ఆధునికతరం ఫాస్ట్ బౌలర్లలో టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా ఉన్న ఈ రైటార్మ్ పేసర్ భారత్‌కు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించాడు. తనదైన బౌలింగ్ శైలితో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా మాజీ క్రికెటర్ల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు.
అయితే, పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ మాత్రం బుమ్రా గురించి భిన్నంగా స్పందించాడు. ఈ తరం బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడన్న షెహజాద్.. తన దృష్టిలో మాత్రం పాక్ లెజెండ్ వసీం అక్రం మాత్రమే అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్ అని పేర్కొన్నాడు.
నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అహ్మద్ షెహజాద్‌ను హోస్ట్ బెటర్ పేసర్‌ను ఎంచుకోవాలంటూ.. వసీం అక్రం, వకార్ యూనిస్, షేన్ బాండ్, జస్‌ప్రీత్ బుమ్రా, షాన్ టైట్, మిచెల్ స్టార్క్ పేర్లను చెప్పాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఇది చాలా సులువైన ప్రశ్న. మీరు చెప్పినవాళ్లలో అందరి కంటే బెస్ట్ పేసర్ వసీం అక్రం’’ అని షెహజాద్ పేర్కొన్నాడు.
ఇక బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుత బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడు. అతడొక వరల్డ్ క్లాస్ బౌలర్. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్నవాడు’’ అని షెహజాద్ భారత పేసర్‌ను ప్రశంసించాడు.
అదే విధంగా.. అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరన్న ప్రశ్నకు బదలిస్తూ.. ‘‘రషీద్ లతీఫ్.. రిషభ్ పంత్ కంటే బెటర్ కీపర్’’ అని షెహజాద్ చెప్పుకొచ్చాడు. కాగా బుమ్రా, రిషభ్ పంత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నారు.
ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో కంగారూల చేతిలో ఓడింది. మూడో టెస్టు డ్రా కాగా.. ఇరుజట్ల మధ్య మెల్‌బోర్న్, సిడ్నీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment