Rashid Latif
-
పాక్ క్రికెట్ అంపశయ్య మీద ఉంది: మాజీ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం అంపశయ్య మీద ఉందని.. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు ప్రస్తుతం అత్యవసరమని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. బాబర్ ఆజం కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. బాబర్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా పాక్ జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది.వరుస పరాభవాలువన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడమే గాకుండా.. సూపర్-8కు కూడా చేరకుండానే ఇంటిబాటపట్టింది.ఐసీయూలో ఉందిఇక ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలిసారిగా టెస్టుల్లో ఓడిపోవమే గాక.. 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఫలితంగా పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. పరిస్థితిని చక్కదిద్దగల ప్రొఫెషనల్ డాక్టర్ కావాలి. ఆర్థికంగానూ బోర్డు బలపడాల్సిన ఆవశ్యకత ఉంది.సమస్యల సుడిగుండంలో పాక్ జట్టు సరైన కోచ్‌లు కూడా ముఖ్యమే. పాక్ జట్టు సమస్యల సుడిగండంలో కూరుకుపోయింది. మైదానం లోపల.. వెలుపలా పరిస్థితి ఒకేలా ఉంది’’ అని పేర్కొన్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోవడమే ఉత్తమమన్న రషీద్ లతీఫ్.. బ్యాటర్‌గా జట్టుకు అతడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా పాకిస్తాన్ తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడనుంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌కు బాబర్, టెస్టులకు షాన్ మసూద్ ప్రస్తుతం సారథులుగా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు మరో బిగ్‌షాక్!? -
టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది: పాక్ మాజీ కెప్టెన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చీఫ్‌గా జై షా నియామకాన్ని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యతిరేకించడం లేదని.. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా తప్పక తమ దేశానికి వస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో పీసీబీకి ఈ మేరకు అవగాహన కుదిరిందని చెప్పుకొచ్చాడు.పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025కాగా 2017 తర్వాత తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీపైనే భారం వేసిన పాక్ బోర్డుఈ క్రమంలో హైబ్రిడ్ విధానంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని.. అందుకు తగ్గట్లుగానే టీమిండియా మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా తమ దేశంలోనే నిర్వహిస్తామని.. ఆ జట్టును తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ బాస్‌గా నియమితుడు కావడంతో పాక్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన రషీద్ లతీఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు.సగం ప్రక్రియ పూర్తైంది‘‘జై షా నియామకాన్ని పీసీబీ ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనే అనుకుంటున్నా. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్ వస్తే.. అందుకు జై షానే కారణం అనుకోవచ్చు. భారత ప్రభుత్వ మద్దతుతో అతడు బోర్డును ఒప్పిస్తాడు. ఇందుకు సంబంధించి సగం ప్రక్రియ పూర్తైంది. టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది’’ అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా సంచలనానికి తెరతీశాడు. కాగా 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇక భారత జట్టుకు అక్కడికి వెళ్లి పదహారేళ్లకు పైనే అయింది. 2008లో చివరగా టీమిండియా పాక్‌లో పర్యటించింది. 2013 తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు తెరపడింది.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
'#Rest In Peace.. పాకిస్తాన్ క్రికెట్'
పాకిస్తాన్ జట్టులో ప్రస్తుతం శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు బాబర్ ఆజం స్థానంలో షాదాబ్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). బాబర్ ఆజంతో పాటు పాక్ నెంబర్‌వన్ బౌలర్ షాహిన్ అఫ్రిది సహా ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్‌లను రెస్ట్ పేరుతో పక్కనబెట్టింది. పాకిస్తాన్ జట్టును కొత్తగా తయారు చేయాలన్న ఉద్దేశంతో పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ ఆధ్వర్యంలోని బోర్డు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే పీసీబీ చేస్తున్న మార్పులపై పాక్ మాజీ క్రికెటర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పాకిస్తాన్ జట్టు ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్(#Rest In Peace) మోడ్‌లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లను పక్కనబెట్టడం నచ్చని లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''కొన్నాళ్లుగా మన ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో, అవార్డులు గెలుచుకోవడంలో ముందుంటున్నారు. అంతేకాదు బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదిలు గతేడాది ఐసీసీ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇది వాళ్లకు(పీసీబీ) నచ్చలేదు. అందుకే బోర్డు రూపంలో తమకు హక్కు ఉందంటూ నచ్చనివారిపై వేటు వేసేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఫామ్‌లో ఉన్న.. విశ్రాంతి అవసరం లేని ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తూ.. 70, 80 ఏళ్ల వయసులో ఉన్న బోర్డు సభ్యులు రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అజమాయిషీ చెలాయిస్తూ పాకిస్తాన్ క్రికెట్‌ను మార్చాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ రెస్ట్ ఇన్ పీస్‌లో ఉందని చెప్పగలను. కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ మొత్తం జట్టునే ప్రక్షాళన చేయాలనుకోవడం మూర్కత్వం కిందకు వస్తుంది. జట్టులోకి ఎవరైతే కొత్త ఆటగాళ్లు వచ్చారో వారిని అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు ఆడనివ్వండి.. కానీ సీనియర్లతో కాంబినేషన్‌తో ఆడించడం మంచింది. ఈ విషయంలో మీడియా కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ నాశనానికి ఇదే తొలి అడుగులా కనిపిస్తుంది'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ చదవండి: పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు -
టీమిండియా టైటిళ్లు గెలవకపోతే, కోహ్లి 100 సెంచరీలు కొట్టినా వేస్టే..!
టీమిండియా క్రికెటర్లపై సమయం దొరికినప్పుడంతా అక్కసుతో కూడిన కామెంట్స్ చేయడం పాకిస్తాన్ మాజీలకు పరిపాటిగా మారింది. రమీజ్ రజా, షోయబ్ అక్తర్, షాహీద్ అఫ్రిది లాంటి వారికైతే టీమిండియా క్రికెటర్లపై నెగిటివ్ కామెంట్స్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు. ఈ జాబితాలోకి తాజాగా మరో పాకీ చేరాడు. కొద్దికాలం పాటు పాక్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ లతీఫ్.. తాజాగా పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై నోరు పారేసుకున్నాడు. కోహ్లి రికార్డులను ఉద్దేశించి వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. కోహ్లి 100 సెంచరీలు సాధించడం ముఖ్యం కాదని, దేశానికి టైటిళ్లు అందించడమే ముఖ్యమని ఎద్దేవా చేశాడు. భారత క్రికెట్ అభిమానులు కోహ్లి రికార్డుల కోసం ఎదురుచూడట్లేదని, టీమిండియా టైటిల్ సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచుస్తున్నారని అన్నాడు. ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా దారుణ వైఫల్యాలను ఎత్తి చూపాడు. కోహ్లి 200 సెంచరీలు కొట్టినా, టీమిండియా టైటిళ్లు గెలవకపోతే ఉపయోగం లేదని ఎద్దేవా చేశాడు. బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో కోహ్లి 44వ వన్డే శతకం సాధించిన అనంతరం ల'తీఫ్' ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 100 శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బంగ్లాపై సెంచరీతో కోహ్లి.. 72 అంతర్జాతీయ శతకాలతో రికీ పాంటింగ్‌ను (71) వెనక్కునెటి సచిన్ తర్వాతి స్థానానికి ఎగబాకాడు. వన్డేల్లో కోహ్లి మరో 6 శతకాలు బాదితే ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా అవతరిస్తాడు. -
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు, టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా వెల్లడించాడు. కాగా ఆసియా కప్-2022లో పాకిస్తాన్జట్టులో భాగంగా ఉన్న జమాన్ అంతగా అకట్టుకోలేపోయాడు. ఈ మెగా టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన జమాన్ కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన ఫైనల్లో ఫఖర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. "ఫఖర్ జమాన్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతోంది. అతడు త్వరగా కోలుకోని జట్టులో చేరాలని ఆశిస్తున్నాను. మరోవైపు షాహీన్ అఫ్రిది కూడా ఇదే గాయంతో బాధపడుతున్నాడు" అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు పాక్ జట్టును పీసీబి గురువారం ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: Babar Azam: అతడి కెరీర్ నాశనం చేస్తున్నారు! బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవలేదు! -
కోహ్లి ఎప్పటికీ రోహిత్ లేదంటే సూర్యకుమార్ కాలేడు: పాక్ మాజీ కెప్టెన్
Ex- Pakistan Captain Criticises Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ విమర్శలు గుప్పించాడు. టీ20 ఫార్మాట్లో అతడు ఎప్పటికీ రోహిత్ శర్మ లేదంటే సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడు కాలేడని వ్యాఖ్యానించాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా.. సమకాలీన క్రికెటర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు సాధించాడు. అయితే, ఇటీవలి కాలంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి.. ఆసియా కప్-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 35 పరుగులు(34 బంతులు), హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో 59 పరుగులు(44 బంతుల్లో- నాటౌట్) సాధించాడు. కోహ్లి గొప్ప టీ20 ప్లేయర్ కాలేడు! ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ షోలో మాట్లాడిన రషీద్ లతీఫ్.. కోహ్లిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్లో కోహ్లి ఎప్పటికీ గొప్ప ప్లేయర్ కాలేడని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడతాడని.. కోహ్లి మాత్రం 30-35 బంతులు ఎదుర్కొన్న తర్వాత.. అప్పుడు హిట్టింగ్ ఆడేందుకు ప్రయత్నిస్తాడన్నాడు. ఈ మేరకు లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్‌లతో విరాట్ కోహ్లిని పోలుస్తాం. నిజానికి వీళ్లంతా టీ20లలో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన దాఖలాలు లేవు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లి వన్డేల్లో గొప్ప క్రికెటర్.. కానీ ఎప్పటికీ గొప్ప టీ20 ప్లేయర్ మాత్రం కాలేడు. రోహిత్ శర్మ లేదంటే సూర్యకుమార్ యాదవ్‌లా అస్సలు ఆడలేడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా.. ‘‘30- 35 బంతులు ఎదుర్కొన్న తర్వాతే కోహ్లి హిట్టింగ్ ఆడటం మొదలుపెడతాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా ఇలాగే ఆడేవాడు. అయితే, రోహిత్ శర్మ పవర్ ప్లేలో కావాల్సినన్ని పరుగులు రాబడతాడు. దూకుడు ప్రదర్శిస్తాడు’’ అని లతీఫ్ పేర్కొన్నాడు. అవును.. నిజమే! కాగా అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 101 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మొత్తంగా 3402 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 94. అర్ధ శతకాలు 31. ఇక ఐపీఎల్లో 223 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 6624 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 113. ఐదు శతకాలు, 44 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 134 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 3520 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 118. నాలుగు శతకాలు.. 27 అర్ధ శతకాలు సాధించాడు. ఐపీఎల్లో 227 మ్యాచ్‌లలో భాగమై... 5879 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 109. సాధించిన శతకాలు, అర్ధ శతకాలు వరుసగా 1, 40. ఈ నేపథ్యంలో ఈ గణాంకాలను ఉదాహరిస్తూ కోహ్లిని ఉద్దేశించి లతీఫ్ చేసిన వ్యాఖ్యలపై కింగ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘‘అవును.. నిజమే.. కింగ్ కోహ్లి ఎప్పటికీ రోహిత్ శర్మ లేదంటే సూర్యకుమార్ యాదవ్ కాలేడులే’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం(సెప్టెంబరు 4) టీమిండియా సూపర్-4 స్టేజ్‌లో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: Serena Wiliams: సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం Virat Kohli: భార్య అనుష్కతో కలిసి ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేసిన కోహ్లి.. ధర ఎంతంటే! Ind Vs Pak: హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరూ తుది జట్టులో ఉండాల్సిందే! -
'గతేడాది పాక్ చేతిలో ఓటమి భారత్‌ను బాగా డ్యామేజ్ చేసింది.. ఈ సారి మాత్రం'
ఆసియా కప్-2022లో భాగంగా టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా తలపడనుంది. అయితే గతేడాది ఇదే వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ఎక్కడ అయితే ఓటమి చవిచూసిందో అక్కడే దానికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కీలక వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాక్ చేతిలో ఓటమి భారత్‌ను బాగా దెబ్బతీసిందని లతీఫ్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్లో లతీఫ్ మాట్లాడుతూ.. "ప్రపంచకప్ ఓటమి భారత జట్టు మైండ్‌లో ఉంటుందని నేను అనుకోవడంలేదు. టీమిండియా ప్రస్తుతం ప్రతీ సిరీస్‌లోను విజయం సాధిస్తోంది. అదే విధంగా ప్రతీ సిరీస్‌లోనూ వారి జట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ భారత్ వెనుకంజ వేయడం లేదు. ప్రస్తుతం టీమిండియా దృష్టింతా ఆసియాకప్ పైనే ఉంది. అయితే గతేడాది పాకిస్తాన్ చేతిలో ఓటమి మాత్రం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే వారు తమ లోపాలను సవరించుకుని ముందుకు సాగుతున్నారు. కాగా పాక్, భారత్ జట్లు వేర్వేరుగా చాలా సిరీస్‌లు ఆడవచ్చు. కానీ భారత్-పాక్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠత ఉంటుంది. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌పై భారత జట్టుతో పాటు, బీసీసీఐ కూడా ప్రత్యేక శ్రద్ద చూపుతుందని భావిస్తున్నాను. కీలక ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉంటే ఆసియా కప్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా ఉంటుంది. యూఏఈలో పరిస్థితులు కూడా టీమిండియాకు కూడా అనుకూలంగా ఉంటాయి. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ తన సత్తా చాటడం ఖాయం. గత 20 ఏళ్లగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ లలో భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్నది. అయితే పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది" అని పేర్కొన్నాడు. చదవండి: WC 2022: ఓపెనర్‌గా పంత్, ఇషాన్.. సూర్య కాదు! అతడే సరైనోడు! జట్టులో చోటే లేదే! -
"పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు "
గత కొంత కాలంగా వివిధ సిరీస్‌లో కెప్టెన్లను మారుస్తున్న భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 1990లలో పాకిస్తాన్ జట్టు కూడా ఇదే విధంగా సారథిలను మారుస్తూ వచ్చింది అని రషీద్ లతీఫ్ అన్నాడు. అప్పుడు పాకిస్తాన్ చేసిన తప్పునే భారత్ ఇప్పుడు చేస్తుందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత 8 నెలల నుంచి భారత జట్టుకు ఇప్పటి వరకు ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహారించారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్,జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్ భారత్‌కు సారథిలుగా పనిచేశారు. ఇక తాజాగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు కూడా ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం అందరూ బ్యాకప్ కెప్టెన్లు గురించి మాట్లాడుతున్నారు. కానీ భారత్ మాత్రం గత ఏడాది నుంచి ఏకంగా ఏడుగురు సారథిలను మార్చింది. భారత క్రికెట్ చరిత్రలో నేను ఈ పరిస్థితిని చూడటం ఇదే మొదటిసారి. టీమిండియా వరుసగా విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి వారిని వివిధ సిరీస్‌లకు తమ సారథిలుగా నియమించింది. అది జట్టుకు మంచిది కాదు. ప్రస్తుతం భారత జట్టు తీరు చూస్తుంటే టీమిండియా సైతం 1990లలో పాకిస్తాన్ చేసిన తప్పే చేస్తున్నట్టుంది. ప్రస్తుతం భారత జట్టుకు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి లాంటి నాయకుడు కావాలి అని పేర్కొన్నాడు. కాగా 1990లలో పాకిస్తాన్ కూడా ఇదే విధంగా తమ కెప్టెన్లను పదే పదే మార్చింది. 1992లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, సలీమ్ మాలిక్, వకార్ యూనిస్, రమీజ్ రాజా, రషీద్ లతీఫ్, సయూద్ అన్వర్, అమీర్ సొహైల్ లు పాకిస్తాన్ జట్టుకు సారథ్యం వహించారు. చదవండి: Nicholas Pooran: వాళ్ల వల్లే ఈ దుస్థితి! మరీ చెత్తగా! ఇకపై: విండీస్ కెప్టెన్ -
'ఐపీఎల్ అంటేనే బిజినెస్'.. విషం చిమ్మిన పాక్ మాజీ క్రికెటర్
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అన్ని క్రికెట్ లీగ్ల్లోకెళ్లా అత్యధిక సంపాదన అర్జిస్తుంది. దీనికి అనుబంధగా ఉన్న బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా ఏటా కాసుల పంట కురుస్తుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా రైట్స్ ఈ వేలం బోర్డుకు కనివినీ ఎరుగని రీతిలో కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 2023-2027 మధ్య ఐదేళ్ల కాలానికి గానూ రూ.48, 390 కోట్ల రికార్డు ధరకు ఐపీఎల్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఈ వేలం ప్రక్రియలో డిస్సీ స్టార్ రూ.23,575 కోట్లు వెచ్చించి ఐపిఎల్ టీవీ హక్కులు సొంతం చేసుకోగా.. ముఖేష్ అంబానికి చెందిన వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ రూ. 24,815 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాయి. దీంతో ప్రపంచంలో ఐపీఎల్ ప్రస్తుతం బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్‌గా అవతరించింది. అంతేకాదు అంతర్జాతీయంగా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(యూఎస్ఏ), నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(యూఎస్ఏ), ఇంగ్లీష్ ప్రమీయర్ లీగ్(ఇంగ్లండ్) సరసన ఐపీఎల్ కూడా చోటు దక్కించుకుంది. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ విలువ ధర కూడా భారీగా పెరిగిపోయింది. గతంలో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54.5 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.114 కోట్లకు చేరుకోవడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన లీగ్‌గా ఐపీఎల్ దూసుకెళ్తుంటే కొంతమంది మాత్రం పనిగట్టుకొని విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అంతా బిజినెస్ అని.. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారని తెలిపాడు. లతీఫ్ మాట్లాడుతూ..''ఐపీఎల్ గురించి మాట్లాడితే క్రికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐపీఎల్ అంతా బిజినెస్. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారు..డబ్బులే ముఖ్యమనుకుంటే అదే దారిలో చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.. వారిని కూడా జత చేసుకోండి. ఐపీఎల్లో బిజినెస్ ఎక్కువయ్యి క్వాలిటి తగ్గిపోయింది. అంతా కమర్షియల్ అయిపోవడంతో ప్రస్తుతం ఐపీఎల్ చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది.ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఒక భారతీయుడిని పిలిచి మీరు ఎన్ని గంటలు మ్యాచ్ చూస్తున్నారని అడగండి.. సమాధానం మీకే తెలుస్తుంది. అందుకే అంటాను ఐపీఎల్ ఒక బిజినెస్ అని.. నా మాటకు కట్టుబడి ఉంటా'' అంటూ పేర్కొన్నాడు. -
రోహిత్ నోరు జారి ఉంటాడు.. అతడు ఆల్‌టైమ్ గ్రేట్ ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్
రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఇటీవల అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. భారత జట్టు తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశూ రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 435వ వికెట్ సాధించాడు. తద్వారా టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్(434 వికెట్లు)రికార్డును అధిగమించాడు. పర్యాటక లంక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా అసలంకను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఇక రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయంలో బౌలర్ల పాత్ర మరువలేనిది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో తన వంతు సహకారం అందించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ అశూపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘నా దృష్టిలో అతడు ఆల్ టైమ్ గ్రేట్. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అందుకే నా అభిప్రాయం ప్రకారం తను ఎల్లప్పుడూ గొప్ప ఆటగాడే’’ అంటూ కొనియాడాడు. అతే, ఈ విషయంలో తాను రోహిత్ శర్మ వ్యాఖ్యలతో ఏకీభవించలేనని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అన్నాడు. భారత క్రికెట్లో అశూ దిగ్గజ బౌలర్ అంటే ఒప్పుకోనన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘అశ్విన్ గొప్ప బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. ముఖ్యంగా స్వదేశంలో టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. కాబట్టి భారత్‌లో అతడు అత్యుత్తమ స్పిన్నర్ అని చెప్పవచ్చు. అయితే, విదేశాల్లో మాత్రం నా అభిప్రాయం ప్రకారం అనిల్ కుంబ్లే గొప్ప బౌలర్. బిషన్ సింగ్ బేడీ కూడా అద్భుత బౌలర్. కాబట్టి రోహిత్ శర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవించలేను. బహుశా రోహిత్ నోరు జారి ఉంటాడు. లేదంటే ఆటగాళ్లను ప్రోత్సహించే క్రమంలో అశూను ఆల్ టైమ్ గ్రేట్ అని ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. కాగా అశ్విన్ స్వదేశంలోనే పైగా వికెట్లు సాధించాడు. చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
బాబర్, రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు..
Rashid Latif Comments On Team India: పాకిస్థాన్ మాజీ వికెట్‌కీపర్ రషీద్ లతీఫ్ భారత క్రికెట్ అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు లేరని టీమిండియా ఫ్యాన్స్ బాధపడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ లతీఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా పాక్ పరిమిత ఓవర్ల ఓపెనింగ్ జోడీ(బాబర్, రిజ్వాన్)పై ప్రశంసల వర్షం కురిపించిన లతీఫ్.. భారత అభిమానులను తక్కువ చేసి మాట్లాడాడు. ఏడాది కిందట పాక్ అభిమానులు సైతం తమ జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు లేరని బాధపడేవాళ్లని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బాబర్, రిజ్వాన్ ద్వయం తిరుగులేనిదని, ఈ జోడీ మున్ముందు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని జోస్యం చెప్పాడు. తమ దేశ క్రికెటర్లను ఆకాశానికెత్తిన లతీఫ్.. విరాట్, రోహిత్‌లలో మునుపటి పదను లేదని పేర్కొన్నాడు. లతీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భగ్గుమంటున్నారు. సోషల్‌మీడియా వేదికగా లతీఫ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది కాలంగా పాక్ ఓపెనింగ్ ద్వయం పొట్టి ఫార్మాట్లో మంచినీళ్ల ప్రాయంగా పరుగులు సాధిస్తుంది. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో భారత టీ20 ఓపెనింగ్ జోడీ రోహిత్, రాహుల్ పేరిట ఉన్న అత్యధిక శతక భాగస్వామ్యాల(6) రికార్డును బద్దలు కొట్టింది. రిజ్వాన్ ఈ క్యాలెండర్ ఇయర్లో 2000 పరుగులు చేయగా.. బాబర్ 1600 పైచిలుకు పరుగులు సాధించాడు. చదవండి: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు! -
‘క్రికెట్ చరిత్రలోనే అది అత్యంత చెత్త రూల్’
కరాచీ: క్రికెట్లో బ్యాట్స్‌మన్ వికెట్ కోల్పోతామనే భయం లేకుండా ఆడేది ఫ్రీ హిట్. ముందు బాల్ నో బాల్ అయితే ఆ తర్వాత బంతిని ఫ్రీహిట్‌గా పరిగణిస్తున్నారు. సుమారు ఆరేళ్లుగా ఈ రూల్ అమలవుతోంది. 2015లో తొలిసారి ఈ నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టగా, అప్పట్నుంచి అది బ్యాటర్స్‌కు వరంగా మారింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ విమర్శలు గుప్పించాడు. అసలు నో బాల్‌కు ఫ్రీ హిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అసలే బ్యాట్స్‌మన్ గేమ్‌గా మారిపోయిన క్రికెట్లో ఈ నిబంధన ఏమిటని రషీద్ ప్రశ్నిస్తున్నాడు. అదనంగా పరుగు వస్తున్నప్పుడు ఫ్రీ హిట్ అనే నిబంధన అవసరం లేదంటున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రూల్ అని ధ్వజమెత్తాడు. ఈ తరహా నిబంధన వల్ల అవినీతికి ద్వారం సులువుగా తెరిచినట్లేనని లతీఫ్ మండిపడ్డాడు. ఒక బౌలర్ ఈజీగా నో బాల్ వేసే అవకాశం ఉంటుందని, దాన్నే ఫిక్సింగ్ కూడా వాడుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్లో ఐసీసీకి ట్యాగ్ చేశాడు లతీఫ్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో ఆర్సీబీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లు ఆడిన ఇన్నింగ్స్‌ను లతీఫ్ ప్రశంసించాడు. ఇది వేరే లెవెల్ ఇన్నింగ్స్ అంటూ కొనియాడాడు. ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి అక్కడ ఉన్నది ఏబీ.. బౌలింగ్ ఎవరికిచ్చావ్! Free hit on No ball , worst ever rule/ Law in cricket. huge window for individual ( corruption) act, but effect all team @ICC @ICCLive @IPL #BCCI @Steve_Rich100 @thePSLt20 @BBL — Rashid Latif ®️🇵🇰🌹 (@iRashidLatif68) April 18, 2021 AB with Max #RCBvKKR different level ... — Rashid Latif ®️🇵🇰🌹 (@iRashidLatif68) April 18, 2021 -
‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’
కరాచీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఘనతలేమిటో మనకు తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లను సచిన్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలను సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ సచిన్. సచిన్ ఆడినన్ని రోజులు ఇది సచిన్ శకం అనేంతంగా మరిపించాడు. అయితే సచిన్‌ను మించిన ఆటగాడు ఒకడున్నాడనే విషయాన్ని ఎప్పుడో గుర్తించాడట పాకిస్తాన్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్. ఈ విషయాన్ని తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే ఎంఎస్ ధోనినే అట. (చదవండి: సీఎస్కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనా ఔట్?) ‘ ధోనిలో ఒక ప్రత్యేకమైన ఆటగాడ్ని తమ దేశానికి తన్వీర్ ఎప్పుడో గుర్తించాడట. 2004లో కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో ధోనిని తన్వీర్ చాలా దగ్గరగా చూసిన విషయాన్ని రషీద్‌తో పంచుకున్నాడట. ‘రషీద్ భాయ్.. ఒక ప్లేయర్ ఉన్నాడు.. అతను సచిన్‌ను మర్చిపోయేలా చేయడం ఖాయమన్నాడు. అప్పుడు నేను దాంతో విభేదించాను. అది జరగదని తేల్చిచెప్పా. సచిన్ అంటే సచినే. అతనిలా మరొకరు ఉండరు అని చెప్పాను. మరో సచిన్ వచ్చే చాన్స్ లేదనే చెప్పా. కానీ సచిన్‌కు చాలా దగ్గరగా వచ్చాడు ధోని. ఒక బ్రాండ్ వాల్యూలో సచిన్‌కు అతి దగ్గరగా వచ్చిన క్రికెటర్ సచిన్’ అని రషీ్ లతీఫ్ తాజాగా పేర్కొన్నాడు. లతీఫ్ తన యూట్యూబ్ చానల్లో కాట్ బిహైండ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. (చదవండి: కోహ్లి.. చెప్పడానికి ఏమీ లేదు: ఆర్సీబీ) 2004లో అంతర్జాతీ అరంగేట్రం చేసిన ధోని.. ఆ తర్వాత ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలో 148 పరుగులతో దుమ్మురేపాడు. ఆ మరుసటి ఏడాది జైపూర్‌లో శ్రీలంకపై ధోని విశ్వరూపం ప్రదర్శించి 183 పరుగులు చేశాడు. ఆ సమయంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన సయ్యద్ అన్వర్(194)కు దగ్గరగా వచ్చిన ధోని దాన్ని మిస్సయ్యాడు. ఇక వికెట్ కీపర్‌గా తనదైన మార్కు చూపెట్టిన ధోని.. హెలికాప్టర్ షాట్‌ను తీసుకొచ్చాడు. ప్రత్యేకంగా సిక్స్‌లు కొట్టడంలో సిద్ధహస్తుడైన ధోని.. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టాడు. 2007లో టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011లో వన్డే వరల్డ్‌కప్‌లను ధోని నేతృత్వంలోని భారత్ గెలవగా, చాంపియన్ ట్రోఫీ కూడా సాధించిపెట్టాడు. దాంతో మూడు వేర్వేరు ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.(చదవండి: అలా అయితే సచిన్ అత్యున్నత శిఖరాలకు చేరేవాడా?) -
‘సచిన్ ఔట్ అవ్వాలని కోరుకునేవాడిని కాదు’
హైదరాబాద్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడు ఔటవ్వాలని తన అంతరాత్మ అస్సలు కోరుకునేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం వీడియో చాట్‌లో పాల్గొన్న ఈ మాజీ వికెట్ కీపర్ సచిన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. యువ క్రికెటర్లకు అతడొక మార్గనిర్దేశకుడని, ఆట పట్ల సచిన్‌కు ఉన్న మక్కువ మరే ఇతర ఆటగాళ్లలో చూడలేదన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో చోటుచేసుకున్న వివాదాల్లో సచిన్ పేరు ఎక్కడా వినిపించని విషయాన్ని గుర్తుచేశాడు. ఈ విషయంలో సచిన్ నుంచి ఎంతో స్పూర్థి పొందాలని యువ ఆటగాళ్లుకు రషీద్ సూచించాడు. ‘200 టెస్టులు, 400కి పైగా వన్డేలు ఆడటం మామూలు విషయం కాదు. క్రికెట్ చరిత్రలో ఏ రికార్డు చూసినా, అత్యుత్తమ 11 మంది క్రికెటర్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు సచిన్. ఇక నేను కీపింగ్ చేస్తున్న సమయంలో అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించేవాడిని, అతడు ఔటవ్వాలని నా మనస్సు అస్సలు కోరుకునేది కాదు. అయితే ఇదే క్రమంలో బ్రయాన్ లారా, పాంటింగ్, కలిస్ వంటి ప్లేయర్స్ అవుటవ్వాలని గట్టిగా ప్రయత్నించేవాడిని. ఇక ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సచిన్ వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది. స్లెడ్జింగ్ చేసినా, ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా ఏకాగ్రత కోల్పోకుండా నవ్వుతాడు, తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. అనేక మంది ఆటగాళ్లు సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకున్నారు’ అని రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు. చదవండి: 'ఆరోజు పాంటింగ్ చెత్త నిర్ణయం తీసుకున్నాడు' 'ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లి ముందుంటాడు' -
‘సెహ్వాగ్ వేరే దేశానికి ఆడుంటే మరెన్నో రికార్డులు’
కరాచీ: భారత క్రికెట్ జట్టులో డాషింగ్ ఓపెనర్‌గా తనదైన ముద్ర వేసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గతంలో సెహ్వాగ్‌తో కలిసి ఆడిన సందర్భాలను గుర్తు చేసుకున్న లతీఫ్.. ప్రపంచ క్రికెట్లో సెహ్వాగ్‌ది ప్రత్యేక స్థానమన్నాడు. సెహ్వాగ్ మ్యాచ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లు ముందుగానే భయపడేవని లతీఫ్ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. కాట్ బిహైండ్ అనే ఒక యూట్యూబ్ షోలో మాట్లాడిన లతీఫ్.. సెహ్వాగ్‌ను విధ్వసంకర క్రికెటర్‌గా పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లతో కలిసి సెహ్వాగ్ మరొక దేశం తరఫున ఆడి ఉంటే రికార్డులు మీద రికార్డులు కొల్లగొట్టేవాడన్నాడు. స్వదేశంలోనైనా విదేశంలోనైనా సెహ్వాగ్ దూకుడు ఒకే రకంగా ఉండేదన్నాడు. అతను సాధించిన పరుగులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయన్నాడు. టెస్టు క్రికెట్లో 8వేలకు పైగా పరుగులు సాధించిన సెహ్వాగ్.. మరొక దేశానికి ఆడుంటే పది వేల పరుగులను సునాయాసంగా సాధించేవాడన్నాడు. (‘అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు’) భారత్ తరఫున ఆడటం వల్లే సెహ్వాగ్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయిందనే విషయాన్ని లతీఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు. సచిన్, ద్రవిడ్‌ల నీడలో ఆడటం వల్లే సెహ్వాగ్ ప్రతిభ తగ్గిపోయిందన్నాడు. ‘ సెహ్వాగ్‌ది ఎప్పుడూ ఆధిపత్య ధోరణే. మేము ఓపెనర్లగా బరిలోకి దిగితే పిచ్ స్వభావం, బౌలర్లు ఎవరు అనే విషయాన్ని ఫోకస్ చేసేవాళ్లం. సెహ్వాగ్ నైజం అలాంటింది కాదు. ఇక్కడ పిచ్, బౌలర్ అనేది సెహ్వాగ్‌కు సెకండరీ. దూకుడే అతని మంత్రం. గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ వంటి స్టార్ బౌలర్లు బౌలింగ్ చేసినా సెహ్వాగ్ బెదిరేవాడుకాదు. ఏ ఒక్క బౌలర్‌కి భయపడిన సందర్భాల్లో సెహ్వాగ్‌లో లేవు. ఒక ప్రభావంతమైన క్రికెటర్. సెహ్వాగ్ ఆటను చూసి ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అతని జట్టులో సెహ్వాగ్ ఒక చెరగని ముద్ర వేశాడు. వరల్ఢ్ క్రికెట్లో ఒక సక్సెస్ఫుల్ ఆటగాడు సెహ్వాగ్’ అని లతీఫ్ పేర్కొన్నాడు. సెహ్వాగ్ అనేవాడు మరొక దేశానికి ఆడి ఉంటే అతనికుండే క్రేజే వేరుగా ఉండేదన్నాడు. తన కెరీర్లో 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్.. 8,586 పరుగులు చేశాడు. (సర్ఫరాజ్‌కు డిమోషన్..!) -
అప్పుడు గంగూలీనే కారణం
కరాచీ: ప్రస్తుతం తమ క్రికెట్ జట్టు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే(బీసీసీఐ) శరణ్యమని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్. దీనికి బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొరవ తీసుకోవాలని విన్నవించాడు. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌తో తమ దేశంలో మళ్లీ ఆటకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్న లతీఫ్.. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని గంగూలీని కోరాడు. 2004లో పాకిస్తాన్లో టీమిండియా పర్యటించిందంటే అందుకు నాటి కెప్టెన్ గంగూలీయే కారణమన్న విషయాన్ని అతడు ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తమ దేశంలో పర్యటించడానికి అప్పుడు బీసీసీఐ సుముఖత చూపకపోయినా గంగూలీ కారణంగానే భారత జట్టు.. పాక్‌లో పర్యటించిందన్నాడు. ఇప్పుడు కూడా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో గంగూలీ శ్రద్ధ చూపాలన్నాడు. భారత్-పాక్ జట్ల క్రికెట్ మ్యాచ్‌ల పునరుద్ధరణకు ఓ క్రికెటర్‌గా, బీసీసీఐ చీఫ్‌గా పీసీబీ ప్రెసిడెంట్ ఎహ్సాన్ మణికి గంగూలీ సాయం చేస్తాడని తాను ఆశిస్తున్నానని తెలిపాడు. ‘భారత్-పాకిస్థాన్ నడుమ పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగనంతవరకు రెండు దేశాల మధ్య పరిస్థితులు మెరుగువపడవు. 2004లో పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటనకు బీసీసీఐ మొదట విముఖత ప్రదర్శించింది. కానీ అప్పటి కెప్టెన్ గంగూలీ బోర్డు, ఆటగాళ్లకు నచ్చజెప్పి పర్యటనకు ఒప్పించాడు. సుదీర్ఘకాలం తర్వాత జరిగిన ఆ టూర్లో భారత్ మరపురాని విజయాలు అందుకుంది’ అని మాజీ కీపర్ లతీఫ్ గుర్తుచేశాడు.ఆ సమయంలో పాకిస్తాన్లో పర్యటించిన భారత జట్టు అటు వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచిన భారత్.. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.(ఇక్కడ చదవండి: మా తరంలో మ్యాచ్ విన్నర్ అతడే: దాదా) -
అది ఒక చెత్త ఆలోచన : పాక్ మాజీ కెప్టెన్
న్యూఢిల్లి: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటివల నాలుగు దేశాలు( భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, మరో అగ్రశేణి క్రికెట్ జట్టు)తో కూడిన క్రికెట్ సూపర్ సీరిస్ నిర్వహించాలని ప్రతిపాదన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఓ యూట్యూబ్ వీడియోలో విమర్శించారు. సౌరవ్ గంగూలీ ప్రతిపాదించిన నాలుగు జట్లతో కూడిన టోర్నమెంట్ శుభవార్త కాదన్నారు. ప్రత్యేకంగా నాలుగు దేశాల క్రికెట్ జట్లతో సిరీస్‌లు నిర్వహించటం వల్ల మిగతా ఐసీసీ సభ్యదేశాలను ఈ దేశాలు విస్మరించనట్లు అవుతుందని రషీద్ ఘాటుగా విమర్శించారు. గతంలో తీసుకువచ్చిన బిగ్ త్రి అనేది ఒక చెత్త ఆలోచనగా మిగిలిపోతుందని రషీద్ అభిప్రాయపడ్డాడు. 2021లో ప్రారంభమయ్యే నాలుగు దేశాల సూపర్ సిరీస్ మొదటగా భారతదేశంలో జరగనున్నట్లు సౌరభ్ గంగూలి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక నాలుగు దేశాల టోర్నీపై భారత్, ఇంగ్లాండ్ దేశ క్రికెట్ జట్లు సిద్ధంగా ఉన్నా.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. అదే విధంగా ఐసీసీ మూడు దేశాలకు మించి ఎటువంటి సిరీస్‌లు నిర్వహించదన్న విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. ‘మేము ప్రధాన క్రికెట్ దేశాల అధికారులతో క్రమం తప్పకుండా కలుస్తాము. క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చిస్తాము. డిసెంబర్లో జరిగిన బీసీసీఐ సమావేశంలో నాలుగు దేశాల టోర్నీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ టోర్నీపై ఇతర ఐసీసీ సభ్యదేశాలతో చర్చిండానికి సిద్ధంగా ఉన్నాము’ అని తెలిపింది. -
తలొగ్గిన పాక్ క్రికెటర్.. భారత్‌పై ప్రశంసలు
లండన్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పై, టీమిండియాపై తాను చేసిన ట్వీట్లు, కామెంట్లకు గానూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనపై తీవ్ర విమర్శలు రావడంతో యూ టర్స్ తీసుకున్నాడు. సెహ్వాగ్‌పై, కెప్టెన్ కోహ్లీపై ప్రశంసల జల్లులు కురిపించాడు లతీఫ్. దీంతో డాషింగ్ బ్యాట్స్‌మెన్ నైతిక విజయాన్ని సాధించాడు. టెస్టు క్రికెట్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన గొప్ప బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ అని కొనియాడాడు. అయితే ఇతర దేశాలైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలను అగౌరవపరచడం తప్పని పేర్కొంటూనే.. ఈ విషయం గుర్తుంచుకుంటే సెహ్వాగ్ కే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చాడు. 'సెమీఫైనల్ చేరుకున్న టీమిండియాకు అభినందనలు. వారికి ఫైనల్ వెళ్లే అవకాశం మెండుగా ఉంది. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. కానీ అతడు నిజాయితీ పరుడైన కోచ్ అనిల్ కుంబ్లేకు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. కోహ్లీకి నీకు అది తగదని' పాక్ మాజీ క్రికెటర్ లతీఫ్ వీడియో ద్వారా సూచించాడు. అసలు వివాదమిది.. పాకిస్తాన్‌పై భారత్ 124 పరుగుల తేడాతో నెగ్గిన అనంతరం సెహ్వాగ్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. కంగ్రాట్స్ భారత్.. బాప్ బాప్ హోతా హై అని, బంగ్లాదేశ్‌పై ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గినట్లుగా భారత్ అలవోకగా విజయం సాధించిందని ట్వీట్ చేయడంపై లతీఫ్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. సెహ్వాగ్‌ను కించపరిచేలా ట్వీట్లు చేసిన లతీఫ్ అలాగే ఓ వీడియోను పోస్ట్ చేశాడు. లతీఫ్ కామెంట్లపై స్పందించిన సెహ్వాగ్.. 'చెత్త వాగుడు కంటే.. అర్థానిచ్చే నిశ్శబ్ధం మంచిదేనని' ట్వీట్ చేశాడు. మనోజ్ తివారీ కూడా లతీఫ్ పై కామెంట్లతో ఎదురుదాడికి దిగాడు. దీంతో వెనక్కి తగ్గిన లతీఫ్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు భారత ఆటగాళ్లకు క్షమాపణ చెబుతూ, వారి గొప్పతనాన్ని పొగుడుతూ వీడియో పోస్ట్ చేశాడు.