
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మేటి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది. అతని బౌలింగ్ శైలితీరు నియమాలకు లోబడే ఉందని, సందేహాస్పదంగా లేదని సమీక్ష అనంతరం తేలింది. అయితే తన బౌలింగ్ యాక్షన్‌ను ఎక్కడ సమీక్షించారనే విషయాన్ని షకీబ్ వెల్లడించలేదు.
ఇప్పటికే టెస్టులకు, అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్ వన్డే ఫార్మాట్‌లో, ఫ్రాంచైజీ లీగ్‌లలో బౌలింగ్ చేసేందుకు మార్గం సుగమం అయింది. గత ఏడాది అక్టోబర్ కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టు తర్వాత షకీబ్ మళ్లీ బరిలోకి దిగలేదు.
గత డిసెంబర్‌లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్‌లో సర్రే జట్టు తరఫున మ్యాచ్ ఆడిన సమయంలో షకీబ్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉండటంతో అతడు బౌలింగ్‌పై నిషేధం విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన షకీబ్ త్వరలో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశముంది.
చదవండి: ఐపీఎల్‌లో ‘సలైవా’ వాడవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment