ఘాటుగా సెటైర్ వేశాడు నవీన్. తమను విమర్శించే వాళ్లే ఇప్పుడు ఈ విజయం కారణంగా ఆకాశానికెత్తుతున్నారంటూ చురకలు అంటించాడు. స్టేడియంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్న ఫోటోకు సపోర్టు అని.. గుంపుగా స్టేడియమంతా నిండిన అభిమానులున్న ఫొటోకు కంగ్రాట్స్ అని రాసి ఉన్న దృశ్యాలు షేర్ చేశాడు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనేఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ స్పందించింది. నవీన్ పోస్టుకు బదులిస్తూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనే’’ అంటూ మద్దతు తెలిపింది. కాగా టీ20 ప్రపంచకప్ ‘సూపర్–8’ దశలో భాగంగా మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. నవీనుల్ హక్ (3/20), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ (4/20) తమ వైవిధ్యభరిత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టారు. గతంలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాపై నెగ్గని అఫ్గానిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (49 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 51; 6 ఫోర్లు) శుభారంభం అందించారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించారు. గుర్బాజ్, ఇబ్రహీం అవుటయ్యాక వచ్చిన ఇతర అఫ్గాన్ బ్యాటర్లు మెరిపించలేకపోయారు. కమిన్స్ హ్యాట్రిక్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆసీస్ పేసర్ కమిన్స్ చివరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (2)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో తొలి రెండు బంతులకు కరీమ్ జన్నత్ (9 బంతుల్లో 13; 1 సిక్స్), గుల్బదిన్ నైబ్ (0)లను అవుట్ చేసి ఈ టోర్నీలో రెండో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు.నవీనుల్, గుల్బదిన్ సూపర్ బౌలింగ్ కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నవీనుల్ హక్ అద్భుత బంతికి ఓపెనర్ ట్రవిస్ హెడ్ (0) బౌల్డయ్యాడు. ఆ తర్వాత నవీనుల్ తన రెండో ఓవర్లో కెపె్టన్ మిచెల్ మార్ష్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వార్నర్ (3)ను నబీ పెవిలియన్‌కు పంపించడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.ఈ దశలో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ (17 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే గుల్బదిన్ వైవిధ్యభరిత బంతులతో ముందుగా స్టొయినిస్‌ను, ఆ తర్వాత టిమ్ డేవిడ్‌ను అవుట్ చేశాడు. అనంతరం ప్రమాదకరంగా మారిన మ్యాక్స్‌వెల్‌ను కూడా గుల్బదిన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు.దీంతో ఆసీస్ 108 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు సాగింది. కమిన్స్ ఏమైనా అద్భుతం చేస్తాడా అని ఆశించినా అతడిని గుల్బదిన్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా పరాజయం ఖాయమైంది. చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్‌లో విరాట్ 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాదిన ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్‌ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
T20 WC: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్
వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో అఫ్గన్ జట్టు వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-సిలో ఉంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన రషీద్ ఖాన్ బృందం.. గ్రూప్ దశలో మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడో గెలుపు నమోదు చేసి ఆరు పాయింట్ల(నెట్ రన్‌రేటు +4.230)తో గ్రూప్-సి టాపర్‌గా నిలిచింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫజల్హక్ ఫరూకీ(3/16), నవీన్ ఉల్ హక్(2/4), నూర్ అహ్మద్(1/14) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి సత్తా చాటారు. తేలికగా తలవంచని ప్రత్యర్థిఈ క్రమంలో 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసిన పీఎన్జీ జట్టు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ ముందు అంత తేలికగా తలవంచలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గులాబిదిన్ నయీబ్(36 బంతుల్లో 49 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, మహ్మద్ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్) ఆచితూచి ఆడారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఫలితంగా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసిన అఫ్గన్ జయభేరి మోగించింది. తద్వారా సూపర్-8 దశకు అర్హత కూడా సాధించింది. ఇక ఇప్పటికే వెస్టిండీస్ గ్రూప్-సి నుంచి సూపర్-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్ అయింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్
షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్ ఇషాక్ (27), సెదీఖుల్లా అటల్ (19), ఇజాజ్ అహ్మద్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, కర్టిస్ క్యాంపర్, డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్.. 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-9-4), నవీన్ ఉల్ హక్ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ, రషీద్ ఖాన్, ఖరోటే తలో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ (28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాత్ డెలానీ (21), హ్యారీ టెక్టార్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఐర్లాండ్ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్‌పై నిషేధం
గుజరాత్ టైటాన్స్ బౌలర్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్‌పై ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) మేనేజ్మెంట్ నిషేధం విధించింది. షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ నూర్‌పై 12 నెలల నిషేధం విధిస్తున్నట్లు ILT20 యాజమాన్యం ప్రకటించింది. నూర్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నూర్‌పై నిషేధం విధించింది. నూర్ ఇంటర్నేషనల్ లీగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు మొగ్గు చూపాడు. ILT20 క్రమశిక్షణా ఉల్లంఘణ కమిటీ తొలుత నూర్‌పై 20 నెలల నిషేధం విధించింది. అయితే ఒప్పందంపై సంతకం చేసే సమయానికి నూర్ మైనర్ కావడంతో అతని నిషేధ కాలాన్ని ఎనిమిది నెలలు తగ్గించి 12 నెలలకు కుదించారు. ఇంటర్నేషనల్ లీగ్ యాజమాన్యం కొద్ది నెలల క్రితం నూర్ సహచరుడు, ఆఫ్ఘనిస్తాన్ వివదాస్పద బౌలర్ నవీన్ ఉల్ హాక్‌పై కూడా నిషేధం విధించింది. అతను కూడా నూర్ లాగే కాంట్రాక్ట్ పొడిగింపు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. 19 ఏళ్ల నూర్.. 2023 ILT20 సీజన్లో వారియర్స్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ నూర్‌తో 2023 సీజన్‌కు ముందు 30 లక్షల బేస్ ధరకు ఒప్పందం కుదుర్చుకుంది. నూర్ 2023 ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. -
టీ20లలో కోహ్లి ప్రపంచ రికార్డు.. ఏకైక బ్యాటర్‌గా ఘనత
అంతర్జాతీయ టీ20 పునరాగమనం సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లి ఏడాదికి పైగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో... టీ20 వరల్డ్ కప్-2024కు ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండో టీ20 సందర్భంగా బరిలోకి దిగాడు. 16 బంతుల్లో 29 కాగా.. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. పర్యాటక అఫ్గనిస్తాన్ జట్టును 172 పరుగులకు ఆలౌట్ చేసింది. లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్(68), శివం దూబే(63- నాటౌట్) దంచి కొట్టగా.. కోహ్లి సైతం దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 29 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏకైక క్రికెటర్‌గా.. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ టీ20 ఛేజింగ్ మ్యాచ్‌లలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి. తద్వారా ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లోనూ ఈ రికార్డుల రారాజే ఇక వన్డేల్లోనూ సెకండ్ బ్యాటింగ్‌లో ఈ రికార్డుల రారాజే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఛేజింగ్‌లో 152 ఇన్నింగ్స్ ఆడి 7794 రన్స్ పూర్తి చేసుకున్నాడు కోహ్లి. ఇందులో 27 సెంచరీలు, నలభై ఫిఫ్టీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అన్నట్లు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. పేసర్ నవీన్ ఉల్ హక్కు వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. -
ఐపీఎల్: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అఫ్గానిస్తాన్ త్రయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్లకు ఊరట లభించింది. ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గోనేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరుతులతో కూడిన నో-అబ్జెక్షన్స్ సర్టిఫికేట్లను (NOC) మంజూరు చేసింది. కాగా గత నెలలలో జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ ముగ్గరిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ కొన్ని ఆంక్షలు విధించింది. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు వీరి ముగ్గురు అంగీకరించడంతో అఫ్గాన్ క్రికెట్ తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంది. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అదే విధంగా ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. వీరిద్దరితో పాటు ఐపీఎల్-2024 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. చదవండి: T20 WC:రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ! -
టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్‌కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్‌గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్‌ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్‌కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ! -
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్‌పై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పై దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్‌లో భాగమైన షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్‌పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నవీన్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్‌పై నిషేధం విధించింది. నవీన్ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్‌కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్ మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. నవీన్.. 2023 సీజన్లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో నవీన్ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్ ఐదో స్థానంతో గత సీజన్‌ను ముగించింది. ఈ సీజన్లో వారు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. -
WC: అప్పుడు స్మిత్.. ఇప్పుడు నవీన్! కోహ్లి చర్య వైరల్.. గంభీర్ ప్రశంసలు
ICC WC 2023- Kohli- Naveen: ఒక ఆటగాడికి మద్దతుగా నిలవలేనపుడు.. అతడిని విమర్శించే హక్కు కూడా ఎవరికీ ఉండదని గౌతం గంభీర్ అన్నాడు. అభిమాన క్రికెటర్‌ను ఉత్సాహపరచడంలో తప్పులేదని.. అయితే, అది ఇతరులను హేళన చేసే విధంగా ఉండకూడదని హితవు పలికాడు. ఏదేమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ పట్ల వ్యవహరించిన తీరు గొప్పగా ఉందని గంభీర్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి, అఫ్గాన్ పేసర్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. గంభీర్ జోక్యంతో ఈ క్రమంలో లక్నో మెంటార్ గంభీర్ సైతం నవీన్‌కు మద్దతుగా మైదానంలోకి రావడంతో వివాదానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడించింది. ఈ ఘటన తర్వాత నవీన్ ఎక్కడ, ఏ మ్యాచ్‌లో కనిపించినా ప్రేక్షకులు కోహ్లి, కోహ్లి అంటూ ఆట పట్టిస్తూ వచ్చారు. కోహ్లి నామస్మరణతో నవీన్‌ను ట్రోల్ చేశారు. స్వయంగా రంగంలోకి దిగిన కోహ్లి.. నవీన్‌తో చేతులు కలిపి ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా కోహ్లి సొంతమైదానం అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం కూడా ఇదే పునరావృతమైంది. అయితే ‘ఢిల్లీ బాయ్’ కోహ్లి మళ్లీ స్వయంగా అభిమానులను నిలువరించాడు. ఇలా చేయవద్దంటూ సున్నితంగా వాళ్లకు నచ్చజెప్పాడు. అంతేకాదు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో నవీన్‌తో చేతులు కలపగా ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ ‘థమ్సప్’ సంకేతం చూపించడం హైలైట్‌గా నిలిచింది. తాజా ఘటనతో నాటి వివాదానికి తెర పడినట్లయింది. మరోసారి కోహ్లి గుర్తుచేశాడు ఈ విషయంపై స్పందించిన గౌతం గంభీర్.. ‘‘కోహ్లి చేసిన పని ఎంతో గొప్పగా అనిపించింది. ఇక ఇప్పటి నుంచి రానున్న మ్యాచ్‌లలో ఎవరూ ఇలా చేయరనే అనుకుంటున్నా. దేశం కోసం ఆడే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కేందుకు ఆటగాడు ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో.. ఎన్ని కఠిన సవాళ్లు అధిగమిస్తే ఈ స్థాయికి చేరుకుంటారో కోహ్లి మరోసారి అందరికీ గుర్తుచేశాడు. వాళ్లు మన అతిథులు.. హుందాగా వ్యవహరించాలి ఒకరికి అండగా నిలవలేనపుడు.. వాళ్లను విమర్శించే హక్కు కూడా మనకు ఉండదు. నిజానికి ఢిల్లీలో ప్రేక్షకులు కాస్త హుందాగా వ్యవహరించాల్సింది. ఇప్పుడు మనం వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాం. ఇలాంటి సమయంలో పర్యాటక జట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లేపుడు మధుర జ్ఞాపకాలు తీసుకువెళ్లేలా చూడాలేగానీ ఇలాంటివి చేయకూడదు’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఇక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో నవీన్ బౌలింగ్‌లో 10 బంతులు ఆడిన కోహ్లి 3 సింగిల్స్ తీశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన అఫ్గన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయం సాధించింది. కోహ్లి అంటే కోహ్లినే... కాగా గత వరల్డ్ కప్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా స్టీవ్ స్మిత్‌ను ప్రేక్షకులు ‘చీటర్’ అంటూ గేళి చేశారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని వారించడంతో పాటు స్మిత్ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా నవీన్ విషయంలోనూ హుందాగా వ్యవహరించి మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. చదవండి: CWC 2023: అఫ్ఘనిస్తాన్‌పై గెలుపు అనంతరం రోహిత్ శర్మ ఏమన్నాడంటే..? View this post on Instagram A post shared by ICC (@icc) -
కలిసిపోయిన విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హక్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(54 బంతుల్లో 131) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కలిసిపోయిన విరాట్ కోహ్లి-నవీన్ ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆఫ్గానిస్తాన్ పేసర్ నవీన్-ఉల్-హక్ కలిసిపోయారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకుని తమ మధ్య ఉన్న వైరానికి ఫుల్స్టాప్ పెట్టారు. కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్కు కోహ్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ అభిమానులు నవీన్ ఎక్కడ కన్పించిన కోహ్లి కోహ్లి అంటూ అరుస్తూ అతడిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కూడా 'కోహ్లీ కోహ్లి' నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, నవీన్‌కు మధ్య మంచి పోటీ ఉంటుందని అంతా భావించారు. కోహ్లి కూడా నవీన్‌ను టార్గెట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అదేమి జరగలేదు. అందరి ఊహలను తలకిందలు చేస్తూ ఇద్దరూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించారు. ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లే మా కింగ్ కోహ్లితో అట్లుంటది కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WC 2023 IND Vs AFG: రోహిత్ శర్మ ఊచకోత.. ఆఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్ #INDvsAFG #ViratKohli𓃵 #CricketTwitter So it's finally over 🫂 naveen vs kohli pic.twitter.com/EUC96FjWbk — movie enthusiast (@OKAYCHILL07) October 11, 2023 Virat Kohli 🤝 Naveen Ul Haq. This is why cricket is more than a game. pic.twitter.com/5n3QQevYXy — Johns. (@CricCrazyJohns) October 11, 2023 -
CWC 2023: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. అందరి కళ్లు అతనిపైనే..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సొంత మైదానం అయిన న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ (అక్టోబర్ 11) భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. ఐపీఎల్ 2023లో విరాట్-నవీన్‌ల మధ్య గొడవ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఏమేరకు రియాక్ట్ అవుతారోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. విరాట్ సొంత మైదానం కావడంతో ప్రేక్షకులు నవీన్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించవచ్చేమో అని జనాలు అనుకుంటున్నారు. నవీన్ ఉల్ హక్ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో సైతం ట్రెండింగ్‌లో ఉంది. మరి ఢిల్లీ ప్రేక్షకులు నవీన్ పట్ల ఏరకంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హక్ మధ్య 2023 ఐపీఎల్ సందర్భంగా గొడవ జరిగిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా జరిగిన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానలా మారి, నవీన్ ఎక్కడికి వెళ్లినా నీడలా వెంటాడుతుంది. ఈ గొడవకు కారకులెవరు అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా నవీన్ ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా కోహ్లి అభిమానులు అతని టార్గెట్ చేస్తున్నారు. నవీన్ కనిపిస్తే చాలు కోహ్లి, కోహ్లి అంటూ కేకలు పెడుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కోహ్లి అభిమానుల టార్చర్ తట్టుకోలేక నవీన్ తన సోషల్‌మీడియా ఖాతాల కామెంట్ల సెక్షన్‌ను డిసేబుల్ చేశాడు. కోహ్లి ఫ్యాన్స్ నవీన్‌ను నిద్రలో కూడా వెంటాడుతున్నారు. కోహ్లి ఫ్యాన్స్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నవీన్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటివ్వదని అంతా అనుకున్నారు. అయినా ఆ దేశ బోర్డు సాహసం చేసి నవీన్‌ను ఇండియాకు పంపింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించగా.. ఆఫ్ఘన్లు తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడారు. -
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన నవీన్ 2021లో తన చివరి వన్డే ఆడాడు. కెరీర్లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) నవీన్ తన వన్డే కెరీర్లో 14 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. నవీన్ ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2023లో కోహ్లితో గొడవతో నవీన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్ ఫ్రాంచైజీ క్రికెట్ కోసం తన అంతర్జాతీయ కెరీర్‌ను వదులుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమ రెండో వరల్డ్‌కప్ ఆడేందుకు నిన్ననే భారత్‌కు వచ్చింది. వార్మప్ గేమ్ కోసం ఆఫ్ఘన్ క్రికెటర్లు త్రివేండ్రంలో ల్యాండయ్యారు. తమ తొలి వరల్డ్‌కప్‌లో (2019) లీగ్ స్టేజ్ దాటలేని ఆఫ్ఘన్ టీమ్ ఈసారి అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి సంచలనాలు క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఆఫ్ఘన్ జట్టులో నవీన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ. రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వీరితో ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచనాలు సృష్టించే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో వారు బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీని ముందు వారు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. సెప్టెంబర్ 29న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 3న శ్రీలంకతో ఆఫ్ఘన్లు తలపడతారు. -
నువ్వస్సలు మారొద్దు: గంభీర్ పోస్ట్ వైరల్.. సెటైర్లతో కోహ్లి ఫ్యాన్స్ కౌంటర్
There are very few like you, never change: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను విరాట్ కోహ్లి అభిమానులు మరోసారి టార్గెట్ చేశారు. మీ ఎక్స్ట్రాలన్నింటికి ఢిల్లీలో మా కింగ్ బ్యాట్‌తోనే సమాధానమిస్తాడంటూ చురకలు అంటిస్తున్నారు. మీ స్టాండ్ అస్సలు మారొద్దు.. అలాగే ఉండాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023లో లక్నోలో ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ లక్నో బౌలర్‌కు మద్దతుగా ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. గంభీర్ జోక్యంతో ముదిరిన గొడవ కోహ్లితో గొడవపడుతున్న నవీన్‌ను సమర్థించేలా మాట్లాడటంతో కోహ్లి కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. భారత మాజీలు సహా మిగతా క్రికెటర్లు సైతం ఈ విషయంలో గంభీర్‌ను తప్పుబట్టారు. మైదానంలో ఆటగాళ్లు మాటా మాటా అనుకోవడం సహజమేనని.. అంతమాత్రాన కోచ్ స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా మధ్యలో దూరిపోకూడదని విమర్శించారు. అయితే, నవీన్ కోహ్లితో గొడవను అక్కడితో ముగించలేదు. మ్యాంగోస్ పోస్టులతో కోహ్లి, కోహ్లి ఫ్యాన్స్ కవ్వించగా.. అదే స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. నువ్విలాగే ఉండాలి.. మారొద్దు ఇదిలా ఉంటే.. నవీన్ ఈరోజు(సెప్టెంబరు 23) ఇరవై నాలుగవ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా గంభీర్ సోషల్ మీడియా వేదికగా అతడికి విషెస్ తెలియజేశాడు. ‘‘హ్యాపీ బర్త్‌డే నవీన్.. అతి కొద్ది మంది మాత్రమే నీలా ఉండగలుగుతారు. నువ్విలాగే ఉండాలి. ఎప్పటికీ మారొద్దు’’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఢిల్లీలో టీమిండియాతో మ్యాచ్ ఈ పోస్ట్‌పై కోహ్లి ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పైవిధంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నవీన్ ఉల్ హక్‌ను అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023కి ఎంపిక చేశారు అఫ్గనిస్తాన్ సెలక్టర్లు. ఈ క్రమంలో అక్టోబరు 11న టీమిండియాతో ఢిల్లీలో అఫ్గనిస్తాన్ జట్టు తలపడనుంది. కోహ్లి హోం గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగనుండటంతో నవీన్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడేస్తాడంటూ ఫ్యాన్స్ గంభీర్ పోస్టుకు బదులిస్తున్నారు. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! View this post on Instagram A post shared by Gautam Gambhir (@gautamgambhir55) -
వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. నవీన్ ఉల్ హాక్కు చోటు
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఇవాళ (సెప్టెంబర్ 13) ప్రకటించింది. ఈ జట్టుకు హస్మతుల్లా షాహీది నాయకత్వం వహించనుండగా.. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హాక్, నూర్ అహ్మద్ లాంటి స్టార్ ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘన్ సెలెక్టర్లు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్లు వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉండనున్నారు. రెగ్యులర్ సభ్యుల్లో ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానంలో వీరు జట్టులో చేరతారు. రీఎంట్రీ ఇచ్చిన నవీన్ ఉల్ హాక్.. గత ఐపీఎల్లో విరాట్ కోహ్లితో గొడవ కారణంగా భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో విలన్లా మారిపోయిన నవీన్ ఉల్ హాక్‌ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023 కోసం ప్రకటించిన జట్టుకు నవీన్‌ను ఎంపిక చేయకపోవడంతో, భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో కూడా అతనికి ఛాన్స్ ఉండదని అంతా అనుకున్నారు. అయితే, ఆఫ్ఘన్ సెలెక్టర్లు నవీన్‌కు భారత్‌లో ఆడిన అనుభవం ఉండటాన్ని పరిగణలోకి అతనికి జట్టులో చోటు ఇచ్చారు. కాగా, కోహ్లితో ఉన్న విభేదాల కారణంగా నవీన్‌ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు పక్కకు పెడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హస్మతుల్లా షాహీది (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్ హాక్ ఫారూఖీ రిజర్వ్ ప్లేయర్లు.. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్ -
నవీన్‌కు గట్టి షాక్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! అయ్యో పాపం..
Naveen ul Haq’s Cryptic Post: ఆసియా కప్-2023 నేపథ్యంలో యువ పేసర్ నవీన్ ఉల్ హక్కు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు గట్టి షాకిచ్చింది. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో అతడిని పక్కనపెట్టి మెగా టోర్నీలో అవకాశం లేదని సంకేతాలు ఇచ్చిన మేనేజ్మెంట్.. ఇప్పుడు ఆ మాటను నిజం చేసింది. వన్డే ఈవెంట్లోకు ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో నవీన్‌కు స్థానం ఇవ్వలేదు. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభిమానులు నవీన్ ఉల్ హక్‌ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అయ్యో పాపం నవీన్..! మరేం పర్లేదు నీకు మంచే జరిగింది. ఒకవేళ ఆసియా కప్‌లో గనుక ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో నీకు చోటు దక్కి ఉంటే కచ్చితంగా కోహ్లి బ్యాటింగ్ విధ్వంసానికి బలైపోయేవాడివి. ఈసారి తప్పించుకున్నావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మేరకు కామెంట్లు, మీమ్స్‌తో ఈ అఫ్గన్ ఫాస్ట్ బౌలర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ జట్టు ప్రకటన నేపథ్యంలో నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టా పోస్ట్ సైతం నెట్టింట వైరల్‌గా మారింది. బాగా హర్ట్ అయ్యాడు ‘‘చీకటిని చూసేందుకు నీ కళ్లు ఎంతగా అలవాటు పడిపోయినా పర్లేదు. అయితే, వెలుగును చూసేందుకే ఇలా చేస్తున్నాయని మాత్రం నువ్వు అనుకుంటే అది పొరపాటే’’ అని నవీన్ ఉల్ హక్ పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ సెలక్టర్లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే తాను హర్ట్ అయినట్లు చెప్పాడు. దీంతో అతడి అభిమానులు.. ‘‘బాధపడకు భాయ్.. మనకంటూ తప్పక ఓ రోజు వస్తుంది’’ అని అండగా నిలుస్తున్నారు. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ మాత్రం.. ‘‘అయ్యో పాపం’’ అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన నవీన్ ఉల్ హక్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రన్‌మెషీన్ కోహ్లితో వాగ్వాదానికి దిగాడు. గంభీర్ ఎంట్రీతో ముదిరిన వివాదం వీరిద్దమరి మధ్య జరిగిన గొడవలో అప్పటి లక్నో మెంటార్ గౌతం గంభీర్ కూడా జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఈ నేపథ్యంలో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలం కావడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి నవీన్.. ‘‘తియ్యటి మామిడి పండ్లు’’ అంటూ చేసిన పోస్ట్ కింగ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఇక నవీన్ దురుసు ప్రవర్తనకు కోహ్లి కూడా నర్భగర్భంగానే ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా వన్డే కప్ ఆరంభం కానుంది. భారత్, పాకిస్తాన్, నేపాల్.. శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ టోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఆ తర్వాత అఫ్గన్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా కాగా 2016లో బంగ్లాదేశ్‌తో వన్డే సందర్భంగా నవీన్ ఉల్ హక్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. రెండేళ్ల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. అఫ్గనిస్తాన్ తరఫున ఇప్పటి వరకు ఈ 23 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ 7 వన్డేలు, 27 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 14, 34 వికెట్లు పడగొట్టాడు. కోహ్లితో వివాదం తర్వాత అంటే ఐపీఎల్-2023 ముగిసిన తర్వాత అఫ్గన్ తరఫున నవీన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం. ఆసియా కప్-2023: అఫ్గనిస్తాన్ జట్టు హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
ఆసియాకప్‌కు ఆఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
ఆసియాకప్-2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. అదే విధంగా గాయం కారణంగా పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ఆటగాళ్లు షరాఫుద్దీన్ అష్రఫ్, నజీబుల్లా జద్రాన్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్‌పై ఆఫ్గాన్ సెలక్టర్లు మరోసారి వేటు వేశారు. అతడి ఆసియాకప్ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ,కరీం జనత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లుపాల్గొనబోతున్నాయి. పాకిస్తాన్, నేపాల్, భారత్ జట్లు గ్రూపు-ఏ లో ఉండగా.. ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గ్రూపు-బిలో ఉన్నాయి. కాగా నేపాల్ జట్టు తొలిసారి ఆసియాకప్ అర్హత సాధించింది. పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్.. ఇక ఆసియాకప్ సన్నాహాకాల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఫ్గాన్ ఓటమి పాలైంది. శ్రీలంక వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో 3-0 తేడాతో ఆఫ్గాన్‌ను పాక్ వైట్ వాష్ చేసింది. అయితే సిరీస్ ఆఫ్గాన్ కోల్పోయనప్పటికీ.. కొంత మంది ఆటగాళ్లు మాత్రం తమ వ్యక్తిగత ప్రదర్శనలతో అకట్టుకున్నారు. ఇక ఆసియాకప్‌లో ఆఫ్గాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 3న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆసియాకప్‌కు ఆఫ్గాన్ జట్టు హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, రియాజ్ హసన్, ఇక్రమ్ అలీ ఖిల్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, అబ్దుల్ రెహమాన్, రషీద్ ఖాన్, షరఫుద్దీన్ ఉర్ రహ్ అష్రఫ్, సులిమాన్ సఫీ, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్ చదవండి: #Neeraj Chopra:13 ఏళ్ల వయస్సులోనే ఎన్నో అవమానాలు.. అయినా వరల్డ్ ఛాంపియన్! నీరజ్ 'బంగారు' కథ -
పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే!
గడ్డి నీలంగా ఉందని గాడిద.. పులితో చెప్పింది! లేదు లేదు.. గడ్డి పచ్చగా ఉంది.. పులి జవాబు.. రెండిటి మధ్య మాటా మాటా పెరిగింది.. దీంతో గాడిద, పులి కలిసి అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్లాయి. అపుడు.. గాడిద గట్టిగా అరవడం మొదలుపెట్టింది.. మహారాజా గడ్డి నీలం రంగులోనే ఉంది. అవును.. నిజమే గడ్డి నీలంగానే ఉంది.. సింహం బదులిచ్చింది. గాడిదకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. కానీ పులి మాత్రం వెనక్కి తగ్గలేదు. గడ్డి పచ్చగానే ఉందనే వాదనకు దిగింది. గాడిదను శిక్షించమని సింహాన్ని కోరింది. కానీ.. సింహం అనూహ్య ప్రకటన చేసింది. పులిని శిక్షించాల్సిందిగా ఆదేశించింది. వాదోపవాదాల అనంతరం ఐదేళ్ల పాటు మౌనంగా ఉండాలని పులిని సింహం ఆదేశించడంతో గాడిద ఆనందంగా గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. పులి.. సింహం వేసిన శిక్షను ఆమోదించింది. అయితే, అంతకంటే ముందు.. ‘‘మహారాజా.. గడ్డి పచ్చగానే ఉంటుంది కదా!’’ అని సింహాన్ని అడిగింది. అవునని సింహం బదులిచ్చింది. మరి మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు అని అడిగింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు గడ్డితో నీకేం పని? అది పచ్చగా ఉందా? నీలంగా ఉందా? అన్న విషయం నీకెందుకు? నీలాంటి తెలివైన జంతువులు అసలు ఈ విషయాల గురించి పట్టించుకోవడమే తప్పు. అలాంటిది నా దగ్గరకు వచ్చి నా సమయం కూడా వృథా చేశావు. అందుకే నీకు శిక్ష విధించాను’’ అని పులి సందేహాన్ని తీర్చింది. ఇందులో నీతి ఏమిటంటే.. టైమ్‌ను ఎంత చెత్తగా వేస్ట్ చేస్తామో తెలుసుకోవడం! నిజాన్ని అంగీకరించని మూర్ఖులతో ఏళ్లకు ఏళ్లు వాదించినా ప్రయోజనం ఉండదు. ఇది తప్పు.. ఇది ఒప్పు అని వాళ్లకు ఎన్ని సాక్ష్యాలు చూపించినా వారి వారి ఊహాగానాలు, ఏకపక్ష అభిప్రాయాలు మారవు. అసలు మనం చెప్పే విషయాలను అర్థం చేసుకునే స్థాయి వాళ్లకు ఉండదు. అహంకారంతో వాళ్ల కళ్లు మూసుకుపోతాయి. తాము చెప్పింది, చేసిందే సరైందనే ఈగోతో ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడి సమయం వృథా చేయడం వేస్ట్!! అఫ్గనిస్తాన్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్-ఉల్-హక్ ఇన్‌స్టాలో పంచుకున్న వీడియోలో ఉన్న నీతికథ ఇది. కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా నవీన్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో గొడవకు దిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా చెలరేగిన భావోద్వేగాలను అదుపుచేసుకోలేని ఈ యువ ఆటగాడు.. ఆట అయిపోయిన తర్వాత ఇరు జట్లు పరస్పరం కరచాలనం చేసుకునే కోహ్లి ఏదో అనగానే అతడి చేతిని విసిరికొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారి తీయగా.. లక్నో మెంటార్ గౌతం గంభీర్ జోక్యంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో మైదానాన్ని వీడిన తర్వాత కోహ్లి, నవీన్ ఒకరినొకరు ఉద్దేశిస్తూ నర్మగర్భ పోస్టులతో సోషల్ మీడియా వార్‌కు తెరతీశారు. ఈ నేపథ్యంలో కోహ్లిని కించపరిచే విధంగా వ్యవహరించాడంటూ నవీన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు కింగ్ కోహ్లి ఫ్యాన్స్. ఎక్కడ మ్యాచ్ జరిగినా కోహ్లి నామస్మరణతో అతడిని టీజ్ చేశారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో నవీన్ మాట్లాడుతూ.. కోహ్లినే గొడవ మొదలుపెట్టాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత నవీన్‌పై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రిప్టిక్ పోస్ట్‌తో ముందుకు వచ్చాడు నవీన్ ఉల్ హక్. ఇది కోహ్లి ఫ్యాన్స్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, కింగ్ అభిమానులు ఈ వీడియోపై కూడా తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అవును నువ్వు గాడిదవే! నీతో వాదించడం మా కింగ్ తప్పే. అయినా ఇక్కడ మా స్టార్ పులిలాంటి వాడు కాదు.. సింహం లాంటోడు.. ఆ సింహం అడవికి రాజైతే.. మా కోహ్లి రికార్డుల రారాజు. అది గుర్తుపెట్టుకో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందుకు నవీన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!! చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు.. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
కోహ్లి మీద అసూయతోనే గంభీర్ అలా చేశాడు: పాక్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి- లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. విరాట్‌పై అసూయతోనే గౌతీ వాగ్వాదానికి దిగినట్లు అనిపించిందన్నాడు. ఏదేమైనా ఓ క్రికెటర్‌గా ఇలా ఇద్దరు ఆటగాళ్లు మైదానంలోనే తగువు దిగడం తనను బాధించిందన్నాడు. కాగా లక్నో వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్- ఉల్- హక్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ నవీన్ కోహ్లితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో గొడవ పెద్దది కాగా గౌతం గంభీర్ జోక్యం చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి- నవీన్ గొడవ.. కోహ్లి- గంభీర్ మధ్య అగ్గిరాజేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాట్‌కు మద్దతునివ్వగా.. మరికొందరు గౌతీకి అండగా నిలిచారు. ఈ క్రమంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన అహ్మద్ షెహజాద్.. గౌతీ కావాలనే గొడవకు దిగినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ‘‘ఓ ప్రేక్షకుడిగా, ఆటగాడిగా.. ఆ దృశ్యాలు నన్ను కలచివేశాయి. నాకైతే.. కోహ్లి మీద అసూయతోనే గౌతం గంభీర్ గొడవ పెద్దది చేశాడనిపించింది. ఎన్నో రోజులుగా సమయం కోసం వేచి చూసి మరీ వివాదానికి తెరలేపినట్లు... విరాట్‌ను వివాదంలోకి లాగేందుకు వాగ్వాదానికి దిగాడేమో అన్నట్లు అనిపించింది. అయినా, ఆటగాళ్ల మధ్య గంభీర్ తలదూర్చాల్సిన అవసరం ఏమిటో నాకింకా అర్థం కాలేదు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని.. ఇందులో కోహ్లి తప్పేం లేదని టీమిండియా స్టార్‌ను సమర్థించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో తలపడిన తొలి సందర్భంలో సొంతగడ్డపై ఆర్సీబీని లక్నో ఓడించగా.. రెండోసారి పోరులో ఆర్సీబీ..లక్నోను చిత్తు చేసింది. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. లక్నో టాప్-4లో నిలిచింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో భారీ తేడాతో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని! -
కోహ్లినే గొడవ ప్రారంభించాడు.. నా తప్పేం లేదు: నవీన్ ఉల్ హక్
ఐపీఎల్-2023లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ జోక్యం చేసుకోవడంతో మరింత పెద్దదైంది. ఇక ఈ విషయాన్ని కోహ్లి అక్కడితోనే విడిచి పెట్టగా.. నవీన్ మాత్రం సోషల్ మీడియాలో విరాట్‌నే టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లి అభిమానులు ఓ ఆట ఆడేసుకున్నారు. అతడు ఎక్కడ కనిపించిన కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా అరుస్తూ చుక్కలు చూపించారు. ఇక ఈ వివాదంపై నవీన్ ఉల్ హక్ తాజాగా స్పందించాడు. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ సంచలన వాఖ్యలు చేశాడు. ' మ్యాచ్ సమయంలో విరాట్ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ గొడవను ప్రారంభించలేదు. మ్యాచ్ అనంతరం మేం షేక్‌హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కోహ్లి మళ్లీ గొడవను ప్రారంభించాడు. మాపై పడిన ఫైన్లు చూస్తే మీకు చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరినీ స్లెడ్జ్ చేయను. ఒక వేళ చేయాలనుకున్న నేను బౌలర్‌ను కాబట్టి బ్యాటర్లకు మాత్రమే చేస్తా. ఆ మ్యాచ్‌లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఎవరినీ స్లెడ్జ్ చేయలేదు. నేను పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ఆటగాళ్లకు తెలుసు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గానీ మ్యాచ్ తర్వాత గానీ సహనం కోల్పోలేదు. అక్కడ నా తప్పులేదని అందరికీ తెలుసు. నేనే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కోహ్లినే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నేను కూడా మనిషినే కదా రియాక్ట్ అవ్వక తప్పలేదు' అని చెప్పాడు. చదవండి: Ashes 2023: విచిత్రకర రీతిలో ఔటైన హ్యరీ బ్రూక్.. అస్సలు ఊహించుండడు! వీడియో వైరల్ -
T20 Blast: నవీన్ ఉల్ హక్‌ను చెడుగుడు ఆడుకున్న అనామక బ్యాటర్లు
ఐపీఎల్-2023లో ఓవరాక్షన్ చేసి (కోహ్లితో వివాదం) వార్తల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌ను ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అనామక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ను నిన్న (జూన్ 1) జరిగిన మ్యాచ్‌లో డెర్బిషైర్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన నవీన్.. ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. నవీన్‌ను ముఖ్యంగా సెంచరీ హీరో వేన్ మ్యాడ్సన్ (61 బంతుల్లో 109 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉతికి ఆరేశాడు. ఎడాపెడా బౌండరీలు బాది నవీన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మ్యాడ్సన్తో పాటు థామస్ వుడ్ (24 బంతుల్లో 37; 7 ఫోర్లు), బ్రూక్ గెస్ట్ (20 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లీసెస్టర్‌షైర్ బౌలరల్లో నవీన్‌తో పాటు ముల్దర్ (3-0-34-0), విల్ డేవిస్ (3-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. పార్కిన్సన్ (2/36), రెహాన్ అహ్మద్ (2/20), అకెర్మన్ (1/16) వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లీసెస్టర్‌షైర్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. నిక్ వెల్చ్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్), రిషి పటేల్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ అకెర్మన్ (38 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), రెహాన్ అహ్మద్ (14 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) లీసెస్టర్షైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. డెర్బీ బౌలర్లలో జాక్ చాపెల్ 2, మార్క్ వ్యాట్, జార్జ్ స్క్రిమ్షా, లూయిస్ రీత్ తలో వికెట్ పడగొట్టారు. -
విరాట్ సర్, ఐయామ్ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్ ఉల్ హక్ రియాక్షన్
ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లితో గొడవ పెట్టుకున్నప్పటి నుంచి లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్‌ను నెటిజన్లు, ముఖ్యంగా విరాట్ అభిమానులు, టీమిండియా అభిమానులు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. నవీన్.. కోహ్లిని ఉద్దేశిస్తూ ఏ పోస్ట్ చేసినా, వారు తగు రీతిలో ఘాటుగా జవాబిస్తున్నారు. ఈ క్రమంలో నవీన్ ట్విటర్ అకౌంట్ నుంచి రెండు రోజుల కిందట వచ్చిన ఓ పోస్ట్ నెట్టింట వైరలైంది. ఆ ట్వీట్లో ఏముందంటే.. విరాట్ సర్.. ఐయామ్ సారి, నేను మీకు పెద్ద అభిమానిని.. చిన్నప్పటి నుంచి మీరే నా ఆరాధ్య క్రికెటర్.. నా రూమ్ మొత్తం మీ పోస్టర్లతోనే నిండి ఉంటుంది.. లక్నోని వదిలి మీ కెప్టెన్సీలో ఆర్సీబీకి ఆడాలనుంది అంటూ నవీన్ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే నెట్టింట హల్చల్ చేసింది. నవీన్ పశ్చాత్తాపపడుతున్నట్లున్నాడని కోహ్లి అభిమానులు అనుకున్నారు. అది నా ట్విటర్ అకౌంట్ కాదు.. ఫేక్: నవీన్ ఉల్ హక్ అయితే, కొద్ది గంటల తర్వాత ఈ ట్వీట్ నవీన్ ఉల్ హక్ చేయలేదని తెలిసింది. ఈ విషయంపై అతనే స్వయంగా స్పందించాడు. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ రన్ చేస్తున్నారని, తాను కోహ్లికి క్షమాపణ చెబుతున్నట్లు ట్వీట్ చేయలేదని తన అఫిషియల్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చాడు. కాగా, ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా కోహ్లి.. గంభీర్-నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన వన్ టు టూ ఫైట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాహాబాహీకి దిగినంత పని చేశారు. అనంతరం వీరు సోషల్‌మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకున్నారు. ఈ విషయంలో కోహ్లి కాస్త సైలెంట్ అయినా నవీన్ మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాడు. గంభీర్ అండదండలతో కోహ్లిని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. దీనికి ప్రతిగా కోహ్లి ఆర్మీ సైతం గంభీర్, నవీన్‌లపై ఎదురుదాడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఫేక్ అకౌంట్ నుంచి కోహ్లికి అనుకూలంగా ట్వీట్ రావడం.. దానిపై నవీన్ స్పందించడం జరిగింది. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించనున్న ఎంఎస్ ధోని -
గంభీర్ ఓ లెజెండ్.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇక మైదానంలో..
IPL 2023- Naveen-ul-Haq- Gautam Gambhir: ‘‘గంభీర్ ఓ దిగ్గజ క్రికెటర్. ఇండియా మొత్తం ఆయనను గౌరవిస్తుంది. భారత క్రికెట్‌కు ఆయన ఎనలేని సేవ చేశాడు. మెంటార్‌గా, కోచ్‌గా, క్రికెట్ లెజెండ్‌గా ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కెరీర్లో ఎలా ముందుకు సాగాలో ఎన్నో సూచనలు ఇచ్చారు. మైదానం లోపల, వెలుపలా ఎలా ఉండాలో నేర్పించారు’’ అని లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్, అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ అన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ దిగ్గజ ఆటగాడని, అతడి మార్గనిర్దేశనంలో అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. తొలి సీజన్లోనే ఐపీఎల్-2023తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన నవీన్.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో లక్నో తరఫున అరంగేట్రం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడిన నవీన్ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కోహ్లితో వాగ్వాదంతో ఒక్కసారిగా చెన్నై మ్యాచ్‌లో నవీన్ మెరుగ్గా రాణించినప్పటికీ లక్నో 81 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఆట కంటే కూడా టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లితో వాగ్వాదం, తదనంతరం కోహ్లిని ఉద్దేశించి చేసిన సోషల్ మీడియా పోస్టులతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లితో వాగ్వాదం సమయంలో నవీన్‌కు గంభీర్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరిని కోహ్లి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అంతేకాదు.. నవీన్ బౌలింగ్ చేయడానికి వచ్చిన ప్రతిసారి కోహ్లి నామస్మరణతో స్టేడియాన్ని హోరెత్తించారు. గంభీర్ లెజెండ్.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఈ నేపథ్యంలో కింగ్ అభిమానులు అలా చేయడాన్ని ఆస్వాదిస్తానన్న నవీన్.. గంభీర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. గంభీర్ తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు ముంబైతో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ మెంటార్, కోచ్ .. ప్లేయర్ ఎవరైనా గానీ.. ఎవరికైనా గానీ నా వంతు సాయం చేయాల్సి వచ్చినపుడు నేను వెనకడుగు వేయను. అలాగే ఇతరుల నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తా. గంభీర్ నాకు ఎన్నో విషయాలు నేర్పించారు’’ అని నవీన్ ఉల్ హక్ తెలిపాడు. కాగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన లక్నో తమ రెండో సీజన్‌ను కూడా నాలుగో స్థానంతో ముగించింది. మరోవైపు.. లక్నోపై గెలిచిన ముంబై క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. చదవండి: IPL 2023: ముంబై గెలిచిందా సరికొత్త చరిత్ర.. టైటిల్ నెగ్గే విషయంలో కాదు..! #MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే! Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి పేరిట అలా చేయడాన్ని ఆస్వాదిస్తాను: నవీన్ ఉల్ హక్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్లో ప్రేక్షకులు.. కోహ్లి నామస్మరణ చేస్తూ తనను అవహేళన చేయడంపై లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్ స్పందించాడు. ఇలా చేయడం వల్ల తనలో కసి పెరిగి ఇంకా బాగా ఆడతానని ఆయన అన్నాడు. వాస్తవానికి మైదానంలో ప్రేక్షకులు ఎవరి పేరును జపించినా తాను ఆస్వాధిస్తానని, కోహ్లి పేరును జపించడం అదనపు కిక్‌ను ఇస్తుందని తెలిపాడు. తాను బరిలో ఉన్నప్పుడు బయటి శబ్దాలపై దృష్టి పెట్టనని, నా పని నేను చేసుకుంటూ పోతానని అన్నాడు. స్టాండ్స్‌లో ప్రేక్షకులు చేసే అల్లరి తనను ప్రభావితం చేయదని, ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా నేను దాన్ని పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. ఏ క్రీడలో అయినా బాగా ఆడినప్పుడు ప్రశంసలు, తేలిపోయినప్పుడు విమర్శలు తప్పవని చెప్పుకొచ్చాడు. Naveen Ul Haq (on 'Kohli, Kohli' chants) said, "I like that everybody in the ground is chanting his name or any player's name. I enjoy it. It gives me passion to do well for my team". pic.twitter.com/Iyqt6Ozqec — Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2023 కాగా, ముంబై ఇండియన్స్‌తో నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా చిదంబరం స్టేడియంలోని ప్రేక్షకులు నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌కు వచ్చిన సమయంలో కోహ్లి నామస్మరణతో స్టేడియం మొత్తాన్ని మార్మోగించారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో నవీన్.. కోహ్లి అంశంపై స్పందించాడు. ఇదిలా ఉంటే, ముంబైతో మ్యాచ్‌లో నవీన్ (4/34) అద్భుతంగా రాణించినప్పటికీ లక్నో జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో ఆకాశ్ మధ్వాల్ (3.3-0-5-5) ధాటికి కుదేలైన లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. చదవండి: కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు! -
కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో కోహ్లి, నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన గొడవ సీజన్‌కే హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్యలో గంభీర్ దూరడంతో ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ గొడవ ఇప్పట్లో సద్దమణిగేలా కనిపించడం లేదు. కోహ్లి ఈ విషయం పెద్దగా పట్టించుకోకపోయినా క్రికెట్ అభిమానులు మాత్రం నవీన్ ఉల్ హక్‌ను టార్గెట్ చేస్తున్నారు. గొడవ జరిగిన తర్వాత లక్నో ఎక్కడికి వెళ్లి మ్యాచ్ ఆడినా నవీన్ ఉల్ హక్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే వస్తున్నారు. నవీన్ ఉల్ హక్ కూడా అభిమానులనుద్దేశించి వినూత్న గెస్టర్స్తో సమాధానం ఇస్తున్నాడు. తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ బుధవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్ తన చర్యతో మరోసారి హైలెట్ అయ్యాడు. మ్యాచ్‌లో రోహిత్ శర్మ 11 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్స్ దిశగా రోహిత్ భారీ షాట్ ఆడగా ఆయుష్ బదోని క్యాచ్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ వికెట్ తీసుకోగానే తన రెండు చేతులను చెవుల దగ్గర పెట్టి వినిపించడం లేదు అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసిన నవీన్ ఉల్ హక్.. గ్రీన్‌ను ఔట్ చేసిన సమయంలోనూ ఇదే తరహా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. కోహ్లితో కదా నీ వైరం.. మధ్యలో మా రోహిత్ ఏం చేశాడు అంటూ కామెంట్ చేశారు. Afghan breakthrough! Naveen gets the big wicket of Rohit Sharma in the #TATAIPL #Eliminator 👏#LSGvMI #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/vFl43ZPSuW — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: ధోని పట్టిందల్లా బంగారమే! -
కోహ్లిని గంభీర్, నవీన్‌లు కవ్విస్తుంటే.. లక్నో యాజమాన్యం ఏం చేసిందో చూడండి..!
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ-లక్నో మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి.. గంభీర్-నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన వన్ టు టూ ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాహాబాహీకి దిగినంత పని చేశారు. అనంతరం వీరు సోషల్‌మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో కోహ్లి కాస్తంత సైలెంట్ అయినా నవీన్ ఉల్ హక్ మాత్రం ఓవరాక్షన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. తాజాగా (మే 21) గుజరాత్‌పై కోహ్లి వీరోచిత శతకం చేసిన తర్వాత కూడా నవీన్.. కింగ్ కోహ్లిని కవ్వించాడు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసి కోహ్లితో పాటు ఆర్సీబీని కూడా ఎగతాళి చేశాడు. Naveen Ul Haq posted this video on his Instagram after RCB lost the match#RCBvsGT pic.twitter.com/FCaF41IMnM — Gems of Shorts (@Warlock_Shabby) May 21, 2023 ఇదంతా ఒకెత్తైతే.. గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్ అనంతరం గంభీర్, నవీన్ ఉల్ హక్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాత్రం కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తి ఆకాశానికెత్తింది. లక్నో మేనేజ్మెంట్ తమ ట్వీట్లో కోహ్లిని కొనియాడింది. కోహ్లి తన చివరి రెండు మ్యాచ్‌ల్లో వీరోచితమైన శతకాలు బాది తమను భయపెట్టాడని.. అతను ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తి అని ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే కోహ్లిని ఆల్‌టైమ్ గ్రేట్ (GOAT) ఐకాన్‌తో గౌరవించింది. లక్నో చేసిన ఈ ట్వీట్‌తో కోహ్లి అభిమానులు కాస్త శాంతించారు. గంభీర్,నవీన్‌లను టార్గెట్ చేసే డోస్‌ను కాస్త తగ్గించారు. మన ప్రవర్తనను బట్టి ఇతరుల ప్రవర్తన ఆధారపడి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. This man had us on our feet these last two games. An absolute force of nature. 👏 The 🐐 pic.twitter.com/QS3EEvnoUb — Lucknow Super Giants (@LucknowIPL) May 21, 2023 ఇదిలా ఉంటే, ఆర్సీబీ-లక్నో జట్లు క్వాలిఫయర్స్‌లో కాని, ఎలిమినేటర్‌లో కాని, ఫైనల్లో కాని ఎదురెదురుపడాలని అభిమానులు ఆశించారు. అయితే వారి ఆశ నెరవేరలేదు. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ గెలవడంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి వీరోచిత శతకం వృధా కాగా.. శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న విరాట్ కోహ్లి -
ఇస్తారా? తీసుకుంటారా? ఆర్సీబీ అవుట్.. వర్షం వల్ల ఓ పాయింట్! పైగా
IPL 2023- Virat Kohli: ఐపీఎల్-2023లో తొలిసారి ఎదురుపడిన సందర్భంలో రాయల్ చాలెంజర్స్‌ను ఓడించింది లక్నో సూపర్ జెయింట్స్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై గెలుపొంది గత సీజన్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. ఈ క్రమంలో లక్నో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అలా మొదలైంది ఆఖర్లో బై రూపంలో వచ్చిన పరుగుతో లక్నో గెలుపు ఖరారు కాగా.. ఆవేశ్ ఖాన్ హెల్మెట్ కిందపడేసి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తానేదో బ్యాటింగ్ చేసి పరుగులు సాధించినట్లు రెచ్చిపోయాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆవేశ్ ఓవరాక్షన్ సహించలేక మందలించి వదిలేశారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి లక్నో మెంటార్ గౌతం గంభీర్.. ‘‘ష్’’ అంటూ నోరు మూసుకోవాలంటూ సైగ చేశాడు. అయితే, దూకుడైన ఆటకు మారుపేరైన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లికి ‘ఎవరైనా.. ఏదైనా.. స్వీట్ గిఫ్ట్’’ ఇస్తే తిరిగి ఇవ్వడం అలవాటు. సీన్ రివర్స్ లక్నోలో సీన్ రివర్స్ అయింది. సొంతమైదానంలో రాహుల్ సేన ఫాఫ్ డుప్లెసిస్ బృందం చేతిలో చిత్తైంది. మరి కోహ్లి ఊరుకుంటాడా? తమ అభిమానులను అవమానించినందుకు ఇంతకు ఇంతా బదులు తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి- నవీన్ ఉల్ హక్, కోహ్లి- గంభీర్ మధ్య వాగ్వాదం వివాదానికి దారితీసింది. ఇచ్చినపుడు తిరిగి తీసుకోవాలి ఇక డ్రెసింగ్ రూం సెలబ్రేషన్స్ టైమ్‌లోనూ కోహ్లి.. ‘‘మీరు ఒకళ్లకు ఇచ్చినపుడు తిరిగి తీసుకునే అలవాటు కూడా ఉండాలి’’ అంటూ ముందుగా తమను కవ్వించినందుకే ఇలా కౌంటర్ ఇచ్చానన్నట్లు గంభీర్ అండ్ కోకు చెప్పాడు. అయితే, గొడవ అంతటితో సమసిపోలేదు. పరస్పర కౌంటర్లతో కొనసా..గింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 నుంచి ఆర్సీబీ అవుటైన నేపథ్యంలో లక్నో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘ఇస్తారా? తీసుకుంటారా? వదిలేయండబ్బా! ఆర్సీబీ గెలుపు కోసం అద్భుత పోరాటం చేసింది. ఏదేమైనా వచ్చే సీజన్లో మిమ్మల్ని కలుస్తాం’’ అని పేర్కొంది. ఉత్తి పుణ్యానికి పాయింట్లు అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం లక్నో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వర్షం కారణంగా ఒక పాయింట్! సన్‌రైజర్స్ అభిషేక్ పుణ్యమా అని రెండు పాయింట్లు.. కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపు.. చావు తప్పి కన్నులొట్టబోయి.. లక్ ఉండట్టి ప్లే ఆఫ్స్ చేరారు. మీకు ఆర్సీబీ గురించి మాట్లాడే అర్హత లేదు’’ అంటూ మండిపడుతున్నారు. స్నేహ హస్తం చాచినందుకు మరికొందరు మాత్రం ఆ ఎమోజీ చూస్తుంటే వివాదానికి స్వస్తి పలుకుతూ స్నేహ హస్తం చాచినట్లు అనిపిస్తోందని తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా సీఎస్కేతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా లక్నోకు ఒక పాయింట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో.. ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఓడితే ఇంటిబాట పట్టాల్సిందే! మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి అజేయ శతకం వృథాగా పోయింది. శుబ్‌మన్ గిల్ అజేయ సెంచరీ కారణంగా ఓటమి పాలైన బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..! Give it? Take it? Let's leave it. 🤝 Well fought, @RCBTweets. See you next season. 🤙 — Lucknow Super Giants (@LucknowIPL) May 21, 2023 -
ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు
ఐపీఎల్-2023లో ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, నవీన్ ఉల్హక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కోహ్లి అక్కడితోనే విడిచి పెట్టగా.. నవీన్ ఉల్ హక్ మాత్రం ఏదో విధంగా విరాట్‌ను గెలుకుతున్నాడు. తాజాగా నవీన్ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకున్నాడు. విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నవీన్ ఓ పోస్ట్ చేశాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్ ఉల్ హక్ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్ స్టోరీ పోస్టు చేశాడు. అది కోహ్లితో పాటు ఆర్సీబీ జట్టును ఎగతాళి చేసినట్లు ఉంది. అయితే కోహ్లిని హేళన చేసిన నవీన్ ఉల్‌హక్‌ను ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చీ మరి ఇంత దారుణమా.. నీవు అస్సలు మనిషివేనా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా మే20న కేకేఆర్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో నవీన్‌ను కూడా కోహ్లి అభిమానులు టార్గెట్ చేశారు. నవీన్-ఉల్-హక్ బౌలింగ్‌కు వచ్చినపుడు ప్రేక్షకులు ``కోహ్లీ.. కోహ్లీ..`` అని కేకలు వేసి తమ నిరసనను తెలియజేశారు. కోహ్లీ అభిమానుల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ ఉల్ హక్.. ``గప్ చుప్`` అని సైగలు చేస్తూ నోటిపై వేలు వేసి సైలంట్‌గా ఉండాలని ఫ్యాన్స్‌ను సూచించాడు. కింగ్ పోరాటం వృథా కాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్బుత పోరాటం వృథా మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీతో చెలరేగాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. జట్టులో మిగితా బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ.. కోహ్లి మాత్రం తన అద్భుత ఇన్నింగ్స్‌తో 197 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. దురదృష్టవశాత్తూ బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమకావడంతో ఆర్సీబీ ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: #Virat Kohli: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే! Naveen Ul Haq posted this video on his Instagram after RCB lost the match#RCBvsGT pic.twitter.com/FCaF41IMnM — Gems of Shorts (@Warlock_Shabby) May 21, 2023 The moment King Kohli created history: 7th IPL century - an absolute GOAT..!! pic.twitter.com/NMwjLp5rjE — Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023 -
Virat Kohli: ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే చుక్కలే! మరోసారి నవీన్‌కు తెలిసొచ్చింది! చెత్తగా..
IPL 2023 Virat Kohli vs Naveen-ul-Haq- LSG In Play Offs: లక్నో సూపర్ జెయింట్స్ పేసర్, అఫ్గనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుత ఆట తీరుతో అనుకునేరు! కానే కాదు.. ప్రేక్షకులు నోళ్లు మూయాలంటూ దుందుడుకు వైఖరితో! ఐపీఎల్-2023లో ఆర్సీబీ- లక్నో రివేంజ్ మ్యాచ్ సందర్భంగా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి- అఫ్గన్ యువ పేసర్ నవీన్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కొనసా.. గించారు నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం తర్వాత కరచాలనం చేసుకునే సమయంలోనూ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. మైదానం వెలుపల కూడా వీరి మధ్య వార్ కొనసాగింది. తర్వాత సోషల్ మీడియాలోనూ కౌంటర్ పోస్టులతో కోహ్లి- నవీన్ పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి త్వరగా అవుట్ కావడంతో నవీన్.. ‘‘తియ్యటి మామిడి పండ్లు’’ అని, ఆర్సీబీ ఓటమి నేపథ్యంలో రౌండ్ 2 అంటూ ఇన్‌స్టా స్టోరీతో మరోసారి కోహ్లిని, అతడి ఫ్యాన్స్‌ను కవ్వించాడు. కోహ్లి నామస్మరణతో హోరెత్తించి ఇంకేముంది టీమిండియా ముఖచిత్రం, స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లితో గొడవ పడితే ఎలా ఉంటుందో ట్రోల్స్ రూపంలో నవీన్‌కు అర్థమయ్యేలా చేశారు ఫ్యాన్స్. అంతేకాదు, నవీన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోనూ కోహ్లి.. కోహ్లి అంటూ కింగ్ నామస్మరణతో హోరెత్తించారు. కానీ తగ్గేదేలే అంటూ గంభీర్‌లా ప్లే ఆఫ్స్ రేసులో కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లోనూ నవీన్‌కు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. అయితే, నవీన్ సైతం మైదానంలోని ప్రేక్షకులను ఉద్దేశించి నోరు మూయాలంటూ నోటిపై వేలును ఉంచి వారిని మరింత రెచ్చగొట్టాడు. బెంగళూరులో ఆర్సీబీ- లక్నో మ్యాచ్‌లో లక్నో మెంటార్ గౌతం గంభీర్ తరహాలో ‘ష్’ అంటూ సైగ చేశాడు. ఆర్సీబీ పోటీలో ఉండాలంటే గెలవాల్సిందే కేకేఆర్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో రహ్మనుల్లా గుర్బాజ్ క్యాచ్‌ను రవి బిష్ణోయి పట్టుకున్న సమయంలో ఈ మేరకు తన చర్యతో వైరల్‌గా మారాడు. ఇదిలా ఉంటే.. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ చేరుకుంది. ఇక నాలుగో స్థానం కోసం ముంబై, ఆర్సీబీ పోటీలో నిలిచాయి. తమ తదుపరి మ్యాచ్‌లలో ఈ రెండూ ఓడితే రాజస్తాన్‌కు అవకాశాలు ఉంటాయి. చుక్కలు చూపిస్తాం ఇక ఈ మ్యాచ్‌లో నవీన్ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 46 పరుగులు ఇచ్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో 8 ఓవర్లలో 85 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో.. ‘‘మా కింగ్ బ్యాటింగ్ గురించి చెత్త కామెంట్లు చేయడం కాదు. ముందు నీ ఆట మీద దృష్టి పెట్టు. మా హీరో మొన్న సెంచరీ చేస్తే నువ్వు ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డావు’’ అని ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇకనైనా మారు.. కోహ్లి అభిమానులతో పెట్టుకుంటే నీకు చుక్కలే.. ఖబడ్దార్’’ అంటూ హెచ్చరిస్తున్నారు. చదవండి: కావాలనే యశ్ చేతికి బంతినిచ్చా! అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! Such a shame from this toxic kohli fans to chant kohli kohli when naveen is playing and if he reacts you people call him having attitude. pic.twitter.com/Sya8VRq8EY — indian cricket team (@ictfannn) May 21, 2023 How dare of him to do a gesture like that in front of Indian crowds ? Naveen this guy is such a shamelss pic.twitter.com/7utvOOGNAK — Sohel (@SohelVkf) May 20, 2023 A breathtaking finish to a sensational encounter! 🔥@LucknowIPL clinch a victory by just 1 run after Rinku Singh's remarkable knock 🙌 Scorecard ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/umJAhcMzSQ — IndianPremierLeague (@IPL) May 20, 2023 -
ఫ్రెండ్స్ అయిపోయిన కోహ్లీ అండ్ నవీన్...!
-
నేనెవరినీ స్లెడ్జ్ చేయను.. అది నా అలవాటు కాదు: కోహ్లితో గొడవపడ్డ నవీన్ ఉల్ హక్
IPL 2023: కొద్ది రోజుల క్రితం ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో గొడవపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్, తాజాగా సహచరుడు ఆవేశ్ ఖాన్‌తో జరిగిన ఓ చాట్ షోలో (ఎక్దమ్ టైట్, ఎక్దమ్ రైట్ బై బాండ్ టైట్) ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. సరదాగా సాగిన ఆవేశ్-నవీన్ ఉల్ హక్ మధ్య సంభాషణను ఎల్ఎస్జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది. Avesh. Naveen. Too much fun 😂 Also, wait till 1.39 👀@AstralAdhesives | #bondtite pic.twitter.com/QlKnyZSgHu — Lucknow Super Giants (@LucknowIPL) May 12, 2023 ఆవేశ్-నవీన్ ఒకరినొకరు ప్రశ్నలు సంధించుకున్న ఈ షోలో స్లెడ్జింగ్ గురించిన ఓ ప్రశ్నను ఆవేశ్.. నవీన్‌ను అడిగాడు. ఫీల్డ్‌లో నువ్వు చేసిన లేదా ఎదుర్కొన్న ఫేవరెట్ స్లెడ్జ్ ఏంటని ఆవేశ్..నవీన్‌ను అడిగాడు. దీనికి నవీన్ ఠక్కున స్పందిస్తూ.. నేనెవరిని ముందుగా స్లెడ్జింగ్ చేయను.. అది నా అలవాటు కాదు అని అన్నాడు. దీనికి ఆవేశ్ కచ్చితంగా సమాధానం చెప్పాలన్నట్లుగా పట్టుబట్టడంతో నవీన్ ఏదో సొల్లు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ ఫస్ట్ క్లాస్ గేమ్ సందర్భంగా నాతో పాటు క్రీజ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఫీల్డర్ స్లెడ్జ్ చేశాడని, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ ఫీల్డర్.. ఇదే లాస్ట్ వికెట్, త్వరగా ఔట్ చేస్తే నేను ఇంటికి వెళ్లాలి, నాకు నిన్ననే పెళ్లైంది అని స్లెడ్జ్ చేశాడంటూ పస లేని విషయాన్ని స్లెడ్జింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మధ్యలో ఆవేశ్ కలగజేసుకుని.. ఇది ఫన్నీ ఇన్సిడెంట్, సీరియస్‌గా జరిగిన స్లెడ్జింగ్ గురించి చెప్పు అంటూ పట్టుబట్టాడు. దీనికి నవీస్ స్పందిస్తూ.. సీరియస్‌గా జరిగినవి ఏవీ లేవని బదులిచ్చాడు. నవీన్.. కోహ్లితో జరిగిన వివాదం ప్రస్తావన తేకపోవడంతో వీరి మధ్య సంధి కుదిరిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే కోహ్లి-నవీన్-గంభీర్ల మధ్య గొడవ పూర్తయ్యాక చాలా రోజుల పాటు ఈ ముగ్గురి మధ్య (కోహ్లితో గంభీర్, నవీన్) సోషల్‌మీడియా వార్ జరిగిన విషయం తెలిసిందే. దూకుడుగా ఉండే కోహ్లి, గంభీర్‌లు ఎప్పుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో లక్నో, ఆర్సీబీల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తదుపరి ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో (3) గెలవాల్సి ఉంది. ప్రస్తుతం లక్నో, ఆర్సీబీ 11, 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రోహిత్, కోహ్లి పనైపోయింది: టీమిండియా మాజీ క్రికెటర్ -
నవీన్-ఉల్-హక్ పై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు..
-
నీతో నీకే పోటీ.. విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్! ట్రోఫీ గెలవకపోయినా..
IPL 2023- MI Vs RCB: ఐపీఎల్-2023లో వరుస పరాజయాలతో ఢీలా పడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన ఆర్సీబీ.. తాజాగా ముంబైలోనూ పరాభవాన్ని మూటగట్టుకుంది. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ విజయంతో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకురాగా.. వరుస ఓటముల నేపథ్యంలో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. వీటిలో భారీ తేడాతో గెలుపొందితేనే బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే.. ‘‘ఈ సాలా కప్ నామ్దే’’ అని గంపెడాశలు పెట్టుకున్న అభిమానులకు మరోసారి నిరాశతప్పదు. నిజానికి ఆర్సీబీ ఆరంభంలో బాగానే ఆడింది. ముఖ్యంగా ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ రాణించడం కలిసి వచ్చింది. వీరికి తోడు మాక్స్వెల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో వరుస విజయాలు సాధించింది. అప్పుడు హాఫ్ సెంచరీ చేసినా కానీ.. ప్రస్తుతం.. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో సీన్ రివర్స్ అయింది. ఢిల్లీతో మ్యాచ్‌లో కోహ్లి 55, డుప్లెసిస్ 45 పరుగులు సాధించగా.. మాక్సీ డకౌట్ అయ్యాడు. మరో బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ అర్థ శతకం సాధించడంతో 181 పరుగులు చేయగలిగిన ఆర్సీబీ.. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా ఓటమిని అంగీకరించకతప్పలేదు. ఇప్పుడు పూర్తిగా వైఫల్యం ఇక ముంబైతో మ్యాచ్‌లో కోహ్లి 4 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే పరిమితం కావడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినప్పటికీ డుప్లెసిస్ (65), మాక్సీ(68) రాణించడంతో 199 పరుగులు సాధించగలిగింది. కానీ మరోసారి బౌలర్లు చేతులెత్తేయడంతో ఈ మ్యాచ్‌ను కూడా ప్రత్యర్థికి సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆసక్తిర పోస్టుతో ముందుకు వచ్చాడు. ముంబైతో మ్యాచ్‌లో తన వైఫల్యం, ఆర్సీబీ ఓటమి నేపథ్యంలో.. ‘‘ఒత్తిళ్లను అధిగమించి నీతో నువ్వే పోరాడాలి. వాస్తవంలోనూ నీతో నీకే అసలైన పోటీ ఉంటుంది’’ అంటై లైట్ కింద కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు. కోహ్లి వర్సెస్ కోహ్లి అంతే ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘నువ్వు నిజమైన హీరోవి. కప్ గెలిచినా.. గెలవకపోయినా నా మనస్సులో నీ స్థానం ఎప్పటికీ చెరిగిపోదు. నీలో ప్రయత్నలోపం లేదు. జట్టును గెలిపించేందుకు నీ వంతు కృషి చేస్తున్నావు’’ అని పేర్కొంటున్నారు. ఇక మరికొందరేమో.. కోహ్లిని లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ కవ్విస్తూ పెట్టిన పోస్టులను ఉద్దేశిస్తూ.. భలే కౌంటర్ ఇచ్చాడని.. ఈ ప్రపంచంలో కోహ్లికి కోహ్లితోనే పోటీ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్! MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్!
IPL 2023- MI Vs RCB- #Naveen-ul-Haq- Virat Kohli: అఫ్గనిస్తాన్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్- ఉల్- హక్ మరోసారి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని కవ్వించాడు. వరుస ఇన్‌స్టా పోస్టులతో మరోసారి అగ్గిరాజుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు నవీన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘చిల్లర వేషాలు మానుకోకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. మా కింగ్‌తో పెట్టుకుంటే నీకు దబిడి దిబిడే’’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోహ్లి వర్సెస్ నవీన్ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- నవీన్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో కూడా నవీన్ కోహ్లితో అనుచితంగా ప్రవర్తించాడు. కోహ్లి కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చాడు. అగ్నికి ఆజ్యం పోసిన గంభీర్ ఇంతలో లక్నో మెంటార్ గంభీర్ జోక్యం చేసుకోవడం.. గొడవ మరింత పెద్దదికావడం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ కోహ్లి, గంభీర్ల మ్యాచ్ ఫీజులో వందశాతం కోత విధించడంతో పాటు నవీన్‌కు కూడా ఫీజులో 50 శాతం తగ్గిస్తూ జరిమానా విధించింది. అయితే, ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి, నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియా వేదికగా కూడా వార్కి దిగారు. పరస్పరం విమర్శించుకుంటూ పోస్టులతో హల్చల్ చేశారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుటైన విషయం తెలిసిందే. కోహ్లి అవుట్ కాగానే అలా ఈ నేపథ్యంలో మ్యాచ్ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫొటోను పంచుకున్న నవీన్.. మ్యాంగోస్ తియ్యగా ఉన్నాయంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి విఫలమైనప్పటికీ ఆర్సీబీ 199 పరుగులు స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఆర్సీబీ ఓటమి నేపథ్యంలో ఇలా ఈ నేపథ్యంలో సూర్యకుమార్- వధేరా ఆర్సీబీ ఓటమిని ఖరారు చేసే క్రమంలో వాళ్లిద్దరు ఒకరికొకరు అభినందించుకుంటున్న ఫొటోను షేర్ చేసిన నవీన్.. ‘‘రౌండ్ 2.. ఇంత తియ్యటి మామిడి పండ్లను నేను ఎప్పుడూ తినలేదు.. సూపర్’’ అంటూ మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడు. దీంతో కింగ్ కోహ్లి అభిమానులు అతడిపై విరుచుకుపడుతున్నారు. ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్ ‘‘ఎక్స్‌ట్రాలు చేస్తే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్.. జాగ్రత్త. నువ్వెంత.. నీ అనుభవం ఎంత? ముందు నీ ఆట గురించి నువ్వు చూసుకో.. తర్వాత ఇతరులపై రాళ్లు వేద్దువు గానీ’’ 23 ఏళ్ల నవీన్‌కు అని చురకలు అంటిస్తున్నారు. కాగా నవీన్‌కు మైదానంలో సీనియర్లతో గొడవపడటం ఇదేమీ కొత్తకాదు. మహ్మద్ ఆమిర్, షాహిద్ ఆఫ్రిది వంటి ముదుర్లతో కూడా పేచీలు పెట్టుకున్న ‘ఘనత’ అతడిది!! ఇప్పటి వరకు ఇద్దరు కాగా ఐపీఎల్-2023లో కోహ్లి ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌లో కలిపి 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. ఇక నవీన్ విషయానికొస్తే.. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన అతడు.. 4 ఇన్నింగ్స్‌లో 6.12 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ Naveen ul haq's insta story after Kohli got out for 1(4)😭😭😭😭 pic.twitter.com/RIw4Y5yISe — ` Frustrated CSKian (@kurkureter) May 9, 2023 WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
కోహ్లి ఔట్.. 'మామిడి పండ్లు బాగున్నాయ్'
ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వివాదం ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలుసు. మ్యాచ్ తర్వాత కూడా వారి మధ్య మాటల పరోక్షంగా మాటల యుద్ధం, సోషల్ మీడియాలో వార్ నడిచిన విషయం తెలిసిందే. మంగళవారం ఆర్సీబీ- ముంబయి మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట్లో ఆర్సీబీ కాస్త తడబడింది. విరాట్ కోహ్లీ 4 బంతుల్లో కేవలం ఒకే పరుగు చేసి అవుటయ్యాడు. అదే సమయంలో నవీన్ ఉల్ హక్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు. అందులో ఒక టేబుల్ మీద మామిడిపండ్లు ఉన్నాయి. ఎదురుగా టీవీలో ముంబయి- ఆర్సీబీ మ్యాచ్ నడుస్తోంది. స్వీట్ మ్యాంగోస్ సూపర్ ఉన్నాయి అంటూ ఏమోజీలు కూడా పెట్టాడు. అది కూడా కోహ్లి ఔటైన మరుసటి క్షణమే పోస్టు పెట్టడంతో పరోక్షంగా అతనికి కి కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక రకంగా కోహ్లి ఔట్ తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పకనే చెప్పాడు. దీన్నిబట్టి నవీన్ ఉల్ హక్ కోహ్లీతో వివాదానికి ఇప్పుడప్పుడే తెరదించేలా లేడంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెటర్లు అయి ఉండి ఇలా చిన్నపిల్లల్లా ఇన్ డైరెక్ట్ కామెంట్లు, క్రిప్టెడ్ పోస్టులు పెట్టుకుని కామెంట్ చేసుకోవడం మరీ సిల్లీగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. Naveen UL haq celebrating Virat Kohli's wicket 😭😭😭 pic.twitter.com/Ia0guczSbr — ANSHUMAN🚩 (@AvengerReturns) May 9, 2023 చదవండి: రోహిత్ శర్మ పేరిట అత్యంత చెత్త రికార్డు.. -
నిప్పు ఉప్పులా ఉండే కోహ్లి, గంగూలీ కలిసిపోయారు.. కోహ్లి ఇక ఢిల్లీకి వచ్చేయ్..!
ఆర్సీబీ కీ ప్లేయర్ విరాట్ కోహ్లి, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ చాలాకాలంగా తమ మధ్య నెలకొన్న విభేదాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. నిన్న (మే 6) ఆర్సీబీ-డీసీ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం వీరిరువురు ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, ఒకరి భజం మరొకరు తట్టుకుంటూ కనిపించారు. ఈ సీన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 🚨 Massive Respect 🚨 Hand Shake And Almost Hug Moment Between Sourav Ganguly & Virat Kohli Two Of The Best To Lead Indian Cricket ❤️#IPL23 #rcbvsdc #DCvsRCB pic.twitter.com/bIoLrNNvVD — Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) May 6, 2023 కోహ్లి, దాదా కలిసిపోయారని భారత క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు. డీసీ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి.. గంగూలీతో వివాదం సమసిపోయింది కదా కోహ్లి.. ఆర్సీబీని వదిలేసి తమ జట్టుకు వచ్చేయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్ గంగూలీతో హుందాగా వ్యవహరించడం పట్ల హర్షిస్తున్నారు. The way Virat Kohli looked at ganguly pic.twitter.com/pLoAzyn9EI — itz_mksoni25 (@_itz_mksoni25) April 17, 2023 కాగా, గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్సీ విషయంలో కోహ్లితో మొదలైన వివాదం నిన్న మొన్నటి వరకు సాగింది. ఈ మధ్యలో అనేక సందర్భాల్లో వీరు బహిరంగానే ఒకరితో ఒకరు విభేదించారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే డీసీతో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పించుకున్నారు. Virat Kohli stares towards Sourav Ganguly and Ricky Ponting after takes the catch. 🔥 pic.twitter.com/EmuAzzzzMb — S. (@Sobuujj) April 15, 2023 తొలుత కోహ్లి ఏదో మనసులో పెట్టుకుని గంగూలీ వైపు కోపంగా చూడగా.. ఆతర్వాత ఇరువురు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే తరుణంలో (మ్యాచ్ అనంతరం) కోహ్లిని చూసి గంగూలీ తప్పుకున్నాడు. దీంతో కోహ్లికి చిర్రెత్తిపోయి వెనక్కు తిరిగి గంగూలీవైపు మరోసారి బిర్రుగా చూశాడు. గంగూలీ చర్యకు బదులుగా కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేసి, తమ మధ్య అగాధాన్ని మరింత పెంచుకున్నాడు. No handshake between Virat Kohli and Sourav Ganguly❓😳 📸: Jio Cinema#RCBvDC #IPL23 #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/7iRoSq4kw7 — CrickDesi (@Crick_Desi) April 15, 2023 అయితే దాదా.. తాను కూడా తగ్గేదేలేదంటూ ఇన్‌స్టాలో కోహ్లిని అన్ ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందని అభిమానులు అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా నిన్నటి మ్యాచ్ అనంతరం కోహ్లి-గంగూలీ ఆప్యాయంగా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గంభీర్, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో విఫలమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కోహ్లి (55), మహిపాల్ లోమ్రార్ (54 నాటౌట్), డుప్లెసిస్ (45) రాణించడంతో ఆర్సీబీ 181 పరుగులు చేయగా.. ఛేదనలో ఫిలిప్ సాల్ట్ (87) చెలరేగడంతో ఢిల్లీ మరో 20 బంతులు మిగిలుండగానే సునాయాస విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలోవార్నర్ (22), మిచెల్ మార్ష్ (26) ఓ మోస్తరుగా రాణించగా.. రిలీ రొస్సో (35 నాటౌట్), అక్షర్ పటేల్ (8 నాటౌట్) డీసీని విజయతీరాలకు చేర్చారు. చదవండి: కోహ్లిని మరోసారి రెచ్చిగొట్టిన నవీన్ ఉల్ హక్.. గంభీర్ మద్దతు -
కోహ్లిని మరోసారి రెచ్చిగొట్టిన నవీన్ ఉల్ హక్.. గంభీర్ మద్దతు
ఐపీఎల్ 2023లో భాగంగా మే 1న ఆర్సీబీ-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి.. నవీన్ ఉల్ హక్, గౌతమ్ గంభీర్ల మధ్య జరిగిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లిని రెచ్చగొట్టాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ తాజాగా తన జట్టు మెంటార్ గంభీర్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కోహ్లిని రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు. మీతో ఇతరులు ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో, మీరు కూడా వారితో అలాగే వ్యవహరించండి.. మీతో ఇతరులు ఎలా మట్లాడాలనుకుంటారో, మీరు కూడా వారితో అలాగే మాట్లాడండి అంటూ నవీన్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీనిపై గంభీర్ స్పందిస్తూ.. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, ఎప్పుడూ మార్చుకోకు.. అంటూ నవీన్ కామెంట్స్‌కు మద్దతు పలుకుతూ కోహ్లికి పరోక్షంగా చురకలంటించాడు. మరి నవీన్-గంభీర్‌లు చేసిన ఈ వ్యాఖ్యలపై కోహ్లి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) మరోవైపు, గంభీర్ వ్యవహారం విషయమై కోహ్లి.. బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ లేఖలో కోహ్లి తన తప్పేమీ లేదని, తాను అమాయకుడినని, వారు రెచ్చగొడితేనే నేను స్పందించానని పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కృనాల్ పాండ్యా (గాయంతో కేఎల్ రాహుల్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు) నేతృత్వంలో లక్నో టీమ్ ఇవాళ (మే 7) టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3: 30 గంటలకు ఈ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. ప్రస్తుతం లక్నో 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: గంభీర్, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ -
బ్లడీ.. అసలు..! మాట జారిన కోహ్లి.. అదే గొడవకు కారణం! బీసీసీఐకి మెసేజ్ కూడా!
IPL 2023- LSG Vs RCB- #ViratGambhirFight: ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ మధ్య గొడవ జరిగి రోజులు గడుస్తున్నా.. ఈ వివాదానికి సంబంధించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. కోహ్లి- గంభీర్ మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రత్యక్ష సాక్షి ఇటీవలే కొన్ని విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కోహ్లి మాట జారడంతో గంభీర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ సదరు వ్యక్తి పేర్కొన్నారు. ఆ మాట అనడంతో ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ తాజా కథనంలో.. గంభీర్‌కు కోపం తెప్పించిన మాటేమిటో వెల్లడించింది. అదే విధంగా గొడవ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి జరిమానా విధించిన నేపథ్యంలో కోహ్లి బీసీసీఐకి ఓ సందేశం పంపాడని పేర్కొంది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫ్రీ హిట్ నేపథ్యంలో.. లక్నో టెయిలెండర్ నవీన్-ఉల్-హక్‌తో గొడవ.. ఆ తర్వాత కోహ్లి జోక్యం.. అటుపై మ్యాచ్ తర్వాత లక్నో ఓపెనర్ కైలీ మేయర్స్‌తో కోహ్లి మాట్లాడుతుండగా.. గంభీర్ మధ్యలోకి రావడం వంటి పరిణామాల క్రమంలో వివాదం ముదిరింది. బ్లడీ అసలు నువ్వేంటి? ఈ నేపథ్యంలో కోహ్లి.. మేయర్స్‌తో మాట్లాడుతుండగా.. గంభీర్ అతడిని కోహ్లి నుంచి విడదీసే ప్రయత్నం చేశాడు. దీంతో.. ‘‘బ్లడీ.. F***. నేను అతడికి సెండాఫ్ ఇస్తుంటే మధ్యలో నువ్వేంటి’’ అని విరాట్ అన్న మాట గంభీర్ చెవిన పడటంతో అతడు కోపోద్రిక్తుడయ్యాడని దైనిక్ జాగరణ్ కథనంలో పేర్కొంది. బీసీసీఐ అధికారులకు కోహ్లి మెసేజ్ అదే విధంగా మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 100 శాతం కోత విధించడంపై విచారం వ్యక్తం చేసిన కోహ్లిహ్లి.. ‘‘నేనసలు నవీన్ ఉల్ హక్‌ని గానీ.. గంభీర్‌ని గానీ అసలు ఏమీ అనలేదు’’ అని కొంతమంది అధికారులకు మెసేజ్ చేసినట్లు తెలిపింది. తన తప్పేమీ లేకపోయినా ఫైన్ విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. నవీన్‌పైకి బంతి విసరాలని తాను సిరాజ్‌కు చెప్పలేదని.. బౌన్సర్స్ వేయాలని మాత్రమే సూచించినట్లు కోహ్లి పేర్కొన్నట్లు తెలిపింది. కాగా ఈ వార్తలపై స్పందించిన కింగ్ ఫ్యాన్స్.. గంభీర్ కావాలనే గొడవను పెద్దది చేసి రచ్చ చేశాడని.. ఇందులో కోహ్లి తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. గంభీర్ అభిమానులు మాత్రం.. ‘‘చేసిందంతా చేశావు.. టీవీలో అందరూ చూశారు. అయినా.. మళ్లీ ఇప్పుడిలా మెసేజ్‌లు పెడతావా?’’ అని కోహ్లి తీరుపై మండిపడుతున్నారు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లి -
Virat Kohli: ఐపీఎల్ ఆడేందుకే వచ్చా! ఎవరెవరితోనూ తిట్టించుకోవడానికి కాదు!
IPL 2023 LSG Vs RCB: విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదానికి కేంద్ర బిందువైన నవీన్ ఉల్ హక్ తీరుపై కింగ్ అభిమానులు మండిపడుతూనే ఉన్నారు. ఎదుటి వాళ్లను కవ్వించినపుడు.. మనం కూడా వాటిని స్వీకరించే గుణం కలిగి ఉండాలంటూ హితవు పలుకుతున్నారు. షాహిద్ ఆఫ్రిది, మహ్మద్ అమీర్లాంటి వాళ్లతో పెట్టుకున్నా.. ఇపుడు కోహ్లితో గొడవపడితే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సోషల్ మీడియా వేదికగా కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా నవీన్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు వారికి మరింత కోపం తెప్పిస్తున్నాయి. ‘‘నీకు ఒక రూల్.. ఇతరులకు మరో రూల్ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకో’’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్- నవీన్ మధ్య వాగ్వాదం జరుగగా.. కోహ్లి జోక్యంతో చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. నవీన్‌తో మొదలైన వివాదం కోహ్లి- గంభీర్ వాగ్వాదం పెట్టుకునేంత వరకు సాగింది. కోహ్లికి సారీ చెప్పి కలిసిపోవాలని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పినా నవీన్ ససేమిరా అన్నాడు. ఇక మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా కూడా కోహ్లితో నవీన్ పరోక్ష పోరుకు దిగడం విశేషం. కోహ్లి తన్ ఇన్‌స్టా పోస్టులో.. ‘‘పైకి కనబడేదంతా నిజం కాదు’’ అన్న అర్థంలో కోట్ షేర్ చేయగా.. నవీన్ సైతం.. ‘‘నువ్వు ఏదైతే పొందేందుకు అర్హుడివో నీకు అదే దక్కుతుంది’’ అంటూ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఐపీఎల్ ఆడటానికి మాత్రమే వచ్చాను ఇక తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు నవీన్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ‘‘నేను ఇక్కడికి ఐపీఎల్ ఆడటానికి మాత్రమే వచ్చాను. ఎవరెవరి చేతనో తిట్టించుకోవడానికి కాదు’’ అని కాస్త పొగరుగానే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఫ్యాన్స్.. ‘‘అందరూ ఆడటానికే వస్తారు. నీ సీనియర్ రషీద్ ఖాన్ ఎప్పటి నుంచో ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఇలాంటి వివాదాల జోలికి పోలేదు. వికెట్ తీసినపుడు నువ్వెంతలా సెలబ్రేట్ చేసుకుంటావో.. ఎదుటి వాళ్ల సంబరాలను చూసి కూడా కాస్త ఓర్వడం నేర్చుకో’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ నవీన్ ఉల్ హక్? ఆఫ్గనిస్తాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ 2021లో ఐర్లాండ్‌పై ఆఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడిన నవీన్ 14 వికెట్లు తీశాడు.అఫ్గన్ తరఫున 27 టీ20లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాదే ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఐపీఎల్-2023 మినీవేలంలో 23 ఏళ్ల నవీన్‌ను రూ.50లక్షలకు లక్నో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నవీన్ 7 వికెట్లు సాధించాడు. కోహ్లితో గొడవ నేపథ్యంలో గత రెండ్రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చదవండి: ధోని కాదు.. డీకే కూడా కాలేడు! ఇలాంటివి సహజం.. మా వల్లే ఒత్తిడిలో కూరుకుపోయి! కోహ్లి- గంభీర్ గొడవ.. జరిగిందిదే! గౌతం ఆ మాట అనడంతో: ప్రత్యక్ష సాక్షి Full video mil gyi match ki..#LSGvsRCB #gautamgambhir #ViratGambhirFight #VIRATKOHLI #naveenulhaq #KohliGambhir pic.twitter.com/DVO8S1zCvA — Sipu 🇮🇳 (@shishpal10np) May 3, 2023 -
కోహ్లి- గంభీర్ గొడవ.. జరిగిందిదే! గౌతం ఆ మాట అనడంతో: ప్రత్యక్ష సాక్షి
IPL 2023 LSG Vs RCB- #ViratGambhirFight: ‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత మేయర్స్, విరాట్ పక్క పక్కనే నడుస్తూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్లినట్లు టీవీలో కనిపించింది. తమ పట్ల పదే పదే ఎందుకు అభ్యంతకరంగా ప్రవర్తించావంటూ మేయర్స్.. కోహ్లిని అడిగాడు. అందుకు బదులుగా కోహ్లి.. నువ్వెందుకు నావైపు చూస్తూ ఉన్నావు అని కౌంటర్ ఇచ్చాడు. అంతకంటే ముందు అమిత్ మిశ్రా.. విరాట్ కోహ్లి.. నవీన్ ఉల్ హక్‌ను పదే పదే తమను టీజ్ చేస్తున్నాడంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ పరిణామాలన్నిటినీ గౌతం గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించాడు. అందుకే మేయర్స్‌ను వెనక్కి లాగి.. కోహ్లితో మాట్లాడవద్దని చెప్పాడు. అప్పుడు విరాట్ వెంటనే మాట వదిలేశాడు. ఆ తర్వాత ఇరువర్గాలు పరిణతి లేకుండా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే’’ అంటూ విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదం గురించి నాటి మ్యాచ్‌లో పరిస్థితులను దగ్గరగా చూసిన ప్రత్యక్షసాక్షి ఒకరు పీటీఐతో వ్యాఖ్యానించారు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. దిగజారుడు ప్రవర్తన ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. సొంతమైదానంలో లక్నోను ఓడించి చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు ముఖ్యంగా విరాట్ కోహ్లి లక్నో బ్యాటింగ్ సమయంలో దూకుడుగా వ్యవహరించడం.. తర్వాత గంభీర్‌తో గొడవ వివాదానికి దారితీసింది. సస్పెండ్ చేస్తేనే దీంతో కొంతమంది కోహ్లికి, మరికొంత మంది గంభీర్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. గావస్కర్ వంటి దిగ్గజాలు.. జెంటిల్మన్ గేమ్‌కు మచ్చ తెచ్చిన వీరిద్దరినీ సస్పెండ్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాద సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు వార్తా సంస్థ పీటీతో ముచ్చటిస్తూ అక్కడ ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. వాళ్లను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్లే కోహ్లి- గంభీర్ ఎదురుపడిన తర్వాత.. ‘‘కోహ్లిని పిలిచి గౌతం.. ఏంటి? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘‘నేను మిమ్మల్నేమీ అనలేదే! అయినా మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?’’ అని విరాట్ ప్రశ్నించాడు. అదుపులో పెట్టుకుంటే మంచిది కోహ్లి మాటలకు గౌతం స్పందిస్తూ.. ‘‘నువ్వు మా జట్టు ఆటగాళ్లను తిడుతున్నావంటే నా కుటుంబంలోని వ్యక్తిని తిట్టినట్లే’’ అని పేర్కొన్నాడు. కోహ్లి కూడా ఏమాత్రం తగ్గకుండా.. అవునా.. అయితే, మీ కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోండి అని జవాబిచ్చాడు. తోటి ప్లేయర్లు గొడవ పడుతున్న వీరిద్దరినీ విడదీసే క్రమంలో.. గంభీర్ చివర్లో.. ‘‘అయితే, ఇప్పుడు నేను నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలంటావు!’’ అంటూ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు’’ అని సదరు వ్యక్తి కోహ్లి- గంభీర్ మధ్య జరిగిన వాడివేడి సంభాషణ గురించి తెలిపారు. చదవండి: అత్యుత్తమ గణాంకాలు.. షమీపై సంచలన ఆరోపణలు! అరెస్టు చేయాలంటూ సుప్రీం కోర్టులో IPL 2023: ఐపీఎల్ జట్టుకు కొత్త కెప్టెన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
LSG VS RCB: కోహ్లి-నవీన్-గంభీర్‌లలో తప్పెవరిది..?
కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గంభీర్ల మధ్య నిన్నటి (మే 1) మ్యాచ్ (ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ) సందర్భంగా చోటు చేసుకున్న వివాదం, ఆ తదనంతర పరిణామాలు జెంటిల్మెన్ గేమ్‌కు మాయని మచ్చగా మిగిలిపోనున్నాయి. దిగ్గజ క్రికెట్‌గా వేనోళ్ల కీర్తించబడుతున్న విరాట్ కోహ్లి తన స్థాయిని మరిచి గొడవకు బీజం వేస్తే.. నవీన్ ఉల్ హాక్‌ను సాకుగా చూపి గంభీర్ గొడవను పెద్దది చేసి భారత క్రికెట్ పరువును బజారుకీడ్చాడు. కోహ్లి-నవీన్ వివాదాన్ని గంభీర్ ఆటలో భాగంగా చూసుంటే ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యేది కాదు. అయితే కోహ్లి అంటే మొదటి నుంచి సరిపోని గంభీర్.. ఉద్దేశపూర్వకంగానే కోహ్లితో గొడవను ప్రొలాంగ్ చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు కోహ్లి.. నవీన్‌ను కవ్వించడంతో ఈ గొడవ మొదలయ్యుండకపోవచ్చు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ (ఏప్రిల్ 10) అనంతరం ఈ గొడవ స్టార్ట్ అయ్యిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. (చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్ గొడవకు మూల కారకుడు?) నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఆ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించింది. లక్నో విజయానంతరం ఆ జట్టు మెంటార్ గంభీర్.. ఆర్సీబీ అభిమానులను వారి సొంతగడ్డపై హేలన చేసేలా వ్యంగ్యమైన సంబరాలు చేసుకున్నాడు (నోరు మూయండి అన్నట్లు). సాధారణంగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చే అలవాటున్న కోహ్లి.. నిన్నటి మ్యాచ్ ఆరంభం నుంచే గంభీర్‌పై రివెంజ్‌కు ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే లక్నో వికెట్ కోల్పోయిన ప్రతిసారి స్టేడియంలోని ప్రేక్షకుల వైపు సైగ చేస్తూ తనదైన స్టయిల్లో గంభీర్‌కు చురక తగిలేలా ప్రవర్తించాడు. ఇది మనసులో పెట్టుకునే గంభీర్.. నవీన్ ఇష్యూను హైలైట్ చేసి, కోహ్లిపై పైచేయి సాధించాలని చూశాడు. మరోపక్క నవీన్ సైతం గంభీర్ అండ చూసుకుని సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా కోహ్లితో ఇష్టవచ్చినట్లు ప్రవర్తించాడు. మరి ఈ తంతు గురించి పూర్తిగా తెలిసాక తప్పెవరిదో, ఒప్పెవరిదో మీరే చెప్పండి. (కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..!) -
చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్ గొడవకు మూల కారకుడు?
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ వార్తల్లో నిలిచింది. సోమవారం పోస్ట్ మ్యాచ్ అనంతరం అర్థరాత్రి నుంచి కోహ్లి, గంభీర్ల వాగ్వాదం క్రికెట్‌ను కుదిపేస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఈ అంశమే ప్రస్తావనకు వస్తోంది. నవీన్ ఉల్ హక్ కారణంగా కోహ్లి, గంభీర్‌లు గొడవపడ్డారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అసలు ఈ గొడవకు మూల కారణం వేరే ఉంది. అసలు గొడవ ఎక్కడ మొదలైంది.. దీనికి ఎవరు కారణం అని ఆరా తీస్తే మహ్మద్ సిరాజ్ పేరు బయటికి వచ్చింది. వాస్తవానికి మ్యాచ్‌లో గొడవ ప్రారంభంమైంది సిరాజ్‌తోనే. లక్నో బ్యాటింగ్ 17వ ఓవర్లో ఈ పోరు మొదలైంది. ఈ సందర్భంగా క్రీజులో అమిత్ మిశ్రా, నవీల్ ఉల్ హక్ ఉన్నారు. లక్నో 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. 17వ ఓవర్ వేయడానికి మహ్మద్ సిరాజ్వచ్చాడు. ఈ ఓవర్ తొలి 5 బంతుల్లో సిరాజ్ 8 పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి ఫ్రీ హిట్ అయింది. అయితే ఫ్రీ హిట్‌ను ఎదుర్కోవడంలో నవీన్ విఫలమవడంతో అది డాట్ బాల్ అయింది. తర్వాత సిరాజ్ బంతిని అందుకుని నవీన్ వైపు చూశాడు. అంతే కాకుండా నవీన్ క్రీజులో ఉన్నా.. బంతిని వికెట్‌కి విసిరాడు. ఈ సందర్భంగా సిరాజ్-నవీన్ మధ్య స్వల్ప స్థాయిలో మాటల వాగ్వాదం జరిగింది. ఇక్కడే అసలు గొడవకు బీజం పడింది. ఆ తర్వాత కోహ్లీ జోక్యం చేసుకోవడంతో గొడవ పెద్దదైంది. మధ్యలో అమిత్ మిశ్రా వచ్చి కోహ్లీని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ, కోహ్లి మిశ్రాపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఘటనను అంపైర్‌కు వివరిస్తుండగా కోహ్లీ సహనం కోల్పోయాడు. చివర్లో కోహ్లీ తన షూ డస్ట్ని నవీన్‌కి చూపించాడు. ఆ తర్వాత నుంచి జరిగిన కథంతా మీకు తెలిసిందే. ఇదంతా చూసిన అభిమానులు.. ''దీన్నిబట్టి అసలు గొడవకు సూత్రధారి సిరాజ్ అన్నమాట.. చేయాల్సిదంతా చేసి సిరాజ్ సైడ్ అవ్వగా.. గొడవ ద్వారా కోహ్లి అనవసరంగా హైలెట్ అయ్యాడంటూ'' అభిమానులు తెగ బాధపడ్డారు. చదవండి: నవీన్ ఉల్ హాక్ మామూలోడు కాదు.. అఫ్రిది లాంటి ముదురును కూడా లెక్కచేయలేదు..! -
నవీన్ ఉల్ హాక్ మామూలోడు కాదు.. అఫ్రిది లాంటి ముదురును కూడా లెక్కచేయలేదు..!
లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (మే 1) జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హాక్- గౌతమ్ గంభీర్ల మధ్య వివాదం క్రికెట్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ నోట విన్నా, ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంపై చూసినా ఇదే టాపిక్‌పై డిస్కషన్ నడుస్తోంది. ఎవరికి తోచిన విధంగా వారు కోహ్లి-నవీన్-గంభీర్ల క్యారెక్టర్లను అనలైజ్ చేస్తున్నారు. కోహ్లి-గంభీర్ల మధ్య పచ్చిగడ్డి వేయకుండానే భగ్గుమనేది.. కొందరు గొడవ స్టార్ట్ చేసింది కోహ్లి అంటే, మరికొందరు నవీన్‌ను తప్పుపడుతుంటే, మెజారిటీ శాతం గంభీర్ గొడవను పెద్దది చేసి ఓవరాక్షన్ చేశాడని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా నిజానిజాలు, పూర్వపరాలు తెలుసుకోకుండా కామెంట్లు చేయడం మాత్రం తప్పే. కోహ్లి-గంభీర్ల విషయానికొస్తే.. వీరి మధ్య వైరం ఈనాటిది కాదు. ఇద్దరు కలిసి టీమిండియాకు ఆడే రోజుల నుంచే వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఐపీఎల్లో సైతం వీరు పలు సందర్భాల్లో కొట్టుకునే దాకా వెళ్లారు. ఆట వరకు వీరిద్దరు పర్ఫెక్షనిస్ట్లే అయినప్పటికీ.. వీరి ఆన్ ఫీల్డ్ బిహేవియర్ మాత్రం కెరీర్ ఆరంభం నుంచే బాగోలేదు. భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో వీరిద్దరూ ఫెల్యూర్సే అని చెప్పాలి. అయితే ఉద్దేశపూర్వకంగా గొడవ పడాలని వీరెప్పుడూ అనుకోరని వీరితో పరిచయమున్న ఎవరినడిగినా చెబుతారు. ఆటలో భాగంగా మొదలయ్యే కవ్వింపు కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసింది. అదే నవీన్ ఉల్ హాక్ విషయానికొస్తే.. అమాయకంగా కనిపించే ఈ ఆఫ్ఘానీ పేసర్ చాలా మదురు అని జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అతని చిన్నపాటి కెరీర్ మొత్తం వివాదాల మయం. ప్రపంచం నలుమూలలా జరిగే లీగ్‌ల్లో పాల్గొన్న నవీన్.. దాదాపు ప్రతి చోట ఎవరితో ఒకరితో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓసారి అతని ఘనకార్యాల ట్రాక్ రికార్డుపై లుక్కేస్తే ఈ విషయం క్లియర్‌గా అర్ధమవుతుంది. అమీర్, షాహిద్ అఫ్రిదిలతో గొడవ.. 2020 లంక ప్రీమియర్ లీగ్‌లో నవీన్ తన కంటే మహామదుర్లైన పాకిస్తాన్ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ అమీర్‌లతో గొడవపడ్డాడు. ఆతర్వాత బిగ్‌బాష్ లీగ్-2022లో డి ఆర్కీ షార్ట్‌తో, 2023 లంక ప్రీమియర్ లీగ్‌లో తిసార పెరీరాతో, ఐపీఎల్ 2023లో విరాట్‌తో కయ్యానికి కాలు దువ్వాడు. ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ ప్రాంతానికి చెందిన నవీన్.. దేశవిదేశాల్లో ఆడిన చాలా మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లతో గొడవలు పడ్డాడు. My advise to the young player was simple, play the game and don't indulge in abusive talk. I have friends in Afghanistan team and we have very cordial relations. Respect for teammates and opponents is the basic spirit of the game. https://t.co/LlVzsfHDEQ — Shahid Afridi (@SAfridiOfficial) December 1, 2020 Naveen-ul-Haq fight between other players in SriLanka Premier League Fight 01 : Naveen Vs Thisara Perera#IPL2023 #RCBvLSG #ViratKohli #naveenulhaq #Gambhir #gambhirvskohli #LPL #SriLanka pic.twitter.com/LLXLmf8qle — விடாமுயற்சியுடன் டேவிட் (@DavidVaasu) May 2, 2023 సహచరుడు రషీద్ ఖాన్‌ను చూసి నేర్చుకోవాలి.. అడపాదడపా టాలెంట్‌తో నెట్టుకొస్తున్నాడని కొన్ని ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి, లేకపోతే ఇతన్ని దేకేవాడే లేడు. సహచరులు, గుజరాత్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఎంత హుందాగా వ్యవహరిస్తారో, అందుకు ఇతను పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించి తమ దేశ పరువును పోగొట్టుకున్నాడు. వయసులో పెద్దవాడు, క్రికెట్ దిగ్గజం అయిన విరాట్ కోహ్లి ఆవేశంలో ఓ మాట అన్నాడని సర్దుకుపోయి ఉంటే, ఈ వివాదం ఇంత పెద్దదయ్యే కాదు. మంచికో చెడుకో కోహ్లితో వివాదం కారణంగా చాలామందికి తెలియని నవీన్ పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. -
ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. లేదంటే: కోహ్లి కామెంట్స్ వైరల్
Virat Kohli's Savage Response- Sweet Win vs LSG: ‘‘ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే.. తిరిగి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాలేని పక్షంలో ఎదుటివాళ్లకు ఏదో ఒకటి ఇవ్వాలనే సాహసం చేయకూడదు’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తనను విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. రచ్చ రచ్చ ఐపీఎల్-2023లో లక్నో వేదికగా కేఎల్ రాహుల్ సేనతో ఆర్సీబీ పోరు నేపథ్యంలో నవీన్ ఉల్ హక్, గంభీర్లతో కోహ్లికి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో గత మ్యాచ్‌లో గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిన సైగకు బదులుగా.. కోహ్లి ప్రేమను పంచాలంటూ తమ కెప్టెన్ డుప్లెసిస్‌కు ముద్దులు విసిరాడు. తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులను మరింత ఉత్సాహపరుస్తూ ఆద్యంతం దూకుడు ప్రదర్శించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లక్నోను ఓడించడంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. వాళ్లు మనల్ని ఎంత ఇష్టపడుతున్నారో తెలిసింది ఇందులో కోహ్లి మాట్లాడిన మాటలు హైలైట్‌గా నిలిచాయి. ‘‘ఇక్కడ మేము విజయం సాధించడం అత్యంత ముఖ్యమైనది. అలాంటి సమయంలో మా సొంత మైదానంలో కంటే కూడా ఇక్కడే(లక్నో) ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభించడం విశేషం. మధుర విజయం ఈ అనుభూతి ఎంతో బాగుంది. జట్టుగా మనల్ని వాళ్లు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వాళ్లు మనకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. నిజంగా ఇది మర్చిపోలేని మధుర విజయం. మనం సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పట్టుదలగా నిలబడి ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించిన తీరు అద్భుతం. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మనం సఫలమయ్యాం’’ అని కోహ్లి స్పూర్తిదాయక ప్రసంగం చేశాడు. కోహ్లి అత్యుత్తమ వర్షన్ చూశాం కదా! అదే సమయంలో గంభీర్, నవీన్‌లతో గొడవకు దారి తీసిన పరిస్థితులను పరోక్షంగా ప్రస్తావిస్తూ పనిలో పనిగా గట్టి కౌంటర్ కూడా ఇచ్చిపడేశాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌లోని అత్యుత్తమ వర్షన్‌ని చూశాం కదా? అవునా కాదా? నా పని కేవలం మైదానంలో అందరితో కామ్‌గా డీల్ చేయడమే. ఏదేమైనా మన కర్తవ్యాన్ని మనం పూర్తిం చేశాం’’ అంటూ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: టెస్టుల్లో నంబర్‌వన్‌గా టీమిండియా నేపాల్ సంచలనం.. ఇండియా, పాకిస్తాన్లతో కలిసి! ఇంతకీ టోర్నీ సంగతేంటి? LSG v RCB, Game Day Dressing Room Reactions King Kohli reacts to the win, Faf explains the crucial partnership and how Virat’s aggression helps the team, Karn and Hazlewood talk about their performances, before the team sang the victory song. Watch Game Day for more…#PlayBold pic.twitter.com/Jr0kCzYoIa — Royal Challengers Bangalore (@RCBTweets) May 2, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
LSG Vs RCB: కోహ్లి-గంభీర్ మధ్యే కాదు.. లక్నో-ఆర్సీబీ మధ్య కూడా యుద్ధం జరిగింది..!
అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియం వేదికగా నిన్న (మే 1) జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గౌతమ్ గంభీర్ల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఓ దశలో కోహ్లి-గంభీర్‌లు కొట్టుకునేంత వరకు కూడా వెళ్లారు. నవీన్ సైతం ఏమాత్రం తగ్గలేదు. కోహ్లి తనను టార్గెట్ చేసిన ప్రతిసారి కౌంటర్ అటాక్ చేశాడు. కెప్టెన్ రాహుల్ కోహ్లికి సారి చెప్పమన్నా, ఈ ఆఫ్ఘానీ ఎంత మాత్రం తగ్గలేదు. గంభీర్ సపోర్ట్ చేస్తుండటంతో నవీన్ మరింత రెచ్చిపోయాడు. మ్యాచ్ అనంతరం (మే 2) నవీన్.. కోహ్లితో సోషల్‌మీడియా వార్‌కు కూడా దిగాడు. కోహ్లి చేసిన పోస్ట్‌కు కౌంటర్‌గా మరో పోస్ట్ పెట్టాడు. ఈ రెండు పోస్ట్‌లు ఒకదానితో ఒకటి సంబంధం లేనివే అయినప్పటికీ.. కోహ్లి పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే నవీన్ కూడా తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేయడంతో అందరూ దీన్ని కౌంటర్ అటాక్ అనుకుంటున్నారు. It's 1-1 in IPL 2023. 📸: BCCI/IPL#CricTracker #LSGvRCB pic.twitter.com/CBDOTSMlLc — CricTracker (@Cricketracker) May 2, 2023 ఓ పక్క మైదనంలో కోహ్లి-నవీన్-గంభీర్ల మధ్య వన్ టు టూ ఫైట్ నడుస్తుంటే.. మరోపక్క కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ, గతంలో జరిగిన ఓ సన్నివేశాన్ని టార్గెట్ చేస్తూ లక్నో సూపర్ జెయింట్స్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చింది. ప్రస్తుత సీజన్లోనే ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం అనంతరం లక్నో టీమ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదే మీరు ధైర్యంగా ఆడే విధానం అంటూ ఆర్సీబీని కించపరిచే విధంగా ట్వీట్ చేసింది. దీనికి బదులుగా నిన్న లక్నోపై విజయానంతరం ఆర్సీబీ కూడా ఓ ట్వీట్ చేసింది. ఈ విధంగా మేము ధైర్యంగా ఆడతాము అంటూ లక్నోకు టిట్ ఫర్ టాట్ చేసి చూపించింది. కాగా, ఆర్సీబీ ఈ ఏడాది ప్లే బోల్డ్ అనే నినాదంతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. -
LSG Vs RCB: కోహ్లికి కౌంటరిచ్చిన నవీన్ ఉల్ హాక్.. ఆసక్తికర పోస్ట్
అటల్ బిహారీ వాజ్‌పేయ్ మైదానం వేదికగా నిన్న (మే 1) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న పరిణామాలు సైతం అందరికీ విధితమే. లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హాక్- విరాట్ కోహ్లిల మధ్య మొదలైన చిన్నపాటి మాటల యుద్ధం చినిచినికి గాలి వానలా మారి, జెంటిల్మెన్ గేమ్‌కు మాయని మచ్చ తెచ్చింది. pic.twitter.com/S2YO2OwBgk — Billu Pinki (@BilluPinkiSabu) May 1, 2023 మ్యాచ్ అనంతరం గొడవకు కారకులైన నవీన్, కోహ్లి తమ సోషల్‌మీడియా ఖాతాల్లో చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే. అదే నిజం కాదు. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు. మన దృక్కోణానికి సంబంధించింది మాత్రమే అని అర్థం వచ్చేలా ఓ కోట్‌ను షేర్ చేశాడు. Who the F**k is the naveen ul haq? Disrespecting thE KING #Kohli dont forget poor afghani your country plays cricket bcoz of bCci bloddy beggars!! #RCBVSLSG #gambhir #kohli #naveenulhaq pic.twitter.com/6yklJ750Q2 — Puneet Singh Deol (@PuneetDeol777) May 1, 2023 నవీన్ ఉల్ హాక్ విషయానికొస్తే.. ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు. మీకు అర్హమైనది మీకు దక్కుతుంది. అది ఎలాగైనా జరిగి తీరుతుంది అని అర్ధం వచ్చేలా ఓ కోట్ని షేర్ చేశాడు. కోహ్లి-నవీన్‌లు ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్‌లు చేశారో తెలియదు కానీ, మ్యాచ్ అనంతరం జరిగిన పరిణామాలను మనసులో ఉంచుకునే ఈ కోట్స్ షేర్ చేశారన్నది సుస్పష్టం. latest Instagram stories of Virat Kohli and Naveen-ul- Haq 👀 📸: Instagram/ViratKohli/Naveen-ul-Haq#CricTracker #IPL2023 #LSGvRCB pic.twitter.com/UpUdlAkObG — CricTracker (@Cricketracker) May 2, 2023 కాగా, ఆర్సీబీ నిర్ధేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతి తర్వాత నవీన్-కోహ్లిల మధ్య తొలిసారి మాటల యుద్ధం జరిగింది. ఊహించినంత త్వరగా విజయం దక్కకపోవడంతో (మిశ్రా, నవీన్ ఔటవ్వకుండా ఆడుతున్నారు) అసహనంతో ఉండిన కోహ్లి.. తొలుత మిశ్రాపై, ఆతర్వాత నవీన్‌పై నోరు పారేసుకున్నాడు. The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 అంతటితో ఆగకుండా నవీన్వైపు షూ చూపిస్తూ దుర్భాషలాడినట్లు టీవీల్లో కనిపించింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో మరోసారి కోహ్లి-నవీన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో గంభీర్ జోక్యంతో ఈ వివాదం పెద్దదైంది. గంభీర్-కోహ్లి ఇద్దరూ కొట్టుకునేంత దాకా వెళ్లారు. ఆ సమయంలో మైదానం రణరంగాన్ని తలపించింది. ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్న రిఫరీ.. కోహ్లి-గంభీర్ల మ్యాచ్ ఫీజుల్లో 100 శాతం.. నవీన్ మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు. Naveen😭😭😭 king ko apne ling pe rakh raha pic.twitter.com/O4Qf0tVZyz — Masum💛 (@chicken_heartz) May 1, 2023 Here is the whole fight scenario 🥶🥶.#LSGvsRCB #viratkholi #gautamgambhir pic.twitter.com/Km3PAdFXIu — 𝕄𝕦𝕞𝕓𝕒𝕚 ℂ𝕙𝕒 ℝ𝕒𝕛𝕒 👑 (@mumbai_raja_) May 1, 2023 -
LSG Vs RCB: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్
IPL 2023- Kohli Vs Gambhir: ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం నాటి మ్యాచ్ ప్రేక్షకులకు మజాను అందించింది. నువ్వా- నేనా అంటూ హోరాహోరీగా సాగిన పోరులో సొంతమైదానంలో తమకు ఎదురైన పరాభవానికి ఆర్సీబీ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో డుప్లెసిస్ బృందం 18 పరుగుల తేడాతో లక్నోను చిత్తు చేసింది. 126 పరుగులకే ఆర్సీబీ కథ ముగియడంతో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాకిచ్చింది. సమష్టి ప్రదర్శనతో.. సూపర్‌జెయింట్స్‌పై గెలుపొందింది. ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నో పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ కోల్పోవడంతో ఆర్సీబీ స్టార్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సహా మిగతా ఆటగాళ్లంతా తమదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కోహ్లి దూకుడు మామూలుగా లేదు ఇక ఒక్కో వికెట్ పడటం, అద్బుత ఫీల్డింగ్‌తో రనౌట్ల రూపంలో ప్రత్యర్థిని దెబ్బకొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో రన్‌మెషీన్ కోహ్లి సంతోషం అంబరాన్నింటింది. చిన్నస్వామి స్టేడియంలో లక్నో గెలుపు తర్వాత ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిన సైగలకు.. కౌంటర్ ఇచ్చాడు కోహ్లి. షాకిచ్చిన బీసీసీఐ మ్యాచ్ ఆద్యంతం ఫుల్ ఎనర్జీతో దూకుడుగా కనిపిస్తూ.. ముద్దులు విసురుతూ తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్‌తో వివాదం, మ్యాచ్ అనంతరం గంభీర్‌తో వాగ్వాదం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుచిత ప్రవర్తన కారణంగా కోహ్లి, గంభీర్‌లకు.. బీసీసీఐ భారీ జరిమానా రూపంలో పనిష్మెంట్ ఇచ్చింది. చూసేదంతా నిజం కాదు ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే. అదే నిజం కాదు. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు. మన దృక్కోణానికి సంబంధించింది మాత్రమే’’ అనే అర్థం ఉన్న కోట్‌ను కోహ్లి షేర్ చేశాడు. గంభీర్‌తో వివాదం అనంతరం విరాట్ ఈ మేరకు పోస్ట్ పెట్టడం గమనార్హం. కాగా నవీన్, గంభీర్‌తో కోహ్లి వివాదం నేపథ్యంలో కింగ్ అభిమానులు అతడికి అండగా నిలుస్తుండగా.. మరికొంత మంది మాత్రం కోహ్లి అతి తగ్గించుకుంటే మంచిదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో కోహ్లి ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇస్తూ మండిపడుతున్నారు. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ఇంకా జట్టులో అవసరమా? తీసిపడేయండి IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా! Who the F**k is the naveen ul haq? Disrespecting thE KING #Kohli dont forget poor afghani your country plays cricket bcoz of bCci bloddy beggars!! #RCBVSLSG #gambhir #kohli #naveenulhaq pic.twitter.com/6yklJ750Q2 — Puneet Singh Deol (@PuneetDeol777) May 1, 2023 The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి గంభీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. వీరిద్దరూ మరోసారి జెంటిల్ మేన్ గేమ్‌ని వీధిపాలు చేశారు. ఏం జరిగిందంటే? ఈ ఏడాది సీజన్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత గంభీర్ నోటి మీద వేలు వేసుకొని.. ఇక నోరు మూసుకోండి అన్నట్టుగా సైగ చేశాడు. ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో కోహ్లి రివేంజ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగినట్లు సృష్టంగా కన్పించింది. లక్నో వికెట్లు పడినప్పుడు దూకుడుగా సెల్రబేషన్స్ చేయడం, ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం లాంటివి చేశాడు. ఈ క్రమంలో లక్నో ఇన్నింగ్స్ 17 ఓవర్లో పేసర్ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య చిన్న పాటి మాటల యుద్దం జరిగింది. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడువ సద్దుమణిగింది. అయితే అది అక్కడతో ఆగలేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చే సమయంలో మళ్లీ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్‌ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. చదవండి: #Kohli, Gambhir Fight: గౌతం గంభీర్, విరాట్ కోహ్లికి బిగ్ షాక్.. భారీ జరిమానా పో నేనేం సారీ చెప్పను.. ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్ కోహ్లి, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన నవీన్ ఉల్-హక్‌ను కోహ్లికి క్షమాపణ చెప్పమని రాహుల్ అడిగాడు. అయితే నవీన్ మాత్రం నేనేం సారీ చెప్పను పో అన్నట్టుగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇంత తలపొగరా? ఇక నవీన్ ఉల్-హక్ ప్రవర్తనపై విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో ఇటువంటి సహజం. దాన్ని సీరియస్‌గా తీసుకుని సారీ చెప్పకపోవడం ఏంటి? మరి ఇంత తలపొగరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: IPL 2023: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. కింగ్ ఏం చేశాడంటే? Naveen😭😭😭 king ko apne ling pe rakh raha pic.twitter.com/O4Qf0tVZyz — Masum💛 (@chicken_heartz) May 1, 2023 The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023