IPL 2023: LSG Broke The Internet By Praising Virat Kohli On Twitter - Sakshi
Sakshi News home page

IPL 2023: కోహ్లిని గంభీర్‌, నవీన్‌లు కవ్విస్తుంటే.. లక్నో యాజమాన్యం ఏం చేసిందో చూడండి..!

Published Mon, May 22 2023 9:15 PM | Last Updated on Tue, May 23 2023 9:00 AM

IPL 2023: LSG Broke The Internet By Praising Virat Kohli On Twitter - Sakshi

ఐపీఎల్‌ 2023లో ఆర్సీబీ-లక్నో మధ్య మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి.. గంభీర్‌-నవీన్‌ ఉల్‌ హక్‌ల మధ్య జరిగిన వన్‌ టు టూ ఫైట్‌ గురించి అందరికీ తెలిసిందే. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ సందర్భంగా వీరు ముగ్గురు బాహాబాహీకి దిగినంత పని చేశారు. అనంతరం వీరు సోషల్‌మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో కోహ్లి కాస్తంత సైలెంట్‌ అయినా నవీన్‌ ఉల్‌ హక్‌ మాత్రం ఓవరాక్షన్‌ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. తాజాగా (మే 21) గుజరాత్‌పై కోహ్లి వీరోచిత శతకం చేసిన తర్వాత కూడా నవీన్‌.. కింగ్‌ కోహ్లిని కవ్వించాడు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేసి కోహ్లితో పాటు ఆర్సీబీని కూడా ఎగతాళి చేశాడు. 

ఇదంతా ఒకెత్తైతే.. గుజరాత్‌-ఆర్సీబీ మ్యాచ్‌ అనంతరం గంభీర్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం మాత్రం కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తి ఆకాశానికెత్తింది. లక్నో మేనేజ్‌మెంట్‌ తమ ట్వీట్‌లో కోహ్లిని కొనియాడింది. కోహ్లి తన చివరి రెండు మ్యాచ్‌ల్లో వీరోచితమైన శతకాలు బాది తమను భయపెట్టాడని.. అతను ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తి అని ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే కోహ్లిని ఆల్‌టైమ్‌ గ్రేట్‌ (GOAT) ఐకాన్‌తో గౌరవించింది. లక్నో చేసిన ఈ ట్వీట్‌తో కోహ్లి అభిమానులు కాస్త శాంతించారు. గంభీర్‌,నవీన్‌లను టార్గెట్‌ చేసే డోస్‌ను కాస్త తగ్గించారు. మన ప్రవర్తనను బట్టి ఇతరుల ప్రవర్తన ఆధారపడి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఆర్సీబీ-లక్నో జట్లు క్వాలిఫయర్స్‌లో కాని, ఎలిమినేటర్‌లో కాని, ఫైనల్లో కాని ఎదురెదురుపడాలని అభిమానులు ఆశించారు. అయితే వారి ఆశ నెరవేరలేదు. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్‌ గెలవడంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి వీరోచిత శతకం వృధా కాగా.. శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో గుజరాత్‌-సీఎస్‌కే.. మే 24న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్‌ 2లో క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్‌ 1 విన్నర్‌-క్వాలిఫయర్‌ 2 విన్నర్లు తలపడతాయి. 

చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న విరాట్‌ కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement