ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లితో గొడవ పెట్టుకున్నప్పటి నుంచి లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్‌ను నెటిజన్లు, ముఖ్యంగా విరాట్ అభిమానులు, టీమిండియా అభిమానులు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. నవీన్.. కోహ్లిని ఉద్దేశిస్తూ ఏ పోస్ట్ చేసినా, వారు తగు రీతిలో ఘాటుగా జవాబిస్తున్నారు. ఈ క్రమంలో నవీన్ ట్విటర్ అకౌంట్ నుంచి రెండు రోజుల కిందట వచ్చిన ఓ పోస్ట్ నెట్టింట వైరలైంది.
ఆ ట్వీట్‌లో ఏముందంటే.. విరాట్ సర్.. ఐయామ్ సారి, నేను మీకు పెద్ద అభిమానిని.. చిన్నప్పటి నుంచి మీరే నా ఆరాధ్య క్రికెటర్.. నా రూమ్ మొత్తం మీ పోస్టర్లతోనే నిండి ఉంటుంది.. లక్నోని వదిలి మీ కెప్టెన్సీలో ఆర్సీబీకి ఆడాలనుంది అంటూ నవీన్ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే నెట్టింట హల్‌చల్ చేసింది. నవీన్ పశ్చాత్తాపపడుతున్నట్లున్నాడని కోహ్లి అభిమానులు అనుకున్నారు.
అది నా ట్విటర్ అకౌంట్ కాదు.. ఫేక్: నవీన్ ఉల్ హక్
అయితే, కొద్ది గంటల తర్వాత ఈ ట్వీట్ నవీన్ ఉల్ హక్ చేయలేదని తెలిసింది. ఈ విషయంపై అతనే స్వయంగా స్పందించాడు. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ రన్ చేస్తున్నారని, తాను కోహ్లికి క్షమాపణ చెబుతున్నట్లు ట్వీట్ చేయలేదని తన అఫిషియల్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చాడు.
కాగా, ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా కోహ్లి.. గంభీర్-నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన వన్ టు టూ ఫైట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాహాబాహీకి దిగినంత పని చేశారు. అనంతరం వీరు సోషల్‌మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకున్నారు.
ఈ విషయంలో కోహ్లి కాస్త సైలెంట్ అయినా నవీన్ మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాడు. గంభీర్ అండదండలతో కోహ్లిని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. దీనికి ప్రతిగా కోహ్లి ఆర్మీ సైతం గంభీర్, నవీన్‌లపై ఎదురుదాడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఫేక్ అకౌంట్ నుంచి కోహ్లికి అనుకూలంగా ట్వీట్ రావడం.. దానిపై నవీన్ స్పందించడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment