కరాచీ: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ వికెట్ కోల్పోతామనే భయం లేకుండా ఆడేది ఫ్రీ హిట్. ముందు బాల్ నో బాల్ అయితే ఆ తర్వాత బంతిని ఫ్రీహిట్‌గా పరిగణిస్తున్నారు. సుమారు ఆరేళ్లుగా ఈ రూల్ అమలవుతోంది. 2015లో తొలిసారి ఈ నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టగా, అప్పట్నుంచి అది బ్యాటర్స్‌కు వరంగా మారింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ విమర్శలు గుప్పించాడు. అసలు నో బాల్‌కు ఫ్రీ హిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అసలే బ్యాట్స్‌మన్ గేమ్‌గా మారిపోయిన క్రికెట్‌లో ఈ నిబంధన ఏమిటని రషీద్ ప్రశ్నిస్తున్నాడు.
అదనంగా పరుగు వస్తున్నప్పుడు ఫ్రీ హిట్ అనే నిబంధన అవసరం లేదంటున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రూల్ అని ధ్వజమెత్తాడు. ఈ తరహా నిబంధన వల్ల అవినీతికి ద్వారం సులువుగా తెరిచినట్లేనని లతీఫ్ మండిపడ్డాడు. ఒక బౌలర్ ఈజీగా నో బాల్ వేసే అవకాశం ఉంటుందని, దాన్నే ఫిక్సింగ్ కూడా వాడుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్‌లో ఐసీసీకి ట్యాగ్ చేశాడు లతీఫ్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లు ఆడిన ఇన్నింగ్స్‌ను లతీఫ్ ప్రశంసించాడు. ఇది వేరే లెవెల్ ఇన్నింగ్స్ అంటూ కొనియాడాడు.
ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి
అక్కడ ఉన్నది ఏబీ.. బౌలింగ్ ఎవరికిచ్చావ్!
Free hit on No ball , worst ever rule/ Law in cricket. huge window for individual ( corruption) act, but effect all team @ICC @ICCLive @IPL #BCCI @Steve_Rich100 @thePSLt20 @BBL
— Rashid Latif ®️🇵🇰🌹 (@iRashidLatif68) April 18, 2021
AB with Max #RCBvKKR different level ...
— Rashid Latif ®️🇵🇰🌹 (@iRashidLatif68) April 18, 2021
Comments
Please login to add a commentAdd a comment