India Vs South Africa
-
సౌతాఫ్రికాతో సిరీస్.. భారత్-‘ఎ’ జట్టు వైస్ కెప్టెన్‌గా గొంగడి త్రిష
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే అండర్–19 మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’ జట్లను ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన గొంగడి త్రిష భారత ‘ఎ’ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.అదే విధంగా... హైదరాబాద్‌కే చెందిన గుగులోత్ కావ్యశ్రీకి భారత ‘ఎ’ జట్టులో... కేసరి ధృతికి భారత ‘బి’ జట్టులో చోటు లభించింది. ఆంధ్ర బౌలర్ షబ్నమ్ భారత ‘ఎ’ జట్టులో ఎంపికైంది. పుణె వేదికగాదక్షిణాఫ్రికాతోపాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోమ్యాచ్లు జరుగనున్నాయి.ఇక ఈ టోర్నీ డిసెంబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది. కాగా 18 ఏళ్ల త్రిష గత ఏడాది జరిగిన అండర్–19 ప్రపంచ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. భారత ‘ఎ’ జట్టు: సనిక చాల్కె (కెప్టెన్), గొంగడి త్రిష (వైస్ కెప్టెన్), గుగులోత్ కావ్యశ్రీ, భవిక అహిరె, జోషిత, హర్లీ గాలా, సస్తీ మండల్, సిద్ధి శర్మ, సోనమ్ యాదవ్, గాయత్రి సుర్వసె, చాందిని శర్మ, హ్యాపీ కుమారి, షబ్నమ్, బిదిషా డే, ప్రాప్తి రావల్. భారత ‘బి’ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), కమలిని (వైస్ కెప్టెన్), మహంతి శ్రీ, ఇషావరి అవసారె, మిథిలా వినోద్, ఆయుశి శుక్లా, కేసరి ధృతి, పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ, పార్శవి చోప్రా, నందన, అనాది తాగ్డె, అనందిత, సుప్రియా అరెల, భారతి ఉపాధ్యాయ్. లీగ్ దశలోనే తెలంగాణ అవుట్ సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు కథ లీగ్ దశలోనే ముగిసింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 0–7 గోల్స్ తేడాతో ఛత్తీస్‌గఢ్ జట్టు చేతిలో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్ ‘బి’లో తెలంగాణ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 0–11 గోల్స్ తేడాతో జార్ఖండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తెలంగాణతో జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ తరఫున దామిని ఖుస్రో, మధు సిదార్, శ్యామ్లీ రే 2 గోల్స్ చొప్పున చేయగా... అంజలి ఎక్కా 1 గోల్ సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ 15–0తో బెంగాల్ జట్టుపై, ఉత్తర ప్రదేశ్ 5–0తో ఉత్తరాఖండ్‌పై, గుజరాత్ 1–0తో అస్సాంపై గెలుపొందాయి. -
ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్‌దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
పాకిస్తాన్ రికార్డు బద్దలు.. భారీ మైలురాయిని అధిగమించిన టీమిండియా
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ (3-1) అనంతరం టీమిండియా ఓ భారీ మైలురాయిని అధిగమించింది. పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 90కు పైగా విజయాల శాతం నమోదు చేసిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో 90కు పైగా విజయాల శాతాన్ని నమోదు చేయలేదు.భారత్.. పాకిస్తాన్ పేరిట ఉన్న లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టింది. షార్ట్ ఫార్మాట్లో ఈ ఏడాది భారత్ 92.31 విజయాల శాతం కలిగి ఉంది. 2018లో పాక్ 89.43 విజయాల శాతాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికా సిరీస్‌తో కలుపుకుని ఈ ఏడాది భారత్ మొత్తం 26 టీ20లు ఆడింది. ఇందులో 24 విజయాలు నమోదు చేసింది. భారత్ ఈ ఏడాది కేవలం రెండు టీ20ల్లో మాత్రమే ఓడింది.టీమిండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ ఛాంపియన్‌గానూ అవతరించింది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ 2024లో భారత్ జగజ్జేతగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్ అనంతరం భారత్.. జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికాపై వరుస సిరీస్‌ల్లో విజేతగా నిలిచింది. సౌతాఫ్రికా సిరీస్‌లో కేవలం మూడో టీ20లో మాత్రమే ఓడిన భారత్.. 1, 2, 4 టీ20ల్లో విజేతగా నిలిచింది.పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన జట్లు..భారత్- 92.31 (2024)పాకిస్తాన్- 89.43 (2018)ఉగాండ- 87.88 (2023)పపువా న్యూ గినియా- 87.5 (2019)టాంజానియా- 80.77 (2022)ఇదిలా ఉంటే, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో బిజీగా ఉంది. ఈ సిరీస్ కోసం భారత్ ఇదివరకే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ కోసం టీమిండియా కఠోర సాధన చేస్తుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు. హిట్‌మ్యాన్ రెండోసారి తండ్రైనందున కుటుంబంతో గడిపేందుకు భారత్‌లోనే ఉన్నాడు. -
నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్‌తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్‌తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్‌లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు. సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్‌లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం. Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024 -
తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. వరుస సెంచరీలతో తిలక్ సత్తాచాటాడు. ప్రోటీస్‌తో జరిగిన మూడో టీ20లో అద్బుత సెంచరీతో చెలరేగిన తిలక్.. ఇప్పుడు జోహన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో అదే ఇన్నింగ్స్‌ను రిపీట్ చేశాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్ అసాంతం తిలక్ అద్బుతమైన ప్రదర్శన కరబరిచాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 140 సగటు, 198 స్ట్రైక్‌రేటుతో తిలక్ 280 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు రెండు కూడా తిలక్ దక్కాయి.కోహ్లి రికార్డు బ్రేక్ఈ క్రమంలో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా తిలక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది.2020-21లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లి 147 స్ట్రైక్‌రేటుతో 231 పరుగులు సాధించాడు. తాజా సిరీస్‌తో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా ఎగరేసుకుపోయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
సంజూ భారీ సిక్సర్.. లేడీ ఫ్యాన్ చెంపకు తగిలిన బంతి! వీడియో
సౌతాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆఖరి టీ20లో మాత్రం దెబ్బతిన్న సింహంలా విజృంభించాడు. జోహన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శాంసన్ కొట్టని ఓ భారీ సిక్సర్ నేరుగా వెళ్లి స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళా అభిమాని ముఖానికి తగిలింది. ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన స్టబ్స్ రెండో బంతిని మిడిల్ అండ్ లెగ్‌లో ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శాంసన్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ఆ బంతి మొదట సెక్యూరిటీ గార్డును తాకి, ఆపై స్టాండ్స్‌లో ఉన్న అమ్మాయి దవడకు తగిలింది.దీంతో ఆ లేడీ ఫ్యాన్ నొప్పిని భరించలేక ఏడ్చేసింది. ఆమెకు వెంటనే ఐస్ తెచ్చి దవడపై ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆమె గాయపడినట్లు తెలియగానే సంజూ క్షమాపణలు కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ను 135 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు Wishing a quick recovery for the injured fan! 🤕🤞Keep watching the 4th #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex 👈#JioCinemaSports pic.twitter.com/KMtBnOa1Hj— JioCinema (@JioCinema) November 15, 2024 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. దెబ్బకు ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా అద్బుత విజయంతో ముగించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 3-1తో సూర్య సేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.సిక్సర్లు, ఫోర్ల వర్షంతో వాండరర్స్ మైదానం తడిసి ముద్దైంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ అద్బుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120, సంజూ శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచారు. అదేవిధంగా ఈ యువ జోడీ రెండో వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు.దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం 284 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ప్రోటీస్ జట్టు కేవలం 148 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆసీస్ రికార్డు బద్దలు..👉సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటివరకు 31 టీ20లు ఆడి 18 విజయాలు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్‌ల్లో 17 విజయాలు నమోదు చేసింది.తాజా మ్యాచ్‌తో ఆసీస్ అల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.👉టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు(284). గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది. 👉అంతర్జాతీయ టీ20ల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం(210) జోడించిన జోడీగా తిలక్-శాంసన్ నిలిచారు. దీంతో రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
అందులో సీక్రెట్ ఏమీ లేదు.. వారిద్దరూ మాత్రం అద్బుతం: సూర్య
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని సూర్య చెప్పుకొచ్చాడు.వారిద్దరూ అద్బుతం: సూర్య"పరిస్థితులకు అనుగుణంగా మారి ఆడటంలో ఎటువంటి రహస్యం లేదు. మేము డర్బన్‌లో అడుగుపెట్టిన వెంటనే మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాము. మేము గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఎలా ఆడామో ఈ సారి కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము.ఫలితాలు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప నాక్ అని ఎంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వారిద్దరితో పాటు అభిషేక్ కూడా తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చని మా బౌలర్లకు చెప్పారు. అందుకు తగ్గట్టే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ఇక్కడే మా తదుపరి టీ20 వరల్డ్‌కప్‌ను ఆడనున్నాము.దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో విజయాలు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ స్టాప్ కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రోజే మాకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మీకు నచ్చిన విధంగా ఆడడండి, మేము కూర్చోని మీ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తాము అని మాతో చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. వరుసగా రెండు టీ20ల్లో డకౌటై నిరాశపరిచిన సంజూ.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.తిలక్ వర్మతో స్కోర్ బోర్డును ఈ కేరళ స్టార్ బ్యాటర్ పరుగులు పెట్టించాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఇక అద్భుత సెంచరీతో చెలరేగిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన శాంసన్👉అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శాంసన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో సంజూకు ఇది మూడో సెంచరీ. తద్వారా ఈ రేర్ ఫీట్‌ను సంజూ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచక్రికెట్లో ఏ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు సాధించలేదు.👉అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. సంజూ కంటే ముందు ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేశాడు.భారత్ ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది.భారత బ్యాటర్లలో శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(47 బంతుల్లో 120 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో ప్రోటీస్ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా.. రికార్డులు బ్రేక్ (ఫొటోలు)
-
శివాలెత్తిన తిలక్, సంజూ.. విధ్వంసకర శతకాలు.. టీమిండియా అతి భారీ స్కోర్
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో శివాలెత్తిపోయారు. సంజూ 55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేయగా.. తిలక్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. సంజూకు ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ. తొలి టీ20లో సెంచరీ అనంతరం సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న సంజూ 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. తిలక్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సిపామ్లాకు అభిషేక్ శర్మ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు...భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
భారత్, సౌతాఫ్రికా నాలుగో టీ20.. తుది జట్లు ఇవే..!
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 15) జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో టీ20లో ఆడిన జట్లనే యధాతథంగా బరిలోకి దించుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా గెలిచిందా చరిత్రే..!
జొహనెస్‌బర్గ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 15) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది.ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు సౌతాఫ్రికాపై తలో 17 విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధిస్తే.. భారత్ 30 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధించింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా, భారత్ తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఒకటి, మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. సౌతాఫ్రికా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. చివరిగా జరిగిన మూడో టీ20లో భారత్ సౌతాఫ్రికాపై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (107 నాటౌట్) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (50) ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా గెలుపు కోసం చివరి వరకు పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సౌతాఫ్రికా లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్కో జన్సెన్ (54), హెన్రిచ్ క్లాసెన్ (41) దక్షిణాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అర్షదీప్ సింగ్ 3 కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గెలుపుకు అడ్డుకట్ట వేశాడు. -
IND VS SA 4th T20: సంజూ మరోసారి డకౌటైతే..?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. జొహనెస్‌బర్గ్ వేదికగా ఇరు జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. శాంసన్ తన 32 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్లో మొత్తం ఆరు సార్లు డకౌటయ్యాడు. శాంసన్ ఇవాళ జరుగబోయే నాలుగో టీ20లో కూడా డకౌటైతే ఓ చెత్త రికార్డును టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో కలిసి షేర్ చేసుకుంటాడు.కోహ్లి తన 117 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో ఏడు సార్లు డకౌటయ్యాడు. సంజూ నేటి మ్యాచ్‌లో డకౌటైతే విరాట్ సరసన నిలుస్తాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌటైన అప్రతిష్ట రోహిత్ శర్మకు దక్కుతుంది. హిట్‌మ్యాన్ తన 151 మ్యాచ్ టీ20 కెరీర్లో 12 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. హిట్‌మ్యాన్ తర్వాతి స్థానాల్లో విరాట్ (7), సంజూ శాంసన్ (6), కేఎల్ రాహుల్ (5), శ్రేయస్ అయ్యర్ (4) ఉన్నారు.కాగా, సంజూ తన కెరీర్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు కావడం ఇది రెండో సారి. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. నేటి మ్యాచ్‌లో సంజూ ఎలాగైనా ఖాతా తెరిచి విరాట్ పేరిట ఉన్న అప్రతిష్టను సమం చేయకూడదని భావిస్తున్నాడు. సంజూ గత రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన సందర్భాల్లో మార్కో జన్సెన్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సంజూ ఈసారి ఎలాగైనా జన్సెన్ ఫోబియా నుంచి బయటపడి భారీ స్కోర్ సాధించాలని ఆశిద్దాం. -
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్‌బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్‌పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్‌గా 46 రన్స్‌తో 187కు పైగా స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్‌లో మూడో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
IND VS SA 3rd T20: చరిత్ర సృష్టించిన టీమిండియా
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో వెళ్లింది. మూడో టీ20లో గెలుపు అనంతరం టీమిండియా ఓ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. పాక్ తర్వాత విదేశాల్లో 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 241 టీ20 మ్యాచ్‌లు ఆడి 164 మ్యాచ్‌లో విజయాలు సాధించింది. విదేశాల్లో 152 టీ20లు ఆడిన భారత్ 100 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా.. విదేశాల్లో 203 టీ20లు ఆడిన పాక్ 116 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా..!సౌతాఫ్రికాతో మూడో టీ20లోనే టీమిండియా మరో రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 13 సిక్సర్లు బాదిన భారత్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.శతక్కొట్టిన తిలక్ వర్మ.. విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మసౌతాఫ్రికాతో మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టీ20ల్లో 200 పరుగుల మార్కు దాటడం భారత్‌కు ఈ ఏడాది ఇది ఎనిమిదోసారి. టీ20 చరిత్రలో ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సార్లు 200 పరుగుల మార్కును దాటలేదు.పోరాడి ఓడిన సౌతాఫ్రికా..220 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా చివరి నిమిషం వరకు అద్భుతంగా పోరాడి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హెన్రిచ్ క్లాసెన్ (41), మార్కో జన్సెన్ (54) సఫారీలను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్‌సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. హార్దిక్ పాండ్యాపై వేటు..?
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో రేపు (నవంబర్ 15) జరుగబోయే నాలుగో టీ20లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ డిసైడ్ కానున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను చాలా కీలకంగా తీసుకోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ బ్యాట్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయకపోగా.. బౌలింగ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టీ20లో ఆరు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి వికెట్ లేకుండా 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాత రెండో టీ20 బ్యాట్‌తో కాస్త పర్వాలేదనిపించిన హార్దిక్.. బంతితో (3 ఓవర్లలో వికెట్ లేకుండా 22 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తో రాణించాడని మాట వరుసకే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో అతను స్ట్రయిక్ రొటేట్ చేయకుండా ఇన్నింగ్స్ ఆఖర్లో అనవసరంగా బంతులు వేస్ట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో హార్దిక్ కీలక సమయంలో వైడ్లు వేసి అభిమానులకు కంపరం పుట్టించాడు.మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన హార్దిక్.. ఆతర్వాత బౌలింగ్‌లో దారుణమైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ ఏకంగా 50 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. మూడు టీ20ల్లో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20 నుంచి హార్దిక్‌ను తప్పించాలని అభిమానులను నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్‌కు తుది జట్టులో చేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హార్దిక్ బంతితో ఎలాగూ తేలిపోతున్నాడు కాబట్టి ఆవేశ్ ఖాన్ లేదా యశ్ దయాల్‌కు నాలుగో టీ20లో అవకాశం ఇవ్వడం మంచిదని అంటున్నారు.మరోవైపు ఈ సిరీస్‌లో రింకూ సింగ్ సైతం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగో టీ20లో రింకూను కూడా తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రింకూ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో రింకూ స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి టీ20లో 11 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో 9, మూడో టీ20 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ టీమిండియా వశమవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ ఈ రెండు మార్పులపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్‌ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్‌తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్‌లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తిలక్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
టీమిండియా తదుపరి హెడ్‌కోచ్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతం గంభీర్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనే అతడి శిక్షణా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడాడు.శుభారంభమే అయినాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా అవతరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ హీరో గౌతం గంభీర్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. శ్రీలంక పర్యటనతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు.అయితే, లంకతో వన్డే సిరీస్‌లో చారిత్రక ఓటమి తర్వాత.. మళ్లీ సొంతగడ్డపై గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా మరో వైట్‌వాష్ విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో 2-0తో ఓడించింది. అయితే, ఆ తర్వాత మరో ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై.. చెత్త రికార్డులు మూటగట్టుకుంది.ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలుఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలు ఎదురుకానుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా పాసైతేనే గంభీర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేదంటే.. విమర్శలతో పాటు కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ వచ్చినా ఆశ్చర్యం లేదు.వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మాత్రంమరోవైపు.. ప్రధాన కోచ్‌ల గైర్హాజరీలో టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జింబాబ్వే టూర్లో లక్ష్మణ్ సారథ్యంలో యువ జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై పటిష్ట ప్రొటిస్ జట్టుపై కూడా సూర్యకుమార్ సేన సత్తా చాటుతోంది.సెంచూరియన్‌లో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు సాధించడమే గాక.. లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపు జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ లక్ష్మణ్‌పై ప్రశంసలు కురిపించాడు.టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు‘‘ఈరోజు వీవీఎస్ వ్యూహాలను చూసిన తర్వాత.. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్‌ను మూడో నంబర్లో బ్యాటింగ్‌కు పంపకుండా కొత్త ప్రణాళికను అమలు చేశాడు.ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ గనుక విఫలమైతే.. వీవీఎస్ తదుపరి కోచ్‌గా.. రేసులో ముందుకు దూసుకువస్తాడు. మూడో టీ20లో సూర్యను మూడో నంబర్లో పంపకుండా.. ఉండటం వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియాకు అనుకూల ఫలితం వచ్చింది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.11 పరుగుల తేడాతో టీమిండియా విజయంకాగా సెంచూరియన్‌లో బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్‌కు బదులు తిలక్ వర్మ మూడో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ.. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 219 పరుగులు చేసిన టీమిండియా.. 11 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
భువనేశ్వర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై కూడా అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్‌కు పంపిన అర్ష్‌దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్‌కు 80 మ్యాచ్‌లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు2. అర్ష్‌దీప్ సింగ్- 59 మ్యాచ్‌లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వేలంలో అతడికి రూ. 10 కోట్ల ధర!
టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.కేవలం 16 బంతుల్లోనేస్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.తొలి సౌతాఫ్రికా ప్లేయర్గాఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్‌రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గనుక జాన్సెన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లువేదిక: సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్టీమిండియా స్కోరు- 219/6 (20)సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.మళ్లీ గెలుపు బాటకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో సిరీస్ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.అభిషేక్ శర్మ ధనాధన్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆఖరి వరకు అజేయంగా తిలక్వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.ప్రపంచంలోనే తొలి క్రికెటర్గాఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లుతిలక్ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో 2024- సెంచూరియన్ వేదికగా..సురేశ్ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో 2010- గ్రాస్ ఐస్లెట్ వేదికగామార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్ లండన్బాబర్ ఆజం(పాకిస్తాన్)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్క్రిస్ గేల్(వెస్టిండీస్)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్‌బర్గ్.టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లుయశస్వి జైస్వాల్- 2023లో నేపాల్ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులోతిలక్ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులోశుబ్మన్ గిల్(126*)- 2023లో న్యూజిలాండ్ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులోసురేశ్ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు Thunderstruck ❌Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8— JioCinema (@JioCinema) November 13, 2024 -
అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా తిరిగి పుంజుకుంది. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.దీంతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత జట్టు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(107 నాటౌట్) ఆజేయ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు.అనంతరం లక్ష్య చేధనలో ఆతిథ్య సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగల్గింది. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మళ్లీ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమ్ మీటింగ్‌లో మేము చాలా విషయాలు చర్చించుకున్నాము. మా బ్రాండ్ క్రికెట్‌ను కొనసాగించాలనుకున్నాము. సెంచూరియన్‌లో అదే చేసి చూపించాము.జట్టులో ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఓ క్లారిటీ ఉంది. మా కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. నెట్స్‌లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు దూకుడుగా ఆడి నా పనిని సులువు చేస్తున్నారు. అన్నీ సానుకూలంగా జరుగుతుండటం చాలా అనందంగా ఉంది. మైదానంలోనూ ఆరేడు నిమిషాలు ముందే ఉన్నాం.మేము సరైన దిశలో వెళ్తున్నామని భావిస్తున్నాను. ఇక తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 అనంతరం తిలక్ నా గదికి వచ్చి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమివ్వండి అని అడిగాడు.అందుకు నేను సరే అని పూర్తి స్వేచ్ఛగా ఆడమని చెప్పాను. తను చెప్పినట్లే తిలక్ అదరగొట్టాడు. తొలి సెంచరీ సాధించడంతో అతడి కుటంబ సభ్యులు ఆనందపడి ఉంటారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: ఆ నలుగురు మావాడి కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి -
IND Vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు.ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్లను సరైన సమయంలో పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అశ్విన్ రికార్డు బద్దలు...ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.చదవండి: IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది -
SA Vs IND: తిలక్ వర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు (ఫొటోలు)