IPL 2022
-
IPL 2023: 2022 సీన్ రిపీట్.. అప్పుడెలాగో, ఇప్పుడూ అలాగే..!
2022 సీన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ రిపీట్ కాబోతుందా అంటే..? కొన్ని గణాంకాలు ఆ ఫలితాన్నే సూచిస్తున్నాయి. గత సీజన్లో ఛాంపియన్‌గా అవతరించిన గుజరాత్, ఏరకంగా అయితే తమ ప్రస్థానాన్ని ప్రారంభించిందో (తొలి మ్యాచ్‌లో విజయం), ప్రస్తుత సీజన్లోనూ అలాగే మక్కీ టు మక్కీ సీన్ రిపీట్ చేస్తోంది. గత సీజన్లో 14 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. ప్రస్తుత సీజన్లోనూ అన్నే మ్యాచ్‌లు ఆడి గత సీజన్లోలాగే 10 విజయాలు, 4 అపజయాలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు చూడటానికి చాలా సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ, గుజరాత్ మాత్రం కాపీ పేస్ట్ అన్న తరహాలోనే తమ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఇక్కడ గుజరాత్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఓ రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో వరుస సీజన్లలో 5 కంటే తక్కువ మ్యాచ్‌లు ఓడిన తొలి జట్టుగా హార్ధిక్ సేన చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో జోరు కొనసాగిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఆర్సీబీని మట్టికరిపించి, ముంబైని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా చేసింది. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. గుజరాత్ ఓపెనర్ శుభ్మర్ గిల్ సుడిగాలి శతకంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..! -
CSK: అట్టడుగు నుంచి అగ్రస్థానానికి.. ఒక్క సీజన్లో ఎంత మార్పు..!
ఐపీఎల్ 2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాలు సాధిస్తూ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చివరి నుంచి రెండో స్థానంతో గత సీజన్‌ను ముగించిన సీఎస్కే.. ప్రస్తుత సీజన్లో అనూహ్యంగా పుంజుకుని ఓ రేంజ్లో ఇరగదీస్తుంది. ఈ సీజన్‌ను సైతం ఓటమితో (గుజరాత్ చేతిలో) ప్రారంభించిన ధోని సేన.. ఆతర్వాత ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క ఓటమిని (రాజస్థాన్) మూటగట్టుకుని బ్రేకుల్లేని బుల్డోజర్గా దూసుకుపోతుంది. నిన్న (ఏప్రిల్ 23) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా భారీ జంప్ చేసింది. కేకేఆర్‌పై భారీ స్కోర్ చేయడంతో ఆ జట్టు రన్‌రేట్ సైతం గణనీయంగా మెరుగుడింది. సీఎస్కేలో ఒక్క సీజన్లో ఇంత మార్పు రావడంతో ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ఇదే జోరును కొనసాగించి, ఐదో టైటిల్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు యువకులు, వెటరన్ ఆటగాళ్ల సమ్మేళనంలా ఉన్న సీఎస్కే సైతం ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని దృడ నిశ్చయంతో ఉంది. తమ సారధి ధోనికి బహుశా ఈ సీజన్ ఆఖరిది కావొచ్చనే సంకేతాలు అందడంతో సీఎస్కే సభ్యులంతా తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు లాంటి వెటరన్లకు కూడా ఇదే సీజన్ ఆఖరిది అయ్యే అవకాశం ఉండటంతో, వారిని సైతం ఘనంగా సాగనంపాలని భారీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయిన తమ నాయకుడికి టైటిల్‌తో వీడ్కోలు పలకడమే తామందించగలిగే గౌరవమని సీఎస్కే సభ్యులు భావిస్తున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ బౌలర్లపై సీఎస్కే బ్యాటర్లు ఓ రేంజ్లో డామినేషన్ చలాయించారు. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
IPL 2023: ఏప్రిల్ 6.. ఏడాది గ్యాప్.. కేకేఆర్ బ్యాటర్ల మహోగ్రరూపం
ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూనకం వచ్చినట్లు ఊగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. Still in awe of this... 🥰pic.twitter.com/amSg9sZdvU — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (ఏప్రిల్ 6, 2022) కేకేఆర్ ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. నాడు ముంబై ఇండియన్స్‌పై కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో శార్దూల్ కూడా కమిన్స్ తరహాలోనే రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకే రోజు, ఏడాది గ్యాప్‌లో కేకేఆర్ బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చడం యాదృచ్చికంగా జరిగినప్పటికీ కేకేఆర్ అభిమానులు మాత్రం ఏప్రిల్ 6 గురించి చెప్పుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. 𝘚𝘢𝘮𝘢𝘫𝘩 𝘳𝘢𝘩𝘦 𝘩𝘰! 😌@imShard @patcummins30 #KKRvRCB | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/shanGi5s82 — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దుల్‌తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. Pat Cummins finishes things off in style! Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare. Scorecard - https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR — IndianPremierLeague (@IPL) April 6, 2022 అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..?
ఈ ఏడాది (2022) మే 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా) వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1,01,566 మంది హాజరయ్యారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడం అదే తొలిసారి. దీంతో ఐపీఎల్-2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPL pic.twitter.com/PPhalj4yjI— BCCI (@BCCI) November 27, 2022 ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇవాళ (నవంబర్ 27) వెల్లడించింది. బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి నుంచి అవార్డు ప్రతిని అందుకున్న దృష్యాన్ని షేర్ చేసింది. భారతీయులకు ఇదో గర్వించదగ్గ క్షణం. భారత్.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇది మా అభిమానులకు అంకితం.. మొతేరా, ఐపీఎల్‌కు అభినందనలు అంటూ బీసీసీఐ ట్విటర్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే, నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఆడిన తొలి లీగ్‌లోనే అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఛాంపియన్‌గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి, 30 బంతుల్లో 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. -
IPL 2023: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్ నిర్హహకాకులు ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించినట్లు తెలస్తోంది. కాగా ఈ మినీ వేలం దాదాపు డిసెంబర్ 16న జరిగే అవకాశం ఉంది. అయితే వేలంకు సంబంధించి వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాగా ఐపీఎల్ 16వ సీజన్ వచ్చే ఏడాది మార్చి అఖరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను హోమ్, అవే పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అదే విదంగా ఈ మినీ వేలంలో ప్రతీ ప్రాంఛైజీ పర్స్ బ్యాలెన్స్‌ను 5 కోట్లు పెంచి 95 కోట్లుగా నిర్ణయించారు. ఒక వేళ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదిలివేయడం లేదా ఇతర జట్ల నుంచి తీసుకుంటే పర్స్ బ్యాలెన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. అరంగేట్ర సీజన్లోనే హార్దిక్ పాండ్యా నేతత్వంలోని గుజరాత్ అదరగొట్టింది. ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌ను ఓడించి గుజరాత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చదవండి: T20 WC 2022: పంత్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్ దిగ్గజం -
హార్దిక్ పూర్తిగా మారిపోయాడు.. ఈ మార్పునకు కారణం అతడే: మాజీ పేసర్
Asia Cup 2022- Hardik Pandya: ‘‘కాలం.. అనుభవం మనిషికి అన్ని విషయాలు నేర్పిస్తాయి. ఇందుకు పాండ్యా కూడా అతీతుడు కాడు. వ్యక్తిగా.. ఆటగాడిగా తనలో వచ్చిన మార్పులను నేను స్పష్టంగా చూశాను’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. తండ్రిగా మారిన తర్వాత హార్దిక్ పరిణితి చెందాడని.. ఆటపై మరింత దృష్టి సారించాడని పేర్కొన్నాడు. చేదు అనుభవాలు ఎదుర్కొని.. కాగా గడ్డు పరిస్థితులను దాటుకుని ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ ఇచ్చిన అవకాశంతో మరోసాని తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. అదే జోష్‌లో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్లో ముందుకు సాగున్నాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ఘనత వహించి.. టీమిండియాలో పునరగామనం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ టీ20 ఫార్మాట్లో ఏకంగా టీమిండియా పగ్గాలు చేపట్టి వరుస విజయాలు నమోదు చేశాడు. అంతేకాదు.. ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి తన విలువ చాటుకున్నాడు. అయితే, గతంలో మాదిరి మరీ దూకుడుగా కాకుండా.. వివాదాల జోలికి పోకుండా.. కాస్త కామ్‌గా ఉంటూనే తన పనిని తాను చక్కబెట్టుకుంటున్నాడు. ఆశిష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) ఒకేలా ఉంటానంటే కుదరదు! ఈ నేపథ్యంలో.. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా హార్దిక్‌కు మరింత సన్నిహితంగా మెలిగిన ఆశిష్ నెహ్రా.. తమ కెప్టెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొడుకు అగస్త్య రాకతో హార్దిక్ పూర్తిగా మారిపోయాడన్నాడు. ఐసీసీ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘మనిషికి మార్పు అవసరం. అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉంటానంటే కుదరదు. పాండ్యా విషయంలోనూ అదే జరిగింది. అగస్త్య వచ్చాకే! అనుభం తనకు చాలా నేర్పిందన్న విషయాన్ని అతడే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు కూడా! తను ఇప్పుడు వివాహితుడు.. ఓ బిడ్డకు తండ్రి.. అలాగే పరిణితి కలిగిన వ్యక్తి. నిజంగా అగస్త్య రాకతో తను చాలా మారిపోయాడు. తన పని ఏమిటో తాను చూసుకుంటూ.. కెరీర్‌పై మరింత దృష్టి సారించాడు. ఈ విషయాలను నేను దగ్గరగా గమనించాను’’ అని హార్దిక్ పాండ్యా గురించి నెహ్రా చెప్పుకొచ్చాడు. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) ఇక పాండ్యా వయసు ఇంకా 28 ఏళ్లేనన్న నెహ్రా.. ఆటను ఇలాగే కొనసాగిస్తే.. కెరీర్ మరింత ఉజ్వలంగా సాగుతుందన్నాడు. కఠిన శ్రమకు ఓర్వడంతో పాటుగా నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే తత్వం గలవాడని హార్దిక్‌ను కొనియాడాడు. కాగా హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషాను పెళ్లాడాడు. వీరికి కొడుకు అగస్త్య సంతానం. ఇక హార్దిక్‌కు తన కొడుకంటే పంచప్రాణాలు. ఆట నుంచి విరామం దొరికితే కుటుంబానికే మొత్తం సమయం కేటాయిస్తాడు పాండ్యా. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడు కెప్టెనా? ఫిట్నెస్ పరీక్షలో నెగ్గుతాడా? బౌలింగ్ చేయగలడా? పడిలేచిన కెరటంలా..
‘‘ప్రస్తుతం.. క్రికెట్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్ తానేనని అతడికి తెలిసి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అతడు రాణిస్తున్నాడు. బహుశా తన మైండ్‌సెట్ అలా మారిపోయి ఉంటుంది. గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు.. కీలకమైన సమయంలో బ్యాట్‌తో రాణిస్తున్నాడు.. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు’’ - పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. హార్దిక్ పాండ్యా బంతితోనూ, బ్యాట్‌తోనూ అద్భుతం చేశాడు- టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆఖర్లో టీమిండియాపై ఒత్తిడి పెంచాలనుకున్నాం. కానీ హార్దిక్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు- పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పునరాగమనం తర్వాత అత్యద్భుతంగా రాణిస్తూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి.. జట్టును గెలిపించాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. Asia Cup 2022 India Vs Pakistan- Hardik Pandya: ఆసియా కప్-2022లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు దక్కిన ప్రశంసల్లో మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి! కీలక పోరులో అదీ దాయాది జట్టుపై విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు హార్దిక్. ఆల్‌రౌండ్ ప్రదర్శన.. పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో బౌలర్‌గా తన వంతు పాత్ర పోషించాడు. 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వికెట్లు పడుతున్నా భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(43 పరుగులు)ను అద్భుత బంతితో పెవిలియన్‌కు పంపించాడు. అదే విధంగా.. ప్రమాదకరంగా పరిణమిస్తున్నాడునుకుంటున్న సమయంలో ఇఫ్తికర్ అహ్మద్(28)ను అవుట్ చేశాడు. ఖుష్దిల్ను కూడా కేవలం రెండు పరుగులకు పెవిలియన్‌కు పంపాడు. తద్వారా పాకిస్తాన్‌ను 147 పరుగులకు ఆలౌట్ చేయడంలో తన వంతు సహకారం అందించాడు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ తడబడుతున్న వేళ మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు హార్దిక్. సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో 15 ఓవర్ ఆరంభంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. తనదైన స్టైల్లో ఫోర్ బాది ఆ ఓవర్‌ను ముగించాడు. ఆ తర్వాత వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా సింగిల్స్ తీశాడు. బ్యాట్‌తోనే సమాధానం ఇక జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి అవుటైన తర్వాత.. గెలుపు సమీకరణం 4 బంతుల్లో 6 పరుగులుగా ఉన్న వేళ సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆల్‌రౌండ ప్రతిభతో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గతేడాది ప్రపంచకప్-2021 సమయంలో వ్యక్తిగతంగా తనను విమర్శించిన వారికి ఈ మ్యాచ్‌తో దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు హార్దిక్ పాండ్యా! గడ్డు పరిస్థితులు ఎదుర్కొని.. ఐపీఎల్-2021లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. ఆ సీజన్లో 11 ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన మొత్తం పరుగులు 127. సెకండ్ ఫేజ్‌లో అయితే అసలు బౌలింగ్ చేయలేదు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2021 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా.. మెగా ఈవెంట్లోనూ రాణించలేకపోయాడు. ఈ క్రమంలో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు తన కెరీర్ ఆరంభం నుంచి అండగా ఉన్న ముంబై ఫ్రాంఛైజీ సైతం ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్‌ను వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఫిట్నెస్ సాధించడం కోసం జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు ఈ ‘ఆల్‌రౌండర్’. రాత మార్చిన ఐపీఎల్-2022.. కెరీర్ చిక్కుల్లో పడిన వేళ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూపంలో అదృష్టం హార్దిక్ తలుపుతట్టింది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. ఐపీఎల్-2022 నేపథ్యంలో హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది గుజరాత్ ఫ్రాంఛైజీ. జాతీయ జట్టుకు దూరమై క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్న హార్దిక్ తిరిగి బౌలింగ్ చేస్తాడా లేదా అన్న అనుమానాల నడుమ ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఫిట్నెస్ టెస్టు ఎదుర్కొన్నాడు పాండ్యా. అందులో సఫలీకృతం కావడంతో అభిమానులతో పాటు గుజరాత్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. పడిలేచిన కెరటంలా.. అప్పటి వరకు కెప్టెన్‌గా ఏమాత్రం అనుభవం లేని హార్దిక్ పాండ్యా.. అవలీలగా టైటాన్స్‌ను ముందుకు నడిపించాడు. సీజన్ ఆరంభానికి ముందు చెప్పినట్లుగానే ధోని స్టైల్లో కెప్టెన్సీ చేసి జట్టును విజేతగా నిలిపాడు. సారథిగా.. బ్యాటర్‌గా(15 ఇన్నింగ్స్‌లో 487 పరుగులు- అత్యధిక స్కోరు 87 నాటౌట్)... బౌలర్‌గా(10 ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు).. మూడు పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేసి అరంగేట్ర సీజన్లోనే గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలిపాడు. అదే వేదికపై.. ఆ తర్వాత హార్దిక్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టీమిండియాలో పునరాగమనం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సారథిగా ఎంపికవడం.. క్లీన్‌స్వీప్ చేయడం.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించి విజయం సాధించడం.. ఇప్పుడు ఇలా గతేడాది ఏ వేదికపై అయితే తనకు, తన జట్టుకు అవమానం జరిగిందో అదే వేదికపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం.. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు కాబోయే కెప్టెన్ అంటూ నీరాజనాలు అందుకోవడం.. ఇలా పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఇంకో 15 పరుగులు చేయాల్సి ఉన్నా.. మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం హార్దిక్ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యర్థి బలాబలాలు అంచనా వేసి మన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలు సంధించాలి. బౌలింగ్‌లో షార్ట్ బంతులు నా బలం. బ్యాటర్లను తప్పుదోవ పట్టించి.. బంతిని అంచనా వేయలేని స్థితికి తీసుకురావాలి. ఇక ఛేజింగ్ విషయానికొస్తే.. ఓ యువ బౌలర్.. ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆడతారని తెలుసు. ఆఖరి ఓవర్లో మా విజయానికి 7 పరుగులు కావాలి. ఒకవేళ 15 పరుగులు చేయాల్సి ఉన్నా నేను ఇలాగే ఆడేవాడిని. నిజానికి 20వ ఓవర్లో నాకంటే కూడా ఆ బౌలర్ మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తెలుసు’’ అని హార్దిక్ పేర్కొన్నాడు. ఆల్ ది బెస్ట్ హీరో.. గడ్డు పరిస్థితులను దాటుకుని కెరీర్‌ను తిరిగి ఉజ్వలంగా మలచుకుంటున్న హార్దిక్ పాండ్యా.. భవిష్యత్తులోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం. పేసర్లు ప్రతాపం చూపినా.. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ మ్యాచ్ హీరో ఎవరంటే మాత్రం మొగ్గు పాండ్యావైపే చూపాల్సి వస్తుంది మరి! కీలకమైన సమయంలో 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి అజేయంగా నిలిచి సిక్సర్‌తో విజయం అందించిన హార్దిక్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే! ఏమంటారు? చదవండి: Asia Cup Ind Vs Pak: ‘కేవలం లక్ వల్లే ఇండియా గెలిచింది’! అసలేం మాట్లాడుతున్నావు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆరోజు కోహ్లి రెండున్నర గంటలు బ్యాటింగ్ చేశాడు.. నేను షాకయ్యా!
Asia Cup 2022- Rashid Khan Comments On Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆట కోసం ఎంతటి శ్రమకైనా ఓర్చేతత్వం అతడిదని.. పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడని కొనియాడాడు. కోహ్లి ఇప్పటికే కెరీర్లో అత్యుత్తమ దశకు చేరుకున్నాడన్న రషీద్.. అందుకే అతడిపై అంచనాలు భారీగా ఉంటాయని పేర్కొన్నాడు. కాబట్టి ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాలని అభిమానులు భావిస్తున్నారని.. అందుకు కోహ్లి గొప్ప ఆటతీరే కారణమని చెప్పుకొచ్చాడు. చాలా రోజులుగా జట్టుకు దూరమైన కోహ్లి ఆసియా కప్-2022 టోర్నీతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. యూఏఈ వేదికగా ఆగష్టు 27 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. నిజంగా చెప్తున్నా.. రెండున్నర గంటలు బ్యాటింగ్! ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వూలో అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన సంఘటన తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. ఈ మేరకు రషీద్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో భాగంగా ఆ మరుసటి రోజు మేము ఆర్సీబీతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అప్పుడు నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లిని చూశాను. నిజం చెప్తున్నా.. అతడు రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. అది చూసి నేను షాక్ అయిపోయాను. అర్ధ శతకంతో మెరిశాడు.. తర్వాతి రోజు మాతో మ్యాచ్‌లో కోహ్లి 70కి పైగా పరుగులు సాధించాడు. తను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక అందరూ అంటున్నట్లుగా కోహ్లి ఫామ్ కోల్పోయినట్లు తాను భావించడం లేదని.. తనపై ఉన్న అంచనాల కారణంగానే విమర్శలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. కోహ్లి స్థానంలో ఓ సాధారణ బ్యాటర్ ఉంటే ఇలాంటి మాటలు వినిపించేవి కావని పేర్కొన్నాడు. వాళ్లిద్దరికీ బౌలింగ్ చేయడం ఇష్టం ఇక విరాట్ కోహ్లి, బాబర్ ఆజం వంటి టాప్ క్లాస్ బ్యాటర్లుకు బౌలింగ్ చేయడం తనకు ఇష్టమని రషీద్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు అరంగేట్ర సీజన్లోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. కాగా ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి.. గుజరాత్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా బెంగళూరును 8 వికెట్ల తేడాతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌కు ముందు కోహ్లి ప్రాక్టీసు చేసిన విషయాన్ని రషీద్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్‌తోనూ ముచ్చట! Hello DUBAI 🇦🇪 Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz — BCCI (@BCCI) August 24, 2022 -
9 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! భావోద్వేగంతో..
Mumbai Indians -Kumar Kartikeya: అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కష్టాల కడలిని ఈదాల్సి వచ్చినా వెనకడుగు వేయక ముందుకు సాగేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ముంబై ఇండియన్స్ యువ స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ కూడా ఒకడు. క్రికెటర్ కావాలన్న తన ఆశయం కుటుంబానికి భారం కావొద్దనే తలంపుతో 15 ఏళ్ల వయస్సులో ఇంటిని వీడాడు. సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను వీడి ఢిల్లీ చేరుకున్నాడు. కష్టనష్టాలకోర్చి.. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. పగలంతా పనిచేసుకుని.. ఏడాదిపాటు కేవలం రాత్రిపూట భోజనంతో సరిపెట్టుకుని లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. కఠిన శ్రమ, ప్రతిభకు తోడు కాలం కలిసి రావడంతో 2018లో మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. తన ఆట తీరుతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్రంలోనే.. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న కార్తికేయ ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఐదు వికెట్లతో మెరిసి.. ఇక ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2021-22 టోర్నీలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల కుమార్ కార్తికేయ.. ఫైనల్లో 5 వికెట్లతో రాణించాడు. తద్వారా మధ్యప్రదేశ్ తొలిసారిగా రంజీ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా తన కలలను సాకారం చేసుకుంటున్న కార్తికేయ తొమ్మిదేళ్ల తర్వాత తాజాగా తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు. ఈ విషయాన్ని కార్తికేయ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘తొమ్మిదేళ్ల 3 నెలల తర్వాత నా కుటుంబాన్ని.. మా అమ్మను కలిశాను. ఈ అనుభూతిని వర్ణించడానికి, నా మనసులోని భావనలు తెలిపేందుకు మాటలు రావడం లేదు’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి దిగిన ఫొటోను కార్తికేయ షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. క్రికెటర్ కావాలన్న లక్ష్యం కోసం కార్తికేయ చేసిన త్యాగాన్ని కొందరు కొనియాడుతుంటే.. తల్లిదండ్రులను కలుసుకోవడానికి నీకు ఇన్నేళ్లు పట్టిందా అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. చదవండి: ICC T20 Rankings: బాబర్ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్ 1 స్థానానికి చేరువలో! -
T20 WC: అతడు మరీ అంత బ్యాడ్ ఛాయిస్ కాదు! ప్రపంచకప్ జట్టులో ఉంటే..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో భారత జట్టులో మహ్మద్ షమీకి స్థానం కల్పిస్తే బాగుంటుందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌తో పాటు షమీ కూడా జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ టోర్నీలో అనుభవజ్ఞులైన ఈ పేస్ త్రయంతో బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రయోగాలు చేస్తున్న టీమిండియా! ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగుతామన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా పలు ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ముఖ్యంగా హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లను మెగా ఈవెంట్‌కు సన్నద్ధం చేసే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షమీకి అవకాశం ఇవ్వాలంటూ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. మహ్మద్ షమీ(PC: BCCI) ఐపీఎల్లో అదరగొట్టిన షమీ! అయినా.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో షమీ.. ఆరు వికెట్లు(ఎకానమీ 9.57) పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత టీమిండియా తరఫున టీ20ల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. మరింత మెరుగయ్యాడు! ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శనతో దినేశ్ కార్తిక్ టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు. నిజానికి మహ్మద్ షమీ కూడా ఐపీఎల్లో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ట్రోఫీ అందించాడు. గత ప్రపంచకప్ మ్యాచ్ కంటే ఇప్పుడు మరింత మెరుగయ్యాడు. కాబట్టి అతడు ఈసారి మరీ అంత బ్యాడ్ ఛాయిస్ ఏమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా, భువీ, అర్ష్‌దీప్‌తో పాటు 31 ఏళ్ల షమీని మేనేజ్మెంట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్-2022లో అదరగొట్టిన 37 ఏళ్ల దినేశ్ కార్తిక్ భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చి.. ఫినిషర్‌గా స్థానం సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. చదవండి: Suryakumar Yadav: ఇదే కొనసాగితే సూర్య కెరీర్ నాశనమవడం ఖాయం! తగ్గేదేలే అంటున్న రోహిత్! -
'పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల జట్లలో ఆడనున్నారు'
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఒక్క ఐపీఎల్ మినహా మిగితా దేశాల ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీల్లో భాగం అవుతున్నారు. ఇక త్వరలో జరగనున్న యూఏఈ, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాక్ ఆటగాళ్లు భాగమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు యూఏఈ టీ20 లీగ్‌లో జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లు ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల కోసం ఆడనున్నారని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం ఉంది. కానీ పాక్ ఆటగాళ్లు మిగతా టీ20 లీగ్‌లలో ఆడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు దక్షిణాఫ్రికా, యూఏఈ టీ20 లీగ్‌లలో జట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. కాబట్టి వారి జట్లులో పాక్ ఆటగాళ్లు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానుల తో జతకట్టనున్నారు" అని ఆకాష్ చోప్రా యూ ట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు " -
తండ్రైన కేకేఆర్ బ్యాటర్.. శుభాకాంక్షల వెల్లువ
సౌరాష్ట్ర వెటరన్ వికెట్ కీపర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమకు మంగళవారం మగ బిడ్డ జన్మించినట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిన్నారి కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు షెల్డన్ జాక్సన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేకేఆర్ సైతం లిటిల్ నైట్‌కు క్లబ్‌లోకి స్వాగతం అంటూ జాక్సన్‌ను విష్ చేసింది. కాగా దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికీ 35 ఏళ్ల షెల్డన్ జాక్సన్‌కు ఇంత వరకు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో తాను నిరాశకు గురైనట్లు జాక్సన్ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఒకానొక సమయంలో తాను ఈ విషయం గురించి ఒకరిద్దరిని అడుగగా.. తనకు వయసైపోయిందన్నారని, అందుకే బీసీసీఐ నుంచి పిలుపు రావడం లేదన్నారని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో 30 ఏళ్లు పైబడిన వారిని జట్టుకు ఎంపిక చేయడం చూశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2011లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన షెల్డన్ జాక్సన్ 79 మ్యాచ్‌లు ఆడాడు. 5947 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 67 మ్యాచ్‌లలో 2346 పరుగులు చేశాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో 1534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షెల్డన్ జాక్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్! ఇంకా.. Blessed with a boy❤️😇 pic.twitter.com/Kh5zmBTy43 — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 💜💜 https://t.co/Xr70sHk5eG — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 -
'37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఫాప్ డు ప్లెసిస్‌ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌కు సంబంధించిన ప్రణాళికలలో భాగంగా లేడు. అదే విధంగా అతడు తన దక్షిణాఫ్రికా క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. కాగా డుప్లెసిస్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2020లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్ పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది సీజన్లో 468 పరుగులు చేసిన డుప్లెసిస్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. "డు ప్లెసిస్ 37 ఏళ్ల వయస్సులో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఫీల్డింగ్‌లో కూడా అదరగొడుతున్నాడు. డుప్లెసిస్ ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాబట్టి అటువంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టులో ఉండాలి. క్రికెట్ సౌతాఫ్రికా పునరాలోచన చేసి అతడిని ప్రపంచకప్‌కు జట్టులోకి తీసుకురావాలి" అని మోర్కెల్ పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly 50th Birthday: లండన్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న దాదా -
తిలక్ వర్మతో స్నేహం దేవుడిచ్చిన గొప్ప బహుమతి! మేమిద్దరం..
అండర్-19 ప్రపంచకప్-2022 టోర్నీలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బేబీ ఏబీడీని.. ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మెగా వేలం-2022లో భాగంగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో అతడు 7 ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు చేశాడు. అయితే, ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం పద్నాలుగింటికి కేవలం 4 మ్యాచ్‌లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, బ్రెవిస్‌కు మాత్రం పలువురు మేటి క్రికెటర్ల సలహాలతో పాటు కొంతమంది స్నేహితులూ దొరికారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణంలోని జ్ఞాపకాలు పంచుకున్నాడు. ‘‘ఇంతకంటే గొప్ప జట్టు ఉంటుందని నేను అనుకోను.. ఒక పెద్ద కుటుంబంలో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది. దిగ్గజాలతో కలిసి ఆడటం గొప్ప అనుభవం. నా ఆటను మెరుగుపరుచుకునే ఎన్నో సలహాలు నాకు లభించాయి’’ అని బ్రెవిస్ పేర్కొన్నాడు. దేవుడిచ్చిన వరం ఇక హైదరాబాదీ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మతో స్నేహం గురించి చెబుతూ.. ‘‘నాకు అక్కడ ఓ స్పెషల్ ఫ్రెండ్ ఉన్నాడు. తనతో స్నేహం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తాను. ఈ స్నేహబంధం నా గుండెల్లో ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. నాకోసం తిలక్ అన్ని వేళలా అండగా నిలబడతాడు’’ అని బేబీ ఏబీడీ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘మేము ఇద్దరం ఒకరినొకరం సపోర్టు చేసుకుంటాం. మాకు కాస్త హాస్య చతురత ఎక్కువ. ఒకరినొకరం ప్రాంక్ చేసుకోవడమే కాదు.. సహచర ఆటగాళ్లను కూడా ఆటపట్టించేవాళ్లం. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) బస్సు ప్రయాణాల్లోనూ మా అల్లరికి అంతే ఉండేది కాదు. వేకువజామునా.. లేదంటే అర్ధరాత్రులు అనే తేడా లేకుండా ఇద్దరం కలిసి నెట్‌ఫ్లిక్స్ చూసేవాళ్లం’’ అంటూ తిలక్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలను బ్రెవిస్ గుర్తు చేసుకున్నాడు. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే. చదవండి: Trolls On BCCI: కోహ్లి తప్పుకొన్నాక.. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందేంటి? బీసీసీఐపై ట్రోల్స్ View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ క్రికెటర్! వేడుకలో తమ చిన్నారి కూడా!
ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ తన చిరకాల ప్రేయసి బ్రియర్ నీల్‌ను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల నడుమ బుధవారం(జూన్ 29) జరిగిన వేడుకలో ఆమెను వివాహమాడాడు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన చిన్నారి సమక్షంలో వీరి వివాహం జరుగడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీన్ అబాట్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. ‘‘నా ‘ప్రేమ’ను నేను పెళ్లాడాను. నా బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ అబాట్! స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా జీవితంలోని ప్రత్యేక వేడుక ఇలా జరిగింది’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2022లో సీన్ అబాట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో అబాట్ దంపతులకు రైజర్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. కాగా అబాట్ 2014లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్ తరఫున 5 వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడాడు.ఇక ఐపీఎల్- 2022లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన సీన్ అబాట ఒక వికెట్ తీశాడు. చదవండి: IND VS ENG 5th Test: ఇంగ్లండ్‌తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ View this post on Instagram A post shared by Sean Abbott (@sean_abbott) View this post on Instagram A post shared by Sean Abbott (@sean_abbott) -
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! సర్జరీ విజయవంతం.. కోలుకుంటున్నా: రాహుల్
KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిమానులకు శుభవార్త! గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరమైన అతడు త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలుపెట్టినట్లు కేఎల్ రాహుల్ స్వయంగా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించిన రాహుల్.. తొలి సీజన్లోనే జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 15 ఇన్నింగ్స్‌లో 616 పరుగులు చేసి తాజా సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు రాహుల్. అయితే, ఆఖరి నిమిషంలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో రిషభ్ పంత్ భారత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నాటికైనా రాహుల్ కోలుకుంటాడనుకుంటే అలా జరుగలేదు. గతేడాది జరిగిన సిరీస్‌లో రెండో టాప్ స్కోరర్‌గా ఉన్న అతడు ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. కనీసం వన్డే, టీ20 సిరీస్‌కైనా అందుబాటులో ఉంటాడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ట్విటర్ వేదికగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు. ‘‘అందరికీ హలో.. గత రెండు వారాలుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే, సర్జరీ విజయవంతంగా పూర్తైంది. ఇప్పుడు బాగున్నాను. కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’’ అని రాహుల్ పేర్కొన్నాడు. కాగా రాహుల్‌కు జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగినట్లు సమాచారం. త్వరలోనే అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట అకాడమీకి చేరుకుని అక్కడే ఆరు నుంచి 12 వారాల పాటు శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక పొట్ట దిగువ భాగంలో(మృదువైన కణజాలం) తీవ్రమైన నొప్పి రావడాన్ని సాధారణంగా స్పోర్ట్స్ హెర్నియాగా వ్యవహరిస్తారు. చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" Hello everyone. It's been a tough couple of weeks but the surgery was successful. I'm healing and recovering well. My road to recovery has begun. Thank you for your messages and prayers. See you soon 🏏♥️ pic.twitter.com/eBjcQTV03z — K L Rahul (@klrahul) June 29, 2022 -
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు భలే ఛాన్స్.. ఇంగ్లండ్‌కు పయనం!
IPL 2022- Mumbai Indians: ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లకు ఆటను మెరుగుపరచుకునే మంచి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వారు మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. కాగా ఐపీఎల్-2022లో ముంబై దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోహిత్ శర్మ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. అయితే, అరంగేట్ర ఆటగాళ్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్ తదితరులు రాణించడం కాస్త ఊరటనిచ్చిన అంశం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎడిషన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్ టూర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి టాప్ కౌంటీ క్లబ్‌తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్‌లు ఆడించనున్నట్లు సమాచారం. వాళ్లందరికీ అవకాశం ఈ విషయాల గురించి ముంబై వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్ తదితర యువ క్రికెటర్లకు టాప్ టీ20 క్లబ్‌లతో పోటీ పడే అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అర్జున్ టెండుల్కర్ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సైతం వీరితో చేరునున్నాడు’’ అని పేర్కొన్నాయి. ఇక భారత్‌కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్ టూర్ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ట్రిప్‌లో భాగమైన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితా(అంచనా) ఎన్టీ తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకేన్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమణ్‌దీప్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్ జుయాల్, ఆకాశ్ మెధ్వాల్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండుల్కర్, డెవాల్డ్ బ్రెవిస్. చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! "Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence." 💯 Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs — Mumbai Indians (@mipaltan) May 26, 2022 -
T20 Captaincy: టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పించండి! అప్పుడే!
Rohit Sharma T20 Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచించాడు. అప్పుడు హిట్‌మ్యాన్‌పై భారం తగ్గి టెస్టు, వన్డేల్లో మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. వరుస సిరీస్‌లు గెలిచి! కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో వరుస టీ20 సిరీస్‌లు గెలిచాడు. వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించాడు. అయితే, దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌కు ముందు గాయం కారణంగా రోహిత్ జట్టుకూ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇంతవరకు టీమిండియా తరఫున పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో రీషెడ్యూల్డ్ టెస్టుతో సారథిగా తన ప్రయాణం ప్రారంభిస్తాడనుకున్నా కరోనా బారిన పడటం గమనార్హం. టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పించండి! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు చాంపియన్ అయిన ఈ జట్టు తాజా సీజన్లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ టీ20 కెప్టెన్సీ గురించి సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు సెహ్వాగ్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్‌కు గనుక కొత్త కెప్టెన్ ఫలానా వ్యక్తి అని భారత క్రికెట్ జట్టు యాజమాన్యం మదిలో ఎవరి పేరైనా ఉంటే.. కచ్చితంగా రోహిత్ శర్మను రిలీవ్ చేయాలి. తద్వారా.. ఒకటి.. రోహిత్‌పై పనిభారం తగ్గుతుంది. ముఖ్యంగా తన వయసు దృష్ట్యా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే.. రోహిత్‌కు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. తను పునరుత్తేజం పొందుతాడు. టెస్టులు, వన్డేల్లో మరింత దృష్టి సారించి జట్టును ముందుకు నడిపించగలుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? -
అతడి ఎంపిక సరైంది.. భారత్‌కు ఇప్పుడు అలాంటి ఆటగాడు అవసరం!
India Vs Ireland T20I Series: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో దీపక్ హుడాను ఎంపిక చేయడం మంచి నిర్ణయమని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. లోయర్ ఆర్డర్లో భారత్‌కు ఇప్పుడు హుడా వంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2022లో అద్భుతంగా ఆకట్టుకున్న అతడు.. టీమిండియా తరఫున ఏ మేరకు రాణిస్తాడో చూడాలని ఉందన్నాడు. అద్భుతంగా రాణించినా! కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు దీపక్ హుడా. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 14 ఇన్నింగ్స్‌లో కలిపి 451 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. మిడిలార్డర్లో కీలకంగా వ్యవహరించి లక్నో ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో హుడాకు జాతీయ జట్టులో చోటు దక్కుతుందని భావించినా మొండిచేయి ఎదురైంది. అయితే, కీలక ఆటగాళ్లు లేకుండా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్‌లో అతడు స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు ఇలాంటి ఆటగాడి అవసరం ఉంది! ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐర్లాండ్‌తో సిరీస్‌లో హుడా రాణిస్తాడనే అనుకుంటున్నా. ఐపీఎల్లో దీపక్ హుడా తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నిజానికి లోయర్ ఆర్డర్లో వచ్చి ఆకట్టుకునే ప్రదర్శన చేయడం కష్టం. అయితే, హుడా ఐపీఎల్లో ఈ కఠినతరమైన పనిని ఎంతో సులువుగా చేశాడు. టీమిండియాకు ఇప్పుడు ఇలాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. ఐపీఎల్‌లోనే కాదు భారత్ తరఫున కూడా అతడు అత్యుత్తమంగా రాణిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 26, 28 తేదీల్లో భారత్- ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు పాకిస్తాన్లో సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ! డబ్బు మీద ఆశలేదు కానీ! India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! -
Ranji Trophy: మూడు సెంచరీలు.. సంతోషం! ఆయన వల్లే ఇదంతా!
Ranji Trophy 2021- 2022: Mumbai- Yashasvi Jaiswal: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2021-22 సీజన్లో ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌తో సెమీస్‌లో యశస్వి రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 100, 181 పరుగులు చేయడం విశేషం. తద్వారా ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు కూడా! ఇక మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా మరో శతకం బాదే అవకాశం చేజారినా యశస్వి.. 78 పరుగులతో రాణించాడు. ఇక ఈ 20 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.. ఈ ఎడిషన్‌లో మొత్తంగా 497 పరుగులు చేయడం గమనార్హం. నాకు గర్వకారణం ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యశస్వి జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌తో కలిసి పలు ఇన్నింగ్స్‌లో ఈ కుర్ర బ్యాటర్ ఓపెనింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీలో తన ప్రదర్శ, బట్లర్‌తో అనుబంధం గురించి బీసీసీఐ ఇంటర్వ్యూలో యశస్వి మాట్లాడాడు. యశస్వి జైశ్వాల్(PC: Yashasvi Jaiswal Twitter) ఈ మేరకు.. ‘‘మూడు సెంచరీలు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరో శతకం చేజారినా.. మరేం పర్లేదు. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నిజానికి ముంబై క్యాప్ ధరించగానే నేను ఎంతో అదృష్టవంతుడినన్న భావన కలుగుతుంది. ముంబైకి ఆడుతున్నామంటే ఎల్లప్పుడూ ఎంతో జాగరూకతతో ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటేనే సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగగలం. ముంబైకి ఆడటం నిజంగా నాకు గర్వకారణం’’అని యశస్వి చెప్పుకొచ్చాడు. ఆయన వల్లే ఇదంతా ఇక తన బ్యాటింగ్ మీద జోస్ బట్లర్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు నిజంగా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బంతిని చూస్తూ.. పరిస్థితులను అంచనా వేసుకుంటూ షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోవాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాన్ని పొందగలం అని అన్నాడు. ఆయన టిప్స్ ఫాలో అవుతున్నాను’’ అని యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో 10 ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు.. 68. చదవండి: Ranji Trophy 2022 FInal: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ What does it mean to play for Mumbai? 🤔 How does it feel to score runs in tons? 🤔 The @josbuttler impact 👍 Aman Khan interviews @ybj_19 as he sums up the Day 1 of the @Paytm #RanjiTrophy #Final. 👌 👌 - By @ameyatilak Full interview 🎥 🔽 #MPvMUM https://t.co/1xxSOsxoEE pic.twitter.com/sqv77EY0tW — BCCI Domestic (@BCCIdomestic) June 22, 2022 50*, 181, 100, 103 👏 Yashasvi Jaiswal just loves to bat. 😋💗#MPvMUM | 📸: @bccidomestic pic.twitter.com/n64y2yLazB — Rajasthan Royals (@rajasthanroyals) June 22, 2022 -
ఐపీఎల్లో రాణించినా పట్టించుకోలేదు.. ఇక నేను టీమిండియాకు ఆడటం కష్టమే..!
Wriddhiman Saha: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తాను టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు ఇదివరకే తనతో స్పష్టం చేశారని, నేనే ఆటపై మమకారం చంపుకోలేక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తనను ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూశానని వైరాగ్యంతో చెప్పుకొచ్చాడు. గడిచిన ఐపీఎల్ సీజన్లో తన పర్ఫామెన్స్‌ను కొలమానంగా తీసుకుని ఉంటే ఈ పాటికి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండాల్సి ఉండిందని బాధను వెల్లగక్కాడు. యువకులతో పోటీపడి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా అవకాశం రాలేదంటే ఇక తాను టీమిండియాకు ఆటడం కష్టమేనని వాపోయాడు. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటూ వచ్చిన సాహా, గతేడాది ఆడిలైడ్ టెస్టు తర్వాత వెనకబడ్డాడు. నాటి ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి టెస్టుల్లో టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. తదనంతరం సాహా, టీమిండియాకు సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా మారిపోయాడు. పంత్ గాయం కారణంగా లేక విశ్రాంతి తీసుకున్న మ్యాచుల్లోనే సాహాకు అవకాశం దొరికేది. ఇలాంటి పరస్థితుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్‌లో భాగమైన సాహా తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని 11 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సాయంతో 31.70 సగటున 317 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శన ఆధారంగా తనను టీమిండియాకు ఎంపిక చేస్తారని సాహా ఆతృతగా ఎదురుచూశాడు. అయితే సెలెక్టర్లు మాత్రం అతనికి మరోసారి మొండి చేయి చూపించారు. చదవండి: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..! -
నేను ఆడిన కెప్టెన్లలో అతడే అత్యుత్తమం: యష్ దయాల్
గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాల్ తమ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్లలో పాండ్యానే అత్యుత్తమ సారథని అని యష్ దయాల్ తెలిపాడు. కాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు. అదే విధంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి హార్ధిక్ చరిత్ర సృష్టించాడు. “హార్దిక్ పాండ్యా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మ్యాచ్‌లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అతడికి బాగా తెలుసు. మనపై మనకు నమ్మకం ఉంటే అతడు మనల్ని స్వంత నిర్ణయాలు తీసుకునేలా సపోర్ట్ చేస్తాడు. అది బౌలర్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్లలో పాండ్యానే అత్యుత్తమ కెప్టెన్. అదే విధంగా ఆశిష్ నెహ్రా నాకు మొదటి నుంచి చాలా మద్దతుగా నిలిచాడు. టోర్నీ ఆరంభానికి ముందు నా బౌలింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేసేవాడిని. కానీ ఆశిష్ సర్ నాకు ఒక సలహా ఇచ్చారు. మొదట ఓపెనర్లుకు ఒక విధంగా, డెత్ ఓవర్లలో సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయమని చెప్పారు" అని యష్ దయాల్ పేర్కొన్నాడు. చదవండి: William Porterfield Retirement: ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ మూలస్థంభం -
ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు.. దటీజ్ తిలక్ వర్మ
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఒక జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. సీజన్లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టుగా విఫలమైనా.. ఒకరిద్దరు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. అందులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను మినహాయిస్తే మరొకరు తెలుగుతేజం తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. డెబ్యూ సీజన్లోనే అదరగొట్టే ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌లాడిన తిలక్ వర్మ 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. తిలక్ వర్మ ఆటతీరుపై రోహిత్ శర్మ సహా ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే ప్రశంసల వర్షం కురిపించారు. అతను ఆడుతున్నది డెబ్యూ సీజన్ అయినప్పటికి.. ఐదు, ఆరు సీజన్ల అనుభవం తిలక్‌లో కనిపించిందని పేర్కొన్నారు. కాగా ముంబై ఇండియన్స్ తిలక్‌వర్మను రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తిలక్ వర్మ.. టోర్నీ ద్వారా తనకు వచ్చిన రూ. 1.70 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా తండ్రికే మొత్తం డబ్బును అందజేశాడు. ఈ విషయాన్ని తిలక్ వర్మ ది వీక్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''నా బుర్రలో ఆట తప్ప ఇంకేం ఆలోచనలు రానివ్వను. ఐపీఎల్ ద్వారా నేను పొందిన మొత్తాన్ని నా తండ్రికి ఇచ్చేశాను. ఏ వ్యక్తి అయినా డబ్బుకు దాసోహం అవ్వడం సహజం. అందుకే డబ్బు ఉంచుకోవడం ద్వారా వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మా నాన్నకు డబ్బు ఇస్తూ.. 'ప్లీజ్ నన్ను వాటికి కాస్త దూరంగా ఉంచండి' అని'' పేర్కొన్నా అంటూ తెలిపాడు. ఒక ఎలక్ట్రిషియన్ కొడుకుగా ఎదిగిన తిలక్ వర్మ చిన్నప్పటి నుంచి దుబారా ఖర్చులు చేయడం అలవాటు చేసుకోలేదు. అందుకే తాను సంపాదించిన ప్రతీ రూపాయిని ఇప్పటికి తండ్రికే ఇవ్వడం అలవాటు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు..''తిలక్ వర్మ లాంటి వాళ్లు ఇంకా ఉన్నారా.. తండ్రి చాటు తనయుడు.. కష్టం అంటే ఏంటో తెలిసిన కుర్రాడు తిలక్ వర్మ'' అని పొగడ్తలతో ముంచెత్తారు. చదవండి: ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ ఐపీఎల్లో తెలుగుతేజం తిలక్ వర్మ కొత్త చరిత్ర -
ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. వీడియో వైరల్!
IPL 2022- Andre Russell: ‘‘పెద్ద పెద్ద కలలు కనాలి! అయితే, కఠిన శ్రమతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే వాటిని నిజం చేసుకోగలం. ఆ దేవుడు మంచివాడు! అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను’’ అంటూ వెస్టిండీస్ హిట్టర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తాను కారు కొన్న విషయాన్ని వెల్లడించాడు. తన పట్టుదల, కృషితో కలలను సాకారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 నేపథ్యంలో కేకేఆర్ రసెల్‌ను 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్‌లో అతడు 12 ఇన్నింగ్స్‌లో 335 పరుగులు(అత్యధిక స్కోరు 70 నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు. ఇక 13 ఇన్నింగ్స్‌లో కలిపి 17 వికెట్లు పడగొట్టి తనకు వెచ్చించిన ధరకు న్యాయం చేశాడు ఈ ఆల్‌రౌండర్. ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ ముగింపు నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న రసెల్ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏమ్జీ(Mercedes-Benz AMG) కారును కొన్నాడు. కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆనందం పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన క్రిస్ గేల్, డారెన్ సమీ, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ ఆల్‌రౌండర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రసెల్ కొన్న ఈ స్టైలిష్ కారు విలువ సుమారు 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్-2021 తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఆండ్రీ రసెల్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విండీస్ జట్టులో లేకపోవడం గమనార్హం. చదవండి: Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’ View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) -
‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్లో పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్ మొహసిన్ ఖాన్. కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 కంటే తక్కువ ఎకానమీ (5.96)తో రెండో స్థానంలో కేవలం 14.07 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. మొహసిన్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ గణాంకాలు చాలు. ఇలా అవకాశం వచ్చిన ఆరంభ సీజన్లోనే తానేంటో నిరూపించుకుని పలువురి దృష్టిని ఆకర్షించాడు. ఈ జాబితాలో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఉన్నాడు. మొహసిన్ ప్రతిభకు షమీ ఫిదా అయినట్లు అతడి కోచ్ బరుద్దీన్ సిద్ధిఖి పేర్కొన్నాడు. ఐపీఎల్ మెగా వేలం-2022 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘వేలం జరుగుతున్న సమయంలో నేను షమీతో పాటే అతడి ఫామ్‌హౌజ్‌లో ఉన్నాను. షమీ సెలక్ట్ అయినట్లు తెలిసింది. అలాగే మొహసిన్‌ను కూడా లక్నో కొనుగోలు చేసింది. ఈ విషయం తెలియగానే.. ‘‘నాకొక నాలుగు నెలల సమయం ఇవ్వండి. మొహసిన్‌ను ఇండియాలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా. నిజానికి తను చాలా మంచి బ్యాటర్. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు ఆడతాడని కేఎల్ రాహుల్ సైతం నాతో అన్నాడు’’ అని షమీ నాతో చెప్పాడు’’ అని సిద్ధిఖి స్పోర్ట్స్ యారీతో వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో షమీ ఎల్లప్పుడూ ముందుంటాడని ప్రశంసించాడు. కాగా సిద్ధిఖి గతంలో షమీతో కలిసి పనిచేశాడు. ఇక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అయిన మొహసిన్‌కు ఎప్పుడు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2018 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన 2019లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే, ఆడే అవకాశం మాత్రం రాలేదు. మెగా వేలం 2022లో ఈ లెఫ్టార్మ్ బౌలర్‌ను లక్నో 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆరంభ మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వకపోయినా కొన్ని కీలక మ్యాచ్‌లలో అదరగొట్టి 23 ఏళ్ల మొహసిన్ ఖాన్ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Hardik Pandya: ఎన్నెన్ని మాటలు అన్నారో.. అదో పెద్ద యుద్ధం.. ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలియదు! ENG vs NZ: డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్లో పడ్డ బంతి.. వీడియో వైరల్! An elated dugout as @LucknowIPL win by 6 runs against #DelhiCapitals.#TATAIPL #DCvLSG pic.twitter.com/EVagwBHHVA — IndianPremierLeague (@IPL) May 1, 2022