no ball
-
క్రికెట్లో అత్యంత అరుదైన 'నో బాల్'
క్రికెట్లో బౌలర్ల తప్పిదాల కారణంగా నో బాల్స్ అవ్వడం తరుచూ చూస్తుంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసక్తికరంగా వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా నో బాల్ ప్రకటించబడింది. బౌలర్ ఎలాంటి పొరపాటు చేయకుండానే అంపైర్ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. A No Ball in the Vitality Blast because the wicketkeeper's gloves were in front of the stumps. 😲pic.twitter.com/bYvAtQ2pQv— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లో జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో సోమర్సెట్, నార్తంప్టన్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బంతికి బౌలింగ్ టీమ్ స్టంపౌట్ కోసం అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ రీప్లేకు ఆదేశించాడు. ఇక్కడే వికెట్‌కీపర్ చేసిన ఓ పొరపాటు బయటపడింది.సదరు అప్పీల్ స్టంపౌట్‌గా తేలకపోగా నో బాల్ అయ్యింది. బౌలర్ తనవైపు (క్రీజ్ దాటకుండా) నుంచి ఎలాంటి పొరపాటు చేయనప్పటికీ.. వికెట్‌కీపర్ గ్లవ్స్ స్టంప్స్ కంటే ముందుండటంతో థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా బ్యాటర్‌కు ఆ మరుసటి బంతి ఫ్రీ హిట్‌గా లభించింది. సదరు బ్యాటర్ ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకుని భారీ సిక్సర్‌గా మలిచాడు. క్రికెట్లో వికెట్‌కీపర్ పొరపాటు వల్ల ఇలా నో బాల్స్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ టోర్నీలో నిన్నటితో (సెప్టెంబర్ 6) క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లన్నీ ముగిసాయి. సర్రే, సోమర్సెట్, గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు సెమీస్‌కు చేరాయి. సెప్టెంబర్ 14న జరిగే రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌ల్లో సర్రే, సోమర్సెట్.. గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు పోటీపడతాయి. అనంతరం అదే రోజు ఫైనల్ కూడా జరుగుతుంది. -
ఇదేమి అంపైరింగ్‌రా బాబు.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- శ్రీలంక మధ్య మూడో టీ20 అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో లంక విజయానికి 19 పరుగుల అవసరమ్వగా.. 16 పరుగుల మాత్రమే చేసి ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్ కమిందు మెండిస్(65 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. చెత్త అంపైరింగ్.. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్ కీలకమైన ఆఖరి ఓవర్లో అఫ్గాన్ పేసర్ వఫాదర్ మొమాండ్.. మెండిస్‌కు ఫుల్ టాస్‌గా సంధించాడు. అయితే ఆ బంతి మెండిస్ నడుముపై నుంచి వెళ్లింది. దీంతో హైట్ నో బాల్ కోసం మెండిస్ అప్పీల్ చేశాడు. కానీ స్క్వేర్ లెగ్ అంపైర్ హన్నిబాల్ మాత్రం అది ఫెయిర్ డెలివరీ అంటూ చెప్పుకొచ్చాడు. కనీసం థర్డ్ అంపైర్ కైనా రిఫర్ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలో మెండిస్ డీఆర్ఎస్ కావాలని పట్టుబట్టాడు. అయితే రూల్స్ ప్రకారం నో బాల్ విషయంలో డీఆర్ఎస్ను పరిగణలోకి తీసుకోరు. అనంతరం రిప్లేలో క్లియర్‌గా అది హైట్ నోబాల్‌గా తేలింది. ఈ క్రమంలో అంపైర్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చెత్త అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అది నోబాల్‌గా ఇచ్చి వుంటే కచ్చితంగా శ్రీలంక గెలిచి ఉండేదని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్ No-ball or legal delivery? #SLvAFG pic.twitter.com/P5iPSfiEjx — Estelle Vasudevan (@Estelle_Vasude1) February 21, 2024 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త నో బాల్.. వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్- నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ బౌలర్ అభిమన్యు మిథున్ విచిత్రమైన నో బాల్‌ను సంధించాడు. చెన్నై బ్రేవ్స్ ఇన్నింగ్స్ 5 ఓవర్లో మిథన్ వేసిన నో బాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 5 ఓవర్లో మూడో బంతిని వేసే క్రమంలో మిథున్ ఓవర్ స్టేప్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. అయితే రిప్లేలో అతడు ఫుట్కు క్రీజుకు మధ్య దూరం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు క్రీజు నుంచి చాలం దూరంలో తన ఫుట్‌ను ల్యాండ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నోబాల్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వారియర్స్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్రేవ్స్ 9.7 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. What's happening in the T10 League? 🤦🏽♂️🤦🏽♂️ #AbuDhabiT10 pic.twitter.com/FGcbshIhPz — Farid Khan (@_FaridKhan) December 2, 2023 -
ఒక్క బంతికి 18 పరుగులా.. నువ్వు దేవుడివయ్యా!
ఒక ఓవర్లో 18 పరుగుల సమర్పించుకుంటే అది పెద్ద వార్త కాకపోవచ్చు.. కానీ ఒక్క బంతికి 18 పరుగులు ఇచ్చుకుంటే మాత్రం అది సంచలనమే అవుతుంది. సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ ఈ పుణ్యం మూటగట్టుకొని అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. మంగళవారం రాత్రి సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ బౌలింగ్ చేశాడు. క్రీజులో సంజయ్ యాదవ్ ఉన్నాడు. ఓవర్లో మొదటి నాలుగు బంతులు కరెక్ట్‌గా వేసిన అభిషేక్ తన్వర్ ఆరు పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాతి బంతి నోబాల్.. ఆ తర్వాత బంతికి ఒక పరుగు వచ్చింది. దీంతో ఐదు బంతుల్లో ఎనిమిది పరుగులు వచ్చినట్లయింది. ఇక ఓవర్ చివరి బంతి వేయడానికి నానా కష్టాలు పడ్డాడు. తొలుత నోబాల్, ఆ తర్వాత నోబాల్ వేస్తే ఈసారి సిక్సర్, తర్వాతి బంతి మళ్లీ నోబాల్.. రెండు పరుగులు.. అనంతరం వైడ్ బాల్.. ఇక చివరగా వేసిన సరైన బంతికి మరో సిక్సర్.. ఇలా కేవలం ఆఖరి బంతికి మూడు నోబాల్స్, ఒక వైడ్ సహా రెండు సిక్సర్లు, రెండు పరుగులు మొత్తంగా 18 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బతో సంజయ్ యాదవ్ కేవలం ఆఖరి ఓవర్లోనే తాను ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 18 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. One ball 18 runs 🤑#TNPL2023 pic.twitter.com/GcN9E8XyoP — Cricket Insider (@theDcricket) June 13, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెపాక్ సూపర్ గల్లీస్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గల్లీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రదోష్ పాల్(55 బంతుల్లో 88 పరుగులు, 12 ఫోర్లు, ఒక సిక్సర్), నటరాజన్ జగదీశన్ 27 బంతుల్లో 35, అపరాజిత్ 19 బంతుల్లో 29 పరుగులు, సంజయ్ యాదవ్ 12 బంతుల్లో 31 పరుగుల నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సలెమ్ స్పార్టాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. ముహ్మద్ అద్నాన్ ఖాన్ (15 బంతుల్లో 47 నాటౌట్, ఒక ఫోర్, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ మినహా మిగతావారు విఫలమయ్యారు. చదవండి: విండీస్‌తో టెస్టు సిరీస్.. కెప్టెన్‌గా ఆఖరిది కానుందా? -
#NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు..
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 పోరులో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే నోబాల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మూడో బంతిని గైక్వాడ్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న గిల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ రుతురాజ్ వెనుదిరగడంతో తొలి వికెట్ దక్కిందన్న సంతోషం దర్శన్ నల్కండే మొహంలో కనిపించింది. కానీ మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైంది. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో రుతురాజ్ ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చాడు. అలా నోబాల్ అవడంతో బతికిపోయిన రుతురాజ్ ఆ తర్వాత 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అంటే ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు అన్నమాట. తొలి ఇన్నింగ్స్ కావడంతో రుతురాజ్ ఇన్నింగ్స్ ఎంతవరకు గుజరాత్‌కు నష్టం తెస్తుందనేది చెప్పలేం. Gaikwad: From🙁 to 🤩 A twist of fate sees Ruturaj maximize with the bat in #GTvCSK ⚔️#IPLPlayOffs #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/dOfabAaXTS — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్ -
అది నోబాల్.. థర్డ్ అంపైర్ చీటింగ్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్‌జెయింట్స్(LSG)మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై స్టేడియానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి సమద్ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి వెళ్లిందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇదే ఎస్ఆర్హెచ్ అభిమానులకు కోపం తెప్పించింది. థర్డ్ అంపైర్‌ని తిడుతూనే ఎల్ఎస్జీ డగౌట్ వైపు కొంతమంది అభిమానులు నట్స్, బోల్ట్‌లు విసిరికొట్టారు. అవి వచ్చి డగౌట్లో పడడంతో గందరగోళం నెలకొంది. దీంతో లక్నో ఆటగాళ్లంతా డగౌట్వైపుగా రావడం.. క్లాసెన్, క్వింటన్ డికాక్‌లు నోబాల్ వ్యవహారంపై సీరియస్‌గా చర్చించడం కనిపించింది. అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని కంగారు పడిన వేళ అంపైర్లు కలగజేసుకొని డగౌట్ నుంచి ఆటగాళ్లను పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయాడు. 47 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ అదే ఓవర్లో చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి ప్రేరక్ మన్కడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్ వెళ్లే సమయంలో క్లాసెన్ మొహం బాధతో నిండిపోవడం కనిపించింది. 3rd Umpire gives this as a fair delivery. - The Hyderabad crowd starts chanting 'Kohli, Kohli'.#SRHvLSGpic.twitter.com/2vY2YkxKQa — runmachinevi143 (@runmachinevi143) May 13, 2023 After a controversial reversal of no ball decision by the third umpire, the SRH fans in the stadium are showing their frustrations at the LSG dugout. The crowd were also heard chanting, "Kohli, Kohli" with Gambhir in the dugout 👀 📸 JioCinema#SRHvLSG #SRH #SRHvsLSG pic.twitter.com/jPti6MyaFe — 12th Khiladi (@12th_khiladi) May 13, 2023 A blunder from the third umpire? 📸: Jio Cinema#IPL2023 | #SRHvLSG pic.twitter.com/pyQk6IzUoj — CricTracker (@Cricketracker) May 13, 2023 చదవండి: సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్ టెండూల్కర్ -
అదృష్టం ఎస్‌ఆర్‌హెచ్‌వైపు.. కొంపముంచిన నో బాల్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక అద్బుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులతో విధ్వంసం సృష్టించి మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌వైపు తిప్పాడు. కానీ మరుసటి బంతికే అతను ఔటవ్వడంతో మళ్లీ రాజస్తాన్ వైపు తిరిగింది. కొంపముంచిన నోబాల్.. ఇక ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో సందీప్ శర్మ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. రెండో బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్ తరలించడంతో నాలుగు బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. ఇక మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి, ఐదో బంతికి సింగిల్స్ రావడంతో ఆఖరి బంతికి ఎస్ఆర్హెచ్కు ఐదు పరుగులు అవసరం అయ్యాయి. సందీప్ ఆఖరి బంతి వేశాడు. సమద్ లాంగాఫ్ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడే ఉన్న బట్లర్ క్యాచ తీసుకోవడంతో ఎస్ఆర్హెచ్ మరో ఓటమి ఎదురైంది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్. అంపైర్ నోబాల్ అని ప్రకటించాడు. దీంతో ఒత్తిడిలో పడిన సందీప్ యార్కర్ వేయగా.. అబ్దుల్ సమద్ స్ట్రెయిట్సిక్స్తో ఎస్ఆర్హెచ్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఒక రకంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలవాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. అందుకే ఎస్ఆర్హెచ్ను నోబాల్ రూపంలో అదృష్టం వరించింది. This is the best league in the world and you can't change our minds 🔥 Congrats Samad, hard luck, Sandeep!#RRvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/phHD2NjyYI — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్లెన్ పిలిప్స్ -
David Warner: ఎవరికి రాని ఆలోచనతో చరిత్రకెక్కాడు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ శైలి ఏంటని అడగ్గానే టక్కున చెప్పే సమాధానం ఎడమ చేతి వాటం బ్యాటర్ అని. మరి అలాంటి వార్నర్ తొలిసారి తన బ్యాటింగ్ శైలిని మార్చి చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్‌కు స్విచ్ అయి బ్యాటింగ్ ఆడాడు. క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు తన బ్యాటింగ్ శైలిని మార్చడం వీలుకాదు. ఒక మ్యాచ్‌లో బంతి పడ్డాకా బ్యాటింగ్‌ను స్విచ్ చేయడం చూస్తుంటాం. కానీ వార్నర్ అలా కూడా చేయలేదు. మరి వార్నర్ రూల్‌ను బ్రేక్‌చేసి ఎలా ఆడాడనేగా మీ డౌటు. వాస్తవానికి వార్నర్ ఆడింది ఫ్రీహిట్‌ను. అవునండీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ మూడో బంతిని హృతిక్ షోకీన్ నోబాల్ వేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫ్రీహిట్ లభించింది. అయితే ఫ్రీహిట్ ఎలా ఆడినా ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇక్కడే వార్నర్ ఎవరికి రాని ఆలోచనతో లెఫ్ట్ హ్యాండర్ కాస్త రైట్ హ్యాండ్‌గా మారి భారీ షాట్ ఆడాడు. అయితే బంతి పెద్దగా దూరం పోలేదు. కేవలం ఒక రన్ మాత్రమే వచ్చింది. ఏదైతేనేం వార్నర్ ఎవరికి రాని ఆలోచనతో చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. David warner turns to a right handed batsman on a free hit (📸 - JIO Cinema) #IPL #IPL2023 #DCvMI #Delhicapitals #DC #Davidwarner #CricketTwitter pic.twitter.com/cbsMaRY9t9 — Khel Cricket (@Khelnowcricket) April 11, 2023 చదవండి: 'రావడం అంత ఈజీ కాదు; అప్పుల ఊబి నుంచి బయటపడ్డాం' -
'వాట్ యాన్ ఐడియా సర్ జీ'.. ఈ దెబ్బతో బౌలర్లు దారిలోకి
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సోమవారం సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌లో సీఎస్కే 12 పరుగులతో గెలిచి సీజన్లో బోణీ కొట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో 34 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం ఆసక్తి కలిగించింది. ఇందులో వైడ్లు 20 ఉంటే.. సీఎస్కేవి 13 కాగా.. లక్నోవి ఏడు వైడ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ 13 వైడ్స్ ఇవ్వకపోయుంటే 25 పరుగులతో గెలిచి ఉండేది. అలా అయితే రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండేది. ఇక తమ బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వడంపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సీరియస్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ..'' తర్వాతి మ్యాచ్ నుంచి మా బౌలర్లు నోబాల్స్, వైడ్స్ ఎక్కువగా వేస్తే ఊరుకోను. నేను కెప్టెన్ పదవి నుంచి దిగిపోతా. అప్పుడు వేరే కెప్టెన్ నేతృతంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్.. ఇంకోసారి ఇలా జరిగితే తప్పుకుంటా'' అంటూ జట్టును హెచ్చరించాడు. ఇదే విషయమై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఒక యూనిక్ ఐడియా ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.'' మ్యాచ్‌లో బౌలర్లు రెండు లేదా మూడు వైడ్స్ వేస్తే బ్యాటర్‌కు ఫ్రీహిట్ ఇవ్వండి.. అప్పుడు బౌలర్లు ఆటోమెటిక్‌గా దారిలోకి వస్తారు. నియంత్రణతో బౌలింగ్ వేయడం చూస్తాం.'' అంటూ పేర్కొన్నాడు. కాగా లక్నో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో దీపక్ చహర్ వరుసగా మూడు వైడ్స్ వేసిన సమయంలో సునీల్ కామెంట్రీలో ఇలా స్పందించాడు. పక్కనే ఉన్న మరో కామెంటేటర్ ఇయాన్ బిషప్ మాత్రం..'' వినడానికి హాస్యాస్పదంగా'' ఉంది అంటూ కామెంట్ చేశాడు. అయితే బిషప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సునీల్.. ''ఇలాంటి వైడ్స్, నోబాల్స్ వల్ల మ్యాచ్ సమయం చాలా వృథా అవుతుంది. అందుకే నేను చెప్పింది మంచి ఆలోచనే.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తే మంచిది'' అంటూ తనను తాను సమర్థించుకున్నాడు. అయితే సునీల్ గావస్కర్ ఐడియాపై కొందరు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వాట్ యాన్ ఐడియా సర్ జీ.. దెబ్బకు బౌలర్లు దారిలోకి రావడం ఖాయం.'' అంటూ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు పలు కొత్త రూల్స్ వచ్చాయి. ఇంపాక్ల్ ప్లేయర్ అనే రూల్‌ను ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఇంపాక్ట్ రూల్‌ను అన్ని జట్లు విరివిగా వాడేస్తున్నాయి. ఇక వైడ్, నోబాల్స్ విషయంలోనూ ఆటగాళ్లు డీఆర్ఎస్కు వెళ్లే అవకాశాన్ని కల్పించారు. -
ప్రాణం తీసిన 'నో బాల్' గొడవ.. అంపైర్ అందుకు నో చెప్పడంతో..
భువనేశ్వర్: క్రికెట్ మ్యాచ్ ఆడే సమయంలో ఇరు జట్లు అపుడుపుడు మాటల యుద్ధానికి దిగుతాయి. భౌతిక దాడులు చేసుకునే సందర్భాలు అత్యంత అరుదు. అయితే గల్లీ క్రికెట్లో మాత్రం ఇలా కాదు.. మాటా మాటా పెరిగి ఒక్కోసారి ఇరుజట్లు బాహాబాహీకి దిగుతాయి. ఆటగాళ్లు ఒకరిపైఒకరు దాడి చేసుకుని తీవ్రంగా గాయపరుచుకుంటారు. ఒడిశా కటక్ జిల్లా మహిసానంద గ్రామంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. క్రెకెట్ మ్యాచ్ ఆడే సమయంలో అంపైర్ నో బాల్ ఇవ్వలేదని సంగ్రామ్ రౌత్ అనే ఆటగాడు రెచ్చిపోయాడు. నో బాల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కానీ అంపైర్ అందుకు ఒప్పకోలేదు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన సంగ్రామ్, మరో ఇద్దరు ఆటగాళ్లు.. అంపైర్‌ను తోసేసి దాడి చేయబోయారు. గొడవ పెద్దది కావడంతో లక్కీ రౌత్ అనే స్థానికుడు అంపైర్‌ను కాపాడేందుకు మధ్యలో జోక్యం చేసుకుని వెళ్లాడు. దీంతో సంగ్రామ్ అతడ్ని బ్యాట్‌తో కొట్టాడు. ఛాతీలో కత్తితో పొడిచాడు. దీంతో లక్కీ తీవ్రగాయాలతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: 'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు' -
క్రికెట్లో కొత్త పంథా.. ఐపీఎల్ 2023 నుంచే మొదలు
ఐపీఎల్ జట్లకు గుడ్‌న్యూస్. తాజాగా మొదలుకానున్న ఐపీఎల్ 16వ సీజన్ నుంచి డీఆర్ఎస్ను మరింత విస్తరించనున్నారు. ఔట్, నాటౌట్‌కే కాకుండా ఇకపై నోబాల్, వైడ్ బాల్‌కు ఆటగాళ్లు సమీక్ష కోరేలా రూల్స్ మార్చారు. అయితే ఈ నిబంధనను ఇప్పటికే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ఉపయోగిస్తున్నారు. శనివారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వైడ్ బాల్ విషయంలో డీఆర్ఎస్ కోరింది. ఈ ఫలితం హర్మన్‌కు అనుకూలంగా వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరులోనూ ఈ రూల్‌ను వాడారు. మేఘన్ షూట్ ఫుల్‌టాస్‌గా వేసిన డెలివరీని అంపైర్ నోబాల్‌గా ప్రకటించలేదు. దాంతో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సమీక్ష కోరింది. అయితే సఫలం కాలేదు. యూపీ వారియర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచులోనూ ఇలాంటి సమీక్షే కోరారు. ఒక్కోసారి అంపైర్ తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయంతో మ్యాచ్ గమనమే మారిపోతుంది. కొన్నిసార్లు గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోవాల్సి వస్తోంది. గతంలో ఇన్నింగ్స్ ఆఖరి బంతులు నోబాల్ అయినా అంపైర్లు ఇవ్వకపోవడంతో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరారు ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు, ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో నోబాల్, వైడ్ బాల్ కోసం సమీక్ష కోరేలా నిబంధనలు సవరించింది. ''మైదానంలోని అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని క్రికెటర్లు కోరొచ్చు. బ్యాటర్ ఔటయ్యారో లేదో తెలుసుకోవచ్చు. వైడ్ బాల్, నోబాల్ విషయంలోనూ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై సమీక్ష అడగొచ్చు'' అని డబ్ల్యూపీఎల్ నిబంధనల్లో పేర్కొన్నారు. రానున్న ఐపీఎల్ 2023 సీజన్లోనూ ఈ రూల్ వర్తించనుంది. చదవండి: పిచ్‌తో మైండ్‌గేమ్.. కలవరపడుతున్న 'కంగారూలు' -
ఆఖర్లో హైడ్రామా.. వెనక్కి వచ్చేయాలంటూ క్రికెటర్లకు పిలుపు
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఆట తొలిరోజునే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. అయితే తొలి టెస్టులోలాగా ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోలేదు. ఈసారి ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అనంతరం వార్నర్(18) వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన లబుషేన్ టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అశ్విన్ వరుస బంతుల్లో స్మిత్, లబుషేన్‌ను పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. ఇక అక్కడి నుంచి ఆస్ట్రేలియా వికెట్ల పతనం కొనసాగుతూ వచ్చింది. మధ్యలో పీటర్ హ్యాండ్స్కోబ్(72 నాటౌట్.. ఉస్మాన్ ఖవాజా(81 పరుగులు)కు జత కావడంతో ఆసీస్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ జడేజా తన స్పిన్ మాయతో టీమిండియాకు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. అలా 246 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆలౌట్‌కు ఒక్క వికెట్ దూరంలో మాత్రమే ఉంది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జడేజా సూపర్ బంతితో హ్యాండ్స్‌కోబ్‌ను బోల్తా కొట్టించాడు. జడ్డు బంతిని హ్యాండ్స్కోబ్ కవర్స్ దిశగా ఆడగా అశ్విన్ క్యాచ్ పట్టాడు. అంతే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసిందని టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న క్రికెటర్లు అప్పటికే డ్రెస్సింగ్‌రూమ్ బాట పట్టారు. రోహిత్ , రాహుల్‌లు కూడా వెనుదిరిగే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జడేజా నో బాల్ వేసినట్లు రీప్లేలో తేలింది. జడ్డూ ఫుట్ భాగం లైన్ అవతల ఉండడంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు. దీంతో హ్యాండ్స్కోబ్ నాటౌట్ అని తేలింది. నోబాల్స్ వేయడంలో పొదుపు పాటించే జడేజా ఈ మ్యాచ్‌లో ఆరు నో బాల్స్ వేయడం విశేషం. ఇక ఆసీస్ ఆలౌట్ అనుకొని అప్పటికే పెవిలియన్ వెళ్లిన టీమిండియా క్రికెటర్లకు తిరిగి రావాలని పిలుపు వచ్చింది. దీంతో చేసేదేంలేక క్రికెటర్లు మైదానంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆలౌట్‌కు ఎక్కువ సమయం పట్టేలేదనుకోండి. షమీ వేసిన మరుసటి ఓవర్లో నాలుగో బంతికి కుహ్నేమన్ క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. It was very tight#No ball#jaddu sixth no Ball in this match#INDvAUS #BGT2023 #hotstar pic.twitter.com/OSHwTEcoak — Raushan choudhary (@Raushan0321) February 17, 2023 చదవండి: షమీ చెవులు పిండిన అశ్విన్.. ఫోటో వైరల్ -
నోబాల్ విషయంలో పాక్ క్రికెటర్ నానా యాగీ
పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ నోబాల్ విషయమై అంపైర్‌తో నానా యాగీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా ఇది చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా రంగ్‌పూర్ రైడర్స్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ రోబుల్ హక్ వేశాడు. వరుసగా రెండు బంతులు బౌన్సర్లు వేయడంతో.. ఫీల్డ్ అంపైర్ రెండో బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నో బాల్ ఇవ్వడంపై రంగ్‌పూర్ రైడర్స్ కెప్టెన్ నురుల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన హారిస్ రవూఫ్ జోక్యం చేసుకొని అసలెలా నోబాల్ ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బౌన్సర్లు వేస్తే వార్నింగ్‌తో సరిపెట్టాలని రూల్ ఉన్నా.. పట్టించుకోకుండా నోబాల్ ఇవ్వడమేంటన్నాడు. అయితే అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నురుల్ హసన్, హారిస్ రవూఫ్‌లు కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రంగ్‌పూర్ రైడర్స్ సిల్హెట్ స్ట్రైకర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రైకర్స్.. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తంజిమ్ హసన్ సకీబ్(41 పరుగులు), కెప్టెన్ మొర్తజా(21 పరుగులు).. ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో హసన్ మహ్మూద్, అజ్మతుల్లాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోనీ తాలుక్దార్ 41 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. Haris Rauf In fight With Umpire over a no Ball. #BPL #Bpl2023 pic.twitter.com/oLLme81d7f — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 27, 2023 చదవండి: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? -
అత్యధిక నోబాల్స్ వేసిందెవరంటే?
టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్షదీప్ సింగ్ టి20ల్లో ఊహించని రికార్డు నమోదు చేశాడు. అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్షదీప్ ఏకంగా 5 నో బాల్స్ వేశాడు. తొలి ఓవర్లో మూడు, ఆఖరి ఓవర్లో రెండు నో బాల్స్ వేశాడు. దాంతో, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. గతంలో అతను దక్షిణాఫ్రికా మీద 4 నో బాల్స్ వేశాడు. ఇప్పటివరకు అర్ష్‌దీప్ 11ఇన్నింగ్స్‌ల్లో 14 నో బాల్స్ వేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ రెండో స్థానంలో ఉన్నాడు. హసన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 11 నో బాల్స్ వేశాడు. ఇక వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ ఆరు ఇన్సింగ్స్‌ల్లో 11 నో బాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే విండీస్‌కు చెందిన మరో బౌలర్ ఒషానే థామస్ కూడా 11 నో బాల్స్ వేశాడు. అత్యధిక నో బాల్స్ వేసిన జట్టుగా ఘనా నిలిచింది. ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా బౌలర్లు ఏకంగా 10 నో బాల్స్ వేశారు. నో బాల్ వేయని క్రికెటర్స్ అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలం ఆడి, ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్లు కొందరు ఉన్నారు. వీళ్లలో భారత మాజీ క్రికెటర్ 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ కూడా ఉన్నాడు. అతను 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. 79 టెస్టులు, 3 వన్డేలు ఆడిన వెస్టిండీస్ లెజెండరీ స్పిన్సర్ లాన్సే గిబ్స్ తన కెరీర్లో ఒక్క నో బాల్ వేయలేదు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథాం తన 16 ఏళ్ల కెరీర్లో నో బాల్ అస్సలు వేయలేదు. 70 టెస్టులు, 63 వన్డేలు ఆడిన ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ ఖాతాలో నో బాల్ అనేదే లేదు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ 88 టెస్టులు, 175 వన్డేల్లో నో బాల్ వేయలేదు. -
అర్షదీప్ నో బాల్స్ వ్యవహారంపై మండిపడ్డ గవాస్కర్.. గల్లీ బౌలర్లా అంటూ..!
క్రికెట్‌కు సంబంధించి ఎంతటి వారు తప్పు చేసినా పరుష పదజాలంతో మందలించే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. తాజాగా టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌పై ఫైరయ్యాడు. శ్రీలంకతో నిన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో అర్షదీప్ హ్యాట్రిక్ నో బాల్స్‌తో పాటు మొత్తంగా 5 నో బాల్స్ వేయడంపై సన్నీ ఓ రేంజ్లో మండిపడ్డాడు. ప్రొఫెషనల్ బౌలర్ అయి ఉండి ఇలా చేయడం సరికాదని, పరోక్షంగా గల్లీ బౌలర్ అని అర్ధం వచ్చేలా సంబోధించాడు. నో బాల్స్ వేయకపోవడం అన్నది అంతర్జాతీయ స్థాయి బౌలర్‌కు ప్రాధమిక సూత్రమని, అది మరిచిన బౌలర్ ఈ స్థాయి క్రికెట్‌కు పనికిరాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. బౌలర్ తన బేసిక్స్‌కు స్టిక్ అయి బంతి విసిరిన తర్వాత ఏం జరుగుతుంది, బ్యాటర్ ఏం చేస్తాడన్నది పక్కకు పెడితే.. నోబాల్ వేయకపోవడం అన్నది బౌలర్ బేసిక్స్‌లో భాగమని అర్షదీప్‌ను ఉద్దేశించి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా లైవ్ కామెంట్రీలోనే గవాస్కర్ అర్షదీప్‌పై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బంతినందుకున్న అర్షదీప్.. ఆ ఓవర్లోనూ మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి భారత బౌలర్‌గా!
పుణే వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్ష్‌దీప్ ఏకంగా 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. పరుగులు విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఏకంగా 5 నోబాల్స్ వేశాడు. దీంతో పలు చెత్త రికార్డులను అర్ష్‌దీప్ తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ వరుసగా హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. తద్వారా భారత టీ20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన తొలి భారత బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్ చెత్త రికార్డు నెలకొల్పాడు. చదవండి: IND vs SL: భారత్ చెత్త బౌలింగ్.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు! టార్గెంట్ ఎంతంటే? -
ఏంటి అర్ష్‌దీప్ బౌలింగ్ మర్చిపోయావా? ఒకే ఓవర్లో మూడు నో బాల్స్
యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దాదాపు రెండు నెలల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత సెలక్టర్లు అర్ష్‌దీప్ సింగ్ విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన అర్ష్‌దీప్.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే అనారోగ్యం కారణంగా తొలి టీ20కు దూరమైన అర్ష్‌దీప్.. రెండో టీ20కు కోలుకున్నాడు. దీంతో జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ తనదైన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్ తన తొలి ఓవర్లోనే ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విషయం పక్కన పెడితే.. అర్ష్‌దీప్ అదే ఓవర్లో వరుసగా మూడు నో బాల్స్ వేశాడు. దీంతో తన ఓవర్లో ఏకంగా 9 బంతులు అర్ష్‌దీప్ వేశాడు. ఆఖరి బంతిని పూర్తి చేయడానికి అర్ష్‌దీప్ ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో నెటిజన్లు అర్ష్‌దీప్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి అర్ష్‌దీప్ బౌలింగ్ మర్చిపోయవా అంటూ ట్విట్లు చేస్తున్నారు. 3 consecutive No Balls by Arshdeep Singh:- pic.twitter.com/lyGJsbj8Yd — Til wali Kanya🌼🇮🇳 (@UPkiKanyaaa) January 5, 2023 are yrr no ball ki hatrick #INDvsSL #arshdeep pic.twitter.com/snjCNb0ykw — Asian Doge (@vvjndr) January 5, 2023 -
Ind Vs Ban: ఒక్క బంతికే 14 పరుగులు బాదిన కేఎల్ రాహుల్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నిరోజులుగా ఫామ్‌లో లేని రాహుల్ బంగ్లాతో మ్యాచ్‌లో మాత్రం తన మునుపటి ఆటను ప్రదర్శించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సరిగ్గా 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే షోరిఫుల్ ఇస్లామ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో రాహుల్ ఒక్క బంతికే 14 పరుగులు బాదడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఓవర్లో నాలుగో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. అయితే అది నోబాల్ అని తేలడంతో ఫ్రీహిట్ లభించింది. నోబాల్ గనుక బంతి కౌంట్ కాదు కాబట్టి.. మొత్తం ఏడు పరుగులు(సిక్స్‌తో కలిపి) వచ్చాయి. మరుసటి బంతి వైడ్ వేయడంతో ఫ్రీ హిట్ అలానే కంటిన్యూ అయింది. అనంతరం ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకున్న రాహుల్ రిస్ట్ పవర్ ఉపయోగించి డీప్ మిడ్‌వికెట్ మీదుగా మరోసారి భారీ సిక్సర్ బాదాడు. అలా ఒక్క బంతికే 14 పరుగులు వచ్చాయి. చదవండి: అగ్రపీఠంపై సూర్య భాయ్.. కోహ్లి తర్వాత తొలి భారతీయుడిగా రికార్డు -
ఆఖరి ఓవర్లో డ్రామా.. ఆ ‘నో బాల్’ ఎందుకంటే...! గతంలో ఐపీఎల్లో కూడా!
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఉత్కంఠ పోరులో మూడు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ అఖరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది. చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి లెగ్ బైస్ రూపంలో ఒక పరగు రాగా.. రెండో బంతికి ఎవెన్స్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ సమీకరణం నాలుగు బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఈ క్రమంలో మూడో బంతికి లెగ్ బైస్ రూపంలో నాలుగు పరుగులు, నాలుగో బంతికి నగరవా భారీ సిక్స్ బాదాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ జింబాబ్వే వైపు మలుపు తిరిగింది. అఖరి రెండు బంతులకు జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఐదో బంతికి నగరవా భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అఖరి బంతికి కూడా ముజారబానీ కూడా స్టంపౌటయ్యాడు. దీంతో గెలుపు సంబురాల్లో మునిగి తేలిపోయింది. ఓటమి బాధతో జింబాబ్వే ఆటగాళ్లు కూడా డగౌట్‌కు చేరుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అఖరి బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. నో బాల్’ ఎందుకంటే... స్టంప్ చేసే క్రమంలో బంగ్లాదేశ్ కీపర్ నూరుల్ అత్యుత్సాహంతో వికెట్లను దాటి వాటి ముందే బంతిని అందుకున్నాడు. ఐసీసీ నిబంధన 27.3.1 ప్రకారం కీపర్ ఇలా చేయకూడదు. బంతి బ్యాట్‌ను లేదా బ్యాటర్‌ను తాకిన తర్వాత లేదా వికెట్లను దాటిని తర్వాతే బంతిని అందుకోవాలి. 27.3.2 ప్రకారం దానిని ‘నో బాల్’గా ప్రకటిస్తారు కూడా. దాంతో మరోసారి ఆఖరి బంతికి 5 పరుగులు చేస్తే గెలిచే అవకాశం జింబాబ్వేకు వచ్చింది. అయితే మొసద్దిక్ మరో చక్కటి బంతి వేసి సింగిల్ కూడా ఇవ్వలేదు. దాంతో బంగ్లా ఆటగాళ్ల మొహాల్లో మళ్లీ నవ్వు కనిపించింది. గతంలో ఐపీఎల్లో కోల్‌కతా కీపర్ ఉతప్ప, రైనా మధ్య ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుంది. చదవండి: #OnThisDay: నాడు నిరాశపరిచిన సచిన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని! మిస్టర్ కూల్ తుపాన్ ఇన్నింగ్స్ చూశారా! -
క్రికెట్ చరిత్రలో ఇలా తొలిసారి.. నాటకీయంగా నో బాల్ ప్రకటన
టీ20 ప్రపంచకప్-2022 సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. క్వాలిఫయర్స్ తొలి మ్యాచ్‌లో ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు పసికూన నమీబిమా షాకివ్వగా.. ఆ మరుసటి రోజే మరో చిన్న జట్టు స్కాట్లాండ్.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి సంచలనం సృష్టించింది. ఆతర్వాత అక్టోబర్ 21న వెస్టిండీస్‌కు మరో పరాభవం ఎదురైంది. అండర్ డాగ్ ఐర్లాండ్్.. వెస్టిండీస్‌ను 9 వికెట్ల భారీ తేడాతో ఓడించి, తమను తక్కువ అంచనా వేస్తే ఎంతటి జట్టుకైనా ఇదే గతి అని పెద్ద జట్లకు అలర్ట్ మెసేజ్ పంపింది. సంచనాలు క్వాలిఫయర్స్ దశకే పరిమితమయ్యాయనుకుంటే పొరబడ్డట్టే. సూపర్-12 దశలోనూ సంచలన విజయాల జైత్రయాత్ర కొనసాగింది. అక్టోబర్ 26న జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో లెజెండ్ కిల్లర్ ఐర్లాండ్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. ఐర్లాండ్ విజయానికి వరుణుడు పరోక్షంగా సహకరించినప్పటికీ.. విజయాన్ని విజయంగానే పరిగణించాలి. ఈ మ్యాచ్ తర్వాత అక్టోబర్ 27న మరో పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. పాకిస్తాన్‌ను ఒక్క పరుగు తేడాతో మట్టికరిపించి, దాయాదిని చావుదెబ్బ కొట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఇలాంటి సంచలన విజయాలకే కాక మరెన్నో హైడ్రామాలకు నెలవుగా మారింది. భారత్-పాక్, సౌతాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో చాలా నాటకీయ పరిణామాలు చూశాం. అలాంటిదే ఇవాళ (అక్టోబర్ 30) జరిగిన బంగ్లాదేశ్-జింబాబ్వే మ్యాచ్‌లోనూ చోటు చేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మ్యాచ్ చివరి ఓవర్లో నెలకొన్న హైడ్రామాను క్రికెట్ ప్రేమికులు మునుపెన్నడూ కని ఎరుగరు. జింబాబ్వే గెలుపుకు చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమైన సమయంలో బంతి మొసద్దెక్ హుస్సేన్ అందుకున్నాడు. తొలి 5 బంతులకు 11 పరుగులు రాగా.. ఆఖరి బంతికి జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి బంతికి ముజరబానీ స్టంపౌట్ కావడంతో బంగ్లాదేశ్ గెలుపు సంబురాల్లో మునిగి తేలిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ముజరబానీని స్టంపౌట్ చేసే క్రమంలో బంగ్లా వికెట్ కీపర్ బంతిని స్టంప్స్‌కు ముందే కలెక్ట్ చేసుకోవడంతో థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో జింబాబ్వేకు ఫ్రీ హిట్ లభించింది. అయితే ఫ్రీ హిట్ బంతికి ఒక్క పరుగు కూడా చేయలేకపోవడంతో జింబాబ్వే ఓటమిపాలైంది. స్కోర్ వివరాలు.. బంగ్లాదేశ్: 150/7 (20 ఓవర్లు) జింబాబ్వే: 147/8 (20 ఓవర్లు) -
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం
చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిచ్చిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ చివరి ఓవర్లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతిని అంపైర్లు 'నో బాల్'గా ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరి ఓవర్ నాలుగో బంతిని నవాజ్ ఫుల్ టాస్ వేయగా కోహ్లి దాన్ని సిక్సర్‌గా మలిచాడు. నడుము ఎత్తులో వచ్చిన ఈ బంతిని అంపైర్లు నో బాల్‌గా ప్రకటించారు. వెంటనే పాకిస్థాన్ టీం సభ్యులంతా అంపైర్లతో వాదించారు. అయినా వాళ్లు నిర్ణయాన్ని మార్చుకోలేదు. నో బాల్ తర్వాత ఫ్రీ హిట్‌గా వచ్చిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లను గిరాటేసిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో కోహ్లి- దినేశ్ కార్తీక్ మూడు పరుగులు తీశారు. ఫ్రీ హిట్ అయినందున బ్యాటర్ బౌల్డ్ అయినా ఔట్ ఉండదనే నిబంధనను కోహ్లి చక్కగా వినియోగించున్నాడు. ఈ బంతితోనే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులే అవసరమయ్యాయి. అయితే ఈ నోబాల్ వ్యవహారంపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ట్విట్టర్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. నడుము ఎత్తులో వచ్చిన బంతిని అంపైర్లు రివ్యూ తీసుకోకుండానే నో బాల్‌గా ఎలా ప్రకటించారని అడిగాడు. ఫ్రీ హిట్ బాల్‌కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించాడు. Why was no ball not reviewed, then how can it not be a dead ball when Kohli was bowled on a free hit. #INDvPAK #T20worldcup22 pic.twitter.com/ZCti75oEbd — Brad Hogg (@Brad_Hogg) October 23, 2022 ఈ నో బాల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. బంతి బ్యాటర్ నడుము ఎత్తుకు పైకి వస్తేనే నో బాల్ అని కొందరు అంటున్నారు. అంతిమ నిర్ణయం అంపైర్లదే అని, దానికి ఇరు జట్లు కట్టుబడి ఉండాలని మరికొందరు అంటున్నారు. మరికొందరేమో కోహ్లి దాదాపు క్రీజు బయట ఉన్నాడు.. అలాంటప్పుడు బంతి నడుము ఎత్తుపైకి వచ్చినా నో బాల్ కాదు అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతి వరకు అద్భుత పోరాటపటిమ ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కింగ్ కోహ్లి తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తనకు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లి -
స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు!
ఇటీవలే ఆసియా కప్ టోర్నీలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి 71వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి తన నాలుగేళ్ల కరువు తీర్చుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో స్మిత్ 127 బంతుల్లో వంద పరుగుల మార్క్‌ను అందుకొని వన్డే కెరీర్లో 12వ సెంచరీ అందుకున్నాడు. అయితే సెంచరీ సాధించాడు అని మనం పొగిడేలోపే స్మిత్ చేసిన ఒక పని అతన్ని చిక్కుల్లో పడేసింది. మరి ఇంత స్వార్థంగా ఆలోచిస్తాడా అని విషయం తెలుసుకున్న తర్వాత కచ్చితంగా పేర్కొంటారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 38వ ఓవర్ జేమ్స్ నీషమ్ వేశాడు. అప్పటికే గ్రౌండ్ చుట్టూ చూసిన స్మిత్ ఒక పొరపాటును గమనించాడు. వన్డే నిబంధనల ప్రకారం 40 ఓవర్లకు ముందు 30 గజాల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ ఈ విషయాన్ని మరిచిపోయి ఐదుగురు ఫీల్డర్లను ఉంచాడు. స్మిత్ చెప్పాలనుకుంటే బంతి పడకముందే చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా జేమ్స్ నీషమ్ వేసిన తొలి బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ తర్వాత లెగ్ అంపైర్‌వైపు తిరిగిన స్మిత్.. ''సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లకు బదులు ఐదుగురు ఉన్నారు.. అది నోబాల్ ఒకసారి పరిశీలించండి'' అంటూ చేతులతో సైగ చేశాడు. దీంతో తప్పిదాన్ని గమనించిన అంపైర్ రూల్స్ ప్రకారం నోబాల్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఫ్రీహిట్ రాగా.. నీషమ్ బౌన్సర్ వేశాడు. భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించి స్మిత్ విఫలమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ స్మిత్‌పై మండిపడ్డారు. స్మిత్ మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు.. ఒకప్పుడు బాల్ టాంపరింగ్.. ఇప్పుడు అంపైర్‌ను చీటింగ్.. నువ్వు మారవా.. అంటూ కామెంట్లు చేశారు. ఇక స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్ 105, లబుషేన్ 52 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ 42 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. చివర్లో కామెరాన్ గ్రీన్ 12 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. Steve Smith launching a filthy slog over the fence because he knew it was a no-ball due to the number of fielders outside the circle 🤯#AUSvNZ #PlayOfTheDay pic.twitter.com/T3LFFjsCB8 — cricket.com.au (@cricketcomau) September 11, 2022 చదవండి: Kane Williamson: కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..! బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
నోబాల్ ఇచ్చుంటే ఎస్ఆర్హెచ్ గెలిచేదా!
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్ ఆరంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసినప్పటికి మధ్యలో ఐదు వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఒక దశలో టాప్ ప్లేస్‌కు గురిపెట్టినట్లే కనిపించిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చతికిలపడింది. ఆ తర్వాత సీఎస్కే చేతిలో.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓటమి చవిచూసింది. దీంతో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఈ విషయం పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ ప్రధాన బ్యాటర్స్ అంతా విఫలమైన వేళ మార్క్రమ్(42), నికోలస్ పూరన్(34 బంతుల్లో 62) గెలుపుపై ఆశలు కల్పించారు. పూరన్ ఉన్నంతవరకు ఎస్ఆర్హెచ్ గెలుపుపై కాస్త ధీమా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో పూరన్ వివాదాస్పద రీతిలో ఔట్ అయ్యాడు. శార్దూల్ ఆ ఓవర్ ఐదో బంతిని చాలా ఎత్తులో ఫుల్‌టాస్ వేశాడు. అయితే పూరన్ క్రీజు నుంచి బయటకు వచ్చి లాంగాన్ దిశగా షాట్ ఆడగా పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఔట్‌పై ఫీల్డ్ అంపైర్‌కు సందేహం ఉండడంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ పరిశీలనలో.. పూరన్ క్రీజుదాటి బయటకు రావడం.. ఫుల్‌టాస్ బంతి అయినప్పటికి బ్యాట్‌కు టచ్ అయ్యే సమయంలో తక్కువ ఎత్తులో ఉండడంతో ఔట్ సిగ్నల్ ఇచ్చాడు. అలా థర్డ్ అంపైర్ నిర్ణయం ఫీల్డింగ్ జట్టుకు అనుకూలంగా వచ్చింది. పూరన్ ఔట్ కావడంతో ఎస్ఆర్హెచ్ ఓటమి దాదాపు ఖరారైంది. ఒకవేళ అంపైర్ అది నోబాల్‌గా పరిగణించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. పూరన్ ఉండుంటే జట్టును గెలిపించేవాడేమో.. కానీ ఏం చేస్తాం అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: IPL 2022 DC Vs SRH: ఎస్ఆర్హెచ్పై వార్నర్ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు -
గిల్ ఔట్‌పై అప్పీల్.. నో బాల్ ఇవ్వడం వెనుక అసలు కథ!
ఐపీఎల్ 2022లో శనివారం గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. గుజరాత్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ నో బాల్ డిక్లేర్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. విషయంలోకి వెళితే.. గుజరాత్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ షాబాజ్ అహ్మద్ వేశాడు. అప్పటికే గిల్ 24 పరుగులతో టచ్‌లో కనిపించాడు. అయితే షాబాజ్ వేసిన నాలుగో బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ మిస్ చేశాడు. బంతి వెళ్లి సబ్‌స్టిట్యూట్ కీపర్ అనూజ్ రావత్ చేతిలో పడింది. క్యాచ్ ఔట్‌గా అనూజ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. Courtesy: IPL Twitter ఫీల్డ్ అంపైర్ కూడా తాకిందేమోనని ఔట్ సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే గిల్ డీఆర్ఎస్ కోరాడు. అయితే అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను ఎక్కడ తగల్లేదని థర్డ్ అంపైర్ పరిశీలనలో తేలింది. ఔటివ్వకపోగా థర్డ్ అంపైర నోబాల్ ప్రకటించాడు. ఈ నిర్ణయం విన్న ఆర్సీబీ ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కోహ్లి ఫీల్డ్ అంపైర్ వద్దకు వచ్చి నోబాల్ ఎందుకని అడిగాడు. వాస్తవానికి అనూజ్ రావత్ క్యాచ్ పట్టడానికి ముందే గ్లోవ్స్ స్టంప్ లైన్ మీదకు వచ్చాయి. క్రికెట్ లా ప్రకారం.. బంతిని బ్యాట్స్‌మన్ ఆడడానికి ముందే కీపర్ ఉద్దేశపూర్వకంగా గ్లోవ్స్‌ను స్టంప్స్ వద్దకు తీసుకొస్తే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. ఇదే రూల్‌ను అనూజ్ రావత్ విషయంలో థర్డ్ అంపైర్ అప్లై చేశారు. కాగా ఫ్రీహిట్‌ను భారీ సిక్స్ సంధించిన గిల్.. అదే ఓవర్లో ఐదో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఎంసీసీ రూల్స్‌లో ఏం ఉందంటే.. ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట క్లబ్) రూల్స్‌లో లా 27.3.1, లా 27.3.2ను అనూజ్ రావత్ ఉల్లఘించినట్లు తేలింది. లా 27.3.1 ప్రకారం బౌలర్ బంతి వేయడానికి ముందు.. లేక బ్యాట్స్‌మన్ బంతిని టచ్ చేయడానికి ముందు.. లేదా బంతి బ్యాటర్ బ్యాట్‌ను తాకి స్టంప్స్‌ను దాటి వెళ్లడానికి ముందు కీపర్ స్టంప్స్ దగ్గరకు రాకూడదని ఈ నిబంధన పేర్కొంటుంది. ఇక లా 27.3.2 ప్రకారం బంతి బ్యాట్స్‌మన్ బ్యాట్‌ను తాకడానికి ముందే వికెట్ కీపర్ ఉద్దేశపూర్వకంగా స్టంప్స్ దగ్గరకు వస్తే అంపైర్‌కు నో బాల్ ఇచ్చే అధికారం ఉంటుంది. చదవండి: IPL 2022: రోహిత్ విఫలం.. రితికాను ఓదార్చిన అశ్విన్ భార్య గిల్ నోబాల్ వివాదంపై వీడియో కోసం క్లిక్ చేయండి -
‘మూడో అంపైర్ జోక్యం చేసుకోవాలి’
బ్యాటర్ నడుముకంటే ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చే ‘నోబాల్స్’ విషయంతో మూడో అంపైర్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఢిల్లీ, రాజస్తాన్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో ‘నోబాల్’ అంశం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ దశను మార్చే కీలక సమయాల్లో అంపైర్లు ఈ విషయాన్ని పరిశీలించమంటూ థర్డ్ అంపైర్ కోరటం సరైందని అతను సూచించాడు. జయవర్ధనే ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్‌ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది. చదవండి: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. -
రిషభ్ పంత్‌కు భారీ జరిమానా
శుక్రవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్‡ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది. -
IPL 2022: అలా చేయడం తప్పే.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్
IPL 2022 DC Vs RR: Rishabh Pant On No Ball Decision- ‘‘మ్యాచ్ ఆసాంతం వాళ్లు(రాజస్తాన్ రాయల్స్) బాగా బౌల్ చేశారు. కానీ చివర్లో పావెల్ మాకు ఆశలు కల్పించాడు. నిజానికి ఆ ‘నో-బాల్’ అనేది మాకు ఆ సమయంలో అత్యంత విలువైనది. కానీ నా చేతిలో ఏం లేదు కదా! ఈ విషయంలో మేము నిజంగా పూర్తి నిరాశకు లోనయ్యాం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ తలపడిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమైన వేళ రాజస్తాన్ తమ బౌలర్ మెక్‌కాయ్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలో.. తొలి 3 బంతుల్లో ఢిల్లీ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ సిక్సర్లు బాదాడు. అయితే, ఫుల్‌టాస్‌గా వచ్చిన మూడో బంతి నో- బాల్‌గా అనిపించడంతో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంపైర్ నో- బాల్ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ కెప్టెన్ పంత్ క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లు పావెల్, కుల్దీప్ యాదవ్‌లను వెనక్కిపిలిచాడు. అంతేకాదు ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ ఆమ్రే సైతం మైదానంలోకి వెళ్లాడు. కానీ అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మెక్కాయ్ వేసిన ఆ ఫుల్‌టాస్‌ను నో- బాల్‌గా ప్రకటించలేదు. ఈ ఘటనపై స్పందించిన పంత్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అంపైర్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఆ బాల్ విషయంలో డగౌట్లో ఉన్న ప్రతి ఒక్కరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రౌండ్లో ఉన్న ప్రతిఒక్కరు అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా చూశారు. నిజానికి థర్డ్ అంపైర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని.. దానిని నో- బాల్‌గా ప్రకటించాల్సింది’’ అని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో ఆమ్రేను మైదానంలోకి పంపిన తన నిర్ణయం పట్ల పంత్ విచారం వ్యక్తం చేశాడు. కానీ తమ విషయంలో జరిగింది కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇరు వైపులా తప్పు ఉందని, ప్రత్యర్థి 200కు పైగా స్కోరు చేసినపుడు.. దానిని ఛేదించే క్రమంలో టార్గెట్ చేరుకుంటామన్న సమయంలో ఇలా జరగడం అసహనానికి దారి తీసిందన్నాడు. అంతేగాక.. ఈ సీజన్లో అంపైరింగ్ ఎంత బాగుంటుందో చూస్తూనే ఉన్నాం కదా అంటూ అంపైర్లపై సెటైర్లు వేశాడు. ఇక మ్యాచ్ ఆరంభంలో తాము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేస్తే బాగుండేదని పంత్ అభిప్రాయపడ్డాడు. ఏదేమైఆ ఆఖరి వరకు పోరాట పటిమ కనబరిచిన తమ జట్టు సభ్యులను అభినందించిన పంత్.. తలెత్తుకునే ఉండాలని, తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ సేన 15 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ -2022 మ్యాచ్ 34: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు: రాజస్తాన్-222/2 (20) ఢిల్లీ- 207/8 (20) చదవండి👉🏾Rishabh Pant: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. IPL 2022 DC Vs RR: బట్లర్ ‘తీన్’మార్... 𝗛 𝗔 𝗟 𝗟 𝗔 𝗕 𝗢 𝗟 FEELS LIKE THIS! 🔥 — Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 What is Pant thinking ? It’s a street game , calling his team back . pic.twitter.com/WDEZvpRnay — SKS (@TweetSailendra) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంపైర్ పొరపాటు ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది
క్రికెట్లో ఫీల్డ్ అంపైర్‌పై ఒత్తిడి చాలానే ఉంటుంది. ప్రతీ బంతిని సూక్ష్మంగా పరిశీలించడం.. నో బాల్స్, వైడ్స్, లెగ్ బై, రనౌట్లు, ఫోర్లు, సిక్సర్లు, మైదానంలో ఆటగాళ్లను కంట్రోల్ చేయడం.. ఇలా ఒకటేంటి చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. ఇంత ఒత్తిలోనూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. దీంతో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. తాజాగా ఐపీఎల్ 2022లోనూ అలాంటిదే ఒకటి జరిగింది. ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో అంపైర్ ఒక నో బాల్‌ను గుర్తించలేకపోయాడు. విషయంలోకి వెళితే.. టి20 క్రికెట్లో తొలి పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసిన తర్వాత ఔట్ ఫీల్డ్‌లో నలుగురు ఫీల్డర్లను ఉంచాలి. మిగతా ఫీల్డర్లు 30 గజాల సర్కిల్లో ఉండాలి. ఇది రూల్.. అయితే మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతి వేసే సమయానికి ఉమ్రాన్ మాలిక్ ఔట్ ఫీల్డ్‌లో ఐదో ఫీల్డర్‌గా ఉన్నాడు. అప్పటికే బంతి వేయడం..బ్యాట్స్‌మన్ పరుగు తీయడం జరిగిపోయింది. ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సైమన్ డౌల్ ఎయిర్‌లో నోబాల్ అని చెప్పడం క్లియర్‌గా వినిపించింది. అంపైర్ చూసుంటే కచ్చితంగా నో బాల్ వచ్చేదే. అయితే ఔట్‌ఫీల్డ్‌లో ఎంతమంది ఉన్నారన్న విషయం అంపైర్ పట్టించుకోలేదు. మొత్తానికి అంపైర్ పొరపాటుతో ఎస్ఆర్హెచ్కు ఒక నోబాల్ కలిసొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Commwntator Simon Doull calls no-ball. pic.twitter.com/jSdbEEIkFv — Cricketupdates (@Cricupdates2022) April 15, 2022 -
నోర్ట్జేకు చేదు అనుభవం.. బౌలింగ్ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు
భారత గడ్డపై తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జేకు చేదు అనుభవం ఎదురైంది. తన వరుస ఓవర్లలో రెండు బీమర్లు(హై ఫుల్‌టాస్ బంతి) వేయడంతో అంపైర్లు నోర్జ్టే బౌలింగ్ వేయకుండా అడ్డుకున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్‌లో బౌలర్ రెండు బీమర్లు వేస్తే మ్యాచ్ పూర్తయ్యేవరకు సదరు బౌలర్‌కు మళ్లీ బౌలింగ్ వేయకుండా నిషేధిస్తారు. తాజాగా నోర్ట్జే విషయంలో అదే జరిగింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతిని నోర్జ్టే డికాక్‌కు బీమర్ వేశాడు. 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతిని డికాక్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. అంపైర్ బీమర్ అని వార్నింగ్ ఇచ్చి నో బాల్‌గా పరిగణించాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన నోర్ట్జే.. ఆ ఓవర్ మూడో బంతిని మరోసారి బీమర్ వేశాడు. దీపక్ హుడాకు చాలా ఎత్తులో వెళ్లిన బంతిని ఎక్స్ట్రా కవర్స్ దిశగా ఆడాడు. హుడా సింగిల్ కంప్లీట్ చేయగా.. అంపైర్లు దానిని బీమర్‌గా పరిగణించి నోర్జ్టేను బౌలింగ్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో మిగిలిన నాలుగు బంతులను కుల్దీప్ యాదవ్ వేశాడు. నోర్ట్జేకు ఒక రకంగా బ్యాడ్‌లక్ అనే చెప్పొచ్చు. ఇక నోర్ట్జేకు భారత్ గడ్డపై ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. 2020 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న నోర్ట్జే ఆ సీజన్ మొత్తం యూఏఈలోనే ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్లో టీమిండియాలో జరిగిన తొలి అంచె పోటీలకు దూరమైన నోర్ట్జే.. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచె పోటీల్లో పాల్గొన్నాడు. అలా రెండు సీజన్ల పాటు విదేశాల్లోనే ఆడి.. మూడో సీజన్ ద్వారా భారత్ గడ్డపై ఆడుతున్న తొలి క్రికెటర్‌గా నోర్ట్జే చరిత్ర సృష్టించాడు. చదవండి: IPL 2022: 'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్?!' -
వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఎస్ఆర్హెచ్ బౌలర్లు నో బాల్స్ కోసం పోటీ పడుతున్నారు. ఎక్కడైనా బౌలర్ వికెట్లు తీస్తే ఆనందిస్తారు.. కానీ ఎస్ఆర్హెచ్ తాము స్పెషల్‌గా ఉండాలని అనుకుందేమో. భువనేశ్వర్‌తో మొదలుపెడితే.. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ మొదటి ఓవర్లోనే నో బాల్స్ వేశారు. ఇందులో భువనేశ్వర్ నోబాల్‌తో వికెట్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో లైఫ్ పొందిన బట్లర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక మిగతా ఇద్దరు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఎక్కడైనా బౌలర్స్ వికెట్ల కోసం పోటీ పడతారు.. కానీ ఇక్కడ మాత్రం నోబాల్స్ కోసం తపిస్తున్నారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా ఆ మాత్రం ఉంటుంది అని కామెంట్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ నో బాల్స్ గోల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: స్పెషల్ బంతితో మెరిశాడు.. ప్రతీసారి జరగాలని రాసిపెట్టి ఉండదు! -
డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్ బౌలర్‌కు వింత పరిస్థితి
ఒక బౌలర్ తాను ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే వికెట్ తీసి అరంగేట్రంను గొప్పగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి అవకాశం కోసం ప్రతీ బౌలర్ ఎదురుచూస్తుంటాడు. కొందరిని ఆ అదృష్టం వరిస్తుంది.. మరికొందరికి అవకాశం రాకపోవచ్చు. కానీ ఒక బౌలర్‌కు తన తొలి మ్యాచ్‌లోనే వికెట్ వచ్చినప్పటికి.. అది నోబాల్ అవడంతో వికెట్‌లెస్ బౌలర్‌గా మిగిలిపోవడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఆ జాబితాలో చేరిపోయాడు ఇంగ్లండ్‌కు చెందిన సాకిబ్ మహమూద్. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ద్వారా సాకిబ్ మహమూద్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 507 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన విండీస్ 3 వికెట్ల నష్టానికి 229 పరుగులతో ధీటుగానే బదులిస్తుంది. క్రీజులో కెప్టెన్ బ్రాత్‌వైట్‌తో పాటు జెర్మన్ బ్లాక్‌వుడ్ 65 పరుగులతో ఆడుతున్నాడు. అప్పటికే ఈ ఇద్దరి మధ్య 128 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. మహమూద్ అప్పటికే 14 ఓవర్లు వేసినప్పటికి ఒక్క వికెట్ దక్కలేదు. కాగా మరోసారి బౌలింగ్‌కు వచ్చిన మహమూద్ 136 కిమీవేగంతో పర్ఫెక్ట్ యార్కర్‌ను వదిలాడు. అంతే బంతి క్రీజులో ఉన్న బ్లాక్‌వుడ్‌ను దాటుకుంటూ మిడిల్‌స్టంప్‌ను పడగొట్టింది. ఇంకేముంది సాకిబ్ తొలి టెస్టు వికెట్ అందుకున్నాననే ఆనందంలో మునిగిపోయాడు. ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో షాకవడం సాకిబ్ వంతైంది. అలా తాను ఆడుతున్న తొలి టెస్టులో వికెట్ సాధించే అవకాశం కోల్పోయాడు. బెన్ స్టోక్స్ కానీ సాకిబ్ మాత్రం ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. తొలి టెస్టు ఆడుతూ వికెట్ తీసినప్పటికి అది నోబాల్ అవడంతో ఆ అవకాశం కోల్పోయిన క్రికెటర్‌గా సాకిబ్ నిలిచాడు. ఇంతకముందు ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్( 2013లో బ్రాడ్ హడిన్), మార్క్ వుడ్(మార్టిన్ గప్టిల్, 2015లో), టామ్ కరన్( డేవిడ్ వార్నర్, 2017లో), మాసన్ క్రేన్( ఉస్మాన్ ఖవాజా, 2018లో).. ఇలాగే తమ తొలి టెస్టు వికెట్‌ను సాధించే ప్రయత్నంలో నోబాల్ వేసి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. తాజాగా వీరి సరసన సాకిబ్ మహమూద్ కూడా చేరిపోయాడు. మార్క్ వుడ్ కాగా తొలి వికెట్ నోబాల్‌గా తేలినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో సాకిబ్ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. టామ్ కరన్ చదవండి: Yastika Bhatia: 'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా' PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా Mason Crane denied his maiden Test wicket by a no ball. ✅ Mark Wood denied his maiden Test wicket by a no ball. ✅ Ben Stokes denied his maiden Test wicket by a no ball. ✅ Tom Curran denied his maiden Test wicket by a no ball. ✅#Ashes pic.twitter.com/l3DZ5xD4fz — Seam Up Cricket (@SeamUp) January 6, 2018 -
రెండుసార్లు బచాయించినా గెలిపించలేకపోయారు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022) చివరి అంకానికి చేరుకుంది. లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఎలిమినేటర్ 2లో భాగంగా శుక్రవారం లాహెర్ ఖలందర్స్ ఇస్లామాబాద్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ షాహిన్ అఫ్రిది తన చివరి ఓవర్ వేశాడు. ఇస్లామాబాద్ గెలవాలంటే 4 ఓవర్లలో 35 పరుగులు చేయాలి. క్రీజులో హిట్టర్ అసిఫ్ అలీతో పాటు హసన్ అలీ ఉన్నారు. ఓవర్ తొలి బంతిని అసిఫ్ బౌండరీ పంపించాడు. రెండో బంతిని సింగిల్ తీయడంతో హసన్ అలీ స్ట్రైక్‌కు వచ్చాడు. మూడో బంతిని హసన్ భారీ షాట్ ఆడినప్పటికి బంతి వెళ్లి డేవిడ్ వీస్ చేతిలో పడింది. కానీ రిప్లేలో నోబాల్ అని తేలింది. అప్పటికే ఒక పరుగు పూర్తైంది. ఆ తర్వాత ఫ్రీ హిట్‌లోనూ అసిఫ్ అలీ కూడా అదే తరహాలో భారీ షాట్ ఆడాడు. లాంగాన్ దిశలో ఫీల్డర్ క్యాచ్ తీసుకున్నప్పటికి కౌంట్ కిందకు రాదు. అలా రెండుసార్లు ఔట్ నుంచి బచాయించినప్పటికి ఇద్దరు అలీలు మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లాహోర్ ఖలందర్స్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. షఫీక్ 52 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కమ్రాన్ గులామ్ 30, డేవిడ్ వీస్ 28 నాటౌట్, మహ్మద్ హఫీజ్ 28 పరుగులు చేశారు. అనంతరం ఇస్లామాబాద్ యునైటెడ్స్ 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. అజమ్ ఖాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్ అయ్యర్.. డౌట్ అక్కర్లేదు pic.twitter.com/49893BOcmh — Sports Hustle (@SportsHustle3) February 25, 2022 pic.twitter.com/PDjZQt2Xlk — Sports Hustle (@SportsHustle3) February 25, 2022 -
క్యాచ్ పట్టిన ఫీల్డర్ సెలెబ్రేషన్స్ వేరే లెవల్.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా
సాధారణంగా ఏదైనా మ్యాచ్‌లో క్యాచ్ పడితే ఫీల్డర్ సెలెబ్రేషన్స్ వేరే విధంగా ఉంటాయి. అయితే పట్టిన క్యాచ్ నోబాల్ అయితే.. ఫీల్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. అచ్చెం ఇటువంటి సంఘటనే యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా బ్రెస్సియా క్రికెట్ క్లబ్, టర్కీ జైటిన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రెస్సియా ఇన్నింగ్స్‌లో చాలా ఈజీ క్యాచ్‌లను టర్కీ ఫీల్డర్లు జారవిడిచారు. అయితే బ్రెస్సియా ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన అభిషేక్ కుమార్ బౌలింగ్‌లో.. బాబర్ హుస్సేన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్‌గా అందుకున్నాడు. క్యాచ్ పట్టిన ఆనందంలో ఫీల్డర్ సెలెబ్రేషన్లో మునిగిపోయాడు. అయితే అతడు ఆనందం కొంత సమయం మాత్రమే మిగిలింది. ఎందుకంటే సదరు ఫీల్డర్ క్యాచ్ పట్టిన బంతిను అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో అతడికి ఒక్క సారిగా గుండె జారినంత పనైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూరోపియన్ క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Ind Vs SL T20I: ఓపెనర్లుగా వారిద్దరు.. రోహిత్‌కి నో ఛాన్స్! When your team finally hold onto a catch... 🥳 But it's a free-hit 😭 So many emotions in one ball! 😂 #ECL2022 pic.twitter.com/HoJxGc8tJJ — European Cricket (@EuropeanCricket) February 23, 2022 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతిని వేశాడు. శ్రీలంకతో జరిగిన మూడో టి20లో స్టార్క్ వేసిన ఆ బంతి లంక బ్యాటర్ దాసున్ షనకతో పాటు మిగతా ఆటగాళ్లను.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. స్లో యార్కర్ బాల్ వేయాలని భావించిన స్టార్క్ వ్యూహం విఫలమైంది. చదవండి: Kevin Pietersen: ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్‌కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్ దీంతో బంతి అతని చేతి నుంచి జారి షనక పక్కనుంచి దాదాపు 3 మీటర్ల ఎత్తులో వెళ్లి పక్కనున్న పిచ్‌పై పడింది. కీపర్ మాథ్యూ వేడ్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో అది కాస్త బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్ నోబాల్‌తో పాటు ఫ్రీ హిట్ ఇచ్చాడు. కాగా స్టార్క్ వేసిన నోబాల్.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతిగా పరిగణించారు. ఇంతకముందు ఇలాంటివి జరిగినప్పటికి స్టార్క్ వేసిన బంతి దాదాపు 3 మీటర్ల ఎత్తులో వెళ్లడంతో చెత్త బంతిగా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో టి20లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆసీస్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్ షనక 39 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 25 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మ్యాక్స్‌వెల్ 39, ఆరోన్ ఫించ్ 35 పరుగులతో రాణించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న జరగనుంది. చదవండి: Mitchell Starc: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి "I don't think I've ever seen a ball go that wide!" Matthew Wade had no chance with that one! #AUSvSL pic.twitter.com/MjC8sCvYtk — cricket.com.au (@cricketcomau) February 15, 2022 -
నో బాల్స్ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది?
టెస్టుల్లో నో బాల్స్ వేయడమే అరుదు. మరి అలాంటిది దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ నో బాల్స్ విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఇప్పటివరకు 17 నో బాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలోనే రబాడ చెత్త రికార్డు నమోదు చేశాడు. సౌతాఫ్రికా తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన జాబితాలో రబాడ చోటు దక్కించుకున్నాడు. ఇంతకముందు 1997-98లో కేప్‌టౌన్ టెస్టు వర్సెస్ శ్రీలంకతో మ్యాచ్‌లో షాన్ పొలాక్ 17 నోబాల్స్ వేయగా.. ఆ తర్వాత మళ్లీ పొలాక్ 1998 నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 17 నోబాల్స్ వేశాడు. ఇక 2004-05లో పోర్ట్ ఎలిజిబెత్ టెస్టు వర్సెస్ ఇంగ్లండ్‌తో డేల్ స్టెయిన్ 16 నోబాల్స్ వేయడం విశేషం. చదవండి: Virat Kohli: రెండు ఇన్నింగ్స్‌లో ఒకేలా ఔటైన కోహ్లి.. ఫ్యాన్స్ ట్రోల్ -
ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టైకి ఊహించని షాక్ తగిలింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ టై బౌలింగ్ చేసే సమయంలో రెండు బంతులను బ్యాట్స్‌మన్ నడుముపైకి విసిరాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతులు బ్యాట్స్‌మన్ పైకి విసిరితే బీమర్ అని పిలుస్తారు. అయితే బీమర్ అనేది క్రికెట్లో ప్రమాదకరంగా ఉండడంతో దానిని నిషేధించారు. దీంతో ఒక బౌలర్ ఒక ఓవర్లో రెండు కంటే ఎక్కువ బీమర్లు వేస్తే అతన్ని బౌలింగ్ చేయకుండా నిషేధించొచ్చు. ఆండ్రూ టై అదే తప్పు చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ నడుముపైకి బీమర్ వేశాడు. మరుసటి బంతిని వైడ్ వేయగా.. ఆ తర్వాత బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్లు టైను అడ్డుకొని బౌలింగ్ వేయకుండా నివారించారు. ప్రస్తుతం ఆండ్రూ టై బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 35 బంతుల్లో 67 పరుగులు, జాసన్ సాంగా 46 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కొలిన్ మున్రో 64 పరుగులు నాటౌట్‌తో రాణించినప్పటికి మిగిలినవారు విఫలమయ్యారు. Two dangerous no-balls, and he's out. Here's why AJ Tye finished the innings with 1.3 completed overs to his name...@KFCAustralia | #BBL11 pic.twitter.com/nuTs6XF3LI — KFC Big Bash League (@BBL) December 28, 2021 -
స్టోక్స్ నోబాల్స్ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా?
Ben Stokes No Balls Controversy Ashes Series.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పునరాగమనం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ద్వారా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన స్టోక్స్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. 5 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక బౌలింగ్‌కు విషయానికి వస్తే.. స్టోక్స్ బౌలింగ్ లయ తప్పింది. అందుకు నిదర్శనమే నోబాల్స్. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను స్టోక్స్ వేశాడు. వార్నర్ ఆడిన ఆ ఓవర్లో తొలి నాలుగు బంతులను స్టోక్స్ విసరకముందు.. అతని కాలు క్రీజు నుంచి ఓవర్‌స్టెప్ అవ్వడం క్లియర్‌గా కనిపించింది. అటు ఫీల్డ్ అంపైర్ కానీ.. ఇటు థర్డ్ అంపైర్ కానీ నో బాల్స్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Ashes Series: స్టోక్స్ సూపర్ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్ ఇదే విషయమై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ట్రోల్ చేశారు. ''ఫీల్డ్ అంపైర్ గమనించలేదు అంటే ఒప్పుకోవచ్చు.. మరీ థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నట్లు.. వారిద్దరికి కళ్లు కనబడలేదా..'' అంటూ కామెంట్స్ చేశారు. స్టోక్స్ వేసిన నాలుగు నోబాల్స్‌కు సంబంధించిన వీడియోనూ ఆస్ట్రేలియన్ మీడియా ట్విటర్లో షేర్ చేసింది. మరో విశేషమేమిటంటే ఓవర్ నాలుగో బంతికి వార్నర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.. స్టోక్స్ ఎంట్రీ అదుర్స్ అనుకున్నారు. కానీ అప్పుడు అంపైర్ చెక్ చేసి నో బాల్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. మరి ముందు మూడు నోబాల్స్ కథేంటి అని అభిమానులు ప్రశ్నించారు. ఏది ఏమైనా పాపం స్టోక్స్‌కు రీఎంట్రీ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్టోక్స్ నోబాల్స్ విషయానికి వస్తే... ఐసీసీ రూల్స్ ప్రకారం.. థర్డ్ అంపైర్ ఒక బౌలర్ వేసే నోబాల్స్ అన్నింటిని ట్రాక్ చేయరు. వికెట్ బంతులైతేనే రిప్లేలో పరీక్షిస్తారు. క్లాజ్ 21.5.2 ప్రకారం.. బౌలర్ బంతి విడవడానికి ముందు తన పాదంలో కొద్ది బాగాన్ని క్రీజుపై ఉంచినా.. గ్రౌండ్‌పై పెట్టినా.. మిడిల్‌స్టంప్‌ను కలిపే లైన్ లోపల వేసినా అది సరైన బాల్ కిందే లెక్కిస్తారు. ఈ మూడు రూల్స్ అతిక్రమించినప్పుడే ఫీల్డ్ అంపైర్ నోబాల్స్‌గా పరిగణిస్తారు. మరోవైపు థర్డ్ అంపైర్ కూడా టెలివిజన్ రిప్లేలో బౌలర్ ఫ్రంట్‌ఫుట్ ఎండ్‌ను కచ్చితంగా చెక్ చేస్తాడు. ఫీల్డ్ అంపైర్ చూడనప్పుడు...పైన చెప్పిన మూడురూల్స్లో ఏ ఒక్కటి బౌలర్ అతిక్రమించినా వెంటనే థర్డ్ అంపైర్ .. ఫీల్డ్ అంపైర్‌కు నోబాల్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. మరి స్టోక్స్ వేసిన బంతులు నో బాల్స్ అని క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికి అంపైర్లు ఏ చర్య తీసుకోకపోవడం ఆసక్తి కలిగించింది ఇక మ్యాచ్‌లో ఆట రెండో రోజు లంచ్ విరామం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. వార్నర్ 56, లబుషేన్ 55 పరుగులతో ఆడుతున్నారు. Each of Ben Stokes' first four deliveries to David Warner was a no-ball 👀@copes9 | #Ashes pic.twitter.com/kcyNrYHSYr — 7Cricket (@7Cricket) December 9, 2021 -
19 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు.. జహీర్ తర్వాత బుమ్రానే
లార్డ్స్: భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాత సమస్య మళ్లీ ముందుకొచ్చి నట్లుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఏకంగా 13 నోబాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలో అతను ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇంతకముందు 2002లో జహీర్‌ఖాన్ విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్ వేశాడు. ఆ తర్వాత మరే భారత బౌలర్ ఇన్ని నోబాల్స్ వేయలేదు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్ వేసి జహీర్‌తో సమానంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 26 ఓవర్లు వేసి 79 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డ్రాగా ముగుస్తుందా లేక ఫలితం వస్తుందా అన్నది నాలుగో రోజు ఆటపై ఆధారపడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వేగంగా ఆడి ఇంగ్లండ్‌కు ఎంత టార్గెట్ విధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. -
3093 బంతులు, దాదాపు ఆరేళ్లు.. ఒకే ఒక్క నోబాల్
కొలొంబో: లంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ కుమార్.. ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నోబాల్ వేసిన భువీ.. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ తప్పును చేశాడు. 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరిసారిగా నోబాల్ వేసిన అతను.. 3093 బంతుల తర్వాత తిరిగి నోబాల్ వేశాడు. మొత్తంగా భువీ తన అంతర్జాతీయ కెరీర్లో కేవలం 5 నోబాల్స్ మాత్రమే వేయడం మరో విశేషం. Bhuvneshwar Kumar has bowled a No Balls after 5 years and 3093 international deliveries. — Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2021 8 ఏళ్లకు పైబడిన కెరీర్లో ఇన్ని తక్కువ నోబాల్స్ వేసిన బౌలర్ కేవలం భువీ మాత్రమే అయ్యిండొచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, భువీ ఖాతాలోని నోబాల్ రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే మంగళవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో భువీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 119 వన్డేలు, 21 టెస్ట్‌లు, 48 టీ20లు ఆడిన భువీ.. అతి తక్కువ ఎకానమీతో 247 వికెట్లు పడగొట్టాడు. That was Bhuvneshwar Kumar's first no-ball after October 2015 😳#SLvIND — Priya 🦋🦋 (@BabesPatiyala) July 20, 2021 Bhuvneshwar Kumar has bowled a No ball after 6 years in International Cricket. #INDvsSL #INDvSL pic.twitter.com/BNdPE4KVW1 — Noman Views (@Noman2294) July 20, 2021 -
IPL 2021: ఇదేం నో బాల్ సైరన్.. క్రికెటర్ల అసహనం!
ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగింది. మొత్తం ఈ మ్యాచ్‌లో 26 సిక్సర్లు రావడం ఫ్యాన్స్‌కు మంచి మజాను అందించింది. కానీ ఒకానొక సందర్భంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రవీంద్ర జడేజా వేసిన 11 ఓవర్ ఆఖరి బంతిని రసెల్‌కు వేశాడు. ఆ ఓవర్‌ను చాలా కుదరుగా వేసిన జడేజా రసెల్ దూకుడును కాస్త కట్టడి చేశాడు. ఓకే.. మంచి ఓవర్ అనుకున్నారు సీఎస్కే అభిమానులు. జడేజా ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. కీపర్ ధోని కూడా బ్యాట్స్‌మన్ స్టైకింగ్ చేసే ఎండ్‌లోకి వచ్చేశాడు. ఇక బౌలర్ కూడా ఓవర్‌ను వేయడానికి దాదాపు సిద్ధమై పోయాడు., కానీ అప్పుడు మోగింది నో బాల్ సైరన్. దాంతో ఇక క్రికెటర్లకు ఏమీ అర్థం కాలేదు. ఇంత ఆలస్యంగా నోబాల్ సైరన్ ఏమిటి అనే అసహనం వారిలో కనిపించింది. మళ్లీ స్టైకింగ్ ఎండ్ మారిపోయింది. కీపర్ ధోని కూడా మళ్లీ అటువైపు నడిచాడు. ఫీల్డర్లు పొజిషన్ కూడా మళ్లీ చేంజ్ కాక తప్పలేదు. ఆ బంతి ఫ్రీ హిట్ కావడంతో దాన్ని రసెల్ సిక్స్‌గా మలిచాడు. సాధారణంగా ఓవర్ చివరి బంతి నో బాల్ అయితే ఒక బౌలర్ ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లకముందే నో బాల్ సిగ్నల్ రావాలి. కానీ చాలా ఆలస్యమైంది. నో బాల్ అంపైర్ చూడటానికి, అది కన్ఫామ్ చేసుకోవడానికి టైమ్ పట్టి ఉండివచ్చు. కానీ ఇలా మొత్తం ఛేంజ్ అయిన తర్వాత నో బాల్ సైరన్ మోగడం అంతా అసహనానికి లోను కావాల్సి వచ్చింది. నో బాల్ సిగ్నల్‌ను థర్డ్ అంపైర్‌కు అప్పచెప్పడంతో అది ఆలస్యం అవుతుంది. గతంలో బౌలర్ వేసే లైన్ క్రాస్ నో బాల్ ఫీల్డ్ అంపైర్ల చేతిలో ఉంటుంది. ప్రత్యేకంగా నో బాల్ అంపైర్ అని వారికి అప్పచెప్పారో అప్పట్నుంచీ అది ఆలస్యం కావడం తరచు జరుగుతోంది. నో బాల్ వివాదాలు.. ఐపీఎల్–2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందా! ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు 7 పరుగులు చేయాల్సి ఉండగా, మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే టీవీ రీప్లేలో అది ‘నోబాల్’గా తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లి ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నోబాల్’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో చెన్నై కెప్టెన్ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగాడు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 2020 ఐపీఎల్లో తొలిసారి ‘నోబాల్ అంపైర్’ అంటూ ప్రత్యేకంగా నియమించారు. ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, రిజర్వ్ అంపైర్లకు ఇది అదనం. కేవలం మ్యాచ్‌లో నోబాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్ పని. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నో బాల్ అంపైర్ అంశం ఇలా ఆలస్యం కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: CSK Vs KKR: కమిన్స్ మెరుపులు వృథా -
‘క్రికెట్ చరిత్రలోనే అది అత్యంత చెత్త రూల్’
కరాచీ: క్రికెట్లో బ్యాట్స్‌మన్ వికెట్ కోల్పోతామనే భయం లేకుండా ఆడేది ఫ్రీ హిట్. ముందు బాల్ నో బాల్ అయితే ఆ తర్వాత బంతిని ఫ్రీహిట్‌గా పరిగణిస్తున్నారు. సుమారు ఆరేళ్లుగా ఈ రూల్ అమలవుతోంది. 2015లో తొలిసారి ఈ నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టగా, అప్పట్నుంచి అది బ్యాటర్స్‌కు వరంగా మారింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ విమర్శలు గుప్పించాడు. అసలు నో బాల్‌కు ఫ్రీ హిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అసలే బ్యాట్స్‌మన్ గేమ్‌గా మారిపోయిన క్రికెట్లో ఈ నిబంధన ఏమిటని రషీద్ ప్రశ్నిస్తున్నాడు. అదనంగా పరుగు వస్తున్నప్పుడు ఫ్రీ హిట్ అనే నిబంధన అవసరం లేదంటున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రూల్ అని ధ్వజమెత్తాడు. ఈ తరహా నిబంధన వల్ల అవినీతికి ద్వారం సులువుగా తెరిచినట్లేనని లతీఫ్ మండిపడ్డాడు. ఒక బౌలర్ ఈజీగా నో బాల్ వేసే అవకాశం ఉంటుందని, దాన్నే ఫిక్సింగ్ కూడా వాడుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్లో ఐసీసీకి ట్యాగ్ చేశాడు లతీఫ్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో ఆర్సీబీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లు ఆడిన ఇన్నింగ్స్‌ను లతీఫ్ ప్రశంసించాడు. ఇది వేరే లెవెల్ ఇన్నింగ్స్ అంటూ కొనియాడాడు. ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి అక్కడ ఉన్నది ఏబీ.. బౌలింగ్ ఎవరికిచ్చావ్! Free hit on No ball , worst ever rule/ Law in cricket. huge window for individual ( corruption) act, but effect all team @ICC @ICCLive @IPL #BCCI @Steve_Rich100 @thePSLt20 @BBL — Rashid Latif ®️🇵🇰🌹 (@iRashidLatif68) April 18, 2021 AB with Max #RCBvKKR different level ... — Rashid Latif ®️🇵🇰🌹 (@iRashidLatif68) April 18, 2021 -
'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా'
బ్రిస్బేన్: ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన టి.నటరాజన్ తొలి సిరీస్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టాడు.మూడు మ్యాచ్‌లు కలిపి 6.92 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీశాడు.ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం నటరాజన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే టీమిండియా ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా నటరాజన్ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు తీశాడు... కానీ నటరాజన్ విషయంలో నో బాల్స్ అంశం మాత్రం బాగా కలవరపెడుతుంది. మంచి ఫుట్‌వర్క్ కలిగిన నటరాజన్ ఆడిన తొలి టెస్టులోనే ఏడు నోబాల్స్ వేయడం విశేషం. టెస్టు మ్యాచ్‌లో నోబాల్స్ పడడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇదే అంశంపై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. 'నటరాజన్ బౌలింగ్ శైలి అద్భుతంగా ఉంది.. అతను వికెట్ తీసే విధానం కూడా చాలా బాగుంది. కానీ నో బాల్స్ విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా. టెస్టుల్లో నో బాల్స్ వేయడం అరుదు.. అలాంటిది నటరాజన్ మాత్రం ఏడు నోబాల్స్ వేశాడు. దీంతోపాటు ఒక ఓవర్ ప్రారంభంలోనే మొదటి బంతి సరిగా వేయడానికి ఐదు నో బాల్స్ వేయడం కాస్త ఆశ్యర్యం వేసింది. ఆ సమయంలో నటరాజన్‌కు ఆ బంతులు జీర్ణించుకోవడం కాస్త కష్టంగా మారి ఉంటుంది.' అని తెలిపాడు. (చదవండి: ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) కాగా గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్‌గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (4), శుభ్‌మన గిల్ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది.(చదవండి: రోహిత్ కావాలనే అలా చేశాడా!) -
టెక్నాలజీ... నాన్ స్ట్రయికర్నూ చూడాలి: అశ్విన్
న్యూఢిల్లీ: ఫ్రంట్‌ఫుట్ నోబాల్ తెలుసుకునేందుకు థర్డ్ అంపైర్‌కు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో భారత స్పిన్నర్ అశ్విన్... టెక్నాలజీని నాన్ స్ట్రయికర్ వైపు కూడా వినియోగించాలని సూచించాడు. ‘బంతి బౌల్ కాకముందే క్రీజ్ దాటే నాన్ స్ట్రయికర్ బ్యాట్స్‌మన్‌పై కన్నేసేందుకు టెక్నాలజీ వాడాలి. రీప్లేలో బంతి పడకముందే అతను పరుగందుకుంటే ఆ రన్స్ లెక్కలోకి తీసుకోరాదు. అప్పుడే క్రికెట్లో బ్యాట్స్‌మన్, బౌలర్‌కు సమానత్వం లభిస్తుంది. దీనిపై నేను ఇంకాస్త స్పష్టత కూడా ఇస్తాను. నాన్ స్ట్రయికర్ గనుక అలా బంతిని బౌలర్ సంధించకముందే పరుగు పెడితే 2 రన్స్ సులభమవుతాయి. దీంతో అడిన బ్యాట్స్‌మన్‌కే మరుసటి బంతి ఆడే అవకాశం లభిస్తుంది. అప్పుడు అవసరాన్ని బట్టి అతను బౌండరీ లేదంటే సిక్సర్ బాదేయొచ్చు. దీనివల్ల నాకు 7 పరుగుల మూల్యం తప్పదు. అందుకే నేను నాన్ స్ట్రయికర్వైపు కూడా టెక్నాలజీని చూడమంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. -
భారత్-వెస్టిండీస్ సిరీస్‌లో కొత్త రూల్
హైదరాబాద్ : గత కొంత కాలంగా ఫీల్డ్ అంపైర్లు నో బాల్స్‌ను గుర్తించడంలో పదేపదే విఫలమవుతున్నారనే ఆరోపణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను థర్డ్ అంపైర్‌కే అప్పగిస్తున్నట్లు ఐసీసీ గురువారం అధికారికంగా ప్రకటించింది. భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్‌లలో దీనిని ట్రయల్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం జరిగే భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగే తొలి టీ20 నుంచే ఈ కొత్త నిబంధనకు అంకురార్పణ జరగనుంది. ఈ సిరీస్‌లతో పాటు కొన్ని నెలలు ఈ నిబంధనను పరిశీలించి తర్వాత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈ నిబంధన ప్రకారం థర్డ్ అంపైర్ ఫ్రంట్ ఫుట్ బాల్ నోబాల్స్‌ను గుర్తించి ఫీల్డ్ అంపైర్‌కు సూచిస్తాడు. అదేవిధంగా థర్డ్‌అంపైర్‌తో చర్చించకుండా ఫీల్డ్ అంపైర్ నోబాల్స్‌ను ప్రకటించకూడదు. ఒక వేళ బ్యాట్స్‌మన్ ఔటైన బంతి నోబాల్ అని థర్డ్ అంపైర్ ప్రకటిస్తే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ఒక్క నిబంధన మినహా ఫీల్డ్ అంపైర్‌కు ఉండే విధులు, బాధ్యతలు అలాగే కొనసాగుతాయి’అంటూ ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత కొంతకాలంగా నో బాల్స్ అంశంలో వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 21 ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేకపోయారు. దీంతో అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తాయి. సెకన్ కాలంలో నోబాల్, బాల్ లెంగ్త్, దిశ, ఎల్బీడబ్ల్యూ వంటివి గమనించడం కష్టతరంగా మారిందని అంపైర్లు వాపోయారు. దీంతో ఈ బాధ్యతను థర్డ్ అంపైర్‌కు అప్పగించాలని పలువురు సూచించారు. దీంతో నోబాల్ అంశాన్ని కొన్ని నెలల పాటు థర్డ్ అంపైర్‌కు అప్పగించాలని ఐసీసీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై మాజీ ఆసీస్ అంపైర్ సైమన్ టఫెల్ పెదవి విరిచాడు. ఇప్పటికే డీఆర్ఎస్, రనౌట్స్ వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్న థర్డ్ అంపైర్లపై ఈ నిబంధన మరింత భారం పెంచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మరో ప్రత్యామ్నాయం చూస్తే బెటర్ అని సూచించాడు. ఇక ఈ ట్రయల్స్ విజయవంతం అయితే భవిష్యత్‌లో నోబాల్స్‌కు సంబంధించి పూర్తి బాధ్యతలు థర్డ్ అంపైర్‌కే అప్పగించే అవకాశం ఉంది. -
నోబాల్ అంపైర్...
ముంబై: ఐపీఎల్–2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందా! ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు 7 పరుగులు చేయాల్సి ఉండగా, మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే టీవీ రీప్లేలో అది ‘నోబాల్’గా తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లి ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నోబాల్’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో చెన్నై కెప్టెన్ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగాడు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 2020 ఐపీఎల్లో తొలిసారి ‘నోబాల్ అంపైర్’ అంటూ ప్రత్యేకంగా నియమించనున్నారు. ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, రిజర్వ్ అంపైర్లకు ఇది అదనం. కేవలం మ్యాచ్‌లో నోబాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్ పని. ‘ఈ అంపైరింగ్ గురించి చెబుతుంటే కొంత వింత గా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. మేం టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. కాబట్టి నోబాల్స్ పొరపాట్లనే ప్రత్యేకంగా గుర్తించేందుకు ఒక అంపైర్ ఉంటే మంచిదే. రాబోయే ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం ఉంది’ అని కౌన్సిల్ సభ్యుడొకరు వెల్లడించారు. మరోవైపు మ్యాచ్‌లో ‘పవర్ ప్లేయర్’ను తీసుకొచ్చే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటి వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి లభించలేదని తెలిసింది. ఎక్కువ మంది సీనియర్లు ఉన్న ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తి తమ అనుకూలత కోసమే ఈ కొత్త తరహా ప్రతిపాదన చేశాడని సమాచారం. డిసెంబర్ 19న వేలం... ఐపీఎల్–2020 కోసం జరిగే ఆటగాళ్ల వేలంను డిసెంబర్ 19న కోల్‌కతాలో నిర్వహించాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతీ సారి వేలం బెంగళూరులోనే జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ. 3 కోట్లు అదనంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ గరిష్టంగా రూ. 85 కోట్లకు పెంచారు. -
పవర్ ప్లేయర్ కాదు.. ఎక్స్ట్రా అంపైర్!
సాక్షి, ముంబై : అన్నీ కుదిరితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13 కొత్త పుంతలు తొక్కనుంది. దీనిలో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ‘పవర్ ప్లేయర్’ అనే కొత్త ప్రతిపాదన గవర్నింగ్ కౌన్సిల్ ముందుకు వచ్చింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తుది నిర్ణయమని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. అయితే పవర్ ప్లేయర్‌పై చర్చ జరుగుతుండగానే మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఐపీఎల్లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వారిపై పని ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో మైదానంలో మరో ఎక్స్ట్రా అంపైర్‌ను ఉంచాలని గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది. అయితే ఈ ఎక్స్ట్రా అంపైర్ కేవలం ‘నో బాల్’ చెక్ చేయడానికి మాత్రమేనని తెలుస్తోంది. అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగాత్మకంగా ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. ఫ్రంట్ ఫుట్, హైట్ నోబాల్ నిర్ణయాలను మాత్రమే తీసుకునే అధికారం ఎక్స్ట్రా అంపైర్‌కు ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని, దీనిపై అధ్యక్షుడు గంగూలీ కూడా సుముఖంగా ఉన్నాడని ఆ అధికారి తెలిపారు. అయితే వచ్చే ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేనందున ‘పవర్ ప్లేయర్’ను ఈసీజన్లో అమలు చేయడం కుదరదని గవర్నింగ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా పవర్ ప్లేయర్ నిబంధనకు గంగూలీ ఆమోదముద్ర వేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను తరువాతి ఐపీఎల్‌కు వాయిదా పడింది. ఇక గత సీజన్లో ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా చివరి బంతిని లసిత్ మలింగ నోబాల్ వేసనప్పటికీ అంపైర్ గుర్తించలేదు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ బంతిని అంపైర్ నోబాల్ ప్రకటించి ఉంటే ఫలితం ఆర్సీబీకి అనుకూలంగా ఉండేది. అయితే ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
వామ్మో.. శతాబ్దపు నో బాల్ చూశారా!
క్రికెట్లో అప్పుడప్పుడు వైవిధ్యమైన, ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. సరిగ్గా అలాంటి ఓ ఘటన బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మూడో వన్డేలో జరిగింది. విండీస్ పేసర్ షెల్డాన్ కోట్రెల్ వేసిన ఓ నో బాల్‌ను ఈ శతాబ్దపు నో బాల్‌గా పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇటీవల విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను లెఫ్టార్మ్ పేసర్ షెల్డాన్ కోట్రెల్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని షెల్డాన్ వేయగా.. సెకండ్ స్లిప్‌లో ఉన్న విండీస్ ఫీల్డర్ అతికష్టమ్మీద బంతిని క్యాచ్ అందుకున్నాడు. అంపైర్ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. కాగా, స్ట్రైకింగ్‌లో ఉన్న బంగ్లా ఓపెనర్ అనాముల్ హక్ విండీస్ పేసర్ నోబాల్‌కు ఆశ్చర్యపోయాడు. కాగా, ఈ మ్యాచ్‌లో షెల్డాన్ 9 ఓవర్లు వేసి ఒకే వికెట్ సాధించి 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ వన్డేలో 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ నెగ్గిన విషయం తెలిసిందే. -
శతాబ్దపు నో బాల్ చూశారా!
-
అంపైర్ నోబాల్ ఇచ్చాడని.. చెల్లెలికి విషమిచ్చాడు!
క్రికెట్ అంటే మన దేశంలో అందరికీ ఇష్టమే. అయితే అందులో వివాదాలకు కూడా ఏమాత్రం కొదవలేదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలో గల జరారా పట్టణంలో ఇలాగే జరిగిన ఓ వివాదం.. చివరకు విషాదాంతమైంది. అక్కడివాళ్లు ఐపీఎల్ తరహాలోనే జేపీఎల్ అని ఓ టోర్నమెంటు నిర్వహించుకున్నారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 5,100 ఇస్తామన్నారు. జరారా, బరికి జట్ల మధ్య జరుగుతున్న ఓ మ్యాచ్‌లో సందీప్ పాల్ అనే బౌలర్ వేసిన బాల్‌ను అంపైర్ రాజ్‌కుమార్ నోబాల్‌గా ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాల్ కోరాడు. కానీ అంపైర్ తిరస్కరించడంతో, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని చంపేస్తానని బెదిరించాడు. అయితే, రాజ్‌కుమార్ దాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు. సరిగ్గా మర్నాడే రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులంతా పొలానికి వెళ్లినపుడు సందీప్ పాల్ వాళ్లింటికి వెళ్లి, అక్కడున్న 15 ఏళ్ల పూజకు, ఆమె స్నేహితులు ముగ్గురికి కూల్డ్రింకులు ఇచ్చాడు. వాళ్లందరికీ అతడు తెలుసు కాబట్టి అనుమానం ఏమీ రాలేదు. విషం కలిపిన ఆ డ్రింకులను వాళ్లు తాగేశారు. కాసేపటికే పూజ కుప్పకూలింది. దాంతో ఆమెను, మిగిలిన ముగ్గురిని కూడా ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం అలీగఢ్‌లోని పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. సంఘటన స్థలంలోనే మరో పురుగుల మందు సీసా కూడా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బంతిని తాకాడు.. పెవిలియన్ కు చేరాడు!
లండన్:క్రికెట్ లో నో బాల్ నిబంధన గురించి తెలియని వారుండరు. నో బాల్ లో రనౌట్ రూపంలో మాత్రమే ఆటగాడు పెవిలియన్ కు చేరే అవకాశం ఉంది. మిగతా ఏ రకంగా ఆడినా.. నో బాల్ కు అవుట్ అనేది ఉండదు. అయితే నో బాల్ లో బంతిని తాకినందుకు ఇంగ్లిష్ కౌంటీ క్రికెటర్ అవుటై పెవిలియన్ కు చేరిన ఘటన ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. క్రికెటర్ బ్రయాన్ డార్భషైర్(35) .. అమతియర్ తరుపున లీగ్ మ్యాచ్ ఆడుతూ ఓ బౌలర్ వేసిన నో బాల్ ను డిఫెన్స్ ఆడాడు. ఆ తరువాత బంతిని చేతితో పట్టుకుని ఫీల్డర్ కు విసిరాడు. దీంతో సదరు ఫీల్డర్ డార్భషైర్ అవుట్ కు అప్పీల్ చేశాడు. ఇంకేముంది ఫీల్డర్ అప్పీల్ తో అంపైర్ ఏకీభవించడంతో డార్భషైర్ పెవిలియన్ కు చేరడం చకచకా జరిగిపోయాయి. సాధారణంగా ఏ బ్యాట్స్ మెన్ అయినా బంతిని ఆడిన తరువాత చేతితో ఫీల్డర్ కు ఇచ్చినా దాని వల్ల పెద్దగా జరిగే నష్టం జరిగిన దాఖలాలు లేవు. కాగా, ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాట్స్ మెన్ బంతిని తాకుకూడదనేది స్థానిక మెర్లీబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధన. దీంతోనే డార్భషైర్ అవుటయ్యాడని ఎంసీసీ సలహాదారు మార్క్ విలియమ్స్ స్పష్టం చేశారు.బంతిని తాకే ముందు ఫీల్డర్ అనుమతి తీసుకోవాల్సిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉండగా తాను అవుటైన విధానంతో ప్రత్యర్థి జట్టుపై డార్భషైర్ విమర్శలు గుప్పించాడు. ఆ జట్టుకు అసలు గేమ్ స్పిరిట్ లేదని మండిపడ్డాడు. అంతర్జాతీయంగా ఈ తరహాలో ఓ క్రికెటర్ పెవిలియన్ కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
‘నో’బాల్ నేపాల్!
అసోసియేట్ జట్టే అయినా ప్రపంచ కప్‌లో తమ స్ఫూర్తిదాయక ఆటతీరుతో నేపాల్ అందరి మనసులూ గెలుచుకుంది. హాంకాంగ్, యూఏఈ లాంటి జట్ల తరహాలో కాకుండా ఈ జట్టులో మాత్రమే అసలైన, అక్కడే పుట్టి పెరిగిన నేపాలీలు ఉన్నారు. టోర్నీలో రెండు మ్యాచ్‌లు నెగ్గినా, రన్‌రేట్‌లో వెనుకబడి సూపర్-10 అవకాశం కోల్పోయిన ఆ జట్టు ఒక అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి ఆ జట్టు ఒక్క నోబాల్, ఒక్క వైడ్ బాల్ కూడా వేయకపోవడం విశేషం! ఏ టి20 ప్రపంచ కప్‌లోనూ ఈ ఘనత ఏ జట్టుకూ సాధ్యం కాలేదు. హాంకాంగ్‌తో 1 పరుగు (లెగ్‌బై), బంగ్లాదేశ్‌తో 2 (లెగ్‌బై), అఫ్ఘానిస్థాన్‌తో 5 (బై 4, లెగ్‌బై 1)...ఇలా మాత్రమే ఆ జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చిందంటే బౌలర్లు ఎంత క్రమశిక్షణతో బౌలింగ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. అగ్రశ్రేణి జట్లు, స్టార్ బౌలర్లు కూడా ఏదో దశలో గతి తప్పడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ జట్టు మొత్తం అదే తరహాలో బౌలింగ్ చేయడం అరుదైన విషయమే. తమ ఆటతో భవిష్యత్తుపై ఆశలు రేపిన నేపాల్‌కు హ్యట్సాఫ్ చెప్పక తప్పదు.