T20 World Cup 2022, AUS Vs IND Warm-Up Match: Fans Slammed Dinesh Karthik For Dropping Glenn Maxwell's Easy Catch In Yuzvendra Chahal's Bowling - Sakshi
Sakshi News home page

T20 WC 2022: అయ్యో కార్తిక్‌! అప్పుడు కూడా ఇలాగే చేశావంటే కష్టమే!

Published Mon, Oct 17 2022 1:45 PM | Last Updated on Mon, Oct 17 2022 4:08 PM

T20 WC 2022 Ind Vs Aus Warm Up: Dinesh Karthik Drops Catch Fans Worry - Sakshi

ఫైల్‌ ఫొటో (PC: PTI)

T20 World Cup Warm Ups- Australia vs India: టీ20 ప్రపంచకప్‌-2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అసలైన పోరుకు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం (అక్టోబరు 17)న బ్రిస్బేన్‌ వేదికగా ఆసీస్‌తో తలపడింది రోహిత్‌ సేన. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది ఆస్ట్రేలియా.

ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(57), మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(50) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది టీమిండియా.

ఫించ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(35), ఆరోన్‌ ఫించ్‌(76) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. స్టీవ్‌ స్మిత్‌(11) తొందరగానే అవుట్‌కాగా.. ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ క్రీజులోకి వచ్చీరాగానే చహల్‌ వేసిన బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో బాల్‌ బ్యాట్‌ను అంచును తాకింది. కానీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ మాక్సీ ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. 11వ ఓవర్‌లో జరిగిన ఈ ఘటన తర్వాత లైఫ్‌ పొందిన మాక్స్‌వెల్‌.. 16 బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. అయితే, 15 ఓవర్‌ మూడో బంతికి భువీ మాక్సీని బోల్తా కొట్టించగా.. డీకే క్యాచ్‌ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

అయ్యో ఏంటిది కార్తిక్‌?
కాగా.. ఇటీవలి కాలంలో కార్తిక్‌ ఈజీ క్యాచ్‌లు మిస్‌ చేస్తుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. రిషభ్‌ పంత్‌ను కాదని డీకేకు అవకాశాలు ఇస్తున్నారని.. దీంతో అతడి బాధ్యత మరింత పెరిగింది కాబట్టి జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నారు. ఇది వార్మప్‌ మ్యాచ్‌ కాబట్టి సరిపోయింది. కానీ.. ప్రధాన మ్యాచ్‌లలో ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో గనుక ఇలాంటి తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. వార్మప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ టాపార్డర్‌ హిట్‌ అయినా, లోయర్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ తన పదునైన బంతులతో కంగారూలను కంగారెత్తించాడు. ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. దీంతో ఆరు పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

చదవండి: T20 WC 2022 Warm Ups: అక్టోబరు 17న ఆసీస్‌తో టీమిండియా! వార్మప్‌ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌.. ఇతర పూర్తి వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement