Dinesh Karthik
-
దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్(Dinesh KarthiK అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్తీక్.. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.ముఖ్యంగా జోబర్గ్ పార్ట్‌టైమ్ బౌలర్ విహాన్ లుబ్బేకు కార్తీక్ చుక్కలు చూపించాడు. పార్ల్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన లుబ్బే బౌలింగ్‌లో కార్తీక్ వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అతడి విరోచిత ఇన్నింగ్స్ ఫలితంగా పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.రాయల్స్ బ్యాటర్లలో కార్తీక్‌తో పాటు రూబిన్ హెర్మాన్(28) రాణించాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డెవాన్ ఫెరీరా, సిపామల తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు విల్జోయెన్, తహీర్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని జోబర్గ్ సూపర్ కింగ్స్.. 17.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడీ, ముజీబ్, కీత్ డడ్జియన్ తలా వికెట్ సాధించింది. ఇక ఈ విజయంతో సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు బెర్త్‌కు మరింత చేరువైంది.జోరు తగ్గని డీకే..కాగా గతేడాది ఐపీఎల్ సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కార్తీక్ విడ్కోలు పలికాడు. బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కార్తీక్ సౌతాఫ్రికా టీ20లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని పార్ల్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. జోరూట్, డేవిడ్ మిల్లర్ వంటి కీలక ఆటగాళ్లు సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో కార్తీక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం కాస్త ముందుగానే లభించింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని డికే సద్వినియోగపరుచుకున్నాడు. తొలి ఎస్ఎ 20 హాఫ్ సెంచరీని కార్తీక్ నమోదు చేశాడు.39 ఏళ్ల కార్తీక్ 362 టీ20 ఇన్నింగ్స్‌లలో 27.09 సగటు, 136.83 స్ట్రైక్ రేట్‌తో 7504 పరుగులు చేశాడు. ఇందులో 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 261 సిక్సర్లు, 722 ఫోర్లు కొట్టాడు. అటు ధోనీ 342 టీ20 ఇన్నింగ్స్‌లలో 38.11 సగటుతో 7,432 పరుగులు చేశాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 517 ఫోర్లు, 338 సిక్సర్లు బాదాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ ఈవెంట్ రద్దు MAIDEN SA20 FIFTY FROM DINESH KARTHIK. 🙇♂️🌟pic.twitter.com/1c7uReQZ8l— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025 -
ధోనిని అధిగమించిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ టీ20ల్లో ఓ భారీ రికార్డును సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు. టీ20ల్లో ధోని 391 మ్యాచ్‌ల్లో 7432 పరుగులు చేయగా.. డీకే 409 మ్యాచ్‌ల్లో 7451 పరుగులు సాధించాడు. ఐపీఎల్ సహా భారత క్రికెట్ మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించిన డీకే ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డీకే.. నిన్న (జనవరి 27) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 2 భారీ సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసిన కార్తీక్ మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని రికార్డును బద్దలు కొట్టాడు.39 ఏళ్ల దినేశ్ కార్తీక్ పొట్టి ఫార్మాట్లో 26.99 సగటున, 136.84 స్ట్రయిక్‌రేట్‌తో 34 హాఫ్ సెంచరీల సాయంతో 7451 పరుగులు చేశాడు. ఇందులో 718 బౌండరీలు, 258 సిక్సర్లు ఉన్నాయి. ధోని విషయానికొస్తే.. ఈ మాజీ సీఎస్కే కెప్టెన్ తన టీ20 కెరీర్లో 38.11 సగటున, 135.64 స్ట్రయిక్‌రేట్‌తో 28 హాఫ్ సెంచరీల సాయంతో 7432 పరుగులు చేశాడు. ఇందులో 517 ఫోర్లు, 338 సిక్సర్లు ఉన్నాయి. 43 ఏళ్ల ధోనికి కార్తీక్ రికార్డును తిరిగి అధిగమించేందుకు మరో అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. తదుపరి ఐపీఎల్ సీజన్లో ధోని మరి కొన్ని పరుగులు చేసినా డీకేను అధిగమిస్తాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండో ఎడిషన్‌లో డీకేకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఈ సీజన్లో అతను ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఐదుసార్లు మాత్రమే బ్యాటింగ్‌కు దిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో చేసిన స్కోరే అత్యధికం. కార్తీక్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేకపోయినా పార్ల్ రాయల్స్ ఈ సీజన్లో అదరగొట్టింది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. తాజా గెలుపుతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాయల్స్ చేతిలో ఓటమితో డర్బన్ సూపర్ జెయింట్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్ జెయింట్స్ తరఫున మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ మరో బంతి మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ జో రూట్ డకౌటై నిరాశపర్చగా.. డ్రి ప్రిటోరియస్ (43), రూబిన్ హెర్మన్ (59) రాయల్స్‌ను గెలిపించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (15 బంతుల్లో 21) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. -
పంత్‌తో పోటీలో సంజూ వెనుకబడటానికి కారణం అదే: డీకే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టులో రిషభ్ పంత్‌కు చోటు దక్కడంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. సంజూ శాంసన్(Sanju Samson)ను కాదని.. సెలక్టర్లు ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి వైపు మొగ్గుచూపడానికి గల కారణాన్ని విశ్లేషించాడు. ఇద్దరూ సూపర్ బ్యాటర్లే అయినా.. పంత్(Rishabh Pant)లోని ఓ ప్రత్యేకతే అతడిని రేసులో ముందు నిలిపిందని పేర్కొన్నాడు.పాకిస్తాన్ వేదికగావన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా క్వాలిఫై అయింది.మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్-2023 పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా అర్హత సాధించాయి. ఇందుకు సంబంధించి ఈ ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం ఇంకా టీమ్ వివరాలు వెల్లడించలేదు.సంజూకు దక్కని చోటుఇదిలా ఉంటే.. జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ల కోటాలో వన్డే వరల్డ్‌కప్- 2023లో రాణించిన కేఎల్ రాహుల్‌తో పాటు.. రిషభ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిజానికి వన్డేల్లో పంత్ కంటే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.అప్పుడు కూడా ఇదే తరహాలోఇప్పటి వరకు టీమిండియా తరఫున 31 వన్డేల్లో పంత్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు.. సంజూ 16 వన్డేల్లో 56.66 సగటుతో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 510 పరుగులు సాధించాడు. నిజానికి సంజూకు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో కూడా చోటు దక్కాల్సింది. కానీ నాడు అతడిని కాదని.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోయాడు. దీంతో సంజూకు అవకాశం ఇచ్చి ఉంటే.. ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య కోసం అతడిని బలిచేసి.. మరోసారి అన్యాయం చేశారంటూ బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి కూడా పంత్ కోసం సంజూను కావాలనే పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.పంత్‌ను చేర్చడం ద్వారానే అది సాధ్యంఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్.. లేదా సంజూ శాంసన్.. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇద్దరూ అచ్చమైన బ్యాటర్లే. అయితే, రిషభ్ పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపడానికి కారణం.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడమే.బ్యాటింగ్ ఆర్డర్లో మేనేజ్మెంట్ కోరుకుంటున్న వైవిధ్యం పంత్‌ను చేర్చడం ద్వారా సాధ్యమవుతుంది. ఏదేమైనా సంజూ శాంసన్ కూడా చివరి వరకు పోటీలో నిలిచాడని చెప్పవచ్చు.విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఉంటే..అయితే, ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపింది. ఈ దేశీ టోర్నీలో ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని దినేశ్ కార్తిక్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)తో అతడికి విభేదాలు తలెత్తిన కారణంగానే ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు. మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరానికి సంజూ రాలేదని కేసీఏ పెద్దలు వేటు వేయగా.. సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మాత్రం తన కుమారుడిపై కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించాడు. సంజూ మాదిరి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాని ఎంతో మంది ఆటగాళ్లకు కేరళ జట్టులో చోటు ఇచ్చారని పేర్కొన్నాడు.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
ఫామ్‌లో ఉన్నంత మాత్రాన కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు: డీకే
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్(Karun Nair) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. ఏడు ఇన్నింగ్స్‌లో అతడు నాటౌట్‌గా నిలవడం విశేషం.బ్యాటర్‌గా దుమ్ములేపుతూనే.. కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో విదర్భను విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు చేర్చాడు. దేశీ వన్డే టోర్నీలో విదర్భ ఇలా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.అతడిని ఎంపిక చేయాలిఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో.. కరుణ్ నాయర్‌ను ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ క్రమంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్ నాయర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నా.. అతడిని ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేయడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ కరుణ్ నాయర్ ఆడుతున్న తీరు అమోఘం. అతడు ఊహకు అందని రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు.ఫామ్‌లో ఉన్నంత మాత్రాన సెలక్ట్ చేయరుఅందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు అతడి గురించే చర్చిస్తున్నారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కరుణ్ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఎందుకంటే.. సెలక్టర్లు ఇప్పటికే టీమ్ గురించి తుది నిర్ణయానికి వచ్చి ఉంటారు.ఏదేమైనా కరుణ్ నాయర్ గొప్ప ఆటగాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలిగే ఇన్ ఫామ్ బ్యాటర్‌ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. అతడు గనుక తిరిగి జట్టులోకి వస్తే నాకూ సంతోషమే’’ అని డీకే పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా కరుణ్ నాయర్ ఎంపికయ్యే అవకాశం లేదని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో జైసూ ఆడటం ఖాయం‘‘ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు జైస్వాల్‌కు విశ్రాంతినిచ్చారు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన అనంతరం ఈ యువ ఆటగాడికి తగినంత రెస్ట్ అవసరం.ఈ విషయంలో సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వందకు వంద శాతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిస్తారు. వన్డేల్లో అరంగేట్రం కదా అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేయగలడు. ఇంగ్లండ్‌తో టీ20లలో ఆడనంత మాత్రాన అతడికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో, టీ20లలో అదరగొడుతున్న జైస్వాల్ ఇంత వరకు వన్డేల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
IPL 2025: కేఎల్ రాహుల్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే..!
భారత మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తాడని జోస్యం చెప్పాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నా, అక్షర్ పటేల్‌కే ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. క్రిక్‌బజ్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డీకే ఈ విషయాలను పంచుకున్నాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్‌ను టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించడంపై డీకే స్పందిస్తూ.. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం కూడా కనిపించడం లేదు. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా ఉండగా టీమిండియా బాగా రాణించింది. హార్దిక్, సూర్యకుమార్ ఆథ్వర్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లో (సౌతాఫ్రికా) గెలిచింది. అక్షర్ పటేల్ విషయానికొస్తే.. అతనికి ఇదో మంచి అవకాశం. మరి ముఖ్యంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా ఉండబోతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ అక్షర్‌కు బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్ కెప్టెన్‌గా కూడా అక్షర్‌కు అనుభవం ఉంది. అక్షర్‌కు నా శుభాకాంక్షలు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.డీకే ఏ ఆధారంగా అక్షర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అన్నాడో తెలీదు కానీ, అక్షర్‌కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. అక్షర్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో అక్షర్ ఓ మ్యాచ్‌లో డీసీ కెప్టెన్‌గా సేవలందించాడు. మెగా వేలానికి ముందు డీసీ యాజమాన్యం అక్షర్‌ను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది. 30 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అక్షర్.. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమై ఉన్నాడు. కాగా, అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని తేల్చి చెప్పిన దినేశ్ కార్తీక్ గతంలో ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.సాధారణ ఆటగాడిగా రాహుల్..?అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికైతే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2020 సీజన్ తర్వాత తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. 2020, 2021 సీజన్లలో పంజాబ్ కెప్టెన్‌గా.. 2022-24 వరకు లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాహుల్ డీసీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడో లేక మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
రాణించిన రబాడ.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ రెండో విజయం నమోదు చేసింది. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించాడు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేప్‌టౌన్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ 8, కొలిన్ ఇంగ్రామ్ 7, జార్జ్ లిండే 1, జూనియర్ ఏబీడి 14, అజ్మతుల్లా 2 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో గాలిమ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్, మఫాకా, ముజీబ్ ఉర్ రెహ్మన్, లుంగి ఎంగిడి తలో వికెట్ దక్కించుకున్నారు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డ్రి ప్రిటోరియస్ (26), జో రూట్ (26), వన్‌డౌన్ బ్యాటర్ సామ్ హెయిన్ (20), ముజీబ్ రెహ్మాన్ (34), మఫాకా (22 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయుడు దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. డీకే 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (1) కూడా నిరాశపరిచాడు. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రబాడ అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన రబాడకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. -
గిల్.. భారత్‌లో ఆడినట్లు అక్కడ ఆడితే కుదరదు: దినేష్ కార్తీక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన గిల్ రెండో టెస్టు నుంచి అందుబాటులో వచ్చాడు.ఇప్పటివరకు ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. వరుసగా 31, 28, 1 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో స్వల్ప మార్పులు చేయాలని చేయాలని కార్తీక్ సూచించాడు."శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపం ఉంది. అతడు బంతిని బలంగా కొట్టడానికి ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. మీరు వైట్‌బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడే సమయంలో ఇది సహజంగా జరుగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా అలానే ఆడేవాడు.కానీ ఇప్పుడు అతడు తన సమస్యకు పరిష్కరం కనుగొన్నాడు. శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు భారత కండీషన్స్‌కు ఎక్కువగా అలవాటు పడడంతోనే.. విదేశీ పిచ్‌లలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన వెంటనే మీ మనసు దానిని ఫుల్బాల్గా అంచనావేసి.. ఫ్రంట్ ఫుట్కు వెళ్లి ఆడమని చెబుతుంది.కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ టార్లకు వెళ్లే ఆటగాళ్లు కొత్త బంతిని ఎలా ఆడాలో ముందే ప్రాక్టీస్ చేస్తారు. కొత్త బాల్‌ను ఆడేందుకు రెండు రకాలుగా ప్రయత్నిస్తారు. ఒకటి షాప్ట్ హ్యాండ్స్‌తో ఆడుతారు లేదా శరీరానికి దగ్గరగా బంతిని ఆడటం లేదా వదిలేయడం చేస్తారు. శుబ్‌మన్ గిల్ భారత్‌లో ఆడినట్లే ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు.స్వదేశంలో పరిస్థితులకు ఆసీస్ కండీషన్స్‌కు చాలా తేడా ఉంది. బంతిని గట్టిగా హిట్ చేయడానకి వెళ్లి ఔట్ అవుతున్నాడు. గబ్బా వంటి స్టేడియాల్లో ఫ్రంట్ ఫుట్ ఆడటం కొంచెం కష్టం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మీ మనస్సును నియంత్రించుకుని అలాంటి బంతులను వదిలేస్తాని నిర్ణయించుకోవాలి.టెస్టుల్లో చాలా కాలం నుంచి నంబర్3లో ఆడుతున్నావు. అటువంటి అప్పుడు అంత సులువగా ఔట్ అవ్వడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే గిల్ ఒక్కడే కాదు, భారత బ్యాటింగ్ సమష్టిగానే విఫలమవుతోంది. ప్రతీ ఇన్నింగ్స్‌లో వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అన్పిస్తోందని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్
ఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి తమ పేస్ దళాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెగా వేలానికి ముందే యశ్ దయాళ్ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. వేలంలో భాగంగా టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకుంది. ఈ వెటరన్ పేసర్ కోసం ఏకంగా రూ. 10.75 కోట్లు ఖర్చు చేసింది.రిటెన్షన్స్ సమయంలో టీమిండియా ప్రస్తుత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వదిలేసిన తర్వాత.. ఆర్సీబీ ఈ మేర అతడి స్థానాన్ని సీనియర్‌తో భర్తీ చేసుకుంది. ఈ నేపథ్యంలో భువీ గురించి ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమైన దినేశ్ కార్తిక్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.అతడు బెస్ట్ టీ20 బౌలర్ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, మొ బొబాట్, ఓంకార్ సాల్వీలతో డీకే మాట్లాడుతూ.. ‘‘బుమ్రా తర్వాత.. ఇప్పటికీ తన ప్రభావం చూపగలుగుతున్న అత్యుత్తమ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. భువనేశ్వర్ కుమార్ పేరు చెబుతాను. అతడు బెస్ట్ టీ20 బౌలర్’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. కుర్ర పేసర్ రసీఖ్ సలాం గురించి ప్రస్తావనకు రాగా.. 24 ఏళ్ల ఈ ఆటగాడి నైపుణ్యాలు అద్భుతమని డీకే కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అభిమానులను ఆకర్షిస్తోంది.భీకర ఫామ్‌లో భువీభువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ స్వింగ్ సుల్తాన్.. ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి పదకొండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఇక భువీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు సగటు 12.90తో ఎకానమీ రేటు 5.64గా నమోదు చేయడం విశేషం. అంతేకాదు సారథిగానూ జట్టును విజయపథంలో నడిపి క్వార్టర్ ఫైనల్లో నిలిపి.. సెమీస్ రేసులోకి తెచ్చాడు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) జోష్ హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు) లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిఖ్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) దేవ్‌దత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో షెఫర్డ్ (రూ. 1.50 కోట్లు లుంగి ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) .చదవండి: కెప్టెన్ ఫామ్‌లో లేకుంటే కష్టమే.. రోహిత్ ఇకనైనా..: ఛతేశ్వర్ పుజారా -
అతడొక విధ్వంసక బ్యాటర్.. అందుకే కొనుక్కున్నాం: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కోసం ఈసారి భారీ మొత్తమే ఖర్చుపెట్టింది. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అనూహ్య రీతిలో అతడి కోసం రూ. 11.50 కోట్లు ధారపోసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సాల్ట్ కోసం.. తొలుత ముంబై ఇండియన్స్‌తో పోటీపడిన ఆర్సీబీ.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో తలపడింది.ధరను ఏకంగా రూ. 8 కోట్ల పెంచి కేకేఆర్‌కు సవాలు విసిరింది. అయినప్పటికీ కోల్‌కతా వెనుకంజ వేయలేదు. రూ. 10 కోట్ల వరకు వచ్చింది. అయితే, ఆ తార్వత ఆర్సీబీ ఏకంగా ధరను రూ. 11.50 కోట్లకు పెంచగా కేకేఆర్ తప్పుకొంది. దీంతో సాల్ట్ ఆర్సీబీ సొంతమయ్యాడు.అతడొక విధ్వంసర బ్యాటర్.. పవర్ ప్లేలో..అయితే, సాల్డ్ కోసం అంతమొత్తం వెచ్చించడం సరైందేనా అన్న చర్చల నడుమ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఫిల్ సాల్ట్.. అతడి గురించి ఏమని చెప్పాలి?!... అతడొక విధ్వంసర బ్యాటర్. పవర్ ప్లేలో ఏ బౌలర్ బౌలింగ్‌నైనా చితక్కొట్టగలడు.అలాంటి ఆటగాడు మా జట్టులో సానుకూలాంశం. ఆర్సీబీకి ఎలాంటి ప్లేయర్ కావాలో.. ఫిల్ అలాంటివాడే’’ అని డీకే సాల్ట్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఆర్సీబీ జితేశ్ శర్మ రూపంలో మరో వికెట్ కీపర్ కోసం రూ. 11 కోట్ల ఖర్చుపెట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సాల్ట్, జితేశ్లలో ఎవరు కీపింగ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టోర్నీ మొదలైన తర్వాతే మేము ఈ విషయంపై సరైన నిర్ణయానికి రాగలము. అత్యుత్తమ ఆటగాడినే మేము ఎంచుకుంటాము’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మూడు సెంచరీలుకాగా ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 38 టీ20లు ఆడిన ఫిల్ సాల్ట్ సగటున 36.86తో 1106 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 165.32. అతడి ఖాతాలో మూడు అంతర్జాతీయ టీ20 సెంచరీలతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో సాల్ట్ 268 మ్యాచ్‌లు పూర్తి చేసకుని 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 6517 రన్స్ సాధించాడు సాల్ట్. ఇందులో మూడు సెంచరీలు, 41 ఫిఫ్టీలు ఉన్నాయి. గతేడాది కేకేఆర్‌కు ఆడిన సాల్ట్ 12 మ్యాచ్‌లలో కలిపి.. నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 435 పరుగులు చేశాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరురిటెన్షన్స్: విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) ,రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) ,యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) వేలంలో కొన్నప్లేయర్లుహాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) చదవండి: Mohammed Siraj: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే! -
Ind vs NZ 3rd Test: బుమ్రాను జట్టు నుంచి తీసేయండి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇక ముందు మరింత జాగ్రత్తగా అడుగువేయాల్సి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు గెలవడం సహా ఆస్ట్రేలియాలో మెరుగ్గా రాణిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కివీస్ జట్టుతో ఆఖరిదైన మూడో టెస్టులో తుదిజట్టు ఎంపికపై డీకే తన అభిప్రాయం పంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్ నుంచి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విరామం ఇవ్వాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్కుఈ క్రమంలో నవంబరు 1 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టులోనైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రోహిత్ సేన ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లనుంది.ఈ నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికీ నా మెదడు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఇక నామమాత్రపు మూడో టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్ ఉండబోతుందో ఇప్పుడే చెప్పలేం.బుమ్రా స్థానంలో సిరాజ్ రావాలిఅయితే, నా దృష్టిలో మాత్రం బుమ్రాను తప్పించి మహ్మద్ సిరాజ్‌ను తీసుకురావాలి. ఎందుకంటే.. బుమ్రాకు ఇప్పుడు విశ్రాంతి అత్యవసరం. మిగతవాళ్లందరినీ కొనసాగించడమే మంచిది. గత మ్యాచ్ ఆడిన బ్యాటర్లు లేదా బౌలర్లలో ఒక్కరిని కూడా తప్పించడానికి సరైన కారణం కనిపించడం లేదు. బుమ్రాకు మాత్రం రెస్ట్ కావాలి’’ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఈ పేస్‌గుర్రానికి బ్రేక్ ఇస్తే మంచిదని డీకే ఈ సందర్భంగా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తుందన్న అంచనాల నడుమ టీమిండియా ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లలో ఆ ఒక్కరు ఎవరన్నది శుక్రవారం తేలుతుంది. కాగా కివీస్‌తో బెంగళూరు టెస్టులో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. పుణె టెస్టులో మాత్రం ఖాతా తెరవలేదు.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్‌కు 18 కోట్లు..! -
దినేశ్ కార్తిక్- దీపికా ట్విన్స్ మూడో బర్త్‌డే.. కనిపించని డీకే (ఫొటోలు)
-
రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా సథరన్ సూపర్ స్టార్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ధవన్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ మెరుపు అర్ద సెంచరీతో (28 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్టిన్ గప్తిల్ 22, హమిల్టన్ మసకద్జ 20, దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ (1), పార్థివ్ పటేల్ (4),పవన్ నేగి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ప్లంకెట్, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ గ్రేట్స్.. శిఖర్ ధవన్ మినహా ఎవరూ రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ ఈ మ్యాచ్‌లో 15 పరుగులకే ఔటయ్యాడు. లెండిల్ సిమన్స్ 7, మొహమ్మద్ కైఫ్ 5, అస్గర్ అఫ్ఘాన్ 3, మనన్ శర్మ 10 పరుగులు చేశారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2, చతురంగ డిసిల్వ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా -
ముగిసిన లెజెండ్స్ లీగ్ వేలం.. భారీ ధర అతడికే
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)-2024 సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ క్రికెట్ టోర్నీ.. ఇప్పుడు మూడో సీజన్‌కు సిద్దమవుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోనునున్నాయి. తొలి సీజన్(2022)లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా.. రెండువ సీజన్లో మణిపాల్ టైగార్స్ ఛాంపియన్‌గా అవతరించింది.ఇక ఇది ఇలా ఉండగా.. ఎల్ఎల్సీ మూడో సీజన్‌కు సంబంధించిన వేలం ముంబై వేదికగా గురువారం(ఆగస్టు 29)న జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఎల్ఎల్సీ సీజన్లో భాగం కావడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. వేలానికి ముందే శిఖర్ ధావన్‌ను గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకోగా.. కార్తీక్‌తో సదరన్ సూపర్ స్టార్స్ ఒప్పందం కుదర్చుకుంది.అయితే ధావన్, కార్తీక్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఎంత మొత్తం వెచ్చించియో వెల్లడించలేదు. వీరిద్దరూ మినహా మిగితా క్రికెటర్లందరూ వేలంలో పాల్గోనున్నారు. మొత్తం ఈ వేలంలో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గోనగా.. 97 మంది మాత్రమే అమ్ముడు పోయారు. ఈ 97 మంది క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఆరు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 39.63 కోట్లు వెచ్చించాయి. ఈ వేలంలో శ్రీలంకకు చెందిన ఇసురు ఉదానా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. అర్బనైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది.ఉదానా తర్వాత భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ నిలిచాడు. అతడిని కూడా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా బ్రెట్‌లీ, దిల్షాన్, షాన్ మార్ష్, ఫించ్, ఆమ్లా వంటి దిగ్గజ క్రికెటర్లు అమ్ముడుపోలేదు.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..మణిపాల్ టైగర్స్హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, తిసర పెరీరా, షెల్డన్ కాట్రెల్, డాన్ క్రిస్టియన్, ఏంజెలో పెరీరా, మనోజ్ తివారీ, అసేలా గుణరత్నే, సోలమన్ మిరే, అనురీత్ సింగ్, అబు నెచిమ్, అమిత్ వర్మ, ఇమ్రాన్ ఖాన్, రాహుల్ శుక్లా, అమిటోజ్ సింగ్, ప్రవీణ్ గుప్తా, సౌరభ్ గుప్తా .ఇండియా క్యాపిటల్స్ యాష్లే నర్స్, బెన్ డంక్, డ్వేన్ స్మిత్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, నమన్ ఓజా, ధవల్ కులకర్ణి, క్రిస్ మ్ఫోఫు, ఫైజ్ ఫజల్, ఇక్బాల్ అబ్దుల్లా, కిర్క్ ఎడ్వర్డ్స్, రాహుల్ శర్మ, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వరరావు, భరత్ చిప్లి, పర్వీందర్ అవానా, పవన్ సుయాల్, మురళీ సుయాల్ విజయ్, ఇయాన్ బెల్.గుజరాత్ జెయింట్స్క్రిస్ గేల్, లియామ్ ప్లంకెట్, మోర్నే వాన్ వైక్, లెండిల్ సిమన్స్, అసోహర్ అఫోహాన్, జెరోమ్ టేలర్, పరాస్ ఖాడా, సీక్కుగే ప్రసన్న, కమౌ లెవర్రాక్, సైబ్రాండ్ ఎనోయెల్బ్రెచ్ట్, షానన్ గాబ్రియేల్, సమర్ క్వాద్రీ, మహమ్మద్ కైఫ్, శ్రీసన్హవాన్, శ్రీసన్హవాన్.కోణార్క్ సూర్యస్ ఒడిశాఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, కెవిన్ ఓ బ్రియాన్, రాస్ టేలర్, వినయ్ కుమార్, రిచర్డ్ లెవీ, దిల్షన్ మునవీర, షాబాజ్ నదీమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, బెన్ లాఫ్లిన్, రాజేష్ బిష్ణోయ్, ప్రవీణ్ తాంబే, దివేష్ పఠానియా, కేపీ అప్పన్న, అంబటి రాయుడు, అంబటి రాయుడు.సదరన్ సూపర్ స్టార్స్దినేష్ కార్తీక్, ఎల్టన్ చిగుంబుర, హామిల్టన్ మసకద్జా, పవన్ నేగి, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, శ్రీవత్స్ గోస్వామి, హమీద్ హసన్, నాథన్ కౌల్టర్ నైల్, చిరాగ్ గాంధీ, సుబోత్ భాటి, రాబిన్ బిస్ట్, జెసల్ కరీ, చతురంగ డి సిల్వా, మోను కుమార్అర్బన్రైజర్స్ హైదరాబాద్సురేష్ రైనా (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, టినో బెస్ట్, స్టువర్ట్ బిన్నీ, క్రిస్టోఫర్ ఎంఫోఫు, అస్గర్ ఆఫ్ఘన్, చమర కపుగెదెరా, పీటర్ ట్రెగో, రిక్కీ క్లార్క్, పవన్ సుయాల్, ప్రజ్ఞాన్ ఓజా, శివ కాంత్ శుక్లా, సుదీప్ త్యాగి, తిరుమలశెట్టి సుమన్, యోగేష్ నగర్, షాదాబ్ జకాతి, జెరోమ్ టేలర్, గురుకీరత్ మాన్, అమిత్ పౌనికర్, దేవేంద్ర బిషూ. -
టీమిండియా స్టార్ రీ ఎంట్రీ.. ఆ జట్టులో చేరిక
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తాను భాగం కానున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత కూడా ఆటగాడిగా కొనసాగే అవకాశం టీ20 లీగ్‌ల ద్వారా దక్కిందని.. మరోసారి మైదానంలో దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే వెల్లడించాడు.ఇటీవలే రిటైర్మెంట్కాగా ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ చెన్నై క్రికెటర్.. సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డీకే ఈ ఏడాది జూన్ 1న ప్రకటన విడుదల చేశాడు. అనంతరం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో జట్టు కట్టిన దినేశ్ కార్తిక్.. ఈ లీగ్‌లో ఆడనున్న భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.ఆ జట్టులో చేరిన డీకేఇక తాజాగా లెజెండ్స్ లీగ్‌లోనూ పాల్గొనన్నుట్లు తెలిపాడు. ఈ టీ20 లీగ్‌లో సదరన్ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు మంగళవారం వెల్లడించాడు. అభిమానుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నానని.. తనలో ఆడగల సత్తా ఉన్నంత కాలం క్రికెటర్‌గా కొనసాగుతానని డీకే పేర్కొన్నాడు. మైదానంలో దిగేందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.కాగా 2004 నుంచి 2022 వరకు టీమిండియాకు ఆడిన దినేశ్ కార్తిక్.. 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లలో భాగమయ్యాడు. టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 రన్స్ స్కోరు చేశాడు.ఇక శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తాను లెజెండ్స్ లీగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గబ్బర్ సోమవారం ప్రకటించాడు.తాజాగా డీకే సైతం ఇదే బాటలో నడవడం విశేషం. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, క్రిస్ గేల్,ఆరోన్ ఫించ్ తదితర మాజీ క్రికెటర్లు ఇప్పటికే భాగమయ్యారు. కాగా సెప్టెంబరు 29న లెజెండ్స్ లీగ్ వేలం జరుగనుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
కుల్దీప్ కాదు!.. టీమిండియాలో అశ్విన్ వారసుడు ఇతడే: డీకే
ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన ఈ చెన్నై స్టార్ 516 వికెట్లు తన ఖతాలో వేసుకున్నాడు. తద్వారా అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా అశూ కొనసాగుతున్నాడు.ఇక అశ్విన్ తదుపరి సొంతగడ్డ వేదికగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్‌కు సరైన వారసుడు ఇతడేనంటూ టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మరో చెన్నై స్టార్కే ఉందని అభిప్రాయపడ్డాడు.కుల్దీప్ కాదు!ఇప్పటికే జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్ పేరును చెప్పాడు డీకే. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కొత్త తరం ఆఫ్ స్పిన్నర్ కోసం టీమిండియా వెదుకుతోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఏ సిరీస్ సందర్భంగా మూడు మ్యాచ్‌లలో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లను బరిలోకి దించడమే ఇందుకు నిదర్శనం.పుల్కిత్ నారంగ్, వాషింగ్టన్ సుందర్, సారాంశ్ జైన్లను ఈ సిరీస్ సందర్భంగా పరీక్షించింది. వీరిలో రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల నైపుణ్యం వాషింగ్టన్ సుందర్‌కే ఉంది. అశూ వారసుల పోటీలో అతడే ముందుంటానడంలో సందేహం లేదు. తనకు లభించిన కొద్దిపాటి అవకాశాలను కూడా వాషీ సద్వినియోగం చేసుకున్నాడు.అతడే సరైన వాడు.. ఎందుకంటే?అందుకే.. అశూ స్థానంలో అతడే సరైన వాడని చెప్పగలను’’ అంటూ దినేశ్ కార్తిక్ వాషీ పేరు చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే విధంగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 24 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 22 వన్డేలు, 49 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 6, 23, 44 వికెట్లు తీశాడు. చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు వాషీ. -
ధోనీ విషయంలో తప్పు చేశాను, క్షమించండి: దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ గత వారం తన ఆల్‌టైమ్, ఆల్ ఫార్మాట్ ఫేవరెట్ టీమిండియాను ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా డీకే ఈ జాబితాలో ఎంఎస్ ధోనికి చోటివ్వలేదు. ఈ కారణంగా అతను ధోని అభిమానుల నుంచి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో డీకే తాజా వివరణ ఇచ్చాడు.ధోని విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పొరపాటున ధోని పేరును లిస్ట్‌లో చేర్చలేదని వివరణ ఇచ్చాడు. స్వతహాగా వికెట్‌కీపర్‌ను అయి ఉండి, ధోని పేరును చేర్చకపోవడం నిజంగా పెద్ద పొరపాటని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ జట్టులో ఉండటంతో అందరూ అతనే వికెట్‌కీపర్ అనుకున్నారని పేర్కొన్నాడు. ఈ అంశానికి సంబంధించిన ఎపిసోడ్ బయటికి వచ్చే వరకు ధోనిని ఎంపిక చేయలేదని తనకు కూడా తెలీదని వివరణ ఇచ్చాడు. జట్టు ఎంపిక సమయంలో తన మదిలో చాలా విషయాలు ఉన్నాయని, అందుకే పొరపాటు జరిగిందని అన్నాడు.తన జట్టులో ధోని తప్పనిసరిగా ఉంటాడని తెలిపాడు. ధోని ఏడో స్థానంలో వికెట్‌కీపర్‌గా మాత్రమే కాకుండా జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తాడని అన్నాడు. ధోని ఈ జట్టులోనే కాదు, తాను ఎంపిక చేసే ఏ జట్టులోనైనా ఉంటాడని తెలిపాడు. కాగా, ధోని నేతృత్వంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన విషయం తెలిసిందే. -
ఓపెనర్లుగా వీరూ, రోహిత్.. మిడిలార్డర్లో సచిన్, విరాట్: డీకే
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కామెంటేటర్‌గా మరింత బిజీ అయ్యాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శనను తనదైన శైలిలో విశ్లేషిస్తూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించిన డీకే తాజాగా.. తన ఆల్‌టైమ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.ఓపెనర్లుగా వీరూ, రోహిత్మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు తన జట్టులో దినేశ్ కార్తిక్ చోటిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంగా మారి.. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు డీకే.మిడిల్ ఆర్డర్లో సచిన్, విరాట్పరిమిత ఓవర్ల క్రికెట్లో 100కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన వీరూతో పాటు.. ఇటీవలి టీ20 ప్రపంచకప్-2024లో 257 పరుగులతో రెండో హయ్యస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌కు ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశమిస్తానన్నాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఎంచుకున్న డీకే.. వంద సెంచరీల దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.ఇక ఆ తర్వాతి స్థానంలో రన్‌మెషీన్, 80 శతకాల వీరుడు విరాట్ కోహ్లికి చోటిచ్చిన దినేశ్ కార్తిక్.. ఆల్‌రౌండర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్స్ యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, లెజెండ్ అనిల్ కుంబ్లేలకు స్థానం కల్పించాడు డీకే. పన్నెండో ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను ఎంచుకున్నాడు ఈ తమిళనాడు మాజీ బ్యాటర్. క్రిక్‌బజ్ షోలో ఈ మేరకువ్యాఖ్యలు చేశాడు.వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో డీకే ఎంచుకున్న భారత అత్యుత్తమ జట్టువీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖన్.12th మ్యాన్: హర్భజన్ సింగ్. -
ఆర్సీబీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..? కార్తీక్ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ వీడనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై ఇండియన్స్ కట్టబెట్టింది. దీంతో అప్పటినుంచి తన జట్టు యాజమాన్యంపై హిట్‌మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముంబై జట్టుతో ఇదే నా చివరి సీజన్ అని హిట్‌మ్యాన్ అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ క్రమంలోనే ముంబైని వీడి ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలంలో రోహిత్ భాగం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్పై వేటు వేసి రోహిత్ శర్మ తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌ను అభిమానులు ప్రశ్నించారు. డీకే ఇటీవలే క్రిక్‌బజ్ చిట్‌చాట్‌లో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడా అని ఓ అభిమాని డీకేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా కార్తీక్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ సైలెంట్‌గా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What changes should #India make ahead of #ChampionsTrophy? 🤔Why did #Rohit & Co. struggle against spinners❓#LaapataaLadies to #Maharaja: A special binge-watch list for cricketers! 🎦@DineshKarthik talks about it all, only on #heyCB, here ⬇️ pic.twitter.com/e6Q2ipzZei— Cricbuzz (@cricbuzz) August 11, 2024 -
'అదొక విచిత్రమైన పిచ్.. అక్కడ ఆడటం కోహ్లి, రోహిత్కైనా కష్టమే'
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు.ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్‌కే కోహ్లి ఔట్ కావడం గమనార్హం. కోహ్లి ఒక్కడే కాకుండా మిగితా బ్యాటర్లు కూడా లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.తమ సొంతపిచ్లపై తప్ప స్వింగ్, స్పిన్ కండీషన్స్‌లో ఆడలేరని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. కొలంబోలోని వికెట్ కండీషన్స్ చూసి భారత ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారని కార్తీక్ తెలిపాడు."ఈ సిరీస్‌లో టీమిండియా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ బంతి కొంచెం పాతబడ్డాక బాగా టర్న్ అవుతోంది. ముఖ్యంగా 8-30 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కొవడం ఆటగాళ్లకు చాలా కష్టమైన పని. అది విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అయినా కావచ్చు. అందులో కొలంబో పిచ్ ఇంకా కఠినమైన పిచ్. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు ఆడటం చాలా కష్టం. ఆటలో గెలుపు ఓటుములు సహజం. ఈ ఒక్కసిరీస్లో ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు.అన్ని పిచ్‌లు ఈ విధంగా ఉండవు. నేను ఏదో విరాట్ కోహ్లిని సపోర్ట్ చేసేందుకు ఈ వాఖ్యలు చేయడం లేదు. కొలంబో వికెట్ పరిస్థితులను మాత్రమే తెలియజేశానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న దినేష్ కార్తీక్.. తొలి భారత క్రికెటర్‌గా
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్లో పార్ల్ రాయల్స్ తరపున కార్తీక్ ఆడనున్నాడు. వచ్చే ఏడాది సీజన్‌కు గాను విదేశీ ప్లేయర్ కోటాలో డీకేతో పార్ల్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది.తద్వారా ఎస్ఎ టీ20లో ఆడనునున్న తొలి భారత ఆటగాడిగా కార్తీక్ నిలిచాడు. కాగా ఐపీఎల్-2024 అనంతరం అన్నిరకాల క్రికెట్ ఫార్మాట్లకు కార్తీక్ విడ్కోలు పలికాడు. కాగా భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే కచ్చితంగా అన్ని ఫార్మాట్లకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఈ క్రమంలోనే కార్తీక్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడే ఛాన్స్ లభించింది. ఇక ఇటీవలే ఎస్ఎ టీ20 టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్తీక్ ఎంపికయ్యాడు. కాగా టీ20ల్లో కార్తీక్‌కు అపారమైన అనుభవం ఉంది. తన కెరీర్లో 401 టీ20లు ఆడిన డీకే.. 136.96 స్ట్రైక్-రేట్‌తో 7407 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఏకంగా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదే విధంగా భారత్ తరుపన దినేష్ 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కాగా డీకేతో పాటు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌ను కూడా పార్ల్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది.పార్ల్ రాయల్స్ జట్టుడేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, దయాన్ గలీమ్చదవండి: 'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు' -
సౌతాఫ్రికా టీ20 లీగ్ అంబాసిడర్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచపు అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ బెట్‌వే ఎస్ఏ20కు అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. లీగ్ క్రికెట్లో డీకేకు ఉన్న అనుభవం, భారత్‌లో కార్తీక్‌కు ఉన్న క్రేజ్ తమ లీగ్ వృద్ధికి తోడ్పడుతుందని స్మిత్ అన్నాడు. బెట్‌వే ఎస్ఏ20 లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై డీకే స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టనుండటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. గ్రేమ్ స్మిత్ బృందంతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సహచర అంబాసిడర్ ఏడీ డివిలియర్స్‌తో కలిసి పని చేస్తాడు.ఎస్ఏ20 లీగ్ గత రెండు సీజన్లుగా విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లోనూ ఐపీఎల్ తరహాలో చాలామంది విదేశీ స్టార్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చేతుల్లో నడుస్తుంది. ఈ జట్టుకు సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీలు ఎస్ఏ20 లీగ్‌లో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఓనర్ల యాజమాన్యంలోనే నడుస్తున్నాయి.కార్తీక్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభ ఎడిషన్‌ను (2008) నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన డీకే.. ఐపీఎల్ 2024 అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. డీకే రిటైర్మెంట్ ముందు వరకు ఆర్సీబీకి ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం ఆర్సీబీ డీకేను తమ మెంటార్‌గా నియమించుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో కార్తీక్ 135.66 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో కార్తీక్ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు. -
'అతడొక అద్భుతం.. కోహునూర్ డైమండ్ కంటే విలువ ఎక్కువ'
టీ20 ప్రపంచకప్-2024 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరపడింది. అయితే భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ అసాంతం బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.కీలకమైన ఫైనల్లో సైతం బుమ్రా సత్తాచటాడు. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న ప్రతీసారి బుమ్రా బంతితో మ్యాజిక్ చేసేవాడు. తన బౌలింగ్‌తో వరల్డ్‌క్లాస్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 4.17 ఏకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. వరల్డ్ క్రికెట్లో బుమ్రాని మించిన బౌలర్ మరొకడు లేడని కార్తీక్ కొనియాడాడు."బుమ్రా ఒక వరల్డ్‌క్లాస్ బౌలర్. జస్ప్రీత్ కోహినూర్ వజ్రం కంటే విలువైనవాడు. కామెంటరీలో కూడా ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. వరల్డ్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రాని మించిన వాడు మరొకడు లేడు. ఒత్తడిలో అద్బుతంగా బౌలింగ్ చేయడమే బుమ్రా స్పెషల్. అతడు లాంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఎటువంటి పరిస్థితులైనా బుమ్రా రాణించగలడు. ఇది అందరూ బౌలర్లు చేయలేరు. నిజంగా బుమ్రా చాలా బ్రిలియంట్ అంటూ" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
కోచ్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే.. తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. "సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తీక్‌కు స్వాగతం"అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది.39 ఏళ్ల డీకే.. ఈ ఏడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010, 2014) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన కార్తీక్.. గత మూడు సీజన్లలో ఆర్సీబీకి (2024, 2023, 2022) ప్రాతినిథ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తీక్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021) ఫ్రాంచైజీలకు ఆడాడు.ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో (ఏడుగురు) కార్తీక్ ఒకడు. ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సాహా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇనాగురల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్ ఆడారు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్ కేవలం రెండే రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తీక్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. డీకే.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని (264) పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ ఖాతాలో 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి.Dinesh Karthik talking about RCB and he continues to be with this family. ❤️- RCB 🤝 DK...!!!! pic.twitter.com/TiHTs3yjaA— Tanuj Singh (@ImTanujSingh) July 1, 2024కార్తీక్ కెరీర్‌ను 2022 ఐపీఎల్ ఎడిషన్ మలుపు తప్పింది. ఆ సీజన్లో పేట్రేగిపోయిన కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ ప్రదర్శన కారణంగా అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. 2024 సీజన్లోనూ కార్తీక్ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అతను 187.35 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. -
అలా మొదలై.. 'డి' ఫర్ దినేశ్ వరకూ..
‘పడిపోవడంలో తప్పు లేదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ మాట అతనికి సరిగ్గా సరిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం తొలిసారి భారత జట్టు తరఫున అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈ ఇరవై ఏళ్ల అతని ప్రయాణం అందరికంటే ఎంతో భిన్నంగా సాగింది. ఆటలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా అనివార్య కారణాలతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయినా, ఏనాడూ ఆశ కోల్పోలేదు. ఎప్పుడూ సాధన మానలేదు. ఇక ముగించాలని భావించలేదు.స్థానం కోల్పోయిన ప్రతిసారి పట్టుదలగా పోరాడి పునరాగమనం చేశాడు. ఎప్పుడు వచ్చినా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చాడు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. మరొకరైతే అలాంటి స్థితిలో అన్నింటినీ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారేమో! కానీ అతను ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడా తన కెరీర్‌పై ఆ ప్రభావం లేకుండా స్థితప్రజ్ఞతో ముందుకు సాగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆగిపోయినా ఐపీఎల్లో సత్తా చాటి తన విలువేంటో చూపించాడు. ఆడే అవకాశం లేని సమయంలో వ్యాఖ్యాతగా తన మాట పదునును ప్రదర్శించాడు.39 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, మైదానంలో చురుగ్గా ఆడుతూనే ఇటీవలే ఐపీఎల్‌కు ముగింపు పలికిన ఆ క్రికెటరే దినేశ్ కార్తీక్. గత ఇరవై ఏళ్లలో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన ఇతర ఆటగాళ్లందరితో పోలిస్తే కార్తీక్ ప్రస్థానం వైవిధ్యభరితం, ఆసక్తికరం. దిగ్గజ ఆటగాళ్ల మధ్య కూడా తన ప్రత్యేకతను నిలుపుకోవడంలో అతను సఫలమయ్యాడు.భారత క్రికెట్లో వికెట్ కీపింగ్‌కు సంబంధించి అన్ని రుతువులతో పాటు ‘మహేంద్ర సింగ్ ధోని కాలం’ కూడా ఒకటి నడిచింది. వికెట్ కీపర్లను ధోనికి ముందు, ధోని తర్వాతగా విభజించుకోవచ్చు. ‘ధోని కాలం’లో ఎంతో మంది యువ వికెట్ కీపర్లు తెర వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎంతో ప్రతిభ ఉన్నా, దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతూ వచ్చినా ధోని హవా, అతని స్థాయి ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి.అలాంటి బాధితుల జాబితాలో అగ్రస్థానం దినేశ్ కార్తీక్‌దే. 2008–2016 మధ్య ఐదు సీజన్ల పాటు అతను దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. కానీ ఈ ప్రదర్శన కూడా అతడికి టీమిండియాలో రెగ్యులర్‌గా చోటు ఇవ్వలేకపోయింది. నిజానికి ధోనికి ఏడాది ముందే భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన కార్తీక్...ధోని అరంగేట్రానికి మూడు నెలల ముందే వన్డేల్లోకి అడుగు పెట్టాడు.కానీ ఒక్కసారి ధోని పాతుకుపోయిన తర్వాత కార్తీక్‌కు అవకాశాలు రావడం గగనంగా మారిపోయింది. కానీ అతను ఎప్పుడూ నిరాశ పడలేదు. తన ఆటనే నమ్ముకుంటూ ముందుకు సాగాడు. కీపర్‌గా స్థానం లభించే అవకాశం లేదని తెలిసిన క్షణాన తన బ్యాటింగ్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. తన ప్రదర్శనలతో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తనకు చోటు కల్పించే పరిస్థితిని సృష్టించుకోగలిగాడు.అలా మొదలై...సెప్టెంబర్ 5, 2004... అంతర్జాతీయ క్రికెట్లో దినేశ్ కార్తీక్ తొలి మ్యాచ్. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ పోరులో అద్భుత వికెట్ కీపింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. భూమికి దాదాపు సమాంతరంగా గాల్లో పైకెగిరి మైకేల్ వాన్‌ను అతను స్టంపౌట్ చేసిన తీరు ఈ కొత్త ఆటగాడి గురించి అందరూ చర్చించుకునేలా చేసింది. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం.2007లో ధోని సారథ్యంలో భారత జట్టు సాధించిన టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఈ మెగా టోర్నీకి దాదాపు పది నెలల ముందు భారత జట్టు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇందులో కూడా ధోని ఉన్నా, బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించింది. దక్షిణాఫ్రికాపై మన టీమ్ నెగ్గిన ఈ పోరులో కార్తీక్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కడం విశేషం. చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయంలో కూడా కార్తీక్ తన వంతు పాత్ర పోషించాడు.అలా మూడు ఫార్మాట్లలో కూడా అతను భారత జట్టులో భాగంగా మారాడు. టెస్టుల్లో కార్తీక్ హైలైట్ ప్రదర్శన 2007లోనే వచ్చింది. స్వింగ్‌కు విపరీతంగా అనుకూలిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్లకే కొరుకుడు పడని ఇంగ్లండ్ గడ్డపై అతను సత్తా చాటాడు. కొత్త బంతిని ఎదుర్కొంటూ అక్కడి పరిస్థితుల్లో ఓపెనర్‌గా రాణించడం అంత సులువు కాదు. కానీ తాను ఎప్పుడూ ఆడని ఓపెనింగ్ స్థానంలో జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు. నాటింగ్‌హామ్‌లో అతను చేసిన 77 పరుగులు, ఆ తర్వాత ఓవల్‌లో సాధించిన 91 పరుగులు భారత జట్టు 1986 తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.జట్టులోకి వస్తూ పోతూ...ఇంగ్లండ్‌లో రాణించిన తర్వాత కూడా కార్తీక్ కెరీర్ వేగంగా ఊపందుకోలేదు. తర్వాతి మూడేళ్లలో అతను 7 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కీపర్ స్థానానికి అసలు అవకాశమే లేకపోగా, రెగ్యులర్ బ్యాటర్ స్థానం కోసం తన స్థాయికి మించిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీ పడాల్సి రావడంతో తగినన్ని అవకాశాలే రాలేదు. వన్డేల్లోనైతే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం వస్తే అదే గొప్ప అనిపించింది. 2010లో వన్డే జట్టులోనూ స్థానం పోయింది. కానీ కార్తీక్ బాధపడలేదు.పునరాగమనం చేయాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసని నమ్మాడు. అందుకే మూడేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో చెలరేగాడు. ఫలితంగా 2013లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో మళ్లీ స్థానం లభించింది. ధోని ఉన్నా సరే, బ్యాటర్‌గా చోటు దక్కించుకొని విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడయ్యాడు. మరో ఏడాది తర్వాత టీమ్‌లో మళ్లీ చోటు పోయింది. ఇప్పుడూ అదే పని. దేశవాళీలో బాగా ఆడటంతో మూడేళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు.ఆ తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో తర్వాతి రెండేళ్లు నిలకడగా రాణించిన అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ చోటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా దురదృష్టవశాత్తూ కార్తీక్ పేరును పరిశీలించకుండా సెలక్టర్లు సాహాను ప్రధాన కీపర్‌గా తీసుకున్నారు. అయినా అతను కుంగిపోలేదు. ఏకంగా ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2018లో మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగగలిగాడంటే అతని పట్టుదల ఎలాంటితో అర్థమవుతుంది.2021 ముస్తక్ అలీ ట్రోఫీతో...మరచిపోలేని ప్రదర్శనతో...అంతర్జాతీయ టి20ల్లోనూ కార్తీక్ ప్రస్థానం పడుతూ లేస్తూనే సాగింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడే అయినా ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్నింటికీ ఒకటే సమాధానం...ధోని ఉండగా చోటెక్కడుంది? 2010లో భారత్ తరఫున టి20 ఆడిన మరో ఏడేళ్లకు 2017లో అతను తన తర్వాతి మ్యాచ్ ఆడాడంటే అతని కమ్‌బ్యాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే 2018లో నిదాహస్ ట్రోఫీలో కార్తీక్ ప్రదర్శన అతనికి కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది.సరిగ్గా చెప్పాలంటే 14 ఏళ్ల కెరీర్ తర్వాత ఇది కార్తీక్ మ్యాచ్ అనే గుర్తింపును తెచ్చి పెట్టింది. శ్రీలంకతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను జట్టును గెలిపించాడు. ఆఖరి బంతికి అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడో కెరీర్ ముగిసింది అనుకున్న దశలో 2022 టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకొని 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడటం మరో విశేషం. మరో వైపు ఐపీఎల్లో కూడా ఎన్నో మంచి ప్రదర్శనలు కార్తీక్‌కు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఐపీఎల్లో 6 టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ మొదలైన 2008నుంచి 2024 వరకు కార్తీక్ 257 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో తన లీగ్ కెరీర్ ముగించాడు. ఈ టోర్నీలో 4842 పరుగులు చేసిన అతను అత్యధిక పరుగులు చేసినవారిలో పదో స్థానంలో నిలిచాడు.ఫ్యామిలీతో...ఆటుపోట్లు ఎదురైనా...కార్తీక్ స్వస్థలం చెన్నై. మాతృభాష తెలుగు. తండ్రి ఉద్యోగరీత్యా బాల్యం కువైట్‌లో గడిపినా... తర్వాత మద్రాసులోనే స్థిరపడ్డాడు. తండ్రి నేర్పించిన ఆటతో దిగువ స్థాయి క్రికెట్లో మంచి ప్రదర్శనలు ఇస్తూ సీనియర్ జట్టు వరకు ఎదిగాడు. అయితే ఆటగాడిగా భారత జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కార్తీక్ వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 2007లో అతను తన మిత్రురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు.ఐదేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తనతో వివాహ బంధంలో ఉండగానే భారత జట్టు, తమిళనాడు జట్లలో తన సహచరుడైన మురళీ విజయ్ను ప్రేమించడం, ఆపై తనకు దూరం కావడం అతడిని తీవ్రంగా బాధించాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పరిచయం అతని జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. 2015లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల వయసు ఉన్న కవల అబ్బాయిలు ఉన్నారు. –మొహమ్మద్ అబ్దుల్ హాది -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.తన 39వ పుట్టినరోజున దినేశ్ కార్తిక్ ఈ మేరకు ఇన్‌స్టా ఉద్వేగపూరిత పోస్ట్‌తో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా. దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్ కార్తిక్ సుదీర్ఘ నోట్ రాశాడు.2004లో అరంగేట్రంతమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే! -
బ్యాట్ వదిలి బల్లెం పట్టిన డీకే
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్ను అందుకున్నాడు.క్రికెట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. Neeraj Chopra trained Dinesh Karthik to be his partner at 2024 Olympics.#Neerajchopra #Dineshkarthik pic.twitter.com/zOLswEDjW8— scOut Op (@ScOutoppp69) May 29, 2024డీకే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్ ఛాన్స్ అని నీరజ్‌ను అడిగి మరీ జావెలిన్‌ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్ అథ్లెట్‌లా రన్ అప్ తీసుకుని జావెలిన్‌ను సంధించాడు. మండే ఎండలో డీకే చేస్తున్న ప్రయత్నానికి ముగ్దుడైన నీరజ్.. నువ్వు చేయగలవు దినేష్ భాయ్ అంటూ ప్రోత్సహించాడు. నీరజ్ ప్రోత్సాహంతో జావెలిన్‌ను విసిరిన డీకే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి సక్సెస్ సాధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డీకేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ప్రయత్నం అమోఘమని కొనియాడుతున్నారు. తెలీని క్రీడలోనూ సక్సెస్ సాధించావని కితాబునిస్తున్నారు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ జావెలిన్ త్రోయర్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరేమో నీరజ్‌తో పాటు ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోమని సూచిస్తున్నారు. 38 ఏళ్ల డీకే 2004 నుంచి 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. డీకే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి తాజాగా ముగిసిన 2024 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.నీరజ్ చోప్రా విషయానికొస్తే.. 26 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ 2020 టోక్యో ఓలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జులైలో జరిగే సమ్మర్ ఓలింపిక్స్లో నీరజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
టీ20 వరల్డ్‌కప్-2024కు కామెంటేటర్లు వీరే.. డీకేకు చోటు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను శుక్రవారం ప్రకటించింది. 41 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి , లెజెండరీ సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్, ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్, వసీం అక్రమ్ వంటి వారు ఈ ప్యానల్లో ఉన్నారు.కాగా దినేష్ కార్తీక్ ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో వన్డే వరల్డ్‌కప్-2023, యాషెస్ సిరీస్‌లో వ్యాఖ్యతగా వ్యవహరించాడు. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశించి భంగపడ్డ ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు ఈ వ్యాఖ్యాతల జాబితాలో చోటుదక్కింది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కామెంటరీ ప్యానెల్: రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, ఇయాన్ మోర్గాన్, టామ్ మూడీ, జాంబోయ్, రవిశాస్త్రి, ఇయాన్ బిషప్, నాజర్ హుస్సేన్, హర్ష భోగ్లే, డేల్ స్టెయిన్, గ్రేమ్ స్మిత్, మైఖేల్ అథర్టన్, వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, దినేష్ కార్తీక్, మెల్ జోన్స్,ఎబోనీ రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్, లిసా స్థలేకర్, శామ్యూల్ బద్రీ, మ్పుమెలెలో మ్బాంగ్వా, ఇయాన్ స్మిత్, నటాలీ జర్మనోస్, కార్లోస్ బ్రాత్‌వైట్, డానీ మోరిన్సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, ఫించ్, బ్రియాన్ ముర్గాట్రాయిడ్, మైక్ హేస్మాన్, ఇయాన్ వార్డ్, స్టీవ్ స్మిత్, అథర్ అలీ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, నియాల్ ఓబ్రియన్, కాస్ నైడూ, డారెన్ గంగా , వసీం అక్రమ్ -
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఓటమి అనంతరం కార్తీక్ తన 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. కార్తీక్‌తో అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దినేష్ కార్తీక్‌ను నేను తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2009 సందర్భంగా కలిశాను. బహుశా దక్షిణాఫ్రికాలో అనుకుంటా. నేను అతడితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అదే మొదటి సారి. అతడు చాలా సరదాగా ఉంటాడు. డికే చాలా యాక్టివ్ ఉంటాడు. అదేవిధంగా కన్ఫ్యూజ్డ్ పర్సన్. చాలా సార్లు అతడు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. దినేశ్‌పై నాకు కలిగిన తొలి అభిప్రాయం ఇదే. డీకేకు అద్భుతమైన టాలెంట్ ఉంది. నేను మొదటిసారిగా చూసిన దినేష్‌కు, ఇప్పటి దినేష్‌లో ఎలాంటి మార్పులేదు. అతడు తెలివైనవాడు. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్‌ది ఫీల్డ్ కూడా డీకేతో నాకు మంచి అనుబంధం ఉంది. కార్తీక్‌కు క్రికెట్‌పైనే కాకుండా ఇతర విషయాలపై మంచి అవహగహన ఉంది. అతడితో నాకు సంబంధించిన ఏ విషయమైన నేను చర్చిస్తాను. ఐపీఎల్-2022లో నేను పెద్దగా రాణించలేదు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో దినేష్ నా పక్కను కూర్చోని నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. నాలో ఉన్న లోపాలను నాకు అర్ధమయ్యేలా చెప్పాడు. నేను ఈ రోజు మెరుగ్గా ఆడుతున్నానంటే అందుకు కారణం డీకేనే. కార్తీక్‌లో తన నిజాయితీ, ధైర్యం నాకు బాగా నచ్చాయి. నాకు పరిచయం అయినందుకు థంక్యూ డీకే అంటూ విరాట్ ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. -
నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య భావోద్వేగం
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులోనూ కలిసి జీవించాలనే ఆలోచనే వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి.తనలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగటం. బాగా ఆడలేక విమర్శలు ఎదుర్కొన్నపుడు.. జట్టులో స్థానం కరువైనపుడు రెండు- మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు.తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా చాలా రోజుల పాటు కుంగిపోతారు.వదిలేసేదాన్నేమో!నేను కూడా అథ్లెట్‌నే కాబట్టి అప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలను. తన స్థానంలో గనుక నేనే ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో!కానీ తను అలా కాదు. తన కెరీర్లో వివిధ దశల్లో విభిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ తను పట్టుదలగా నిలబడ్డాడు.గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నాడో అన్నీ సాధించేశాడు. ఒక అథ్లెట్ లైఫ్‌లో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అంత సులువేమీ కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడు.తన కోసం, తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ భార్య దీపికా పళ్లికల్ ఉద్వేగానికి లోనయ్యారు.తన భర్త కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడని.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తాను అనుకున్న స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. కాగా ఐపీఎల్లో ఆరంభం నుంచి పదిహేడేళ్ల పాటు కొనసాగిన క్రికెటర్లలో ఒకడైన దినేశ్ కార్తిక్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్బైఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన అతడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. రాజస్తాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఓటమితో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు.ఈ నేపథ్యంలో దినేశ్ కార్తిక్ భార్య, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ పైవిధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా దీపికా పళ్లికల్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగుసార్లు భారత్ తరఫున పతకాలు సాధించారు. ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్స్ గెలిచారు. డీకే- దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు(కవలలు) సంతానం.చదవండి: Dinesh Karthik: మొదటి భార్య మోసం: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!DK, We love you! ❤ Not often do you find a cricketer who’s loved by everyone around him. DK is one, because he was smart, humble, honest, and gentle! Celebrating @DineshKarthik's career with stories from his best friends and family! 🤗#PlayBold #ನಮ್ಮRCB #WeLoveYouDK pic.twitter.com/fW3bLGMQER— Royal Challengers Bengaluru (@RCBTweets) May 24, 2024 -
Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)
-
Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి పదిహేడో ఎడిషన్ దాకా కొనసాగిన కొంత మంది ఆటగాళ్లలో దినేశ్ కార్తిక్ ఒకడు. తమిళనాడుకు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అరంగేట్ర సీజన్ నుంచి ఇప్పటి దాకా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.ఇక పదిహేడేళ్ల పాటు నిరంతరాయంగా క్యాష్ రిల్ లీగ్ ఆడుతున్న 38 ఏళ్ల డీకే.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని పరోక్షంగా తెలియజేశాడు.ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు డీకేకు శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు పలికారు. ఇక సుదీర్ఘకాలంగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్న డీకే తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి భారంగా మైదానాన్ని వీడాడు.ఒక్క టైటిల్...👉దినేశ్ కార్తిక్ 2008 నుంచి 2024 వరకు అన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 2008లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 2.1 కోట్లకు డీకేను కొనుక్కుంది.👉మూడేళ్ల పాటు ఆ జట్టుతో కొనసాగిన దినేశ్ కార్తిక్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జట్టుకట్టాడు. రెండేళ్ల పాటు పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 2013లో ముంబై ఇండియన్స్‌కు మారాడు.👉ఆ ఏడాది రోహిత్ శర్మ ట్రోఫీ గెలవడంతో డీకే ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ చేరింది. నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన ముంబై తుదిజట్టులో దినేశ్ కార్తిక్ కూడా ఉన్నాడు.👉అయితే, ముంబై ఇండియన్స్‌తో అతడి ప్రయాణం అంతటితో ముగిసిపోయింది. 2014 వేలంలో ఢిల్లీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేను దక్కించుకుంది. ఏకంగా 12.5 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.ఆర్సీబీ అప్పుడే తొలిసారి👉కానీ మరుసటి ఏడాదే డీకేను ఢిల్లీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో 2015 ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి దినేశ్ కార్తిక్‌ను సొంతం చేసుకుంది. ఈ వికెట్ కీపర్బ్యాటర్ కోసం ఏకంగా రూ 10.50 కోట్లు ఖర్చు పెట్టింది.👉అయితే, ఆ సీజన్లో డీకే 11 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 141 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో మరుసటి ఏడాది ఆర్సీబీ అతడిని వదిలించుకుంది.గుజరాత్ లయన్స్‌తో రెండేళ్ల ప్రయాణం👉ఈ క్రమంలో సురేశ్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ డీకేను కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అక్కడే కొనసాగాడు. ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్టు కనుమరుగు కాగా.. 2018లొ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు దినేశ్ కార్తిక్.కేకేఆర్ కెప్టెన్‌గా నియామకం👉ఆ ఏడాది వేలంలో రూ. 7.4 కోట్లకు కేకేఆర్ యాజమాన్యం డీకేను కొనుక్కుంది. ఈ క్రమంలో గౌతం గంభీర్ జట్టు నుంచి నిష్క్రమించగా.. దినేశ్ కార్తిక్‌ను కెప్టెన్‌గా నియమించింది.👉ఇక కేకేఆర్ సారథిగా రెండున్నరేళ్ల పాటు కొనసాగిన డీకే 37 మ్యాచ్‌లలో జట్టును ముందుండి నడిపించాడు. అయితే, 2020 సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వైదొలగగా ఇయాన్ మోర్గాన్ ఆ బాధ్యతలను స్వీకరించాడు.మరోసారి ఆర్సీబీ చెంత.. ఇక్కడే వీడ్కోలు👉ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలం-2022కు ముందు కేకేఆర్ కార్తిక్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఆర్సీబీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేపై నమ్మకం ఉంచి అతడిని రూ. 5.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.👉ఆ సీజన్లో ఆర్బీసీ తరఫున 183కు పైగా స్ట్రైక్‌రేటుతో డీకే 330 పరుగులతో రాణించాడు. ఫినిషర్‌గా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈక్రమంలో టీ20 ప్రపంచకప్-2022 భారత జట్టులో చోటు కూడా సంపాదించాడు డీకే.👉అయితే, మెగా టోర్నీలో నిలకడలేమి ఆటతో విమర్శలపాలైన డీకే.. 2023 సీజన్లోనూ విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లలో కలిపి కేవలం 140 పరుగులే చేశాడు. ఇక ఈ ఏడాది ఆర్సీబీ తరఫున 13 ఇన్నింగ్స్ ఆడిన డీకే 326 పరుగులు సాధించాడు.👉ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో బెంగళూరు పరాజయం నేపథ్యంలో ఓటమితో తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాడు దినేశ్ కార్తిక్. మొత్తంగా ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో డీకే.. 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థ శతకాలు ఉన్నాయి. దినేశ్ కార్తిక్ ఐపీఎల్ రికార్డులు👉మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండేలతో పాటు 17 సీజన్ల పాటు ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడు.👉క్యాష్ రిచ్ లీగ్ పదిహేడేళ్ల చరిత్రలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే అతడు మిస్సయ్యాడు.👉ధోని తర్వాత అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు. ధోని 264 మ్యాచ్‌లు ఆడగా.. డీకే తన కెరీర్లో 257 మ్యాచ్‌లలో భాగమయ్యాడు.2018- 2020 మధ్య కేకేఆర్ కెప్టెన్‌గా 37 మ్యాచ్‌లు ఆడి 19 విజయాలు సాధించాడు. తద్వారా గంభీర్(61) తర్వాత కేకేఆర్‌ను అత్యధికసార్లు గెలిపించిన కెప్టెన్‌గా రికార్డు.👉దినేశ్ కార్తిక్ వికెట్ కీపర్‌గా 174 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ధోని(190) తర్వాత ఈ జాబితాలో రెండో స్థానం ఆక్రమించాడు. From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6— IndianPremierLeague (@IPL) May 22, 2024 చదవండి: అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్ -
ఐపీఎల్‌కు బైబై.. దినేశ్ కార్తిక్ రిటైర్ అయ్యాడా!.. వీడియో వైరల్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ దినేశ్ కార్తిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. క్యాష్ రిచ్ లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు.అయితే, రిటైర్మెంట్ గురించి డీకే నేరుగా ప్రకటించకపోయినా.. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత మైదానంలో చోటు చేసుకున్న దృశ్యాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఐపీఎల్ నిర్వాహకులు సైతం సోషల్ మీడియా వేదికగా డీకే రిటైర్మెంట్ను నిర్ధారించారు.‘‘ఒక ఐపీఎల్ ట్రోఫీ.. అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్.. 16 ఏళ్లు.. ఆరు జట్లు.. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. థాంక్యూ డీకే’’ అంటూ జస్ట్ రిటైర్డ్ అనే బోర్డున్న కారు వెనకాల నిల్చున్న దినేశ్ కార్తిక్.. విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యాలకు టాటా చెప్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2024లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ రాజస్తాన్ రాయల్స్‌తో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా టైటిల్ రేసు నుంచి నిష్క్రమించి ఇంటిబాట పట్టింది.అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం డీకేను ఆర్సీబీ ప్లేయర్లు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇక అభిమానులకు అభివాదం చేస్తూ మైదానమంతా కలియదిరుగుతూ భావోద్వేగానికి గురైన దినేశ్ కార్తిక్.. వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు అతడి వెనకాలే నడుస్తూ కరతాళ ధ్వనులతో ఉత్సాహపరిచారు.ఓటమితో ఐపీఎల్ కెరీర్ ముగించిన డీకే ఉద్వేగానికి లోనుకాగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అతడిని హత్తుకుని.. ‘‘మరేం పర్లేదు’’ అంటూ ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో #Happy Retirement DK అంటూ ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6— IndianPremierLeague (@IPL) May 22, 20241⃣ #TATAIPL 🏆2⃣nd - most dismissals by a WK in #IPL 💪3⃣rd - most appearances in the league's history! 🤯#IPLonJioCinema #RRvRCB #DineshKarthik #TATAIPLPlayoffs pic.twitter.com/dXYJz6skOi— JioCinema (@JioCinema) May 22, 2024 -
Dinesh Karthik Photos: ఐపీఎల్‌కు దినేశ్ కార్తీక్ వీడ్కోలు (ఫొటోలు)
-
దినేష్ కార్తీక్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు
భారత వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా కార్తీక్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు చేసిన డీకే.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కార్తీక్ ఐపీఎల్లో బెంగళూరు తరపున 57 మ్యాచ్‌ల్లో 912 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 43 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ తరపున 898 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును కార్తీక్ బద్దలు కొట్టాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 249 మ్యాచ్‌ల్లో 7897 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను 60 పరుగుల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా నిలుపున్‌కుంది.. -
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే .. ఆ ముగ్గరు స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్?
టీ20 వరల్డ్‌కప్-2024లకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్1న అమెరికా, కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే1లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపికను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ మీటింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోనున్నాడు. అయితే సెలక్టర్లు కంటే ముందు చాలా మంది మాజీ ఆటగాళ్లు టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే భారత జట్టును అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు చేరాడు.టీ20 ప్రపంచకప్‌కు తన 15 మంది ప్రాబబుల్స్‌ని రాయుడు ఎంచుకున్నాడు. రాయుడు ఎంచుకున్న జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది.అదేవిధంగా ఐపీఎల్లో అదరగొడుతున్న పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌లకు రాయడు తన ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అనుహ్యంగా రాయుడు వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను కాకుండా దినేష్ కార్తీక్‌కు చోటు ఇవ్వడం గమనార్హం.దినేష్ కార్తీక్ ఈ ఏడాది సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఫినిషర్‌గా వచ్చి డీకే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రాయుడు కార్తీక్‌కు అవకాశమిచ్చాడు. అంబటి ఎంచుకున్న జట్టులో టాప్-4లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలకు రాయుడు అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను రాయుడు ఎంపిక చేశాడు. #IncredibleStarcast expert @RayuduAmbati has picked 15 ambitious players for his #TeamIndia squad ahead of #T20WorldCup2024 & there's only one all-rounder, @imjadeja! 👀Participate in the biggest opinion poll ever on our social media handles (23rd April-1st May) and see if you… pic.twitter.com/1PB3TwATc8— Star Sports (@StarSportsIndia) April 24, 2024 -
ఇంకెవరు.. నీ భార్యనే: కోహ్లి ఆన్సర్‌తో షాకైన డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఆటతోనే కాదు తన చురుకుదనంతో అభిమానులను ఫిదా చేస్తూ ఉంటాడు. క్రీజులో దిగగానే భారీ షాట్లతో విరుచుకుపడగల ఈ రన్ మెషీన్.. మైదానంలో తన చేష్టలతోనూ వినోదం పంచుతూ ఉంటాడు. అదే విధంగా.. సహచర ఆటగాళ్లతోనూ సరదాగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా మారుస్తాడు. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. తోటి ప్లేయర్ దినేశ్ కార్తిక్ అడిగిన ప్రశ్నలకు కోహ్లి ఊహించని సమాధానమివ్వడమే గాకుండా.. మళ్లీ అతడిని మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐపీఎల్-2024లో మ్యాచ్‌ల నుంచి విరామం దొరికిన సమయంలో ఆర్సీబీ తమ ఆటగాళ్లతో పలు ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఉండగా... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి కోహ్లి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఇంకెవరు నీ భార్యనే! ఇందులో భాగంగా.. డీకే ముందుగా.. ‘‘క్రికెటర్ కాకుండా నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పగలరా?’’ అని అడగ్గా.. కోహ్లి వెంటనే తడుముకోకుండా .. ‘‘నీ భార్య’’ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో క్షణంపాటు ఆశ్చర్యంలో మునిగిన డీకే.. ‘‘అవును.. సరైన సమాధానం.. కానీ నిజానికి నా మనసులో వేరే పేరు అనుకున్నా’’ అన్నాడు. డీకే అలా అనగానే అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కోహ్లి ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.. మోసం చేసిన మొదటి భార్య? కాగా దినేశ్ కార్తిక్ భార్య పేరు దీపికా పళ్లికల్. ఆమె స్వ్కాష్ ప్లేయర్. భారత్ తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. అయితే, దీపికా కంటే ముందు డీకే నికితా వంజరాను పెళ్లాడాడు. కానీ ఆమె డీకేతో వివాహ బంధంలో ఉండగానే భర్త స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీకే ఆమెకు విడాకులివ్వగా.. మురళీ విజయ్ను పెళ్లాడింది. తర్వాత డీకే దీపికాను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి బ్యాటర్‌గా రాణిస్తున్నా ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి గెలిచి పట్టికలో పదో స్థానంలో ఉంది. అయితే, కోహ్లి మాత్రం 361 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు.. దినేశ్ కార్తిక్ సైతం జట్టు కష్టాల్లో ఉన్నపుడు బ్యాట్ ఝులిపిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం మాత్రం ఉండటం లేదు. Virat Kohli - the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నన్ను నవ్వించగలిగేది అతనే.. అప్పుడు చాలా బాధ పడ్డాను: రోహిత్ శర్మ
క్లబ్ ప్రియారీ ఫైర్ అనే పోడ్కాస్ట్తో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్ ఖాళీ సమయంలో క్లబ్ ప్రియారీతో మాట్లాడుతూ.. ధోని, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. నన్ను నవ్వించగలిగేది అతనే.. రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ.. టీమిండియాలో నన్ను ఎవరైనా నవ్వించగలరంటే అది పంత్ మాత్రమే. అతన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటాడు. నాకు నవ్వుకోవాలని అనిపించిన ప్రతిసారి అతనితో మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి నవ్వించేస్తాడు. వికెట్ల వెనక పంత్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అందరూ పగలబడి నవ్వుతారు. అయితే కారు ప్రమాదం కారణంగా పంత్ అమూల్యమైన కెరీర్‌ను మిస్ కావడం నన్ను చాలా బాధించింది. ఇప్పటికైనా అతను బెస్ట్ అంటూ హిట్‌మ్యాన్ కితాబునిచ్చాడు. ధోనిని ఒప్పించడం చాలా కష్టం.. డీకే అయితే ఈజీ టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం చాలా మంది రిటైర్డ్ క్రికెటర్లు (పాకిస్తాన్) తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనే అంశంపై మాట్లాడుతూ.. రిటైర్మెంట్ వెనక్కు తీసుకోమని ధోనిని ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే అతను బాగా అలసిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో అతన్ని రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని వరల్డ్‌కప్ ఆడమని అడగలేం. అడిగినా అతను ఒప్పుకోడు. ఇదే విషయంలో దినేశ్ కార్తీక్‌ను ఒప్పించడమయితే చాలా సులువే అని హిట్‌మ్యాన్ అన్నాడు. శభాష్ డీకే.. వరల్డ్‌కప్ ఆడాలని ఉన్నట్లుంది.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని, దినేశ్ కార్తీక్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారని రోహిత్ కితాబునిచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ డీకేను సరదాగా ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కార్తీక్ హిట్టింగ్ చేస్తుండగా రోహిత్ సరదాగా చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. శభాష్ డీకే.. టీ20 వరల్డ్‌కప్‌కు సెలెక్ట్ కావాలని అడుతున్నట్లుంది. నీ మైండ్‌లో కూడా ఇదే నడుస్తున్నట్లుందని రోహిత్ డీకేను ఆటపట్టించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది.. ఇదే సందర్భంగా రోహిత్.. ధోని ముంబైతో ఆడిన ఇన్నింగ్స్‌పై (4 బంతుల్లో 20 నాటౌట్) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది. నాలుగు బంతులు ఆడి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతన్ని ఇన్నింగ్స్ తమ ఓటమిని శాశించింది. ధోని చేసిన 20 పరుగులే తమకు వారికి వ్యత్యాసం అంటూ గుర్తు చేసుకున్నాడు. -
T20 WC 2024: ధోని యూఎస్ వస్తాడు: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు టైటిల్ అందించిన హిట్‌మ్యాన్ ఈసారి మాత్రం కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఫ్రాంఛైజీ నిర్ణయం మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆరు మ్యాచ్‌లు ఆడి 261 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(105*) కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఆట నుంచి విరామం దొరికిన సమయంలో రోహిత్ శర్మ క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్‌కాస్ట్‌లో భాగంగా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, ఆడం గిల్ క్రిస్ట్‌లతో సరదాగా ముచ్చటించాడు. ధనాధన్ ధోని యూఎస్ వస్తాడు ఈ సందర్భంగా ఐపీఎల్-2024లో అదరగొడుతున్న టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఎంఎస్ ధోనిని ఒప్పించడం కష్టం. ఇప్పటికే తను కాస్త అనారోగ్యంతో ఉన్నాడు. బాగా అలసిపోయాడు. అతడు యూఎస్‌కు రావడమైతే ఖాయం. కానీ అక్కడ గోల్ఫ్ ఆడతాడు. ఇటీవలి కాలంలో ధోని గోల్ఫ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు’’ అని రోహిత్ పేర్కొన్నాడు. డీకేను ఒప్పించడం తేలిక ఏదేమైనా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ సీఎస్కే స్టార్ నాలుగు బంతుల్లోనే 20 రన్స్ రాబట్టిన తీరు అమోఘమని కొనియాడాడు. ఇక మరో వెటరన్ ప్లేయర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ గురించి ప్రస్తావిస్తూ.. డీకేను వరల్డ్‌కప్‌లో ఆడేలా కన్విన్స్ చేయడం చాలా సులువని రోహిత్ సరదాగా కామెంట్ చేశాడు. అదే విధంగా.. యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి మాట్లాడుతూ.. ‘‘క్రేజీ. అందరు యువ ఆటగాళ్లు ఇలాగే ఉంటారనుకోండి. అందులో పంత్ మరింత క్రేజీ. నేను ఎప్పుడైనా ముభావంగా ఉన్నపుడు నవ్వేలా చేస్తాడు. పంత్ అత్యుత్తమ ప్రదర్శన అతడు పిల్లాడిగా ఉన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే.. గతేడాది ఆ దుర్ఘటన కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావడం బాధనిపించింది. తను తిరిగిరావడం సంతోషంగా ఉంది. వికెట్ కీపర్‌గానూ పంత్ అదరగొడుతున్నాడు. గాయాల నుంచి కోలుకుని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వికెట్ కీపర్‌గా అతడే? కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్‌కప్-2024 ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే టీమిండియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్‌గా పంత్ పేరు ఖరారైందని రోహిత్ శర్మ పరోక్షంగా చెప్పాడంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీ సిక్సర్ల వీరుడు.. అతడి భార్య కూడా స్పోర్ట్స్ పర్సనే! (ఫొటోలు)
-
టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి, తన కెరీర్‌ను ఘనంగా ముగించిడానికి కార్తీక్‌కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్‌లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్‌లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
చరిత్రపుటల్లోకెక్కిన సన్‌రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్.. టీ20 రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ చాలా వరకు టీ20 రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (287/3) 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కాగా.. పొట్టి క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా (గతేడాది ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ మంగోలియాపై చేసిన 314 పరుగుల స్కోర్ టీ20ల్లో అత్యధికం) రికార్డైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262=549) టీ20 హిస్టరీలో (ఓ మ్యాచ్‌లో) నమోదైన అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 22 సిక్సర్లు కొట్టిన సన్‌రైజర్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (ఓ ఇన్నింగ్స్‌లో) కొట్టిన జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ (39 బంతులు) చేసిన సెంచరీ సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన శతకంగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో నమోదైన బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81), సిక్సర్లు (38) (ఇరు జట్లు కలిపి కొట్టినవి) పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు, సిక్సర్లుగా రికార్డయ్యాయి. ఈ రికార్డులే కాక ఈ మ్యాచ్‌లో మరెన్నో చిన్నా చితక రికార్డులు నమోదయ్యాయి. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గూసన్ 2, టాప్లే ఓ వికెట్ పడగొట్టాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పోరాడితే పోయేదేమీ లేదనుకుని చివరి నిమషం వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, మయాంక్ మార్కండే 2, నటరాజన్ ఓ వికెట్ పడగొట్టాడు. -
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్?
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమతో అందరని ఆకట్టుకున్నాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో కార్తీక్ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించాడు. అతడికి బౌలింగ్‌లో ఎలా చేయాలో ఆర్ధం కాక ఎస్ఆర్హెచ్ బౌలర్లు తలలపట్టుకున్నారు. భువనేశ్వర్, ప్యాట్ కమ్మిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్కు గట్టిపోటీ ఇవ్వగల్గింది. డికే ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్ వచ్చి తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ఉండవచ్చు.. డీకే మాత్రం మా మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు. pic.twitter.com/jqOIaCZAgL — Cricket Videos (@cricketvid123) April 15, 2024 -
IPL 2024: చిత్ర విచిత్రమైన షాట్లతో చెడుగుడు ఆడుకున్న దినేశ్ కార్తీక్
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చెలరేగిపోయాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో (ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్) డీకే ఆడిన షాట్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. ఈ ఓవర్లో డీకే చిత్రవిచిత్రమైన షాట్లు ఆడి నాలుగు బౌండరీలు రాబట్టాడు. వినూత్న షాట్లతో డీకే ఆకాశ్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. డీకే ఈ ఓవర్లో కొట్టిన నాలుగు బౌండరీలు ఒకే దిశలో వెళ్లడం విశేషం. డీకే ఉద్దేశపూర్వకంగా ఈ షాట్లు ఆడి సక్సెస్ అయ్యాడు. డీకే పవర్ హిట్టింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే రీప్లే చూసినట్లుంటుంది. అన్ని షాట్లు ఒకేలా ఉన్నాయి. It's not a replay ❌ It's just @DineshKarthik using his improvisation perfectly 👌 not once but four times. Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/IzU1SAqZ6m — IndianPremierLeague (@IPL) April 11, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను చేజార్చారు. -
RCB Vs MI: శెభాష్ డీకే భాయ్, నీవు వరల్డ్ కప్‌లో ఆడాలి.. రోహిత్ ఆఫర్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం తన బ్యాటింగ్‌తో అందరని ఆకట్టుకున్నాడు. మరోసారి కార్తీక్ ఫినిషర్‌గా అవతారమెత్తాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే.. ముంబై బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లతో కార్తీక్ ఆలరించాడు. ఆర్సీబీ 196 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తీక్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే కార్తీక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సైతం ఫిదా అయిపోయాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ.. కార్తీక్ వద్దకు వెళ్లి చప్పట్లు కొడుతూ అభినంధించాడు. అంతేకాకుండా డీకే భాయ్ నీవు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలంటూ రోహిత్ నవ్వుతూ ఉన్నాడు. కార్తీక్ కూడా ఒకే అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Rohit Sharma teasing DK with " World Cup Khelna hai saabash"😂#RCBvMIpic.twitter.com/F01TTl1szu — Sunil the Cricketer (@1sInto2s) April 11, 2024 -
RCB Vs MI: దినేష్ కార్తీక్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కార్తీక్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా ముంబై పేసర్ ఆకాష్ మధ్వాల్‌ను డీకే ఓ ఆట ఆడేసుకున్నాడు. ఆకాష్ మధ్వాల్ వేసిన తన ఆఖరి రెండు ఓవర్లలో కార్తీక్ ఏకంగా 38 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తీక్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కార్తీక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. డీకే ది ఫినిషర్ అంటూ కామెంట్లు చేస్తున్నాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. pic.twitter.com/dBwUH5hlgA — Sitaraman (@Sitaraman112971) April 11, 2024 -
రోహిత్, కోహ్లి కాదు.. ప్రపంచంలో అతడే బెస్ట్!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భూగ్రహం మీద ప్రస్తుతం అత్యంత విలువైన క్రికెటర్ ఇతడేనంటూ టీమిండియా స్టార్లలో ఓ ఆటగాడి పేరు చెప్పాడు. డీకే చెప్పిన ఆ ప్లేయర్ రన్‌మెషీన్ విరాట్ కోహ్లినో లేదంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మనో కానే కాదు! మరెవరు?.. దినేశ్ కార్తిక్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో బిజీగా ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి ఫినిషర్‌గా తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఇప్పటి వరకు తాజా ఎడిషన్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో డీకే 90 పరుగులు చేశాడు. తదుపరి ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా డీకే మళ్లీ గురువారం బరిలో దిగనున్నాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. కేవలం ఆటగాడినే కాకుండా కామెంటేటర్‌గానూ దినేశ్ కార్తిక్ రాణిస్తున్న విషయం తెలిసిందే. భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్, మైఖేల్ అథెర్టన్లతో కలిసి డీకే స్కై స్పోర్ట్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నిజం చెప్పాలంటే అతడిలా మూడు ఫార్మాట్లలో ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తున్న మరొక ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి సత్తా అలాంటిది. కాబట్టి ప్రస్తుతం ఈ భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ అతడు సమర్థవంతంగా ఆడుతున్నాడు. వేరే ఆటగాడికి లేని నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు. అతడు బరిలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే’’ అంటూ డీకే.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. తన దృష్టిలో ప్రస్తుతం బుమ్రా మాత్రం ఈ ప్రపంచం మొత్తం మీద విలువైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. కాగా భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇక గురువారం ముంబై- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా బుమ్రా- డీకే ఎదురుపడే అవకాశం ఉంది. చదవండి: T20 WC: హార్దిక్, రాహుల్‌కు నో ఛాన్స్.. ఆ ముగ్గురూ ఫిక్స్! -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్‌తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్‌గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్‌లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్‌ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు..
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. తన హోం గ్రౌండ్లో రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్లు అయిన దినేష్ కార్తీక్ చెత్త రికార్డును రోహిత్ సమం చేశాడు. కార్తీక్ ఇప్పటివరకు 17 సార్లు డకౌట్ కాగా.. రోహిత్ శర్మ సైతం 17 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వీరి తర్వాతి స్ధానంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్(15) ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్లైన ఆటగాళ్లు వీరే.. రోహిత్ శర్మ(17) దినేష్ కార్తీక్(17), గ్లెన్ మాక్స్వెల్(15), పీయూష్ చావ్లా(15) మన్దీప్ సింగ్(15) సునీల్ నరైన్(15) -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరు విజయం (ఫొటోలు)
-
RCB Vs PBKS: 'డీకే' ది ఫినిషర్.. కేవలం 10 బంతుల్లోనే విధ్వంసం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఫినిషర్ అవతారమెత్తాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని ఈ వెటరన్ అందించాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ సైతం నిరాశపరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు వర్షం కురిపిస్తూ బౌలర్లను ఒత్తడిలోకి నెట్టే ప్రయత్నించాడు. పాటిదార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే పాటిదార్ ఎక్కువ సమయం పాటు కోహ్లికి సపోర్ట్‌గా నిలవకపోయాడు. హర్‌ప్రీత్ బరార్ బౌలింగ్‌లో పాటిదార్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ సైతం హర్‌ప్రీత్‌కే చిక్కాడు. మాక్స్వెల్ ఔటయ్యే సమయానికి ఆర్సీబీ స్కోర్ 12.1 ఓవర్లలో 103/3. అంటే ఆర్సీబీ విజయానికి 7.5 ఓవర్లలో 74 పరుగులు కావాలి. కొంచెం కష్టమైన టాస్క్ అయినప్పటికి కోహ్లి క్రీజులో ఉండడంతో అభిమానలు థీమాగా ఉన్నారు. కోహ్లికి తోడుగా రావత్ క్రీజులోకి వచ్చాడు. రావత్ సింగిల్స్ తీసుకుంటూ కోహ్లికి స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కోహ్లి వీలుచిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కాస్త తగ్గించాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదిన విరాట్ కోహ్లి.. ఆఖరి బంతికి ఔటయ్యాడు. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 77 పరుగులు చేసిన విరాట్ నిరాశతో మైదానాన్ని వీడాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మహిపాల్ లామ్రోర్ వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో రావత్ సైతం పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ వచ్చాడు. కార్తీక్ క్రీజులోకి వచ్చిన వెంటనే తన బ్యాట్‌కు పనిచెప్పాడు. సామ్ కుర్రాన్ వేసిన 17 ఓవర్‌ను ఫోర్ బాది కార్తీక్ ముగించాడు. ఆ తర్వాత 18 ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్ సిక్స్, ఫోరు బాది మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను ఫినిష్ చేసే బాధ్యతను కార్తీక్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా కార్తీక్ చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, సిక్స్ బాదిన డికే.. 20 ఓవర్లలో తొలి రెండు బంతులను బౌండరీలగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై ఆర్సీబీ అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. What an incredible finish by Dinesh Karthik! 🫡 DK - The finisher 🔥#RCBvsPBKS #DineshKarthik pic.twitter.com/3JzIDKKIxt — OneCricket (@OneCricketApp) March 25, 2024 -
IPL2024 : బెంగళూరుపై చెన్నై విజయం (ఫొటోలు)
-
IPL 2024: లేటు వయస్సులో డీకే ఖతర్నాక్ ఇన్నింగ్స్.. ! వీడియో వైరల్
ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్ అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన డీకే.. తన ఖాతార్నాక్ ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. మరో యువ ఆటగాడు అనుజ్ రావత్‌తో కలిసి తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఆరో వికెట్‌కు రావత్‌తో కలిసి 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 26 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 38 ఏళ్ల కార్తీక్ కొట్టిన 2 సిక్సర్ల కూడా మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు కార్తీక్ గుడ్‌బై చేప్పే అవకాశముంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కార్తీక్‌తో పాటు అనుజ్ రావత్(48) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ ఒక్క వికెట్ సాధించాడు. All heads must bow, all lips must confess... ANUJ RAWAT AND DINESH KARTHIK ARE THE GREATEST DUO IN THE HISTORY OF IPL.🐐🐐pic.twitter.com/zKwLc4rKNW — VJ17 (@ABDszn17) March 22, 2024 -
టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) తాజా సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌కూ గుడ్‌బై? అదే విధంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా డీకే గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ తమిళనాడు బ్యాటర్ ఇప్పటి వరకు 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1025, 1752, 686 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గానూ మెరుగ్గా రాణించిన దినేశ్ కార్తిక్ ఖాతాలో ఒకే ఒక సెంచరీ(టెస్టుల్లో) ఉంది. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ చెన్నై ప్లేయర్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో 242 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4516 పరుగులు సాధించాడు. 133 డిస్మిసల్స్లోనూ భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్. 2008 నుంచి ఇప్పటి దాకా ఇక 2008లో ఈ టీ20 లీగ్ మొదలైన నాటి ప్రతి ఎడిషన్‌లోనూ ఆడిన ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ఇప్పటి వరకు ఆరు ఫ్రాంఛైజీలకు దినేశ్ కార్తిక్ ప్రాతినిథ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(కెప్టెన్‌గానూ)లకు ఆడిన డీకే.. గత రెండు సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అనూహ్యంగా వరల్డ్‌కప్ జట్టులో ఐపీఎల్-2022లో ఆర్సీబీ ఫినిషర్‌గా అదరగొట్టిన దినేశ్ కార్తిక్.. ఆ ఏడాది అనూహ్యంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మెగా టోర్నీలో విఫలమైన అతడు మళ్లీ భారత జట్టులో స్థానం పొందలేకపోయాడు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం! అయితే, దేశవాళీ క్రికెట్లో మాత్రం తమిళనాడు తరఫున బరిలోకి దిగుతూనే ఉన్నాడు 38 ఏళ్ల దినేశ్ కార్తిక్. కామెంటేటర్‌గానూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 తర్వాత ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌కూ స్వస్తి పలికి.. కేవలం డొమెస్టిక్ క్రికెట్ మీద దృష్టి సారించాలని డీకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం ప్రచురించింది. చదవండి: సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్! -
మరీ ఇంత స్వార్థమా?.. కోచ్ ఇలా చేయడం తప్పే: డీకే ఫైర్
DK Fumes As Tamil Nadu Coach 'Throws Captain Under The Bus': తమిళనాడు క్రికెట్ కోచ్ సులక్షణ్ కులకర్ణి తీరుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మండిపడ్డాడు. జట్టు ఓటమికి కెప్టెన్‌ను బాధ్యుడిని చేసేలా స్వార్థపూరితంగా మాట్లాడటం కోచ్ స్థాయికి తగదని చురకలు అంటించాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా ముంబైతో జరిగిన సెమీ ఫైనల్లో తమిళనాడు ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇన్నింగ్స్ 70 పరుగుల భారీ తేడాతో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణి స్పందిస్తూ.. కెప్టెన్ ఆర్.సాయి కిషోర్ నిర్ణయాలను తప్పుబట్టాడు. ఓ ముంబైకర్‌గా నాకన్నీతెలుసు.. కానీ టాస్ గెలిచినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశాడని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరోజు వికెట్‌ను నేను గమనించాను. కోచ్‌గా, మంబైకర్(ముంబైకి చెందినవాడు)గా అక్కడి పిచ్ పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. టాస్ గెలిచినపుడు బౌలింగ్ చేయించాలని అనుకుంటే.. మా కెప్టెన్ మాత్రం తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా బాస్ అతడే. అతడి నిర్ణయమే ఫైనల్. కేవలం ఇన్పుట్స్, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వరకే నేను పరిమితం’’ అని సులక్షణ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. నిజానికి తాము మొదటి రోజు ఆట టాస్ సమయంలోనే ఓడిపోయామంటూ సాయి కిషోర్‌ను ఓటమికి బాధ్యుడిని చేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందించాడు. కోచ్‌కు ఇంత స్వార్థం పనికిరాదు.. ‘‘ఇలా మాట్లాడటం కచ్చితంగా తప్పే. కోచ్ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం నన్ను నిరాశకు గురిచేసింది. ఏడేళ్ల తర్వాత తొలిసారి జట్టును రంజీ సెమీస్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌ను అభినందించాల్సింది పోయి.. ఇలా కోచే స్వయంగా.. బహిరంగంగా అతడిని విమర్శించడం సరికాదు’’ అని తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ డీకే ఆగ్రహం వ్యక్తం చేశాడు. This is soo WRONG This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it's a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus 👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs — DK (@DineshKarthik) March 5, 2024 తమిళనాడు ఆట ముగిసిందిలా.. ఫైనల్లో ముంబై రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతమైదానంలో తమిళనాడుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 353/9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 106.5 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయికిశోర్ 6 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 232 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు షమ్స్ ములానీ (4/53), శార్దుల్ ఠాకూర్ (2/16), మోహిత్ (2/26), తనుష్ (2/18) ధాటికి 162 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. శార్దుల్ ఠాకూర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం! -
శిఖర్ ధావన్ విధ్వంసం.. చెలరేగిన దినేష్ కార్తీక్
డివై పాటిల్ టీ20 కప్-2024లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగాడు. ఈ టోర్నీలో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సత్తాచాటాడు. డివై పాటిల్ బ్లూ జట్టు విజయంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. 9 వికెట్ల తేడాతో ఆర్సీఐని బ్లూ జట్టు చిత్తు చేసింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్బీఐ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆర్బీఐ బ్యాటర్లలో ప్రణయ్ శర్మ(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాటిల్ బ్లూ జట్టులో పరీక్షిత్ వల్సంకర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొథారీ 3 వికెట్లు పడగొట్టాడు. -
ఆ ఇద్దరు భారత క్రికెటర్లు నా ఫేవరేట్ : జాన్వీ కపూర్
భూమి గుండ్రంగా ఉందన్న విషయం తెలిసిందే. మనుషుల జీవితాలు గుండ్రంగానే ఉంటాయని కొందరిని చూస్తుంటే అనిపిస్తోంది. ఉదాహరణకు నటి జాన్వీ కపూర్ నే తీసుకుంటే ఈమె తల్లి అందాల రాశి దివంగత నటి శ్రీదేవి తెలుగమ్మాయి. బాలనటిగా రంగప్రవేశం చేసి తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి సత్తాచాటారు. ఆ తరువాత కథానాయకిగా దక్షిణాదిని ఏలేసీ హిందీ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులనూ మైమరపించి మిస్టర్ ఇండియా అయ్యారు. అలాంటి అపరంజి బొమ్మ కడుపును పుట్టిన జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు ఇండియన్ సినిమాను చుట్టేస్తున్నారు. అయితే ఈ బ్యూటీ తల్లికి కాస్త భిన్నంగా పయనిస్తున్నారు. శ్రీదేవి దక్షిణాదిలో జయించి ఉత్తరాది వెళితే జాన్వీ కపూర్ ఉత్తరాదిలో పాపులర్ అయ్యి దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు. హిందీలో దడక్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దక్షిణాదిలో దేవర చిత్రంతో దిగుమతి అయ్యారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్ జత కడుతున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తదుపరి జాన్వీ మరో భారీ క్రేజీ ఆఫర్ వివరించిందని తెలిసింది. అదే నటుడు రామ్ చరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం. ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతోనూ జత కట్ట బోతున్నారన్నారు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. మహాభారతం ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కర్ణుడిగా నటించబోతున్న సూర్య సహ ధర్మచారిగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు స్వయానా ఆమె తండ్రి బోనీకపూర్ ఇటీవల ఒక భేటీలో స్పష్టం చేశారు. ఇంకాపోతే తాను దక్షిణాది చిత్రాల్లో నటించడానికి గురించి నటి జాన్వీ కపూర్ ఒక భేటీలో పేర్కొంటూ దేవర వంటి భారీ చిత్రంలో తానూ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో నటించడం ద్వారా ఇక్కడ తన మూలాలను చేరుకునే అవకాశం కలుగుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే తాను ఇప్పుడు తెలుగు భాషను నేర్చుకుంటున్నానని చెప్పారు. తనకు ఇండియన్ సినిమా, క్రికెట్ క్రీడ అంటే చాలా ఇష్టం అన్నారు. క్రికెట్ క్రీడాకారులు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ అంటే చాలా ఇష్టం అని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. తాను దక్షిణాది చిత్రాల్లో నటించడం ద్వారా జీవితం గుండ్రంగా సాగుతోందని అనిపిస్తోందని ఈ బ్యూటీ పేర్కొన్నారు. -
పోప్ సంగతి సరే.. వాళ్ల విషయంలోనూ అలా ఎందుకు?: డీకే విమర్శలు
India vs England, 1st Test : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉప్పల్‌లో గురువారం మొదలైన టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజే తలవంచి ఓటమిని ఆహ్వానించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. స్వదేశంలో టీమిండియా ఇలా ఊహించని రీతిలో ఓటమిపాలు కావడంతో రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. వాళ్ల విషయంలోనూ డిఫెన్సివ్‌గా ఎందుకు? తొలి టెస్టులో భారత్ ఆట తీరు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్, మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని విమర్శించాడు. ఒలి పోప్ వంటి బ్యాటర్ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదని డీకే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేసి ఉంటే బాగుండన్నాడు. ఈ మేరకు జియో సినిమా షోలో దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఇంత బేలగా చూడలేదు ఇక భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదన్నాడు. రోహిత్ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని వాపోయాడు. కాగా ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ ఈ మ్యాచ్‌లో 196 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు -
ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు సహాయక బృందంలో...
భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా భారత ‘ఎ’ జట్టుతో ఇంగ్లండ్ అహ్మదాబాద్‌లో 3 నాలుగు రోజులఅనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టూర్ తొలి 9 రోజుల పాటు కార్తీక్ ఇంగ్లండ్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు. హెడ్ కోచ్ నీల్ కిలీన్ నేతృత్వంలో అతను పని చేస్తాడు. -
'అతడిని టీమిండియా మిస్సవుతోంది.. సౌతాఫ్రికాకు చుక్కలు చూపించేవాడు'
సెంచూరియన్ వేదికగా టీమిండయాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగుస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తాచాటుతోంది. రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెనర్ డీన్ ఎల్గర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ మినహా మిగితా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. అరంగేట్ర ఆటగాడు ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో పేస్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సేవలు కోల్పోయిందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "వెటరన్ పేసర్ మహ్మద్ షమీని భారత జట్టు నిజంగా మిస్ అవుతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సెంచూరియన్ వంటి వికెట్‌పై షమీ తన సీమ్‌తో అద్భుతాలు చేయగలడు. షమీ ఆడి ఉంటే ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయిపోయి ఉండేది. జస్ప్రీత్ బుమ్రా, షమీ ద్వయం ప్రత్యర్ధి జట్టును ముప్పుతిప్పులు పెట్టేవారు. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వీరిద్దరి కలిసి కేవలం 27 ఓవర్లలనే 118 పరుగులు సమర్పించుకున్నారు. సిరాజ్ వికెట్లు తీసినప్పటికీ కొంచెం ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. అయితే చివరి స్పెల్‌లో సిరాజ్ అద్భుతమైన బంతులను వేశాడు. అతడి బౌలింగ్ చూస్తే ఒకట్రెండు వికెట్లు పడగొట్టగలడనే నమ్మకం నాకు కలిగింది. మూడో రోజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేస్తే మ్యాచ్ మలుపు తిరగవచ్చు అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: AUS Vs PAK: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్ -
దినేష్ కార్తీక్ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం
విజయ్ హజారే ట్రోఫీ-2023లో తమిళనాడు తొలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జరిగిన పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో తమిళనాడు పరాజయం పాలైంది. తమిళనాడు కెప్టెన్, టీమిండియా వెటరన్ దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 252 పరుగుల లక్ష్య ఛేదనలో 40 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తమిళనాడు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్ జట్టును అదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ కార్తీక్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. ఆఖరికి సిద్దార్ద్ కౌల్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో కార్తీక్ పోరాటం ముగిసింది. కార్తీక్ ఔటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 175 పరుగులకే చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో సిద్దార్ద్ కౌల్ ఐదు వికెట్లతో చెలరేగాడు. కాగా ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న డికే.. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కార్తీక్‌ను రిటైన్ చేసుకుంది. చదవండి: ఐపీఎల్-2024 షెడ్యూల్ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! ఈసారి ఇక్కడ కష్టమే? -
IPL 2024: ఆర్సీబీలో భారీ ప్రక్షాళన.. స్టార్ ఆటగాళ్లకు షాక్.. లక్కీ డీకే
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళనకు దిగింది. ఆ జట్టు హాజిల్‌వుడ్, హసరంగ, హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్, పార్నెల్ లాంటి స్టార్లను సైతం వేలానికి వదిలేసింది. అయితే ఆ జట్టు ఎవరూ ఊహించని విధంగా దినేశ్ కార్తీక్‌ను కొనసాగించింది. కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను కొనసాగించిన ఆర్సీబీ.. కెమారూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ను నుంచి ట్రేడింగ్ చేసుకుంది. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండనే ఉన్నారు. ఆర్సీబీ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. వనిందు హసరంగ హర్షల్ పటేల్ జోష్ హాజిల్‌వుడ్ ఫిన్ అలెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ డేవిడ్ విల్లే వేన్ పార్నెల్ సోనూ యాదవ్ అవినాశ్ సింగ్ సిద్దార్థ్ కౌల్ కేదార్ జాదవ్ ఆర్సీబీ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్) గ్లెన్ మ్యాక్స్‌వెల్ విరాట్ కోహ్లి రజత్ పాటిదార్ అనూజ్ రావత్ దినేశ్ కార్తీక్ సుయాశ్ ప్రభుదేశాయ్ విల్ జాక్స్ మహిపాల్ లోమ్రార్ కర్ణ్ శర్మ మనోజ్ భండగే కెమరూన్ గ్రీన్ (ముంబై నుంచి ట్రేడింగ్) మయాంక్ డాగర్ (ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడింగ్) వైశాఖ్ విజయ్ కుమార్ ఆకాశ్ దీప్ మొహమ్మద్ సిరాజ్ రీస్ టాప్లే హిమాన్షు శర్మ రజన్ కుమార్ -
మాథ్యూస్ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్
వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌తో చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా ఔట్‌గా మాథ్యూస్ వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. ఇది జరిగి దాదాపు ఐదు రోజులు అవుతున్నప్పటకీ ఇంకా చర్చ జరగుతూనే ఉంది. కొంత మంది బంగ్లా కెప్టెన్ షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. మాథ్యూస్ కనీసం ఒక్క బంతినైనా ఎదుర్కొని హెల్మెట్‌ను మార్చకోవాల్సందని కార్తీక్ అన్నాడు. "హెల్మెట్ మార్చమని అభ్యర్థించడానికి ముందు మాథ్యూస్ కనీసం ఒక బంతిని ఫేస్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఎటువంటి సమస్య ఉండకపోయేది. అయితే ఆ సమయంలో అతడికి ఆ ఆలోచిన వచ్చి ఉండదు. ఆ దిశగా అతడు అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే టైమ్డ్ ఔట్‌కు ప్రత్యర్ధి జట్టు అప్పీలు చేస్తారని మాథ్యూస్ ఊహించి ఉండడు. అదే ఇక్కడ కీలకమైన అంశమని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్ రికార్డు సమం! -
WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్
ICC ODI World Cup 2023: అనుకోకుండా కొన్ని కొన్ని.. అలా జరిగిపోతూ ఉంటాయంతే! టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు ఇలాగే జరిగింది. అనూహ్యరీతిలో టీ20 వరల్డ్‌కప్-2022 జట్టులో చోటు దక్కించుకున్న ఈ చెన్నై బౌలర్.. వన్డే ప్రపంచకప్-2023 టీమ్‌లోనూ ఊహించని రీతిలో స్థానం సంపాదించాడు. గత ఆరేళ్లలో కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఈ స్పిన్ ఆల్‌రౌండర్‌కు అక్షర్ పటేల్ గాయం రూపంలో ఐసీసీ ఈవెంట్ ఆడే అవకాశం దక్కింది. అది కూడా సొంతగడ్డపై మెగా టోర్నీలో భాగమయ్యే అదృష్టం వరించింది. అక్షర్ గాయం.. అశ్విన్ పాలిట వరంగా.. ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ గాయపడటంతో తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు అశ్విన్. అయితే, ఈ గుజరాతీ బౌలర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు మేనేజ్మెంట్ పిలుపునిచ్చింది. ఇలా అనుకోకుండా సువర్ణావకాశం లభించడంపై స్పందించిన అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు. విధి, పరిస్థితుల ప్రభావం వల్లే తాను ప్రపంచకప్ ఈవెంట్లో భాగం అవుతున్నానని పేర్కొన్నాడు. అయితే, తనకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కూడా కావొచ్చని అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రపంచకప్-2023 వార్మప్ మ్యాచ్‌లో భాగంగా గువాహటి వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ శనివారం తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో జట్టుతో పాటు అక్కడికి చేరుకున్న అశ్విన్.. దినేశ్ కార్తిక్‌తో మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదొక్కటే ధ్యేయం నిజానికి నువ్వు జోక్ చేస్తున్నావే అనుకున్నా. అస్సలు ఇక్కడ ఈరోజు నేనిలా ఉంటానని ఊహించలేదు. మేనేజ్మెంట్ నాపై నమ్మకం ఉంచింది. ఇలాంటి టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే మనం ముందుకు సాగగలం. ఆటను ఆస్వాదిస్తూ సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాల్సి ఉంటుంది. బహుశా టీమిండియా తరఫున నాకిదే చివరి ప్రపంచకప్ టోర్నీ కావొచ్చు. కాబట్టి టోర్నమెంట్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తాననేదే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 37 ఏళ్ల అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో వాషింగ్టన్ సుందర్ రూపంలో యువ ఆఫ్ స్పిన్నర్ నుంచి పోటీ ఉంది. టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ కూడా బ్యాటర్‌గా రాణించడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అశూ రిటైర్ అయ్యే అవకాశం కాబట్టి వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడే అవకాశాలు తక్కువే. మరోవైపు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్లు సైతం పొట్టి ఫార్మాట్లో యువకులకు అవకాశం ఇచ్చే క్రమంలో తమ స్థానాలను త్యాగం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి అశూకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కావొచ్చు. అదృష్టం వెంటపడితే మాత్రం మళ్లీ ఏదో మ్యాజిక్ జరిగి జట్టులోకి వచ్చినా రావొచ్చు!! లేదంటే వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం!! చదవండి: వరల్డ్‌కప్ జట్టు సెలక్షన్‌పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు? -
ఆసియా కప్ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. అతడికి వీలు కాలేదనే సుందర్‌కు ఛాన్స్
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్‌ను కాదని.. రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్‌తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్ సింగ్ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆశల పల్లకిలో కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా చెన్నై ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్‌లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్‌కు ఫస్ట్ ఛాయిస్ అశూనే ఈ క్రమంలో.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆసియా కప్-2023 శ్రీలంకతో ఫైనల్‌కు తొలి ఛాయిస్ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్, అజిత్, రాహుల్ ద్రవిడ్‌లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్ ఫైనల్‌కు ముందుగా వాళ్లు అశ్విన్‌కే పిలుపునిచ్చారు. ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు అయితే, తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్ మ్యాచ్‌లు ఆడి రిథమ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్‌ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్ రెండు క్లబ్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతే ఆసీస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్‌కే. వాషింగ్టన్ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్‌కప్ జట్టులోనూ.. కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్‌తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్ తీశాడు. మార్నస్ లబుషేన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
WC: ఇషాన్, సంజూ శాంసన్ కాదు! వరల్డ్‌కప్‌తో డీకే రీ ఎంట్రీ!?
You’ll see me in the World Cup: ఆసియా వన్డే కప్-2023.. నెల తిరిగేలోపు వన్డే ప్రపంచకప్.. మెగా ఈవెంట్ల రూపంలో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం లభించనుంది. శ్రీలంక, పాకిస్తాన్లలో ఆసియా కప్ జరుగనుండగా.. భారత్ వేదికగా ఐసీసీ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 5- నవంబరు 19 వరకు ప్రపంచకప్ ఈవెంట్ జరుగనుంది. కత్తిమీద సాము ఈ నేపథ్యంలో అర్హత సాధించిన జట్లన్నీ జట్ల కూర్పుపై దృష్టి సారించాయి. ఇక.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై వరల్డ్‌కప్ ఆడనున్న టీమిండియాపై అంచనాలు భారీగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటడం ఓవైపు.. సానుకూల అంశంగా కనిపిస్తున్నా.. మరోవైపు ఇదే సెలక్టర్లకు కత్తిమీద సాములా తయారైంది. రాహుల్ వస్తున్నాడు.. అయ్యర్ మాత్రం ఇదిలా ఉంటే.. గాయాల బెడదతో చాన్నాళ్లుగా జట్టుకు దూరమైన ఆటగాళ్ల జాబితాలో ఉన్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ నాటికి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వరల్డ్‌కప్ సమయానికైనా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే స్పష్టం చేశాడు. వాళ్లిద్దరు లేకపోవడంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇస్తుండగా.. కీలక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక ప్రస్తుతం రాహుల్, రిషభ్ జట్టుకు దూరంగా ఉంటున్న కారణంగా కేఎస్ భరత్(టెస్టులు), ఇషాన్ కిషన్‌లు వికెట్ కీపింగ్ చేస్తున్నారు. నన్ను తప్పకుండా చూస్తారు! వీరితో పాటు సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉండనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారన్న అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేఎల్ రాహుల్(పూర్తిగా కోలుకుని తిరిగి వస్తే), ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని ఓ ట్విటర్ యూజర్.. నెటిజన్ల ఛాయిస్ అడిగాడు. వద్దు బాబోయ్.. వస్తానన్నది కామెంటేటర్‌గా? ఇందుకు బదులుగా.. ఓ అభిమాని వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పేరును చెప్పాడు. ఇక డీకే సైతం స్పందిస్తూ.. ‘‘ఈసారి వరల్డ్‌కప్‌లో నన్ను తప్పకుండా చూడబోతున్నారు. ఇంతకంటే ఏం చెప్పగలను’’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. అయితే, నెటిజన్లు మాత్రం.. ‘‘2019 వన్డే వరల్డ్‌కప్, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడే అవకాశం ఇస్తే ఏం చేశావో గుర్తుంది. అమ్మో.. నువ్వు మళ్లీ రావొద్దు.. రాలేవులే!’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో ఆర్సీబీ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచి ఫినిషర్‌గా ఆకట్టుకున్న దినేశ్ కార్తిక్‌ను ప్రపంచకప్-2022 జట్టుకు ఎంపిక చేశారు సెలక్టర్లు. కానీ ఈ వెటరన్ వికెట్ కీపర్ అంచనాలు అందుకోలేక చతికిలపడ్డాడు. ఐపీఎల్-2023లోనూ విఫలమై.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో డీకే వరల్డ్‌కప్‌లో కనిపిస్తానన్నది కామెంటేటర్‌గా అంటూ అతడి అభిమానులు పేర్కొంటున్నారు. చదవండి: సత్తా చాటిన శుభ్‌మన్.. దుమ్మురేపిన తిలక్ వర్మ You'll see me in the World Cup for sure is what I can say 😉 https://t.co/nzzXzGbiki — DK (@DineshKarthik) August 8, 2023 -
రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే
India tour of West Indies, 2023- Ajinkya Rahane Failure: అజింక్య రహానేకు ఇది అత్యంత సాదాసీదా సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన తర్వాత ఏకంగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి ఇలాంటి అవకాశం ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోవడం సహజం. అయితే, అజింక్య రహానేకు ఎవరు ఏమనుకుంటున్నారన్న అంశంతో పనిలేదు. అతడికి రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం వచ్చింది. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌ల కారణంగా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. మరికొంత మందికి ఇలా కొన్ని సిరీస్‌లు చేదు అనుభవాన్నిస్తాయి. అయితే, అజింక్య రహానే విషయంలో మాత్రం నిలకడలేని ఆట ప్రభావం చూపుతోంది. అందుకే గతంలో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది ఈ విషయం అతడికి కూడా తెలిసే ఉంటుంది. అయితే, సౌతాఫ్రికా టూర్లో ఇలాంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అతడిలో అంతర్మథనం మొదలవడం ఖాయం’’ అని టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన భారత జట్టు ఉప నాయకుడు అజింక్య రహానేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారో చాలా మందికి అర్థం కాలేదన్న డీకే.. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడని పెదవి విరిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదుర్స్ కాగా ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో రహానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమైన వేళ అజ్జూ రాణించాడు. ఈ మెగా ఫైట్‌లో 135 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విండీస్ టూర్లో భాగంగా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు కానీ ఆడిన రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తంగా కేవలం 11(3, 8) పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ డీకే.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. తాజా సైకిల్లో తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత.. -
ఎందరో సహకారంతో ఈ స్థాయికి చేరా: దినేష్ కార్తిక్
సాక్షి, చైన్నె: తన క్రికెట్ పయనంలో ఎందరో సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరినట్టు క్రికెటర్, స్టైలిష్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ తెలిపారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా ఆయన నియమితులయ్యారు. శనివారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో దినేష్ కార్తిక్ స్ఫూర్తితో కొత్త స్పోర్ట్స్ వేర్ లైన్‌ను పరిమ్యాచ్ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన క్రికెట్ పయనం, పరిమ్యాచ్ స్పోర్ట్స్, ఐపీఎల్ అనుభవాలను గురించి దినేష్ కార్తిక్ మీడియాకు వివరించారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అనేది అసమానమైన శైలి, అసాధారణమైన సౌలభ్యం, బలమైన విజేత స్ఫూర్తిని సూచించే బ్రాండ్‌గా వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్న తనం నుంచి ఎన్నో ఆశలు ఉండేవని, ఇవి ప్రస్తుతం సాకారం అవుతున్నట్టు వివరించారు. ఎందరో సహకారంతో తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు. తన బ్యాట్, జెర్సీ, క్యాప్, ఇలా అన్నింటా ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ముందుకెళుతున్నట్టు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే తాను ఈ వ్యవహారంలో నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. -
స్వర్ణం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య
హ్వాంగ్జౌ (చైనా): ఆసియా స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దీపిక పల్లికల్ (క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య) – హరీందర్‌పాల్ సింగ్ సంధు జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో దీపిక – హరీందర్ 11–10, 11–8 స్కోరుతో ఇవాన్ యూయెన్ – రాచెల్ ఆర్నాల్డ్ (మలేసియా)పై విజయం సాధించారు. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్లో మలేసియాకు చెందిన టాప్ సీడ్ ఆయిరా అజ్మాన్ – షఫీక్ కమాల్‌ను...సెమీ ఫైనల్లో తయ్యద్ అస్లామ్ – ఫైజా జఫర్ (పాకిస్తాన్)ను భారత ద్వయం ఓడించింది. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. భారత్‌కు చెందిన అనాహట్ సింగ్ – అభయ్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. -
నాకేమీ 75 ఏళ్లు కాదు.. ధోని, డీకే మాత్రం! వాళ్లను ఒక్కమాట కూడా అనను!
Ind Vs WI: ‘‘నేను నైరాశ్యంలో మునిగిపోయినప్పుడల్లా దినేశ్ కార్తిక్, మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేసుకుంటాను. నేను కేకేఆర్‌కు ఆడుతున్న సమయంలో కార్తిక్‌ని దగ్గరగా గమనించాను. అతడి కెరీర్ ఎలాంటి మలుపులు తిరిగిందో చూశాను. నాకు డీకే స్ఫూర్తి. కెరీర్ పరంగా నిరాశ ఎదురైనపుడు అతడే నా మోటివేషన్’’ అని సౌరాష్ట్ర వెటరన్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ ఉద్వేగానికి లోనయ్యాడు. 36 ఏళ్ల వయసులో.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. దేశవాళీ మ్యాచ్‌లలో సౌరాష్ట్ర తరఫున టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నాడు. కానీ 36 ఏళ్ల జాక్సన్‌కు ఇంతవరకు ఒక్కసారి కూడా టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ ప్రతిసారి మొండిచేయే ఎదురైంది. కనీసం ఇండియా- ఏ జట్టుకు కూడా అతడిని ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలో గతేడాది ట్విటర్ వేదికగా సెలక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన షెల్డన్ జాక్సన్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలతో ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘మనకసలు అవకాశమే ఇవ్వకపోతే మనల్ని మనం ఎలా నిరూపించుకుంటాం? వాళ్లను ఒక్కమాట కూడా అనను సెలక్షన్ విధానంపై నేనెప్పుడూ ఎలాంటి కామెంట్ చేయను. నన్నెందుకు ఎంపిక చేయలేదని అడిగే హక్కు మాత్రం ఉంటుంది కదా! కానీ నేనెప్పుడూ ఏ సెలక్టర్‌ను కూడా ఎప్పుడూ సంప్రదించలేదు. నన్ను ఎందుకు బలి చేశారని అడుగలేదు. ఒకవేళ నిజంగానే నా ఆట తీరు మరీ అంత ఘోరంగా ఉంటే 90కి పైగా మ్యాచ్‌లు ఎలా ఆడి ఉంటాను. నా సగటు 50. పరిమిత ఓవర్లు, రెడ్‌బాల్ క్రికెట్లో ప్రభావం చూపగలుగుతున్నా. నిజానికి ఇన్నాళ్లుగా నాకు అండగా నిలుస్తున్న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు చెప్పాలి. నాకు షా కుటుంబం మద్దుతు ఉంది..అందుకే ముఖ్యంగా షా(జయదేవ్ షా, నిరంజన్ షాలను ఉద్దేశించి) కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంది. వంద మ్యాచ్‌లకు నేను చేరువవుతున్నానంటే అందుకు వాళ్లే కారణం. ఏదేమైనా జట్టు ఎంపిక విషయంలో సెలక్టర్లు మనల్ని విస్మరించినప్పుడు విసుగు, కోపం, అసహనం రావడం సహజమే కదా!’’ అని షెల్డన్ జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో సెలక్టర్లను ఉద్దేశించి షెల్డన్ జాక్సన్ చేసిన ట్వీట్ ‘‘గత మూడు సీజన్లలో అద్భుతంగా ఆడాను కాబట్టి జాతీయ జట్టుకు ఎంపికవ్వాలనే కల నెరవేరుతుందని ఆశించే హక్కు నాకుంటుంది. నా వయసును బట్టి కాదు.. నా ఆట తీరును బట్టి నా పేరును పరిశీలనలోకి తీసుకోండి. నువ్వు మంచి ఆటగాడివి కానీ.. ఇలాంటి మాటలు వినీ వినీ విసుగొచ్చింది. నాకు వయసైపోయిందన్న మాట వాస్తవమే. కానీ నాకిప్పుడు 35 ఏళ్లే.. 75 కాదు’’ అని జాక్సన్ 2022 ఆగష్టులో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా విమర్శనాస్త్రాలు సంధించాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టు ఎంపిక నేపథ్యంలో షెల్డన్ జాక్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ! WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే! -
లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
రెండు మనుసుల కలయికతో.. ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే ఆ బంధం నాలుగుకాలాల పాటు వర్ధిల్లుతుంది. భాగస్వాములలో ఏ ఒక్కరు పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ‘మూడో వ్యక్తి’ని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించిన పార్ట్నర్ను మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నె దిల్షాన్, ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే, దిల్షాన్ తమ భార్యలు.. తమతో బంధంలో కొనసాగుతూనే.. తమ స్నేహితులతోనే అనుబంధం పెనవేసుకోవడం భరించలేకపోయారు. వారితో బంధానికి వీడ్కోలు పలికి కొత్త జీవితం మొదలుపెట్టి ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా గడుపుతున్నారు. వారి జీవితాల్లో ఏం జరిగిందంటే.. స్నేహం ముసుగులో వెన్నుపోటు చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు దినేశ్ కార్తిక్. డీకే సహచర క్రికెటర్, ఫ్రెండ్ అయిన మురళీ విజయ్‌తో బంధం కొనసాగించింది. వారిద్దరి రహస్య రిలేషన్షిప్ తెలుసుకున్న దినేశ్ గుండె ముక్కలైంది. దీంతో 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో నికిత ఎంచక్కా మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మరోవైపు.. స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ రూపంలో రెండోసారి ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ప్రస్తుతం కవలలు(ఇద్దరు కుమారులు) సంతానం. దిల్షాన్ది ఇంచుమించు ఇదే పరిస్థితి లంక లెజండరీ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ నిలంక వితంగే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె దిల్షాన్ ఓపెనింగ్ పార్ట్నర్ ఉపుల్ తరంగతో అనుబంధం పెంచుకుందట. ఈ క్రమంలో దిల్షాన్‌తో విడాకులు తీసుకున్న నిలంక.. ఆ తర్వాత ఉపుల్ను పెళ్లాడింది. నిజానికి నిలంక, ఉపుల్ మధ్య అతి చనువే దిల్షాన్‌తో ఆమె విడిపోవడానికి కారణమని గతంలో వార్తలు వచ్చాయి. భార్య మంజులతో దిల్షాన్ ఇక నిలంక- దిల్షాన్లకు ఒక కుమారుడు సంతానం కాగా.. భరణం, కుమారుడి సంరక్షణ కోసం నిలంక.. దిల్షాన్‌ను కోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పురాగా అతడు కొడుకుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నటి మంజుల థిలినిని పెళ్లాడిన దిల్షాన్‌కు మరో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. బ్రెట్ లీ మాజీ భార్య సైతం ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా భార్యా బాధితుడే అంటారు. ఆటతో బిజీగా ఉండే లీతో తన జీవితం సంతోషంగా లేదని భావించిన అతడి భార్య.. రగ్బీ ప్లేయర్‌ను పెళ్లాడినట్లు సిడ్నీ హెరాల్డ్ గతంలో వెల్లడించింది. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు! -
నువ్వెందుకు బౌలింగ్ చేస్తున్నావు? కావాలంటే మీకు కూడా.. అంతేగానీ! ధోని ఆ ఒక్క మాటతో
‘‘2004లో.. ఇండియా- ఏ జట్టు కెన్యా, జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని రిజర్వ్ కీపర్‌గా ఉండగా.. దినేశ్ కార్తిక్ తుది జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అయితే, ఓసారి నెట్స్‌లో ధోని.. కార్తిక్‌కు బౌలింగ్ చేయడం చూశాను. వెంటనే ధోని దగ్గరకు వెళ్లి.. ‘‘నువ్వెందుకు అతడికి బౌలింగ్ చేస్తున్నావు? అతడు నీకు ప్రధాన పోటీదారు అన్న విషయం తెలుసు కదా! ఒకవేళ అతడు బాగా ప్రాక్టీస్ చేసి మెరుగైన ప్రదర్శన ఇస్తే నీకు తుది జట్టులో ఆడే అవకాశం రాదు. కాబట్టి నువ్వు కూడా బ్యాటింగ్ లేదంటే కీపింగ్ ప్రాక్టీస్ చేయాలి కానీ ఇదేంటి? అసలు నువ్వెందుకు అతడికి బౌలింగ్ చేస్తున్నావు? అని అడిగాను. వెంటనే ధోని స్పందిస్తూ.. ‘‘దయచేసి నన్ను ఆపకండి. నాకు బౌలింగ్ చేయాలని ఉంది. ఒకవేళ మీకు బ్యాటింగ్ చేయాలని ఉంటే చేయండి. కావాలంటే మీకు కూడా నేను బౌలింగ్ చేస్తాను’’ అని బదులిచ్చాడు. ఈ విషయాన్ని తలచుకున్నపుడల్లా.. ధోని తాను సాధించాలనుకున్నవి ఎలా సాధించగలిగాడో నాకు అర్థమవుతుంది. ధోనికి దినేశ్ కార్తికో.. మరెవరో పోటీకానే కాదు. తనకు తానే పోటీ. ఆరోజు తన మాటలతో నాకు కనువిప్పు కలిగించాడు. ఎవరైనా సరే ఇతరులతో కాకుండా తమకు తాము పోటీ అని భావిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోనిలా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని పేర్కొన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి కాగా వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ధోని 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన మిస్టర్ కూల్.. 2006లో టీ20లలో అడుగుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ఇక సారథిగా భారత్‌కు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని.. మూడు ఐసీసీ టైటిళ్లు బహుమతిగా ఇచ్చాడు. అదే విధంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ ఐదుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపి.. లీగ్ క్రికెట్లోనూ తనదైన ముద్ర వేశాడు. విరాట్ కోహ్లి వంటి ఎంతోమంది స్టార్లను తయారు చేసిన ధోని ఎంతో నిరాడంబరంగా ఉంటాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్దంలో మాత్రమే చూడగలడు ఈ నేపథ్యంలో ఒకప్పుడు తనకు పోటీదారు అయిన దినేశ్ కార్తిక్ విషయంలో ధోని ఆలోచనా ధోరణిని ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆకర్షిస్తున్నాయి. ‘‘తనకు తానే సాటి. గ్రేట్‌నెస్ అనే పదానికి నిర్వచనం ఎంఎస్ ధోని. తనకు పోటీ అయిన వ్యక్తిని అతడు కేవలం అద్దంలో మాత్రమే చూడగలడు’’ అంటూ ఆకాశ్ ట్విటర్లో వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: IPL 2023: నిజంగానే ఆరోజు ఓవరాక్షన్ చేశాను! నా ప్రవర్తన వల్ల.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే.. Master of his own game, MS Dhoni continues to redefine greatness. The only competition he faces is the one in the mirror. 🏏💪 #DhoniLegacy #Aakashvani pic.twitter.com/auGcAv81nt — Aakash Chopra (@cricketaakash) June 19, 2023 -
దినేష్ కార్తీక్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్సీబీ.. అతడితో పాటు!
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఈ సీజన్లోనైనా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించిన అభిమానులకు.. ఆర్సీబీ మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఏడింటిలో గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టులో ప్రక్షాళనకు ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. . ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న మినీ వేలంలో పక్కా ప్రణాళికలతో రావాలని ఆర్సీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో పేలవ ప్రదర్శన కనబరిచిన దినేష్ కార్తీక్‌కు ఆర్సీబీ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-16వ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన డికే..11.67 సగటుతో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ధానంలో మరో యువ వికెట్ కీపర్‌ను తీసుకోవాలని బెంగళూరు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు విదేశీ ఆటగాళ్లు వనిందూ హసరంగా, జోష్ హాజిల్ వుడ్, ఫిన్ అలెన్‌ను కూడా విడిచిపెట్టాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో హసరంగాను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో పర్వాలేదనపించినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మరోవైపు జోష్ హజెల్‌వుడ్‌ను 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి ఫిట్నెస్ దృష్ట్యా వచ్చే సీజన్‌కు ముందు సాగనింపాలని ఆర్సీబీ భావిస్తోంది. చదవండి: గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్ -
అతడి కోసమే ఇలా! భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? క్రికెటర్ ట్వీట్ వైరల్
Duleep Trophy 2023: అద్భుతంగా రాణించినప్పటికీ తనకు దులిప్ ట్రోఫీ టోర్నీ ఆడే జట్టులో చోటు కల్పించకపోవడంపై కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘోరం ఎప్పుడైనా జరిగిందా అంటూ సెలక్టర్ల తీరును ప్రశ్నించాడు. తానెవరినీ తప్పుబట్టడం లేదని, అయితే.. తనను ప్రతిష్టాత్మక ట్రోఫీ ఆడే జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పగలరా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2022-23 రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో కేరళ తరఫున వెటరన్ ఆల్‌రౌండర్ జలజ్ ఏడు మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కోసం? బ్యాట్‌తోనూ రాణించి కేరళ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, దులిప్ ట్రోఫీ ఆడే క్రమంలో సౌత్ జోన్ జట్టును ఎంపిక చేసే క్రమంలో 36 ఏళ్ల జలజ్‌ను సెలక్టర్లు విస్మరించారు. తమిళనాడు ఆల్‌రౌండర్, టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించేందుకు ఈ కేరళ ప్లేయర్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు జట్టులో స్థానం లేకపోవడాన్ని జీర్ణించుకోలేని జలజ్ సక్సేనా ట్విటర్ వేదికగా ఆవేదనను పంచుకున్నాడు. ‘‘భారత్‌లో రంజీ ట్రోఫీ(ఎలైట్ గ్రూప్) టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిని దులిప్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేయలేదు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? చరిత్రను తిరగేయండి దయచేసి.. నాకోసం ఒక్కసారి చరిత్రను తిరగేయండి! కేవలం ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంతే! ఎవరినీ నిందించే ఉద్దేశం నాకైతే లేదు’’ అంటూ జలజ్ ఆవేదనభరిత ట్వీట్ చేశాడు. కాగా దులిప్ ట్రోఫీ సౌత్ జోన్ సెలక్షన్ విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జలజ్‌తో పాటు తమిళనాడు ప్లేయర్ బాబా ఇంద్రజిత్‌ను కూడా పక్కనపెట్టడంతో సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఈ విషయంపై స్పందిస్తూ.. సెలక్షన్ కమిటీ అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. రెస్టాఫ్ ఇండియాకు ఆడిన బాబా ఇంద్రజిత్‌ను ఎందుకు ఎంపికచేయలేదో ఎవరైనా చెప్పగలరా అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు. సెలక్టర్లు ఏం చేస్తున్నారో వాళ్లకైనా అర్థమవుతోందా అంటూ ఫైర్ అయ్యారు. కాగా బెంగళూరు వేదికగా జూన్ 28 నుంచి దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. జూలై 12-16 వరకు ఫైనల్ జరుగనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్, సౌత్ జోన్ల జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. చదవండి: Ind vs WI: రోహిత్, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్! ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్‌లో ఇరు జట్లు Highest wicket taker in Ranji trophy in India( Elite Group) didn't get picked in Duleep trophy. Can you please check whether it has ever happened in the Indian Domestic history? Just wanted to know. Not blaming anyone 🙏 https://t.co/Koewj6ekRt — Jalaj Saxena (@jalajsaxena33) June 17, 2023 -
బుమ్రా రీ ఎంట్రీ కన్ఫర్మ్
-
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అతడొచ్చేస్తున్నాడు..!
టీమిండియా అభిమానులకు వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ శుభవార్త చెప్పాడు. గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఆగస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని పరోక్షంగా కన్ఫర్మ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 నాలుగో రోజు కామెంట్రీ ఇస్తూ డీకే ఈ విషయాన్ని బయటపెట్టాడు. బుమ్రా ఎంట్రీతో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరిగే వరల్డ్‌కప్ కంతా బుమ్రా సెట్ అయితే, అది టీమిండియాకు చాలా మేలు చేస్తుంది. కాగా, ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో టీమిండియా.. ఐర్లాండ్‌తో 3 టీ20లు ఆడనుంది. ఇందుకోసం భారత్.. ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిస్తుంది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 425 పరుగుల లీడ్‌ను సాధించింది. మరో 30, 40 పరుగులు చేసి, ఆ జట్టు ఇన్నింగ్స్‌ను (ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 252/6) డిక్లేర్ చేయవచ్చు. అలెక్స్ క్యారీ (64), స్టార్క్ (33) క్రీజ్‌లో ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 252/6 (అలెక్స్ క్యారీ 64 బ్యాటింగ్, జడేజా 3 వికెట్లు) ఆసీస్ 425 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..? -
ఒక్క సిరీస్ తో వరల్డ్ కప్ కి యశస్వి జైస్వాల్..
-
వన్డే ప్రపంచకప్ జట్టులో జైశ్వాల్.. దినేష్ కార్తీక్ సంచలన వాఖ్యలు!
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ ఫ్లేఆఫ్స్‌కు చేరడడంలో విఫలమైనప్పటికీ.. ఆ జట్టు యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన అద్బుత ప్రదర్శనతో అందరిని అకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో యశస్వీ జైశ్వాల్ దుమ్మురేపాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌కు తనవంతు సహకారం అందించేవాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్ 625 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జైస్వాల్ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో జైశ్వాల్ చోటు దక్కనుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే వేదికగా భారత వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా అతడికి అవకాశం ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జైశ్వాల్‌ను ఉద్దేశించి టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ కీలక వాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్ వంటి పెద్ద ఈవెంట్‌కు జైశ్వాల్‌ను ఎంపికచేయాలి అనడం తొందరపాటే అవుతుందని కార్తీక్ తెలిపాడు. "వన్డే జట్టులోకి యశస్వీని ఇంత వేగంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతడు అద్భుతమైన యువ ఆటగాడు. అతడికి ప్రస్తుతం కేవలం 21 ఏళ్లు మాత్రమే. జైశ్వాల్‌కు చాలా భవిష్యత్తు ఉంది. అతడొక స్పెషల్ ప్లేయర్. కాబట్టి అతడిని ముందు భారత టీ20 జట్టులో భాగం చేయండి. వచ్చే ఏడాది జరగున్న టీ20 ప్రపంచకప్ సమయానికి యశస్వీని సిద్దంచేయాలి. జట్టులో కుదురుకున్నాక అప్పుడు టీ20లు మాత్రమే కాకుండా వన్డేల్లో కూడా అవకాశం ఇవ్వాలి. కానీ అంతర్జాతీయ క్రికెట్ అన్నింటికంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలా ఒత్తిడి ఉంటుంది" అని ఐసీసీ రివ్యూ షోలో కార్తీక్ పేర్కొన్నాడు. -
గతేడాది ఫినిషర్‌గా రికార్డు.. ఈ సీజన్లో డకౌట్ల రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాల్సింది పోయి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవర్లో యష్ దయాల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యి చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. గతేడాది ఫినిషర్‌గా దినేశ్ కార్తిక్ మంచి ప్రదర్శన కనబరిచాడు. లాస్ట్ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన కార్తిక్ 330 పరుగులు చేశాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉన్నప్పటికి ఫినిషర్‌గా మాత్రం రికార్డులు సాధించాడు. కానీ ఈ ఏడాది సీన్ మొత్తం రివర్స్ అయింది. ఫినిషర్‌గా అదరగొట్టిన ఏడాది వ్యవధిలోనే డకౌట్ల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా దినేశ్ కార్తిక్ తొలి స్థానంలో నిలిచాడు. 17 డకౌట్లతో కార్తిక్ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 16 డకౌట్లతో రెండు, 15 డకౌట్లతో మణిదీప్‌సింగ్, సునీల్ నరైన్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్ 16వ సీజన్లో దినేశ్ కార్తిక్ డకౌట్‌గా వెనుదిరగడం ఇది నాలుగోసారి. ఒక సీజన్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో దినేశ్ కార్తిక్ చేరిపోయాడు. జాస్ బట్లర్(2023, ఐదు డకౌట్లు) తొలి స్థానంలో ఉండగా.. గిబ్స్(2009), మిథున్ మార్ష్(పుణే వారియర్స్), మనీష్ పాండే(2012), శిఖర్ ధావన్(2020), ఇయాన్ మోర్గాన్(2021), నికోలస్ పూరన్(2021), దినేశ్ కార్తిక్(2023) నాలుగేసిసార్లు ఒకే సీజన్లో డకౌట్ అయ్యారు. చదవండి: కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా -
రోహిత్ శర్మతో పోటాపోటీ.. నువ్వు మారవా? ఫ్యాన్స్ ఫైర్
IPL 2023 RR vs RCB: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీ ఆదివారం (మే 14) రాజస్తాన్‌తో తలపడుతోంది. జైపూర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరు అర్ధ శతకాలతో ఈ క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లి(18) మరోసారి నిరాశపరచగా, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 44 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ సైతం హాఫ్ సెంచరీ(33 బంతుల్లో 54 పరుగులు)తో రాణించాడు. కాగా పదిహేనో ఐదో బంతికి రాజస్తాన్ బౌలర్ కేఎం ఆసిఫ్ డుప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపగా.. మహిపాల్ లామ్రోర్ క్రీజులోకి వచ్చాడు. తుస్సుమన్న డీకే ఈ క్రమంలో పదహారో ఓవర్ మొదటి బంతికే ఆడం జంపా అతడిని అవుట్ చేశాడు. కేవలం ఒక్కే పరుగు చేసి ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన లామ్రోర్ స్థానంలో డీకే వచ్చాడు. ఆ మరుసటి బంతికే జంపా దినేశ్ కార్తిక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఎల్బీడబ్ల్యూ అయిన డీకే డకౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి ఆర్సీబీ స్కోరు 120 పరుగులు మాత్రమే! ఈ క్రమంలో మాక్సీ బ్యాట్ ఝులిపించడం.. అనూజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ 171 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో డకౌట్ కావడం ద్వారా మరోసారి చెత్త రికార్డు నమోదు చేశాడు. చెత్త రికార్డు.. డక్ల వీరులు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి చరిత్రకెక్కాడు. వీరిద్దరు ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో 16 డక్‌లు నమోదు చేశారు. 15 డకౌట్లతో మన్దీప్ సింగ్, సునిల్ నరైన్ వీరి తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో డీకే ఆట తీరుపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ‘‘ఇకనైనా మారు డీకే! అప్పుడేమో ఫినిషర్‌గా అదరగొట్టావు.. ఇప్పుడేమో డకౌట్లలో రోహిత్‌తో పోటీ పడుతున్నావు. రోజురోజుకూ జట్టుకు భారంగా మారుతున్నావు’’ అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కాగా గతేడాది ఫినిషర్‌గా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన డీకే.. ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 11 ఇన్నింగ్స్‌లో చేసిన మొత్తం పరుగులు 140. అత్యధిక స్కోరు 30. ఈ గణాంకాలను బట్టి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చదవండి: #AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు Most ducks in IPL History 16- Dinesh Karthik 16- Rohit Sharma Tough Competition between them 🤩#IPL2O23 #RRvRCB pic.twitter.com/6deEKumtMj — 🄺Ⓐ🅃🄷🄸🅁 1⃣5⃣ (@katthikathir) May 14, 2023 -
ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..?
ఐపీఎల్-2023లో సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తయినా ఇప్పటికీ కొందరు బ్యాటర్లు గాడిలో పడకపోవడంతో సంబంధిత ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. భారీ మొత్తం వెచ్చించి సొంత చేసుకున్న కొందరు ఆటగాళ్లు పదేపదే అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారారు. తమ చెత్త బ్యాటింగ్‌తో ఫ్రాంచైజీలకు భారంగా మారిన ఆటగాళ్లెవరో ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుత సీజన్లో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రియాన్ పరాగ్ ముందువరుసలో ఉంటాడు. వేలంలో 3.8 కోట్లు దక్కించుకున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 20 అత్యధిక స్కోర్‌తో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పరాగ్ తర్వాత చెత్త పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఆటగాడు ఆర్సీబీ దినేశ్ కార్తీక్. ఫినిషర్‌గా ఇరగదీస్తాడని భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన డీకే (5.5 కోట్లు).. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28 అత్యధిక స్కోర్‌తో కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన డీకే.. వికెట్‌కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. క్యాచ్‌లు మిస్ చేయడం, స్టంపింగ్, రనౌట్లు చేయలేకపోవడం, చేతిలోకి వచ్చిన బాల్స్‌ను జారవిడచడం.. ఇలా వికెట్‌కీపింగ్‌లోనూ డీకే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంతటితో ఇతని ఆగడాలు ఆగలేదు. బ్యాటింగ్ సమయంలో ఇతను పరుగులు చేయలేకపోగా.. బాగా ఆడుతున్న వారిని పలు సందర్భాల్లో రనౌటయ్యేలా చేశాడు. కార్తీక్‌తో పాటు మరో ఆటగాడు కూడా ఆర్సీబీకి చాలా భారంగా మారాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ కూడా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమై జట్టు ఓటములకు కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్‌తో పాటు జట్టు మొత్తం బ్యాటింగ్ విభాగంలో దారుణంగా నిరాశపరుస్తుంది. బ్రూక్ ఒకే ఒక మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఆతర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. మయాంక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. చించేస్తాడనుకున్న కెప్టెన్ మార్క్రమ్ కూడా తేలిపోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు దీపక్ హుడా.. సీఎస్కేకు అంబటి రాయుడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షాలు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని సంబంధిత ఫ్రాంచైజీలు తదుపరి జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆడిస్తారో లేక సాహసం చేసి పక్కకు కూర్చోబెడతారో వేచి చూడాలి. చదవండి: ముంబైతో మ్యాచ్.. జూనియర్ మలింగ అద్భుత గణాంకాలు -
కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా నిరూపించుకున్నాడా? మరీ దారుణంగా.. ఇప్పటికైనా
IPL 2023- Dinesh Karthik: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆట తీరును టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో కనీసం ఒక్కదాంట్లో కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేదని పెదవి విరిచాడు. జట్టు తనపై ఆధారపడొచ్చనే భరోసా ఇవ్వలేకపోయాడంటూ విమర్శలు గుప్పించాడు. అప్పుడు అదుర్స్. .. గత సీజన్లో ఆర్సీబీ ఫినిషర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత జట్టులో పునరాగమనం చేశాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్. కానీ పదహారో ఎడిషన్‌లో సీన్ రివర్స్ అయింది. గతేడాది ఐపీఎల్లో 16 ఇన్నింగ్స్‌లలో 330 పరుగులు చేసిన డీకే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో సాధించినవి కేవలం 83 పరుగులు. ఇప్పుడేమో తుస్ ఈ గణాంకాలను బట్టి దినేశ్ కార్తిక్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆర్సీబీకి బలంగా ఉన్న డీకే ఈసారి మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మరోవైపు ఆర్సీబీ భారమంతా విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మీదే పడుతోంది. కేజీఎఫ్‌పైనే భారం ప్రతిసారీ ఈ ముగ్గురిపైనే ఆధారపడటంతో వీరిలో ఒక్కరు విఫలమైనా ఆర్సీబీ విజయాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేజీఎఫ్ (కోహ్లి, గ్లెన్, ఫాఫ్) గనుక ఒకవేళ స్థాయికి తగ్గట్లు రాణించలేని పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆర్సీబీ యాజమాన్యం ప్రణాళికలు రచించుకోవాలి. వాళ్లు గనుక విఫలమై జట్టు కష్టాల్లో కూరుకుపోతే బాధ్యతను నెత్తినవేసుకోగల ఆటగాళ్లను తయారుచేసుకోవాలి. ఆ ప్లేయర్ దినేశ్ కార్తికా లేదంటే మహిపాల్ లామ్రోరా అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఆర్సీబీ మిడిలార్డర్ మాత్రం పూర్తి బలహీనంగా ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ముఖ్యంగా కార్తిక్ గత ఎనిమిది మ్యాచ్‌లలో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టు తనపై ఆధారపడొచ్చు అనే భరోసాను ఇవ్వలేకపోయాడు. మేనేజ్మెంట్ కచ్చితంగా ఈ బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలి’’ అని సూచించాడు. లేనిపక్షంలో భారీ మూల్యం తప్పదంటూ ఇర్ఫాన్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా గత మ్యాచ్‌లో సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. మే 1న లక్నోలో సూపర్ జెయింట్స్‌తో పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో గాయపడిన డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. చదవండి: Viral: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి! MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్‌ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్‌ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్‌సెంచరీ), వన్ డౌన్లో సన్‌రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్‌ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్‌లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్ కంటే హీనం.. పైగా ఆల్‌రౌండరట..!
IPL 2023 RCB VS KKR: ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్లో అతనాడిన 8 మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయకపోగా.. బ్యాటింగ్‌లో కేవలం 42 పరుగులు (10.50 సగటు, 107.69 స్ట్రయిక్ రేట్) మాత్రమే చేశాడు. ఈ సీజన్లో అతడి గణాంకాలు ఇలా ఉన్నాయి.. కేకేఆర్‌పై 1 (5), 0/25 (ఒక్క ఓవర్) ఢిల్లీపై 20 (12), 0/11 సీఎస్కేపై 12 (10) పంజాబ్‌పై 5 (3) రాజస్థాన్‌పై 2 (4) కేకేఆర్‌పై 2 (5), 0/6 ఈ దారుణ ప్రదర్శన నేపథ్యంలో షాబాజ్ అహ్మద్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. 2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా ఆడుతున్నాడంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. షాబజ్ను వెంటనే జట్టును తొలగించి, వేరే ఆటగాడిని రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతనితో పాటు దినేశ్ కార్తీక్‌ను కూడా వెంటనే జట్టు నుంచి తప్పించి, ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలని పట్టుబడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది కూడా తాము టైటిల్ గెలవలేమని అంటున్నారు. కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 26) జరిగిన మ్యాచ్‌లో షాబాజ్ ప్రదర్శన (1 (5), 0/25 (1)) గురించి ప్రస్తావిస్తే.. ఇలాంటి మహత్తరమైన ఆల్‌రౌండర్‌ను తాము జీవితంలో చూడలేదని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్ చేయడం ఎలాగూ రాదు, బౌలర్‌గా అయినా ఉపయోగపడతాడా అనుకుంటే, జేసన్ రాయ్ చేతిలో (ఒకే ఓవర్లో 4 సిక్సర్లు) బలైపోయాడని అంటున్నారు. చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు మొత్తంగా షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్‌ల కారణంగానే ఆర్సీబీ ఓటమిపాలవుతుందని మండిపడుతున్నారు. సొంత మైదానంలో వరుస ఓటములను జీర్ణించుకోలేక ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హర్యానాకు చెందిన 29 ఏళ్ల షాబాజ్ అహ్మద్‌ను (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్) 2023 ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ 2.4 కోట్టు పెట్టి సొంతం చేసుకుంది. 2020 సీజన్లో ఐపీఎల్ అరంగ్రేటం (ఆర్సీబీ తరఫున, ధర 20 లక్షలు) చేసిన షాబాజ్.. ఇప్పటివరకు ఆడిన 37 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ (17), మ్యాక్స్‌వెల్ (5) సహా అందరూ విఫలమయ్యారు. సిరాజ్ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) పర్వాలేదనిపించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: ఫినిషర్ పాత్రకు న్యాయం చేయకపోగా పనికిమాలిన రికార్డు -
అవమాన భారంతో తలెత్తుకోలేకపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. డీకే, షాబాజ్‌పై ఫైర్
సొంత మైదానంలో పరాజయాల (లక్నో, సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో) నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కారణంగా వారు తలెత్తుకోలుకపోతున్నారు. సొంత ఇలాకాలో ఇదేం కర్మ రా బాబు అనుకుంటూ అవమాన భారంతో కుంగిపోతున్నారు. సొంత జట్టుకే వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. KGFను (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్) మినహాయించి మిగతా ఆటగాళ్లందరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్‌లపై తారా స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరి వల్లే ఆర్సీబీ విజయాలకు దూరమవుతుందని మండిపడుతున్నారు. వీరు సరిగ్గా ఆడకపోగా.. ఇతరులను కూడా భ్రష్ఠుపట్టిస్తున్నారని (రనౌట్లు, మిస్ ఫీల్డింగ్‌లు, క్యాచ్‌లు జారవిడచడం వంటివి) తూర్పారబెడుతున్నారు. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. దినేశ్ కార్తీక్‌ను (18 బంతుల్లో 22, సుయాశ్ రనౌట్‌కు కారకుడు), షాబాజ్ అహ్మద్‌ను (5 బంతుల్లో 2, ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకున్నాడు) పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు వీరి వల్లే తాము సొంత మైదానంలో తలెత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక చాలు.. మీరు వెళ్లండ్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హర్షల్ పటేల్, సుయాశ్ ప్రభుదేశాయ్, విజయ్ కుమార్ వైశాఖ్లు కూడా తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలని, లేకపోతే స్వచ్ఛందంగా జట్టును తప్పుకోవాలని సూచిస్తున్నారు. పనిలో పనిగా సరైన జట్టును (దేశీయ ఆటగాళ్లను) ఎంపిక చేసుకోలేదని ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఆ నలుగురిని (KGF, సిరాజ్) తప్పిస్తే, ఐపీఎల్ చరిత్రలో ఇంత బలహీనమైన జట్టే ఉండదని అంటున్నారు. కాగా, చిన్న స్వామి స్టేడియంలో (బెంగళూరు) కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 26) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సిరాజ్ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) మినహాయించి ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమై ఓటమిపాలైంది. చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ (17), మ్యాక్స్‌వెల్ (5) సహా అందరూ విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: 'ఓటమికి అర్హులం.. ఫీల్డింగ్ వైఫల్యం కొంపముంచింది' -
ఫినిషర్ పాత్రకు న్యాయం చేయకపోగా పనికిమాలిన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో దినేశ్ కార్తిక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని కార్తిక్ తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ మరోసారి విఫలమయ్యాడు. 18 బంతుల్లో 22 పరుగులు చేసిన కార్తిక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫినిషర్ పాత్రకు న్యాయం చేయని దినేశ్ కార్తిక్ ఒక పనికిమాలిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రనౌట్లలో పాలుపంచుకున్న బ్యాటర్‌గా దినేశ్ కార్తిక్ తొలి స్థానంలో నిలిచాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సుయాష్ శర్మ వేసిన బంతిని కార్తిక్ డీప్ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన కార్తిక్ రెండో పరుగు కోసం యత్నించాడు. అయితే మిస్ కమ్యునికేషన్ వల్ల సుయాష్ ప్రభుదేశాయ్ ఆలస్యంగా స్పందించాడు. అప్పటికే బంతిని అందుకున్న అనుకుల్ రాయ్ సుయాష్‌కు త్రో వేయగా..అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో ప్రభుదేశాయ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే దినేశ్ కార్తిక్ ఐపీఎల్ చరిత్రలో 39వ రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. కార్తిక్ తర్వాతి స్థానంలో 37 రనౌట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉండగా.. 35 రనౌట్లతో ధోని మూడో స్థానంలో, 30 రనౌట్లతో రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. Dinesh Karthik The Greatest Finisher Will Finish RCB One Day 😭😂. pic.twitter.com/iGsxXmfERB — Aufridi Chumtya (@ShuhidAufridi) April 26, 2023 చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా -
PBKS Vs RCB: 'జట్టులో ఎందుకున్నాడో మరిచిపోయాడు.. గుర్తుచేయండి'
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కార్తిక్ ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సీజన్లో ఆరో మ్యాచ్ ఆడుతున్న కార్తిక్ వరుసగా 0,9,1*,0,28,7 పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌లు కలిపి కేవలం 45 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఇందులో ఒక మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి ఒక్క పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు.. కానీ మిగతా ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అసలు దినేశ్ కార్తిక్ ఆర్సీబీ జట్టులోకి వచ్చిందే ఫినిషర్ పాత్రలో. గత సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేసి మంచి ఫినిషర్‌గా గుర్తింపు పొంది ఏకంగా టి20 వరల్డ్‌కప్‌లోనే చోటు దక్కించుకున్నాడు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన కార్తిక్ పెద్దగా రాణించలేకపోయాడు. Photo: IPL Twitter కనీసం ఐపీఎల్లో అయినా తన ఫినిషర్ పాత్రను పోషిస్తాడనుకుంటే అదీ లేదు. సీఎస్కేతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో కార్తిక్ 14 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో చెలరేగి ఆర్సీబీని రేసులో ఉంచారు. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కార్తిక్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించినప్పటికి చివరి వరకు నిలబడలేకపోయాడు. ఫినిషర్ అంటే చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను పూర్తి చేయాలి. అది ఓటమి అయినా గెలుపు అయినా. కానీ కార్తిక్ ఆ సూత్రం మరిచిపోయాడు. టార్గెట్‌ను చేధించాలనే కోరికతో ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్‌ను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆర్సీబీ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యింది. Photo: IPL Twitter తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ కార్తిక్ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌లు 16 ఓవర్లలో 137/0తో మంచి ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఔటయ్యారు. ఈ దశలో ఆర్సీబీకి ఇంకా మూడు ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఫినిషర్ అనేవాడు ఆఖర్లో తక్కువ ఓవర్లుంటే హిట్టింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కార్తిక్ తాను ఫినిషర్ అన్న విషయమే మరిచిపోయి మెల్లిగా ఆడాడు. ఆడిన ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి అంటే పర్లేదు.. కానీ తొలి ఇన్నింగ్స్‌లో అలా ఉండదు. ఒత్తిడి ఉండదు కాబట్టి వచ్చిన బ్యాటర్లు యథేచ్చగా బ్యాట్ ఝులిపించే అవకాశం ఉంటుంది. కానీ కార్తిక్ మాత్రం అలా చేయలేకపోయాడు. దీంతో అభిమానులు కార్తిక్‌పై ట్రోల్స్ వర్షం కురిపించారు. ''కార్తిక్ తన రోల్ ఏంటో మరిచిపోయినట్లున్నాడు.. గుర్తుచేయాల్సిన అవసరం వచ్చింది..'' అంటూ కామెంట్ చేశారు. Dinesh Karthik in this IPL 2023 be like 😅#RCBvsPBKS #IPL2O23 #DK pic.twitter.com/iXMKyWgBsz — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 20, 2023 Dinesh Karthik in IPL 2023- 0 (3) 🦆 9 (8) 1*(1) 0 (1) 🦆 28 (14) 7 (5) 45 Runs 32 Balls 140.63 SR 9 Average 5 Single Digit Scores#RCBvsPBKS — Melon Rusk 😎 (@CricCrazyRaj) April 20, 2023 -
ధోని చేసిన తప్పు థర్డ్ అంపైర్‌కు కనిపించలేదా?
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని కీపింగ్‌లో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాటర్ బంతి మిస్ అయి క్రీజు దాటిన సెకన్ల వ్యవధిలోనే బెయిల్స్‌ను ఎగురగొట్టంలో ధోని ఘనాపాటి. తన స్టంపింగ్‌లతో ఎన్నోసార్లు మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. అలాంటి ధోని కీపర్‌గా చేసిన అతి పెద్ద తప్పును థర్డ్అంపైర్ గుర్తించలేకపోవడం ఆసక్తి కలిగించింది. ఇదంతా ఆర్సీబీ, సీఎస్కేల మధ్య మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15వ ఓవర్ జడేజా వేశాడు. ఓవర్ ఐదో బంతిని కార్తిక్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. బంతి అందుకున్న ధోని వెంటనే బెయిల్స్ ఎగురగొట్టాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించడం.. రిప్లేలో కార్తిక్ తన ఫుట్‌ను క్రీజులోనే ఉంచడంతో నాటౌట్ అని ప్రకటించడం జరిగిపోయాయి. కానీ అసలు సంగతి అది కాదు. Photo: IPL Twitter జడేజా బంతి వేయడం కార్తిక్ మిస్ చేసిన వెంటనే ధోని బంతిని అందుకున్నాడు. కానీ స్టంప్ లైన్‌కు ముందే బంతిని అందుకోవడం ధోని చేసిన పొరపాటు. నిబంధనల ప్రకారం బంతిని కీపర్ స్టంప్ లైన్ పాస్ అయిన తర్వాతే అందుకోవాలి. ఒకవేళ నిబంధన ఉల్లంఘిస్తే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. ధోని బంతిని స్టంప్‌లైన్ ముందే తీసుకోవడం క్లియర్‌గా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఈ విషయాన్ని గమనించలేదు. దీంతో ఆర్సీబీకి నోబాల్ అవకాశం మిస్ అయింది. ఒకవేళ థర్డ్ అంపైర్ దానిని నోబాల్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఎందుకంటే అప్పటికి కార్తిక్, షాబాజ్ అహ్మద్‌లు క్రీజులో ఉండడం.. ఇంకా ఐదు ఓవర్లు మిగిలే ఉన్నాయి. అలా ధోని చేసిన అతి పెద్ద తప్పును థర్డ్అంపైర్ గమనించకపోవడంతో ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ''థర్డ్ అంపైర్ సీఎస్కే తరపున అనుకుంటా.. అందుకే నోబాల్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే కచ్చితంగా ఆర్సీబీ గెలిచి ఉండేది'' అంటూ మండిపడ్డారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పరుగుల జడివాడలో సీఎస్కే కేవలం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవన్ కాన్వే 83, శివమ్ దూబే 52, అజింక్యా రహానే 37 రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఆరంభంలోనే కోహ్లి రూపంలో షాక్ తగిలినప్పటికి డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు సునామీ సృష్టించడంతో లక్ష్యం దిశగా సాగింది. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు వెనుదిరగడంతో ఆర్సీబీ ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత వచ్చిన కార్తిక్, సుయాశ్ ప్రభుదేశాయ్‌లు ధాటిగా ఆడినప్పటికి జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. చివరకు ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. Did anyone feel that that was a no ball. Ball collection seemed like it was before the stump line #CSKvRCB #IPL2023 — Hemang Badani (@hemangkbadani) April 17, 2023 Look where dhoni collected the ball It was clearly no ball 😭😭😭 pic.twitter.com/rJCrrsfPOe — Chiku (@Kohliisgoat) April 17, 2023 -
IPL 2023: దినేశ్ కార్తిక్ డకౌట్.. ఇంకోసారి ఇలా చేస్తే! ధోని ఫ్యాన్స్ ఫైర్
IPL 2023- Royal Challengers Bangalore vs Delhi Capitals: టీమిండియా వెటరన్ బ్యాటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ గతేడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. కీలక సమయంలో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడి విలువైన ఆటగాడిగా నిరూపించుకున్నాడు. అనేక సందర్భాల్లో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. అప్పుడలా ఐపీఎల్-2022 సీజన్లో మొత్తంగా 16 మ్యాచ్‌లలో కలిపి 330 పరుగులు సాధించిన డీకే.. జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో చాలా మంది ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను మాజీ సారథి, టీమిండియా అత్యుత్తమ ఫినిషర్‌తో మహేంద్ర సింగ్ ధోనితో పోలుస్తూ కామెంట్లు చేశారు. ఇప్పుడిలా ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లోనూ గత ఎడిషన్ మాదిరే మెరుపులు మెరిపిస్తాడని భావించిన అభిమానులకు మాత్రం పూర్తి నిరాశను మిగిల్చాడు దినేశ్ కార్తిక్. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 4 మ్యాచ్‌లు ఆడిన డీకే చేసిన మొత్తం పరుగులు 10(0, 9, 1, 0). ఢిల్లీ క్యాపిటల్స్‌తో సొంతమైదానంలో మ్యాచ్‌లో డీకే మరోసారి డకౌట్ కావడంతో అతడిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో శనివారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ధోని ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే ఈ నేపథ్యంలో డీకే వరుస వైఫల్యాలను ఎండగడుతూ నెట్టింట భారీ ఎత్తున అతడిపై ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘అంచనాలు అందుకోలేకపోతున్నావు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సార్లు డకౌట్ అయింది నువ్వే. వెళ్లి కామెంట్రీ చెప్పుకో పో! అయినా చాలా మంది డీకేను ధోనితో పోల్చారు కదా!దయచేసి ఇప్పటికైనా అలా చేయడం మానేయండి. లేదంటే అలాంటి వాళ్లను జైళ్లో పడేయాలి. ధోని వరస్ట్ సిట్యుయేషన్ కూడా డీకే బెస్ట్ కంటే మెరుగ్గానే ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి’’ అని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ డకౌట్‌తో డీకే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు(15) అవుటైన బ్యాటర్‌గా మన్దీప్ సింగ్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. చదవండి: చెత్తగా ఆడుతున్నావు.. మారవా ఇక? వెంటనే అతడిని తప్పించి! వీడియో వైరల్ టీమిండియాకు శుభవార్త.. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు బిగ్‌బూస్ట్! బీసీసీఐ కీలక ప్రకటన Dinesh Karthik in IPL2023 So far 0(3) 9(8) 1(1)* 0(1) Those who compare me with Dhoni should be jailed. pic.twitter.com/lowdzlkoTz — ` (@kurkureter) April 15, 2023 Most ducks in IPL 15 - Dinesh Karthik 14 - Rohit Sharma pic.twitter.com/jyBJAdtX8D — ` (@rahulmsd_91) April 15, 2023 15th duck for Dinesh Karthik in IPL, equal with Mandeep Singh for most ducks in IPL history. Most ducks in IPL: 15 - Mandeep 15 - Dinesh Karthik 14 - Rohit 14 - Narine #RCBvDC #TATAIPL2023 — Bharath Seervi (@SeerviBharath) April 15, 2023 Back to winning ways 🙌@RCBTweets register a 23-run win at home and clinch their second win of the season 👏👏 Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/5lE5gWQm8H — IndianPremierLeague (@IPL) April 15, 2023 -
ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టోయినిష్((30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్(19 బంతుల్లో 62, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నోను గెలుపుకు దగ్గరగా తీసుకు వెళ్లారు. అయితే హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. తొలి బంతికి ఉనద్కట్ సింగిల్ తీశాడు. అనంతరం రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో లక్నో విజయ సమీకరణం రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతికి బిష్ణోయ్ సింగిల్ తీసి ఉనద్కట్ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్ ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ, లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్సీబీ కొంపముంచిన డికే ఈ సమయంలో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చేసిన తప్పిదం ఆర్సీబీ కొంపముంచింది. హర్షల్ పటేల్ ఆఖరి బంతిని లో ఫుల్ టాస్‌గా సంధించాడు. స్ట్రైక్‌లో ఉన్న అవేష్ ఖాన్ బంతిని అంచన వేయడంలో విఫలమయ్యాడు. బ్యాట్‌కు బంతి తగలకపోయినా అవేష్ ఖాన్ బై రన్ కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో బంతిని అందుకోవడంలో దినేష్ కార్తీక్ విఫలమయ్యాడు. ఒక వేళ కార్తీక్ బంతిని అందుకుని రనౌట్ చేసి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసుండేది. కార్తీక్ బంతిని అందుకుని రనౌట్ చేయడంలో విఫలమకావడంతో లక్నో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2023 LSG vs RCB: చరిత్ర సృష్టించిన పూరన్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్ Drama at the Chinnaswamy, a last-ball THRILLER 🤯#IPLonJioCinema #IPL2023 #TATAIPL #RCBvLSG | @LucknowIPL pic.twitter.com/AIpR9Q4gFB — JioCinema (@JioCinema) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
ప్రతిసారీ వాళ్లమీదే ఆధారపడితే ఎలా? బెటర్ ఆప్షన్ ఉంటే అతడి స్థానంలో..
IPL 2023 KKR Vs RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ప్రతిసారీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్పై ఆధారపడటం సరికాదంటూ చురకలు అంటించాడు. మిగతా వాళ్లు కూడా కాస్త బ్యాట్ ఝులిపించాలంటూ హితబోధ చేశాడు. ముఖ్యంగా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తమ వంతు పాత్ర పోషించాలని వీరూ భాయ్ సూచించాడు. ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 81 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో సొంత మైదానంలో 204 పరుగులు స్కోరు చేసింది. అంతా చేతులెత్తేశారు లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి శుభారంభం అందించిన ఓపెనర్లు విరాట్ కోహ్లి (21), ఫాఫ్ డుప్లెసిస్ (23) త్వరగానే పెవిలియన్ చేరడంతో కష్టాలు మొదలయ్యాయి. వన్‌డౌన్‌లో వచ్చిన మైకేల్ బ్రేస్‌వెల్ 19 పరుగులు చేయగా.. గ్లెన్ మాక్స్వెల్(5) పూర్తిగా నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ స్కోర్లు ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన హర్షల్ పటేల్(0), షాబాజ్ అహ్మద్ (1), దినేశ్ కార్తిక్ (9), అనూజ్ రావత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన పేస్ ఆల్‌రౌండర్ 20 పరుగులతో అజేయంగా నిలవగా.. ఆకాశ్ దీప్ 17 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో 123 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్సీబీ పదహారో ఎడిషన్‌లో తొలి పరాజయం నమోదు చేసింది. డీకే, మాక్సీ ఏం చేస్తున్నారు? ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘ప్రతిసారి ఇద్దరు ఆటగాళ్ల మీద ఆధారపడటం సరికాదు. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ రాణిస్తే మాత్రమే ఆర్సీబీ గెలుస్తుందనిపిస్తోంది. ఇలా జరుగకూడదు కదా! గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ కూడా పరుగులు సాధించాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అనూజ్ రావత్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్సీబీ ఇప్పటికైనా అతడి కంటే బెటర్ ఆప్షన్ ఉంటే చూసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా మంచే జరిగింది ‘‘ఏదేమైనా టాపార్డర్ విఫలమైతే, బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైతే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే జట్లన్నింటికీ అవగతమే. గతంలో ఎన్నోసార్లు ఆయా జట్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాయి. ఈసారి ఆర్సీబీకి రెండో మ్యాచ్‌లోనే ఇలా జరగడం మంచిదైంది. ఒకవేళ 8-9 మ్యాచ్‌ల తర్వాత ఇలా జరిగి ఉంటే కష్టమైపోయేది. ఆదిలోనే లోపాలు సరిదిద్దుకుంటే మిగతా మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణించే అవకాశాలు ఉంటాయి’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో! ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే A memorable first victory of #TATAIPL 2023 at home.@KKRiders secure a clinical 81-run win over #RCB ⚡️⚡️ Scorecard - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/0u57nKO57G — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
కార్తిక్ తెలివికి కెప్టెన్ డుప్లెసిస్ ఫిదా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అనుభంలో మరోసారి మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ నితీశ్ రాణా ఔట్ విషయంలో దినేశ్ కార్తిక్ చూపించిన స్మార్ట్‌నెస్‌కు అభిమానులు ముగ్దులయ్యారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మైకెల్ బ్రాస్‌వెల్ వేశాడు. ఓవర్ తొలి బంతిని నితీశ్ రానా రివర్స్‌స్వీప్‌కు యత్నించాడు. అయితే బంతి గ్లోవ్స్‌కు తాకి కీపర్ కార్తిక్ చేతుల్లో పడింది. అయితే బ్రాస్‌వెల్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. ఇక్కడే కార్తిక్ తన తెలివిని ఉపయోగించాడు. ఎల్బీకి కాకుండా క్యాచ్ అప్పీల్ కోసం రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి గ్లోవ్స్‌ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నితీశ్ రానా ఔటైనట్లు ప్రకటించాడు. రివ్యూ విషయంలో కార్తిక్ స్మార్ట్‌గా వ్యవహరించడంతో సహచరుల చేత అభినందనలు అందుకున్నాడు. అటు అభిమానులు కూడా ''కీపింగ్‌లో అనుభవం.. ఆ మాత్రం ఉంటుందిలే.. నీ కాన్ఫిడెంట్‌కు ఫిదా కార్తిక్'' అంటూ కామెంట్ చేశారు. -
ఏంటి సిరాజ్ ఇది.. కొంచెం చూసి వెళ్లవచ్చు కదా! పాపం కార్తీక్! వీడియో వైరల్
ఐపీఎల్-2023 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా ఆరంభించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధిచింది. 172 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి కేవలం 16.2 ఓవర్లలోనే ఆర్సీబీ ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(82 నాటౌట్), కెప్టెన్ డుప్లెసిస్(73) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. కార్తీక్, సిరాజ్ ఢీ.. ఈజీ క్యాచ్ డ్రాప్ కాగా ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఒకరినొకరు ఢీకొని.. రోహిత్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశారు. ముంబై ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో సిరాజ్ వేసిన ఐదో బంతికి రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని 30 యార్డ్ సర్కిల్లో గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ కార్తీక్ కాల్ ఇచ్చి బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే సిరాజ్ కార్తీక్ ఇచ్చిన సిగ్నిల్ను చూడకుండా క్యాచ్‌ను పట్టేందుకు వికెట్ కీపర్ వైపు వచ్చాడు. ఈ క్రమంలో కార్తీక్‌ను సిరాజ్ బలంగా ఢీకొనున్నాడు. దీంతో క్యాచ్ నేలపాలు అయింది. అయితే వీరిద్దరూ ఒకరినొకరు బలంగా ఢీకొనడంతో కాసేపు మైదానంలో నొప్పితో విలవిల్లాడారు. అనంతరం ఫిజియో వచ్చి చికిత్స అందించగా వీరిద్దరూ ఎవరు స్థానాలకు వారు వెళ్లారు. కాగా వాస్తవానికి అది కార్తీక్ అందుకోవాల్సిన క్యాచ్. కానీ సిరాజ్ మాత్రం ఎటువంటి కాల్ ఇవ్వకుండా క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేసి క్యాచ్ డ్రాప్ అవ్వడానికి కారణమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తరువాతి ఓవర్ మొదటి బంతికే రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. చదవండి: IPL 2023 RCB Vs MI: వారెవ్వా తిలక్.. ధోనిని గుర్తు చేస్తూ హెలికాప్టర్ షాట్! వీడియో వైరల్ pic.twitter.com/C1JqWbnRyt — Main Dheet Hoon (@MainDheetHoon69) April 2, 2023 -
ఐపీఎల్‌కు ముందు దినేష్ కార్తీక్‌కు బంపరాఫర్.. ఒకే ఒక్కడు!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు బంపరాఫర్ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం కార్తీక్‌కు దక్కింది. ఈ ఏడాది జరగనున్న ఈ సిరీస్ కోసం స్కై క్రికెట్ ఛానెల్ తరఫున కార్తీక్ కామెంట్రీ బాక్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని డీకేనే స్వయంగా వెల్లడించాడు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో కార్తీక్‌తో పాటు ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, రిక్కీ పాంటింగ్, మార్క్ టేలర్, కుమార సంగక్కర, మెల్ జోన్స్, ఇయాన్ వార్డ్, నాసీర్ హుస్సేన్, అథెర్టన్, మార్క్ బౌచర్, ఆండ్రూ స్ట్రాస్ వాఖ్యతలగా వ్యవహరించనున్నారు. కాగా భారత్ నుంచి ఈ సిరీస్‌లో కామెంట్రీ చేయబోతున్నది కార్తీక్ ఒక్కడే కావడం విశేషం. "ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు ఓ బిగ్న్యూస్ను షేర్ చేయడానికి సిద్దమయ్యాను. 2023 యాషెస్ కామెంట్రీ ప్యానెల్లో నేను భాగంగా కానున్నాను. దిగ్గజాలతో కలిసి వాఖ్యతగా వ్యవహరించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కై క్రికెట్‌కు ధన్యవాదాలు" అని కార్తీక్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కూడా కార్తీక్ వాఖ్యతగా వ్యవహరించాడు. ఇక జాతీయ జట్టులో కోల్పోయి కామేంటేటర్‌గా అవతారమెత్తిన డీకే.. ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు. కార్తీక్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో ఫినిషర్‌గా కార్తీక్ అదరగొట్టాడు. ఇక ఐపీఎల్-2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరు వేదికగా ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ దూరం! కెప్టెన్‌గా సూర్యకుమార్ One MASSIVE announcement before the IPL as a player starts... So proud to be amongst these legends. Surreal feeling. Just felt like sharing! Bas. That's all 😊☺️ Thanks @SkyCricket for giving me this opportunity and honour. #Ashes2023 pic.twitter.com/bnYyLDOV0E — DK (@DineshKarthik) March 30, 2023 -
'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా అత్యుత్తమ ఆటగాడు'
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్దమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది భారత ఆటగాళ్లు ఆయా జట్లతో చేరారు. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ ఏడాది సీజకు ప్రారంభానికి ముందు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ఆర్సీబీ ఆటగాడు దినేష్ కార్తీక్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గోన్నాడు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీకు ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడు ఎవరన్న ప్రశ్న కార్తీక్‌కు ఎదురైంది. టీమిండియాలో హార్దిక్ పాండ్యా అత్యంత ముఖ్యమైన ఆటగాడు అంటూ కార్తీక్ బదులిచ్చాడు. "ప్రస్తుత భారత జట్టులో హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడు. ఎందుకంటే హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించగలడు. పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. భారత జట్టులో ఇద్దురు ముగ్గరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్లు చాలా అరుదుగా ఉంటారు. వారిలో హార్దిక్ ఒకడు. పాండ్యా మిడిలార్డర్లో చాలా ముఖ్యమైన ఆటగాడు. చాలా మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఇక బౌలింగ్‌లో కూడా చాలా తెలివగా వ్యవహరిస్తాడు. ఎక్కువ షార్ట్ బాల్స్ వేసి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ఆస్ట్రేలియా సిరీస్ ఆఖరి వన్డే మిచిల్ మార్ష్‌ను ఓ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అదేవిధంగా ట్రావిస్ హెడ్‌ని కూడా పుల్ షాట్ ఆడించి వికెట్ కోల్పోయేలా చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు భారత జట్టుకు చాలా అవసరం. అతడు జట్టులో లేకపోతే టీమిండియా రాణించడం చాలా కష్టం" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: మరో కొత్త అవతారమెత్తనున్న బాలయ్య.. ఐపీఎల్ కామెంటేటర్‌గా..! -
పాపం సూర్య! అందరూ తననే అంటున్నారు.. అతడి తప్పేం లేదు! అంతా..
India vs Australia, 2nd ODI- Suryakumar Yadav: ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని చెప్పవచ్చు. ఇలాంటి అత్యుత్తమ పేసర్ల బౌలింగ్‌లో అవుటైన బ్యాటర్‌ను మరీ అంతగా విమర్శించడం సరికాదు’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ది వేరే లెవల్ అంటూ ఆకాశానికెత్తాడు. టీమిండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చాడు. రోహిత్ శర్మ(13), శుబ్‌మన్ గిల్(0), సూర్యకుమార్ యాదవ్(0), కేఎల్ రాహుల్(9) వంటి కీలక బ్యాటర్ల వికెట్లు తీశాడు. ఆఖర్లో సిరాజ్(0) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌ను గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పాపం సూర్యకుమార్.. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మొదటి వన్డేలో కూడా స్టార్క్ చేతికే చిక్కిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో కూడా మరోసారి స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్ సూర్యకు అండగా నిలిచాడు. ‘‘పాపం సూర్యకుమార్ యాదవ్.. రెండుసార్లు మొదటిబంతికే వెనుదిరిగాడు. దీంతో చాలా మంది.. ‘‘వచ్చిన అవకాశాలను సూర్య సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు’’ అని ఘాటుగా విమర్శిస్తున్నారు. నిజానికి తన తప్పేమీ లేదు. మొదటి బంతికే అవుటవడం అంటే క్రీజులో కుదురుకునే అవకాశం కూడా రాలేదని అర్థం. అలాంటపుడు ఏ బ్యాటర్‌కైనా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. వాళ్ల స్టైలే వేరు! స్టార్క్ లాంటి అత్యుత్తమ బౌలర్లు తమ అద్భుత నైపుణ్యాలతో బ్యాటర్‌ను బోల్తా కొట్టించగలరు’’ అని డీకే క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఫాస్ట్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది, కివీస్ స్టార్ ట్రెంట్‌బౌల్ట్ స్టైలే వేరని.. వారిని ఎదుర్కోవడం అంత సులువుకాదని పేర్కొన్నాడు. అలాంటి వారు పటిష్ట టీమిండియాతో ఆడే ఛాన్స్ వచ్చినపుడు మరింతగా రెచ్చిపోతారని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగనుంది. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం Temba Bavuma: సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు -
WTC Final: అశ్విన్ లేదా జడేజా.. ఇద్దరిలో ఒక్కరికే తుదిజట్టులో చోటు!
WTC Final- India Vs Australia: ‘‘గతంలోనే తుది జట్టు ఎంపిక విషయంలో మేనేజ్మెంట్ తప్పు చేసింది. ఇద్దరు స్పిన్నర్లను ఆడించి మూల్యం చెల్లించింది. అక్కడ ఆడాల్సింది ఒకే ఒక్క మ్యాచ్. కాబట్టి జట్టు ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్లో ఆఖరి మ్యాచ్ అయినందున చాలా మంది ఆటగాళ్లకు కూడా అదే చివరి మ్యాచ్ అవుతుంది. కాబట్టి తుది జట్టు కూర్పుపై స్పష్టత ఉంటేనే అత్యుత్తమ టీమ్ ఎంపిక సాధ్యమవుతుంది. గతంలో మాదిరి ఈసారి పొరపాట్లు దొర్లకుండా ఉండాలంటే అశ్విన్ లేదంటే జడేజాలలో ఎవరో ఒకరిని తప్పించాలి. నా అభిప్రాయం ప్రకారం వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంటే కచ్చితంగా జడేజా వైపే మొగ్గు ఉంటుంది. ఎందుకంటే అతడు అశ్విన్ కంటే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు. ఇక వీళ్లిద్దరు ఫిట్‌గా ఉన్నారంటే అక్షర్ పటేల్‌కు కచ్చితంగా జట్టులో స్థానం దక్కదు. నాకు తెలిసి అతడికి బదులు శార్దూల్ జట్టులోకి వస్తాడు’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. అక్షర్‌కు నో చాన్స్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత తుది జట్టు కూర్పుపై ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ కంటే రవీంద్ర జడేజాకే తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఇక మరో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు జట్టులో స్థానం దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలవడంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో అశ్విన్, జడ్డూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. అక్షర్ బ్యాట్ ఝులిపించి రోహిత్ సేన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకున్న టీమిండియా ఇంగ్లండ్ వేదికగా జూన్ 7- 11 వరకు టెస్టు మ్యాచ్ ఆడనుంది. కాగా విదేశాల్లో.. ముఖ్యంగా పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తుదిజట్టులో సీమర్లకే అవకాశాలు ఎక్కువన్న నేపథ్యంలో డీకే ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నంబర్ 1 అశూ, జడ్డూ ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అశ్విన్, జడేజా ఇద్దరూ ఆడారు. అశూ 4 వికెట్లు తీసి 29 పరుగులు చేయగా.. 31 పరుగులు చేసిన జడ్డూ.. ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బౌలర్ల జాబితాలో నంబర్1గా ఉండగా.. జడ్డూ ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: LLC 2023: క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్ WPL 2023: హమ్మయ్య,.. మొత్తానికి ఆర్సీబీ గెలిచింది -
'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్‌లో అదరగొడతాడు'
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తాడని కార్తీక్ కొనియాడు. కాగా గత కొంత కాలంగా సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ హైదారాబాదీ ప్రస్తుతం వన్డేల్లో ప్రపంచ నెం1 బౌలర్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నడు. మొదటి టెస్టులో మహమ్మద్ సిరాజ్ తన స్పెల్‌తో ఆసీస్‌కు చుక్కలు చూపించాడు. ఇక రెండో టెస్టులో స్పిన్నర్లు చెలరేగడంతో సిరాజ్‌కు బౌలింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో కార్తీక్ క్రిక్‌బజ్ షో రైజ్ ఆఫ్ న్యూ ఇండియాలో మాట్లాడుతూ.. "సిరాజ్ వన్డే ప్రపంచకప్ భారత జట్టులో ఖచ్చితంగా భాగమవుతాడు. అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మెగా ఈవెంట్లో అదరగొడతాడని భావిస్తున్నాను. అయితే గతేడాది ఐపీఎల్ సీజన్ అతడికి చాలా విషయాలు నేర్పించింది. వైఫల్యాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నాడు. అదే విధంగా అతడు పూర్తి ఫిట్నెస్తో తన కెరీర్‌ను కొనసాగిస్తే.. కనీసం 300 టెస్టు వికెట్లు అయినా సాధిస్తాడు" అని కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం! -
త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌కు భారీ ధర.. వాషింగ్టన్ సుందర్‌కు నామమాత్రపు రేట్
TNPL 2023 Auction: ప్రాంతీయ క్రికెట్ టోర్నీ అయిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ఆరు ఎడిషన్లు పూర్తి చేసుకుని ఏడవ ఎడిషన్‌ను సిద్ధమవుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహకులు తొలిసారి ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరుగబోయే ఈ వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు సొంతం చేసుకుంది. వేలంలో పై పేర్కొన్న ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. సాయ్ కిషోర్, సాయ్ సుదర్శన్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, మురుగన్ అశ్విన్.. ఇలా దేశవాలీ స్టార్లు చాలా మంది వేలంలో పాల్గొంటున్నారు. కాగా, ఈ వేలంలో ప్రతి జట్టు కనిష్టంగా 16 మందిని, గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లీగ్‌లో పాల్గొనే 8 జట్లు ఇద్దరు ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫ్రాంచైజీల గరిష్ఠ పర్సు విలువ 70 లక్షలుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్లను నాలుగు కేటగిరీలు విభజించిన నిర్వహకులు.. ఏ కేటగిరి (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 10 లక్షలు, బి కేటగిరి (సీనియర్ బీసీసీఐ దేశవాలీ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 6 లక్షలు, సి కేటగిరి (పై రెండు కేటగిరిల్లో లేకుండా, కనీసం 30 TNPL మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 3 లక్షలు, డి కేటగిరి (ఇతర ఆటగాళ్లు) ఆటగాళ్లకు 1.5 లక్షల చొప్పున బేస్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చేపక్ సూపర్ గిల్లీస్ (ఎన్ జగదీశన్) నెల్లై రాయల్ కింగ్స్ (అజితేశ్, కార్తీక్ మణకందన్) ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ (తుషార్ రహేజా) లైకా రోవై కింగ్స్ (షారుక్ ఖాన్, సురేశ్ కుమార్) దిండిగుల్ డ్రాగన్స్ (రవిచంద్రన్ అశ్విన్) రూబీ త్రిచీ వారియర్స్ (ఆంటోనీ దాస్) సేలం స్పార్టన్స్ (గణేశ్ మూర్తి) మధురై పాంథర్స్ (గౌతమ్) -
అతడిని జట్టు నుంచి తప్పించే పరిస్థితి.. కానీ కోహ్లి వల్లే ఇలా: డీకే
Virat Kohli: ‘‘అచ్చం తన పెద్దన్నలాగే.. అతడికి కోహ్లి అండగా నిలబడ్డాడు. అందుకే అతడు తనని మార్గదర్శిగా భావిస్తాడనుకుంటా. క్లిష్ట పరిస్థితుల్లో విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచాడు. కోహ్లి సారథ్యంలో అతడికి సరైన సమయంలో అవకాశాలు లభించాయి. అందుకే కోహ్లిని తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తాడు. నిజానికి తన కెరీర్లో అతడికి సహకరించిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు కోహ్లి. మరొకరు భరత్ అరుణ్. బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్ అరుణ్ అతడికి ఎల్లప్పుడూ సరైన దారిలో పయనించేలా మార్గదర్శనం చేశాడు. తన కెరీర్లో అతడి పాత్ర కూడా కీలకం. కోచ్‌గా అరుణ్ తన బాధ్యతను నెరవేరిస్తే.. కెప్టెన్‌గా కోహ్లి అతడికి అండగా నిలిచి ఉన్నత స్థితికి చేరుకునేలా సహాయం అందించాడు.. టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్న మహ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుతూ.. వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కోహ్లితో ప్రత్యేక అనుబంధం హైదరాబాదీ సిరాజ్ ఎదుగుదలలో టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ జట్టుకు ఆడుతున్న సిరాజ్‌కు కోహ్లితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక ఆదిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి సత్తా చాటిన సిరాజ్ 2017లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం విదితమే. కివీస్‌తో రెండో టీ20 ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో దారుణంగా అయితే, తన తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని కేవలం ఒకే వికెట్ తీసి తీవ్ర విమర్శల పాలయ్యాడు సిరాజ్. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 40 పరుగుల తేడాతో గెలుపొందడంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. నాటి మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి(65), వికెట్ కీపర్ ఎంఎస్ ధోని (49) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అయినప్పటికీ.. కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైన భారత బౌలర్లపై మండిపడ్డారు ఫ్యాన్స్. దీంతో జట్టులో సిరాజ్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో.. 2020 ఐపీఎల్లో తన ప్రదర్శన కారణంగా ఆర్సీబీ జట్టులోనూ స్థానం కోల్పోయే ప్రమాదం ఏర్పడినపుడు కోహ్లి అతడికి అండగా నిలబడ్డ విషయాన్ని డీకే తాజాగా ప్రస్తావించాడు. సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి క్రిక్‌బజ్.. ‘రైజ్ ఆఫ్ న్యూ ఇండియా’ షోలో మాట్లాడుతూ.. ‘‘నిజానికి ఆరోజు సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించాల్సింది. కానీ విరాట్ కోహ్లి అతడికి అండగా నిలబడ్డాడు. తుదిజట్టులో అతడు ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. 2020లో ఆర్సీబీతో మ్యాచ్.. నేను కేకేఆర్ జట్టులో ఉన్నాను. నాటి మ్యాచ్‌లో కేకేఆర్ 100లోపే ఆలౌట్ అయింది. సిరాజ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. దినేశ్ కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక అప్పటి నుంచి అతడి టీ20 కెరీర్ ఊపందుకుంది. నిజంగా సిరాజ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా నాటి మ్యాచ్‌లో కేకేఆర్ 84 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తనపై కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న సిరాజ్ మూడు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక డీకే కూడా ప్రస్తుతం ఆర్బీసీకి ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Aus ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ T20 WC 2023: ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? టీమిండియా పటిష్ట జట్టు: ఆసీస్ కెప్టెన్ -
దినేష్ కార్తీక్ ముందే పసిగట్టాడా? ఆసీస్ కుప్పకూలుతుందని..
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. కేవలం రెండునర్న రోజుల్లోనే మ్యాచ్‌ను భారత్ ఫినిష్ చేసింది. ఒక సెషన్లోనే ఆస్ట్రేలియా పేకమేడలా కుప్పకూలింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఆస్ట్రేలియా కేవలం ఒకే సెషన్లోనే కుప్పకూలుతుందని భారత వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ ముందే ఊహించాడు. రెండో రోజు ఆట అనంతరం క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన కార్తీక్‌కు, ప్రముఖ వాఖ్యత హార్షా బోగ్లే నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఆస్ట్రేలియా అద్భతమైన పునరాగమనం చేసింది, భారత్ ముందు ఎంత లక్ష్యాన్ని ఉంచలగలదు అని కార్తీక్‌ను బోగ్లే ప్రశ్నించాడు. దానికి బదులుగా కార్తీక్.. ఆసీస్ టీమిండియా ముందు 120 నుంచి 130 పరుగుల టార్గెట్ ఉంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు లేదని సమాధానమిచ్చాడు. కార్తీక్ ఊహించినట్లగానే ఆస్ట్రేలియా మూడో రోజు ఆట సందర్భంగా తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే చాప చుట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిక్‌బజ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vsAUS: ఓటమి బాధలో ఉన్న ఆసీస్‌కు గుడ్‌న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు You know the finisher DK 🔥 You know weatherman DK 🌦 PRESENTING, NOSTRADAMUS @DineshKarthik 🔮 #INDvAUS pic.twitter.com/m4TAFgN5MQ — Cricbuzz (@cricbuzz) February 19, 2023 -
ఐపీఎల్ మూడ్‌లోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్డ్ హిట్టర్ దినేశ్ కార్తీక్.. ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందే ఆ మూడ్‌లోకి వచ్చాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం ఉంటున్న డీకే.. డీవై పాటిల్ టీ20 కప్-2023 సూపర్ లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆర్బీఐతో జరిగిన మ్యాచ్‌లో డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు తరఫున బరిలోకి దిగిన డీకే.. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 75 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన డీకే.. పూనకం వచ్చినట్లు ఊగిపోయి, ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీ.. డీకే తదితర ఐపీఎల్ క్రికెటర్లకు బాగా ఉపయోగపడనుంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించగా.. ఛేదనలో ఆర్బీఐ టీమ్ కోటా ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమై 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డీవై పాటిల్ ఇన్నింగ్స్‌లో దినేశ్ కార్తీక్ (75 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. హార్ధిక్ తామోర్ (28), యశ్ ధుల్ (29), శశాంక్ సింగ్ (23) ఓ మోస్తరుగా రాణించారు. ఆర్బీఐ బౌలర్లలో అలీ ముర్తుజా 2, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్‌పుత్, సాయన్ మొండల్ చెరో వికెట్ పడగొట్టారు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్బీఐ.. బల్తేజ్ సింగ్ (3/33), వినీత్ సిన్హా (3/34), సాగర్ ఉదేశీ (1/24) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్బీఐ ఇన్నింగ్స్‌లో సుమిత్ (49), జ్యోత్ (35), రాజేశ్ బిష్ణోయ్ (33) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాగా, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
BGT 2023: నాకూ ఇలాగే జరిగింది.. టాయిలెట్లోకి వెళ్లి ఏడ్వటమే..!
India vs Australia Test Series 2023: ‘‘తదుపరి టెస్టులో తనని తప్పిస్తారని అతడికి తెలుసు. కేవలం ఒకటో రెండో ఇన్నింగ్స్ కారణంగా అతడిపై వేటు పడటం లేదు.. గత ఐదారు మ్యాచ్‌లలో విఫలమైన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న విషయాన్ని గ్రహించాలి. అతడు వరల్డ్‌క్లాస్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్. కానీ ప్రస్తుతం అతడి ఆటలో సాంకేతిక లోపాలు ఉన్నాయి. తనకి కాస్త విరామం కావాలి. విశ్రాంతి తీసుకున్న తర్వాత వన్డేలకు ఫ్రెష్‌గా తిరిగి రావాలి’’ అని టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. దారుణ వైఫల్యం 8, 12, 10, 22, 23, 10, 2, 20, 17, 1.. గత పది టెస్టు మ్యాచ్‌లలో ఓపెనింగ్ బ్యాటర్ రాహుల్ నమోదు చేసిన స్కోర్లు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను కాదని తనకు అవకాశమిచ్చిన మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కర్ణాటక బ్యాటర్‌ను వైస్ కెప్టెన్సీ హోదా నుంచి తొలగించినట్లు సంకేతాలు ఇచ్చింది బీసీసీఐ. మూడో టెస్టులో అతడికి ఉద్వాసన పలకనున్నట్లు హింట్ ఇచ్చింది. టాయ్లెట్లోకి వెళ్లి ఏడ్వడమే ఈ క్రమంలో దినేశ్ కార్తిక్ క్రిక్‌బజ్ షోలో కేఎల్ రాహుల్ అవకాశాల గురించి ఈ మేరకు స్పందించాడు. ‘‘ఇది ప్రొఫెషనల్ వరల్డ్. ఇక్కడ మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓ ఆటగాడిగా వీటన్నింటికీ సిద్ధపడాలి. ఎప్పుడైతే మరీ తక్కువ స్కోరుకే చెత్త షాట్ సెలక్షన్ కారణంగా అవుట్ అవుతామో.. అప్పుడు బాధ తప్పదు. నా విషయంలోనూ ఇలా జరిగింది. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన తర్వాత.. టాయ్‌లెట్‌కి వెళ్లి కన్నీటి చుక్కలు రాల్చాను. అంతకంటే చేసేదేమీ ఉండదు కదా! ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని డీకే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాహుల్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడని.. మూడో టెస్టులో తన ఓటు శుబ్‌మన్ గిల్‌కే వేస్తానని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌కు రాహుల్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకునే అర్హత ఉందని అభిప్రాయపడ్డాడు. చదవండి: Joe Root: 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' Suryakumar Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్ -
క్రికెటర్ మనసు దోచుకున్న మల్లికా సాగర్
ముంబై వేదికగా సోమవారం జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో మొత్తంగా 87 మంది క్రికెటర్లు అమ్ముడు పోయారు. క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ.59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా నిలిచింది. మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 3.2 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గార్డనర్ నిలిచింది. ఈ సంగతి పక్కనబెడితే.. తొలిసారి నిర్వహించిన వుమెన్స్ ప్లేయర్ల వేలంలో మల్లికా సాగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొట్టతొలి వేలాన్ని నిర్వహించేందుకు మల్లికా సాగర్ అద్వానీ అనే యువతిని బీసీసీఐ ప్రత్యేకంగా నియమించిన సంగతి తెలిసిందే. తన వాక్చాతుర్యం, అందంతో అందరిని ఆకట్టుకున్న మల్లికా సాగర్‌పై టీమిండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ''మల్లికా సాగర్ ఒక టెర్రిఫిక్ ఆక్షనీర్. తాను ఏం చెప్పాలనుకుందో అది సూటిగా, స్పష్టంగా, కాన్ఫిడెంట్‌గా పాజిటివ్ టోన్‌తో చెప్పింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించేందుకు తాను అర్హురాలినని నిరూపించుకుంది. ఈ విషయంలో బీసీసీఐని అభినందించి తీరాలి.. వెల్డన్ బీసీసీఐ'' అంటూ పేర్కొన్నాడు. కాగా మల్లిక సాగర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన దినేశ్ కార్తిక్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందించారు. ''మల్లిక సాగర్‌పై కార్తిక్ మనసు పారేసుకున్నట్లున్నాడు''.. '' తన వాయిస్, మాడ్యులేషన్ అతనికి బాగా నచ్చినట్లుంది.'' అంటూ కామెంట్స్ చేశారు. ముంబైకి చెందిన మల్లికా సాగర్ పురాతన పెయింటింగ్స్ (ఆర్ట్)ను సేకరించే వృత్తిలో ఉన్నారు. ఆమె మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. అలాగే ఆమె ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్స్ ఫర్మ్‌లో పార్ట్నర్గా కూడా ఉన్నారు. ఆక్షన్లు నిర్వహించడంలోనూ మల్లికకు పూర్వ అనుభవం ఉంది. పుండోల్స్ అనే ముంబై బేస్డ్ సంస్థ తరఫున వైవిధ్యభరితంగా వేలం నిర్వహించి గతంలో ఆమె వార్తల్లోకెక్కారు. క్రీడలకు సంబంధించిన వేలం నిర్వహణలోనూ మల్లికకు ప్రవేశం ఉంది. 2021 ప్రో కబడ్డీ లీగ్ వేలాన్ని ఆమె సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. MALLIKA SAGAR is a terrific auctioneer Confident , clear and very poised . Straight away the right choices in the WPL Well done @BCCI #WPLAuction #WPL2023 — DK (@DineshKarthik) February 13, 2023 చదవండి: స్టార్ ఫుట్‌బాలర్ సంచలన నిర్ణయం -
BGT 2023: ఓపెనర్‌గా రాహుల్.. సూర్యను కూడా ఆడిస్తారా? ఎందుకు.. అతడికి బదులు..
India Vs Australia - 1st Test: టెస్టు క్రికెట్లో ప్రతిష్టాత్మక సిరీస్‌గా భావించే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా- ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నాయి. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9న ఈ సిరీస్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఇరు జట్లకు ఈ సిరీస్ మరింత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తుది జట్టులో ఎవరుంటారన్న అంశంపై తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తమ జట్టును ఎంచుకున్నారు. తాజాగా.. భారత వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సైతం ఈ జాబితాలో చేరాడు. ఆసీస్‌తో మొదటి టెస్టుకు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ ట్వీట్ చేశాడు. గిల్ వద్దు.. ఓపెనర్‌గా భీకర ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను కాదని.. రోహిత్‌కు జోడీగా కేఎల్ రాహుల్‌కు డీకే ఓటు వేయడం గమనార్హం. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చిన దినేశ్ కార్తిక్.. కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి చూపాడు. ఇక సూర్యతో పాటు ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు. ఇలా ఎందుకు డీకే అంటున్న ఫ్యాన్స్! అయితే, డీకే జట్టుపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఫామ్‌లో ఉన్న గిల్‌ను కాదని.. కేఎల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడం బాగాలేదంటున్నారు. ఇక సూర్య ఇంతవరకు వన్డేల్లో కూడా పెద్దగా రాణించింది లేదని, కీలక సిరీస్‌లో అతడితో ప్రయోగాలు చేస్తే మూల్యం చెల్లించకతప్పదని అభిప్రాయపడుతున్నారు. టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదన్నది వాస్తవమని.. అయితే టెస్టుల్లో పరిస్థితి వేరే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి.. రాహుల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. రంజీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న కేఎస్ భరత్‌కు అవకాశం ఇవ్వడాన్ని అతడి అభిమానులు స్వాగతిస్తున్నారు. ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు దినేశ్ కార్తిక్ ఎంచుకున్న భారత జట్టు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి' స్మిత్‌ను ఆరుసార్లు అవుట్ చేశా! అశ్విన్ పాదాలకు నమస్కరిస్తే.. వెంటనే! కోహ్లి కూడా.. My 11 for first test 😊 Kl Rohit Pujara Virat SKY Jadeja K S Bharat Ashwin Axar Shami Siraj #BGT2023 #1stTest#IndiaVsAustralia — DK (@DineshKarthik) February 8, 2023 -
శుబ్‌మన్ గిల్ వద్దు.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడే సరైనోడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాయి కూడా. కాగా 2017 తర్వాత తొలిసారిగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. ఇక తొలి టెస్టుకు భారత్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగానే ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావసం పొందుతున్నాడు. అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. అయితే ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు అయ్యర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గిల్ వద్దు.. అతడే కరక్ట్ ఒక వేళ తొలి టెస్టు అయ్యర్ దూరమైతే అతడు స్థానంలో ఎవరని ఆడించాలన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది. కొంతమంది అయ్యర్ స్థానంలో యువ ఆటగాడు శుబ్మాన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని, మరి కొందరు సూర్యకుమార్ యాదవ్‌కు ఛాన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వెటరన్ వికెట్‌కీపర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. క్రిక్‌బజ్‌తో కార్తీక్ మాట్లాడుతూ.. తొలి టెస్టుకు అయ్యర్ అందుబాటులో లేకుంటే ఆ స్థానంలో సూర్యకుమార్ యాదవ్- గిల్లో ఎవరని ఆడించాలన్న చర్చ జరుగుతోంది. నా వరకు అయితే అయ్యర్ స్థానంలో సూర్యకుమార్‌ను ఆడితే బాగుంటుంది. ఎందుకుంటే అతడు స్పిన్‌కు అద్భుతంగా ఆడగలడు. అదే విధంగా ఈ సిరీస్ జరగబోయే కొన్ని పిచ్‌లు స్పిన్ అనుకూలిస్తాయి. కాబట్టి అతడికి తుది జట్టులో అవకాశం ఇవ్వండి. అదే విధంగా సూర్య రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నాడు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Virat vs Rohit: రోహిత్, విరాట్ మధ్య గొడవలు నిజమే.. చక్కదిద్దింది అతడే! -
విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే అర్హత అతడికే ఉంది: డీకే
Virat Kohli's First-Choice Replacement By DK: ‘‘నేను కేవలం ఆ ఒక్క వ్యక్తి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించడం లేదు. క్రికెట్‌ను ప్రేమించే, ఆటలో ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించే అభిమానుల కోణం నుంచి ఈ మాట చెబుతున్నా.. సమీప భవిష్యత్తులో విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడు రాహుల్ త్రిపాఠి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. అరంగేట్రంలోనే నిరాశ ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. లంకతో రెండో మ్యాచ్‌లోనూ అదే స్కోరు. రాహుల్ త్రిపాఠి అయితే, ఆఖరి టీ20లో మాత్రం 31 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రభావం చూపగలిగాడు. 16 బంతుల్లో 35 పరుగులతో త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌లోనూ ఇదే జోష్ కొనసాగిస్తాడని ఆశగా ఎదురుచూస్తే తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. కీలక సమయంలో మాత్రం అదుర్స్ ఆ తర్వాతి మ్యాచ్‌లో 13 పరుగులు చేసిన త్రిపాఠి.. సిరీస్ ఫలితాన్ని తేల్చే అహ్మదాబాద్ టీ20లో మాత్రం అదరగొట్టాడు. 22 బంతుల్లో 44 పరుగులతో ఉత్తమంగా రాణించాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆరంభంలో ‘‘కోహ్లి స్థానాన్ని కట్టబెడితే ఇలాగేనా చేసేది’’ అంటూ విమర్శించిన వాళ్లే.. ‘‘పర్లేదు.. పనికొస్తాడు’’ అంటూ ప్రశంసిచేలా చేసుకున్నాడు. వేరే వాళ్లు వద్దు.. అతడే అర్హుడు ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో పాల్గొన్న దినేశ్ కార్తిక్ రాహుల్ త్రిపాఠిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఐపీఎల్లో అతడితో కేకేఆర్‌కు ఆడిన అనుభవం నాకుంది. తనని దగ్గరగా పరిశీలించాను. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడే గుణం ఉంది. రానున్న ఐపీఎల్లో అతడు అదరగొట్టొచ్చు. అలా జరగకనూపోవచ్చు. అయినప్పటికీ టీమిండియాలో మూడో స్థానానికి అతడు పూర్తి అర్హుడని నేను భావిస్తున్నా. ఒకవేళ విరాట్ కోహ్లి ఆడాలనుకుంటే ఓకే.. లేదు తను తప్పుకోవాలని అనుకుంటే మాత్రం అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వేరే స్థానాల్లో ఆడుతున్న వాళ్లను ప్రమోట్ చేయడం వంటివి చేయకుండా త్రిపాఠికి అవకాశం ఇవ్వాలి. అతడు 40 లేదంటే 30 పరుగులకే చేశాడనే గణాంకాలతో పనిలేదు. కీలక సమయంలో అతడు రాణించగలడు. దయచేసి ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు’’ అని డీకే సూచించాడు. రోహిత్ వారసుడు గిల్.. మరి? కాగా ఫార్మాట్లకు అతీతంగా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడని, మరి కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేదెవరంటూ క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ త్రిపాఠిని ఉద్దేశించి డీకే చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలపై త్రిపాఠి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: MICT Vs DSG: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్.. ఎంఐపై సూపర్ జెయింట్స్ గెలుపు ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ This is best and most beautiful tribute to @tripathirahul52 anyone can give . One of the most selfless player in the circuit who always keep him team above him every single time . Bro u r a joy to watch ♥️♥️ and @DineshKarthik thank you for saying this . pic.twitter.com/o8wBiM6EZc — Raazi (@Rg86037221) February 1, 2023 -
WC 2023: అలా అయితే వరల్డ్‌కప్-2024 వరకు కెప్టెన్‌గా రోహిత్: డీకే
Rohit Sharma- Hardik Pandya: టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత టీమిండియా ఆడిన పలు ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట ఆయా మ్యాచ్‌లకు దూరమవుతూ ఉన్నాడు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ నేపథ్యంలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తి స్థాయి కెప్టెన్ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘అవును.. పాండ్యాకు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఆడితే తప్ప అయితే, ఇప్పుడే అది జరుగుతుందనుకోను. ఎందుకంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 కంటే ముందు టీమిండియా మూడు టీ20 సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్. నిజానికి ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాతే కెప్టెన్సీ మార్పు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ సేన ఈ ఐసీసీ ఈవెంట్లో అద్భుతం చేస్తే పర్లేదు. అలా అయితే రానున్న వరల్డ్‌కప్‌లోనూ లేదంటే కచ్చితంగా కెప్టెన్సీ రోహిత్ చేజారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడితే.. రోహిత్ టీ20లలో కొనసాగాలనుకుంటే.. వరల్డ్‌కప్-2024లోనూ తనే కెప్టెన్‌గా ఉంటాడనటంలో అతిశయోక్తి లేదు’’ అని డీకే అభిప్రాయపడ్డాడు. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘ఇప్పటి వరకైతే హార్దిక్ నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. శ్రీలకంతో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో మనం చూశాం’’ అని దినేశ్ కార్తిక్ అతడిని ప్రశంసించాడు. కాగా ఇటీవల ముంబై మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' Washington Sundar: 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా' -
Ind Vs SL: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్.. ఎందుకిలా?
Team India Captains: ‘‘కొత్త కెప్టెన్ వచ్చిన ప్రతిసారీ.. అంటే కనీసం మూడేళ్లకోసారి జట్టు విధానాలను మార్చేయాలని ఎందుకు కోరుకుంటారు? నాకు తెలిసి విరాట్ కోహ్లి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కోహ్లి తర్వాత రోహిత్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా. వీళ్లు టీమిండియా విధానంలో సమూల మార్పులు తేవాలని ఎందుకు కోరుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసహనం వ్యక్తం చేశాడు. యువ రక్తం కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఒకరిద్దరు మినహా అంతా యువ ప్లేయర్లే జట్టులో ఉండటం విశేషం. ఇక వాంఖడేలో జరిగిన తొలి టీ20లో పేసర్ శివం మావి అరంగేట్రం చేయగా.. సంజూ శాంసన్ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఇక ప్రస్తుత జట్టులో ఒకరిద్దరు సీనియర్లు మినహా అంతా యువకులే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఓడినా పర్లేదా?! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ప్రయోగాలకు వెనుకాడటం లేదు. అంతేకాదు.. మొదటి మ్యాచ్ తర్వాత.. ‘‘ఓడిపోయినా పర్లేదు గానీ, కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వాళ్లు తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెట్టేశా’’ అంటూ పాండ్యా వ్యాఖ్యానించాడు. మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించడం అలవాటు కావడం కోసం చివరి ఓవర్‌ను అక్షర్ చేత వేయించానని చెప్పుకొచ్చాడు. అయితే, వాంఖడేలో 2 పరుగుల తేడాతో విజయం సాధించినా.. పుణెలో మాత్రం 16 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై హార్దిక్ తొలుత బౌలింగ్ ఎంచుకోవడం విశేషం. ఇంతకు ముందున్న వాళ్ల సంగతి? ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షో చర్చలో అజయ్ జడేజా మాట్లాడుతూ.. ‘‘కొత్తగా కెప్టెన్ అయిన ప్రతి ఒక్కరు పాత విధానాన్ని మార్చాలని చూస్తూనే ఉన్నారెందుకు? ఇంతకు ముందున్న వాళ్ల కెప్టెన్సీ సరిగ్గా లేదా ఏంటి?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ‘‘గత కెప్టెన్ల నేతృత్వంలో ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా విఫలమైంది. అందుకే కొత్త విధానాలు అమలు చేయాలని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. కోహ్లి, రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మేజర్ టోర్నీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. మార్పు అనివార్యం, తథ్యం ఇదిలా ఉంటే.. కాగా రెండో టీ20లో యువ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో లంక భారీ స్కోరు చేసింది. కానీ, లంక బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. యువ జట్టు తప్పులను కాయాలని, మార్పులు జరుగుతున్న తరుణంలో అందరూ కాస్త ఓపికగా ఉండాలన్నాడు. దీనిని బట్టి వచ్చే వరల్డ్‌కప్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామనే సంకేతాలు ఇచ్చాడు. చదవండి: ODI World CUP 2023: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. వన్డే వరల్డ్‌కప్‌కు పంత్ దూరం! Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
Ind V Aus: రాహుల్ వరుస సెంచరీలు చేయాలి! గిల్‌కు అన్యాయం చేసినట్లే కదా!
India vs Bangladesh Test Series 2022- KL Rahul: గత కొన్నాళ్లుగా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుతున్న ఈ కర్ణాటక బ్యాటర్.. గత 8 టెస్టు ఇన్నింగ్స్‌లో సాధించిన పరుగులు 137 మాత్రమే! ఇక బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన రాహుల్ నాయకుడిగా విజయవంతమయ్యాడు. కానీ బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. బంగ్లాతో రెండు టెస్టుల్లో కలిపి రాహుల్ చేసిన పరుగులు 57! ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్ కాకపోయి ఉంటే రెండో టెస్టులోనే రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించేవారంటూ ఘాటు వ్యాఖ్యలు వినిపించాయి. మరోవైపు.. యువ ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బంగ్లాతో తొలి టెస్టులో సెంచరీ చేశాడు గిల్. 152 బంతుల్లో 11 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పోటీనిస్తున్న గిల్ రెండో టెస్టులో విఫలమైనా(27 పరుగులు).. ఈ సిరీస్‌లో మొత్తంగా రాహుల్ కంటే గిల్ వంద పరుగులు ఎక్కువే(157) సాధించాడు. దీంతో ఈ యువ రైట్‌హ్యాండ్ బ్యాటర్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుడిచేతి వాటం గల వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ స్థానంలో రోహిత్ శర్మకు జోడీగా గిల్ సరిగ్గా సరిపోతాడననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో గనుక రాహుల్ వరుస సెంచరీలు సాధిస్తేనే ఇక ముందు తుది జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. లేదంటే గిల్ అతడి స్థానాన్ని ఆక్రమించడం ఖాయమని పేర్కొన్నాడు. వరుస సెంచరీలు చేయాలి! అప్పుడే ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో కామెంటేటర్ డీకే మాట్లాడుతూ.. ‘‘నేనైతే కేఎల్‌కు మరో రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఇస్తాను. అయితే తనను తాను నిరూపించుకుంటునే అతడికి భవిష్యత్తు ఉంటుంది. నిజానికి 40కి టెస్టులాడిన ఓ ఓపెనింగ్ బ్యాటర్ సగటు మరీ 30లకే పరిమితం కావడం ఆమోదయోగ్యం కాదు. 35కు పైగా టెస్టులాడిన బ్యాటర్ల అతి తక్కువ సగటు ఇదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాహుల్ కచ్చితంగా లోపాలు సరి చేసుకోవాలి. టెస్టు జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే ఆస్ట్రేలియాతో టెస్టులో కనీసం రెండు సెంచరీ సాధించాలి. లేదంటే రాహుల్ స్థానంలో శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా నాటుకుపోవడం ఖాయం’’ అని టీమిండియా టెస్టు ఓపెనింగ్ స్థానం గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అయితే, డీకే వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతబానే ఉంది.. కానీ ‘‘అంతా బాగానే ఉంది కానీ.. ఆసీస్‌తో సిరీస్‌కు కూడా రాహుల్‌కు ఛాన్స్ ఇవ్వాలంటున్నావా కార్తిక్? ఇదేమైనా బాగుందా? గాయం నుంచి కోలుకుని రోహిత్ తిరిగి వస్తే.. రాహుల్‌ను కొనసాగిస్తే గిల్‌కు అన్యాయం చేసినట్లే అవుతుంది కదా! నీలాగే రాహుల్‌కు కూడా అవకాశాలు ఇస్తూ పోవాలా?’’ అంటూ విమర్శిస్తున్నారు. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక ఇప్పటికే గాయంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో సిరీస్‌తో అందుబాటులోకి వచ్చే అంశంపైనే రాహుల్ తలరాత ఆధారపడి ఉంది. చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు Marco Jansen: 69 పరుగులకే 5 వికెట్లు! పట్టుదలగా నిలబడ్డ జాన్సెన్, వెయిర్నే.. కెరీర్లో తొలిసారి.. -
అతడికి ఐపీఎల్ సెట్ కాదు.. భారత స్టార్ ఆటగాడిపై కార్తీక్ సంచలన వాఖ్యలు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు ఛతేశ్వర్ పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన టెస్టు కెరీర్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని పుజారా సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతులు ఎదుర్కొన్న పుజారా 102 పరుగులు చేశాడు. ఇక దూకుడుగా ఆడుతున్న పుజరాను ఐపీఎల్లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. పుజరాకు టీ20 ఫార్మాట్ సెట్ కాదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "నిజం చెప్పాలంటే పుజరాకు ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి ఉండేది. అతడు చాలా కాలం పాటు ప్రయత్నించాడు. అయితే టీ20 పార్మాట్ తనకు సెట్ కాదని గ్రహించాడు. అతడు ఐపీఎల్ సమయంలో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతాడు. పుజరా తన క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటాడు. పుజరా తాను ఎంటో నిరూపించుకోవడానికి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడటలేదు. ఏ ఫార్మాట్లో ఆడితే బాగుంటుందో అతడికి స్టృషంగా తెలుసు. ఐపీఎల్ అనేది పుజరా లాంటి వారికి సరిపోదని నేను భావిస్తున్నాను. ఇప్పటికే పుజరాకు కుడా ఈ విషయం అర్థమై ఉంటుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా పుజారా చివరగా ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఆ సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనూ పుజారాకు అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది. అయితే ఐపీఎల్- 2022 మెగా వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ అతడిని కోనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్-2023 మినీ వేలంలో పుజారా తన పేరును నమోదు చేసుకున్నాడు. చదవండి: FIFA World Cup Qatar 2022 Second Final : మెస్సీ VS ఫ్రాన్స్ -
ధావన్ పని అయిపోయింది? గబ్బర్‌పై దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ధావన్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బంగ్లాతో ఆఖరి వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కిషన్ సంచలన ఇన్నింగ్స్‌తో ధావన్ కెరీర్‌కు తెరపడినట్లే అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధావన్ కెరీర్‌పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లు కిషన్, గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లే అని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ధావన్‌కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు చేయరు అనుకుంటున్నా. మరోవైపు శుబ్మాన్ గిల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తే వీరి ముగ్గురిలో ఎవరైనా తప్పుకోవాల్సి వస్తుంది. నా అంచనా ప్రకారం అది ధావన్ కావచ్చు. ఇది అద్భుతమైన శిఖర్ కెరీర్‌కు విషాదకరమైన ముగింపు కావచ్చు. ఒక వేళ ధావన్ జట్టుకు ఎంపిక అయినా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టం. అయితే ఈ ప్రశ్నలన్నింటికి కొత్తగా వచ్చే సెలక్టర్లే సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: టీమిండియా అత్యుత్తమ వన్డే జట్టు.. సూర్యకుమార్ యాదవ్‌కు నో ఛాన్స్! -
'మనోళ్ల ఫీల్డింగ్ చూసి కోపం నషాలానికి'
బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓటమి పాలవడంపై టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తుందని తాను అనుకోలేదన్నాడు. కేఎల్ రాహుల్ వదిలేసిన క్యాచ్‌ను సుందర్ పట్టేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించాడు. కేవలం ఫీల్డింగ్ వైఫల్యం వల్లే ఓడిందని దీనేష్ కార్తీక్ అన్నాడు. చివరి ఓవర్లో హసన్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ పట్టి ఉంటే బాగుండేదన్నాడు. అయితే అతను వదిలేసినా.. పక్కనే ఉన్న సుందర్ బంతిని పట్టుకునేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ వల్ల తాను అసహనానికి గురైనట్లు చెప్పాడు. బ్యాటింగ్‌లోనూ గొప్పగా ఆడలేదని తెలిపాడు. చివరి ఓవర్లో ఒత్తిడి కారణంగా కొన్ని బౌండరీలు వదిలేసి ఉండవచ్చని కార్తీక్ చెప్పుకొచ్చాడు. చదవండి: షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం.. -
ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? జట్టుకు భారం.. అతడిని తీసుకుంటే: మాజీ క్రికెటర్
New Zealand vs India- Sanju Samson: ‘‘అతడు టీమిండియాకు భారంగా మారుతున్నాడు. వైఫల్యం ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోవడం ఎందుకు? అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకురండి. ఒక ఆటగాడు తరచుగా విఫలమవుతున్నా.. అతడికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడం సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారీ మూల్యం చెల్లించకతప్పదు. కాబట్టి కొత్తవాళ్లకు కూడా ఛాన్స్‌లు ఇవ్వాలి’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ రితీందర్ సోధి అన్నాడు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారని.. అయినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శించాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కారణంగా పంత్ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే, కీలక మ్యాచ్‌లలో ఛాన్స్ ఇచ్చినా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఐసీసీ టోర్నీలో జింబాబ్వేతో మ్యాచ్‌లో 3, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. రిషభ్ పంత్ ఇక ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ పంత్ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చి 6 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మాత్రం జట్టులో అవకాశాలు కరువయ్యాయి. సంజూకు అన్యాయం! తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ తుది జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పంత్ స్థానంలో సంజూకు అవకాశం ఇవ్వాలంటూ.. ఈ కేరళ బ్యాటర్ పట్ల వివక్ష తగదని నెటిజన్లు బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సంజూ పేరును ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. పక్కన పెట్టేయండి! ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆరంభం నేపథ్యంలో పంత్‌ను విమర్శిస్తూ.. సంజూకు అవకాశం ఇవ్వాలంటూ రితీందర్ సోధి అతడికి మద్దతుగా నిలిచాడు. ‘‘పంత్‌కు ఇంకెన్ని అవకాశాలు వస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. సమయం మించిపోకముందే అతడు కళ్లు తెరవాలి. అయినా ప్రతిదానికి ఓ హద్దంటూ ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు ఒకే ఆటగాడిపై ఆధారపడటం ఎంత వరకు సమంజసం. ఒకవేళ అతడు సరిగ్గా ఆడకపోతే.. నిర్మొహమాటంగా అతడిని పక్కనపెట్టాలి’’ అని సోధి.. సెలక్టర్లకు సూచించాడు. సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఇకనైనా అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. కాగా టీమిండియా తరఫున 25 పంత్ ఇప్పటి వరకు 27 వన్డేలు, 66 టీ20లు ఆడగా.. 28 ఏళ్ల సంజూ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటి వరకు కేవలం 26 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా శుక్రవారం టీమిండియా కివీస్‌తో మొదటి వన్డేలో తలపడనుంది. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ FIFA WC: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు -
దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్
Dinesh Karthik Shares Emotional Video: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తర్వలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు, తన అభిమానులకు కార్తీక్ కృతజ్ఞతలు తెలపడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. డీకే భావోద్వేగం ఇన్స్టాగ్రామ్ వేదికగా కార్తీక్ భావోద్వేగ వీడియో ఇందుకు కారణమైంది. "టీమిండియా తరపున టీ20 ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు.. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ డీకే ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో కార్తీక్ వీడియోపై స్పందించిన అభిమానులు.. ‘‘ప్లీజ్ డీకే.. వద్దు.. ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకు.. మేము దానికి ఇంకా సిద్ధంగా లేము’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు డీకే సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో అదరగొట్టి.. రీ ఎంట్రీ ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అదరగొట్టిన కార్తీక్.. ఫినిషర్‌గా భారత జట్టులో పునరాగమనం చేశాడు. అయితే ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచ్‌లలో పంత్‌ను కాదని డికేకు అవకాశం ఇచ్చినప్పటికీ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా భారత్ ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి కార్తీక్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు కార్తీక్ కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Shikhar Dhawan: కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం! అంత మాత్రానికి.. View this post on Instagram A post shared by Dinesh Karthik (@dk00019) -
'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్ స్థానంలో అతడు రావాలి'
నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ క్రమంలో భారత వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మూడో టీ20కు సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చి సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కార్తీక్ సూచించాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది అని అంతా భావించారు. కానీ మరోసారి జట్టు మేనేజేమెంట్ సంజూని బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ క్రమంలో జట్టు మేనేజేమెంట్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఇక క్రిక్‌బజ్‌తో కార్తీక్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వండి. అతడు వన్డే సిరీస్‌కు సిద్ధమవడానికి కాస్త సమయం లభిస్తుంది. సూర్య స్థానంలో శాంసన్‌ను జట్టులోకి తీసుకురండి. మిగిలిన ఆటగాళ్లు చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చారు. కాబట్టి కేవలం ఒక్క మ్యాచ్‌తోనే పక్కన పెట్టడం సరికాదు. ఇక సంజూ ఫాస్ట్ బౌలింగ్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అదే విధంగా షార్ట్ పిచ్ బౌలింగ్‌లో కూడా అతడు అద్భుతంగా ఆడుతాడు. కాబట్టి సూర్య స్థానంలో శాంసన్‌ను చూడాలనుకుంటున్నాను"అని అతడు పేర్కొన్నాడు. చదవండి: FIFA World CUP 2022: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన -
సెమీస్‌కు ముందు టీమిండియాను వేధిస్తున్న ఆ నలుగురి సమస్య..!
నవంబర్ 10న ఇంగ్లండ్‌తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు నలుగురు ప్లేయర్ల ఫామ్ సమస్య టీమిండియాను కలవరపెడుతుంది. ఆ నలుగురిలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉండటం జట్టును మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రోహిత్‌తో పాటు దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్‌లకు వరుసగా అవకాశలు ఇచ్చినా, సామర్ధ్యం మేరకు రాణించలేక ఘోర వైఫల్యాలు చెందడం మేనేజ్మెంట్తో పాటు అభిమానులను తీవ్రంగా వేధిస్తుంది. రోహిత్‌ను మినహాయించి సెమీస్‌లో పై ముగ్గురిని తప్పించాలన్నా టీమిండియాకు ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తుంది. ప్రపంచకప్-2022లో రోహిత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 89 పరుగులు (4, 53, 15, 2, 15) మాత్రమే చేసి పేలవ ఫామ్‌లో ఉండగా, దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్‌లోనూ వికెట్‌కీపింగ్‌లోనూ దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఫినిషర్ కోటాలో జట్టుకు ఎంపికైన డీకే.. ఆ పాత్రకు న్యాయం చేయలేకపోగా, బ్యాటింగ్ ఓనమాలు కూడా మరిచి వరుస వైఫల్యాల బాటపట్టాడు. వరల్డ్‌కప్‌లో అతనాడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 14 పరుగులు (1, 6, 7), 4 క్యాచ్‌లు మాత్రమే అందుకుని అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. దీంతో సెమీస్‌లో డీకేకు తిప్పించి పంత్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్‌ల విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. ఆల్‌రౌండర్ కోటాలో 4 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అక్షర్.. అవకాశం వచ్చినా బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ (3 వికెట్లు) ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు వికెట్లు తీయడంలో విఫలమవ్వడంతో పాటు ధారళంగా పరుగులు సమర్పించుకోవడం మరింత కలవరానికి గురి చేస్తుంది. స్పిన్నర్ విషయంలో టీమిండియాకు చహల్ రూపంలో మరో చాయిస్ ఉన్నా మేనేజ్మెంట్ దాన్ని ఉపయోగించుకునేందుకు సాహసించలేకపోయింది. వీరిద్దరి వైఫల్యాలపై నజర్ వేసిన యాజమాన్యం.. స్పిన్‌కు అనుకూలించే అడిలైడ్ పిచ్‌పై (సెమీస్చ వేదిక) ఏ మేరకు మార్పులు చేస్తుందో వేచి చూడాలి. అభిమానులు మాత్రం.. స్పిన్ పిచ్ అంటున్నారు కాబట్టి అశ్విన్‌ను కొనసాగించి, అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఈనెల 10న ఇంగ్లండ్‌తో జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియా ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు భారత తుది జట్టును అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా భారత తుది జట్టు ఇలా ఉండబుతుందంటూ కొందరు విశ్లేషకులు బాహాటంగా ప్రకటించారు. వారి అంచనాల మేరకు.. ఇంగ్లండ్‌తో తలపడబోయే భారత జట్టులో రెండు మార్పులకు అవకాశం ఉంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆడిన రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావచ్చు. అలాగే ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందని, ఎక్సట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తామని ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చహల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరే ఇతర మార్పు చేసే సాహసం చేయకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌ల విషయంలో యాజమాన్యం తర్జనభర్జన పడవచ్చని.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పంత్‌ను.. ఛేజింగ్ చేయాల్సి వస్తే డీకేకు ఛాన్స్ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. -
దినేష్ కార్తీక్ కెరీర్ క్లోజ్..!
-
Ind Vs NZ: కివీస్‌తో సిరీస్ నుంచి అవుట్! డీకే కెరీర్ ముగిసిపోయినట్లేనా?
IND Tour Of NZ 2022: టీ20 ప్రపంచకప్-2022 తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత జట్టులో వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కు చోటు దక్కలేదు. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీ నేపథ్యంలో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనుండగా.. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అంతేకాదు మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తిక్‌ను కావాలనే పక్కకుపెట్టారా? 37 ఏళ్ల డీకే కెరీర్ ఇక ముగిసిపోయినట్లేనా అన్న సందేహాల నడుమ టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్పందించారు. దినేశ్ కార్తిక్‌పై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇతర ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చి బెంచ్ స్ట్రెంత్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే అతడిని ఎంపిక చేయలేదన్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన వెంటనే ఈ టూర్ మొదలవుతుంది కాబట్టి డీకేకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్లు తెలిపాడు. దారులు మూసుకోలేదు.. ఈ మేరకు చేతన్ శర్మ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన ఐదు రోజుల తర్వాత టీ20 సిరీస్ ఆరంభమవుతుంది. ఈ టోర్నీలో ఆడిన కొంతమందికి రెస్ట్ ఇవ్వాలని భావించాం. దినేశ్ కార్తిక్ జట్టులో ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సెలక్టర్లకు అతనెప్పుడూ అందుబాటులో ఉంటాడు. అయితే, మిగతా ఆటగాళ్లతో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ముఖ్యంగా తనకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. దినేశ్ కార్తిక్ లాంటి అద్భుతమైన ఆటగాడికి ద్వారాలు ఎప్పుడూ తెరచుకునే ఉంటాయి. భవిష్యత్తులో కూడా అతడికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ విషయం గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా డీకే వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డీకే.. జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఇండియా వరల్డ్‌కప్ గెలిచేందుకు వచ్చింది.. మేము వారిని ఓడించేందుకే వచ్చాం..! VVS Laxman: డాక్టర్ కాబోయి క్రికెటర్! ఆసీస్ అంటే ఆకాశమే హద్దు.. ఆ హీరోచిత ఇన్నింగ్స్ చిరస్మరణీయం! -
దినేశ్ కార్తీక్‌కు భారీ ఊరట.. అయినా పంత్‌కు లైన్ క్లియర్..!
T20 WC 2022 IND VS BAN: టీ20 వరల్డ్‌కప్-2022లో టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పి కారణంగా మైదానం వీడిన దినేశ్ కార్తీక్.. నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనని టీమిండియా మేనేజ్మెంట్లోని కీలక వ్యక్తి ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌కు సమాచారం అందించాడు. దినేశ్ కార్తీక్ గాయం తీవ్రమైనది కానప్పటికీ.. బంగ్లాతో మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండడని సదరు అధికారి తెలిపాడు. డీకే స్థానంలో ఆల్టర్నేట్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడని పరోక్ష సంకేతాలు పంపాడు. ఒత్తిడి కారణంగా తలెత్తిన సాధారణ వెన్నునొప్పితోనే డీకే బాధపడ్డాడని.. టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అతను తిరిగి అందుబాటులోకి వస్తాడని పేర్కొన్నాడు. మొత్తానికి డీకేకు పాక్షిక విరామమివ్వడంతో పంత్‌కు లైన్ క్లియర్ అయ్యింది. బంగ్లాదేశ్‌తో పోరులో అతను సత్తా చాటితే తిరిగి జట్టులో కదురకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో డీకే ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు కాబట్టి.. పంత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. దారుణంగా నిరాశపర్చి విమర్శలపాలైన నేపథ్యంలో పంత్ తనను తాను నిరూపించుకునేందుకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, గ్రూప్-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న (అక్టోబర్ 30) జరిగిన కీలక సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన కార్తీక్.. భారత ఫీల్డింగ్ సమయంలో వెన్నునొప్పి కారణంగా ఆర్ధాంతంగా మైదానాన్ని వీడాడు. పాక్‌తో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అతను.. సౌతాఫ్రికాపై ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా, గ్రూప్-2లో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో నిలిచి సెమీస్ రేసులో బలంగా ముందుకు కదులుతుంది. -
Team India: సమయం ఆసన్నమైంది.. ఆ ముగ్గురిపై వేటు వేయాల్సిందే..!
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నిన్న (అక్టోబర్ 30) సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవం నుంచి టీమిండియా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం సఫారీల చేతిలో ఎదురైన పరాభవాన్ని ఆషామాషీగా తీసుకుంటే రోహిత్ సేన తదుపరి మ్యాచ్‌ల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. టీమిండియా యాజమాన్యం ఇకనైనా మేల్కొని తుది జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పదే పదే విఫలమవుతున్నా కొందరు ఆటగాళ్లకు మళ్లీమళ్లీ అవకాశాలు ఇచ్చి జట్టు లయను దెబ్బతీయొద్దని కోరుతున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ నుంచి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ముందుగా పక్కకు పెట్టాలని జట్టు మేనేజ్మెంట్పై ఒత్తిడి పెంచుతున్నారు. పాక్‌పై 4 పరుగులు, ఆతర్వాత నెదర్లాండ్స్‌పై 9, తాజాగా సౌతాఫ్రికాపై 9 పరుగులకే ఔటై దారుణంగా విఫలమైన రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. అలాగే ఫినిషర్ కోటాలో జట్టులో స్థానం పొందుతున్న దినేశ్ కార్తీక్‌పై సైతం వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. డీకే అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో తేలిపోతున్నాడని, ఫినిషర్ కాదు కదా కనీసం బ్యాటింగ్ ఓనమాలు కూడా తెలియని వాడిలా బ్యాటింగ్ చేస్తున్నాడని తూర్పారబెడుతున్నారు. వరల్డ్‌కప్ లాంటి కీలక టోర్నీల్లో ఇలా వరుస వైఫల్యాలు చెందుతున్న వారిని వెనకేసుకురావడం జట్టుకు ప్రయోజనకరం కాదని అభిప్రాయపడుతున్నారు. డీకేను తప్పియడం వల్ల తుది జట్టులో అదనపు బ్యాటర్ కానీ బౌలర్‌కు కానీ అవకాశం దొరుకుతుందని అంటున్నారు. ఈ రెండు మార్పులే కాక జట్టులో మరో మార్పు కూడా చేయాలని కొందరు మాజీలు, అభిమానులు పట్టుబడుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం దక్కించుకున్న అశ్విన్.. బౌలింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడని, అతనిపై కూడా వేటు వేసి చహల్ లేదా హర్షల్ పటేల్‌లలో ఎవరో ఒకరి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సూపర్-12 దశలో టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం కానుండటంతో జట్టులో ప్రక్షాళణ తప్పనిసరిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. -
ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరజాయం పాలైంది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ప్రోటీస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(59) అఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. ఇక భారత్ బ్యాటర్లలో సూర్య కుమార్ యాదవ్(68) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. కాగా జట్టులో ఫినిషర్‌గా చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్ ఈ మెగా టోర్నీలో తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అదే విధంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా 15 బంతులు ఆడిన డికే కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో పంత్‌ను కాదని కార్తీక్‌కు తుది జట్టులో చోటువ్వడంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కార్తీక్ కంటే రిషబ్ పంత్‌కే ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. "కార్తీక్ స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని తొలి మ్యాచ్ నుంచే నేను చెబుతున్నాను. రిషబ్ ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లలో ఎలా రాణించాలో పంత్‌కు బాగా తెలుసు. దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడి చాలా కాలమైంది. అతడికి ఇటువంటి బౌన్సీ పిచ్‌లపై ఆడిన అనుభవం అస్సలు లేదు. ఇదేమి బెంగళూరు వికెట్ కాదు, నేరుగా బంతి బ్యాట్‌పైకి రావడానికి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో నైనా కనీసం హుడా స్థానంలోనైనా పంత్‌ను తీసుకోవాల్సింది. గతంలో పంత్ గబ్బాలో ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రతీ ఒక్క గుర్తుంది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలి" అని క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో జరిగే భారత్ తదుపరి మ్యాచ్‌కు కార్తీక్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 World Cup 2022: ఎంత పనిచేశావు కోహ్లి.. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే! వీడియో వైరల్ -
ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
టీ20 ప్రపంచకప్-2022 కీలక దశలో భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు ముగిసిన తర్వాత కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానం వీడాడు. అతని స్థానంలో రిషభ్ పంత్ కీపింగ్ కొనసాగించాడు. గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినా బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయాన్ని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో భువనేశ్వర్ కుమార్ నిర్ధారించాడు. వైద్యుల నివేదిక తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని అతను చెప్పాడు. ప్రపంచకప్‌లో 1, 6 పరుగులు చేసి కార్తీక్‌తో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఒకవేళ కార్తీక్ దూరమైనా... పంత్ రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉండటంతో ఇప్పటికిప్పుడు భారత జట్టుకు ఎలాంటి బెంగా లేకపోవచ్చు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చదవండి: T20 World Cup 2022: మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం -
తెలివిగా వ్యవహరించిన కార్తిక్.. లాస్ట్ మ్యాచ్ హీరో జీరో అయ్యాడు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన రొసౌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను ఔట్ కావడంలో దినేశ్ కార్తిక్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ రెండో ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఓవర్లో మూడో బంతి ఇన్‌స్వింగ్ అయి రొసౌ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. దీంతో టీమిండియా అప్పీల్‌కు వెళ్లగా అంపైర్ ఔటివ్వలేదు. అయితే బౌలర్ అర్ష్‌దీప్ ఎల్బీ విషయంలో అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో రోహిత్ కూడా రివ్వూకు మొగ్గుచూపలేదు. కానీ కార్తిక్ మాత్రం మిడిల్ స్టంప్‌ను తాకుతుందని కచ్చితంగా పేర్కొన్నాడు. కార్తిక్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లిన రోహిత్ ఫలితం సాధించాడు. రిప్లేలో బంతి ఇన్‌స్వింగ్ అయి మిడిల్ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లు కనిపించింది. రొసౌ ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో కార్తిక్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ సహా మిగతా ఆటగాళ్లంతా అభినందనల్లో ముంచెత్తారు. ఫలితంగా లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో హీరోగా నిలిచిన రొసౌ ఈ మ్యాచ్‌లో జీరోగా నిలిచాడు. Courtesy: CAPTAIN ROHIT SHARMA pic.twitter.com/RWYW6lnJuy — ✨ᕼ𝒾𝕋мάn 𝐌𝐁 ✨ (@satti45_) October 30, 2022 చదవండి: తీరు మారని కేఎల్ రాహుల్.. పక్కనబెట్టాల్సిందే! -
చంద్రముఖిలా మారిన కోహ్లి.. ముందుగా డీకేను తిట్టుకున్నాను: అశ్విన్
T20 World Cup 2022- India Vs Pakistan- Virat Kohli- సిడ్నీ: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా అది పంచిన ఉత్కంఠను మాత్రం సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. మైదానం బయటే పరిస్థితి ఇలా ఉంటే మైదానంలో చివరి పరుగు చేసిన అశ్విన్ పరిస్థితి ఏమిటి. ఆ సమయంలో అతనికి ఎలా అనిపించింది? ఈ ఆసక్తికర విశేషాలన్నీ స్వయంగా అశ్విన్ పంచుకున్నాడు. ముఖ్యంగా చివరి క్షణాల్లో తన అనుభవాన్ని అతను వివరించాడు. ‘45 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి. ఇక కోహ్లి, హార్దిక్ చెరో 60 పరుగులు చేస్తే తప్ప గెలవలేమనిపించింది. అవసరం పడితే నేనూ బ్యాటింగ్‌లో ఒక చేయి వేయాలని అనుకున్నాను. అయితే కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో ఒక్కసారిగా మ్యాచ్‌ను మార్చేశాడు. 45 బంతుల తర్వాత అతని బ్యాటింగ్ చూస్తే చంద్రముఖి సినిమా గుర్తుకొచ్చింది. గంగనుంచి జ్యోతిక ఒక్కసారిగా చంద్రముఖిలా మారిపోయినట్లు అనిపించింది. ప్రభుతో ‘నన్ను వదలవా’ అంటున్నట్లు మదిలో మెదిలింది! నేను చివరకు 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిప్పుడు క్రీజ్‌లో వచ్చాను. దినేశ్ కార్తీక్‌ను తిట్టుకున్నాను ఆ స్థితికి నన్ను తెచ్చినందుకు ముందుగా దినేశ్ కార్తీక్‌ను తిట్టుకున్నాను. అయితే మనమూ ఏదైనా చేయగల అవకాశం వచ్చినట్లు భావించాను. నాకైతే పిచ్ వరకు వెళ్లడం ఒక సుదీర్ఘ ప్రయాణంగా అనిపించింది. ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం మనకు ఇష్టం లేని చోట ఉండే నిమిషం కూడా గంటలా అనిపిస్తుంది. కోహ్లి వచ్చి ఎక్కడెక్కడ పరుగులు తీయవచ్చో చెప్పాడు. బాబూ... నువ్వయితే అలాంటి చోట్ల షాట్లు కొడతావు, నేనెలా ఆడగలను, నాకు వచ్చిందే చేస్తా అని మనసులో అనుకున్నా. విజయం కోసం పోరాడుతున్న ఒక వ్యక్తిని నేను నేరుగా ఎలా అనగలనని బయటకు మాత్రం చెప్పలేదు. అయితే బౌలర్ నవాజ్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడు. లెగ్‌స్టంప్‌పై వేస్తున్నాడా...ఇలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తరహాలో పలు ప్రశ్నలు అడిగేశాను. అతను మాత్రం చాలా చెప్పినా...నేను మాత్రం ఖాళీ వైపు బంతిని తోసి నా జీవితం కోసం పరుగెత్తినట్లుగా సింగిల్ తీయాలని అనుకున్నా. ఇక నా ఇంటిపై రాళ్లు వేయరులే లెగ్స్టంప్స్ మీద బంతిని వేస్తున్నాడు, జరిగి కవర్స్ మీదుగా కొట్టు అని చివరి సలహా ఇచ్చాడు. పరిస్థితి ఇలా ఉంది, చలి పెడుతోంది, ఇలాంటప్పుడు కవర్స్ మీదుగా కొట్టమంటాడేమిటి అని అనుకున్నాను. చివరి బంతి దిశను బట్టే అది వైడ్ అవుతుందని భావించి వదిలేశా. ఇక నా ఇంటిపై రాళ్లు వేయరులే అని ధైర్యం వచ్చింది. కోహ్లిని రవూఫ్ బౌలింగ్‌లో అంత అద్భుతమైన సిక్సర్లు కొట్టనిచ్చిన దేవుడు నన్ను ఒక్క సింగిల్ తీయనీయడా అనుకున్నా. చివరకు అలాగే జరిగింది. నిజంగా ఒక అద్భుత మ్యాచ్‌లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది’ అని అశ్విన్ నాటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు వివరించాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ T20 World Cup 2022: నెదర్లాండ్స్‌తో పోరు.. టీమిండియాలో మూడు మార్పులు..? -
‘‘టీమిండియా మోసం చేసి గెలిచింది’’.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్
T20 World Cup 2022- India Vs Pakistan- Dead Ball Row: ‘‘బ్యాటర్ అడగ్గానే అంపైర్ నో బాల్ ఇచ్చాడు... టీమిండియా ఎప్పటిలాగే చీటింగ్ చేసి గెలిచింది... ముందేమో అంపైర్ నోబాల్ ఇవ్వలేదు.. విరాట్ కోహ్లి అడగ్గానే.. ‘‘అవును సర్’’ ఇది నోబాలే అన్నాడు.. నిజంగా ఇది సిగ్గుచేటు... కోహ్లి ఒత్తిడి వల్లే నో బాల్ ఇచ్చారు.. నిజానికి పాకిస్తాన్ బాగా ఆడింది.. అది అసలు నోబాల్ కానే కాదు.. డెడ్ బాల్‌గా ప్రకటించకుండా మూడు పరుగులు ఇస్తారా?’’... టీమిండియా చేతిలో పరాజయం తర్వాత పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కిన అక్కసు. ఓటమిని జీర్ణించుకోలేక నో బాల్ వివాదంతో భారత జట్టు గెలుపును తక్కువ చేసి చూపేందుకు అభ్యంతరకర భాషతో విరుచుకుపడ్డారు. షోయబ్ అక్తర్ వంటి మాజీ ఆటగాళ్లు సైతం.. అంపైర్ నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుబడుతూ సెటైరికల్‌గా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన దిగ్గజ అంపైర్ ఆ మ్యాచ్ ముగిసి ఇరు జట్లు తదుపరి మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నా నో బాల్.. డెడ్ బాల్ అంశంపై చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ అంపైర్ సైమన్ టాఫెల్ పాక్ అభిమానులకు దిమ్మతిరిగేలా ఆ మూడు పరుగుల గురించి వివరణ ఇచ్చాడు. పాక్ అభిమానులకు దిమ్మతిరిగే కౌంటర్ ఈ మేరకు భారత్- పాక్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో చోటుచేసుకున్న పరిణామాలపై సైమన్ స్పందిస్తూ.. ‘‘మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా- పాకిస్తాన్ ఉత్కంఠ పోరులో క్లైమాక్స్ గురించి.. ముఖ్యంగా ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయిన తర్వాత వచ్చిన బైస్ గురించి వివరించాలని చాలా మంది నన్ను అడిగారు. ఈ విషయంలో అంపైర్ నిర్ణయం సరైందే! బాల్ స్టంప్స్‌ను తాకిన తర్వాత థర్డ్‌మ్యాన్ వైపు వెళ్లినపుడు బ్యాటర్లు మూడు సార్లు వికెట్ల మధ్య పరిగెత్తినపుడు బైస్‌గా ఇవ్వడం కచ్చితంగా సరైందే! ఫ్రీ హిట్ సమయంలో స్ట్రైకర్ బౌల్డ్ అవ్వడు.. కాబట్టి బంతి స్టంప్స్‌ను తాకినందు వల్ల డెడ్‌బాల్‌గా ప్రకటించే వీలులేదు. బైస్ నిబంధనల ప్రకారం అంపైర్ ఇచ్చిన సంకేతం సంతృప్తికరంగానే ఉంది’’ అని లింక్డిన్లో ఆయన రాసుకొచ్చాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ నిబంధనల ప్రకారం.. డెడ్ బాల్‌గా ఎప్పుడు ప్రకటిస్తారంటే! మ్యాచ్ జరుగుతున్నపుడు స్ట్రైకర్ బ్యాటింగ్ చేసేందుకు సన్నద్ధమై ఉండగా.. బౌలర్ బంతిని విసిరేందుకు సిద్ధమైన క్రమంలో.. ఎలాంటి కారణం చేతనైనా వికెట్ మీది బెయిల్ కింద పడినట్లయితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణస్తారు. అదే విధంగా బంతి కీపర్ లేదంటే బౌలర్ చేతికి ఫీల్డర్ ద్వారా అందినట్లయితే.. అది డెడ్‌బాల్ అయిపోతుంది. అలాంటపుడు బ్యాటర్లు పరుగులు తీసే వీలుండదు. నిజానికి బంతి స్టంప్స్‌ను తాకిన తర్వాత అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రీ హిట్ సమయంలో ఈ నిబంధన వర్తించదు. కాబట్టి పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ తీసిన మూడు పరుగులు చెల్లుబాటే అవుతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. చదవండి: T20 World Cup: అశ్విన్‌కు డీకే థాంక్స్! ‘‘అవును భయ్యా.. అశూ గనుక ఫినిష్ చేసి ఉండకపోతే!’’ T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..! T20 World Cup 2022: పాకిస్తాన్ ఇంటికే.. ఆ రెండు జట్లే సెమీ ఫైనల్‌కు! Simon Taufel puts an end to dead-ball controversy!#INDvsPAK #T20WorldCup #SimonTaufel pic.twitter.com/7WW7Gk0Lal — Siddharth Thakur (@fvosid) October 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ind Vs Pak: అశూకు థాంక్స్ చెప్పిన డీకే! ‘‘నువ్వు లేకపోతే నా పని అయిపోయి ఉండేదే!’
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడేందకు సిద్దమవుతోంది. అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు సోమవారం సిడ్నీలో అడుగుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 82 పరుగులు చేసిన విరాట్ అజేయంగా నిలిచి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. అఖరి ఓవర్లో హై డ్రామా.. కాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హై డ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. చివరి ఆరు బంతుల్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా... పాక్ కెప్టెన్ బాబర్, నవాజ్ చేతికి బంతిని అందించాడు. తొలి బంతికి హార్దిక్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం రెండో బంతిని క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. ఇక మూడో బంతికి కోహ్లి 2 పరుగులు తీశాడు. ఇక నాలుగో బంతిని నవాజ్ హై ఫుల్ టాస్ వేయగా.. కోహ్లి సిక్సర్‌గా మలిచాడు. అయితే నాలుగో బంతి నడుమ ఎత్తుకంటే ఎక్కువగా ఉండటంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. అయితే ఫ్రీ హిట్ బంతిని నవాజ్ వైడ్‌గా వేశాడు. దీంతో భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. అనంతరం ఫ్రీహిట్ బంతికి విరాట్ క్లీన్ బౌల్డయ్యాడు. అయినప్పటికీ విరాట్, కార్తీక్ బైస్ రూపంలో మూడు పరుగులు వచ్చాయి. ఇక భారత్ విజయానికి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ క్రమంలో కార్తీక్ అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో మళ్లీ అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఈ సమయంలో క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. అయితే ఆరో బంతిని కూడా నవాజ్ వైడ్‌గా వేశాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఇక ఆఖరి బంతికి అశ్విన్ సింగిల్ తీసి జట్టును గెలిపించాడు. అశ్విన్‌కు థాంక్స్ చెప్పిన కార్తీక్ ఇక ఆఖరి బంతికి సింగిల్ తీసి జట్టును విజయ తీరాలకు చేర్చిన అశ్విన్‌కు దినేష్ కార్తీక్ ధన్యవాదాలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో.. "మ్యాచ్‌ను ఫినిష్ చేసినందుకు దన్యవాదాలు. నేను ఇప్పుడు కూల్‌గా ఉన్నాను అని అశ్విన్‌తో డీకే అన్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలై ఉంటే కచ్చితంగా అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న కార్తీక్‌పై విమర్శలు వచ్చేవి. ఇక డీకే వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. ‘‘అవును భయ్యా.. కచ్చితంగా నీ పని అయిపోయి ఉండేది. అశూ గనుక మాస్టర్ మైండ్‌తో ఆడి ఉండకపోతే.. నీకు మాములుగా ఉండేది కాదు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Hello Sydney 👋 We are here for our 2⃣nd game of the #T20WorldCup! 👏 👏#TeamIndia pic.twitter.com/96toEZzvqe — BCCI (@BCCI) October 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా? -
అంపైర్లపై అక్తర్ ట్వీట్.. అంతగా బుర్ర చించుకోకు! బాగా మండుతున్నట్లుంది కదా!
T20 World Cup 2022- India Vs Pakistan- Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్.. అసలే దాయాదుల పోరు.. బంతి బంతికీ ఉత్కంఠ... గెలవడానికి భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్ హిట్టర్’ హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్ జోరు చూస్తుంటే మూడు షాట్లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆదివారం నాటి ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 19.1 నవాజ్ వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడిన పాండ్యా అవుటయ్యాడు. 19.2క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. 19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. 19.4 నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దీనిని ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. 19.4 ఈసారి నవాజ్ వైడ్ వేశాడు. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. 19.4 ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్ 3 ‘బై’ పరుగులు తీశారు! చర్చకు తెరతీసిన ఆ మూడు పరుగులు ఇప్పుడు ఈ విషయంపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయినా ఈ మూడు పరుగులు ఎలా ఇచ్చారన్న అంశం మీద ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఇప్పటికే పలు ప్రశ్నలు లేవెనెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో అంపైర్ల నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘భయ్యా.. ఈరోజు రాత్రంతా బుర్ర చించుకునేలా మెదడుకు బాగానే మేత వేశారు కదా’’ అంటూ అంపైర్లను ఉద్దేశించి అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంతలా బుర్ర చించుకోకు.. ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో అక్తర్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ‘‘మరీ అంతలా బుర్ర చించుకోకు. బాగా మండుతున్నట్లుంది. బర్నాల్ రాసుకో. ఆ తర్వాత తీరిగ్గా ఐసీసీ రూల్స్ చదువు. సరేనా.. కాస్త ప్రశాంతంగా ఉండు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో అక్తర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా నో బాల్ నేపథ్యంలో 3 పరుగులు వచ్చిన తర్వాత విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఈ క్రమంలో.. 19.5 దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్ క్రీజులోకి వచ్చేలోపు పాక్ కీపర్ రిజ్వాన్ స్టంపౌట్ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది. 19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ లెగ్ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది. 19.6 ఈసారి నవాజ్ వేసిన బంతిని అశ్విన్ మిడాఫ్‌లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడాడు. పరుగు తీశాడు. భారత్ విజయం ఖరారైంది. టీమిండియా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్ కోహ్లిపై సాహో అంటూ క్రీడాలోకం ప్రశంసల వర్షం కురిపించింది. చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన పాక్ అభిమాని.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్ Virat Kohli: కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్‌లు ప్రత్యేకం.. పాండ్యా ఫిదా.. కింగ్‌పై ప్రశంసల జల్లు Umpire bhaiyo, food for thought aaj raat k liye 😉 pic.twitter.com/vafnDG0EVd — Shoaib Akhtar (@shoaib100mph) October 23, 2022 For you and for all Pakistan 😜 pic.twitter.com/kALP0Cz2rB — sneha karmakar (@snehakarmaka) October 23, 2022 READ pic.twitter.com/igLHOU0aVH — King Kohli🇮🇳🇮🇳 (@shreyas13071992) October 23, 2022 -
T20 WC 2022: భారీ అంచనాలు.. ఈ ‘స్టార్లు’ రాణిస్తేనే! లేదంటే టీమిండియాకు కష్టమే!
టీ20 ప్రపంచకప్-2021 తర్వాత న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర జట్లతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో అదరగొట్టింది టీమిండియా. పొట్టి ఫార్మాట్లో టాప్ ర్యాంకులో కొనసాగుతూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. అయితే, ప్రతిష్టాత్మక ఆసియాకప్-2022 టీ20 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. కనీసం ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. ఆ తర్వాత స్వదేశంలో మాత్రం అదరగొట్టింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుస సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో కీలక ఈవెంట్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్-2022లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. అయితే, ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణించినా ఆసియా కప్-2022లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్రపంచకప్‌నకు ముందు కూడా ఇలాంటి పరిస్థితే! దీంతో వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు. మరోవైపు.. ఇటీవలి కాలంలో బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో బ్యాటర్లు రాణిస్తేనే ఫలితం ఉంటుందని, వారిపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమర్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రోహిత్ శర్మ తొలి టీ20 టోర్నీ నుంచి పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అయితే, ఈ ఎనిమిదో ఎడిషన్ మాత్రం అతడికి మరింత ప్రత్యేకం. ఈసారి కెప్టెన్‌గా కొత్త హోదాలో బరిలోకి దిగబోతున్నాడు. ఇక ఈ హిట్‌మ్యాన్‌కు టీ20 ఫార్మాట్లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ టీ20లలో 4 సెంచరీలు బాదిన ఘనత అతడిది. మొత్తంగా ఇప్పటి వరకు 142 మ్యాచ్‌లు ఆడి 3737 పరుగులు చేశాడు. గతేడాది ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎదురులేని విజయాలు సాధించాడు. అతడి సారథ్యంలో భారత జట్టు వరుస సిరీస్‌లు గెలిచింది. అయితే, ప్రతిష్టాత్మక ఆసియా టోర్నీలో మాత్రం చతికిల పడింది. ఈ ఈవెంట్లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రోహిత్ ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 72 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్.. మొత్తం కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. ఇక గత ప్రపంచకప్‌లోనూ తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఐదు మ్యాచ్‌లలో కలిపి 174 పరుగులు చేయగలిగాడు ఈ ఓపెనర్. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే రోహిత్ సక్సెస్ అయితేనే మిడిలార్డర్‌పై పెద్దగా భారం పడదు. తనదైన రోజున విజృంభించే ఈ హిట్‌మ్యాన్.. ప్రతిష్టాత్మక టోర్నీల్లో మాత్రం పెద్దగా రాణించడనే అపవాదు ఉంది. దానిని చెరిపేసేలా బ్యాట్ ఝులిపిస్తేనే కెప్టెన్‌గా తనకు ఈ టోర్నీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. విరాట్ కోహ్లి టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి అతడి రికార్డులే మాట్లాడతాయి. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడ్డ అతడు.. ఆసియా కప్-2022లో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. ఇక ఈ ఛేజింగ్ కింగ్‌పై టీమిండియా ఎక్కువగా ఆధారపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్న కోహ్లి తన పరుగుల దాహం తీర్చుకునేలా మునుపటిలా బ్యాట్‌తో చెలరేగితే టీమిండియాకు తిరుగు ఉండదు. ఒకవేళ అలా జరుగకుండా.. ఈ వన్‌డౌన్ బ్యాటర్ విఫలమైతే మాత్రం భారత జట్టుకు కష్టాలు తప్పవు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో ఆడుతూ.. రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ ముంబై బ్యాటర్. టీ20లో నంబర్ 2గా ఉన్న సూర్య ఇటీవల ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే బౌండరీలు, సిక్స్‌ల వర్షం కురిపించడం ఖాయం. అయితే, నాలుగో స్థానంలో అదరగొడుతున్న సూర్యకు ఇంతవరకు ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. ప్రాక్టీసు మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో మెరిసినా అసలైన పోరులో ఎంతవరకు రాణిస్తాడనేదే ప్రశ్న. ఆసీస్‌లో అతడు కఠిన సవాలు ఎదుర్కోకతప్పదనడంలో సందేహం లేదు. హార్దిక్ పాండ్యా ప్రపంచకప్-2021కు ముందు విమర్శల పాలైన హార్దిక్ పాండ్యా.. పూర్తి ఫిట్నెస్ సాధించి ఐపీఎల్-2022లో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా అరంగేట్రంలోనే జట్టును గెలిపించి బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు ఈ ఆల్‌రౌండర్. అదే జోష్‌లో టీమిండియా ద్వితీయ శ్రేణి టీ20 జట్టు సారథిగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం సహా పునరాగమనంలో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆసియా కప్-2022లో పాక్‌తో మ్యాచ్ గెలవడంలో అతడిది కీలక పాత్ర. పేస్ బౌలింగ్ చేయగల హార్దిక్ పాండ్యా మిడిలార్డర్లో టీమిండియాకు చక్కటి ఆప్షన్‌గా ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హార్దిక్ రాణిస్తే భారత జట్టుకు తిరుగుండదు. దినేశ్ కార్తిక్ ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఫినిషర్‌గా అద్భుత పాత్ర పోషించాడు. తద్వారా జాతీయ జట్టులో పునరాగమనం చేసిన ఈ కామెంటేటర్ .. కుర్ర బ్యాటర్ రిషభ్ పంత్‌కు పోటీనిస్తూ వరుస మ్యాచ్‌లలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్-2022లో అతడిపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆడిన 19 టీ20ల్లో 273 పరుగులు(150కిపైగా స్ట్రైక్‌రేట్) చేసిన డీకే మెగా టోర్నీలో ఎలా ఆడతాడో చూడాలి మరి! ఇలా బ్యాటర్లతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ , యువ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా రాణిస్తేనే టీమిండియా ట్రోఫీని ముద్దాడగలదు!! -వెబ్‌డెస్క్ చదవండి: West Indies: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి' T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్, అశ్విన్‌కు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2022లో దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్ను భారత మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేరాడు. ఈ బ్లాక్ బ్లస్టర్ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎల్వన్ను గంభీర్ అంచనా వేశాడు. కాగా పాక్‌తో పోరుకు టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను గంభీర్ ఎంపిక చేశాడు. అతడు ఎంచుకున్న జట్టులో దినేష్ కార్తీక్‌కు చోటు దక్క లేదు. ఇక తన అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మను గౌతీ ఎంపిక చేశాడు. అదే విధంగా మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు గంభీర్ ఛాన్స్ ఇచ్చాడు. కాగా తన ప్రకటించిన జట్టులో ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను గంభీర్ ఎంచుకున్నాడు. తన జట్టులో స్ఫెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్‌ను కాదని యుజువేంద్ర చాహల్ అవకాశం ఇచ్చాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్, షమీతో పాటుగా భువనేశ్వర్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లో ఒకరికే తుది జట్టులో జట్టు దక్కుతుందిని గంభీర్ అభిప్రాయపడ్డాడు. పాక్‌తో మ్యాచ్‌కు గౌతీ అంచనా వేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. టీ20 వరల్డ్‌కప్-2022 బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! -
పంత్, కార్తీక్‌లు ఇద్దరూ తుది జట్టులో ఉండాలి: గవాస్కర్
టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పుపై దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. భారత ఫైనల్ ఎలెవెన్‌లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు ఇద్దరు ఉండాలని ఆసక్తికర ప్రపోజల్‌తో ముందుకొచ్చాడు. వీరిలో పంత్‌ను ఆరో స్థానంలో, దినేశ్ కార్తీక్‌ను ఏడో స్థానంలో ఆడించాలని సూచించాడు. అదే సమయంలో హార్ధిక్ పాండ్యాను ఐదో బౌలర్‌గా వినియోగించుకోవాలని సలహా ఇచ్చాడు. భారత్.. ఆరో బౌలర్ వైపు చూడకుండా పంత్, కార్తీక్‌లు ఇద్దరినీ ఆడిస్తే సత్ఫలితం వస్తుందని జోస్యం చెప్పాడు. పంత్‌కు ఆస్ట్రేలియా పిచ్‌లపై మంచి రికార్డు ఉంది కాబట్టి అతన్ని విస్మరించకూడదని, అలాగే డీకేను ఫినిషర్ కోటాలో వినియోగించుకోవాలని పేర్కొన్నాడు. మొత్తంగా భారత్ నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్, ఐదుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. గవాస్కర్ అంచనా వేస్తున్న భారత తుది జట్టు.. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, వన్ డౌన్లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ -
Ind Vs Pak: పాక్‌తో తొలి మ్యాచ్.. పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్!
T20 World Cup 2022- India Vs Pakistan- Predicted India Playing XI: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమవుతోంది. టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం (అక్టోబరు 23) ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ భారత తుది జట్టును అంచనా వేశాడు. చిరకాల ప్రత్యర్థితో పోరులో ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో రోహిత్ సేన బరిలోకి దిగాలని సూచించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బాధ్యత మరింత పెరిగిందన్న భజ్జీ.. అతడు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించడం సానుకూల అంశమని పేర్కొన్నాడు. నా తుది జట్టు ఇదే ఈ మేరకు హర్భజన్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండాలి. యుజీ చహల్‌కు కూడా వారితో పాటు చోటు దక్కాలి. ఇక అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు కూడా చోటు ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్‌లకు ఆరంభ మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాదని అభిప్రాయపడ్డాడు. ఇక అక్షర్ పటేల్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడిందన్న హర్భజన్ సింగ్.. టీ20 ఫార్మాట్లో బ్యాటింగ్ విషయంలో అశ్విన్‌పై ఆధారపడలేమని.. అందుకే అతడికి అవకాశం రాకపోవచ్చని వ్యాఖ్యానించాడు. కాగా ఆర్పీ వర్సెస్ డీకే నేపథ్యంలో రిషభ్ పంత్‌ను కాదని అనువజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వైపే భజ్జీ మొగ్గుచూపడం విశేషం. పాక్‌తో మ్యాచ్‌కు భజ్జీ ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. టీ20 వరల్డ్‌కప్-2022 బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ. పాకిస్తాన్ బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హారీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్. స్టాండ్‌బై ప్లేయర్స్: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. పాక్‌తో మ్యాచ్ అంటేనే.. European T0 League: కిందా మీదా పడి చివరకు ఎలాగోలా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: అయ్యో కార్తిక్! ఇప్పుడంటే ఓకే! అప్పుడు కూడా ఇలాగే చేశావనుకో!
T20 World Cup Warm Ups- Australia vs India: టీ20 ప్రపంచకప్-2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అసలైన పోరుకు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం (అక్టోబరు 17)న బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో తలపడింది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఓపెనర్ కేఎల్ రాహుల్(57), మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(50) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది టీమిండియా. ఫించ్ కెప్టెన్ ఇన్నింగ్స్ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్(35), ఆరోన్ ఫించ్(76) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. స్టీవ్ స్మిత్(11) తొందరగానే అవుట్‌కాగా.. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ క్రీజులోకి వచ్చీరాగానే చహల్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాల్ బ్యాట్‌ను అంచును తాకింది. కానీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ మాక్సీ ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. 11వ ఓవర్లో జరిగిన ఈ ఘటన తర్వాత లైఫ్ పొందిన మాక్స్వెల్.. 16 బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. అయితే, 15 ఓవర్ మూడో బంతికి భువీ మాక్సీని బోల్తా కొట్టించగా.. డీకే క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయ్యో ఏంటిది కార్తిక్? కాగా.. ఇటీవలి కాలంలో కార్తిక్ ఈజీ క్యాచ్‌లు మిస్ చేస్తుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. రిషభ్ పంత్‌ను కాదని డీకేకు అవకాశాలు ఇస్తున్నారని.. దీంతో అతడి బాధ్యత మరింత పెరిగింది కాబట్టి జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నారు. ఇది వార్మప్ మ్యాచ్ కాబట్టి సరిపోయింది. కానీ.. ప్రధాన మ్యాచ్‌లలో ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో గనుక ఇలాంటి తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ టాపార్డర్ హిట్ అయినా, లోయర్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన పదునైన బంతులతో కంగారూలను కంగారెత్తించాడు. ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. చదవండి: T20 WC 2022 Warm Ups: అక్టోబరు 17న ఆసీస్‌తో టీమిండియా! వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు -
పంత్‌కు దినేశ్ కార్తిక్ పాఠాలు.. వీడియో వైరల్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌కు ముందు పంత్, కార్తిక్‌ల మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్‌కు ఫినిషర్ పాత్రలో ఎంపికైన కార్తిక్ వద్ద పంత్ ఏం సలహాలు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. బహుశా పంత్‌కు కార్తిక్ బ్యాటింగ్ పాఠాలు బోధించి ఉంటాడని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో పంత్, కార్తిక్‌లు చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పంత్, కార్తిక్‌లు విడివిడిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి.. మరొకటి ఓడింది. తొలి రెండు మ్యాచ్‌లో పెర్త్‌లో జరగ్గా.. తాజాగా డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ గబ్బాలో జరుగుతుంది. ఈ మ్యాచ్ గెలిచి.. పాక్‌తో పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని టీమిండియా భావిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57, సూర్యకుమార్ యాదవ్ 50, దినేశ్ కార్తిక్ 20 పరుగులు చేశారు. -
కార్తీక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2022కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో.. అతడి స్థానంలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత షమీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా గడ్డపై ఏ విధంగా రాణిస్తాడన్నది అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న. అయితే ఆస్ట్రేలియాకు చేరుకున్న షమీ నెట్స్‌లో మాత్రం చెమటోడ్చుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ బౌలింగ్‌లో కార్తీక్ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ షాట్ ఆడటంలో విఫలమైన కార్తీక్.. క్లీన్ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో తొలి వార్మప్ మ్యాచ్‌లో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలవెన్‌లో షమీకి చోటు దక్క లేదు. చదవండి: KL Rahul: అర్థశతకంతో చెలరేగిన కేఎల్ రాహుల్ -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. పంత్‌కు నో ఛాన్స్! కార్తీక్ వైపే మొగ్గు
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటికే వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడిన భారత్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మరో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడనుంది . ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం కన్పించడంలేదు. కాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి పంత్ కేవలం 18 పరుగులు మాత్రమే సాధించాడు. అదే విధంగా అంతకుముందు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ పంత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంత్‌ను పక్కన బెట్టి వికెట్ కీపర్ బాధ్యతలు దినేష్ కార్తీక్‌కు అప్పజెప్పాలని టీమిండియా మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఫినిషర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో 181 బంతులు ఎదర్కొన్న కార్తీక్ 150.82 స్ట్రైక్ రేట్‌తో 273 పరుగులు సాధించాడు. ఇక పంత్ గత 17 ఇన్నింగ్స్‌లో 136.84 స్ట్రైక్ రేట్‌తో 338 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ స్థానంలో కార్తీక్‌ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరికీ ప్లేయింగ్ ఎలవెన్‌లో చోటు దక్కుతుందో పాక్-భారత్ మ్యాచ్ వరకు వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్‌లో అతడే టీమిండియా టాప్ రన్ స్కోరర్' -
ఎంఎస్ ధోనికి అవమానం.. ఆల్‌టైమ్ బెస్ట్ టీమ్‌లో నో ప్లేస్
భారత్‌ను తొలి టీ20 వరల్డ్‌కప్‌లోనే విజేతగా నిలిపి, పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా తయారు చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఘోర అవమానం ఎదురైంది. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ విజ్డెన్ ఇండియా ప్రకటించిన భారత ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టులో మహేంద్రుడికి చోటు దక్కలేదు. 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించి, టీమిండియాకు గతంలో ఎన్నడూ లేనంత వైభవాన్ని అందించిన వ్యక్తికి ఆల్‌టైమ్ బెస్ట్ జట్టులో చోటు దక్కకపోవడంతో ధోని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఫినిషర్‌గా, బెస్ట్ వికెట్‌కీపర్‌గా, బెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తికి ఆల్‌టైమ్ బెస్ట్ జట్టులో చోటు లభించకపోవడంతో పెదవి విరుస్తున్నారు. ధోని విషయంలో విజ్డెన్ ఇండియా వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. ధోని స్థానంలో వికెట్‌కీపర్ కమ్ ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడం హాస్యాస్పదమని అంటున్నారు. అయితే ఈ విషయమై విజ్డెన్.. తమ లెక్కలు తమకున్నాయనట్లు వ్యవహరించింది. వికెట్‌కీపర్‌గా ధోని బెస్టే అయినప్పటికీ 6,7 స్థానాల్లో ధోనితో (121.15) పోలిస్తే డీకే (150.31) యావరేజ్ అత్యుత్తమంగా ఉందని తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది. ఇదిలా ఉంటే, విజ్డెన్ ప్రకటించిన భారత ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టులో స్పిన్నర్ కోటాలో అశ్విన్‌కు, మిడిలార్డర్లో సురేశ్ రైనాకు చోటు దక్కడం విశేషం. పై పేర్కొన్న మూడు ఎంపికలు మినహా విజ్డెన్ ప్రకటించిన జట్టును భారత అభిమానులు స్వాగతిస్తున్నారు. విజ్డెన్ ఆల్‌టైమ్ బెస్ట్ ఇండియా టీ20 ఎలెవెన్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్ధిక్ పాండ్యా, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, వీరేంద్ర సెహ్వాగ్ (12వ ఆటగాడు) -
ఇదొక్కటి చాలు.. కోహ్లి ఏంటో చెప్పడానికి!
టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ఇప్పటికే చాలా రికార్డులు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లికి కింగ్ అని పేరు ఉంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 71 సెంచరీలు సాధించిన కోహ్ల సచిన్ తర్వాత.. పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత తరంలో అతని దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కీలకమైన టి20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావడం అభిమానులను సంతోపెడుతుంది. తాజాగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో కోహ్లి 49 పరుగులు నాటౌట్ మరోసారి మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌కు సహకరిస్తూ కోహ్లి స్ట్రైక్ రొటేట్ చేసిన విధాన అందరిని ఆకట్టుకుంది. సూర్య ఔటైన తర్వాత తన బ్యాటింగ్ పవరేంటో మరోసారి రుచి చూపించాడు. సూర్య విధ్వంసంలోనూ కోహ్లి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కోహ్లి 28 బంతుల్లో 49 పరుగులతో ఆడుతున్నాడు. దినేశ్ కార్తిక్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఫినిషర్‌గా వచ్చిన కార్తిక్ తొలి బంతిని మిస్ చేశాడు. ఇక రెండో బంతిని బౌండరీ బాదాడు. ఇక మూడో బంతి డాట్ పడింది. ఆ తర్వాత వైడ్ వచ్చింది. ఇక నాలుగో బంతిని కార్తిక్ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత కోహ్లి వద్దకు వచ్చిన కార్తిక్.. ''హాఫ్ సెంచరీ చేస్తానంటే సింగిల్ తీసి ఇస్తాను..'' అని అడిగాడు. కానీ కోహ్లి అందుకు ఒప్పుకోలేదు. ''నువ్వు ఫినిషర్వి.. నీ పాత్ర పోషించు.. హాఫ్ సెంచరీ రాకపోయినా పర్లేదు.'' అని భుజం తట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కార్తిక్ ఐదో బంతిని తనదైన స్టైల్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతిని సింగిల్ తీసిన కార్తిక్ 7 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా కోహ్లి తన హాఫ్ సెంచరీ కంటే జట్టుకు స్కోరు అందివ్వడమే ముఖ్యమని కార్తిక్‌కు చెప్పిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కోహ్లి అభిమానులు.. ''ఇదొక్కటి చాలు కోహ్లి ఏంటో చెప్పడానికి'' అంటూ కామెంట్ చేశారు. In addition to the run fest, a special moment as we sign off from Guwahati. ☺️#TeamIndia | #INDvSA | @imVkohli | @DineshKarthik pic.twitter.com/SwNGX57Qkc — BCCI (@BCCI) October 2, 2022 చదవండి: స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర.. కోహ్లి కెరీర్లో తొలిసారి.. జీవితకాలం గుర్తుండిపోవడం ఖాయం! -
ఆ కప్ దినేష్ కార్తీక్ చేతికి ఎందుకిచ్చారు?
-
రిషబ్ పంత్ పక్కకు... దినేష్ కార్తీక్ కంటిన్యూ
-
Ind Vs Aus: వద్దంటున్నా ట్రోఫీ డీకే చేతిలోనే ఎందుకు పెట్టారు?! మరి అందరికంటే..
Ind Vs Aus 3rd T20- Viral Video: టీ20 ప్రపంచకప్-2022కు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఐదో బంతికి ఫోర్ బాదడంతో భారత్ విజయం ఖరారైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్ టీమిండియా సొంతమైంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన సంబరాల్లో మునిగిపోయింది. గత కొంతకాలంగా వాళ్ల చేతికే! కానీ ఈసారి ఇక బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ నుంచి ట్రోఫీ అందుకున్న అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యుల దగ్గరకు వెళ్లాడు. కాగా జట్టులోని అత్యంత పిన్నవయస్కుడి చేతికి ట్రోఫీనిచ్చే సంప్రదాయాన్ని టీమిండియా గత కొంతకాలంగా పాటిస్తోంది. అయితే, ఈసారి మాత్రం ప్రస్తుతం జట్టులో అందరికంటే పెద్దవాడైన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ 37 ఏళ్ల దినేశ్ కార్తిక్ చేతికి ట్రోఫీని అందించారు. డీకేను టీజ్ చేసిన పాండ్యా! కానీ.. డీకే మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇంతలో హార్దిక్ పాండ్యా బలవంతంగా అతడి చేతికి ట్రోఫీ అందించి.. పైకెత్తి చూపించాలంటూ టీజ్ చేశాడు. ఈ సరదా సన్నివేశాలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘డీకే చేతికే ట్రోఫీ ఎందుకు? ఎందుకంటే.. అందరికంటే తనే ‘చిన్నవాడు’ కదా! అందుకు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్ ముగించుకున్న టీమిండియా.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు సన్నద్ధమవుతోంది. సెప్టెంబరు 28(బుధవారం) నుంచి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రొటిస్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. చదవండి: IND vs SA: 'కోహ్లి, బాబర్ కాదు.. రాబోయే రోజుల్లో అతడే స్టార్ బ్యాటర్' T20 WC 2022: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
T20 WC: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా మద్దతు ఇవ్వాలి.. అప్పుడే: శ్రీశాంత్
India Vs Australia 2022 T20 Series- Bhuvneshwar Kumar- T20 World Cup 2022: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20లో 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్న భువీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగలిగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 91 పరుగులు ఇచ్చాడు భువీ. భువీ వైఫల్యం.. అభిమానుల్లో ఆందోళన డెత్ ఓవర్ల స్పెషలిస్టు, ప్రధాన పేసర్లలో ఒకడైన భువనేశ్వర్ ఇలా విఫలం కావడం జట్టు విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2022కు సమయం ఆసన్నమవుతున్న వేళ భువీ ఫామ్‌లేమి అభిమానులను కలవరపెడుతోంది. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లతో భువీ డీకేకు అండగా ఉన్నట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భువీపై నమ్మకం ఉంచి అతడికి అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాదిరి భువనేశ్వర్‌కు కూడా అండగా నిలవాలని సూచించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భిల్వారా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీశాంత్ హిందుస్థాన్ టైమ్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఒక్కోసారి మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ.. బ్యాటర్ చేతిలో మనకు పరాభవం తప్పకపోవచ్చు. ఆస్ట్రేలియా పిచ్‌లపై రాణించగలడు కొన్నిసార్లు మన వ్యూహం పక్కాగా అమలు అవుతుంది. మరికొన్నిసార్లు బెడిసికొడుతుంది. భువనేశ్వర్‌కు ఇప్పుడు మనందరి మద్దతు అవసరం. దినేశ్ కార్తిక్‌కు అండగా నిలిచినట్లే భువీకి కూడా సపోర్టుగా ఉండాలి. బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగల భువీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. తను నకుల్ బాల్ సంధించగలడు. పేస్‌లో వైవిధ్యం చూపగలడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై తను తప్పకుండా రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ధైర్యంగా ఉండు భువీ! విమర్శలు, కొంతమంది కామెంటేటర్ల మాటలు ఒక్కోసారి మనల్ని ఆందోళనకు గురిచేస్తాయని.. అయితే, మన నైపుణ్యాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని భువీకి సూచించాడు. విమర్శలు పట్టించుకోవద్దని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని భువీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ ఆరంభం కానుంది. అంతకంటే ముందు టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుండగా.. భువీకి విశ్రాంతినిచ్చారు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్.. వైస్ కెప్టెన్‌గా శాంసన్! Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ -
Ind Vs Aus- Uppal: రోహిత్, దినేష్ కార్తీక్ ఫోటోలతో హైదరాబాద్ పోలీసుల ట్వీట్
సాక్షి, హైదరాబాద్- Ind Vs Aus 3rd T20- Hyderabad: హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకోసం అప్పుడప్పుడూ పాపులర్ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు వివరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు క్రికెట్‌ను ఇందుకోసం వాడుకున్నారు. ఓ ట్రెండింగ్ ట్వీట్‌తో ముందుకు వచ్చారు. హైదరాబాద్ వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్, దినేష్ కార్తీక్‌కు చెందిన రెండు ఫోటోలను షేర్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో మొదటి ఫోటోలో రోహిత్ గ్రౌండ్లో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. When commuters follow traffic rules... #HelmetSavesLives #HyderabadCityPolice #wearhelmet #BeSafe #RoadSafety pic.twitter.com/DZwlQggJ6W — Hyderabad City Police (@hydcitypolice) September 26, 2022 రెండో దానిలో రోహిత్ దినేష్‌ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్ ఉంది. ఈ రెండిటిని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో షేర్ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్ చేశారు. -
పంత్ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ నుంచి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ వరకు ఒకే స్థానం కోసం కీపర్ దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఆసియా కప్‌లో పంత్‌కు అవకాశం దక్కగా, ఆసీస్‌తో మూడు మ్యాచుల్లోనూ కార్తీక్ బరిలోకి దిగాడు. వీరిద్దరు కలిసి ఒక మ్యాచ్ ఆడారు. అయితే మూడు మ్యాచ్‌లు కలిపినా కార్తీక్ మొత్తం ఆడింది 7 బంతులే. అందుకే ప్రపంచకప్‌కు ముందు అతనికి మరింత ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అతను ఆస్ట్రేలియాతో సిరీస్ నెగ్గిన అనంతరం స్పష్టం చేశాడు. ‘ప్రపంచకప్‌కు ముందు వీరిద్దరు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని నేను కోరుకుంటున్నా. అయితే పంత్‌తో పోలిస్తే కార్తీక్ మరింత ఎక్కువసేపు క్రీజ్‌లో గడపడం అవసరం. ఈ సిరీస్‌లో అతనికి దాదాపుగా బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అందుకే అతడిని ఎక్కువగా ఆడిస్తున్నాం’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా వీరిద్దరు విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తానో ఇప్పుడే చెప్పలేనని రోహిత్ అన్నాడు. ‘ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను బట్టి మా ప్రణాళిక ఉంటుంది. ఎడంచేతి వాటం బ్యాటర్ అవసరమైతే పంత్‌ను, కుడిచేతి వాటం బ్యాటర్ అవసరమైతే కార్తీక్‌ను ఆడిస్తాం. పరిస్థితిని బట్టి ప్రణాళికలు ఉంటాయి. అయితే అందరినీ తగిన విధంగా వాడుకుంటాం. వరల్డ్‌కప్‌కు ముందు చాలా తక్కువ మ్యాచ్‌లే ఉన్నాయని తెలుసు. కానీ ఆడేది 11 మందే కదా’ అని రోహిత్ చెప్పాడు. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. హార్దిక్ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు! -
కార్తీక్‌పై మరోసారి ‘సీరియస్’ అయిన రోహిత్.. కానీ ఈసారి ముద్దుపెట్టి మరీ!
హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత ఆటగాడు అక్షర్ పటేల్ సంచలన త్రోతో మెరిశాడు. దాదాపు బౌండరీ లైన్ వద్ద నుంచి డైరక్ట్ త్రోతో మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ రనౌట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చాహల్ వేసిన 8 ఓవర్లో మ్యాక్స్‌వెల్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద బాల్ అందుకున్న అక్షర్ పటేల్.. వెంటనే స్ట్రైక్ర్ ఎండ్ వైపు త్రో చేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా బంతి నేరుగా వికెట్లను తాకింది. వెంటనే భారత ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే రిప్లేలో బంతి వికెట్లకు తాకేముందు.. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సైతం తన గ్లౌవ్స్ తాకించండంతో ఒక బెయిల్ పైకి లేచింది. అయితే బంతి తాకిన తర్వాత రెండో బెయిల్ కూడా లేచింది. దీన్ని పరిగణలోకి తీసుకుని థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. కానీ మ్యాక్స్‌వెల్ మాత్రం అంపైర్ నిర్ణయం పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రౌండ్‌ను వీడాడు. మరోసారి రోహిత్-కార్తీక్ బ్రోమాన్స్ కాగా తొలుత కార్తీక్ తన గ్లౌవ్స్‌ను వికెట్ తాకించడంపై రోహిత్ కాస్త సీరియస్‌గా కనిపించాడు. అయితే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించిన అనంతరం రోహిత్ కాస్త కూలయ్యాడు. వెంటనే కార్తీక్ హెల్మట్‌ను ముద్దాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/FtQAGWxns2 — Richard (@Richard10719932) September 25, 2022 pic.twitter.com/vD8P0XFamR — Guess Karo (@KuchNahiUkhada) September 25, 2022 చదవండి: IND vs AUS: టీమిండియాపై గ్రీన్ సరికొత్త చరిత్ర.. తొలి ఆటగాడిగా! -
'నేనే సర్ప్రైజ్ అయ్యా; అందుకే డీకే.. పంత్ కంటే ముందుగా'
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. శుక్రవారం ఆసీస్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. రోహిత్ శర్మ తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చివరి వరకు నిలిచి జట్టును విజయపథంలో నడిపాడు. అయితే ఆఖర్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ ఫోర్, సిక్స్ బాది ఫినిషర్ పాత్రను సమర్థంగా పోషించాడు. దీంతో మ్యాచ్ భారత్ వశమైంది. బ్యాటింగ్‌లో పంత్ కంటే ముందు దినేశ్ కార్తిక్‌ను పంపించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే విషయమై మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ మాట్లాడాడు. ''హార్దిక్ ఔట్ కావడంతో ఆఖరి ఓవర్లో పంత్ లేదా కార్తిక్‌లలో ఎవరు బ్యాటింగ్ రావాలనే దానిపై కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ చివరికి నా దృష్టి కార్తిక్వైపే వెళ్లింది. ఎందుకంటే టి20 ప్రపంచకప్‌లో అతను మాకు ఫినిషర్‌గా ఉపయోగపడనున్నాడు. ఈ సమయంలో కార్తిక్ అవసరం అనిపించింది. అందుకే పంత్ కంటే ముందు కార్తిక్‌ను బ్యాటింగ్‌కు రమ్మన్నా. ఈ విషయంలో పూర్తి క్లారిటీగా ఉన్నా. ఇక నా బ్యాటింగ్ ప్రదర్శనపై నాకే సర్ప్రైజ్ అనిపించింది. గత 8-9 నెలలుగా ఇలాంటి హిట్టింగ్ కోసం ఎదురుచూశా. దూకుడుగా ఆడాలని ప్లాన్ చేసుకోలేదు. కాస్త కుదురుకున్నాకా బ్యాట్‌కు పని చెప్పాలనుకున్నా. కానీ 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఆరంభం నుంచే ఇన్నింగ్స్ ధాటిగా ఆడాల్సి వచ్చింది. పరుగుల కంటే బౌండరీలు, సిక్సర్లపైనే ఎక్కువ దృష్టి పెట్టా. ఇక మ్యాచ్ విజయం మాకు ఊరటనిచ్చింది. సమిష్టి ప్రదర్శనతో మా ప్రధాన ఆయుధమైన బుమ్రా మంచి కమ్‌బ్యాక్ ఇవ్వడం సంతోషం. అక్షర్ పటేల్ సహా మా బౌలర్లు అంతా బాగానే బౌలింగ్ చేశారు. ఇంకాస్త మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మూడో టి20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు 'జట్టులో పంత్ ఎందుకు?'.. డీకే అదిరిపోయే రిప్లై -
'జట్టులో పంత్ ఎందుకు?'.. డీకే అదిరిపోయే రిప్లై
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభిస్తే.. చివర్లో దినేశ్ కార్తిక్ తనదైన ఫినిషింగ్‌తో ముగించాడు. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్, ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కొంతకాలంగా చూసుకుంటే పంత్ జట్టులో ఉంటే కార్తిక్ ఉండకపోవడం.. కార్తిక్ ఉంటే పంత్ మ్యాచ్ ఆడకపోవడం లాంటివి జరుగుతూ వస్తుంది. ఇద్దరు జట్టులో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కింది. ఇక పంత్ వికెట్ కీపర్‌గానే బాధ్యతలు నిర్వహించాడు. అయితే మ్యాచ్ విజయం అనంతరం దినేశ్ కార్తిక్ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో రెండో టి20లో పంత్ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ విలేకరులు ప్రశ్నించారు. దానికి డీకే అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ''వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో కెప్టెన్ రోహిత్‌కు ఐదుగురు బౌలర్ల ఆప్షన్ అవసరం లేకుండా పోయింది. జట్టులో నలుగురు బౌలర్లు ఉంటే చాలు.. అయితే హార్దిక్ రూపంలో ఐదో బౌలర్ ఉండనే ఉన్నాడు. అందుకే ఉమేశ్ యాదవ్ స్థానంలో పంత్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంకో విషయమేంటంటే.. ఓవర్లు కుదించినప్పుడు స్పెషలిస్ట్ బ్యాటర్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే నాతో పాటు పంత్ కూడా జట్టులో ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో ఇలాగే కొనసాగుతుందా అంటే మాత్రం చెప్పలేను'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS 2nd T20: భారత్ గెలుపు మెరుపులు