దక్షిణాఫ్రికాతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20 కోసం భారత అత్యుత్తమ ప్లేయింగ్ ఎలవెన్‌ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌కు చోటు దక్కలేదు.
ఈ జట్టుకు ఓపెనర్లుగా కెప్టెన్ కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో వరుసగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు అతడు చోటిచ్చాడు. ఇక తమ జట్టులో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు చోటు దక్కింది. ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. ఇక తన జట్టులో బౌలర్లగా భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్‌ను అవకాశం ఇచ్చాడు.
రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలవెన్: కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్
చదవండి: IPL 2022: 'ధోని భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'
Comments
Please login to add a commentAdd a comment