PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో ఎస్‌ఆర్‌హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్ ఆరంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసినప్పటికి మధ్యలో ఐదు వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఒక దశలో టాప్ ప్లేస్‌కు గురిపెట్టినట్లే కనిపించిన ఎస్‌ఆర్‌హెచ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చతికిలపడింది. ఆ తర్వాత సీఎస్‌కే చేతిలో.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓటమి చవిచూసింది. దీంతో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి.
ఈ విషయం పక్కనబెడితే ఎస్‌ఆర్‌హెచ్ ప్రధాన బ్యాటర్స్ అంతా విఫలమైన వేళ మార్క్రమ్(42), నికోలస్ పూరన్(34 బంతుల్లో 62) గెలుపుపై ఆశలు కల్పించారు. పూరన్ ఉన్నంతవరకు ఎస్‌ఆర్‌హెచ్ గెలుపుపై కాస్త ధీమా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో పూరన్ వివాదాస్పద రీతిలో ఔట్ అయ్యాడు. శార్దూల్ ఆ ఓవర్ ఐదో బంతిని చాలా ఎత్తులో ఫుల్‌టాస్ వేశాడు. అయితే పూరన్ క్రీజు నుంచి బయటకు వచ్చి లాంగాన్ దిశగా షాట్ ఆడగా పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఔట్‌పై ఫీల్డ్ అంపైర్‌కు సందేహం ఉండడంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ పరిశీలనలో.. పూరన్ క్రీజుదాటి బయటకు రావడం.. ఫుల్‌టాస్ బంతి అయినప్పటికి బ్యాట్‌కు టచ్ అయ్యే సమయంలో తక్కువ ఎత్తులో ఉండడంతో ఔట్ సిగ్నల్ ఇచ్చాడు. అలా థర్డ్ అంపైర్ నిర్ణయం ఫీల్డింగ్ జట్టుకు అనుకూలంగా వచ్చింది. పూరన్ ఔట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి దాదాపు ఖరారైంది. ఒకవేళ అంపైర్ అది నోబాల్‌గా పరిగణించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. పూరన్ ఉండుంటే జట్టును గెలిపించేవాడేమో.. కానీ ఏం చేస్తాం అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
చదవండి: IPL 2022 DC Vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment