Ahmed Shehzad
-
బుమ్రా కాదు.. అతడే బెస్ట్ ఫాస్ట్ బౌలర్: పాక్ క్రికెటర్
ఆధునికతరం ఫాస్ట్ బౌలర్లలో టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా ఉన్న ఈ రైటార్మ్ పేసర్ భారత్‌కు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించాడు. తనదైన బౌలింగ్ శైలితో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా మాజీ క్రికెటర్ల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు.అయితే, పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ మాత్రం బుమ్రా గురించి భిన్నంగా స్పందించాడు. ఈ తరం బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడన్న షెహజాద్.. తన దృష్టిలో మాత్రం పాక్ లెజెండ్ వసీం అక్రం మాత్రమే అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్ అని పేర్కొన్నాడు.నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అహ్మద్ షెహజాద్‌ను హోస్ట్ బెటర్ పేసర్‌ను ఎంచుకోవాలంటూ.. వసీం అక్రం, వకార్ యూనిస్, షేన్ బాండ్, జస్ప్రీత్ బుమ్రా, షాన్ టైట్, మిచెల్ స్టార్క్ పేర్లను చెప్పాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఇది చాలా సులువైన ప్రశ్న. మీరు చెప్పినవాళ్లలో అందరి కంటే బెస్ట్ పేసర్ వసీం అక్రం’’ అని షెహజాద్ పేర్కొన్నాడు.ఇక బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుత బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడు. అతడొక వరల్డ్ క్లాస్ బౌలర్. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్నవాడు’’ అని షెహజాద్ భారత పేసర్‌ను ప్రశంసించాడు. అదే విధంగా.. అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరన్న ప్రశ్నకు బదలిస్తూ.. ‘‘రషీద్ లతీఫ్.. రిషభ్ పంత్ కంటే బెటర్ కీపర్’’ అని షెహజాద్ చెప్పుకొచ్చాడు. కాగా బుమ్రా, రిషభ్ పంత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో కంగారూల చేతిలో ఓడింది. మూడో టెస్టు డ్రా కాగా.. ఇరుజట్ల మధ్య మెల్బోర్న్, సిడ్నీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
మరీ స్కూల్ పిల్లల్లా ఆడారు: పాక్ మాజీ బ్యాటర్ విమర్శలు.. ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్ సేన మరీ స్కూల్ పిల్లల్లా ఆడిందని.. వీరిని ‘పేపర్ టైగర్స్’ అనాలంటూ విమర్శించాడు. అయితే, టీమిండియా అభిమానులు సైతం.. ‘‘మా జట్టు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ షెహజాద్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 46 పరుగుల(తొలి ఇన్నింగ్స్)కే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అనంతరం పుణె వేదికగా రెండో టెస్టులోనూ 113 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 0-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌లో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ సైతం స్పందించాడు. భారత జట్టుపై న్యూజిలాండ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. రోహిత్ సేన పేపర్‌పై మాత్రమే పటిష్టంగా కనిపిస్తుందని.. మైదానంలో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగాఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో.. ‘‘న్యూజిలాండ్ ఇండియాకు వచ్చి టీమిండియానే ఈ స్థాయిలో ఓడించింది. ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగా సునాయాస విజయం సాధించింది. ఇప్పటి నుంచి టీమిండియాను చాలా మంది పేపర్ టైగర్స్ అంటారు.మొదటి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయినపుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రతి ఒక్కరికి చెడ్డరోజు ఒకటి ఉంటుందని చెప్పాడు. మేము కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తాం. కానీ.. రెండో టెస్టులో మీరేం చేశారు? పూర్తిగా ఓటమికి సిద్ధపడ్డట్లే కనిపించారు. బయటివాళ్ల మాటలు పట్టించుకోమని రోహిత్ శర్మ అంటున్నాడు.కానీ.. ఈ రెండు టెస్టులను చూస్తే మీరు ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమైంది. ఏదో స్కూల్ పిల్లలు ఆడుతున్నట్లుగా ఆడారు’’ అని అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ బదులిస్తూ.. ‘‘పాకిస్తాన్ వరుస ఓటముల తర్వాత ఒక్క సిరీస్ గెలిచింది. మీ సంగతి ఏమిటి?మరి మీ జట్టు చిత్తుగా ఓడినపుడు మీరెందుకు ఇలా మాట్లాడలేదు. టీమిండియా తిరిగి పుంజుకుంటుంది. అయినా.. మా జట్టు ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. ఈసారి కూడా టైటిల్ పోరుకు చేరువైంది. మరి మీ సంగతి ఏమిటి?’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కాగా సొంతగడ్డపై చిత్తుగా సిరీస్‌లు ఓడిన పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్‌పై 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన విషయ తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నవంబరు 1 నుంచి ముంబైలో మూడో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపికైన కమ్రాన్ గులామ్, మహ్మద్ అలీలను ఈ సిరీస్‌కు పక్కన పెట్టడాన్ని చాలా పాక్ మాజీలు తప్పబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాక్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ చేరాడు. సెలక్టర్లపై షెహజాద్ విమర్శలు గుప్పించాడు. గులామ్, మహ్మద్ అలీలను జట్టు నుంచి ఎందుకు తప్పించిరంటూ సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించాడు. "కమ్రాన్ గులాంకు మరోసారి మొండి చేయి చూపించారు. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. ఎలాగో ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో జమాల్‌ను సెలక్ట్ చేశారు. జమాల్ సైతం పూర్తి ఫిట్నెస్తో లేడు.అంతేకాకుండా షాహీన్ అఫ్రిది కూడా గాయంతో బాధపడుతున్నాడు. అటువంటిప్పుడు పేసర్ మహమ్మద్ అలీని జట్టులోకి తీసుకోవచ్చుగా. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. వీరిద్దరితో పాటు మరో యువ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ సైతం డొమాస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడిని కూడా జట్టులోకి తీసుకోవడం లేదు.ఇందుకు సెలక్టర్లు ఏమి సమాధానం చెబుతారు? వారు చేసిన తప్పు ఏమిటి? బాబర్ బ్యాటింగ్ చేసే పొజిషన్లోనే బ్యాటింగ్ చేయడమా? కనీసం కమ్రాన్‌కు అయినా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఈ జట్టును సెలక్టర్‌గా యూసుఫ్ భాయ్ ఎంపిక చేశాడు.కాబట్టి కమ్రాన్ గులామ్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు ఒక్క కారణం చెప్పండి అంటూ" షెహజాద్ మండిపడ్డాడు. కాగా కమ్రాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ వన్ డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అతడు 49.60 సగటు, 100 స్ట్రైక్-రేట్‌తో 248 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది. -
విరాట్ కోహ్లి ఒక లెజెండ్.. బాబర్‌తో పోలికేంటి: పాక్ మాజీ క్రికెటర్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం అనంతరం పొట్టి క్రికెట్‌కు కోహ్లి విడ్కోలు పలికాడు. ఈ మెగా టోర్నీ మొత్తం పేలవ ఫామ్ కనబరిచి విమర్శలు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. కీలకమైన ఫైనల్లో మాత్రం సత్తాచాటాడు. టాపార్డర్ విఫలమైన చోట కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికాకు ముందు మెరుగైన స్కోర్ ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలర్లు సంచలన ప్రదర్శన చేయడంతో భారత్ రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రదర్శనగాను కింగ్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో కోహ్లికి మించిన క్రికెటర్ మరొకడు లేడని షెహజాద్ అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి ఒక లెజెండ్. మా తరంలో అతడిని మించిన క్రికెటర్ మరొకడు లేడు. విరాట్ తన టీ20 కెరీర్‌ను ఘనంగా ముగించాడు. తన కెరీరంతటా కోహ్లి అద్బుతంగా ఆడాడు. ఆఖరికి చివరి మ్యాచ్‌లో కూడా కోహ్లి అదరగొట్టాడు. అది విరాట్ కోహ్లి బ్రాండ్. ఫైనల్లో తన సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడితే.. విరాట్ మాత్రం బౌండరీల వర్షం కురిపించాడు. అందుకే విరాట్‌ను మించిన వాడు లేడని నేను పదేపదే చెబుతున్నాను. విరాట్‌ను గతంలో చాలా మంది బాబర్ ఆజంతో పోల్చారు. కానీ అది సరికాదు. విరాట్‌కు ఎవరూ సాటిరారు. కోహ్లి ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ , యావరేజ్ కలిగి ఉన్నాడు. వరల్డ్ క్రికెట్లో ఒకే ఒక్క విరాట్ కోహ్లి ఉంటాడని" ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు. -
దమ్ముంటే వరల్డ్‌కప్ గెలవండి: బాబర్‌కు పాక్ మాజీ బ్యాటర్ సవాల్
వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ .. టీ20 ఫార్మాట్లో మాత్రం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఎనిమిదో ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న బాబర్ ఆజం బృందం.. ఈసారి తమ తలరాతను మార్చుకోవాలని పట్టుదలగా ఉంది.అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు పాక్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. బాబర్ స్థానంలో షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్‌గా రావడం.. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 5-0తో వైట్‌వాష్ కావడం.. ఆ తర్వాత బాబర్ తిరిగి పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇదిలా ఉంటే.. పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో మిలిటరీ టైప్ ట్రెయినింగ్ రూపంలో పాక్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో కూడా పాక్ చిత్తుగా ఓడిపోయింది.దమ్ముంటే ఈసారి వరల్డ్‌కప్ సాధించుఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ బాబర్ ఆజంను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. దమ్ముంటే ఈసారి వరల్డ్‌కప్ గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరాడు.ఈ మేరకు.. ‘‘పాకిస్తాన్ క్రికెటర్ల క్రమశిక్షణ గురించి మాట్లాడాలంటే తెల్లారిపోతుంది. మనం ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు.అయితే, క్రికెట్ గురించి మాత్రం మాట్లాడొచ్చు కదా! జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్నపుడు, నా కంటే ఎవరూ ఎక్కువ కాదనే భావనలో మునిగిపోయినపుడు.. వరల్డ్‌కప్ గెలిచి చూపించాలి.ఇప్పటికే ఐదు టోర్నమెంట్లు ఆడినా.. మీలో మార్పు రాకపోతే ఎలా?’’ అంటూ ఓ టాక్ షోలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ బాబర్ ఆజంపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2024లో పాక్ జట్టు టీమిండియా, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏతో పాటు గ్రూప్-ఏలో ఉంది. జూన్ 6న యూఎస్ఏతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్-2024: పాకిస్తాన్ జట్టుబాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.చదవండి: T20 WC 2024: ఈసారి ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా కెప్టెన్ -
కోహ్లి మీద అసూయతోనే గంభీర్ అలా చేశాడు: పాక్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి- లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. విరాట్‌పై అసూయతోనే గౌతీ వాగ్వాదానికి దిగినట్లు అనిపించిందన్నాడు. ఏదేమైనా ఓ క్రికెటర్‌గా ఇలా ఇద్దరు ఆటగాళ్లు మైదానంలోనే తగువు దిగడం తనను బాధించిందన్నాడు. కాగా లక్నో వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్- ఉల్- హక్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ నవీన్ కోహ్లితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో గొడవ పెద్దది కాగా గౌతం గంభీర్ జోక్యం చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి- నవీన్ గొడవ.. కోహ్లి- గంభీర్ మధ్య అగ్గిరాజేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాట్‌కు మద్దతునివ్వగా.. మరికొందరు గౌతీకి అండగా నిలిచారు. ఈ క్రమంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన అహ్మద్ షెహజాద్.. గౌతీ కావాలనే గొడవకు దిగినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ‘‘ఓ ప్రేక్షకుడిగా, ఆటగాడిగా.. ఆ దృశ్యాలు నన్ను కలచివేశాయి. నాకైతే.. కోహ్లి మీద అసూయతోనే గౌతం గంభీర్ గొడవ పెద్దది చేశాడనిపించింది. ఎన్నో రోజులుగా సమయం కోసం వేచి చూసి మరీ వివాదానికి తెరలేపినట్లు... విరాట్‌ను వివాదంలోకి లాగేందుకు వాగ్వాదానికి దిగాడేమో అన్నట్లు అనిపించింది. అయినా, ఆటగాళ్ల మధ్య గంభీర్ తలదూర్చాల్సిన అవసరం ఏమిటో నాకింకా అర్థం కాలేదు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని.. ఇందులో కోహ్లి తప్పేం లేదని టీమిండియా స్టార్‌ను సమర్థించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో తలపడిన తొలి సందర్భంలో సొంతగడ్డపై ఆర్సీబీని లక్నో ఓడించగా.. రెండోసారి పోరులో ఆర్సీబీ..లక్నోను చిత్తు చేసింది. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. లక్నో టాప్-4లో నిలిచింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో భారీ తేడాతో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని! -
'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం'
పాకిస్తాన్ క్రికెటర్లలో మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లలో అహ్మద్ షెహజాద్ ఒకడు. 2009లో 17 ఏళ్ల వయసులో పాక్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అహ్మద్ షెహజాద్ టాప్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చేవాడు. పాక్ తరపున షెహజాద్ 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2016లో టి20 ప్రపంచకప్ అనంతరం అహ్మద్ షెహజాద్‌పై వేటు పడింది. ఇక చివరిసారి 2019లో పాక్ తరపున టి20 ఆడిన అహ్మద్ షెహజాద్ అప్పటినుంచి మళ్లీ జట్టులోకి రాలేదు. 2016 టి20 ప్రపంచకప్ అనంతరం అప్పటి పాక్ కోచ్ వకార్ యూనిస పీసీబీకి రిపోర్ట్ అందజేశాడు. ఆ రిపోర్ట్‌లో షెహజాద్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్ పేర్లు జతచేర్చాడు. ఈ ఇద్దరిని జట్టు నుంచి తొలగిస్తే మంచిదని రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఈ కారణంతో అహ్మద్ షెహజాద్‌పై వేటు పడింది. ఆ తర్వాత క్రమంగా అతను జట్టుకు దూరమయ్యాడు. తాజాగా అహ్మద్ షెహజాద్ తనను జట్టు నుంచి తీసివేయడంపై స్పందించాడు. ''టీమిండియా లాగా పాకిస్తాన్ క్రికెట్లో సీనియర్ల నుంచి మద్దతు లభించదు. దీనికి ఉదాహరణ టీమిండియాలో కోహ్లి- ధోనిలు. కోహ్లి ఫామ్ కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్.. సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని కోహ్లికి అండగా నిలబడ్డాడు. వరుసగా విఫలమవుతూ వస్తున్నా కోహ్లికి అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. ఆ తర్వాత కోహ్లి సూపర్ ఫామ్ అందుకొని తిరిగి రాణించాడు. కానీ దురదృష్టం కొద్ది పాకిస్తాన్లో అలా ఉండదు. ఇక్కడ ఒక ఆటగాడు బాగా పరుగులు చేస్తున్నాడంటే సీనియర్లలో కుళ్లు, అసూయ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది నిజంగా దురదృష్టకరమనే చెప్పొచ్చు. నాపై రిపోర్ట్ ఇచ్చిన కమిటీని నేను తప్పు బట్టను. ఎందుకంటే పీసీబీ అడిగింది.. కమిటీ వాళ్ల డ్యూటీ చేసింది. కానీ రిపోర్ట్ ఇచ్చేముందు ఒకసారి నేరుగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఏది సరైనది.. ఏది తప్పు అనేది క్లియర్‌గా చెప్పాల్సింది. జట్టులో నేను అగ్రెసివ్‌గా ఉండడం మూలానా జట్టులో గొడవలు వస్తున్నాయని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని నాకు డైరెక్ట్‌గా చెప్పి ఉంటే పద్దతి మార్చుకునేవాడిని'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్‌లో అలా కాదు! -
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి మళ్లీ కష్టాల్లోకి..
కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన షెహజాద్ అహ్మద్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తిరిగి ఇబ్బందుల్ని కొనితెచ్చుకున్నాడు. క్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజామ్.. సింధ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ ఆకారాన్ని దెబ్బ తీసే యత్నం చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)దృష్టికి వెళ్లడంతో పాటు దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో అజామ్ కెరీర్ డైలమాలో పడింది. ‘ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన అజామ్‌పై విచారణ చేపట్టాం. అతనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైసలాబాద్‌లో సింధ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండో రోజు ఆటలో షెహజాద్ బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు రిఫరీ నదీమ్ దృష్టికి తీసుకెళ్లడంతో షెహజాద్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా క్రమ శిక్షణా నియమావళిని ఉల్లంఘించడం షెహజాద్ ఇది తొలిసారి కాదు. 2018లో యాంటీ డోపింగ్ రూల్స్‌ను అతిక్రమించి నాలుగు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దాంతో గతేడాది జూలై 10వ తేదీన అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది పీసీబీ. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన షెహజాద్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో విమర్శల పాలయ్యాడు. కాకపోతే కోచ్ మిస్బావుల్ హక్ మాత్రం షెహజాద్‌కు మద్దతుగా నిలవడంతో ఊరట లభించింది. అయితే ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకున్న షెహజాద్‌పై పీసీబీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
‘ఆ ఇద్దర్నీ మరింత ప్రమాదంలోకి నెట్టకండి’
కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసిన అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్‌లకు ఆ జట్టు ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ మద్దతుగా నిలిచాడు. వారిద్దరూ వచ్చిన సత్తాచాటుకోవాలంటే కష్టమని మిస్బా పేర్కొన్నాడు. కనీసం వారిద్దరూ టచ్‌లోకి రావడానికి కనీస మద్దతు ఇస్తే వారు తమ పూర్వ ఫామ్‌ను అందిపుచుకుంటారన్నాడు. అంతేకానీ ఏదో ఒకటి రెండు ప్రదర్శనలతో తర్వాత ఆ ఇద్దరిపై విమర్శలు వారి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించాడు. ఇక ఒత్తిడిలో ఉన్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అండగా నిలిచాడు మిస్బావుల్ హక్. ‘ప్రమాదంలో ఉన్నవారు సాయం కోసం ప్యానిక్ బటన్ నొక్కినట్లు షెహజాద్, ఉమర్ అక్మల్ విషయంలో చేయకండి. వారు తిరిగి ఫామ్‌లోకి వస్తారు. దయచేసి మరింత ప్రమాదంలోకి నెట్టవద్దు. వారి నుంచి ఆశించిన ప్రదర్శన రావాలంటే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇక సర్ఫరాజ్‌ను ఒత్తిడి నుంచి బయట పడేయటం కూడా నా విధుల్లో భాగం’ అని మిస్బా పేర్కొన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో షెహజాద్, ఉమర్ అక్మల్‌లు విఫలమైన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిస్బావుల్ మాట్లాడుతూ.. ఒక్క ప్రదర్శన కారణంగా విమర్శలు చేయడం తగదన్నాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రయోగాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. -
క్యాచ్ వదిలేశాడు.. రివ్యూ కోరాడు!
లాహోర్: క్యాచ్ వదిలేసి రివ్యూ కోరిన పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘పాకిస్తాన్ కప్’లో భాగంగా ఈ నెల 2న లిస్ట్ ఎ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇందులో ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఫెడరల్ ఏరియాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షెజాద్.. ఖైబర్ పఖ్తుంఖ్వాతో జరిగిన మ్యాచ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు రివ్యూ కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఖైబర్ పఖ్తుంఖ్వా ఆటగాడు ఖుష్దిల్ షా భారీ షాట్‌కు యత్నించాడు. డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న షెహజాద్ బంతిని అందుకునే ప్రయత్నంలో జారవిడిచాడు. కిందపడిన బంతిని తిరిగి చేతిలోకి తీసుకుని క్యాచ్ అందుకున్నట్టు నటించాడు. అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూ కోరి అభాసుపాలయ్యాడు. కిందపడిన బంతిని తీరిగ్గా చేతుల్లోకి తీసుకున్నట్టు రివ్యూలో స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతుండడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్లు చీటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా నువ్వు ఇలానే చేశావ్.. ఉమర్ అక్మల్‌ను తలపిస్తున్నావ్. మీకు అసలు బుర్ర ఉందా అంటూ ఒకరు ఎద్దేవా చేయగా, ‘సరైన క్రికెట్ ఆడని నువ్వు.. గిల్లీ దండా ఆడుకో’ అని మరొక అభిమాని విమర్శించాడు. ‘నువ్వు కెమెరా ఆన్‌లో ఉండగానే ఇలా చీట్ చేస్తే, కెమెరా ఆన్‌లో లేని దేశవాళీ క్రికెట్లో ఇలాంటివి ఎన్ని మోసాలు చేశావో’ అంటూ మరొకరు విరుచుకుపడ్డారు. ‘నువ్వు మహా నటుడిలా ఉన్నావే’ అని మరొక అభిమాని చమత్కరించాడు. -
క్యాచ్ వదిలేశాడు.. రివ్యూ కోరాడు!
-
డోపింగ్ టెస్టులో దొరికిన పాక్ క్రికెటర్!
ఇస్లామబాద్: పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ డోపింగ్ పరీక్షలో దోషిగా తేలాడు. అతడు నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రుజువైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అతనికి నోటిసులు జారీ చేస్తూ.. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు బోర్డు అధికారిక ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. షెహజాద్ పాకిస్తాన్‌లోనిర్వహించిన పరీక్షల్లోనే డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైందని, కానీ భారత్‌లోని ల్యాబ్‌కు పంపించి పీసీబీ మరోసారి నిర్ధారించుకుందని డాన్ పత్రిక పేర్కొంది. గత జూన్‌లో పేరు చెప్పకుండా ఓ క్రికెటర్ డోపింగ్ పాల్పడ్డాడని తెలిపిన పీసీబీ రిపోర్టులు అందడంతో నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఎలాంటి క్రికెట్ ఆడకుండా షెహజాద్‌పై కొంత కాలం నిషేదం పడే అవకాశం ఉంది. నిలకడలేమి ఆటతో జట్టులో చోటు కోల్పోయిన 26 ఏళ్ల షెహజాద్.. స్కాట్లాండ్తో జరిగిన రెండు టీ20ల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆస్ట్రేలియా, జింబాంబ్వేలతో జరిగిన ముక్కోణపు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక డోప్ టెస్టులో విఫలమైన పాక్ క్రికెటర్లలో షెహజాద్ మొదటి వాడేం కాదు.. 2012లో డోప్ టెస్టులో విఫలమైన పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజా హసన్ రెండేళ్ల నిషేదం ఎదుర్కొనగా.. యాసిర్ షా, అబ్దుర్ రెహమాన్‌లు తాత్కాలిక నిషేదాలు ఎదుర్కొన్నారు. -
కోహ్లీతో పోల్చుకుని భంగపడ్డ పాక్ క్రికెటర్
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తనను భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుకుని భంగపడ్డాడు. తాను విరాట్‌లా ఉంటానని, పరుగులు చేయడంలో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని తరచూ చెబుతుంటాడు. ఇటీవల షెహజాద్ తనను కోహ్లీతో పోల్చుకోవడంపై నెటిజన్లు గట్టిగా చురకలు అంటించారు. విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్లకు వారి జట్టు సభ్యులు, అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందని, అయితే ఈ విషయంలో తాను దురదృష్టవంతుడినని షెహజాద్ చెప్పినట్టుగా పాక్‌కు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు ఇటీవల ట్వీట్ చేశాడు. దీన్ని చూడగానే క్రికెట్ అభిమానులు ట్వీట్లతో షెహజాద్‌ను ఉతికిఆరేశారు. కోహ్లీ, రూట్, విలియమ్సన్‌లతో షెహజాద్ పోల్చుకోవడం సిగ్గుచేటని, వాళ్లతో పోల్చుకునే అర్హత లేదని ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు. షెహజాద్ వ్యాఖ్యలను తప్పుపడుతూ పాక్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. కోహ్లీ అన్ని ఫార్మాట్లతో దుమ్ములేపుతూ పరుగుల వర్షం కురిపిస్తుండగా, షెహజాద్ ఏమో జట్టులో చోటు దొరకగా నానా పాట్లు పడుతున్నాడు. టి-20 ప్రపంచ కప్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీంతో కోహ్లీ ఆటతీరుతో షెహజాద్ తనను పోల్చుకోవడం అభిమానులకు నచ్చలేదు. -
ఆ క్రికెటర్లను విరాట్‌తో పోల్చలేం!
కరాచీ: ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ క్రికెటర్లు అహ్మద్ షెహ్జాద్, ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) భారీ అంచనాలు పెట్టుకోవడం అనవసరమని ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభిప్రాయడ్డాడు. ఒకవేళ వారి నుంచి పాక్ క్రికెట్ బోర్డు ఎక్కువగా ఆశిస్తే పొరబడినట్లేనని తెలిపాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో స్థానం కోల్పోయిన ఆ క్రికెటర్లను విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ స్థాయి క్రికెటర్లగా అంచనా వేయవద్దని ఆఫ్రిది సూచించాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టులో అటు ఆఫ్రిదితో పాటు, షెహజాద్, అక్మల్లపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే షెహజాద్, అక్మల్ లు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కారణంగా పాక్ బోర్డు వీరిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే దీనిపై మాట్లాడిన ఆఫ్రిది.. ఏ స్థాయి క్రికెటరైనా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నాడు. -
వెంటాడుతున్న ప్రపంచ కప్ వైఫల్యం
లాహోర్: టి-20 ప్రపంచ కప్‌లో విఫలమైన పాకిస్తాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిదీ, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్‌కు నిరాశ ఎదురైంది. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో ఈ ముగ్గురికి ఆడే అవకాశం దక్కలేదు. ఇంజమామ్ ఉల్ హక్ సారథ్యంలోని పాక్ సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్ టూర్‌కు 35 ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితాను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 14 నుంచి జూన్ 4 వరకు ఖైబర్-పాక్టుంక్వా ప్రావిన్స్‌లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. టి-20 ప్రపంచ కప్‌లో విఫలమైనందుకు అఫ్రిదీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్ పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణ చర్యల కింద వారిపై వేటు వేశారు. ఇంగ్లండ్ పర్యటనలో పాక్ నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి-20 మ్యాచ్ ఆడనుంది. -
కోలుకున్న పాకిస్తాన్
కొలంబో : తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే కుప్పకూలిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మెరుగ్గా ఆడుతోంది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (154 బంతుల్లో 69; 4 ఫోర్లు; 1 సిక్స్), అజహర్ అలీ (152 బంతుల్లో 64 బ్యాటింగ్; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకోవడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 59 ఓవర్లలో రెండు వికెట్లకు 171 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వీరిద్దరు 120 పరుగులు జోడించారు. లంక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి ఇంకా పాక్ 6 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో అలీతో పాటు యూనిస్ (35 బంతుల్లో 23 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు. లంక తొలి ఇన్నింగ్స్‌లో 121.3 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌట్ అయ్యి 177 పరుగుల ఆధిక్యం సాధించింది. యాసిర్ షాకు ఆరు వికెట్లు దక్కాయి. -
షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీ
న్యూఢిల్లీ: తమ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అది తెలివితక్కువతనంతో చేసిన పనిగా విమర్శించారు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్‌తో షెహజాద్ చేసిన మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘మైదానంలో మతం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించడం నిజంగా మూర్ఖత్వం. ఆ వ్యాఖ్యలు స్నేహపూర్వకంగానే చేసినా తప్పే. ఇప్పటికే ఈ ఘటనపై త్రిసభ్య కమిటీని నియమించాం. మా క్రమశిక్షణ కమిటీ మరోసారి ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తుంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వారిది నిజంగా సరైన నిర్ణయం’ అని ఖాన్ అన్నారు. మరోవైపు షెహజాద్ విషయాన్ని దిల్షాన్ తేలిగ్గా తీసుకున్నాడు. ఆ సమయంలో తానేం మాట్లాడానో కూడా గుర్తులేదన్నాడు. 26/11 పై తేలాకే సిరీస్‌లు జరగవచ్చు! ముంబైలో 2008లో జరిగిన 26/11 దాడుల కేసు పూర్తిగా ముగిసే వరకు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ కష్టమేనని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అన్నారు. ఈ నెలలో జరిగే చాంపియన్స్ లీగ్‌లో లాహోర్ లయన్స్ పాల్గొనే అంశంపై కూడా ఇంకా స్పష్టత లేదని ఖాన్ అన్నారు. ఒక వేళ లాహోర్ జట్టు భారత్‌లో ఆడకపోతే... వచ్చే ఎనిమిదేళ్లలో ఇరు జట్ల మధ్య నిర్వహించాలని ప్రతిపాదిస్తున్న సిరీస్‌లపై కూడా దీని ప్రభావం పడవచ్చని ఆయన అన్నారు. అక్టోబరులో జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ అధికారులతో తాను మరింత వివరంగా చర్చించాల్సి ఉందని షహర్యార్ వెల్లడించారు.