అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియం వేదికగా నిన్న (మే 1) జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గౌతమ్ గంభీర్‌ల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఓ దశలో కోహ్లి-గంభీర్‌లు కొట్టుకునేంత వరకు కూడా వెళ్లారు. నవీన్ సైతం ఏమాత్రం తగ్గలేదు. కోహ్లి తనను టార్గెట్ చేసిన ప్రతిసారి కౌంటర్ అటాక్ చేశాడు. కెప్టెన్ రాహుల్ కోహ్లికి సారి చెప్పమన్నా, ఈ ఆఫ్ఘానీ ఎంత మాత్రం తగ్గలేదు. గంభీర్ సపోర్ట్ చేస్తుండటంతో నవీన్ మరింత రెచ్చిపోయాడు.
మ్యాచ్ అనంతరం (మే 2) నవీన్.. కోహ్లితో సోషల్‌మీడియా వార్‌కు కూడా దిగాడు. కోహ్లి చేసిన పోస్ట్‌కు కౌంటర్‌గా మరో పోస్ట్ పెట్టాడు. ఈ రెండు పోస్ట్‌లు ఒకదానితో ఒకటి సంబంధం లేనివే అయినప్పటికీ.. కోహ్లి పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే నవీన్ కూడా తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేయడంతో అందరూ దీన్ని కౌంటర్ అటాక్ అనుకుంటున్నారు.
It's 1-1 in IPL 2023.
— CricTracker (@Cricketracker) May 2, 2023
📸: BCCI/IPL#CricTracker #LSGvRCB pic.twitter.com/CBDOTSMlLc
ఓ పక్క మైదనంలో కోహ్లి-నవీన్-గంభీర్‌ల మధ్య వన్ టు టూ ఫైట్ నడుస్తుంటే.. మరోపక్క కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ, గతంలో జరిగిన ఓ సన్నివేశాన్ని టార్గెట్ చేస్తూ లక్నో సూపర్ జెయింట్స్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చింది.
ప్రస్తుత సీజన్‌లోనే ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం అనంతరం లక్నో టీమ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదే మీరు ధైర్యంగా ఆడే విధానం అంటూ ఆర్సీబీని కించపరిచే విధంగా ట్వీట్ చేసింది. దీనికి బదులుగా నిన్న లక్నోపై విజయానంతరం ఆర్సీబీ కూడా ఓ ట్వీట్ చేసింది. ఈ విధంగా మేము ధైర్యంగా ఆడతాము అంటూ లక్నోకు టిట్ ఫర్ టాట్ చేసి చూపించింది. కాగా, ఆర్సీబీ ఈ ఏడాది ప్లే బోల్డ్ అనే నినాదంతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment