ఐపీఎల్-2023 సందర్భంగా కోహ్లి- గంభీర్ గొడవ (PC: IPL)
ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి- లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. విరాట్‌పై అసూయతోనే గౌతీ వాగ్వాదానికి దిగినట్లు అనిపించిందన్నాడు. ఏదేమైనా ఓ క్రికెటర్‌గా ఇలా ఇద్దరు ఆటగాళ్లు మైదానంలోనే తగువు దిగడం తనను బాధించిందన్నాడు.
కాగా లక్నో వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్- ఉల్- హక్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ నవీన్ కోహ్లితో దురుసుగా ప్రవర్తించాడు.
దీంతో గొడవ పెద్దది కాగా గౌతం గంభీర్ జోక్యం చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి- నవీన్ గొడవ.. కోహ్లి- గంభీర్ మధ్య అగ్గిరాజేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాట్‌కు మద్దతునివ్వగా.. మరికొందరు గౌతీకి అండగా నిలిచారు.
ఈ క్రమంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన అహ్మద్ షెహజాద్.. గౌతీ కావాలనే గొడవకు దిగినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ‘‘ఓ ప్రేక్షకుడిగా, ఆటగాడిగా.. ఆ దృశ్యాలు నన్ను కలచివేశాయి. నాకైతే.. కోహ్లి మీద అసూయతోనే గౌతం గంభీర్ గొడవ పెద్దది చేశాడనిపించింది.
ఎన్నో రోజులుగా సమయం కోసం వేచి చూసి మరీ వివాదానికి తెరలేపినట్లు... విరాట్‌ను వివాదంలోకి లాగేందుకు వాగ్వాదానికి దిగాడేమో అన్నట్లు అనిపించింది. అయినా, ఆటగాళ్ల మధ్య గంభీర్ తలదూర్చాల్సిన అవసరం ఏమిటో నాకింకా అర్థం కాలేదు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని.. ఇందులో కోహ్లి తప్పేం లేదని టీమిండియా స్టార్‌ను సమర్థించాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో తలపడిన తొలి సందర్భంలో సొంతగడ్డపై ఆర్సీబీని లక్నో ఓడించగా.. రెండోసారి పోరులో ఆర్సీబీ..లక్నోను చిత్తు చేసింది. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. లక్నో టాప్-4లో నిలిచింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో భారీ తేడాతో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది.
చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని!
Comments
Please login to add a commentAdd a comment